Rocking Rakesh-Jordar Sujatha Celebrate Bonalu Jathara In London - Sakshi
Sakshi News home page

లండన్‌ గడ్డపై రాకింగ్‌ రాకేశ్‌ - జోర్దార్‌ సుజాత బోనాల జాతర

Published Tue, Jul 11 2023 5:26 PM | Last Updated on Tue, Jul 11 2023 5:33 PM

Rocking Rakesh, Jordar Sujatha Celebrate Bonala Jathara In Landon - Sakshi

వరంగల్‌కు చెందిన ఎన్నారై ఫొరమ్‌ లండన్‌లో బోనాల జాతర వేడుకలు ఘనంగా నిర్వహించారు. గత పదేళ్లుగా ఈ ఉత్సవం నిర్వహిస్తునప్పటికీ ఈ ఏడాది మరింతగా ఘనంగా నిర్వహించాలని ఎన్నారై ఫోరమ్‌ నిర్ణయించుకుంది. యాంకర, నటి తెలంగాణ మహిళ అయిన జోర్దార్‌ సుజాత ఆధ్వర్యంలో బోనాల జాతర నిర్వహించారు.

ఈ మేరకు ఫోరమ్‌ ప్రెసిడెంట్‌ శ్రీధర్‌ నీల మాట్లాడుతూ ‘తెలంగాణ సంస్కృతిలో భాగమైన బోనాల ఉత్సవాలు ఎన్నో ఏళ్లగా లండన్‌లో నిర్వహిస్తున్నాం. ఈ ఏడాది ఎప్పటిలా కాకుండా మరింత ఘనంగా చేస్తున్నాం. ఈ వేడుకలో మరింత ఉత్సాహాన్ని నింపడానికి హైదరాబాద్‌ నుంచి రాకింగ్‌ రాకేశ్‌, సుజాత ఇక్కడికి రావడం ఆనందించదగ్గ విషయం’అని తెలిపారు.

నేరెళ్ల వేణుమాధవ్‌ శిష్యుల తర్వాత రాకింగ్‌ రాజేశ్‌ మిమిక్రీ అంతగా పాపురల్‌ అయ్యారు. బజర్దస్త్‌ వంటి షోలతో చక్కని గుర్తింపు తెచ్చుకున్నారు. సినిమాల్లోనూ అవకాశాలు అందుకుంటున్నారు. ఇటీవల అమెరికా, న్యూజెర్సీలోని నాట్స్‌ కార్యక్రమం విజయవంతం తర్వాత రాకింగ్‌ రాకేశ్‌, జోర్దార్‌ సుజాత లండన్‌లో జరిగిన బోనాల ఉత్సవంలో తమదైన శైలి స్కిట్లు, మిమిక్రీ కార్యక్రమాలతో అలరించారు. ఈ షోతో ఆయన 2300 షోల మార్కును దాటారు. 

రాకింగ్‌ రాకేశ్‌ మాట్లాడుతూ ‘వరంగల్‌ ఎన్నారై ఫోరమ్‌తో నాకు మంచి అనుబంధం ఉంది. కరోనా సమయంలోనే కాకుండా మామూలు సమయంలో కూడా ఇబ్బందుల్లో ఉన్న ఎంతోమందికి నా ద్వారా డబ్బు పంపి సహకారం అందించారు. చిన్నారుల, చదువు ఆర్యోగాలకు సహకరించారు. ఈసారి బోనాల వేడుకలో మేం భాగం కావాలని వరంగల్‌ ఎన్నారై ఫోరమ్‌ కోరగా.. గతంలో వారు చేసినా సేవలకు కృతజ్ఞతా భావంతో లండన్‌ షో చేశాం. మమ్మల్ని ఇందులో భాగం కావాలని ప్రత్యేకంగా ఆహ్వానించడం ఎంతో ఆనందంగా ఉంది. ప్రస్తుతం లండన్‌లో చేసిన షోతో 2300 షోలను పూర్తి చేశాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఫోరమ్‌ ప్రెసిడెంట్‌ శ్రీధర్‌ నీల, ఫౌండర్‌ కిరణ్‌ పసునూరి, జనరల్‌ సెక్రటరీ రమణ, వైస్‌ ప్రెసిడెంట్‌ నాగ ప్రశాంతి, ప్రవీణ్‌ బిట్ల, కమల తదితరులకు కృతజ్ఞతలు’ అని అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement