సాక్షి, న్యూఢిల్లీ: భారత జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహాన్ని లండన్‌లోని మాన్‌చెస్టర్ క్లథడ్రల్ చర్చి ఆవరణలో ప్రతిష్టించాలనే ప్రతిపాదనను మాన్‌చెస్టర్ యూనివర్శిటీ విద్యార్థులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ ప్రతిపాదనను తక్షణం ఉపసంహరించుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తూ సిటీ కౌన్సిల్‌కు విద్యార్థులు ఓ లేఖ కూడా రాశారు. మహాత్మా గాంధీ దక్షిణాఫ్రికాలో ఉన్నప్పుడు నల్ల జాతీయులకు వ్యతిరేకంగా పనిచేశారని, ఆ జాతీయుల పట్ల ఆయనకు విద్వేషం ఉందని విద్యార్థి నాయకులు కొందరు ఆరోపిస్తున్నారు. ‘శాంతి, ప్రేమ, సామరస్యం’ సందేశంతో గుజరాత్‌కు చెందిన ‘శ్రీమద్ రాజ్‌చంద్ర మిషన్’ తొమ్మిది అడుగుల గాంధీజీ విగ్రహాన్ని మాన్‌చెస్టర్ సిటీ కౌన్సిల్‌కు బహూకరించింది. 2017, మాన్‌చెస్టర్ ఎరినాలో పేలుడు సంభవించి 22 మంది మరణించిన నేపథ్యంలో అహింసా వాది అయిన గాంధీజీ విగ్రహాన్ని ఆ మిషన్ అందజేసింది. దీన్ని నవంబర్ 25వ తేదీన ప్రతిష్టించేందుకు నగర మున్సిపాలిటీ అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ నేపథ్యంలో విద్యార్థులు దీన్ని వ్యతిరేకిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment