landon
-
రిషి సునాక్ బ్యాగ్ ధరెంతో తెలుసా..
సెలబ్రిటీలు వాడే ప్రతి వస్తువు సామాన్యులకు ఎప్పుడూ ప్రత్యేకమే. వారు ధరించే షూ, వేసుకునే దుస్తులు, వాడే కారు, పెట్టుకునే వాచీలు, ఉపయోగించే బ్యాగులు.. ఇలా అన్ని స్పెషల్‌గా కనిపిస్తాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇటీవల ఓ రైల్వేస్టేషన్లో యూకే ప్రధాని రిషిసునాక్ వాడిన బ్యాగ్ గురించి నెట్టింట వైరల్‌గా మారింది.రాబోయే బ్రిటిష్ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో భాగంగా రిషి సునక్ ప్రచారంలో పాల్గొనేందుకు ఇటీవల రైలులో ప్రయాణించారు. లండన్ నుంచి బయలుదేరిన ఆయన రాత్రంతా రైలు స్లీపర్‌క్లాస్‌లో ప్రయాణించి కార్న్‌వాల్‌కు చేరుకున్నారు. అందులో ఏముంది ప్రత్యేకత అనుకుంటున్నారా. రిషి రైల్వే స్టేషన్లో దిగిన వెంటనే అందరి కళ్లు ఆయనతోపాటు తాను వాడుతున్న బ్యాగ్‌పై పడింది. దేశంలోని అత్యంత పేద ప్రాంతాల్లో ఒకటైన 'ఆర్ఎస్'ను సూచించే మోనోగ్రామ్ ఉన్న బ్యాక్‌ప్యాక్‌ను ధరిస్తూ కనిపించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. దాంతో వీక్షకులు తాను వినియోగించిన బ్యాక్‌ప్యాక్ ధరెంతో తెలుసుకునే పనిపడ్డారు. దీని విలువ సుమారు రూ.79వేలు ఉంటుందని తెలిసింది.ఇదీ చదవండి: అంబానీ మనవరాలా..మజాకా..క్రూయిజ్‌లో ఫస్ట్ బర్త్డేది సండే టైమ్స్ రిచ్ లిస్ట్ రిపోర్ట్ ప్రకారం..రిషి సునక్, తన భార్య అక్షతామూర్తి నికర విలువ 651 మిలియన్ బ్రిటిష్ పౌండ్లు(సుమారు రూ.6900 కోట్లు). బ్రిటిష్ రాజు కింగ్ చార్లెస్ 3 కంటే వీరే సంపన్నులు. ఈ జంట సంపద కేవలం ఒక సంవత్సరంలోనే 120 మిలియన్ పౌండ్లకు పైగా పెరిగింది.Paddington Station, London: Rishi Sunak boarding the sleeper train to Cornwall, sporting a £750 luxury monogrammed Tumi Arrive Bradley backpack pic.twitter.com/ojWi76ovcu— Jane Fleming (@fleming77) May 29, 2024 -
భారతీయ యువతికి లండన్ ప్రతిష్టాత్మక అవార్డు! కింగ్ చార్లెస్‌ని..
ఓ టీనేజ్ అమ్మాయి లండన్ ప్రిన్స్ చార్లెస్‌ని కలిసే అరుదైన అవకాశాన్ని కొట్టేసింది. ఆయన చేతుల మీదుగా లండన్ ప్రతిష్టాత్మక అవార్డుని అందుకుంది. ఎవరా యువతి, ఏం సాధించిందంటే..ఉత్తరప్రదేశ్‌లోని బహ్రెచ్ జిల్లాలోని ఒక గ్రామానికి చెందని ఆర్తీ అనే 18 ఏళ్ల రిక్షా డ్రైవర్ లండన్‌లోని ప్రతిష్టాత్మకమైన అమల్ కూన్లీ ఉమెన్ ఎంపవర్మెంట్ అవార్డుని అందుకుంది. ఈ అవార్డు బ్రిటిష్ స్వచ్ఛంద సంస్థ ప్రిన్స్ ట్రస్ట్చే స్పాన్సర్ చేయబడుతుంది. ఈ ప్రతిష్టాత్మకమైన అవార్డుకి ఇంగ్లీష్ బారిస్టర్ అమల్ క్లూనీ పేరు పెట్టారు. ఆర్తీ ప్రభుత్వ ఈ రిక్షా చొరవతో డ్రైవర్‌గా పనిచేసి ఇతర యువతులను ప్రేరేపించినందుకుగానూ ఆమెకు ఈ లండన్ ప్రతిష్టాత్మకమైన అవార్డు లభించింది. పింక్ రిక్షా ఇనిషియేటివ్ అంటే..ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం 2020లో మిషన్ శక్తి పథకాన్ని ప్రారంభించింది. ఇది రక్షణ, శిక్షణ, స్వావలంబన ద్వారా మహిళలకు సాధికారత కల్పించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పథకం కింద పింక్ ఈ రిక్షా కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇది మహళలకు ఈ రిక్షాలు నడపడంలో శిక్షణ, ట్రాపిక్ నిబంధలన గురించి పూర్తి సమాచారాన్ని అందిస్తుంది. ఇది ముఖ్యంగా వితంతువుల, ఒంటరి తల్లులకు ఉపాధి అవకాశాలను పెంచడమే ఈ పథకం ముఖ్యోద్దేశం. ఆర్తి గతేడాది జూలైలో భారత ప్రభుత్వం పింక్ ఈ రిక్షా పథకాన్ని పరిచయం చేసేందుకు ముందుకొచ్చారు. చెప్పాలంటే యూపీలో ఆమె తొలి పింక్ ఈ రిక్షా డ్రైవర్ కూడా. చాలా చిన్న వయసులో ఆమె అందించిన గొప్ప సహకారానికిగానూ ఈ ప్రిన్స్ ట్రస్ట్ అవార్డుని తెచ్చిపెట్టాయి. " అసమానతలకు వ్యతిరేకంగా తన చుట్టూ ఉన్నవారిలో శాశ్వతమైన మార్పు తీపుకొచ్చేలా ప్రపంచ పనిలో విజయం సాధించిన యువతులను ఈ అవార్డుతో సత్కరిస్తుంది" ప్రిన్స్ ట్రస్ట్. ఆర్తీ తొలి పింక్ ఈ రిక్షా డ్రైవర్‌గా ఎలా మారిందంటే..ఈ ప్రతిష్టాత్మక అవార్డును గెలుచుకున్న ఆర్తీ మీడియాతో మాట్లాడుతూ..ఇలాంటి సవాళ్లను ఎదుర్కొనేలా ఇతర అమ్మాయిలకు స్ఫూర్తినివ్వగలిగినందుకు గర్విస్తున్నా. ఈ కొత్త స్వాతంత్ర్యం ప్రపంచాన్ని వేరే కోణంలో చూసేందుకు నన్ను అనుమతించింది. ఇప్పుడ నేను నా కలలన మాత్రమే కాకుండా నా కుమార్తె కలలన కూడా నెరవేర్చగలుగుతున్నాను. ఈ చోరవే నాకు బకింగ్‌హామ్ ప్యాలెస్‌లో కింగ్ చార్లెస్‌ని కలిసే అవకాశం లభించేలా చేసింది.ఇది ఒక అద్భుతమైన అనుభవంగా పేర్కొంది ఆర్తీ . అంతేగాదు చార్లెస్ తనకు ఈ రిక్షా డ్రైవింగ్ పట్ల ఉన్న ఆసక్తిని శ్రద్ధగా విన్నారని తెలిపింది. ఆయనతో ఆర్తి తన ఆటో రిక్షా కాలుష్యం కలిగించని వాహానం అని గర్వంగా చెప్పుకొచ్చింది కూడా. ఐదేళ్ల కుమార్తె ఉన్న ఆర్తీ ఇలాంటి సవాళ్లను ఎన్నింటినో ఎదుర్కొని ఇతర బాలికలకు స్ఫూర్తిగా ఉండాలనుకుంటున్నట్లు పేర్కొంది. (చదవండి: 'ప్రపంచ ఆకలి దినోత్సవం': ఎంతమంది బాధపడుతున్నారంటే..?) -
లండన్‌లో సెర్వికల్ కేన్సర్‌పై అవగాహన కార్యక్రమం!
ఆడవారిలో కేన్సర్ కేసులు సంఖ్య విపరీతం గా పెరుపోతున్న సంగతి తెలిసిందే. అందులోనూ సెర్వికల్ కేన్సర్ మహిళలకు మరింత ప్రాణాంతకంగా మారింది. ఈ నేపథ్యంలో యూకే రాజధాని లండన్‌లో మహిళల్లో వచ్చే కేన్సర్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ మేరకు లండన్‌లోని స్లవ్ ప్రాంతంలో ప్రవాస భారతీయులు స్థాపించిన బెర్కషైర్ భారత కమ్యూనిటీ(బీబీసీ) అనే ఛారిటబుల్ ఆర్గనైజేషన ఆధ్వరంలో ఆడవారికి వచ్చే కేన్సర్‌పై అవగాహన కార్యక్రమం జరిగింది. ఆడవారికి వచ్చే ఈ సెర్వికల్ కేన్సర్‌పై అవగాహన కార్యక్రమం నిర్వంహిచారు. ఈ కార్యక్రమానికి వందలాదిగా మహిళలు పాల్గొని ఈ కేన్సర్ రాకుండా ఉండేలా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాలు కూలంకషంగా తెలుసుకున్నారు. అంతేగాదు ఈ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలోనే గత నెల మార్చిలో మహిళ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. అప్పుడే ఇలా మహిళ ఆరోగ్యానికి సంబంధించిన కార్యక్రమాన్ని నిర్వహించాలనుకున్నట్లు బీబీజీ ఛారిటబుల్ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలోనే మహిళల ఆరోగ్యానికి సంబంధించిన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇక ఈ కార్యక్రమం ద్వారా దాదాపు £1,655 పౌండ్లను (సుమారు 1.70 లక్షల రూపాయలు) ఒవేరియన్ కేన్సర్ యాక్షన్ (Ovarian Cancer Action)’ అనే ఛారిటీకి అందజేశామని నిర్వాహకులు తెలిపారు. (చదవండి: ఏరియల్ రోప్ వే.. అదో అద్భుత ప్రయాణ అనుభూతి!) -
సామాజిక విప్లవ చైతన్యమూర్తికి నీరాజనం
విగ్రహాలు జాతి జీవన వికాస చారిత్రక ప్రతిబింబాలు. సమాజాన్ని చైతన్యపరచే విగ్రహాలు మౌన సందేశాలకు ప్రతిరూపాలు. భారతదేశం మినహా ప్రపంచదేశాల్లో ఇప్పటికి లక్షకు పైగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాలు ఉన్నాయని అధికారిక అంచనా. ప్రపంచ దేశాలు అంబేడ్కర్ జ్ఞాన సంపదకూ, సమసమాజ నిర్మాణ రచనా చాతుర్యానికీ, సమయస్ఫూర్తి గల వాగ్ధాటికీ ముగ్ధులై నిత్య నీరాజనాలు పలుకుతున్నాయంటే అది భారతదేశానికి గర్వకారణం. అంబేడ్కర్ సమాజం కోసం జీవించాడు. సమాజ పురోగతి కోసం నిరంతర పోరాటం జరిపిన అసమాన ప్రతిభావంతుడు. తాను నేర్చిన విద్య, విజ్ఞాన సంపద అంతా సమాజం కోసమే వినియోగించాడు. దీన్నే ‘పేబాక్ టు ది సొసైటీ’ అంటారు. అందుకే ఆయన విధానాలను పలు దేశాలు అనుసరిస్తున్నాయి. ‘నా జీవన పోరాటమే నా సందేశం’ (మేరా జీవన్ సంఘర్ష్ హీ మేరా సందేశ్) అని చెప్పిన మాటలే విశ్వ సందేశంగా వినువీధుల్లో వినిపిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు అంబేడ్కర్ విగ్రహాలు నెలకొల్పి తమకున్న గౌరవాన్ని చాటుకున్నాయి. అమెరికాలో మిచిగన్ విశ్వవిద్యాలయం (1993)లో ఒక విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. 2023 అక్టోబరు 14న మేరీలాండ్‌లో ‘స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ’ అనే పేర 19 అడుగుల ఎత్తయిన విగ్రహాన్ని నిలిపారు. 1996లో టొరంటో విశ్వవిద్యాలయం (కెనడా) కూడా అంబేడ్కర్ విగ్రహాన్ని ప్రతిష్ఠించుకొంది. ఇక బ్రిటన్‌లో చాలానే ఉన్నాయి. లండన్, బర్మింగ్ హామ్, మాంచిస్టర్లలో పలు విగ్రహాలను నెలకొల్పారు. అలాగే అంబేడ్కర్ చదివిన ‘లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్’ ముఖద్వారంలో 2000లో ఆయన విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. జర్మనీలోని బెర్లిన్, మ్యూనిక్, ఫ్రాంక్ ఫర్ట్లలో; జపాన్‌లోని టోక్యో, ఒకాసా, కొయెటోలల్లో; దక్షిణాఫ్రికాలోని జొహన్నెస్ బర్గ్, కేప్‌టౌన్, డర్బన్‌లలో; ఆస్ట్రేలియాలోని సిడ్నీ, మెల్బోర్న్, బ్రిస్బెయిన్ వంటి నగరాల్లో; న్యూజిలాండ్‌లోని ఆక్లండ్ తదితర ప్రాంతాల్లో, మారిషస్ (2018), శ్రీలంక (కొలంబో). నేపాల్ (ఖాట్మండు 2019), బంగ్లాదేశ్ (ఢాకా 2021), దుబాయ్‌తో సహా మరెన్నో దేశాల్లో అంబేడ్కర్ విగ్రహాలు నెల కొన్నాయి. తెలంగాణలో గతేడాది ఏప్రిల్ 14న అంబేడ్కర్ ముని మనుమడు ప్రకాష్ అంబేడ్కర్చే 125 అడుగుల ఎత్తయిన అంబేడ్కర్ విగ్రహం ఆవిష్కరించబడింది. లక్నోలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన పార్క్‌కు ‘డాక్టర్ భీమ్రావ్ సామాజిక్ పరిపర్తన్ స్థల్’గా నామకరణం చేసి అక్కడ ఆయన విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈ ప్రదేశంలోనే జ్యోతిరావ్ ఫూలే, నారాయణగురు, బిశ్రా ముండా, శాయాజి మహరాజ్, కాన్షీ రామ్ విగ్రహాలున్నాయి. ఇక్కడే 124 ఏనుగుల విగ్రహాలు కొలువుదీరి సందర్శకులకు ఆహ్లాదం కలుగచేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో లెక్కకు మించిన అంబేడ్కర్ విగ్రహాలున్నాయి. వీటికి తోడు విజయవాడ నడిబొడ్డున స్వరాజ్ మైదానంలో రాష్ట్రప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూ. 400 కోట్లకు పైగా ఖర్చుతో నిర్మించిన 206 అడుగుల విగ్రహాన్ని ఈ రోజు ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్రెడ్డి ఆవిష్కరిస్తున్నారు. ఈ విగ్రహపీఠం 81 అడుగుల ఎత్తు ఉంది. దానిపై ప్రతిష్ఠించిన 125 అడుగుల ప్రధాన విగ్రహంతో మొత్తం 206 అడుగుల అంబేడ్కర్ శిల్పం విజయవాడ నలుదిక్కులకూ కనిపిస్తూ, చూడగానే ఆకర్షించేలా ఉంది. ఈ విగ్రహ ప్రదేశం ఒక స్మృతివనంగా భాసిస్తుంది. మూడు అంతస్తులున్న విగ్రహం కింది భాగంలో నాలుగు ఏసీ హాల్స్ ఉన్నాయి. నాలుగు వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో మినీ థియేటర్, మ్యూజియం, మరో రెండు హాల్స్‌లో అంబేడ్కర్‌కు దక్షిణ భారతదేశంతో ఉన్న అనుబంధంతో కూడిన ఛాయాచిత్రాలు, మరో మ్యూజియం ఉంది. వీటికి తోడు రెండు వేలమంది కూర్చోవడానికి సరిపడే మరో ఓపెన్ ఎయిర్ థియేటర్‌తో పాటు అందమైన పార్కు, మరో అందమైన ఫౌంటెన్ సందర్శకులకు కనువిందు చేయనున్నాయి. విగ్రహం రంగు మాసిపోకుండా పాల్యూరెథేన్ కోటింగ్ వేయటం మరో ప్రత్యేకత! 15 మంది ఎక్కడానికి సరిపడ రెండు లిఫ్టులను ఏర్పాటుచేశారు. మూడు అంతస్తుల్లో నిర్మిత మైన ఈ ప్రదేశం ఒక పర్యాటక కేంద్రంగా వర్ధిల్లుతుందనటంలో ఎలాంటి అనుమానం లేదు. అంబేడ్కర్ విగ్రహ ప్రతి ష్ఠతో విజయవాడలో నూతన సాంస్కృతిక వికాసం మరింతగా వృద్ధిచెందుతుంది. దీనివల్ల సమాజ వికాసంతోపాటు దళిత అస్తిత్వానికీ, సర్వమత సామరస్యానికీ, సకల మానవ సౌభ్రాతృత్వానికీ మరింత దోహదం చేకూరుతుంది. ఈ విగ్రహ ప్రాంగణం నిత్యమూ విజ్ఞాన మేధామథనంతోపాటు సకల కళలు అభివృద్ధి చెందే సాంస్కృతిక కేంద్రంగా మారుతుంది. ఈ కేంద్రంలో ఏర్పరచే నూతన పుస్తక భాండాగారం పుస్తక ప్రియులకూ, పాఠకులకూ ఒక విజ్ఞాన వికాస కేంద్రంగా నిత్యం అందుబాటులో ఉంటుంది. అంబేడ్కర్ విగ్రహంతో పోరాటాల పురిటిగడ్డ విజయవాడ నగరానికి కొత్త అందాలు పురివిప్పుకుంటాయి. ఆయన జీవిత సందేశం అడుగడుగునా ప్రతిబింబించి ప్రగతిపథంలో పయనించే ప్రజలకు మార్గదర్శి కాగలదు. ఆచార్య గుజ్జర్లమూడి కృపాచారి, వ్యాసకర్త ప్రముఖ సాహితీవేత్త, 98481 23655 -
అల్లు అర్జున్‌కు మరో అరుదైన గౌరవం.. ప్రభాస్, మహేశ్ తర్వాత బన్నీయే!
మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో మైనపు విగ్రహం కలిగి ఉండడం గొప్ప గౌరవంగా భావిస్తారు మన సినిమా వాళ్లు. ఒకప్పుడు ఇండియా నుంచి బాలీవుడ్ స్టార్స్‌కి మాత్రమే అక్క చోటు దక్కేది. కానీ ఈ మధ్య కాలంలో సౌత్ ఇండస్ట్రీకి చెందిన వాళ్లను కూడా పరిగణలోకి తీసుకుంటున్నారు. ముఖ్యంగా టాలీవుడ్‌కి చెందిన హీరోలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు మన తెలుగు సినిమా పాన్ ఇండియా స్థాయిలోనే కాదు వరల్డ్ వైడ్‌గా రాణిస్తోంది. దాని కారణంగానే మన వాళ్లకు ఆ మ్యూజియంలో అవకాశం దక్కుతోంది. ఇప్పటికే స్టార్ హీరోలు ప్రభాస్, మహేశ్ బాబు మైనపు విగ్రహాలు మేడమ్ టుస్సాడ్స్ కొలువుదీరిన విషయం తెలిసిందే. ఇక తాజాగా టాలీవుడ్‌కి చెందిన మరో స్టార్ హీరోకి అక్కడ చోటు లభించింది. అతనే జాతీయ అవార్డు గ్రహిత అల్లు అర్జున్. ఈ న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. లండన్ వెళ్లనున్న బన్నీ మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో అల్లు అర్జున్‌కు చోటు దక్కిందనే వార్త గత కొన్నాళ్లుగా నెట్టింట వైరల్ అవుతోంది. కొత్త విషయం ఏంటంటే.. త్వరలోనే బన్నీ లండన్ వెళ్లనున్నారట. మైనపు విగ్రహానికి సంబంధించి కొలతలు ఇవ్వడానికి బన్నీ లండన్ వెళ్తున్నట్లు సమాచారం. . రెండు రోజులు అక్కడే ఉండి ఈ ప్రక్రియ పూర్తి చేసుకుని తిరిగి ఇండియాకు వస్తారట. వచ్చే ఏడాదిలో ఈ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారట. ఒకవేళ ఇదే నిజమైతే ఈ ఘనత సాధించిన మూడో టాలీవుడ్ హీరోగా బన్నీ నిలుస్తాడు. పుష్ప-2పై భారీ అంచనాలు పుష్ప చిత్రానికిగాను ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్‌కి జాతీయ అవార్డు లభించిన సంగతి తెలిసిందే. తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్న ఏకైన హీరో అల్లు అర్జున్. ఈ అవార్డు ప్రకటనతో బన్నీ పాపులారిటీ మరింత పెరిగింది. అందుకే పుష్ప సీక్వెల్ పుష్ప-2(పుష్ప: ది రూల్)కి అంచనాలు మరింత పెరిగాయి. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఆగస్ట్ 15న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. -
లండన్ గడ్డపై రాకింగ్ రాకేశ్ - జోర్దార్ సుజాత బోనాల జాతర
వరంగల్‌కు చెందిన ఎన్నారై ఫొరమ్ లండన్‌లో బోనాల జాతర వేడుకలు ఘనంగా నిర్వహించారు. గత పదేళ్లుగా ఈ ఉత్సవం నిర్వహిస్తునప్పటికీ ఈ ఏడాది మరింతగా ఘనంగా నిర్వహించాలని ఎన్నారై ఫోరమ్ నిర్ణయించుకుంది. యాంకర, నటి తెలంగాణ మహిళ అయిన జోర్దార్ సుజాత ఆధ్వర్యంలో బోనాల జాతర నిర్వహించారు. ఈ మేరకు ఫోరమ్ ప్రెసిడెంట్ శ్రీధర్ నీల మాట్లాడుతూ ‘తెలంగాణ సంస్కృతిలో భాగమైన బోనాల ఉత్సవాలు ఎన్నో ఏళ్లగా లండన్‌లో నిర్వహిస్తున్నాం. ఈ ఏడాది ఎప్పటిలా కాకుండా మరింత ఘనంగా చేస్తున్నాం. ఈ వేడుకలో మరింత ఉత్సాహాన్ని నింపడానికి హైదరాబాద్ నుంచి రాకింగ్ రాకేశ్, సుజాత ఇక్కడికి రావడం ఆనందించదగ్గ విషయం’అని తెలిపారు. నేరెళ్ల వేణుమాధవ్ శిష్యుల తర్వాత రాకింగ్ రాజేశ్ మిమిక్రీ అంతగా పాపురల్ అయ్యారు. బజర్దస్త్ వంటి షోలతో చక్కని గుర్తింపు తెచ్చుకున్నారు. సినిమాల్లోనూ అవకాశాలు అందుకుంటున్నారు. ఇటీవల అమెరికా, న్యూజెర్సీలోని నాట్స్ కార్యక్రమం విజయవంతం తర్వాత రాకింగ్ రాకేశ్, జోర్దార్ సుజాత లండన్‌లో జరిగిన బోనాల ఉత్సవంలో తమదైన శైలి స్కిట్లు, మిమిక్రీ కార్యక్రమాలతో అలరించారు. ఈ షోతో ఆయన 2300 షోల మార్కును దాటారు. రాకింగ్ రాకేశ్ మాట్లాడుతూ ‘వరంగల్ ఎన్నారై ఫోరమ్‌తో నాకు మంచి అనుబంధం ఉంది. కరోనా సమయంలోనే కాకుండా మామూలు సమయంలో కూడా ఇబ్బందుల్లో ఉన్న ఎంతోమందికి నా ద్వారా డబ్బు పంపి సహకారం అందించారు. చిన్నారుల, చదువు ఆర్యోగాలకు సహకరించారు. ఈసారి బోనాల వేడుకలో మేం భాగం కావాలని వరంగల్ ఎన్నారై ఫోరమ్ కోరగా.. గతంలో వారు చేసినా సేవలకు కృతజ్ఞతా భావంతో లండన్ షో చేశాం. మమ్మల్ని ఇందులో భాగం కావాలని ప్రత్యేకంగా ఆహ్వానించడం ఎంతో ఆనందంగా ఉంది. ప్రస్తుతం లండన్‌లో చేసిన షోతో 2300 షోలను పూర్తి చేశాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఫోరమ్ ప్రెసిడెంట్ శ్రీధర్ నీల, ఫౌండర్ కిరణ్ పసునూరి, జనరల్ సెక్రటరీ రమణ, వైస్ ప్రెసిడెంట్ నాగ ప్రశాంతి, ప్రవీణ్ బిట్ల, కమల తదితరులకు కృతజ్ఞతలు’ అని అన్నారు. -
మురికి బెడ్‌షీట్‌తో హఠాత్ అగ్నిప్రమాదాలు.. హెచ్చరించిన ఫైర్ ఫైటర్స్!
రోజంతా పనిచేసి అలసిపోయాక సాయంత్రం అయ్యేసరికి మంచం మీద వాలిపోతాం. రాత్రంతా మంచంపైననే విశ్రాంతి తీసుకుంటాం. అయితే మంచం మీద వేసే బెడ్‌షీట్ గురించి అంతగా ఆలోచించం. చాలామంది అపరిశుభ్రంగా ఉన్న బెడ్‌షీట్‌నే వాడేస్తుంటారు. ఇది అనారోగ్యకరం అని తెలిసినా చాలామంది నిర్లక్ష్యం వహిస్తారు. అయితే తాజాగా ఫైర్ ఫైటర్స్ బెడ్‌షీట్ గురించి తెలిపిన ఒక విషయం ఎంతో ఆశ్చర్యం గొలుపుతోంది. స్లీప్ ఫౌండేషన్ వెలువరించిన ఒక రిపోర్టు ప్రకారం ప్రతీ మనిషి అధిక సమయం బెడ్‌పైనే గడుపుతాడు. అయితే మురికి పట్టిన బెడ్‌షీట్ ఉపయోగిస్తే అది అగ్ని ప్రమాదానికి దారి తీయవచ్చు. ఈ విషయాన్ని లండన్‌కు చెందిన ఫైర్ బ్రిగేడ్ డిపార్ట్మెంట్ తెలియజేసింది. మురికిపట్టిన బెడ్షీట్లపై ఎమోలియంట్స్, లేదా స్కిన్ క్రీమ్ అవశేషాలు జమ అవుతాయి. ఇవి మండే గుణాన్ని కలిగివుంటాయి. వేసవి కాలంలో ఇవి మరింత వేడికి గురై అగ్నిప్రమాదాలకు తావిస్తాయి. అందుకు ఎవరైనా చర్మపు క్రీమ్‌లను వినియోగిస్తున్నప్పుడు ఎంతో అప్రమత్తంగా మెలగాలి. అటువంటి క్రీమ్‌లు బెడ్‌షీట్‌కు అంటుకోకుండా చూసుకోవాలి. లండన్‌లో ఈ విధంగా బెడ్షీట్లు దగ్ధమైన ఘటనలు వెలుగు చూశాయి. మిర్రర్ రిపోర్టును అనుసరించి ఎవరైనా వారానికి ఒకసారి బెడ్‌షీట్‌ను శుభ్రం చేయాలి.వీటిని 60 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత కలిగిన వేడి నీటిలో ఉతకాలి.బెడ్షీట్లు, తలదిండు గలేబులు ఎక్కువగా మురికి పట్టినట్లు అనిపిస్తే వారానికి రెండుసార్లు ఉతకాల్సి ఉంటుంది. ఇంట్లో ఎవరికైనా చర్మవ్యాధులు ఉన్న పక్షంలో బెడ్షీట్లను తరచూ ఉతుకుతుండాలి. ఇది కూడా చదవండి: అందం కోసం కొత్త దంతాలు..‘షార్క్’లా మారిన యువకుడు -
Rishi Sunak:‘నేను ఎన్నికైతే చైనాకు చుక్కలే’
లండన్: బ్రిటన్ ప్రధాని అభ్యర్థి, భారత సంతతి వ్యక్తి రిషి సునాక్ చైనాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను బ్రిటన్ ప్రధానిగా ఎన్నికైతే చైనా పట్ల కఠినంగా వ్యవహరిస్తామని పేర్కొన్నారు. దేశీయ, అంతర్జాతీయ భద్రతకు చైనా నెంబర్ వన్ ప్రమాదకారి అని అభివర్ణించారు. చైనా, రష్యా పట్ల రిషి సునాక్ బలహీనుడిగా ప్రత్యర్థి లిజ్ ట్రస్ ఆరోపణలు చేసిన క్రమంలో ఈ మేరకు మాట్లాడారు మాజీ ఆర్థిక మంత్రి రిషి సునాక్. మరోవైపు.. యూకే-చైనా సంబంధాల అభివృద్ధికి రిషి సునాక్ సరైన వ్యక్తి అని డ్రాగన్ అధికారిక మీడియా గ్లోబల్ టైమ్స్ ఇటీవల పేర్కొనటం గమనార్హం. చైనాను తరిమి కొడతాం.. తాను ప్రధాని పదవి చేపడితే చైనాతో వ్యవహరించే తీరుపై వివరించారు సునాక్. బ్రిటన్‌లోని 30 ఇన్స్టిట్యూట్లను మూసివేస్తామని, దాని ద్వారా సంస్కృతి, భాషా కార్యక్రమాల ద్వారా చైనా వ్యాప్తి చేస్తున్న సాఫ్ట్ పవర్ ప్రభావాన్ని అడ్డుకుంటామన్నారు. ‘మన యూనివర్సిటీల నుంచి చైనా కమ్యూనిస్ట్ పార్టీని తరిమికొడతాం. చైనా గూఢచర్యాన్ని అడ్డుకునేందుకు బ్రిటన్ డొమెస్టిక్ స్పై ఏజెన్సీ ఎంఐ5ని ఉపయోగిస్తాం. చైనా సైబర్ దాడులను అరికట్టేందుకు నాటో తరహా అంతర్జాతీయ సహకారాన్ని నిర్మిస్తాం. చైనా స్వదేశంలో మన సాంకేతికతను దొంగిలించి, మన విశ్వవిద్యాలయాలలోకి చొచ్చుకుపోతోంది. రష్యన్ చమురును కొనుగోలు చేయడం ద్వారా విదేశాలలో వ్లాదిమిర్ పుతిన్‌కు మద్దతుగా నిలుస్తోంది. తైవాన్‌తో సహా పొరుగువారిని బెదిరించే ప్రయత్నం చేస్తోంది.’ అని పేర్కొన్నారు. అప్పులు ఆశ చూపి అభివృద్ధి చెందుతున్న దేశాలను తన అధీనంలోకి తెచ్చుకుంటున్న చైనా బెల్ట్ అండ్ రోడ్ పథకంపై తీవ్ర విమర్శలు చేశారు రిషి సునాక్. అలాగే.. జింజియాంగ్, హాంకాంగ్‌లలో తన సొంత ప్రజలను వేధించటం, అరెస్టులు చేస్తూ మానవ హక్కులను కాలరాస్తోందని ఆరోపించారు. వారి కరెన్సీని తగ్గిస్తూ అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థను తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారని తీవ్రంగా ఖండించారు రిషి. ‘జరిగింది చాలు. చాలా కాలంగా బ్రిటన్‌తో పాటు పశ్చిమ ప్రాంతంలోని రాజకీయ నాయకులు చైనాకు ఎర్ర తివాచీ పరిచారు. చైనా కుటిల బద్ధిపై గుడ్డిగా వ్యవహరించారు. దానిని ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మొదటి రోజునే మారుస్తా.’ అని పేర్కొన్నారు. ఇదీ చదవండి: రిషి సనాన్ తగ్గేదేలే.. సర్వేలపై పరోక్షంగా పంచ్‌లు.. ప్రధాని రేసులో అండర్డాగ్ -
Cuddle Therapy: కష్టాలను తీర్చే కౌగిలింత..
లండన్: మనసుకు కష్టంగా ఉన్నప్పుడు అక్కున చేర్చుకునే మనిషి, ధైర్యాన్నిచ్చే ఓ భుజం, తలనిమిరి ప్రేమ పంచే స్పర్శ కావాలనిపిస్తుంది. కానీ పెరిగిన ఆధునికత మనిషిని ఒంటరి చేసింది. ఓదార్పునిచ్చేవారు, ప్రేమ పంచేవారు కరువయ్యారు. అలాంటివారికి తానున్నానంటున్నాడు యూకేలోని బ్రిస్టల్‌కు చెందిన ట్రెవర్ హూటన్ (ట్రెజర్). బాధల్లో ఉన్నవారికి కౌగిలినందిస్తున్నాడు. గంటకు రూ.7 వేల చొప్పున చార్జ్ చేస్తూ ‘కడిల్ థెరపీ’ పేరుతో సేవలందిస్తున్నాడు. ‘బాధను పంచుకునే మనిషిలేక మదనపడే వాళ్లుచాలా మంది ఉంటారు. అలాంటి చోట నా అవసరం ఉంటుంది. హగ్ అంటే.. కేవలం కౌగిలి మాత్రమే కాదు, అంతకుమించిన ఆత్మీయ స్పర్శ. నీకు నేనున్నాననే ధైర్యం, అభిమానం, ఓదార్పును ఓ స్పర్శద్వారా పంచడం’ అని చెబుతున్నాడు ట్రెజర్. పదేళ్ల కిందటినుంచే మానవ అనుబంధాల శాస్త్రాన్ని అధ్యయనం చేస్తున్న ట్రెజర్.. ఈ బిజినెస్‌ను మే 2022 నుంచి ప్రారంభించాడు. కౌగిలింత అనగానే అభద్రతకు లోనయ్యేవాళ్లు, అపార్థం చేసుకున్నవాళ్లూ ఉన్నారు. అందుకే పూర్తిగా నాన్–సెక్సువల్ అని చెబుతున్నాడు. భారమైన మనసుతో తనదగ్గరకు వచ్చినవాళ్లు దాన్ని దించేసుకుని, సంతోషంగా వెళ్లిపోవడమే ట్రెజర్ మోటో అట. అంతేకాదు.. రిలేషన్షిప్లో ఉన్న ఇద్దరి మధ్య వచ్చిన అపార్థాలను తొలగించి అనుబంధాన్ని పెంచే ‘కనెక్షన్ కోచింగ్’ కూడా ఇస్తానంటున్నాడు. ఇదీ చదవండి: ఐఏఎస్‌కు సిద్ధమవుతూ.. అజ్ఞాతంలోకి -
లండన్‌లో ఘనంగా హీరోయిన్ సీమంతం, ఫొటోలు వైరల్
బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్ త్వరలో తల్లి కాబోతున సంగతి తెలిసిందే. ప్రస్తుతం 7నెలల గర్భవతిగా ఉన్న ఆమె ఆగష్టులో బిడ్డకు జన్మినివ్వబోతోంది. ఈ నేపథ్యంలో ఆమె సీమంతం వేడుకలు ఘనంగా జరిగాయి. కేవలం తన భర్త, సోదరి రియా కపూర్ అత్యంత సన్నిహితుల మధ్య సోనమ్ సీమంత వేడుక జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోలను ఆమె సోదరి రియా కపూర్ షేర్ చేసింది. ఈ వేడుకలో సింగర్ లియో కల్యాణ్ పాట పాడుతూ అందరిని అలరించాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. తన సీమంతం వేడుకలో సోనమ్ పింక్ కలర్ అవుట్ ఫిట్ ధరించి క్యూట్‌గా నవ్వుతు ఫొటోలకు ఫోజులిచ్చింది. కాగా సోనమ్ ప్రస్తుతం తన భర్త ఆనంద్ ఆహుజాతో కలిసి లండన్‌లో ఉంటుంది. 2018లో వ్యాపారవేత్త ఆనంద్ అహుజాను ప్రేమ వివాహం చేసుకున్న సోనమ్ గత కొంతకాలంగా సినిమాలకు దూరమైంది. కాగా సోనమ్.. బాలీవుడ్ స్టార్ అనిల్ కపూర్ కుమార్తె అన్న సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Leo Kalyan (@leokalyan) -
లండన్‌లో హీరో సిద్ధార్థ్‌కు సర్జరీ!
Hero Siddharth Got Surgery In London: హీరో సిద్ధార్థ్‌కు లండన్‌లో సర్జరీ జరిగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బొమ్మరిల్లు, నువ్వు వస్తానంటే నేనొద్దంటానా? చిత్రాలతో బ్లాక్‌బస్టర్ హిట్‌ను అందించిన సిద్ధార్థ్‌కు ఆ తర్వాత ఆశించిన సక్సెస్ రాలేదు. దీంతో తమిళంలో సినిమాలు చేస్తూ అక్కడ సెటిలైపోయాడు. ఈ క్రమంలో అక్కడ కూడా తన సినిమాలకు అంతగా గుర్తింపు రాకపోవడంతో కొంతకాలం బ్రేక్ ఇచ్చాడు. సుదీర్ఘ విరామం అనంతరం ‘మహా సముద్రం’ మూవీతో తిరిగి టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. చదవండి: తల్లికి మధురమైన గిఫ్ట్ ఇచ్చిన విజయ్ దేవరకొండ దసరా సందర్భంగా ఈ చిత్రం విడుదల కానున్న నేపథ్యంలో ఇటీవల మహా సముద్రం ట్రైలర్ విడుదలైన సంగతి తెలిసిందే. కాగా ఈ కార్యక్రమంలో దర్శకుడు అజయ్ భూపతి, హీరో శర్వానందా, హీరోయిన్ అనూ ఇమ్మాన్యయేల్తో పాటు పలువురు సాంకేతిక నిపుణులు హజరయ్యారు. అయితే ఈ వేడుకలో సిద్ధార్థ్ మాత్రం కనిపించలేదు. దీంతో ఫ్యాన్స్ ఆరా తీయగా ఆయనకు సర్జరీ జరిగినట్లు తెలిసింది. ఇటీవల లండన్ వెళ్లిన సిద్ధార్థ్‌కు అక్కడ సర్జరీ జరిగినట్లు ఫిలిం దూనియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. చదవండి: Love Story Review: ‘లవ్‌స్టోరి’ మూవీ రివ్యూ అయితే చికిత్స ఎందుకు, దేనికి అనేది మాత్రం స్పష్టత లేదు. సోషల్ మీడియాలో తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని పంచుకునే సిద్ధార్థ్ సర్జరీ విషయంపై ప్రస్తావించలేదు. అంతేగాక కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఎలాంటి పోస్టులు షేర్ చేయకపోవడం గమనార్హం. ఇక ఈ వార్తలో ఎంతవరకు నిజముందనేది తెలియాలంటే దీనిపై సిద్ధార్థ్ స్పందించే వరకు వేచి చూడ్సాలిందే. కాగా మహా సముద్రంలో సిద్ధార్థ్‌తో పాటు శర్వానంద్ కూడా హీరో నటిస్తున్నాడు. -
త్వరలో ఉబర్ డైవర్లకు పెన్షన్
లండన్: ట్యాక్సీ రైడ్ దిగ్గజ సంస్థ ఉబర్ టెక్నాలజీస్ యూకేలోని పనిచేస్తున్న అర్హులైన ఉబర్ డ్రైవరలందరి కోసం నెలరోజుల వ్యవధిలోనే పెన్షన్ పథకం ప్రారంభించనున్నట్లు పేర్కొంది. గత నెలలో ఉబర్ డ్రైవర్లను కార్మికులుగా పరిగణించాల్సిందేనని స్పష్టంచేస్తూ ఒక కేసులో లండన్‌లోని కోర్టు తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఉబర్ కింద పనిచేస్తున్న డ్రైవర్లకు బ్రిటన్‌లో కనీస వేతనం, సెలవు, అనారోగ్యానికి సంబంధించి హక్కులు కల్పించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో డ్రైవర్లు తాము ఆర్జిస్తున్న సంపాదనలో కనీసం 5% ఆదా చేసుకున్నట్లయితే 3% పెన్షన్ ప్లాన్‌కి దోహదపడుతుందని ఉబర్ పేర్కొంది. అయితే బ్రిటన్ జీఎంబీ యూనియన్ యూకేలోని డ్రైవర్లందరికీ ప్రాతినిధ్యం వహిస్తోంది. అంతేకాదు వారికి వర్కఫోర్స్ తరుఫున చర్చించే హక్కు కూడా కల్పించింది. ఇతర ట్యాక్సీ రైడ్ దిగ్గజాలైన ఓలా, బోల్ట్, అడిసన్ లీలను తమ కంపెనీల్లో పనిచేసే డ్రైవర్లకు కూడా ఇలాటి ప్రయోజనాలను అందించాలని ఉబర్, జీఎంబీ సంస్థలు కోరాయి. ఈ సందర్భంగా ఉబర్ ఎగ్జిక్యూటివ్ జామీ హేవుడ్ మాట్లాడుతూ..."సరికొత్త ఒరవడిని సృష్టించే ఈ పరిశ్రమల పెన్షన్ పథకంలో ఇతర ట్యాక్సీ రైడ్ దిగ్గజాలైన ఓలా, బోల్ట్, అడిసన్ లీలతో కలిసి చేయడానికి స్వాగతిస్తున్నాను" అని పేర్కొన్నారు. కొత్తగా ప్రారంభంకానున్న ఈ పెన్షన్ పథకం కోసం దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు ప్రస్తుతం పనిచేస్తున్న వాళ్లందరికీ ఈ పథకం వర్తిస్తుంది. -
లండన్ రెస్టారెంట్లో ప్రియాంక రచ్చ, వీడియో వైరల్
గ్లోబల్ స్టార్ ప్రియాంక ప్రస్తుతం లండన్‌లో సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. వీకెండ్ సందర్భంగా ఆమె స్నేహితులతో కలిసి డిన్నర్ డేట్‌కు వెళ్లిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం హల్చల్ చేస్తున్నాయి. నటి సండ్రా హో, ఆక్వాఫినా, డైరెక్టర్ పాల్ ఫీగ్లతో కలిసి ప్రియాంక రెస్టారెంట్‌కు వెళ్లినట్లు తెలుస్తుంది. అక్కడ ప్రియాంకను చూసిన ఆమె ఫ్యాన్ ఒకరు గప్‌చుప్‌గా వీడియో తీశాడు. ఆ తర్వాత ఈ వీడియోను ప్రియాంక ట్వీటర్ ఫ్యాన్స్ పేజీలో షేర్ చేయడంతో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ వీడియో ప్రియాంక అల్లరి మామూలుగా లేదు. ప్రియాంక పాట పాడుతూ, డ్యాన్స్ చేస్తూ రచ్చ రచ్చ చేస్తుంటే పక్కనే అక్వాఫినా, సండ్రా హో, డైరెక్టర్ పాల్ ఫీగ్లు ఎంజాయ్ చేస్తూ కనిపించారు. ఇలా తమ అభిమాన నటిని చూసి ఆమె ఫ్యాన్స్ తెగ మురిసిపోతుంటే మరికొందరి ‘ప్రియాంక అల్లరి మామూలుగా లేదు కదా’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా ప్రియాంక తన భర్త నిక్‌జోనస్, తల్లి మధు చోప్రాతో కలిసి లండన్‌లోని ఓ రెస్టారెంట్‌కు వెళ్లిన ఫొటోలు ఇటీవల బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. అంతేగాక అక్కడి రోడ్లపై భర్త నిక్‌జోనస్‌తో కలిసి లండన్ వీధుల్లో ప్రియాంక చిల్ అవుతున్న ఫొటోలు సైతం ఈ మధ్య తరచూ దర్శనమిస్తున్నాయి. కాగ నిక్ జోనస్‌ను వివాహం చేసుకున్న తర్వాత ప్రియాంక ఆమెరికాకు మాకాం మార్చేసిందే. హాలీవుడ్లో వరుస సినిమాలు చేస్తూ నటిగా ఫుల్ బిజీ అయిపోయింది. Video: @priyankachopra at a restaurant with Sandra Oh, Michelle Yeoh, Awkwafina, Paul Feig and his Wife tonight in London 💕 pic.twitter.com/Ki8pYb8VXx — PRIYANKA DAILY (@PriyankaDailyFC) August 14, 2021 -
ఒక బాల్యం నేలపాలు.. మూడు బాల్యాలు కటకటాలపాలు...
భార్యాభర్తల స్థితి నుంచి తల్లిదండ్రులవ్వటం అనేది ప్రకృతి సహజంగా జరుగుతున్న మార్పు. అంతవరకు ఆడుతూపాడుతూ ఉన్న జంట, ఒక్కసారిగా బాధ్యతగల తల్లిదండ్రులుగా మారిపోతారు. చంటిపాపను కంటికి రెప్పలా కాపాడుకుంటారు. నిద్రాహారాలకు దూరమౌతారు. ఇది సృష్టి ధర్మం. ఇటీవల లండన్‌లో జరిగిన సంఘటన తల్లులు ముక్కున వేలేసుకునేలా చేసింది. సభ్య సమాజం తల దించుకునేలా చేసింది. లండన్‌కి చెందిన 19 సంవత్సరాల వెర్ఫీ కుడీకి 20 నెలల పసి పాప ఉంది. చిన్న వయసులోనే బిడ్డకు జన్మనివ్వటం వల్లనేమో, ఆమె తన సరదాలకు దూరంగా ఉండలేకపోయింది. కుడీ తన పుట్టినరోజును గ్రాండ్‌గా జరుపుకోవటం కోసం ఇంటి నుంచి 50 కి.మీ. దూరంలో ఉన్న ఎలిఫెంట్ అండ్ క్యాజిల్‌కి వెళ్లారు. అక్కడే ఆరు రోజుల పాటు ఉండిపోయారు. ఆరు రోజుల పాటు ఆకలితో అలమటించి మరణించింది ఆ పసిపాప. తిరిగి వచ్చిన తనకు కుమార్తె చనిపోయి కనిపించింది. అందుకు తాను బాధపడట్లేదని, ఇది అతి సహజంగా జరిగిందంటున్నారు వెర్ఫీ కుడీ. ఇది ఇలా ఉంటే... ఖమ్మంలో గిరిజన జాతికి చెందిన కవిత, కావ్య, రాణి అనే ముగ్గురు మహిళల మీద హత్యానేరం మోపబడింది. అక్కడి రైతులు పత్తి పంట పండిస్తున్నారనే కోపంతో వీరు ఆ రైతుల మీద హత్యా యత్నం తలపెట్టడంతో అక్కడి ఆదివాసీలకు జైలు శిక్ష వేశారు. అందులో ఈ ముగ్గురూ పసిపిల్లల తల్లులు. ఆ పిల్లలు కూడా ఇప్పుడు తల్లులతో పాటు జైలు జీవితం అనివార్యంగా గడపాలి. అక్కడ ఆ తల్లి తన వేడుక కోసం పసిబిడ్డను విడిచిపెట్టి, ఆమె మరణానికి కారణమయ్యారు. ఇక్కడ ఆవేశంలో చేసిన పనికి ఈ పసిపిల్లలు బలవుతున్నారు. నిండు నూరేళ్ల జీవితం మసకబారిపోతోంది. తల్లిదండ్రులతో గడపవలసిన బాల్యం ఒకచోట బాల్య దశలోనే ముగిసిపోయింది, మరోచోట బాల్యమంతా జైలులో గడవబోతోంది. ‘‘ప్రభుత్వాలు ఇప్పటికైనా కళ్ళు తెరిచి టీనేజ్ తల్లుల సమస్యలపై దృష్టి సారించాలి. సరైన వయసు వచ్చేవరకు తల్లి కాకుండా చట్టాలు సవరించాలి. తల్లి కాబోయే ముందు రాబోయే సాధక బాధకాలు వివరంగా తెలియజేయాలి. సరైన పెంపకంలో పెరగని పిల్లలు ఏ మార్గంలో పయనిస్తారో చెప్పడం కష్టం. ఆ దుస్థితి ముందు తరాల వారికి రాకూడదంటే ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు కళ్ళు తెరవాలి’’ అంటున్నారు ప్రముఖ ఫ్యామిలీ కౌన్సెలర్ శ్రీమతి కె. శోభ. తల్లిదండ్రుల లాలనలో బాల్యం అందంగా గడవాలి. వృద్ధాప్యంలో సైతం బాల్యాన్ని తలచుకునేలా ఉండాలి. అటువంటి బాల్యం మొగ్గలోనే వాడిపోవటం, జైలులో గడవటం... పిల్లల ఎదుగుదలకు అవరోధాలు. ‘‘జైలుకి వెళ్లిన ఆదివాసీలు తమ పిల్లల్ని తమతో పాటు తీసుకువెళ్లాలి. అందువల్ల ఆ పిల్లలు జైలు వాతావరణంలో పెరుగుతారు. వాళ్లని లోపల ఉంచే హక్కు ఎవరికీ లేదు. ముగ్గురు పాపంపుణ్యం తెలియని పిల్లల్ని అక్కడ ఉంచటం వల్ల వాళ్లకి ప్రపంచం తెలియదు. తల్లులు చేసిన తప్పులకు పిల్లలు బలవుతున్నారు. పిల్లల్ని బతికించుకోవటానికి వారు ఈ పనులు చేశామంటున్నారు. అల్లూరి సీతారామరాజు, కొమురం భీం వంటి వారు ‘అడవి మా హక్కు’ అన్నారు. తరతరాలుగా అది వారి హక్కు. ఒక ఆదివాసీ ఒక మాట అన్నారు, ‘చెరువులో నీళ్లు చేపలు తాగితే చెరువు ఎండిపోతుందా’ అని. ఆదివాసీలు చెట్లు కొట్టడం వల్ల అడవి తరిగిపోదు. ఆవేశంలో వారు చేసిన పనికి, ఆ తల్లుల కారణంగా పిల్లల్ని జైలులో పెట్టే హక్కు ఎవ్వరికీ లేదు. పిల్లలు స్వేచ్ఛను అనుభవించటం కోసం తల్లుల్ని వదిలేయాలి’’ అంటున్నారు సామాజిక వేత్త దేవి. ఇప్పుడు వెర్ఫీ కుడీకి తొమ్మిది సంవత్సరాల జైలు శిక్ష విధించింది కోర్టు. ఖమ్మం మహిళలకు కూడా జైలు శిక్ష పడింది. – వైజయంతి ప్రభుత్వాలు కళ్ళు తెరవాలి! అంతులేని స్వేచ్ఛ, సమానత్వం పొంగిపొర్లే దేశం ఒకటి. అడుగడుగునా ఆంక్షలు ఎదుర్కొనే దేశం మరోటి. రెండుచోట్లా బాధితులు పసివారే. దేశాల అభివృద్ధితో సంబంధం లేదని ఈ రెండు సంఘటనలు నిరూపించాయి. తల్లి తన పిల్లల కోసం ఎంతకైనా తెగిస్తుందంటారు. కానీ తల్లే తన పసికందు మరణానికి కారణమవడం విచారకరం. పైగా విచారణలో కూడా ఆమెలో బాధ, పశ్చాత్తాపం కనపడలేదట. మానసిక పరిపక్వత, శారీరక సామర్థ్యం లేకుండా అమాయకంగా ప్రేమలో చిక్కుకునే అమ్మాయిలు ఇలాగే ఉంటారు. రైతు మహిళల అరెస్టు సైతం ఇదే కోవకు వస్తుంది. తల్లులు జైలులో ఉంటే పాల బుగ్గల పసివారి సంగతి ఏమిటి ? ఇటీవలి కాలంలో తల్లుల కోపానికి బలవుతున్న పిల్లల సంఘటనలు అనేకం చూస్తున్నాం. వీటన్నిటికీ కారణం సరైన చదువు లేకపోవడం, సమస్యలపై అవగాహన లేకపోవడం. - కె. శోభ , ఫ్యామిలీ కౌన్సెలర్ వారిని నిందించకూడదు.. పసిబిడ్డను నిర్లక్ష్యం చేయటాన్ని ఎవ్వరూ సమర్థించరు. అసలు 20 సంవత్సరాల లోపు వయసున్నవారు పిల్లల్ని కనకూడదు. అనివార్యంగా కన్నప్పటికీ వారికి బాధ్యతగా పెంచటం తెలియదు. వెర్ఫీ కుడీ చేసిన పనికి ఆమె మీద నింద మోపకూడదు. ఆడుకునే వయసులో తిరగాలనే కోరికను వదులుకోలేరు. వాళ్లకి బాధ్యత తెలీదు. బిడ్డను పెంచలేమనుకుంటే, బేబీ కేర్ సెంటర్లకు అప్పచెప్పాలి. అలా చేసి ఉంటే ఆ పసిపాప మొగ్గలోనే రాలిపోయేది కాదు కదా. ఇలా చేయటాన్ని సమర్థిస్తున్నామని కాదు. అదొక మార్గం మాత్రమే అని చెబుతున్నాం. – దేవి, సామాజికవేత్త -
లండన్‌ను వెనక్కినెట్టిన హైదరాబాద్
సాక్షి,హైదరాబాద్ : భాగ్యనగరం ఖాతాలో మరో ఘనత చేరింది. ప్రపంచంలోనే అత్యధిక సీసీ కెమెరాలు ఉన్న నగరాల్లో రెండో స్థానంలో నిలిచి సరికొత్త రికార్డు సృష్టించింది. తొలి స్థానంలో మనదేశానికే చెందిన చెన్నై ఉండటం మరో విశేషం. రెండు దక్షిణాది నగరాలకు జాబితాలో చోటు దక్కడం, రెండూ ప్రపంచంలోనే ప్రథమ, ద్వితీయ స్థానాలు దక్కించుకోవడంపై ఉన్నతాధికారులు హర్షం వ్యక్తం చేశారు. యూకేకి చెందిన ‘సర్ఫ్‌షార్క్’సంస్థ అంతర్జాతీయంగా 130 నగరాల్లో సర్వే చేసి ఈ వివరాలు వెల్లడించింది. ‘‘ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీసులకు సమానం’’అనే నినాదంతో ముందుకు సాగుతున్న తెలంగాణ ప్రభుత్వం, పోలీసుశాఖ.. సీసీ కెమెరాల ఏర్పాటులో ఈ సరికొత్త మైలురాయి అందుకున్నాయి. నగరంలో ప్రతీ చదరపు కిలోమీటరుకు 480, వెయ్యి మందికి 30 సీసీ కెమెరాలు ఉన్నాయని సర్వే స్పష్టం చేసింది. – సాక్షి,హైదరాబాద్ సురక్షిత నగరం బాటలో! తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించాక హైదరాబాద్‌లో శాంతిభద్రతలకు సీఎం కేసీఆర్ పెద్దపీట వేశారు. వివిధ బహుళజాతి, అగ్ర దేశాల వ్యాపార, పరిశోధన సంస్థలు భాగ్యనగరంలో కార్యకలాపాలు నిర్వహిస్తుండడంతో సురక్షిత నగరంగా పేరొందితే పెట్టుబడులు మరింతగా పెరుగుతాయని భావించారు. 2014లో అమల్లోకి వచ్చిన ప్రజాభద్రతా చట్టం కింద సీసీ కెమెరాల ఏర్పాటును ప్రభుత్వం, పోలీస్ శాఖ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. లండన్‌ను ఆదర్శంగా తీసుకుని భారీగా సీసీ కెమెరాల ఏర్పాటుకు సంకల్పించాయి. ఈ క్రమంలో వీటి ఏర్పాటులో దేశంలోనే మొదటి స్థానంలో తెలంగాణ పోలీస్ నిలిచిన విషయం తెలిసిందే. ఇక నగరాల వారీగా చూస్తే చెన్నై మొదటి స్థానం దక్కించుకుంది. అలాగే హైదరాబాద్‌లో వేల సంఖ్యలో ఉండే సీసీ కెమెరాల దృశ్యాల పర్యవేక్షణకు ప్రత్యేక సాఫ్ట్వేర్ సైతం నిక్షిప్తం చేయడం మరో ప్రత్యేకత. 10 లక్షల సీసీ కెమెరాలే లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా 10 లక్షల సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలనేది తెలంగాణ పోలీసుశాఖ సంకల్పం. ఇప్పటిదాకా 6.65 లక్షల సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. ఇందులో 2020లోనే 99,095 అమర్చాం. త్వరలోనే లక్ష్యాన్ని చేరుకుంటాం. గతేడాది 4,490 కేసుల్లో నేరస్థుల్ని పట్టుకోవడంలో సీసీ కెమెరాలు కీలకంగా వ్యవహరించాయి. – డీజీపీ డాక్టర్ ఎం మహేందర్‌రెడ్డి సంఖ్య పరంగా చూస్తే చెన్నై కంటే హైదరాబాద్‌లోనే ఎక్కువ సీసీ కెమెరాలున్నాయి. అయితే చెన్నై విస్తీర్ణం 426 చదరపు కి.మీ. కాగా... హైదరాబాద్‌ది 625 చదరపు కి.మీ. అందువల్లే ప్రతి చదరపు కి.మీ.కి ఉన్న కెమెరాల అంశంలో చెన్నై మొదటి స్థానం ఆక్రమించింది. దేశంలో ప్రస్తుతం ఏ నగరంలో ఎన్ని సీసీ కెమెరాలు ఉన్నాయంటే.. ఢిల్లీ 4,29,500 హైదరాబాద్ 3,25,000 చెన్నై 2,80,000 కోల్‌కతా 13,800 ముంబై 9,800 అçహ్మదాబాద్ 6,281 బెంగళూరు 1,301 కొచ్చి, జైపూర్ 1000 చదరపు కిలోమీటరుకు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల సంఖ్య, అక్కడి జనాభాను ప్రామాణికంగా తీసుకున్న సర్ఫ్‌షార్క్ సంస్థ 130 నగరాలతో జాబితా రూపొందించింది. సీసీ కెమెరాల ఏర్పాటులో ప్రపంచదేశాలతో పోలిస్తే చైనా, భారత్ ముందున్నాయని సర్వే తెలిపింది. చదరపు కిలోమీటరుకు 657 కెమెరాలతో చెన్నై మొత్తం ప్రపంచంలోనే అగ్రభాగాన నిలిచింది. ఆ తర్వాత 480 కెమెరాలతో హైదరాబాద్ రెండో స్థానం దక్కించుకుంది. సర్వేలో టాప్–10లో చోటు సాధించిన నగరాల వివరాలు ఇలా ఉన్నాయి. టాప్‌టెన్ నగరాలివే.. నగరం సీసీ కెమెరా (చదరపు 1,000 కిలోమీటరుకు) మందికి 1 చెన్నై 657 25.5 2 హైదరాబాద్ 480 30.0 3 హర్బిన్ (చైనా) 411 39.1 4 లండన్ (బ్రిటన్) 399 67.5 5 గ్జియామెన్ (చైనా) 385 40.3 6 చెంగ్డూ (చైనా) 350 33.9 7 తైయువాన్ (చైనా) 319 119.6 8 ఢిల్లీ 289 14.2 9 కున్మింగ్ (చైనా) 281 45.0 10 బీజింగ్ (చైనా) 278 56.2 -
త్వరలో ఫైజర్ కరోనా టీకా సరఫరా
లండన్: కరోనా టీకా కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నవారికి శుభవార్త. ఫైజర్, బయోఎన్‌టెక్ టీకా సరఫరా ఈ ఏడాది చివర్లో, వచ్చే ఏడాది మొదట్లో ప్రారంభం అవుతుందని టీకా అభివృద్ధిలో పాలుపంచుకుంటున్న సీనియర్ శాస్త్రవేత్త ఆదివారం చెప్పారు. ఫైజర్, బయోఎన్‌టెక్ సంస్థలు కలిసి కరోనా వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తున్నాయి. వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి ప్రపంచవ్యాప్తంగా 300 మిలియన్ వ్యాక్సిన్ డోసులను సరఫరా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు బయోఎన్‌టెక్ సంస్థ సీఈవో ప్రొఫెసర్ ఉగుర్ సాహిన్ తెలిపారు. చదవండి: ఫైజర్ ప్రయోగాల్లో అపశ్రుతి -
ఓలాకు లండన్‌లో ఎదురుదెబ్బ
-
అక్కడ 36 వేల మందికి ప్రాణాపాయం!
సాక్షి, న్యూఢిల్లీ : 61 ఏళ్ల క్రిస్ డర్కన్ మార్చి 23వ తేదీన ఆస్పత్రికెళ్లి ఎంఆర్ఐ స్కాన్ చేయించుకోగా ఆయనకు ప్రొస్టేట్ క్యాన్సర్ ఉన్నట్లు తేలింది. బిర్మింగమ్లో భార్య అలిసాన్తో కలిసి నివసిస్తోన్న డర్కన్‌కు వంశ పారంపర్యంగా ప్రాస్టేట్ క్యాన్సర్ వచ్చినట్లు తేలింది. ఆయన తాత, తండ్రులతోపాటు టామ్ అనే 46 ఏళ్ల తమ్ముడికి కూడా ప్రొస్టేట్ క్యాన్సర్ వచ్చిందట. ఆయన తమ్ముడు ఏడాది క్రితమే ఆపరేషన్ చేయించుకొని ప్రాణాపాయం నుంచి బయట పడ్డారట. అలాంటి అదష్టం తనకు లేనందుకు క్రిస్ డర్కన్ ప్రస్తుతం కుమిలిపోయారు. డర్కన్‌కు ప్రొస్టేట్ క్యాన్సర్ ఉందని తేలిన మరుసటి రోజు నుంచే లండన్‌లో లాక్డౌన్ అమలు చేశారు. ఆయనకు హైగ్రేడ్ క్యాన్సర్ ఉండే అవకాశం ఉన్నందున బయాప్సీ నిర్వహించాలంటూ ఆస్పత్రి నుంచి ఓ లేఖ వచ్చిందట. ఆయన ఆగమేఘాల మీద ఆస్పత్రికి వెళ్లగా బయాప్సీ నిర్వహించేందుకు ఆస్పత్రి వర్గాలు నిరాకరించాయట. లాక్డౌన్ కారణంగా ఆస్పత్రి అత్యవసర సేవలు మినహా మిగతా అన్ని వైద్య సేవలను నిలిపి వేశారని చెప్పారట. ఆ తర్వాత ఆయన ఏ ఆస్పత్రికి వెళ్లి ఇలాంటి సమాధానాలే వినాల్సి వచ్చింది. ఆ తర్వాత డర్కన్ జూన్ 9వ తేదీన ఓ ప్రైవేటు ఆస్పత్రిలో బయాప్సీ చేయించుకున్నారు. క్యాన్సర్ ప్రమాదకర స్థాయిలో ఉందని తేలడంతో ఆయనకు ఆగస్టు నెలలో ‘ర్యాడికల్ ప్రొస్టేటెక్టమీ’ చేసి ఆ గ్రంధిని తొలగించారు. దాదాపు ఐదు నెలలపాటు శస్త్ర చికిత్స జరిగే వరకు బతుకుతానో, లేదోననే భయాందోళనల మధ్య ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపినట్లు ఆయన చెప్పారు. లండన్‌లో ఆయన లాగా భయాందోళనలకు గురవుతున్న వారు ఏడు వేల నుంచి 36 వేల వరకు ఉన్నట్లు క్యాన్సర్ రిసెర్చ్ హబ్ ‘డాటా–కెన్’ వెల్లడించింది. ప్రాణాంతక కరోనా వైరస్ ప్రాబల్యం ఇంకా తగ్గక పోవడంతో క్యాన్సర్ సహా అత్యవసరంకానీ ఆపరేషన్లన్నీ ఇప్పటికీ నిలిచిపోయాయి. -
వరల్డ్ వార్ హీరో శత జయంతి
సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచ దేశాల ప్రజలను ప్రాణాంతకమైన కరోనా వైరస్ కుమ్మేస్తున్న నేపథ్యంలో లండన్‌లోని నేషనల్ హెల్త్ స్కీమ్ (ఎన్హెచ్ఎస్)కు 29 మిలియన్ పౌండ్లను (దాదాపు 272 కోట్ల రూపాయలు) విరాళంగా సేకరించి ప్రపంచ నలుమూలల నుంచి ప్రశంసలు అందుకుంటున్న రెండో ప్రపంచ యుద్ధం కెప్టెన్ టామ్ మూర్ గురువారం నాడు వందవ వసంతంలోకి అడుగుపెట్టారు. ఆయన శతజయంతిని పురస్కరించుకొని బ్రిటీష్ రాణి ఎలిజబెత్ ఆయన్ని ‘హానరరీ కల్నల్ (గౌరవ కల్నల్)’ హోదాతో సత్కరించారు. (చదవండి : డబ్ల్యూహెచ్ఓ విఫలం.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు) బ్రిటన్ త్రివిద దళాధిపతుల చీఫ్ జనరల్ సర్ మార్క్ కార్ల్టన్ స్మిత్ స్వయంగా కెప్టెన్ మూర్ వద్దకు వెళ్లి హర్రోగేట్ ఆర్మీ ఫౌండేషన్ కాలేజ్ తరఫున హానరరీ కల్నల్ బ్యాడ్జీని అందజేశారు. కల్నల్ టామ్ యువ సైనికులకే కాకుండా తమలాంటి వృద్ధతరానికి కూడా స్ఫూర్తిదాయకమని జనరల్ సర్ మార్క్ ప్రశంసించారు. టామ్ వందవ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని షాంపియన్ జల్లుల మధ్య కేక్‌కు కట్ చేశారు. సైనిక వైమానికి దళానికి చెందిన రెండు హెలికాప్టర్లు ఆయనకు గౌరవ వందనంగా గాల్లో చెక్కర్లు కొట్టారు. (చదవండి : అమ్మకానికి మూన్‌రాక్.. ధర ఎంతంటే..) టామ్‌కు రాణి ఎలిజబెత్‌తోపాటు ప్రిన్స్ చార్లెస్, కమిల్లాలు అభినందనలు లేఖలు పంపించారు. ఆయన ఒక్క సైన్యానికే కాకుండా మొత్తం దేశానికే ఆదర్శప్రాయుడిగా నిలిచారని ఈ కార్యక్రమానికి హాజరైన రక్షణ మంత్రి బెన్ వ్యాలెస్ ప్రశంసిస్తూ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. బెడ్‌ఫోర్డ్‌షైర్‌లో నివసిస్తున్న టామ్ మూర్ పది రోజుల క్రితం కరోనా వైరస్‌పై యుద్ధానికి అవసరమైన విరాళాలను ఎన్హెఎస్కు ఇవ్వాల్సిందిగా కోరుతూ తన గార్డెన్లో పలు రౌండ్లు నడిచారు. దీన్ని బీబీసీ ద్వారా లైవ్‌లో చూసిన ప్రపంచ దేశాల్లో దాదాపు 60 దేశాలు విరాళాలు ప్రకటించాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రజల నుంచి లక్షలాది గ్రీటింగ్ కార్డులు ఆ రోజు నుంచి రావడం మొదలయ్యాయి. వాటిని ఓ పాఠశాలలో భద్రపరచగా హాలు నిండి పోయింది. వాటిని ఫొటో తీసిన టామ్ మనవడు బెంజీ ఇన్‌గ్రామ్ మూర్ తాతకు సమర్పించారు. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1351281875.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
లాక్డౌన్లో వింతవింతగా...వారికోసమేనట
లండన్ : లాక్డౌన్ కారణంగా ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. అత్యవసర అవసరాల మినహా బయటికి రావడంలేదు. సినిమాలు చూస్తూ, కొత్త వంటలు ప్రయోగిస్తున్నా కొందరికి కాలక్షేపం కావట్లేదు. దీంతో ప్రజలకు కాస్త ఎంటర్టైన్మెంట్ ఇద్దామనుకున్నాడు లండన్‌లోని ఓ వ్యక్తి. వేమౌత్‌కు చెందిన రాయల్ మెరైన్ తన కుక్కలను బయటకి తీసుకొచ్చేటప్పడు వెరైటీగా డ్రెస్ చేసుకుంటున్నాడు. దీంతో అతడ్ని చూసిన జనం సంబరపడిపోతున్నారు. వారి ముఖంలో సంతోషాలు తీసుకొచ్చేందుకు ఈ చిన్న ప్రయత్నం అంటూ మెరైన్ స్నేహితుడు జాక్ అతని ఫోటోలను ఆన్లైన్లో అప్లోడ్ చేయడంతో అవి నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. మెరైన్ ఒక్కోరోజు ఒక్కో విధమైన దుస్తులను ధరిస్తూ అక్కడున్నవారిని ఎంటర్టైన్ చేస్తున్నాడు. ఒకరోజు పింక్ క్రాప్టాప్లో దర్శనమిస్తే మరోరోజు వారియర్ గెటప్‌లో కనిపించి అక్కడున్న వారికి కావల్సినంత ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాడు. మెరైన్ వేషదారణకు నెటిజన్లు కూడా ఫిదా అవుతున్నారు. ఆ గెటప్‌లు ఏంటో మీరూ చూసేయండి. -
గ్లౌస్టర్‌షైర్ కౌంటీ జట్టుతో పుజారా ఒప్పందం
లండన్: భారత టెస్టు స్పెషలిస్ట్ చతేశ్వర్ పుజారా కౌంటీల్లో గ్లౌస్టర్‌షైర్‌తో జతకట్టాడు. ఏప్రిల్‌లో మొదలయ్యే ఇంగ్లీష్ కౌంటీ చాంపియన్‌షిప్‌లో ఆడేందుకు 32 ఏళ్ల భారత బ్యాట్స్‌మన్ ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఇందులో భాగంగా ఏప్రిల్ 12 నుంచి మే 22 వరకు అతను నాలుగురోజుల మ్యాచ్‌లు 6 ఆడతాడు. పుజారా కౌంటీలాడటం ఇదేం కొత్తకాదు. గతంలో డెర్బీషైర్, యార్క్‌షైర్, నాటింగ్‌హామ్‌షైర్ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. -
‘ప్రధానితో నాకు ఎలాంటి సంబంధం లేదు’
లండన్: బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్‌కు తనకు మధ్య సంబంధం ఉన్నట్లు వస్తున్న వార్తలపై ప్రముఖ వ్యాపారవేత్త జెన్నిఫర్ ఆర్కురీ స్పందించారు. ఈ వార్తలు తనను తీవ్ర అవమానకరంగా, హృదయవిదారకంగా తోచాయని అన్నారు. ఈ మేరకు ఆదివారం ఓ మీడియా ఛానెల్లో మాట్లాడుతూ.. వివరణ ఇచ్చారు. జాన్సన్ లండన్ మేయర్‌గా ఉన్న సమయంలో తాను ఆర్థికంగా ఎలాంటి లబ్ధి పొందలేదని తెలిపారు. తనకు, జాన్సన్‌కు సంబంధముందటూ వస్తున్న వార్తలు పూర్తిగా ఆవాస్తమని చెప్పారు. అయితే జాన్సన్ తనను ఎందుకు బ్లాక్ చేసి.. దూరంగా ఉంచుతున్నారో తనకు మాత్రం తెలీదన్నారు. ఒక నైట్ స్టాండ్‌లా బార్ వద్ద తను తీసుకువచ్చుకునే అమ్మాయిని కాదని.. తాను ఏంటో తనకు తెలుసని వివరించారు. తమ ఇద్దరిమధ్య ఏదో సంబంధం ఉందని వచ్చిన వార్తలు చాలా అవమానంగా, అసహ్యంగా భావిస్తున్నానని ఆమె పేర్కొన్నారు. జాన్సన్ మేయర్‌గా ఉన్న సమయంలో వేల పౌండ్ల ప్రజా ధనాన్ని ఆర్కురీ పొందినట్లు, పలు వాణిజ్య సదస్సులకు పాల్గొనే అర్హత లేనప్పటికి జాన్సన్ జోక్యంతో ఆమె పలు సదస్సులకు హారైనట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. -
గాంధీ విగ్రహానికి విద్యార్థుల వ్యతిరేకత
సాక్షి, న్యూఢిల్లీ: భారత జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహాన్ని లండన్‌లోని మాన్చెస్టర్ క్లథడ్రల్ చర్చి ఆవరణలో ప్రతిష్టించాలనే ప్రతిపాదనను మాన్చెస్టర్ యూనివర్శిటీ విద్యార్థులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ ప్రతిపాదనను తక్షణం ఉపసంహరించుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తూ సిటీ కౌన్సిల్‌కు విద్యార్థులు ఓ లేఖ కూడా రాశారు. మహాత్మా గాంధీ దక్షిణాఫ్రికాలో ఉన్నప్పుడు నల్ల జాతీయులకు వ్యతిరేకంగా పనిచేశారని, ఆ జాతీయుల పట్ల ఆయనకు విద్వేషం ఉందని విద్యార్థి నాయకులు కొందరు ఆరోపిస్తున్నారు. ‘శాంతి, ప్రేమ, సామరస్యం’ సందేశంతో గుజరాత్‌కు చెందిన ‘శ్రీమద్ రాజ్‌చంద్ర మిషన్’ తొమ్మిది అడుగుల గాంధీజీ విగ్రహాన్ని మాన్చెస్టర్ సిటీ కౌన్సిల్‌కు బహూకరించింది. 2017, మాన్చెస్టర్ ఎరినాలో పేలుడు సంభవించి 22 మంది మరణించిన నేపథ్యంలో అహింసా వాది అయిన గాంధీజీ విగ్రహాన్ని ఆ మిషన్ అందజేసింది. దీన్ని నవంబర్ 25వ తేదీన ప్రతిష్టించేందుకు నగర మున్సిపాలిటీ అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ నేపథ్యంలో విద్యార్థులు దీన్ని వ్యతిరేకిస్తున్నారు. -
లావుగా ఉన్నావన్నందుకు రెచ్చిపోయాడు!
సాక్షి, న్యూఢిల్లీ : లండన్‌లోని సెయింట్ నియోట్స్ పట్టణానికి చెందిన క్రిష్టఫర్ స్కూబర్ట్కు 44 ఏళ్లు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అందుకోసం ‘మ్యాచ్ డాట్ కామ్’ వెబ్‌సైట్‌ను ఆశ్రయించారు. ఓ అమ్మాయి నచ్చింది. ఇరువురు ప్రేమ సందేశాలు ఇచ్చి పుచ్చుకున్నారు. పెళ్లయితే జంటగా పడుకునేందుకు ఓ మంచి మంచం, మెత్తటి పరువు ఉందని ఆమె చెప్పింది. అంతకన్నా పెద్ద మంచం, పెద్ద పరువు తనింట్లో ఉందని స్కూబర్ట్ సందేశం ఇచ్చారు. ముఖాముఖి కలుసుకునేందుకు, ప్రేమించుకునేందుకు ఓ సాయంత్రం సంధ్య వేళ ఆ అమ్మాయి తేనీరు విందు కోసం స్కూబర్ట్ను రమ్మని ఇంటికి ఆహ్వానించింది. నల్లకోటు, నల్లప్యాంట్, బ్లూ టీషర్టు ధరించి స్కూబర్ట్ ఆమె ఇంటికి వెళ్లారు. అక్కడ స్కూబర్ట్ ఆకారాన్ని చూసిన ఆ అమ్మాయి ఒక్కసారి షాక్ గురైంది. ‘మ్యాచ్ డాట్ కామ్’లో పెట్టిన ప్రొఫైల్ ఫొటోకు నాలుగింతులు ఆయన ఆకారం ఉండడమే ఆమె షాక్‌కు కారణం. ఇంటికొచ్చిన అతిథిని అవమానించ కూడదన్న ఉద్దేశంతో ఆ అమ్మాయి స్కూబర్ట్ను లోపలికి పిలిచి ముందు చెప్పినట్లుగా తేనేరు అందించింది. ఆయన అంత లావుగా ఉంటారని తాను ఊహించలేదని చెప్పింది. ఆమె తన ప్రేమ సందేశంలో పేర్కొన్న మంచం, పరుపును స్కూబర్ట్కు చూపిస్తూ, ఆ మంచం, పరువు తమరొక్కరికి కూడా సరిపోదని, ఇంకా తనకు ఆ మంచం మీద చోటు ఎక్కడ ఉంటుందని, మంచం మీదనైనా సరే తనకంటూ ఓ ప్రత్యేక చోటును కోరుకుంటానని తెలిపింది. మొత్తానికి స్కూబర్ట్ నచ్చ లేదని చెప్పింది. ఇక సెలవు తీసుకోవాల్సిందిగా కోరింది. ప్రేమకు, లావుకు, పెళ్లికి, మంచానికి సంబంధం ఏమిటంటూ కోపోద్రిక్తుడైన స్కూబర్ట్ ఆమెను అమాంతం ఎత్తుకెళ్లి ఆమె చూపించిన పరుపు పైనే పడేసి రెండు, మూడు సార్లు రేప్ చేశారు. అప్పటికి తెల్లారడంతో స్కూబర్ట్ ఇంటికెళ్లి పోయారు. ఆమె పోలీసులను ఆశ్రయించి జరిగిన విషయాన్ని ఫిర్యాదు చేసింది. 2018, జనవరి 30వ తేదీన ఈ సంఘటన జరగ్గా ఈ మరుసటి రోజే పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. వారు ఇద్దరిని వైద్య పరీక్షలకు పంపించారు. బలవంతపు సెక్స్ జరిగినట్లు వైద్యులు సర్టిఫికెట్ కూడా ఇచ్చారు. దాంతో స్కూబర్ట్పై పోలీసులు రెండు రేప్‌లు, ఒక లైంగిక దాడి కింద కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణ 2019, అక్టోబర్ 8వ తేదీన (మంగళవారం) ఆక్స్ఫర్డ్ క్రౌన్ కోర్టు ముందుకు మొదటిసారి విచారణకు వచ్చింది. పరస్పర అంగీకారంతోనే ఇద్దరి మధ్య సెక్స్ జరిగిందని స్కూబర్ట్ న్యాయవాది వాదించారు. వైద్యుల సర్టిఫికెట్ ప్రకారం బలవంతపు సెక్స్ జరిగినట్లు తెలుస్తోందని ప్రాసిక్యూటర్ వార్డ్ జాక్సన్ వాదించారు. తనను బాగా రెచ్చ గొట్టడం వల్ల, తాను రెచ్చిపోవడం వల్ల బలవంతపు సెక్స్ ముద్రలు పడి ఉంటాయని, వాస్తవానికి పరస్పర అంగీకారంతోనే సెక్స్ జరిగిందని స్కూబర్ట్ పేర్కొన్నారు. కోర్టు తదుపరి విచారణ కోసం కేసును వాయిదా వేసింది. ఇంగ్లండ్ చట్టం నిబంధనలకు కట్టుబడి ఆ అమ్మాయి పేరు, వివరాలు వెల్లడించలేదు. -
చివరి టెస్ట్: జడేజా ఒంటరి పోరాటం
లండన్ : ఇంగ్లండ్‌తో జరుగుతున్న చివరి టెస్ట్‌లో తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 292 పరుగులుకు ఆలౌట్ అయ్యింది. ఆల్‌రౌండర్ జడేజా 86 పరుగులతో చివరి వరకూ పోరాడి నాటౌట్‌గా నిలిచాడు. 176 పరుగులతో మూడోరోజు ఆట ప్రారంభించిన భారత్‌ను విహారి, జడేజా ఆదుకున్నారు. వీరిద్దరు ఏడో వికెట్‌కు 77 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. అరంగేట్ర మ్యాచ్‌లోనే తెలుగు కుర్రాడు హనుమ విహారి హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. జట్టు స్కోర్ 237 వద్ద హనుమ విహారి (56)ని మెయిన్ అలీ ఔట్ చేశాడు. దీంతో భారత్ మరో ఇరవై పరుగుల లోపు ఆలౌట్ అవుతుందని భావించారు. కానీ జడేజా ఒంటరి పోరాటంతో భారత్ 292 పరుగులు చేయగలిగింది. ఇషాంత్ శర్మ (4) కొద్ది సేపు క్రీజ్‌లో జడేజాకు అండగా నిలిచాడు. ఆ తరువాత వచ్చిన షమి వెంటనే ఔటైనా.. చివరి వికెట్‌గా వచ్చిన బూమ్రా సహాయంతో జడేజా పోరాడాడు. చివరి వికెట్‌గా బూమ్రా రనౌట్ కావడంతో భారత్ ఇన్సింగ్స్ ముగిసింది. చివరి వికెట్‌కు 32 పరుగుల భాగస్వామ్యం నమోదవ్వడం విశేషం. దీంతో ఇంగ్లండ్‌కు మొదటి ఇన్సింగ్స్‌లో 40 పరుగుల ఆధిక్యం లభించింది. ఇంగ్లండ్ బౌలర్లలో అండర్సన్, స్టోక్స్, మోయిన్ అలీలకు రెండేసి వికెట్లు దక్కగా.. బ్రాడ్, కరణ్, రషీద్‌లు తలో వికెట్ దక్కించుకున్నారు.