త్వరలోనే పేరెంట్స్‌గా ప్రమోషన్‌.. జోర్దార్‌ సుజాత కంటతడి | Jordar Sujatha And Rocking Rakesh Reveals They Expecting A Baby, Baby Bump Pics Goes Viral | Sakshi
Sakshi News home page

Jordar Sujatha Baby Bump Pics: 9 నెలలు.. ఇంతవరకు ఇంటికి పంపలేదు.. జోర్దార్‌ సుజాత ఎమోషనల్‌

Published Sun, Aug 4 2024 7:20 AM | Last Updated on Sun, Aug 4 2024 12:29 PM

Jordar Sujatha, Rocking Rakesh Reveals They Expecting a Baby

జబర్దస్త్‌ కమెడియన్‌ రాకింగ్‌ రాకేశ్‌ - నటి, యాంకర్‌ జోర్దార్‌ సుజాత దంపతులు గుడ్‌న్యూస్‌ చెప్పారు. త్వరలోనే పేరెంట్స్‌గా ప్రమోషన్‌ పొందనున్నట్లు ప్రకటించారు. ఈమేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని ఫోటోలు షేర్‌ చేశారు. ఇది చూసిన అభిమానులు దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇకపోతే ఏప్రిల్‌ నెలలో ఆమె సీమంతం కూడా జరిగింది. అయినా దాన్ని బయటకు చెప్పుకోలేదు. ఇన్నాళ్లకు తాను గర్భవతిని అని తెలియజేస్తూ ఓ వీడియోను యూట్యూబ్‌లో రిలీజ్‌ చేసింది. 'ఈ మధ్య సోషల్‌ మీడియాలో ఏ వీడియో షేర్‌ చేసినా మీరు ప్రెగ్నెంటా? అని కామెంట్లు చేస్తూనే ఉన్నారు.

ప్రెగ్నెన్సీ
ఒక మంచి సందర్భం చూసుకుని చెప్దామనే ఇన్నాళ్లు ఆగాం. మీరు ఆశీర్వదించినట్లే మా వివాహబంధం ఇంకో అడుగు ముందుకేసింది. ఈ విషయం చెప్తున్నందుకు సంతోషంగా ఉంది. అలాగే ఎమోషనల్‌గానూ ఉంది. మా ఇద్దరి ప్రేమకు ప్రతి రూపం ఈ ప్రపంచంలోకి రాబోతోంది. మీ అందరికీ ఈ విషయం చెప్పడానికి 9 నెలలు పట్టింది. ప్రెగ్నెన్సీ వచ్చినప్పటి నుంచి మా ఆయన నన్ను ఎంతో అపురూపంగా చూసుకున్నాడు. జన్మజన్మలకూ ఆయనకు నేనే భార్యను కావాలి.

ఇంటికి పంపలేదు
మా ఇంట్లోని వీణ(తోటి కోడలు).. నన్నెంత బాగా చూసుకుంటుందో! నేను ఏ ఫుడ్‌ తీసుకోవాలనే విషయంలో మా ఆయనతో పోటీపడేది. నాకు ప్రెగ్నెన్సీ వచ్చినప్పటినుంచి మా ఆయన నన్ను ఇంటికి పంపలేదు. అక్కడ రోడ్లు సరిగా లేవు, ఊరిలో ఆస్పత్రులు లేవని పంపలేదు. అలాంటి సమయంలో నన్ను చాలా బాగా చూసుకుంది. ఇల్లు గుర్తు రాకుండా ప్రేమను పంచింది. ఇలా ఎమోషనల్‌ అయితాననే ఇన్నిరోజులు వీడియో చేయలేదు' అంటూ సుజాత కంటతడి పెట్టుకుంది.

 

 

చదవండి: Mahima Makwana: పదేళ్ల వయసులోనే నటిగా మారింది! ఇప్పుడు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement