అనంత దూరంలోని... ఆ గెలాక్సీలో ఆక్సిజన్‌!  | Oxygen Found in a Galaxy Just 300 Million Years After the Big Bang | Sakshi
Sakshi News home page

అనంత దూరంలోని... ఆ గెలాక్సీలో ఆక్సిజన్‌! 

Published Mon, Mar 24 2025 4:16 AM | Last Updated on Mon, Mar 24 2025 9:10 AM

Oxygen Found in a Galaxy Just 300 Million Years After the Big Bang

అనంతమైన విశ్వంలో మన భూమిపై తప్ప ఇంకెక్కడా ప్రాణవాయువు(ఆక్సిజన్‌) ఉండకపోవచ్చని శాస్త్రజు్ఞలు ఇప్పటిదాకా భావించేవారు. కానీ మనకు అత్యంత సుదూరంలో ఉన్న ఒక నక్షత్ర మండలం (గెలాక్సీ)లో ఆక్సిజన్‌ ఆనవాళ్లను గుర్తించారు. అంతేగాక భారీ లోహాల జాడను సైతం కనిపెట్టారు. ఈ గెలాక్సీ భూమి నుంచి ఏకంగా 1,340 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉంది! విశ్వం ఏర్పడిన తొలినాళ్లలోనే ఇది ఏర్పడి ఉండవచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. విశ్వం పుట్టుకకు కారణమైన బిగ్‌బ్యాంగ్‌ 1,380 కోట్ల ఏళ్ల క్రితం సంభవించిందన్న వాదనలు ఇప్పటికే ఉన్నాయి. 

ఈ నక్షత్ర మండలానికి జేడ్స్‌–జీఎస్‌–జెడ్‌14–0 అని నామకరణం చేశారు. నిజానికి దీన్ని 2024 జనవరిలోనే ప్రాథమికంగా గుర్తించారు. జేమ్స్‌ వెబ్‌ స్పేస్‌ టెలిస్కోప్‌ ఈ గెలాక్సీ ఉనికిని వెలుగులోకి తెచ్చింది. కాకపోతే దానిపై ప్రాణవాయువు ఉన్నట్లు కనిపెట్టడం కీలక పరిణామమని సైంటిస్టులు చెబుతున్నారు. ఆ ఆక్సిజన్‌ ఏ రూపంలో, ఎంత పరిమాణంలో ఉందన్నది తేల్చడానికి పరిశోధనలు కొనసాగిస్తున్నారు. పరిమాణంలో అత్యంత భారీగా ఉన్న ఈ నక్షత్ర మండలం కాంతివంతమైనది కూడా. మన భూగోళమున్న గెలాక్సీకి సమీపంలో ఇప్పటిదాకా మరో 700 గెలాక్సీలను జేమ్స్‌ వెబ్‌ టెలిస్కోప్‌ గుర్తించింది. 
– సాక్షి, నేషనల్‌ డెస్క్‌  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement