ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న కుంభమేళాకు వివిధ ప్రాంతాల నుంచి జనం తరలివెళుతున్నారు. ఇప్పుడు బీహార్ నుండి మహా కుంభమేళాకు వెళ్లే వారికి బీఎస్‌ఆర్టీసీ శుభవార్త చెప్పింది. పట్నా నుండి ప్రయాగ్‌రాజ్‌కు బస్సు సర్వీస్ నడుపుతున్నట్లు తెలిపింది. ఈ బస్సు సర్వీసు ఫిబ్రవరి 28 వరకు నడుపుతున్నట్లు పేర్కొంది.
మహా కుంభమేళా(Great Kumbh Mela)కు వెళ్లే భక్తుల సౌలభ్యం కోసం ఈ కొత్త బస్సు సర్వీసును ప్రారంభించినట్లు తెలిపిన బీఎస్‌ఆర్టీసీ ఈ సర్వీసును రాత్రిపూట నడుపుతున్నట్లు పేర్కొంది. ఈ బస్సు ఎక్కినవారు ఉదయానికల్లా గమ్యస్థానానికి చేరుకుంటారని వెల్లడించింది. మహాకుంభ్‌లో పెరుగుతున్న భక్తుల సంఖ్య దృష్ట్యా, రెండు కొత్త బస్సులను నడపాలని బీహార్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ బస్సులు బీహార్ రాజధాని పట్నా నుంచి యూపీలోని ప్రయాగ్‌రాజ్(Prayagraj) వరకు నడుస్తాయి.
బీహార్ రాష్ట్ర రవాణా కార్యదర్శి సంజయ్ కుమార్ అగర్వాల్ మాట్లాడుతూ మహా కుంభమేళాకు వెళ్లే ప్రజల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ బస్సుల ద్వారా భక్తులు సురక్షితంగా, సౌకర్యవంతంగా ప్రయాణించి మహా కుంభమేళాకు చేరుకోవచ్చని తెలిపారు. పట్నా నుండి ప్రయాగ్‌రాజ్‌కు బస్సు ఛార్జీ రూ. 550. ఈ బస్సు పట్నాలో రాత్రి 8:30 గంటలకు బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 4 గంటలకు ప్రయాగ్‌రాజ్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణం(Return journey)లో ఈ బస్సులు ప్రయాగ్‌రాజ్ నుండి రాత్రి 10 గంటలకు ప్రారంభమై, మరుసటి రోజు ఉదయం 5 గంటలకు పట్నా చేరుకుంటాయని సంజయ్‌కుమార్ తెలిపారు.
ఇది కూడా చదవండి: కుంభమేళా నుంచి అయోధ్యకు జనప్రవాహం
Comments
Please login to add a commentAdd a comment