Bihar: Patna Railway Passengers Shocked After Adult Video Played On Ad Screen - Sakshi
Sakshi News home page

Bihar: ప్లాట్‌ఫామ్‌ నెంబర్‌ 10లో.. యాడ్స్‌కు బదులు ఆ వీడియో.. ప్యాసింజర్లు షాక్‌!

Published Mon, Mar 20 2023 3:55 PM | Last Updated on Mon, Mar 20 2023 7:26 PM

Bihar Patna Railway Passengers Shock bizarre Video instead Ad - Sakshi

నిర్లక్ష్యమో, కావాలని జరిగిన ఘటనో తెలియదుగానీ.. స్టేషన్‌లో ప్రయాణికులను బిత్తర పోయేలా చేసింది ఓ ఘటన. అడ్వర్‌టైజ్‌మెంట్‌ల ప్లేస్‌లో మూడు నిమిషాల పాటు అశ్లీల వీడియో ప్రదర్శితమైంది. ఈ పరిణామంతో అక్కడున్నవాళ్లంతా ఇబ్బంది పడాల్సి వచ్చింది. 

ఆదివారం ఉదయం బీహార్‌ రాజధాని పాట్నా ప్రధాన రైల్వే స్టేషన్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ సమయంలో ప్రయాణాలకు సిద్ధంగా ఉన్న కొందరు ఫ్లాట్‌ఫారమ్‌పై ఉన్న టీవీల్లో పో* వీడియో ప్లే కావడంతో ఇబ్బందిపడ్డారు. కొందరు ఆకతాయిలు అరుస్తూ.. ఆ వీడియోను తమ సెల్‌ఫోన్‌లతో బంధించారు. ఈలోపు కొందరు ప్రయాణికులు.. గవర్నమెంట్‌ రైల్వే పోలీస్‌(జీఆర్పీ), ఆర్పీఎఫ్‌ పోలీసుల దృష్టికి విషయాన్ని తీసుకెళ్లారు.  

అప్రమత్తమైన పోలీసులు వెంటనే అడ్వర్టైజ్‌మెంట్లు ప్రసారం చేసే ఏజెన్సీకి ఫోన్‌ చేయడంతో.. వీడియో ఆగిపోయింది.  ఇక ఈ ఘటనకు సదరు ఏజెన్సీ దత్తా కమ్యూనికేషన్స్‌ ఘటనకు కారణమని కేసు నమోదు చేశారు పోలీసులు. అంతేకాదు ఆ ఏజెన్సీ కాంట్రాక్ట్‌ను రద్దు చేయడంతో పాటు మరెప్పుడూ కాంట్రాక్ట్‌ దక్కకుండా బ్లాక్‌లిస్ట్‌లోకి చేర్చారు. అంతేకాదు అదనంగా జరిమానా కూడా విధించారు. మరోవైపు రైల్వే విభాగం ఈ ఘటనపై విడిగా విచారణ చేపట్టింది. అయితే ప్రత్యేకించి ప్లాట్‌ఫాం నెంబర్‌ 10పైనే టీవీల్లోనే ఈ ఘటన చోటు చేసుకోవడంతో.. రైల్వే అధికారులు పలు అనుమానాల్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ట్విటర్‌లో ఆ వీడియో వైరల్‌ అవుతోంది. 

వీడియో: ఇలాంటి షాపింగ్‌ను మీరు కచ్చితంగా ఊహించి ఉండరు!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement