లండన్: మానవుని మెదడులాగే ఆలోచించే సరికొత్త సూపర్ కంప్యూటర్‌ను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ప్రపంచంలోనే అతిపెద్దదైన ఈ సూపర్ కంప్యూటర్‌ను బ్రిటన్‌లోని మాంచెస్టర్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవే త్తలు రూపొందించారు. ఇటీవలే దీన్ని స్విచ్చ్ ఆన్ చేశారు. మిలియన్–ప్రాసెసర్– న్యూరల్ కోర్ స్పైకింగ్ న్యూరల్ నెట్‌వర్క్ (స్పిన్నకర్) ఆధారంగా పని చేసే ఈ కంప్యూటర్ సెకన్‌కు 200 మిలియన్ మిలియన్ల విశ్లేషణలు చేయగలదు. ఇందులో వాడిన ఒక్కో చిప్ 10 కోట్ల ట్రాన్సిస్టర్లు కలిగి ఉంటుంది.
ఈ సూపర్ కంప్యూటర్ తయారీకి మొత్తం 30 ఏళ్లు పడితే ఇందులో పరిశోధనకే 20 ఏళ్లు, నిర్మాణానికి మరో పదేళ్లు పట్టడం విశేషం. ఈ సూపర్ కంప్యూటర్‌ను అభివృద్ధి చేసేందుకు మొత్తం రూ.141 కోట్లు ఖర్చయినట్లు పరిశోధకులు తెలిపారు. మానవ మెదడులోని న్యూరాన్స్ లాగే ఈ కంప్యూటర్ స్పందనలు కలిగి ఉంటుందని, ఇలాంటిది ప్రపంచంలో మరెక్కడా లేదని పేర్కొన్నారు. మానవుని మె దడులోని రహస్యాలను ఛేదించి, విశ్లేషించడాని కి న్యూరో శాస్త్రవేత్తలకు ఈ సూపర్ కంప్యూటర్ ఎంతగానోఉపయోగపడుతుందని వర్సిటీకి చెందిన స్టీవ్ ఫర్బర్ అనే శాస్త్రవేత్త చెప్పారు. అతి తక్కువ శక్తితో రోబోలు కూడా మానవుని వలే మాట్లాడేందుకు, నడిచేందుకు ఈ కంప్యూ టర్ దోహదపడుతుందని ఆయన అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment