ఆ పోర్న్‌ ప్రొఫెసర్ కొలువు ఊడింది! | Smutty Professor quits, Uni lecturer resigns after his secret porn star shame exposessed | Sakshi
Sakshi News home page

ఆ పోర్న్‌ ప్రొఫెసర్ కొలువు ఊడింది!

Published Wed, Mar 16 2016 7:51 PM | Last Updated on Tue, Sep 18 2018 8:00 PM

ఆ పోర్న్‌ ప్రొఫెసర్ కొలువు ఊడింది! - Sakshi

ఆ పోర్న్‌ ప్రొఫెసర్ కొలువు ఊడింది!

పగలు కాలేజీలో పాఠాలు చెప్తూ.. రాతిళ్లు రహస్యంగా శృంగార దృశ్యాల్లో నటిస్తున్న ఓ ప్రొఫెసర్ బాగోతానికి చెక్ పడింది. 61 ఏళ్ల నికోలస్‌ గొడ్డార్డ్ ఎట్టకేలకు ప్రొఫెసర్ ఉద్యోగానికి రాజీనామా చేశాడు. ఇంగ్లండ్‌లోని ప్రఖ్యాత మాంచెస్టర్ యూనివర్సిటీలో పగలు విద్యార్థులకు బుద్ధిగా పాఠాలు చెప్తున్న ఈ ప్రొఫెసర్.. రాత్రిళ్లు మాత్రం 'ఓల్డ్ నిక్‌' అనే మారుపేరుతో పోర్న్ సినిమాల్లో నటిస్తున్నాడు. తన కన్నా 20 ఏళ్లు చిన్నవారైన యువతులతో శృంగారం పాల్గొంటూ నీలి సినిమాల్లో నటిస్తున్న అతని బాగోతాన్ని తాజాగా 'ద సన్' పత్రిక వెలుగులోకి తీసుకొచ్చింది.

ప్రఖ్యాత ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీలో చదువుకొని విద్యార్థులకు పాఠాలు చెప్తున్న ఆయన.. రాత్రిళ్లు సాగిస్తున్న రహస్య రాచకార్యాలు వెలుగులోకి రావడంతో నిరసనలు వ్యక్తమయ్యాయి. రాత్రుళ్లు ఆయన సాగిస్తున్న శృంగార కలాపాలపై మాంచెస్టర్‌ వర్సిటీ విచారణకు సిద్ధమైంది. దీంతో నికోలస్‌ తన ప్రొఫెసర్ కొలువుకు రాజీనామా సమర్పించారని, ఆయన బోధన, పర్యవేక్షణ బాధ్యతలను ఇకనుంచి సహచరులు నిర్వహిస్తారని యూనివర్సిటీ ప్రతినిధి తాజాగా వెల్లడించారు.

ముగ్గురు పిల్లలకు తండ్రి అయిన తర్వాత భార్యకు విడాకులు ఇచ్చి ప్రస్తుతం ఒంటరిగా ఉంటున్న నికోలస్ గొడ్డార్డ్‌ గత 25 ఏళ్లు డిగ్రీ విద్యార్థులకు కెమికల్ ఇంజినీరింగ్ పాఠాలను బోధిస్తున్నాడు. 35 ఏళ్లు బోధన రంగంలో ఉన్న ఆయన సైంటిఫిక్‌ అంశాలపై డజనుకుపైగా పరిశోధన పత్రాలను ప్రచురించారు. అయితే ఉదయం తరగతి గదిలో ఏదైతే బంగారు వాచి పెట్టుకొని విద్యార్థులకు పాఠాలు చెప్తున్నాడో.. రాత్రిళ్లు కూడా అదే బంగారువాచితో పోర్న్ సినిమాల్లో నటిస్తూ ఆయన దొరికిపోయారు. ఉపాధ్యాయుడి వంటి ఉన్నతమైన కొలువులో ఉండి ఈ నీచమైన పనులు ఏమిటని విద్యార్థులు, సహచర అధ్యాపకులు ఆయన తీరును తప్పుబడుతుండగా.. నికోలస్ మాత్రం తన ధోరణిని సమర్థించుకుంటున్నాడు. 'సమాజంలో ఎంతో హిపోక్రసి ఉంది. ప్రజలు ఓవైపు పోర్న్ సినిమాలను వీక్షిస్తూ.. మరోవైపు అందులో నటించేవారిని తప్పుబడుతున్నారు' అని గొడ్డార్డ్ అంటున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement