మన మెదడు చాలా... ఫాస్ట్!
వాషింగ్టన్: మనిషి మెదడుకు సంబంధించిన మరో కొత్త సంగతిది. ఇప్పటిదాకా 100 మిల్లీసెకన్ల కంటే తక్కువ సమయం కనిపించే దృశ్యాలను మెదడు బాగా విశ్లేషించలేదని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. 13 మిల్లీసెకన్లు చాలు ఏ దృశ్యాన్నైనా మెదడు చూడగలదని ఎంఐటీ శాస్త్రవేత్తలు అంటున్నారు. వీరి పరిశోధన కోసం.. కొందరు వలంటీర్లకు నవ్వుతున్న దంపతులు, విహారయాత్ర, ఇతర దృశ్యాలకు సంబంధించిన ఫొటోలను 80, 53, 40, 27, 13 మిల్లీసెకన్ల సమయం చొప్పున కంప్యూటర్‌లో చూపిం చారు. ఒక్కో ఫొటోకు మధ్య 13 మిల్లీసెకన్ల సమయం మాత్రమే ఉన్నా, ఆ ఫొటో విశ్లేషణను కొనసాగిస్తూనే మరో ఫొటో విశ్లేషణ ప్రక్రియను మెదడు నిర్వహించగలదని తేలింది.