manchester university
-
గాంధీ విగ్రహానికి విద్యార్థుల వ్యతిరేకత
సాక్షి, న్యూఢిల్లీ: భారత జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహాన్ని లండన్‌లోని మాన్చెస్టర్ క్లథడ్రల్ చర్చి ఆవరణలో ప్రతిష్టించాలనే ప్రతిపాదనను మాన్చెస్టర్ యూనివర్శిటీ విద్యార్థులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ ప్రతిపాదనను తక్షణం ఉపసంహరించుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తూ సిటీ కౌన్సిల్‌కు విద్యార్థులు ఓ లేఖ కూడా రాశారు. మహాత్మా గాంధీ దక్షిణాఫ్రికాలో ఉన్నప్పుడు నల్ల జాతీయులకు వ్యతిరేకంగా పనిచేశారని, ఆ జాతీయుల పట్ల ఆయనకు విద్వేషం ఉందని విద్యార్థి నాయకులు కొందరు ఆరోపిస్తున్నారు. ‘శాంతి, ప్రేమ, సామరస్యం’ సందేశంతో గుజరాత్‌కు చెందిన ‘శ్రీమద్ రాజ్‌చంద్ర మిషన్’ తొమ్మిది అడుగుల గాంధీజీ విగ్రహాన్ని మాన్చెస్టర్ సిటీ కౌన్సిల్‌కు బహూకరించింది. 2017, మాన్చెస్టర్ ఎరినాలో పేలుడు సంభవించి 22 మంది మరణించిన నేపథ్యంలో అహింసా వాది అయిన గాంధీజీ విగ్రహాన్ని ఆ మిషన్ అందజేసింది. దీన్ని నవంబర్ 25వ తేదీన ప్రతిష్టించేందుకు నగర మున్సిపాలిటీ అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ నేపథ్యంలో విద్యార్థులు దీన్ని వ్యతిరేకిస్తున్నారు. -
ఆలోచించే సూపర్‌కంప్యూటర్
లండన్: మానవుని మెదడులాగే ఆలోచించే సరికొత్త సూపర్ కంప్యూటర్ను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ప్రపంచంలోనే అతిపెద్దదైన ఈ సూపర్ కంప్యూటర్ను బ్రిటన్‌లోని మాంచెస్టర్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవే త్తలు రూపొందించారు. ఇటీవలే దీన్ని స్విచ్చ్ ఆన్ చేశారు. మిలియన్–ప్రాసెసర్– న్యూరల్ కోర్ స్పైకింగ్ న్యూరల్ నెట్వర్క్ (స్పిన్నకర్) ఆధారంగా పని చేసే ఈ కంప్యూటర్ సెకన్‌కు 200 మిలియన్ మిలియన్ల విశ్లేషణలు చేయగలదు. ఇందులో వాడిన ఒక్కో చిప్ 10 కోట్ల ట్రాన్సిస్టర్లు కలిగి ఉంటుంది. ఈ సూపర్ కంప్యూటర్ తయారీకి మొత్తం 30 ఏళ్లు పడితే ఇందులో పరిశోధనకే 20 ఏళ్లు, నిర్మాణానికి మరో పదేళ్లు పట్టడం విశేషం. ఈ సూపర్ కంప్యూటర్ను అభివృద్ధి చేసేందుకు మొత్తం రూ.141 కోట్లు ఖర్చయినట్లు పరిశోధకులు తెలిపారు. మానవ మెదడులోని న్యూరాన్స్ లాగే ఈ కంప్యూటర్ స్పందనలు కలిగి ఉంటుందని, ఇలాంటిది ప్రపంచంలో మరెక్కడా లేదని పేర్కొన్నారు. మానవుని మె దడులోని రహస్యాలను ఛేదించి, విశ్లేషించడాని కి న్యూరో శాస్త్రవేత్తలకు ఈ సూపర్ కంప్యూటర్ ఎంతగానోఉపయోగపడుతుందని వర్సిటీకి చెందిన స్టీవ్ ఫర్బర్ అనే శాస్త్రవేత్త చెప్పారు. అతి తక్కువ శక్తితో రోబోలు కూడా మానవుని వలే మాట్లాడేందుకు, నడిచేందుకు ఈ కంప్యూ టర్ దోహదపడుతుందని ఆయన అన్నారు. -
ఆ పోర్న్ ప్రొఫెసర్ కొలువు ఊడింది!
పగలు కాలేజీలో పాఠాలు చెప్తూ.. రాతిళ్లు రహస్యంగా శృంగార దృశ్యాల్లో నటిస్తున్న ఓ ప్రొఫెసర్ బాగోతానికి చెక్ పడింది. 61 ఏళ్ల నికోలస్ గొడ్డార్డ్ ఎట్టకేలకు ప్రొఫెసర్ ఉద్యోగానికి రాజీనామా చేశాడు. ఇంగ్లండ్‌లోని ప్రఖ్యాత మాంచెస్టర్ యూనివర్సిటీలో పగలు విద్యార్థులకు బుద్ధిగా పాఠాలు చెప్తున్న ఈ ప్రొఫెసర్.. రాత్రిళ్లు మాత్రం 'ఓల్డ్ నిక్' అనే మారుపేరుతో పోర్న్ సినిమాల్లో నటిస్తున్నాడు. తన కన్నా 20 ఏళ్లు చిన్నవారైన యువతులతో శృంగారం పాల్గొంటూ నీలి సినిమాల్లో నటిస్తున్న అతని బాగోతాన్ని తాజాగా 'ద సన్' పత్రిక వెలుగులోకి తీసుకొచ్చింది. ప్రఖ్యాత ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకొని విద్యార్థులకు పాఠాలు చెప్తున్న ఆయన.. రాత్రిళ్లు సాగిస్తున్న రహస్య రాచకార్యాలు వెలుగులోకి రావడంతో నిరసనలు వ్యక్తమయ్యాయి. రాత్రుళ్లు ఆయన సాగిస్తున్న శృంగార కలాపాలపై మాంచెస్టర్ వర్సిటీ విచారణకు సిద్ధమైంది. దీంతో నికోలస్ తన ప్రొఫెసర్ కొలువుకు రాజీనామా సమర్పించారని, ఆయన బోధన, పర్యవేక్షణ బాధ్యతలను ఇకనుంచి సహచరులు నిర్వహిస్తారని యూనివర్సిటీ ప్రతినిధి తాజాగా వెల్లడించారు. ముగ్గురు పిల్లలకు తండ్రి అయిన తర్వాత భార్యకు విడాకులు ఇచ్చి ప్రస్తుతం ఒంటరిగా ఉంటున్న నికోలస్ గొడ్డార్డ్ గత 25 ఏళ్లు డిగ్రీ విద్యార్థులకు కెమికల్ ఇంజినీరింగ్ పాఠాలను బోధిస్తున్నాడు. 35 ఏళ్లు బోధన రంగంలో ఉన్న ఆయన సైంటిఫిక్ అంశాలపై డజనుకుపైగా పరిశోధన పత్రాలను ప్రచురించారు. అయితే ఉదయం తరగతి గదిలో ఏదైతే బంగారు వాచి పెట్టుకొని విద్యార్థులకు పాఠాలు చెప్తున్నాడో.. రాత్రిళ్లు కూడా అదే బంగారువాచితో పోర్న్ సినిమాల్లో నటిస్తూ ఆయన దొరికిపోయారు. ఉపాధ్యాయుడి వంటి ఉన్నతమైన కొలువులో ఉండి ఈ నీచమైన పనులు ఏమిటని విద్యార్థులు, సహచర అధ్యాపకులు ఆయన తీరును తప్పుబడుతుండగా.. నికోలస్ మాత్రం తన ధోరణిని సమర్థించుకుంటున్నాడు. 'సమాజంలో ఎంతో హిపోక్రసి ఉంది. ప్రజలు ఓవైపు పోర్న్ సినిమాలను వీక్షిస్తూ.. మరోవైపు అందులో నటించేవారిని తప్పుబడుతున్నారు' అని గొడ్డార్డ్ అంటున్నాడు.