విషయాన్ని మెదడు చాలా నెమ్మదిగా ప్రాసెస్ చేస్తోందన్న శాస్త్రవేత్తలు
నూతన అధ్యయనంతో కొత్త విషయాలు వెలుగులోకి
పంచేంద్రియాల నుంచి నిరంతరాయంగా వచ్చే సమాచారాన్ని రెప్పపాటు వ్యవధిలో ప్రాసెస్ చేసి అందుకు అనుగుణంగా మానవ మెదడు ఆయా అవయవాలకు ఆదేశాలుగా తిరిగి పంపిస్తుందని ఇన్నాళ్లూ చదువుకున్నాం. అయితే గత అభిప్రాయాలను పటాపంచలు చేస్తూ శాస్త్రవేత్తలు కొత్త విషయాన్ని వెలుగులోకి తెచ్చారు. తనకు అందిన సమాచారాన్ని మెదడు ఎంతవేగంగా విశ్లేíÙస్తుందనే అంశంపై శాస్త్రవేత్తలు తొలిసారిగా దృష్టిసారించారు. ఈ పరిశోధనలో వెల్లడైన ఫలితాలు మెదడుపై ఇన్నాళ్లూ ఉన్న అభిప్రాయాలను మార్చుకునే పరిస్థితుల్ని కల్పిస్తున్నాయి.
కళ్లు, చెవులు, చర్మం, ముక్కు ఇలా ఇంద్రియాలు, అవయవాల నుంచి ఒక్క సెకన్ కూడా ఆపకుండా వచ్చే సమాచారాన్ని మెదడు కేవలం సెకన్‌కు 10 బైట్ల వేగంతో మాత్రమే ప్రాసెస్ చేస్తోందని పరిశోధనలో పాల్గొన్న అధ్యయనకారులు తేల్చిచెప్పారు. కంప్యూటర్ పరిభాషలో సమాచారాన్ని ప్రాథమికంగా ఒక బైట్‌లో కొలుస్తారు. ఈ లెక్కన ఒక వై–ఫై కనెక్షన్ గుండా ఒక సెకన్‌లో 5 కోట్ల బైట్ల సమాచారం ప్రాసెస్ అవుతోంది. అలాంటిది చదవడం, రాయడం, వీడియో గేమ్ ఆడటం, రూబిక్ క్యూబ్ గళ్లను పరిష్కరించడం వంటి పనులు చేసేటపుడు మనిషి మెదడు కేవలం 10 బైట్ల వేగంతోనే సమాచారాన్ని ప్రాసెస్ చేయగల్గుతోంది. ఇది నిజంగా అత్యంత తక్కువ వేగం’’అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
కాలిఫోరి్నయా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలోని అధ్యయనకారుల పరిశోధన వివరాలు ‘న్యూరాన్’జర్నల్‌లో గతవారం ప్రచురితమయ్యాయి. ‘‘ప్రధాన అంగాల నుంచేకాకుండా అంతర్గతంగా కోటానుకోట్ల కణాల నుంచి నాడీ వ్యవస్థ ద్వారా కోట్లాదిగా పోటెత్తుతున్న సమాచారంలో కేవలం ఈ పదిని మాత్రం తీసుకుంటూ మన మెదడు తన చుట్టూ ఉన్న బాహ్య ప్రపంచంపై ఒక అవగాహనకు వస్తోంది. ఆ అవగాహనతోనే నిర్ణయాలు తీసుకుంటోంది. ఇది నిజంగా తీవ్రంగా ఆలోచించాల్సిన విషయం. అసలు మన మెదడు సెకన్‌కు కేవలం 10 బైట్ల స్థాయిలోనే పనిచేయడానికి కారణాలేంటో తెలియాల్సి ఉంది.
వేగంగా ఆలోచించాల్సిన అవసరం లేదని ఒక నిర్ధారణకు వచి్చందా? లేదంటే ఇంతవరకు అతివేగంగా ప్రాసెస్ చేయాల్సిన అవసరమే రాలేదా? అనే కొత్త ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి. మానవ పరిణామ క్రమంలో మనిషి అడవులను దాటి మైదాన ప్రాంతాలకు విస్తరించినా జంతువుల నుంచి రక్షణ, ఆహారాన్వేషణ, మైథునం వంటి బహుకొద్ది అంశాలకు మాత్రమే ఆదిమమానవుడు తన ఆలోచనలను పరిమితం చేశాడు. అలా ఎప్పుడూ స్వల్ప స్థాయిల్లో కొనసాగిన ఆలోచనల వేగం నేటి యుగంలోనూ పుంజుకోకపోయి ఉండొచ్చని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.
ఏకకాలంలో కేవలం కొన్ని ఆలోచనలు, సమాచారాన్ని మాత్రమే ఎందుకు ప్రాసెస్ చేయగల్గుతోంది? ఎక్కువ డేటాను ఎందుకు విశ్లేíÙంచలేకపోతోంది? సమాచార సముద్రంలోంచి కేవలం గుక్కెడు నీటినే ఎందుకు ఒడిసి పట్టుకోగల్గుతోంది? అనే విషయాలపై మరింత లోతైన అధ్యయనం చేపట్టాల్సి ఉంది. మానవ మెదడులో ఏకంగా 8,500 కోట్ల న్యూరాన్లు ఉన్నాయి. వీటిల్లో మూడింట ఒక వంతు మెదడు వల్కలంలోనే పోగుబడి ఉన్నాయి. అత్యున్నత స్థాయి ఆలోచనలు ఈ వల్కలంలోనే ఉద్భవిస్తాయి. ఇంతటి సామర్థ్యం ఉండి కూడా మెరుపువేగంతో దూసుకెళ్లాల్సిన మెదడు ఎందుకిలా మొండికేస్తుందో తెలియాల్సి ఉంది. – సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment