human brain
-
మానవ మెదళ్లు పెద్దవి అవుతున్నాయ్! ఇక ఆ వ్యాధి..
మానవ మెదళ్లు పరిమాణంలో వస్తున్న మార్పులను గుర్తించారు శాస్త్రవేత్తలు. ఒక తరానికి మరొక తరానికి మధ్య చాలా వ్యత్యాసం ఉన్నట్లు తాజా అధ్యయనంలో వెల్లడించారు. దీన్ని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా డేవిస్ హెల్త్ బృందం నిర్థారించింది. ఈ మేరకు యూఎస్‌లోని దాదాపు 55 నుంచి 65 ఏళ్ల మధ్య వయసు ఉన్న మూడు వేల మంది వృద్ధులపై జరిపిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడయ్యింది. 1930లలో జన్మించిన వారి కంటే 1970లలో (జనరేషన్ X) మొత్తం మెదడు పరిమాణం 6.6 శాతం ఎక్కువగా ఉన్నట్లు తెలిపారు. అలాగే మునపటితరం సభ్యులకంటే ప్రస్తుత జనరేషన్ మెదడులో దాదాపు 8% ఎక్కువ వైట్ మ్యాటర్, 15% ఎక్కువ గ్రే మ్యాటర్ ఉందని పరిశోధనలో తేలింది. అంటే.. మునపటితరంతో పోలిస్తే ఇక్కడ మెదడు వాల్యూమ్ 5.7% పెరిగిందని తెలిపారు. దీని కారణంగా నేర్చుకోవడం, జ్ఞాపకశక్తిలో మెరుగుదల ఉంటుందన్నారు. అలాగే వయసు రీత్యా వచ్చే అల్జీమర్స్ వంటి వ్యాధుల ప్రమాదం తగ్గుతుందని చెప్పారు. ఎవరైనా జన్మించినప్పుడు ఉన్న మెదడు పరిమాణం పైనే దీర్ఘకాలిక మెదడు ఆరోగ్యం ఆధారపడి ఉంటుందని చెప్పారు. ఇలా మెదడు పరిమాణం పెరిగితే వృద్ధాప్య వ్యాధులకు వ్యతిరేకంగా శక్తి పెరుగుతుందన్నారు. తత్ఫలితంగా అల్జీమర్స్ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుందని చెప్పారు పరిశోధకులు. ఈ వ్యాధి ప్రపంచవ్యాప్తంగా మిలియన్లమంది ప్రజలను ప్రభావితం చేస్తున్నట్లు చెప్పారు. ముఖ్యంగా అమెరికాలో దాదాపు 7 మిలియన్ల మందికి పైగా ప్రజలు ఈ వ్యాధితోనే బాధపడుతున్నారని నివేదికలు పేర్కొన్నాయి. (చదవండి: గుడ్లు ఎక్కువగా తింటున్నారా ? పరిశోధనలో షాకింగ్ విషయాలు!) -
టెక్ ప్రపంచంలో పంచేంద్రియాలు!
దొడ్డ శ్రీనివాసరెడ్డి మనిషి సృష్టించిన టెక్నాలజీ ఇప్పుడు మరో మనిషిని సృష్టించబోతోంది. కృత్రిమ మేధ (ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్) మనిషి మెదడును అనుకరించేందుకు ప్రయత్నిస్తు్తంటే.. దాని సాయంతో మన పంచేంద్రియాలకు ప్రత్యా మ్నాయాలను సృష్టించే దిశగా పరిశోధనలు సాగుతున్నాయి. కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం చేసే పనులైన చూపు, వాసన, వినికిడి, రుచి, స్పర్శలను ఆస్వాదించగల కృత్రిమ పరికరాల తయారీలో శాస్త్రవేత్తలు తలమునకలు అవుతున్నారు. జ్ఞానేంద్రియాల్లోని లోపాలను సరిచేయడం, వాటి పనితీరును మెరుగుపర్చడంతోపాటు పూర్తిస్థాయిలో కృత్రిమంగానే.. మరింత సమర్థంగా రూపుదిద్దేందుకు ప్రత్యామ్నాయ పరికరాలపై ప్రపంవ్యాప్తంగా పరిశోధకులు నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్నారు. లక్షల మంది చూపులేని అంధులు, కోట్ల మంది దృష్టి లోపాలతో బాధ పడుతున్నవారు ప్రపంచంలో ఉన్నారు. చేతులు, కాళ్లు కోల్పోయి, కృత్రిమ అవయవాలతో కాలం గడుపుతున్న వికలాంగులూ ఉన్నారు. కరోనా బారినపడిన కోట్లాది మంది బాధితులు రుచి, వాసన జ్ఞానం కోల్పోవడం మనం గమనించాం. ఇలాంటి పరిస్థితులను అధిగమించడానికి, మరింత సమర్థంగా జ్ఞానేంద్రియాలు పనిచేసేలా కృత్రిమ మేధతో ప్రత్యామ్నాయ పరికరాలను తయారు చేసుకోవాల్సిన అవసరం మనకు ఉంది. ఆ దిశగా జరుగుతున్న ప్రయత్నాలను అవలోకనం చేసుకుందాం. చూపు మనిషి కళ్లు, కంటిచూపుపై చిరకాలంగా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. చూపులేని, కంటిచూపు సమస్యలతో బాధపడుతున్న వారి కోసం ప్రత్యామ్నాయ మార్గాల అన్వేషణ సాగుతోంది. ఇలాంటి వారి కోసం ‘ఆర్‌కామ్ మైఐ’అనే పరికరం ఇప్పటికే అందుబాటులోకి వచ్చింది. ఈ పరికరాన్ని కళ్లజోడుకు అమర్చుకుంటే మాటల ద్వారా అవసరమైన సమాచారాన్ని అంధులు, కంటిచూపు సరిగా లేనివారు పొందవచ్చు. చిన్న వైర్లెస్ కెమెరా కలిగిఉన్న ఈ పరికరం ద్వారా మన ముందున్న ఏ వస్తువునైనా మాటల ద్వారా అభివర్ణిస్తుంది. మనం తెలుసుకోవాల్సిన వస్తువు వైపు చూస్తూ పరికరాన్ని ఆన్ చేస్తే చాలు... దానికి అమర్చి ఉన్న స్పీకర్ ద్వారా ఆ వస్తువు గురించి వివరిస్తుంది. వార్త, కథనం గురించి తెలుసుకోవాలన్నా ఈ ఆర్నమ్ మై ఐ ద్వారా చదివి వినిపించుకోవచ్చు. వినియోగ వస్తువుల బార్ కోడులను చదివి వాటి వివరాలను కూడా అందిస్తుంది. దాంతో అంధులు కూడా ఎవరి సాయం లేకుండా ధైర్యంగా షాపింగ్ చేయవచ్చు. ►కంటిచూపు సమస్యలు ఉన్న వారికోసం జార్జియా యూనివర్సిటీ ‘మిరా’అనే పరికరాన్ని రూపొందించింది. కృత్రిమ మేధతో పనిచేసే ఆ పరికరాన్ని వీపు భాగంలో తగిలించుకుంటే చాలు... అంధులు కూడా ఒంటరిగా ఎక్కడికైనా వెళ్లవచ్చు. ఈ పరికరం నిరంతరాయంగా మన పరిసరాల గురించి వివరిస్తూ సురక్షితంగా గమ్యం చేరుస్తుంది. ►కంటికి ప్రత్యామ్నాయంగా ‘బయోనిక్ ఐ’త్వరలో అందుబాటులోకి రాబోతోంది. ప్రపంచవ్యాప్తంగా ‘బయోనిక్ ఐ’పై పరిశోధనలు జరుగుతున్నాయి. ‘బయోనిక్ ఐ’... ఎదుట ఉన్న దృశ్యాలను గ్రహించి, వాటిని ఎలక్ట్రిక్ సిగ్నల్స్‌గా మార్చి మెదడుకు సంకేతాలు పంపడం ద్వారా దీన్ని ధరించిన వ్యక్తికి ఆయా దృశ్యాలు ఆవిష్కృతం అయ్యేలా చేస్తుంది. సిడ్నీ వర్సిటీ ఇటీవల ‘బయోనిక్ ఐ’ను గొర్రెలకు అమర్చి పరీక్షించగా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవని తేల్చింది. ఫీనిక్స్99గా పిలిచే ఈ పరికరాన్ని ఇక మనుషులపై పరీక్షించాల్సి ఉంది. సెకండ్ సైట్, ఆస్ట్రేలియాకే చెందిన మోనాష్ విజన్ గ్రూప్, ఫ్రాన్స్‌కు చెందిన పిక్సిమ్ గ్రూప్ లాంటి సంస్థలు కంటి రెటినాకు ప్రత్యామ్నాయంగా పనిచేసే ‘బయోనిక్ ఐ’పై పరిశోధనలు చేస్తున్నాయి. భవిష్యత్తులో ‘బయోనిక్ ఐ’కు 40 కోట్ల డాలర్ల మార్కెట్ ఉంటుందని అంచనా. వాసన స్కాట్లాండ్లో నర్సుగా పనిచేసిన జాయ్ మిన్ని వాసన ద్వారా రోగికి నరాలకు సంబం«ధించిన పార్కిన్సన్ వ్యాధి ఉన్నదీ లేనిదీ చెబుతూ సంచలనం సృష్టించారు. పార్కిన్సన్ వ్యాధి కారణంగా శరీరం నుంచి వచ్చే వాసనల్లో తేడాను ఆమె పసిగట్టగలదు. జాయ్ మిన్ని స్ఫూర్తితో యూరప్‌కు చెందిన అనేక యూనివర్సిటీలు పరిశోధనలు నిర్వహించి పార్కిన్సన్ రోగుల నుంచి వెలువడే పది రకాల రసాయనాలను గుర్తించారు. దీని ఆధారంగా చైనాకు చెందిన జె జియాంగ్ యూనివర్సిటీ కృత్రిమ మేధను ఉపయోగించి ఒక కృత్రిమ నాసికను అభివృద్ధి చేసింది. రోగి శరీరం నుంచి వెలువడే రసాయనాల వాసనను గ్రహించి వ్యాధి లక్షణాలను చెప్పగలిగే ఈ పరికరం 70.8 శాతం కచ్చితత్వం కలిగి ఉంది. శ్వాస ఆధారంగా పని చేయగలిగిన సెన్సర్లు ఉన్న పరికరాల ద్వారా ఇప్పుడు కొన్ని రకాల కేన్సర్లను, మూత్రపిండాల వ్యాధులు, స్లెరోసిస్ వంటి మరికొన్ని వ్యాధులను పసిగట్టే పనిలో పరిశోధకులు ఉన్నారు. బ్రెయిన్ చిప్ కంపెనీ తయారు చేసిన ‘అకిడా’ప్రాసెసర్ వంద రకాల రసాయనాలను, వాసనలను పసిగట్టగలుగుతుంది. ఫుడ్ ప్రాసెసింగ్, కెమికల్, బ్రూవరేజ్ వంటి ఫ్యాక్టరీలలో పదార్ధాల నాణ్యతను పరీక్షించడానికి ఇప్పుడు ఎలక్ట్రానిక్ నాసికలను వినియోగిస్తున్నారు. మనిషికి ప్రమాదకరమైన విషపూరిత వాయువులను పరీక్షించడానికి కూడా ఈ కృత్రిమ నాసికలు వాడకంలోకి వచ్చాయి. వినికిడి దాదాపు రెండు దశాబ్దాలుగా మనం కాక్లియర్ ఇంప్లాంట్స్ ద్వారా చెవిటి వారిలో వినికిడి శక్తిని ఇనుమడించగలిగాం. చెవిలో అంతర్భాగమైన కాక్లీని అనుకరించే పరికరాన్ని మరింత అభివృద్ధి చేసి మాటలను, శబ్దాలను వేరుచేయగల ఏఐ ఆధారిత పరికరాన్ని ‘ఓమ్నీ బ్రిడ్జ్’అభివృద్ధి చేసింది. ఈ పరికరం సాయంతో అవసరమైన భాషలోకి తర్జుమా చేసుకొని సంభాషణల్ని కొనసాగించగలిగే శక్తి చెవిటి వారికి ప్రసాదించింది. ►మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ), రొడ్ ఐలాండ్ స్కూల్ ఆఫ్ డిజైన్ (ఆర్ఐఎస్డీ) కలసి శబ్దాలను గ్రహించి ప్రసారం చేయగల ఒక రకమైన వస్త్రాన్ని అభివృద్ధి చేశాయి. ఈ పరిశోధనా ఫలితాన్ని ఇటీవల నేచర్ పత్రికలో ప్రచురించాయి. చెవిలో కర్ణభేరిని పోలిన ఈ వస్త్రం... శబ్ద తరంగాలను ఎలక్ట్రిక్ తరంగాలుగా మార్చి మన చెవికి అమర్చిన మైక్రోఫొన్ లాంటి పరికరానికి చేరుస్తుంది. ఈ పరికరం ఆ శబ్దాలను చెవిటి వారికి యథాతథంగా వినిపించగలుగుతుంది. ఈ వస్త్రాన్ని పైదుస్తుల్లో గుండె ప్రాంతంలో అమర్చడం ద్వారా గుండె, శ్వాసకోస పనితీరును కూడా ఎప్పటికప్పుడు గమనించవచ్చు. స్పర్శ చర్మానికి ఉన్న ప్రత్యేక గుణం స్పర్శ జ్ఞానం. స్పర్శ ద్వారా వస్తువులను గ్రహించగలిగే గుణం చర్మానికి ఉంది. వికలాంగులకు అమర్చే కృత్రిమ చేతులు, కాళ్లకు స్పర్శ జ్ఞానం కూడా అందించాలనే బృహత్ సంకల్పం పరిశోధకులకు ఏర్పడింది. ఈ దిశగా జరుగుతున్న పరిశోధనలు అనేక ఆవిష్కరణలకు దారి తీస్తున్నాయి. బ్రిటన్‌లోని బ్రిస్టల్ రొబోటిక్స్ లేబొరేటరీకి చెందిన పరిశోధకులు త్రీడీ ప్రింట్‌తో రూపొందించిన కృత్రిమ చర్మాన్ని రోబోల వేళ్లకు తొడగడం ద్వారా స్పర్శ జ్ఞానాన్ని కలిగించడంలో విజయం సాధించగలిగారు. కృత్రిమ చర్మం ద్వారా వస్త్రాల నాణ్యత, మృదుత్వం, తేమ వంటి లక్షణాలను పసిగట్టవచ్చు. స్పర్శను ఆస్వాదించగలిగే కృత్రిమ చర్మం తయారీపై ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు జరుగుతున్నాయి. ముట్టుకున్నçప్పుడు వచ్చే ప్రకంపనాల ఆధారంగా కృతిమ మేథతో వస్తువులను గ్రహించగలిగే ఈ–స్కిన్.. మనిషి స్పర్శజ్ఞానాన్ని అనుకరించగల ప్రత్యామ్నాయ మార్గంగా అవతరించబోతోంది. మనిషి ముట్టుకోలేని అత్యంత వేడి పదార్థాలు, అత్యంత శీతల పదార్థాలు, ప్రమాదకరమైన వస్తువులను ఈ కృత్రిమ చర్మం ద్వారా విశ్లేషించే అవకాశం ఏర్పడుతుందని పరిశోధకుల అభిప్రాయం. ‘అకిడా’ప్రాసెసర్ అమర్చిన పరికరాలతో రోడ్డు, బ్రిడ్జీలను ముట్టుకొని వాటి నాణ్యతను అంచనా వేసే అవకాశం ఏర్పడుతుంది. మనిషి వెళ్లలేని సముద్రగర్భాలు, భూగర్భాల్లో ఈ కృత్రిమ చర్మంగల పరికరాలను పంపడం ద్వారా కొత్త విషయాలు తెలుసుకొనే ఆస్కారం ఉందని ఈ రంగంలో పనిచేస్తున్న పరిశోధకులు చెబుతున్నారు. రుచి గుండె జబ్బులకు, రక్తపోటుకు కారణమైన అధిక ఉప్పు వాడకాన్ని తగ్గించడం కోసం జపాన్‌లో మైజీ యూనివర్సిటీ ఒక ఎలక్ట్రానిక్ చాప్‌స్టిక్‌ను తయారు చేసింది. ఈ చాప్‌స్టిక్‌తో ఆహారం తీసుకొనేటప్పుడు అది సోడియం అయాన్లను నోటికి అందించి కృత్రిమంగా ఉప్పు రుచిని కలిగిస్తుంది. దాంతో ఆహారంలో ఉప్పు వాడకాన్ని గణనీయంగా తగ్గించగలిగామని యూనివర్సిటీ పరిశోధకులు చెప్పారు. ఈ సూత్రాన్ని అనుసరించి మనిషి కోరిన రుచులను కృత్రిమంగా అందించగల అనేక వస్తువులు అందుబాటులోకి రాబోతున్నాయని ప్రముఖ పరిశోధకుడు నిమిషె రణసింఘె చెబుతున్నారు. వైన్ తయారీ కేంద్రాల్లో రుచిచూసి నాణ్యతను అంచనా వేసే టేస్టర్ల స్థానంలో ఇప్పుడు కృత్రిమ మేధస్సుతో పని చేసే ‘ఎలక్ట్రానిక్ నాలుక’లు అంటుబాటులోకి వచ్చాయి. ఈ ఎలక్ట్రానిక్ నాలుకలో ఉండే సెన్సర్లు పదార్థంలో ఉండే రుచికి సంబంధించిన సమాచారాన్ని గ్రహించి, విశ్లేషించి ఫలితాలను వెల్లడించగలవు. పదార్థాల నాణ్యత, తాజాదనాన్ని విశ్లేషించే ఎలక్ట్రానిక్ నాలుకలను ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల్లో వాడుతున్నారు. అలాగే మనిషి నాలుకతో రుచి చూడలేని రసాయనాల కోసం ఫార్మా కంపెనీల్లో కూడా ఎలక్ట్రానిక్ నాలుకలు అందుబాటులోకి వచ్చాయి. -
చలికాలం మెదడుకు ముప్పు.. జాగ్రత్త..!
చలికాలంలో చాలా ముప్పులు ΄పొంచి ఉంటాయి. దెబ్బ చిన్నగా తగిలినా నొప్పి ఎక్కువగా అనిపిస్తుంది. అలర్జీలు కనిపిస్తాయి. చర్మం ΄పొడిబారి పగులుతుంటుంది. కీళ్లనొప్పులు పెరుగుతాయి. నిజానికివన్నీ చాలా చిన్న సమస్యలు. కానీ చాలా పెద్ద సమస్య... అందునా మెదడుకు సంబంధించిన ముప్పు ఒకటి ΄పొంచి ఉంటుంది. అదే మెదడుకు కలిగే రిస్క్. దాని పేరే ‘సెరెబ్రో వాస్కులార్ యాక్సిడెంట్’, సంక్షిప్తంగా దీన్ని ‘సీవీఏ’గా చెబుతారు. సెరిబ్రో వాస్కులార్ యాక్సిడెంట్ (సీవీఏ) అంటే ఏమిటి, అదెందుకు వస్తుంది, దాని వల్ల వచ్చే అనర్థాలు, దాని నివారణ వంటి అనేక అంశాలపై అవగాహన కోసమే ఈ కథనం. చలికాలంలో కొన్ని సమస్యలు బాగా పెరుగుతాయి. ఉదాహరణకు వాతావరణంలో తేమ తగ్గడం... చర్మం నుంచి ఆ తేమను వాతావరణం లాక్కోవడంతో చర్మం పగుళ్లు, అలర్జీలు ఎక్కువ. అలాగే చలి కారణంగా చర్మం ఉపరితలంలో రక్తనాళాలు కుంచించుకుపోయి రక్తప్రసరణ తగ్గడం (వాసో కన్‌స్ట్రిక్షన్) మాత్రమే కాదు... చర్మంలో ఉండే నాడీ కణాలు బాగా ఎక్కువగా పనిచేయాల్సి రావడంతో చిన్న చిన్న దెబ్బలకు సైతం నొప్పి తీవ్రంగా తెలుస్తుంటుంది. ఇవన్నీ ప్రాణాలకు ముప్పు తెచ్చిపెట్టని మామూలు సమస్యలు. కానీ సెరెబ్రో వాస్కులార్ యాక్సిడెంట్స్ అనే ముప్పు వల్ల మాత్రం పక్షవాతం (బ్రెయిన్ స్ట్రోక్), మెదడులో రక్తస్రావం (బ్రెయిన్ హెమరేజ్) వంటి తీవ్రమైన సమస్యలు వచ్చి అరుదుగా కొన్ని సందర్భాల్లో ప్రాణాలకూ ప్రమాదం తెచ్చిపెట్టవచ్చు. సెరెబ్రో–వాస్కులార్ యాక్సిడెంట్స్ ఎందుకంటే...? ముందుగా చెప్పుకున్నట్లుగా వాతావరణంలో తేమ (హ్యుమిడిటీ) తగ్గిపోవడంతో దాన్ని భర్తీ చేసుకునేందుకు పర్యావరణం మన దేహాల్లోని తేమను లాగేస్తుంది. (ఈ కారణంగానే చర్మం΄పొడిబారినట్లుగా కనిపించడం, గీరితే చారలు పడటం వంటివి సంభవిస్తాయి). అంతేకాదు వాతావరణం చల్లగా ఉండటంతో నీళ్లు తాగడమూ తగ్గిపోతుంది. ఇంకా సాయంత్రాలు, రాత్రుళ్లు, తెల్లవారుఝామున బాగా చల్లగా ఉండటంతో రక్తం వేగంగా ప్రవహించాల్సి వస్తుంది. దాంతో రక్తపోటు పెరుగుతుంది. ఇది మెదడులో రక్తస్రావానికి (బ్రెయిన్ హెమరేజ్)కి కారణం కావచ్చు. ఇక శీతకాలం బాగా చల్లగా ఉండటం వల్ల మనం నీళ్లు తాగడం బాగా తగ్గిపోతుంది. దాంతో రక్తం పలుచగా కాకుండా, చిక్కగా మారడంతో΄ాటు రక్తనాళాల్లో రక్తపు ఉండలు (క్లాట్స్) పెరుగుతాయి. ఫలితంగా ఈ క్లాట్స్ రక్తప్రవాహాన్ని అడ్డుకోవడం వల్ల కొన్నిసార్లు మెదడులో రక్తస్రావం (బ్రెయిన్ హెమరేజ్), మరికొన్ని సార్లు మెదడులో కీలకమైన భాగాలకు రక్తం అందక పక్షవాతం రావచ్చు. (ఇవే క్లాట్స్ గుండెకు సరఫరా చేసే రక్తనాళాల్లో వస్తే గుండెపోటు వచ్చే ప్రమాదమూ ఉంటుంది). ముప్పును మరింత పెంచే అంశాలు... దీనికి తోడు ‘సీవీఏ’ ప్రమాదాన్ని మరింత పెంచడానికి కొన్ని అంశాలు దోహదం చేస్తాయి. అవి... డయాబెటిస్, హైబీపీ, హై కొలెస్ట్రాల్, మూత్రపిండాల జబ్బులు, ΄పొగతాగే అలవాటు వంటివి ఈ ముప్పును మరింత పెంచే అంశాలని చెప్పవచ్చు. రెండు రకాలుగా ‘సీవీఏ’ అనర్థాలు... మెదడులో ఏయే ప్రాంతాల్లో, ఏ రకంగా అనర్థాలు ఏర్పడ్డాయనే అంశం ఆధారంగా ‘సీవీఏ’ని రెండు రకాలుగా చెప్పవచ్చు. మెదడులో రక్తస్రావమైతే దాన్ని ఇంట్రాసెరెబ్రల్ హేమరేజ్ (ఐసీహెచ్) అని, మెదడులోని రక్తనాళాల్లో రక్తపు ఉండలు ఏర్పడటం వల్ల పక్షవాతం వస్తే దాన్ని ఇస్కిమిక్ స్ట్రోక్ అని అంటారు. నివారణ / చికిత్స : ఇంతటి ప్రాణాపాయం తెచ్చిపెట్టే ఈ ‘సీవీఏ’కు నివారణ చాలా తేలిక. ఈ సీజన్లో అన్నిటికంటే ముఖ్యంగా చేయాల్సింది నీళ్లు బాగా తాగుతూ ఉండటమే. దీనివల్ల దేహానికి హైడ్రేషన్ సమకూరుతుంది. వాటితో ΄ాటు... ∙గదిలో వెచ్చని వాతావరణంలో ఉండటం (ఒంటిని వెచ్చగా ఉంచుకోవడం) ∙సమయానికి టాబ్లెట్లు (డయాబెటిస్, హైబీపీ, కొలెస్ట్రాల్, గుండెజబ్బుకు వాడే మందులు) తీసుకోవడం ∙ పొగతాగే అలవాటును పూర్తిగా మానేయడం ∙అన్ని పోషకాలు ఉన్న సమతులాహారం తీసుకోవడం ∙చక్కెరలు చాలా తక్కువగా తీసుకోవడం ∙ఉప్పు చాలా చాలా పరిమితంగా మాత్రమే వాడటం ∙క్రమం తప్పకుండా డాక్టర్ ఫాలో అప్‌కు వెళ్తుండటం ∙మెదడుకు సంబంధించిన ఏ లక్షణం కనిపించినా తక్షణం హాస్పిటల్‌కు వెళ్లాలి. అక్కడ లక్షణాలను గమనించి, అవసరాన్ని బట్టి వైద్యులు తగిన చికిత్స అందిస్తారు. లక్షణాలు: తలలో తీవ్రమైన నొప్పి, వాంతులు∙ తల తిరగడం (డిజ్జీనెస్)∙ పూర్తిగా స్పృహ కోల్పోవడం. ఇవేగాక మరికొన్ని లక్షణాలను (బీఈఎఫ్ఏఎస్టీ) అనే ఇంగ్లిష్ అక్షరాల కలబోతతో ‘బీఫాస్ట్’ గా చెప్పవచ్చు. అంటే... ∙‘బీ’ ఫర్ బ్యాలెన్స్ అంటే సరిగ్గా నడవలేక బ్యాలెన్స్ కోల్పోవడం ∙‘ఈ’ ఫర్ ఐస్ (కళ్లు) అంటే కళ్లు మసకలు బారడం ∙‘ఎఫ్ ఫర్ ఫేస్ అంటే... ముఖంలో ఏదో ఒక వైపు జారిపోయినట్లుగా కావడం (పక్షవాతం లక్షణాల్లో ఒకటి) ∙‘ఏ’ ఫర్ ఆర్మ్స్ (భుజాలు) అంటే రెండు చేతుల్లో ఏదో ఒకటి బలహీనంగా మారడం పనిచేయకపోవడం ∙‘ఎస్’ ఫర్ స్పీచ్ అంటే మాట్లాడలేకపోవడం లేదా మాట ముద్దగా రావడం ∙‘టీ’ ఫర్ టైమ్ అంటే... అది ఆంబులెన్స్ అవసరమైన సమయం (టైమ్) అని అర్థం. -డా‘. ఎస్.పి.మాణిక్ ప్రభు సీనియర్ కన్సల్టెంట్ న్యూరోసర్జన్ -
మనసు మాట వినే చక్రాల కుర్చీ!
వాషింగ్టన్: దివ్యాంగులకు చక్కగా ఉపయోగపడే చక్రాల కుర్చీని అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఈ కుర్చీని కదిపేందుకు బటన్స్ నొక్కాల్సిన పనిలేదు. మనిషిలోని ఆలోచనలను బట్టి నడుచుకుంటుంది. అంటే మనస్సుతో∙కుర్చీని కంట్రోల్ చేయొచ్చు. కుర్చీలో కూర్చున్న తర్వాత కుడి వైపునకు మళ్లాలంటే రెండు చేతులను కుడి వైపునకు కదిలించినట్లు మనసులో ఊహించుకుంటే చాలు. ఎడమ వైపునకు వెళ్లాలంటే రెండు కాళ్లను అదే దిశలో కదిలించినట్లు ఊహించుకోవాలి. మెదడులోని సంకేతాలను వీల్ చైర్ కదలికలతో అనుసంధానించారు. ఇందుకోసం హెల్మెట్ (స్కల్ క్యాప్) లాంటిది ధరించాలి. ఇందులో 31 ఎలక్ట్రోడ్లు ఉంటాయి. ఇవి మెదడు అందించే సంకేతాలను పసిగడతాయి. చైర్ వెనుక ల్యాప్‌ట్యాప్ ఫిక్స్ చేసి ఉంటుంది. కృత్రిమ మేధ(ఏఐ)తో మెదడు సంకేతాలు కుర్చీ కదలికలుగా మారుతాయి. దివ్యాంగులు, నడవలేని బాధితులు చేయాల్సిందల్లా కుర్చీలో కూర్చొని కాళ్లు, చేతులు ఆడించినట్లు మనసులో ఊహించుకోవడమే. మనసు మాట వినే ఈ చక్రాల కుర్చీ 80 శాతం కచ్చితత్వంతో పని చేసినట్లు అధ్యయనంలో తేలింది. కుర్చీలను వాణిజ్యపరంగా మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ అధికారులు ప్రణాళిక రూపొందిస్తున్నారు. -
మానవ మస్తిష్కాన్ని కంప్యూటర్లోకి కాపీ చేయొచ్చా?
మరణించాక ఏమవుతుంది? మనిషి మస్తిష్కంలోని సమాచారమంతా మృతదేహంతోపాటే సమాధవుతుంది. లేదా కాలి బూడిదైపోతుంది. అలాగాక మెదడులోని జ్ఞాపకాలనూ సమాచారాన్నీ కంప్యూటర్లోకి లోడ్ చేసుకోగలిగితే? భలే ఉంటుంది కదూ! మృతుని జ్ఞాపకాలనూ, జీవితాంతం అతను నిల్వ చేసుకున్న సమాచారాన్నీ అతడి వారసులు ఎంచక్కా తెలుసుకోవచ్చు. ఈ దిశగా కొన్నేళ్లుగా ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి. అత్యంత సంక్లిష్టమైన ఈ ప్రక్రియ ఇప్పటికిప్పుడు కాకపోయినా మున్ముందు సాధ్యపడే అవకాశాన్ని కొట్టిపారేయలేమని అంటున్నారు. వేల కోట్ల గిగాబైట్ల సమాచారం మెదడును కంప్యూటర్‌తో పోల్చడం పరిపాటి. కంప్యూటర్ ప్రాసిసెంట్ యూనిట్లలోని ఇన్పుట్, ఔట్పుట్ ఎలక్ట్రానిక్ సిగ్నళ్ల తరహాలోనే మానవ మస్తిష్కం కూడా పని చేస్తుందని చెబుతుంటారు. కానీ వాస్తవానికి కంప్యూటర్ కంటే మెదడు అత్యంత సంక్లిష్టమైనది. అసలు మెదడు ఎంత సమాచారాన్ని నిక్షిప్తం చేసుకుంటుందనే విషయాన్ని ఇప్పటిదాకా ఎవరూ కచ్చితంగా నిర్ధారించలేకపోయారు. అమెరికాలో సియాటెల్‌లోని అలెన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్రెయిన్ సైన్స్ పరిశోధకుల బృందం రెండేళ్ల క్రితం ఎలుక మెదడులో ఒక క్యూబిక్ మిల్లీమీటర్ పరిధిలోని కణాల(న్యూరాన్లు) 3డీ నిర్మాణాన్ని మ్యాపింగ్ చేసింది. ఇసుక రేణువు కంటే తక్కువ పరిమాణంలో ఉన్న ఎలుక మెదడు భాగంలో ఏకంగా లక్షకు పైగా న్యూరాన్లున్నట్టు తేలింది. పైగా వాటి మధ్య 100 కోట్లకుపైగా కనెక్షన్లు కూడా ఉన్నట్టు గుర్తించారు. కేవలం రెండు న్యూరాన్ల మధ్య ఉన్న కనెక్షన్లో పట్టే సమాచారాన్ని కంప్యూటర్లో స్టోర్ చేసేందుకు ఏకంగా 2 పెటాబైట్లు, అంటే 2 మిలియన్ గిగాబైట్ల స్టోరేజీ అవసరమైంది. ఎలుక మెదడులో ఒక క్యూబిక్ మిల్లీమీటర్ పరిధిలోని మొత్తం న్యూరాన్లలో ఉన్న సమాచారాన్ని కంప్యూటర్లోకి ఎక్కించాలంటే కోట్ల కొద్ది గిగాబైట్ల స్టోరేజీ కావాల్సిందే. ఆ లెక్కన అత్యంత సంక్లిష్టమైన మనిషి మస్తిష్కాన్ని మ్యాపింగ్ తదితరాలన్నీ చేయడానికి, అందులో దాగుండే అపారమైన సమాచారాన్ని కంప్యూటర్లో భద్రపరచడానికి కోటాను కోట్ల గిగాబైట్ల స్టోరేజీ కావాల్సి ఉంటుంది. మనిషి మెదడులో నిక్షిప్తమై ఉన్న సమాచారాన్ని సేకరించి, కంప్యూటర్ స్టోర్ చేయడం అతిపెద్ద సవాలు అని పరిశోధకులు చెబుతున్నారు. ఇందుకోసం అత్యధిక ర్యాండమ్ యాక్సెస్ మెమరీ (ర్యామ్) ఉన్న కంప్యూటర్లు అవసరమని అన్నారు. సూక్ష్మమైన పొరలుగా.. ఎంత సమాచారాన్ని మనిషి మస్తిష్కంలో భద్రపర్చవచ్చనే ప్రశ్నకు స్పష్టమైన సమాధానం ఇప్పటికైతే లేదు. ఆ పని చేయాలంటే మొదట మెదడులోని సమాచారాన్ని కోడ్‌లోకి మార్చాలి. అప్పుడే కంప్యూటర్ దాన్ని చదివి, స్టోర్ చేసుకుంటుంది. మెదడులో దాగున్న మొత్తం సమాచారాన్ని స్కాన్ చేసి రాబట్టలేం. మెదడు కణాల మధ్య ఉన్న కనెక్షన్లలో సమాచారం నిక్షిప్తమై ఉంటుంది. మొత్తం సమాచారం రాబట్టాలంటే మెదడును వందల కోట్ల సంఖ్యలో సూక్ష్మమైన క్యూబ్‌లు, పొరలుగా కోయాల్సి ఉంటుంది. ఆ తర్వాత 3డీ మ్యాపింగ్ చేయాలి. అనంతరం ఆ క్యూబ్‌లు, పొరలను తిరిగి యథాతథంగా తలలో అమర్చాలి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
మెదడు వేడెక్కుతుంటుంది... ఎందుకలా!
ఏదైనా సంక్లిష్టమైన పెద్ద సమస్య వచ్చినప్పుడు పరిష్కారాలు ఆలోచిస్తుంటే... ‘మెదడు వేడెక్కిపోతోంది’ అనడం మామూలే. అదేదో చమత్కారం కోసం అనే మాట కాదంటున్నారు నిపుణులు. చాలాసేపట్నుంచి వాడుతున్న ల్యాప్‌టాప్ లాగా, ఎంతోసేపట్నుంచి నడిచిన ఇంజన్ లాగే మెదడూ వేడెక్కుతుందంటున్నారు పరిశోధకులు. ఈ మెదడు వేడికీ, ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు కోలుకునే తీరుకు సంబంధం ఉందని గుర్తించడంతో... దీనిపై ఇంకా ముమ్మరంగా పరిశోధనలు జరుగుతున్నాయి. మామూలుగా మనుషుల నార్మల్ ఉష్ణోగ్రత 98.6 డిగ్రీల ఫారెన్‌హీట్. కానీ నిరంతరం మెదడు చేసే పనుల కారణంగా దాని ఉష్ణోగ్రత దాదాపు 104 డిగ్రీల ఫారెన్‌హీట్ ఉంటుందని తేలింది. ఇలా జరగడం ఏ లోపాన్నీ సూచించదనీ, నిజానికి ఇదో ఆరోగ్యకరమైన సూచిక అని వెల్లడించారు. ఈ ఉష్ణోగ్రతను చూసి కొన్నిసార్లు పరిశోధకులే ఆశ్చర్యపోతున్నారు. ఉదాహరణకు... ‘మెదడుకు ఏదైనా గాయమైనప్పుడు... దాని కారణంగా ఇలా జరుగుతుందేమోనంటూ గతంలో ఇలాంటి ఉష్ణోగ్రతలను చూసినప్పుడు భావించేవారు. ఒకవేళ ఇదే ఉష్ణోగ్రత దేహంలోని ఏ భాగంలోనైనా నమోదైతే దాన్ని తప్పక జ్వరంగా పరిగణిస్తార’ని వ్యాఖ్యానించారు ఇంగ్లాండ్‌లోని మెడికల్ రీసెర్చ్ కౌన్సిల్ లాబోరేటరీ ఆఫ్ మాలెక్కులార్ బయాలజీకి చెందిన పరిశోధకుడు జాన్–ఓ–నీల్. మెదడు ఉష్ణోగ్రత తెలిపే ఎమ్మారెస్ అనే టెక్నిక్ మెదడు ఉష్ణోగ్రతలను తెలుసుకునేందుకు స్వచ్ఛందంగా ముందుకొచ్చిన కొంతమంది వలంటీర్లపై ఈ పరిశోధనలు చేశారు. వీరంతా 20 – 40 ఏళ్ల మధ్యవారు. ఇలా కొలవడానికి ‘మాగ్నెటిక్ రెసోనెన్స్ స్పెక్ట్రోస్కోపీ (ఎమ్ఆర్ఎస్) అనే టెక్నిక్‌ను ఉపయోగించారు. అంతేకాదు... ఈ డాటాను వారు సర్కేడియన్ రిథమ్తోనూ సరిపోల్చారు. ఉష్ణోగ్రత ఫలితాలనూ, సర్కేడియన్ రిథమ్‌తో పోల్చుతూ మరిన్ని అధ్యయనాలు జరుగుతున్నాయి. మెదడు ఉష్ణోగ్రత ఎంత? సాధారణంగా మెదడు ఉష్ణోగ్రత 101.3 డిగ్రీల ఫారెన్‌హీట్ ఉంటుంది. ఇది నాలుక కింది ఉష్ణోగ్రత కంటే రెండు డిగ్రీలు ఎక్కువ. మళ్లీ ఈ కొలతల్లో కూడా వ్యక్తి వయసు, జెండర్, మహిళ అయితే రుతుసమయం... ఇలాంటి అంశాలన్నీ బ్రెయిన్ టెంపరేచర్‌ను ప్రభావితం చేస్తున్నాయని గుర్తించారు. కీలకమైన విషయం ఏమిటంటే... పురుషుల మెదడు ఉష్ణోగ్రతల కంటే మహిళల్లో ఎక్కువ. ఈ ఉష్ణోగ్రతలకూ... ఏదైనా ప్రమాదం జరిగి మెదడుకు దెబ్బ (ట్రామాటిక్ బ్రెయిన్ ఇంజ్యూరీ) తగిలితే కోలుకునే తీరుకు సంబంధం ఉందని చెబుతున్నారు. అంతేకాదు... ఈ టెంపరేచర్ ఆధారంగానే ఇలా ప్రమాదం జరిగి కోలుకున్నాక... భవిష్యత్తులో మెదడుకు రాబోయే ముప్పు వివరాలూ తెలుస్తాయనీ, అందుకే 24 గంటల పాటు ఉష్ణోగ్రత వివరాలతో మరిన్ని పరిశోధనలు జరగాలంటున్నారు మెడికల్ రీసెర్చ్ కౌన్సిల్ లాబోరేటరీ ఆఫ్ మాలెక్కులార్ బయాలజీ విభాగంలోని న్యూరాలజిస్ట్ / మహిళా సైంటిస్ట్ నీనా జెకోర్జెక్. -
హవ్వా! ఎలన్ మస్క్.. అంతటా వేధింపులేనా?
వయసును తగ్గించుకునే ప్రయత్నంలో ఒకరు, మనిషి మెదడునే నియంత్రించేందుకు మరొకరు.. ప్రపంచంలోనే అపర కుబేరులుగా ఉన్న ఇద్దరి తాపత్రయం అంతిమంగా ఇవే. పోటాపోటీగా బెఫ్ బెజోస్, ఎలన్ మస్క్ చేయిస్తున్న ప్రయోగాలు మామూలు జనాలకు వినోదాన్ని పంచుతూ ఆసక్తికరంగా అనిపించినా.. మేధావి వర్గం మాత్రం తీవ్రంగా విబేధిస్తోంది. ఈ నేపథ్యంలో ఎలన్ మస్క్‌కి ఊహించని పరిణామం ఎదురైంది. మస్క్ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న బ్రెయిన్-కంప్యూటర్ ఇంటర్ఫేస్ స్టార్టప్ ‘న్యూరాలింక్’.. ఈ ఏడాది దాదాపు మనుషుల మీద ప్రయోగాలకు సిద్ధమైంది. ఈ తరుణంలో ఈ ప్రాజెక్టు కోసం పని చేసిన మాజీ ఉద్యోగులు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది ఒక పనికిమాలిన ప్రయోగమని, విఫలమై తీరుతుందని అంటున్నారు. అంతేకాదు న్యూరాలింక్లోనూ ఉద్యోగులపై వేధింపులు తీవ్ర స్థాయిలో ఉంటున్నాయని వ్యాఖ్యానించారు. న్యూరాలింక్‌లో పని చేసిన ఆరుగురు మాజీ ఉద్యోగులు.. తాజాగా ఫార్చూన్కి ఇంటర్వ్యూ ఇచ్చారు. అసలు ఈ ప్రయత్నాలపై ఎలన్ ఏమాత్రం సంతృప్తికరంగా లేడంటూ వాళ్లు వ్యాఖ్యానించడం కొసమెరుపు. న్యూరాలింక్ కోతులపై చూపించిన ప్రభావానికి.. మనుషులపై చూపించేదానికి బోలెడంత తేడా ఉంటుంది. ఆ విషయం ఆయనకు(మస్క్‌కు) తెలుసు. అసలు ఈ ఏడాది హ్యూమన్ ట్రయల్స్ ఉంటాయన్నది కూడా దాదాపు అనుమానమే అంటూ వ్యాఖ్యానించారు వాళ్లు. వర్కింగ్ కల్చర్ బాగోలేదు| ఎలన్ మస్క్ బాస్‌గా ఉన్నచోట వర్క్‌కల్చర్ బాగోదని గతంలో టెస్లా, స్పేస్‌ఎక్స్‌లోనూ ఆరోపణలు రావడం.. కోర్టు కేసులతో నష్టపరిహారం చెల్లించిన సందర్భాలను చూశాం. మేధో సంపత్తిని దోచేస్తున్నారంటూ టెక్ దిగ్గజ కంపెనీలపై విరుచుకుపడే ఎలన్ మస్క్.. ‘గురివింద గింజ’ తరహాలో ఆవిష్కరణల పేరుతో సొంత ఎంప్లాయిస్నే ఇబ్బంది పెడుతున్నాడనే దానిపై రియలైజ్ కాకపోవడం విడ్డూరం!. ఇప్పుడు సొంత కంపెనీ న్యూరాలింక్లోనూ ఇదే తరహా విమర్శలు వినిపిస్తున్నాయి. అక్కడ పని చేసేవాళ్లంతా భయంతో మాత్రమే పని చేస్తున్నారు తప్ప.. ఇష్టంతో కాదంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు మాజీలు. పని గంటలు, విరామం లేకుండా వర్కింగ్ డేస్, వేతనం తక్కువ, కొన్ని విభాగాల్లో లైంగిక వేధింపుల ఆరోపణలు వినవస్తున్నాయి. అంతెందుకు 2021 మే నెలలో.. న్యూరాలింక్ సహ వ్యవస్థాపకులు మ్యాక్స్ హోడాక్ హఠాత్తుగా కంపెనీని వీడుతున్నట్లు ప్రకటించారు. కానీ, అందుకు గల కారణాల్ని వెల్లడించ లేదు. కానీ, మస్క్‌తో విభేధాలే అనే విషయం మొత్తం అమెరికా మీడియా కోడై కూస్తోంది. సంబంధిత వార్త: టెస్లాలో కామాంధులు? మస్క్ చేష్టల వల్లే రెచ్చిపోతూ.. నిత్యం నరకమే! -
ఆలోచనా లోచనం
ఆలోచన మెదడుకు సంబంధించినది, ప్రేమ హృదయానికి సంబంధించినది. ఆలోచన, ప్రేమ రెండూ మనిషి ప్రగతి కి అత్యంత ఆవశ్యకమైనవి. ఆలోచన (వివేకం) పరిపక్వ స్థితికి చేరితే ప్రేమ ప్రకాశిస్తుందంటారు. అందుకే జ్ఞానోదయమైనవారు – వారు ఏ దేశానికి చెందిన వారైనా, ఏ మతానికి చెందిన వారైనా ప్రేమ మూర్తులై ఉంటారు. వారు మాట్లాడినా, మౌనంగా ఉన్నా, ఏమైనా పని చేసినా, ఏమీ చేయక ఊరకే ఉన్నా వారికి, ఇతరులకూ మంచే జరుగుతుంది. వారు ఏ మత ఆచారాలను పాటిస్తూ ఉండకపోవచ్చు. ఏ మతాన్ని ప్రత్యేకంగా ప్రచారం చేస్తూ ఉండకపోవచ్చు. మతాలకు అతీతంగా ప్రేమ, జ్ఞానాలను వారు ధారాళంగా పంచుతూ ఉంటారు. ఆలోచించగలిగే శక్తి గానీ, ఆలోచించాలన్న తపన గాని లేని మనిషి జీవించి ఉన్నట్టా? అసలు ఆలోచించని మనిషికి, జంతువుకు తేడా ఏమిటి? జంతువులు కూడా వాటికున్న సహజ జ్ఞానాన్ని ఆధారం చేసుకుని కొంత ఆలోచించటాన్ని గమనిస్తాము. మరి మనిషన్నవాడు ఆలోచనా రహితంగా, వివేకహీనుడై జీవిస్తే ఎలా? ప్రపంచంలోని అన్ని మత గ్రంథాల లక్ష్యం మనిషిలో ఆలోచనా శక్తిని రేకెత్తించాలనే. ఎప్పుడైతే ఆలోచనా శక్తి, వివేకం వృద్ధి అవుతాయో మంచి ఏదో, చెడు ఏదో సత్యమేదో, అసత్యమేదో, నిత్యమేదో, అనిత్యమేదో అతడే తెలుసుకోగలడు. సరైన ఎంపిక చేసుకుని చక్కగా జీవించగలడు. ఇతర జీవులను సంతోషంగా జీవింపజేయగలడు. భగవంతుడున్నాడని నమ్మటమో, నమ్మకపోవటమో అంత ముఖ్యం కాదు. పునర్జన్మ ఉందనో, లేదనో భావించటమూ అంత ముఖ్యం కాదు; స్వర్గ నరకాలు ఉన్నాయని విశ్వసించటమో, విశ్వసించకపోవటమో అదీ అంత ముఖ్యం కాదు. మరి ఏది ముఖ్యం? మనిషిగా జన్మించాము కాబట్టి మనుషుల మధ్య జీవించాలి. అది తప్పదు. అయితే ఎలా జీవించాలి? ఎలా జీవిస్తే సుఖంగా, సంతోషంగా మనశ్శాంతితో జీవించగలమో తెలుసుకుని అలా జీవించాలి. అలా జీవించాలంటే వివేకం కావాలి. ఆ వివేకాన్ని కల్గించటమే శాస్త్రాల, మతాల ఉద్దేశం. మన తల్లిదండ్రుల పట్ల, భార్యా పిల్లల పట్ల, బంధుమిత్రుల పట్ల, ఇరుగుపొరుగు వారి పట్ల మనం ఎలా నడుచుకుంటే సుఖంగా, సంతోషంగా, సంతృప్తిగా ఉండగలమో తెలుసుకోవాలంటే వివేకం తప్పక ఉండాల్సిందే. చీకట్లో నడవాలంటే దీపపు కాంతి ఉండాల్సిందే. లేకపోతే ఏదో ఒక గుంటలో పడి చస్తాము. అదేవిధంగా వివేకమనే వెలుగు లేక అంధకారమయమైన (ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియని) జీవితంలో పయనిస్తే కష్టనష్టాలు తప్పవు. పతనం తప్పదు. మనలో వివేక జ్యోతి వెలగాలంటే మనలో ప్రశ్నించే తత్వం వృద్ధి చెందాలి. ఆలోచించే గుణం అధికమవ్వాలి. అంటే గుడ్డిగా విశ్వసించటాన్ని మానుకోవాలి. ఏకాంతంగా ప్రశాంతంగా మౌనంగా కాలాన్ని గడపటాన్ని చేర్చుకోవాలి. అప్పుడే ఆలోచించటానికి అవకాశమేర్పడుతుంది. దేవుడు–దయ్యం, స్వర్గం– నరకం, పుణ్యం, పాపం వీటన్నిటినీ గూర్చి యోచించి, ఆలోచించిన పాశ్చాత్య తత్వవేత్త (ఫ్రెంచ్ ఫిలాసఫర్) వాటి ఉనికిని సందేహించాడు. ఆయన అన్నాడు. ‘...అంటే నేను యోచిస్తున్నాను కాబట్టి నేను ఉన్నాను’ అని అన్నాడు. అంటే యోచన ఆలోచన అన్నది ఒకటుంది నాలో. కాబట్టి నేను కూడా ఉన్నట్టే అని ధ్రువీకరించాడు. దాన్ని బట్టి ఆలోచనా శక్తికున్న ప్రాధాన్యతను మనం ఇట్టే గుర్తించవచ్చు. అందుకే ....‘‘మనిషి ఆలోచనా శక్తి గల ప్రాణి’’ అంటారు. వివేకం, ఆలోచనా శక్తి లేకపోతే మంచి చేయాలనుకున్నా కీడే కలుగుతుంది. ఒరే! కాస్త విశ్రాంతి తీసుకుంటాను. నీవు విసనకర్రతో విసురుతూ నా పక్కన కూర్చో అన్నాడట గురువుగారు. శిష్యుడు విసురుతూ ఉన్నపుడు ఒక ఈగ పదే పదే గురువుగారి తలపై వాలింది. శిష్యునికేమో గురువుగారి పట్ల అమిత భక్తి ఉంది. ఈగపై విపరీతమైన కోపం వచ్చింది. దగ్గరలో ఉన్న రోకలి ని రెండు చేతులతో ఎత్తి పట్టుకుని ఈసారి మా గురువు గారికి నిద్రాభంగం చెయ్, నీ కథ చెబుతా అనుకుంటూ వేచి ఉన్నాడు. ఈగ గురువు గారి గుండుపై కూర్చుంది. శిష్యుడు శక్తి కొద్దీ రోకలితో కొట్టాడు. ఈగ ఎగిరిపోయింది, గురువుగారి గుండు బద్దలైంది. సరైన ఆలోచన లేకపోతే జరిగేది అదే అంటారు స్వామి వివేకానంద. నిజమే. మంచిగా జీవిస్తూ, ఇతరులకు మంచి చేయటమే సర్వమత సారం. కాని మంచి అంటే ఏమిటో తెలియాలిగా? అదీ తెలీకనే కదా మతాలన్నీ మారణ హోమాలు చేసింది, మానవత్వాన్ని మంట కలిపింది. నేను ఆలోచిస్తున్నాను కాబట్టి నేనున్నాను అని రేనే డెక్టార్, అంటే నేను ప్రేమిస్తున్నాను కాబట్టి నేను ఉన్నాను అని ఇంకొక తత్వవేత్త అంటారు. ప్రేమ ఉంది కాబట్టి నేను ఉన్నట్టే అని అంటే ప్రేమకు పెద్ద పీట వేసినట్టే. – రాచమడుగు శ్రీనివాసులు -
పోస్ట్ కోవిడ్ సిండ్రోమ్: తెలిసినవారి పేర్లు కూడా మర్చిపోతున్నారా?
దాదాపు ఏడాదిన్నర కింద మొదలైన కరోనా విలయం ఇప్పుడిప్పుడే సర్దుకుంటోంది. కానీ దాని ప్రభావం మాత్రం ఇప్పటికీ ప్రమాదకరంగానే కనిపిస్తోందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. కరోనా సోకి తగ్గినవారిలో పైకి ఎలాంటి లక్షణాలు కనిపించకపోయినా.. అంతర్గతంగా అవయవాల పనితీరును దెబ్బతీస్తోందని, మెదడుపైనా ప్రభావం చూపుతోందని తాజాగా గుర్తించారు. ఈ పరిశోధన వివరాలు ఏమిటో తెలుసుకుందామా? - సాక్షి సెంట్రల్ డెస్క్ మానసిక సమస్యలను ముందే గుర్తించినా.. కరోనా కారణంగా శారీరకంగానే కాకుండా మానసికంగా పలు సమస్యలు ఎదురవుతున్నట్టు శాస్త్రవేత్తలు ఇంతకుముందే గుర్తించారు. కరోనా వచ్చి తగ్గిపోయాక (పోస్ట్ కోవిడ్ సమయంలో) చిన్న విషయాలకే ఆందోళనకు లోనవడం, కుంగుబాటు (డిప్రెషన్), స్వల్పస్థాయి మతిమరుపు, గందరగోళానికి లోనవడం లక్షణాలు కనిపిస్తున్నట్టు తేల్చారు. అందులోనూ 45-50 ఏళ్లు పైబడిన వారిలో ఈ సమస్య ఎక్కువగా ఉన్నట్టు గుర్తించారు. అయితే కరోనా సోకి ఒంటరిగా క్వారంటైన్లో ఉండాల్సిరావడం, తమకు ఏదైనా అవుతుందేమోనన్న భయం, కరోనాతో ఉపాధి కోల్పోయి ఆర్థికపరమైన సమస్యలు తలెత్తడం వంటివి ఈ మానసిక సమస్యలకు కారణమన్న నిర్ధారణకు వచ్చారు. అయితే కరోనా వైరస్ వల్ల మెదడు కుంచించుకుపోతోందని, ఇది కూడా సమస్యలకు కారణమవుతోందని శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించారు. చదవండి: ప్రపంచంలోనే అతిపెద్ద ఎకో అర్బన్ పార్క్ ‘తెలంగాణలో..’ 45 వేల మందిపై పరిశోధన కరోనా వల్ల మెదడు, నాడీ మండలంపై ప్రభావంపై అమెరికాలోని టెక్సాస్ ఏఅండ్ఎం యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఈ ఏడాది ఆగస్టులో విస్తృతమైన పరిశోధన మొదలుపెట్టారు. ‘యూకే బయోబ్యాంక్’ సంస్థ వద్ద ఉన్న సుమారు 45 వేల మంది మెదడు స్కానింగ్ డేటాను తీసుకుని అధ్యయనం. కరోనా సమయంలోనేగాకుండా అంతకుముందటి పరిస్థితిని పోల్చి చూసేందుకు.. 2014 నాటి నుంచి 2021 జూలై వరకు నమోదు చేసిన అన్ని వయసుల వారి డేటాను పరిగణనలోకి తీసుకున్నారు. కరోనాకు ముందు, తర్వాత మెదడులో జరిగిన మార్పులను పరిశీలించారు. స్వల్ప స్థాయి కోవిడ్ ఉన్నా.. వయసు, ఆరోగ్య పరిస్థితి, ప్రాంతం వంటివన్నీ దాదాపు ఒకేలా ఉండి.. కరోనా సోకిన, సోకని వ్యక్తుల మెదడు స్కానింగ్‌లను శాస్త్రవేత్తలు పోల్చి చూశారు. కరోనా సోకనివారితో పోలిస్తే.. సోకినవారి మెదడులోని కొంతభాగం లో గ్రే మేటర్ (మెదడు కణాలైన న్యూరాన్ల సమూహం) మందం తగ్గిపోయినట్టు గుర్తించారు. తీవ్రస్థాయి కరోనా సోకినవారిలోనే కాకుండా.. స్వల్పంగా కరోనా లక్షణాలు ఉన్నవారిలోనూ మెదడు కుంచించుకుపోతోందని తేల్చా రు. ఆ మేరకు సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ (సీఎస్ఎఫ్) పరిమాణం పెరుగుతోందని గుర్తించారు. సాధారణంగా 40 సంవత్సరాల వయసు దాటాక ఏళ్లు గడిచినకొద్దీ మెదడులో గ్రేమేటర్ కుంచించుకుపోతూ ఉంటుందని.. కానీ కరోనా సోకినవారిలో తక్కువ వయసులోనే, ఎక్కువ వేగంగా కుంచించుకుపోతోందని గుర్తించారు. ముఖ్యంగా 45-50 ఏళ్ల వయసు దాటినవారిలో ఈ ప్రభావం ఎక్కువగా ఉన్నట్టు తేల్చారు. ఆలోచన శక్తి, మానసిక సామర్థ్యాలకు దెబ్బ కరోనా సోకినవారిలో మొదటినుంచీ కనిపిస్తున్న ముఖ్య లక్షణం వాసన, రుచి చూసే సామర్థ్యం కోల్పోవడం. మెదడు ముందుభాగంలో ఉండే ‘ఆల్ఫాక్టరీ బల్బ్’గా పిలిచే ప్రాంతం ద్వారా.. మిగతా భాగాలకు వాసనకు సంబంధించిన సిగ్నల్స్ వెళతాయి. ఈ భాగంపై కరోనా వైరస్ ప్రభావం చూపడం వల్లే వాసన చూడలేని పరిస్థితి ఏర్పడుతుంది. ‘ఆల్ఫాక్టరీ బల్బ్’తోపాటు మెదడులోని టెంపోరల్ లోబ్, హిప్పోకాంపస్ భాగాలకు అనుసంధానం ఉంటుంది. మన జ్ఞాపకశక్తి, ఆలోచనా శక్తికి ఈ భాగాలే కీలకం. కరోనా సోకినవారిలో ఈ భాగాలు కూడా కుంచించుకుపోతున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. దీనివల్లే ఆలోచన శక్తిపై ప్రభావం పడుతోందని, మానసికంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ముఖ్యంగా జ్ఞాపకశక్తి తగ్గిపోవడం వంటి సమస్యలు వస్తున్నాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అంతా బాగానే ఉన్నట్టు అనిపించినా.. కొన్నిసార్లు తెలిసినవారి పేర్లు, చిన్నచిన్న ఘటనలు కూడా కాసేపు గుర్తురాని పరిస్థితి ఉంటోందని వివరిస్తున్నారు. ఇంకా తేల్చాల్సినవీ ఉన్నాయి వయసు మీద పడినకొద్దీ మెదడులో జరిగే మార్పుల తరహాలో కోవిడ్ బారినపడ్డవారిలో మార్పులు కనిపిస్తున్నాయని.. దీని ప్రభావం దీర్ఘకాలంలో ఎలా ఉంటుందన్న దానిపై అధ్యయనం చేస్తున్నామని ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త జెస్సికా బెర్నార్డ్ తెలిపారు. కోవిడ్ వల్ల దెబ్బతిన్న మెదడు మళ్లీ కోలుకుంటుందా? ఈ సమస్య ఎంతకాలం ఉంటుందన్నది తేలాల్సి ఉందని వెల్లడించారు. -
వారెవ్వా… డ్రోన్లకు ‘మెదడు’ బిగించిన సైంటిస్టులు!
అన్నిరంగాల్లోనూ టెక్నాలజీకి ప్రాముఖ్యత పెరిగింది. నేరాలను అరికట్టడానికి, నేర పరిశోధనలోనూ టెక్నాలజీ ఇప్పుడు ముఖ్య భూమిక పోషిస్తోంది. అయితే ఎంత టెక్నాలజీ ఉపయోగిస్తున్నా.. దానికంటూ కొన్ని పరిమితులు ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో ఆ పరిమితులను సైతం అధిగమించే ప్రయత్నాలు నడుస్తున్నాయి. తాజాగా చెక్ రిపబ్లిక్(యూరప్) సైంటిస్టులు.. డ్రోన్లకు అచ్చు మనిషి బుర్ర లాంటి వ్యవస్థను బిగించారు. యస్.. మీరు చదివేది కరెక్టే. సాధారణంగా జన సందోహం ఎక్కువగా ఉన్న చోట మ్యాన్ పవర్‌తో నిఘా నిర్వహించడం కష్టతరంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో డ్రోన్ ద్వారా కదలికలను పరిశీలిస్తుంటారు. అయితే డ్రోన్ సేవలు పరిమితమే కావడం, అనుమానిత కదలికలను సరిగా అంచనా వేయడంలో డ్రోన్లు విఫలమవుతున్నాయి. ఈ నేపథ్యంలో మనిషి మేధస్సును డ్రోన్లకు బిగించాలని చెక్ సైంటిస్టులు ఫిక్స్ అయ్యారు. ఎలా పని చేస్తుందంటే.. మనిషి బుర్రలాంటి మెకానిజాన్ని(న్యూరాల్ నెట్వర్క్).. డ్రోన్లలో సెటప్ చేశారు. ఇది ఒక సర్వేలెన్స్ సిస్టమ్‌లాగా పని చేస్తుంది. ఏదైనా ఎదురైనప్పుడు మనిషిలాగే బుర్ర పెట్టి ఆలోచన స్వభావాన్ని ప్రదర్శిస్తుంది. జన సందోహంలో మనుషుల ముఖ కవళికలు, ప్రవర్తన ద్వారా ఏది నార్మల్.. ఏది అబ్నార్మల్ అనేది నిర్ణయించుకుంటుంది. ప్రయోగదశలో ఫుట్‌బాల్ మైదానంలో ఆటగాళ్ల మీద ఈ ‘బ్రెయిన్ డ్రోన్’లను ప్రయోగించారు. ఆట కొనసాగుతున్నప్పుడు మధ్యలో ఆటగాళ్లు అబద్ధాలు చెప్పగా.. వెంటనే ఈ డ్రోన్ సిస్టమ్ పని చేయడం ప్రారంభించింది. ముందుగా ఫుటేజ్‌ను చిన్న కణాలుగా(భాగాలుగా) విభజించింది. ఆపై పిక్చర్ క్లియర్ ద్వారా అక్కడ ఏం జరుగుతుందనేది అనలసిస్ చేసింది. ఆటగాళ్ల ముఖ కవళికలు, వాళ్ల ప్రవర్తన ఆధారంగా వాళ్లు అబద్దం ఆడారనే ఒక నిర్ధారణకు వచ్చింది. వెంటనే ఈ డ్రోన్ సిస్టమ్ అబ్జర్వర్(సైంటిస్ట్)ను అప్రమత్తం చేసింది. కొంత ప్రతికూలత.. బ్రోనో యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ, చెక్ రిపబ్లిక్ పోలీస్ వ్యవస్థ సహకారంతో ఈ హ్యూమన్ బ్రెయిన్ న్యూరాల్ నెట్‌వర్క్‌ను రూపొందించారు. కేవలం జన సందోహం నడుమ నిఘాతో పాటు ట్రాఫిక్ మనేజ్మెంట్ కోసం కూడా ఈ డ్రోన్ టెక్నాలజీని ఉపయోగించనున్నారు. ఈ రియల్ టైం టెక్నాలజీ కీలక సమయాల్లో పని చేయడం మామూలు విషయం కాదన్నది సైంటిస్టుల మాట. అయితే జన సందోహం ఎక్కువగా ఉన్నప్పుడు ఈ డ్రోన్ సిస్టమ్ కొంత తడబడే ఛాన్స్ ఉంది. అందుకని సెన్సిటివ్ లెవల్‌ను ఏర్పాటు చేశాకే పూర్తిస్థాయిలో వాడకంలోకి తీసుకొస్తామని బ్రోనో సైంటిస్ట్ డేవిడ్ బేజౌట్ చెప్తున్నాడు. -
మెదడుపైనా కాలుష్య ప్రభావం
సాక్షి, న్యూఢిల్లీ : వాయు కాలుష్యం వల్ల ప్రజలకు శ్వాసకోస వ్యాధులు సంక్రమిస్తాయని ఇంతకాలం పరిశోధకులు భావిస్తూ వచ్చారు. కానీ వాయు కాలుష్యం వల్ల ప్రజల జ్ఞాపక శక్తి పడిపోతుందని, మొదడుకూ అనూహ్యంగా పదేళ్ల వృద్ధాప్యం వస్తుందని, దీనికి వాయువులో ఉండే ‘నైట్రోజెన్ డై ఆక్సైడ్ (ఎన్ఓ 20), దూళి (పీఎం 20) కణాల వల్ల ఈ నష్టాలు సంభవిస్తాయని వార్విక్ యూనివర్శిటీ పరిశోధకులు తెలిపారు. వారు ముందుగా ఓ ల్యాబ్‌లోని వాతావరణ కాలుష్యంపై ముందుగా పరిశోధనలు నిర్వహించి అనంతరం, వారు లండన్‌లో వాయు కాలుష్యంపై అధ్యయనం జరిపారు. వాయు కాలుష్యం బారిన పడిన వారిపై అధ్యయనం జరపగా వారిలో కొందరి మెదడు వయస్సు ‘50 నుంచి 60కి’ పెరిగినట్లు అనిపించిందని పరిశోధకులు చెప్పారు. మొదట్లో ఎలుకల్లో కాలుష్యం ప్రభావాన్ని ల్యాబ్ పరీక్షల ద్వారా అంచనా వేసిన ఆండ్రీవ్ ఓస్వాల్డ్, నట్టావుద్ పౌడ్తావిలు మనుషులపై కూడా ఇలాంటి ప్రభావమే ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. వారు లండన్ నగరానికి చెందిన 34 వేల మంది పౌరులను ఎంపిక చేసుకొని, వారిపై వాతావరణ కాలుష్యం ప్రభావాన్ని అంచనావేశారు. ఎంపిక చేసిన పౌరుల ఉద్యోగ హోదా, విద్యార్హతలు, కుటుంబ నేపథ్యం పరిగణలోకి తీసుకొని అధ్యయనం చేశారు. పదాలను గుర్తుంచుకునే జ్ఞాపక శక్తి పరీక్ష ద్వారా మెదడు వయస్సు, దానిపై కాలుష్యం ప్రభావాన్ని పరిశోధకులు అంచనా వేశారు. శ్వాసకోశ వ్యాధులే కాకుండా కాలుష్యం వల్ల మెదడుకు త్వరగా వయస్సు మీరిన లక్షణాలు వస్తాయన్న విషయాన్ని ప్రపధమంగా కనిపెట్టినట్లు చెప్పారు. -
ఆలోచించే సూపర్‌కంప్యూటర్
లండన్: మానవుని మెదడులాగే ఆలోచించే సరికొత్త సూపర్ కంప్యూటర్ను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ప్రపంచంలోనే అతిపెద్దదైన ఈ సూపర్ కంప్యూటర్ను బ్రిటన్‌లోని మాంచెస్టర్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవే త్తలు రూపొందించారు. ఇటీవలే దీన్ని స్విచ్చ్ ఆన్ చేశారు. మిలియన్–ప్రాసెసర్– న్యూరల్ కోర్ స్పైకింగ్ న్యూరల్ నెట్వర్క్ (స్పిన్నకర్) ఆధారంగా పని చేసే ఈ కంప్యూటర్ సెకన్‌కు 200 మిలియన్ మిలియన్ల విశ్లేషణలు చేయగలదు. ఇందులో వాడిన ఒక్కో చిప్ 10 కోట్ల ట్రాన్సిస్టర్లు కలిగి ఉంటుంది. ఈ సూపర్ కంప్యూటర్ తయారీకి మొత్తం 30 ఏళ్లు పడితే ఇందులో పరిశోధనకే 20 ఏళ్లు, నిర్మాణానికి మరో పదేళ్లు పట్టడం విశేషం. ఈ సూపర్ కంప్యూటర్ను అభివృద్ధి చేసేందుకు మొత్తం రూ.141 కోట్లు ఖర్చయినట్లు పరిశోధకులు తెలిపారు. మానవ మెదడులోని న్యూరాన్స్ లాగే ఈ కంప్యూటర్ స్పందనలు కలిగి ఉంటుందని, ఇలాంటిది ప్రపంచంలో మరెక్కడా లేదని పేర్కొన్నారు. మానవుని మె దడులోని రహస్యాలను ఛేదించి, విశ్లేషించడాని కి న్యూరో శాస్త్రవేత్తలకు ఈ సూపర్ కంప్యూటర్ ఎంతగానోఉపయోగపడుతుందని వర్సిటీకి చెందిన స్టీవ్ ఫర్బర్ అనే శాస్త్రవేత్త చెప్పారు. అతి తక్కువ శక్తితో రోబోలు కూడా మానవుని వలే మాట్లాడేందుకు, నడిచేందుకు ఈ కంప్యూ టర్ దోహదపడుతుందని ఆయన అన్నారు. -
గంజాయి కూడా మెదడుకు మంచిదేనా!
బెర్లిన్: గంజాయి దమ్ము బిగించి కొడితే... ఆనందం సంగతి ఏమోగానీ ఆరోగ్యం పాడవుతుందని, త్వరగా చావుకు దగ్గరవుతామని చెప్పేవారు ఎందరో ఉంటారు. కానీ చిన్న మోతాదులో, క్రమం తప్పకుండా గంజాయిని తీసుకుంటే మెదడు చురుగ్గా పనిచేస్తుందని, ఫలితంగా పదేళ్లు ఎక్కువకాలం బతికే అవకాశం ఉందని బాన్ యూనివర్శిటీ, హెబ్రూ యూనివర్శిటీకి చెందిన శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనల్లో తేలింది. వీరు మొదట ఎలుకలపై జరిపిన పరిశోధనలు విజయవంతం కావడంతో ఆ తర్వాత మనుషులపై పరిశోధనలు జరిపారు. అయితే చిన్న పిల్లలకంటే పెద్ద వాళ్లలోనే ఈ గంజాయి ప్రభావం బాగా కనిపిస్తోందని పరిశోధకులు తెలిపారు. చిన్న పిల్లలు గందరగోళానికి గురైతే పెద్ద వాళ్ల మెదడు చురుగ్గా పనిచేస్తున్నట్లు తేలిందని వారు చెప్పారు. ముందుగా తాము ఏడాది లోపు, ఏడాదిన్నర ఎలుకలపై ప్రయోగించి చూశామని, ఆ తర్వాత పిల్లలపై, పెద్దలపై ప్రయోగించి చూశామని చెప్పారు. గంజాయిలో ఉండే ‘కన్నాబినాయిడ్స్’ కారణంగా పెద్దవాళ్లలో మెదడు చురుగ్గా పనిచేయడం మొదలు పెట్టిందని వారు తెలిపారు. మెదడు సామర్థ్యం తగ్గిపోతున్న సమయంలో మెదడును ఈ గంజాయి ప్రభావితం చేస్తున్నట్లు తేలిందని వెల్లడించారు. ఈ ప్రయోగం సందర్భంగా మానవుల ఇతర అవయవాలపై కూడా ఎలాంటి ప్రతికూల ప్రభావం కనిపించలేదని పరిశోధకులు చెప్పారు. అయితే మానవులపై ఇంకా పూర్తిస్థాయి క్లినికల్ అధ్యయనాలు జరపాల్సి ఉందని వివరించారు. -
మానవ మెదళ్లపై హ్యాకర్ల దాడి!
లండన్: వైర్లెస్ సాంకేతిక పరిజ్ఞానం పరిఢవిల్లుతున్న ఆధునికయుగంలో కంప్యూటర్లకు మనిషికి విడదీయలేని అనుబంధం ఏర్పడింది. కంప్యూటర్లలో నిక్షిప్తం చేసుకున్న మన సమస్త సమాచారాన్ని కొల్లగొట్టేందుకు సైబర్ క్రిమినల్స్ పెరిగిపోతున్నారు. ప్రస్తుతం కంప్యూటర్లకు పరిమితమవుతున్న హ్యాకర్లు మున్ముందు మనుషుల మెదళ్లను కూడా ప్రభావితం చేసే ప్రమాదముందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా బ్రెయిన్ ఇంప్లాంట్స్ ద్వారా క్రిమినల్స్.. బ్రెయిన్‌ను ప్రభావితం చేసి ఆలోచనలను మార్చేసే ప్రమాదం ఉందని, దాన్నే శాస్త్రీయ భాషలో దీన్ని ‘బెయిన్ జాకింగ్’ అని అనవచ్చని వారు తెలిపారు. ‘డీప్ బ్రెయిన్ స్టిములేషన్ (డీబీసీ) సిస్టమ్’ అని పిలిచే బ్రెయిన్ ఇంప్లాంట్ ప్రస్తుతం వైద్యరంగంలో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. హార్ట్ పేస్‌మేకర్ తరహాలో పనిచేసే ఈ డీబీసీని పార్కిన్సన్, డిస్టోనియా(కండరాల సమస్యలు), భరించలేని శారీరక నొప్పులను నయం చేసేందుకు వైద్యులు ఉపయోగిస్తున్నారు. ఈ డీబీసీని కూడా హ్యాక్ చేయవచ్చని ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ నిపుణులు ప్రయోగాత్మకంగా నిరూపించారు. బ్రెయిన్ జాకింగ్ ద్వారా రోగాన్ని మరింత తీవ్రం చేయవచ్చని లేదా కామవాంఛను పెంచడానికి, జూదానికి మెదడు బానిసయ్యేలాగా కూడా చేయవచ్చని ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీకి చెందిన పీహెచ్డీ విద్యార్థి లారీ పైక్రాఫ్ట్ ఇటీవల ఓ సెమినార్‌కు సమర్పించిన పత్రంలో పేర్కొన్నారు. బ్రెయిన్ జాకింగ్‌కు సంబంధించి ఎప్పటినుంచో కల్పిత సిద్ధాంతాలు ఎన్నో ఉన్నప్పటికీ ఇప్పుడవి నిజమయ్యే రోజులు వచ్చాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. -
మన మెదడు చాలా... ఫాస్ట్!
వాషింగ్టన్: మనిషి మెదడుకు సంబంధించిన మరో కొత్త సంగతిది. ఇప్పటిదాకా 100 మిల్లీసెకన్ల కంటే తక్కువ సమయం కనిపించే దృశ్యాలను మెదడు బాగా విశ్లేషించలేదని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. 13 మిల్లీసెకన్లు చాలు ఏ దృశ్యాన్నైనా మెదడు చూడగలదని ఎంఐటీ శాస్త్రవేత్తలు అంటున్నారు. వీరి పరిశోధన కోసం.. కొందరు వలంటీర్లకు నవ్వుతున్న దంపతులు, విహారయాత్ర, ఇతర దృశ్యాలకు సంబంధించిన ఫొటోలను 80, 53, 40, 27, 13 మిల్లీసెకన్ల సమయం చొప్పున కంప్యూటర్లో చూపిం చారు. ఒక్కో ఫొటోకు మధ్య 13 మిల్లీసెకన్ల సమయం మాత్రమే ఉన్నా, ఆ ఫొటో విశ్లేషణను కొనసాగిస్తూనే మరో ఫొటో విశ్లేషణ ప్రక్రియను మెదడు నిర్వహించగలదని తేలింది. -
మెదడును తినేసే అమీబా!
న్యూ ఆర్లాన్స్: అమెరికాలోని లూసియానా రాష్ట్రంలో ‘నేగ్లేరియా ఫోలెరీ’ అనే ప్రాణాంతక అమీబా తాగునీటిలో ప్రత్యక్షమై ప్రజలను, అధికారులను హడలెత్తిస్తోంది. న్యూ ఆర్లాన్స్ సమీపంలోని ఓ తాగునీటి సరఫరా కేంద్రంలోని శాంపిళ్లలోఈ అమీబా వెలుగుచూసింది. ముక్కు ద్వారా మాత్రమే మనిషి మెదడును చేరగలిగే ఈ పరాన్నజీవి మెదడును తినేస్తూ.. నరాలను కుళ్లబెట్టేస్తుందట. ఇది సంక్రమించిన ఏడు రోజులకు మెదడువాపు, తలనొప్పి, జ్వరం, వాంతులు, వికారం, మెడ బిగుసుకుపోవడం, మతిభ్రమించడం, మూర్ఛ వంటి లక్షణాలు కన్పిస్తాయి. 12 రోజుల్లోపే మరణం సంభవిస్తుంది. 1962 నుంచీ ఇప్పటిదాకా 132 మందికి ఈ అమీబా సోకగా.. ఇప్పటిదాకా బతికింది ముగ్గురేనని అధికారిక అంచనా. ఇది చాలా ప్రమాదకారి అయినందున సెయింట్ బెర్నార్డ్ పారిష్ ప్రాంతంలోని మంచి నీరు ఎవరూ వాడకూడదంటూ అధికారులు సూచనలు జారీ చేశారు. వేడినీటి బుగ్గల్లో ఉండే ఈ అమీబా తాగునీటిలో కనిపించడం ఇదే తొలిసారని అంటున్నారు.