universe
-
ఒక్కో గ్రాము ధర రూ. 53 వేల కోట్లు, అంత ‘మ్యాటర్’ ఏముంది?
ప్రపంచంలో అత్యంత ఖరీదైంది అనగానే ముందుగా మనకు గుర్తొచ్చేది ప్లాటినం, వజ్రాలు, బంగారం వగైరా గుర్తొస్తాయి. కానీ వీటన్నింటికి మించి షాకింగ్ ధర పలికే వస్తువు ఒకటి ఉంది. దాని పేరు ఎప్పుడైనా విన్నారా? అంత రేటు పలకడానికి గల కారణాలు ఏంటి? భూమిలో పుడుతుందా? లేకపోతే ల్యాబ్‌లో తయారువుతుందా? తెలుసుకుందాం.ప్రపంచంలో అత్యంత ఖరీదైన పదార్థం పేరు యాంటీమాటర్ (Antimatter) దీని ఒక్కో గ్రాము ధర వింటే నిజంగా షాక్ అవ్వాల్సిందే. ఎందుకంటే ఏదో ఒకటీ, రెండు వేలు, కాదు, కోట్లు అంతకన్నా కాదు. ఏకంగా రూ. 53 వేల కోట్లు (62 ట్రిలియన్ డాలర్లు). ఒక్క గ్రాములో అతి తక్కువ పరిమాణంలో తయారీకి లక్షల సంవత్సరాల సమయం పడుతుంది. మిగతా ఖరీదైన పదార్థాల్లా దీనిని భూమి నుంచి తవ్వి తీయడానికి కుదరదు. దానిని సృష్టించడం, నిల్వ చేయడం అనేది అనేక సవాళ్లతో కూడుకొని ఉంటుంది. దాదాపు అసాధ్యమని చెప్పవచ్చు.. ఇది అందుబాటులోకి వస్తే అంతులేని శక్తి ఉత్పత్తికి అవకాశం ఉంటుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.బంగారం, వజ్రాలు లేదా అరుదైన లోహాల మాదిరిగా కాకుండా, యాంటీమ్యాటర్‌ను భూమి నుండి తవ్వలేరు. దీనికి బదులుగా దీనిని అత్యంత నియంత్రిత వాతావరణంలో అణువు ,అణువును కలుపుతూ అత్యంత జాగ్రత్తగా తయారు చేయాలి. ఈ ప్రక్రియలో ఒక గ్రాములో కొంత భాగాన్ని సేకరించడానికి కూడా బిలియన్ల సంవత్సరాలు పట్టవచ్చు. విశ్వంలోని ఆటమ్లు, ప్రోటాన్లు, న్యూట్రాన్లు, ఎలక్ట్రాన్లు, సబ్ ఆటమిక్ కణాలతో కూడిన ‘మ్యాటర్’తో ఆవిర్భవించింది. ప్రతి మ్యాటర్ కణాలకు ప్రతిబింబం లాంటి (Mirror image) యాంటీమ్యాటర్ కణాలు ఉంటాయి. మ్యాటర్ కణాలకు పాజిటివ్ ఛార్జ్ ఉంటే, యాంటీమ్యాటర్ కణాలకు నెగటివ్ ఛార్జ్ ఉంటుంది. దీని తయారీ చాలా క్లిష్టమైన ప్రక్రియ అంటున్నారు శాస్త్రవేత్తలు. ఒక్క గ్రాములో పదోవంతు తయారు చేయడానికి లక్షల సంవత్సరాలు పడుతుంది. ఫలితంగా ఒక్క గ్రాము యాంటీమ్యాటర్ తయారీకి రూ.53 వేల కోట్లు ఖర్చవుతుందని 1999లో నాసా శాస్త్రవేత్త హరోల్డ్ గెర్రిష్ అంచనా వేశారు. స్విట్జర్లాండ్‌లోని ది యూరోపియన్ ఆర్గనైజేషన్ ఫర్ న్యూక్లిర్ రీసెర్చ్(CERN)లోని కణ భౌతిక శాస్త్రవేత్త ప్రొఫెసర్ మైఖేల్ డోజర్ యాంటీమాటర్ నానోగ్రామ్లో 100వ వంతు భాగం తయారీకి దాదాపు ఒక కిలోగ్రాము బంగారం రేటు అంత ఖర్చవుతుందన్నారు.సాధారణ పదార్థంతో దాని పరస్పర చర్య అనేది ప్రధానమైన ఛాలెంజ్. ఎందుకంటే పదార్థం, యాంటీమ్యాటర్ కలిసినపుడు భారీ పేలుడు సంభవిస్తుంది. ఇలా ఒకదానికొకటి నాశనం చేసుకుంటాయి. ఈ సమయంలో అపారమైన శక్తి ఉత్పత్తి అవుతుంది. అలాగే తయారైన వెంటనే ఇది అదృశ్యమైపోతుందని నమ్ముతున్నారు. అందుకే యాంటీమ్యాటర్‌ను భద్రపర్చడం, దీనిపై అధ్యయనం చేయడం చాలా కష్టతరం. తయారీ తరువాత దీన్ని శూన్యంలో ఉంచాలి, సూపర్ కూల్డ్ అయస్కాంత క్షేత్రాలను ఉపయోగించి భద్రం చేయాలి. మ్యాటర్‌తో కలవకుండా యాంటీమ్యాటర్‌ను భద్రపరిచే ప్రయత్నాలు సాగాలి. ఇది కేవలం ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ క్షేత్రాల్లో మాత్రమే సాధ్యమని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో సెర్న్ ఇప్పుడు యాంటీమ్యాటర్ తయారీకి ప్రయత్నిస్తోంది. అత్యాధునిక సాంకేతికతతో నియంత్రిత వాతావరణంలో దీనిని ఉత్పత్తి చేయడానికి, శాస్త్రవేత్తలు అపారమైన శక్తిని ఉపయోగించనున్నారు. CERNలో, పరిశోధకులు శక్తివంతమైన కణ యాక్సిలరేటర్లను ఉపయోగించి ప్రోటాన్లను ఇరిడియం లక్ష్యంతో ఢీకొట్టే ముందు అధిక వేగంతో ముందుకు నడిపిస్తారు. (దున్నకుండా.. కలుపు తీయకుండా.. రసాయనాల్లేకుండానే సాగు!)యాంటీ మ్యాటర్‌పై అధ్యయనాలుయాంటీ మ్యాటర్ అంతులేని శక్తిని ఉత్పత్తి చేస్తుంది కాబట్టి అంతరిక్ష పరిశోధనలకు దీనిని ఉపయోగించవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. యాంటీమాటర్ ఉత్పత్తిలో ఉన్న కష్టం, ఖర్చును దృష్టిలో ఉంచుకుని, శాస్త్రవేత్తలు ఈ అంతుచిక్కని పదార్ధంపై తీవ్ర పరిశోధనలను కొనసాగిస్తున్నారు.విశ్వం ప్రారంభంలో సమాన మొత్తంలో పదార్థం, యాంటీమాటర్ సృష్టించబడ్డాయని శాస్త్రవేత్తలు విశ్వాసం. అవి ఒకదానికొకటి పూర్తిగా నాశనం చేసుకుని ఉండి ఉంటే, ఎలాంటి మ్యాటర్ మిగిలి ఉండకపోతే నేడు మనం చూస్తున్న గెలాక్సీలు, నక్షత్రాలు , గ్రహాలు ఎలా ఉండేవి అనేది ప్రధానమైన ప్రశ్న. ఒకవేళ మనకు కనిపించకుండా యాంటీమ్యాటర్ గెలాక్సీలు దాగి ఉన్నాయా? దీన్ని అర్థం చేసుకోవడానికే ఈ పరిశోధనలు. ఇదీ చదవండి: మదర్స్ ప్రైడ్ : తల్లిని తలుచుకొని నీతా అంబానీ భావోద్వేగం -
అసమానతల అంతు చూస్తారా?
విశ్వంలో ఇప్పటికీ ఎన్నో రహస్యాలు. శతాబ్దాల కాలంలో భిన్న దేశాల విభిన్న రంగాల దిగ్గజ శాస్త్రవేత్తలు ఇప్పటికి ఎన్నో సిద్ధాంతాలను రూపొందించారు. న్యూటన్ సిద్ధాంతాలు, ఐన్‌స్టీన్ సిద్ధాంతాలు ఇలా భౌతిక, రసాయన శా్రస్తాలు, గతిశక్తి, స్థితిశక్తి ఇలా ఎన్నో రకాల అంశాలకు సంబంధించి ఎన్నో పరిశోధనలు నేటి ఆధునిక ప్రపంచ అవసరాలను తీరుస్తున్నాయి. అయితే ఇప్పటికీ భౌతిక, రసాయన, ఇంజనీరింగ్ శాస్త్రవేత్తలకు కొరుకుడుపడని టర్బులెన్స్ దృగ్విషయం అన్ని రంగాలకు పెద్ద సమస్యగా మారింది. ద్రవ ప్రవాహాల్లో హఠాత్తుగా సంభవించే అసాధారణ హెచ్చుతగ్గులు, సముద్రజలాల కదలికల్లో అనూహ్య మార్పులు, రసాయనాల్లో ఊహించని ప్రతిచర్యలు, రక్తప్రవాహాల్లో హెచ్చుతగ్గులు వంటివి ఎందుకు సంభవిస్తాయో ఇప్పటికీ ఎవరికీ తెలీదు. టర్బులెన్స్ సమస్య చాలా రంగాలకు పెద్ద గుదిబండగా తయారైంది. గాల్లో ఎగిరే విమానాలు ఒక్కసారిగా టర్బులెన్స్‌కు గురై హఠాత్తుగా కిందకు పడిపోవడమో ఒక్కసారిగా బ్యాలెన్స్ తప్పడమో జరుగుతున్నాయి. వెదర్ శాటిలైట్లతో ఖచ్చితత్వంతో వాతావరణ పరిస్థితులపై ప్రభుత్వాలను వాతావరణ కేంద్రాలు హెచ్చరిస్తున్నా ఇప్పటికీ కొన్ని చోట్ల ఊహంచని తుపాన్లు అప్పటికప్పుడు ఏర్పడి భారీ ఆస్తి, ప్రాణ నష్టానికి కారణమవుతున్నాయి. సువిశాల విశ్వంలో నక్షత్రాల్లోని అయనీకరణ చెందిన అత్యంత వేడి వాయువుల్లో హఠాత్తుగా ఎందుకు మార్పులు జరుగుతున్నాయో ఖగోళ శాస్త్రవేత్తలు కూడా చెప్పలేకపోతున్నారు. మానవ కణంలో అణువుల మధ్య బంధంలోనూ హఠాత్తుగా మార్పులను చూస్తున్నాం. చివరకు కృత్రిమ గుండె పనితీరును రక్తప్రవాహంలోని టర్బులెన్స్ ప్రభావితం చేస్తూ అత్యంత సమర్థవంతమైన ఆర్టిఫీషియల్ హార్ట్ ఆవిష్కరణ అవసరమని గుర్తుచేస్తోంది. ఇలాంటి దృగ్విషయాలకు ఏకైక కారణమైన టర్బులెన్స్పై మరింత అవగాహనే లక్ష్యంగా శాస్త్రవేత్తలు నడుం బిగించారు. ఈ టర్బులెన్స్పై స్పష్టమైన అవగాహన ఉంటే సైన్స్, ఇంజనీరింగ్ పరిశ్రమల్లో మరింత మెరుగైన డిజైన్‌తో విమానాలు, కార్లు, ప్రొపెలర్లు, కృత్రిమ గుండెలు తయారుచేయడానికి, అత్యంత ఖచ్చితత్వంతో వర్షాలు, వాతావరణం, పర్యావరణ సంబంధ హెచ్చరికలు చేయడానికి వీలు చిక్కుతుంది. వేగంగా చర్యలు జరిపి.. ప్రపంచంలో ఎక్కడ ఏ ద్రవాల్లో ఈ టర్బులెన్స్ తలెత్తుతుందో తెల్సుకోవాలంటే ఆ ద్రవాల పనితీరు, కదలికలపై నిరంతర నిఘా అవసరం. వాటి చర్యను వేగవంతం చేస్తేనే టర్బులెన్స్ ఎప్పుడెప్పుడు వస్తుందో గుర్తించగలం. అందుకోసం ద్రవాల్లో రెండు సార్లు టర్బులెన్స్ సంభవిస్తే ఈ రెండు టర్బులెన్స్ మధ్య కాలంలో జరిగే మార్పులను అత్యంత ఖచ్చితత్వంతో రికార్డ్ చేయాల్సి ఉంటుంది. ఇంతకాలం సంప్రదాయక పద్ధతిలో మాత్రమే డేటాను రికార్డ్చేసేవాళ్లు. ఇకపై తొలిసారిగా అత్యంత అధునాతన క్వాంటమ్ కంప్యూటర్స్ విధానంలో అత్యంత శక్తివంతమైన సూపర్ కంప్యూటర్లలో ఈ డేటాను నమోదుచేసి విశ్లేషించనున్నారు. దీంతో సెకన్ కంటే కొన్ని కోట్ల రెట్లు తక్కువ కాలంలోనూ జరిగే మార్పులను నమోదు చేసి విశ్లేషించడం సాధ్యమవుతుంది. సంబంధిత పరిశోధన వివరాలు జనవరి 29వ తేదీన ప్రఖ్యాత సైన్స్ అడ్వాన్సెస్ జర్నల్, ఫిజికల్ రివ్యూ రీసెర్చ్ జర్నల్లలో ప్రచురితమయ్యాయి. ‘‘సంప్రదాయక విధానాల్లో ప్రయోగాలు చేస్తే ఎప్పుడూ ఒక్కటే ఫలితం వస్తోంది. ఈసారి సంభావ్యత సిద్ధాంతాన్ని ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ అల్గారిథమ్‌ను వాడి మరింత మెరుగైన ఫలితాలను రాబట్టేందుకు ప్రయతి్నస్తున్నాం. రెండు విభిన్న రసాయన మిశ్రమాలను సిములేట్ చేసి వాటిల్లో సంభవించే టర్బులెన్స్‌లను నమోదుచేయదలిచాం. సాధారణ కంప్యూటర్స్‌లో 0, 1 అనే బిట్స్ మాత్రమే వాడతారు. క్వాంటమ్ కంప్యూటింగ్‌లో క్వాంటమ్ బిట్(క్వాబిట్స్) వాడతాం. దీంతో ఒకేసారి ఒకేసమయంలో వేర్వేరు చోట్ల జరిగే మార్పులను క్వాబిట్స్ నమోదుచేస్తాయి’’అని ఆక్స్‌ఫర్ట్ విశ్వవిద్యాలయంలో భౌతిక శాస్త్రవేత్త నిక్ గోరియనోవ్ చెప్పారు. కొత్త విధానంతో కంప్యూటేషన్ అత్యంత వేగవంతంగా జరుగుతుంది. ఇది మా పరిశోధనకు ఎంతో దోహదపడుతుంది’’అని ప్రిన్స్టన్ విశ్వవిద్యాలయంలో పోస్ట్ డాక్టోరల్ పరిశోధకుడు జేమ్స్ బీటెల్ చెప్పారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
లోకేష్ కనకరాజ్-ప్రభాస్ మూవీ ఓకే చెప్పిన యంగ్ రెబల్ స్టార్..
-
మిస్ టీన్ యూనివర్స్‌గా తృష్ణా రే
ఒడిషా యువతి తృష్ణా రే ‘మిస్ టీన్ యూనివర్స్–2024’ కిరీటం గెలుచుకుంది. దక్షిణాఫ్రికాలోని కింబర్లీ నగరంలో ఈ నెల 1 నుంచి 9వ తేదీ దాకా జరిగిన మిస్ టీన్ యూనివర్స్ పోటీలో విజేతగా నిలిచింది. పెరూ, దక్షిణాఫ్రికా, బ్రెజిల్, కెన్యా, పోర్చుగల్, నెదర్లాండ్స్ తదితర దేశాల నుంచి 10 మంది ఫైనల్‌కు చేరుకోగా, ఇండియా నుంచి ప్రాతినిధ్యం వహించిన 19 ఏళ్ల తృష్ణా రే వారందరినీ వెనక్కి నెట్టి అందాల సుందరి కిరీటం సొంతం చేసుకుంది.పెరూ దేశానికి చెందిన అన్నే థార్సెన్ మొదటి రన్నరప్‌గా, నమీబియాకు చెందిన ఆండ్రి రెండో రన్నరప్‌గా నిలిచారు. కల్నల్ దిలీప్ కుమార్ రే, రాజశ్రీ రే దంపతుల కుమార్తె అయిన తృష్ణా రే ప్రస్తుతం ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లోని కేఐఐటీ యూనివర్సిటీలో ఫ్యాషన్ టెక్నాలజీ చదువుతోంది. – న్యూఢిల్లీ -
సమయం ఆదియందు... మెల్లిగా సాగెను...!
ఎంతకూ రాని బస్సు కోసం అసహనంగా ఎదురు చూస్తున్నప్పుడో, చేస్తున్న పని పరమ బోరుగా అనిపిస్తున్నప్పుడో ఎలా ఉంటుంది? టైం అస్సలు సాగడం లేదని అనిపిస్తుంది. కదూ! కానీ ఆదియందు, అంటే బిగ్ బ్యాంగ్ జరిగి, ఆ మహా విస్ఫోటనం నుంచి ఈ మహా సృష్టి పురుడు పోసుకుంటున్న తొలినాళ్లలో సమయం నిజంగానే నింపాదిగా సాగేదట! ఎంతగా అంటే, ఇప్పటి వేగంలో అది కేవలం ఐదో వంతు మాత్రమేనని అంతరిక్ష శాస్త్రవేత్తలు తాజాగా సూత్రీకరించారు...! సృష్టి తొలినాళ్లలో సమయ విస్తరణ (టైం డైలేషన్) తీరుతెన్నులపై సిడ్నీ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తాజాగా ఓ అధ్యయనం జరిపారు. కాసర్స్ అని పిలిచే సృష్టిలోకెల్లా అతి తేజోమయమైన, అత్యంత చురుకైన బృహత్ కృష్ణబిలాల సమూహాలను లోతుగా పరిశీలించారు. దాదాపు 1,230 కోట్ల ఏళ్ల క్రితం కాలం ఇప్పుడు సాగుతున్న వేగంలో కేవలం ఐదో వంతు వేగంతో నడిచేదని తేల్చారు. ఇలా చేశారు: పరిశోధక బృందం తమ అధ్యయనానికి కాసార్స్ను కాలమానినిగా మార్చుకుంది. బిగ్ బ్యాంగ్ తరువాత దాదాపు 150 కోట్ల ఏళ్ల కాల పరిధిలోని మొత్తం 190 కాసర్స్ నుంచి వెలువడే దురి్నరీక్ష్య కాంతులను పరిశోధనలో వాడుకుంది. పలు తరంగధైర్ఘ్యాల్లో వాటి ప్రకాశాన్ని నేడు ఉనికిలో ఉన్న కాసర్స్తో సరిపోల్చారు. కాల ప్రవాహ గతిలో చోటు చేసుకునే కీలక నిర్దిష్ట మార్పుల్లో కొన్ని నేటితో పోలిస్తే అప్పట్లో కేవలం ఐదో వంతు వేగంతో జరిగేవని తేల్చారు. కోటి సూర్య సమప్రభలు... కాసర్స్ అని పిలిచే కాంతిపుంజ సమూహంలోని ఒక్కో కృష్ణ బిలం పరిమాణం అత్యంత భారీగా ఉంటుంది. ఎంతగా అంటే, కొన్ని కృష్ణ బిలాలు సూర్యుని కంటే ఏకంగా కొన్ని వందల కోట్ల రెట్లు పెద్దవి! అవి తమ పరిధిలోకి వచ్చిన ఎంతటి పదార్థాన్ని అయినా అనంత ఆకర్షణ శక్తితో లోనికి లాగేసి అమాంతంగా మింగేస్తాయి. ఆ క్రమంలో లెక్క లేనన్ని వెలుతురు పుంజాలను సృష్టి మూలమూలలకూ వెదజల్లుతుంటాయి. చుట్టూ అనంత కాంతి వలయాలతో వెలుగులు విరజిమ్ముతూ ఉంటాయి. ‘కాలమనే కాన్సెప్ట్ మనకింకా పూర్తిగా అర్థమే కాలేదని చెబితే అతిశయోక్తి కాబోదు. కాలం తీరుతెన్నులు, పరిమితులు తదితరాల గురించి కూడా మనకు తెలిసింది బహు స్వల్పం. అందుకే టైం ట్రావెల్ ( భూత, భవిష్యత్తులోకి వెళ్లగలగడం) వంటివి సాధ్యం కాదని చెబితే అది తొందరపాటే అవుతుంది‘ – గెరైంట్ లెవిస్, అధ్యయన బృంద సారథి, సిడ్నీ యూనివర్సిటీ – సాక్షి, నేషనల్ డెస్క్ -
విశాల విశ్వంలో భూమి లాంటి మరో గ్రహాం
విశాల విశ్వంలో భూగోళాన్ని తలపించే పలు గ్రహాలను ఇప్పటికే శాస్త్రవేత్తలు గుర్తించారు. తాజాగా మన భూమి నుంచి వంద కాంతి సంవత్సరాల దూరంలో భూమిలాంటి మరో గ్రహాన్ని కనుగొన్నారు. ఇది భూమి కంటే ముప్పయి శాతం పెద్దది. ‘టీఓఐ–4306’ అనే నక్షత్రం చుట్టూ తిరిగే ఈ గ్రహం ఉష్ణోగ్రత సూర్యుడి ఉష్ణోగ్రతలో సగానికి సగం ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ గ్రహం తన నక్షత్రం చుట్టూ 2.7 రోజుల్లో తిరుగుతుంది. భూమిపై జీవించే మనుషుల సగటు వయసు 73.5 సంవత్సరాలు. అదే ఈ గ్రహంపై మనుషులు జీవించేటట్లయితే, మనుషుల ఆయుఃప్రమాణం 3,158 ఏళ్ల వరకు ఉంటుందని శాస్త్రవేత్తల అంచనా. ఈ గ్రహంపై ఏడాది ప్రమాణం చాలా తక్కువ కావడమే దీనికి కారణం. ‘నాసా’కు చెందిన ‘ట్రాన్సిటింగ్ ఎక్సోప్లానెట్ సర్వే శాటిలైట్’ (టీఈఎస్ఎస్) ఈ గ్రహాన్ని ఇటీవల గుర్తించింది. -
భారీ ఖగోళ వింత: గుర్తించింది మనవాళ్లే!
విశ్వ పరిశోధనల్లో ఇప్పటిదాకా కనివిని ఎరుగని ఖగోళ వింతకు స్థానం దక్కింది. మూడు పాలపుంతల్లోని మూడు భారీ కృష్ణ బిలాలు(బ్లాక్‌హోల్స్) ఒకదానితో ఒకటి కలిసిపోయాయి. మరో విశేషం ఏంటంటే.. భారత్‌కు చెందిన ముగ్గురు ఖగోళ పరిశోధకులు ఈ వింతను ఆవిష్కరించడం. పాలపుంతలో తాజాగా ఈ మూడు బ్లాక్ హోల్స్‌ను గుర్తించారు. ముందుగా జంట బిలాల గమనాన్ని పరిశీలించిన పరిశోధకులు.. మూడో దానితో వాటి విలీనానికి సంబంధించిన పరిశోధనను ‘ఆస్రోనమీ’ జర్నల్‌లో పబ్లిష్ చేశారు. ‘‘మూడో పాలపుంత(గెలాక్సీ) ఉందనే విషయాన్ని మేం నిర్ధారించాం. ఎన్జీసీ7733ఎన్.. అనేది ఎన్జీసీ7734 గ్రూప్‌లో ఒక భాగం. ఉత్తర భాగం కిందుగా ఇవి ఒకదానిని ఒకటి ఆవరించి ఉన్నాయి’’ అని పేర్కొన్నారు. గెలాక్సీ జంట.. ఎన్జీసీ7733ఎన్-ఎన్జీసీ7734లోని పాలపుంతలు ఒకదానితో ఒకటి కలిసిపోయాయి. సాధారణంగా కృష్ణబిలాల కలయిక తీవ్రమైన ఒత్తిడి.. శక్తిని కలగజేస్తుంది. అయితే వాటి విలీనం ఒకదానితో ఒకటి కాకుండా.. పక్కనే ఉన్న మూడో భారీ బ్లాక్‌హోల్‌లోకి విలీనం కావడం ద్వారా ఆ ఎనర్జీ అంతగా ప్రభావం చూపలేకపోయిందని తెలిపారు. Indian researchers have discovered three supermassive black holes from three galaxies merging together to form a triple active galactic nucleus, a compact region at the center of a newly discovered galaxy that has a much-higher-than-normal luminosity.https://t.co/y8BDohOTg5 pic.twitter.com/1dxjJudPX1 — PIB India (@PIB_India) August 27, 2021 ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆస్రో్టఫిజిక్స్‌కు చెందిన జ్యోతి యాదవ్, మౌసుమి దాస్, సుధాన్షు బార్వే.. ఆస్రో్టసాట్ అబ్జర్వేటరీ ద్వారా అల్ట్రా వయొలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్ సాయంతో వీటిని వీకక్షించగలిగారు. ఈ అధ్యయనం కోసం సౌతాఫ్రికా ఐఆర్ఎస్ఎఫ్, చిలీ వీఎల్టీ, యూరోపియన్ యూనియన్‌కు చెందిన ఎంయూఎస్‌ఈ టెక్నాలజీల సాయం తీసుకున్నారు. అంతేకాదు కృష్ణ బిలాల విలీనానికి సంబంధించిన ప్రకాశవంతమైన యూవీ-హెచ్ ఆల్ఫా ఇమేజ్‌లను సైతం రిలీజ్ చేశారు. -
నేడు ఖగోళ అద్భుతం.. దూసుకెళ్లనున్న భారీ గ్రహశకలం
Asteroid 2016 AJ193 Speed To Earth: ‘భూమి వైపుగా దూసుకొస్తున్న గ్రహశకలాలు..’ చాలామంది ఈ విషయాన్ని చాలా తేలికగా తీసుకుంటారు. కానీ, అంతరిక్ష పరిశోధకులకు మాత్రం ఇదో ఆసక్తికరమైన అంశం. కారణం.. విశ్వం ఆవిర్భావానికి, డైనోసార్ల శకం ముగియడానికి, గ్రహాల ఏర్పాటుకు, విశ్వంలోని ఎన్నో పరిణామాలకు ఆస్టరాయిడ్లతోనే ముడిపడి ఉందన్న థియరీకి ఆధారాలు ఉన్నాయి కాబట్టి. ఏ గ్రహశకలం ఎలాంటి ముప్పు తెస్తుందో అనే విషయంపై స్పష్టత లేకపోవడం వల్ల.. దూసుకొచ్చే ప్రతీదాని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం ఏర్పడింది శాస్త్రవేత్తలకు. ఈ తరుణంలో.. భూమ్మీదకు వేగంగా దూసుకొస్తున్న ఓ ఆస్టరాయిడ్‌ను ఖగోళ శాస్త్రవేత్తలు నిశితంగా పరిశీలిస్తున్నారు. 2016 ఏజే193గా పేరు పెట్టిన ఓ ఆస్టరాయిడ్.. గంటకు 94 వేల కిలోమీటర్ల వేగంతో భూమి వైపు దూసుకొస్తుంది. నాసా అంచనాల ప్రకారం.. ఆగష్టు 21న(అంటే ఇవాళే) అది భూమికి సమీపంగా వచ్చే అవకాశం ఉంది. సుమారు కిలోమీటర్న్నర వెడల్పు ఉన్న శకలం.. అత్యంత ప్రమాదకరమైన శకలంగా నాసా గుర్తించింది. ఇది భూమిని ఢీకొడితే మాత్రం కచ్చితంగా భారీ డ్యామేజ్ చేసే అవకాశం ఉంది. కానీ, ఈసారికి ఆ అవకాశాలు లేవని సైంటిస్టులు స్పష్టం చేశారు. చదవండి: వందేళ్ల తర్వాత బెన్నూ ముప్పు! భూమికి దూరంగా (భూమి-చంద్రుడికి మధ్య ఉన్న దూరానికి తొమ్మిది రెట్లు దూరంగా) ఈ శకలం వెళ్లనుంది. ఈ లెక్కన భూమికి వచ్చిన ప్రమాదం ఏమీ లేదు. అయితే ఈ ఖగోళ అద్భుతాన్ని టెలిస్కోప్‌ల ద్వారా వీక్షించవచ్చని ఖగోళ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. 2063లో మరోసారి ఇది భూమికి దగ్గరగా రానుందని అంచనా వేస్తున్నారు. ఇక సౌర వ్యవస్థలో గ్రహ శకలాల వయసును 4.6 బిలియన్ సంవత్సరాలుగా భావిస్తుంటారు. మొత్తం 26 వేల ఆస్టరాయిడ్స్‌ను గుర్తించిన నాసా.. ఇందులో వెయ్యి గ్రహశకలాలను మాత్రం భూమికి ప్రమాదకరమైన వాటిగా గుర్తించింది. -
‘మిస్సెస్ యూనివర్స్’ ఫైనల్‌కు సిటీ వనిత
పంజగుట్ట: నగరానికి చెందిన రోహిణి నాయుడు ‘మిస్సెస్ యూనివర్స్’ ఫైనల్‌కు ఎంపికయ్యారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఈ ఘనతను సాధించినఏకైక మహిళగా నిలిచిన ఆమె.. అక్టోబర్‌లో గ్రీస్ దేశంలో జరిగే పోటీల్లో టైటిల్ పోరులో తలపడనున్నారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రోహిణి మాట్లాడారు. మిస్సెస్ యూనివర్స్ పోటీలకు వివిధ దేశాల నుంచి 30 వేల ఎంట్రీలు రాగా 172 మందిని ఫైనల్స్‌కు ఎంపికచేశారన్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి తాను ఒక్కదాన్నేఎంపికైనందుకు గర్వంగా ఉందన్నారు. ఫైనల్స్‌లో సత్తా చాటి నగరానికి టైటిల్ తీసుకుకొస్తానని ధీమా వ్యక్తం చేశారు. పోటీల్లో భాగంగా మహిళా సాధికారత, జెండర్ ఈక్వాలిటీ, అపోహలు తొలగించడం అనే అంశాలపై టాస్క్‌లు చేసి సామాజిక మాధ్యమాల్లో అందుబాటులో ఉంచుతానని ఈ సందర్భంగా ఆమె తెలిపారు. -
పక్కనే ఉండు
చెవులకు మఫ్లర్, ఒంటికి స్వెట్టర్ వేసుకుని.. దాదాపుగా రాత్రి పదకొండు అవుతుండగా ధర్మజీవి ఇంటికి వచ్చాడు విశ్వేశ్వర్. వచ్చీరావడంతోనే ‘‘నీ సలహా కోసం వచ్చాన్రా «ధర్మా..’’ అన్నాడు.. «ధర్మజీవి పడుకుని ఉన్న మంచం మీద అతడి కాళ్ల వైపు కూర్చుంటూ.‘‘కుర్చీలో కూర్చోరా..’’ అన్నాడు ధర్మ.. దుప్పట్లో చాపుకుని ఉన్న కాళ్లను పైకి మడుచుకుంటూ. ‘‘పర్లేదురా’’ అని ధర్మజీవి కాలిపై మృదువుగా చెయ్యి ఆన్చాడు విశ్వేశ్వర్. అప్పుడనిపించింది ధర్మజీవికి.. విశ్వేశ్వర్ లోలోపల ఎందుకనో నలిగిపోతున్నాడని. దిగ్గున మంచం మీద లేచి కూర్చున్నాడు. ‘‘ఏమైందిరా విశ్వా?’’ అన్నాడు ఆప్యాయంగా భుజం మీద చెయ్యి వేసి.వాళ్లిద్దరూ స్నేహితులు. ఊళ్లో ఊడలు దిగిన జంట మర్రిచెట్ల లాంటి స్నేహితులు. అరవై ఏళ్ల స్నేహం. ‘‘ఏమైందిరా విశ్వా?’’ మళ్లీ అడిగాడు «ధర్మ. విశ్వ ఏం చెప్పలేదు. ధర్మ కళ్లలోకే చూస్తున్నాడు.మామూలుగా ధర్మను విశ్వ కలిసే సమయం ఇలాగే బాగా పొద్దుపోయాక ఉంటుంది. ధర్మ కూడా ఎప్పుడైనా వెళ్లి విశ్వను వాళ్లింట్లో కలుస్తుంటాడు. అయితే విశ్వ వచ్చి కలిసినంతగా, «ధర్మ Ðð ళ్లి కలవడు. అందుకు ప్రత్యేకమైన కారణం ఏమీ లేదు. ధర్మ ఇల్లు సౌకర్యవంతంగా ఉంటుంది. ధర్మకు ప్రత్యేకంగా ఒక గది ఉంటుంది. భార్యా పిల్లలు వేరుగా వేరే గదుల్లో ఉంటారు. ఇప్పుడా పిల్లలు కూడా లేరు.అమెరికాలో ఒకరు, జర్మనీలో ఒకరు వేరే గదులు చూసుకుని వెళ్లిపోయారు. «ధర్మ, అతడి భార్య జానకి మాత్రం మిగిలారు. విశ్వక్కూడా.. పిల్లలు పెళ్లిళ్లై వెళ్లిపోయాక ఇంట్లో కాస్త స్పేస్ దొరికింది. అయితే పిల్లల్లేని ఆ స్పేస్ అతడికి కొన్నాళ్లకే ఇరుగ్గా ఉన్నట్లనిపించడం మొదలైంది. ఆ ఇరుకును మరింత ఇరుకు చేస్తూ భార్య కూడా అతడికి మరికొంత స్పేస్ ఇచ్చి వెళ్లింది. కొన్ని నెలల క్రితమే ఆమె చనిపోయింది.ఒక్కడే ఇప్పుడు విశ్వ. అతడికున్నదీ ఈ విశ్వంలో ఒక్కడే ఇప్పుడు.. ధర్మ. ‘‘ఇంక చాలనిపిస్తోందిరా’’ అన్నాడు విశ్వ.. నిట్టూరుస్తూ. ధర్మకు అర్థమైంది.‘‘తిన్నావా?’’ అన్నాడు. ‘‘ఊ..’’ అన్నాడే కానీ, విశ్వ తినిరాలేదు. కొద్ది రోజులుగా అతడికి తినవలసిన అవసరం కూడా కనిపించడం లేదు.‘‘జానకీ.. విశ్వా వచ్చాడు..’’ హాల్లోకి చూస్తూ చెప్పాడు ధర్మ ‘‘వద్దమ్మా.. టీ తాగే వచ్చాను’’ అన్నాడు విశ్వ.. ఆమెకు వినిపించేలా. ‘‘సరే.. కాస్త ఆగి తీసుకురా జానకీ’’ అన్నాడు «ధర్మ. పన్నెండూ ఒంటిగంట వరకు ఆ స్నేహితులిద్దరూ మాట్లాడుకోవడం ఆమెకు తెలిసిన సంగతే. ‘‘బతికింది చాలనిపిస్తోందిరా’’ అన్నాడు విశ్వ. అతడి వైపు తీక్షణంగా చూశాడు ధర్మ. ‘‘ఎవరు మాత్రం పనికట్టుకుని బతుకుతారు చెప్పూ. జీవితమే ఏదో ఒక ఆశను పెట్టి, లేదంటే నెత్తి మీద ఓ బాధ్యతను పెట్టి ఏ క్షణానికాక్షణం బతికిస్తుంటుంది మనుషుల్ని.చిన్న వయసులో ఆశలు. పెద్దయ్యాక బాధ్యతలు. ఎవరి బతుకూ వారి చేతుల్లో ఉండదు’’ అన్నాడు. ‘‘ఆశలేం లేవు. బాధ్యతలూ తీరిపోయాయి’’ అన్నాడు విశ్వేశ్వర్. ‘‘ఆశలు నెర వేరీ, బాధ్యతలన్నీ తీరిపోయి ఖాళీగా కూర్చున్న వాళ్లంతా నీలాగే అనుకుంటున్నారా విశ్వా!’’‘‘అది కాదురా.. నాకు ఈ జీవితంపై ఏవిధమైన ఆసక్తీ కలగడం లేదు. ఊరికే.. నాది కాని ఇంట్లోకి వచ్చి కూర్చున్నట్లుగా ఉంది.. నేనింకా ఈ భూమ్మీదే ఉండడం..’’‘‘పోనీ నాకోసం బతకరా. నేను పోయే దాకా. నిద్ర లేస్తే ఎప్పుడూ మన ఆశలు, మన బాధ్యతలేనా? మనపై ఆశలు పెట్టుకున్నవారినీ, మన బాధ్యత తీసుకోవాలని ఆశపడుతున్నవారిని నిరాశపరిచి వెళ్లిపోతామా’’ అన్నాడు ధర్మ. విశ్వేశ్వర్ పెద్దగా నవ్వాడు. ‘‘ఎవరు పెట్టుకుంటార్రా నా మీద ఆశలు. పైకి పోయిన నా భార్య పెట్టుకుంటుందా? పై చదువులని చెప్పి అట్నుంచటే వెళ్లిపోయిన నా పిల్లలా? ఇంకో మాట కూడా అన్నావు. ‘మన బాధ్యత తీసుకోవాలని ఆశపడుతున్న వారిని నిరాశపరిచి వెళ్లిపోతామా?’ అని. ఎవరికైనా ఎందుకిస్తాం మన బాధ్యతను? చెప్పు’’ అన్నాడు విశ్వేశ్వర్. ‘‘పోనీ నీ బాధ్యతను ఎవరి మీదైనా పెట్టెయ్. అప్పుడు బతకాలనిపిస్తుందేమో’’ అన్నాడు ధర్మ. ‘‘అలా ఉంటుందా ధర్మా. ముందసలు బతుకుపై ఆసక్తి ఉంటే కదా.. బాధ్యతలు ఇవ్వడమైనా, బాధ్యతలు తీసుకోవడమైనా! ఇవన్నీ అటుంచు.. నా బాధ్యతను ఇంకొకరు తీసుకోడానికి నేనెందుకు అంగీకరిస్తానని అనుకుంటున్నావు’’ అన్నాడు విశ్వేశ్వర్.‘‘అవుననుకో..’’ అని ఆగిపోయాడు ధర్మ. మాటల మధ్య జానకి ఎప్పుడొచ్చి వాళ్లకు అక్కడ టీ పెట్టి వెళ్లిందో ఇద్దరూ చూసుకోలేదు. ‘‘టీ తీస్కోరా విశ్వా’’ అన్నట్లు చూశాడు ధర్మ. టీ తాగుతున్నంతసేపూ విశ్వేశ్వర్నే చూస్తూ.. టీ తాగడం అయ్యాక.. ‘‘జీవితంపై ఆసక్తి లేదంటున్నావంటే.. జీవితంలోని సంతోషాలను చూడలేకపోతున్నావని అర్థం’’ అన్నాడు ధర్మ. ‘‘ఏం మిగిలి ఉంటాయని.. సంతోషాలు.. సూర్యుడు పడమటికి దిగిపోతుంటే..’’‘‘సంతోషాలు మిగిలిపోవు. ఉండిపోవు విశ్వా. రోజూ బతికే బతుకులోనే వెతుక్కోవాలి’’‘‘ఆశ ఉంటేనే కదా ధర్మా.. వెతుక్కుంటాం. నాకలాంటి ఆశ లేదంటున్నాగా..’’ అన్నాడు విశ్వేశ్వర్. ధర్మకు అర్థమైంది.. విశ్వ ఏదో తీర్మానించుకునే వచ్చాడని. ‘‘సరే.. చెప్పు.. సలహా కోసం వచ్చానని అన్నావ్ కదా. దేనికి సలహా? బతికింది చాలనుకోడానికా?’’ అని నవ్వాడు. విశ్వేశ్వర్ మౌనంగా ఉన్నాడు. ‘‘బతికింది చాలనుకోడానికైతే నా దగ్గరేం సలహా లేదు. బతకడానికైతే మాత్రం ఉంది. నేను నీ మీద ఆశ పెట్టుకుంటాను. నేను నీ బాధ్యత తీసుకుంటాను’’ అన్నాడు ధర్మ. విశ్వేశ్వర్‌కి అర్థం కాలేదనిపించి మళ్లీ చెప్పాడు.‘‘నా జీవితాంతం నువ్వు నా పక్కనే ఉండాలని నా ఆశ. ఇక నేను తీసుకోవాలనుకుంటున్న బాధ్యత.. నిన్నూ మా ఇంట్లో మనిషిగా, మాతో పాటు ఉంచుకునే బాధ్యత. ఏమంటావ్? నాఆశనెరవేరుస్తావా? నీ బాధ్యతను తీసుకోనిస్తావా?’’ అన్నాడు. మళ్లీ ఇందాకటే మాటే అన్నాడు విశ్వేశ్వర్. ‘‘నాపై నీ ఆశకు నా ప్రమేయం లేదు. నీపై నేను పెట్టే బాధ్యతేమీ ఉండబోదు’’ అన్నాడు. అని పైకి లేచాడు. పైకి లేవడం అంటేకుర్చీలోంచి పైకి కాదు. కుర్చీ కన్నా పైకి! ‘‘ఒరేయ్.. విశ్వా’’ అని పెద్దగా అరిచాడు ధర్మజీవి.. తల పైకెత్తి చూస్తూ. ‘‘ఏంటండీ.. అని హాల్లోంచి ముందు గదిలోకి వచ్చింది జానకి. ‘‘నిర్ణయం తీసేసుకున్నాక సలహా తీసుకోడానికి వచ్చినట్లున్నాడు జానకీ’’ అన్నాడు ధర్మజీవి. ఆ మాట ఆమెకు అర్థం కాలేదు. తెల్లారి.. జానకమ్మ.. ముందు గదిలోకి వచ్చి టీ కప్పులు తీయబోయింది. వాటిల్లో ఒకటి మాత్రమే ఖాళీగా ఉంది. ‘‘విశ్వా.. రాత్రి టీ తాగి వెళ్లలేదా?’’ భర్తను లేపుతూ అడిగింది. ధర్మజీవి కదల్లేదు. - మాధవ్ శింగరాజు -
అంచనాలకు అందని ఆస్టరాయిడ్!
హూస్టన్: విశ్వంలో గతి తప్పి భూమి వైపు దూసుకొచ్చే ఆస్టరాయిడ్స్ గురించి సైంటిస్టులు ఎంతో ముందుగానే అంచనా వేస్తారు. అది ఎప్పుడు భూమిని దాటి వెళ్తుందన్న దానిపై ఓ స్పష్టత ఉంటుంది. అయితే ఈసారి మాత్రం అందుకు భిన్నంగా జరిగింది. మొన్న వీకెండ్లో ఓ ఫుట్‌బాల్ మైదానమంత సైజు ఉన్న ఆస్టరాయిడ్ భూమి పక్కగా వెళ్లిందని చాలా మందికి తెలియదు. నాసా శాస్త్రవేత్తలకే అది వచ్చే కొన్ని గంటల ముందు తెలిసింది. ఆరిజోనాలోని నాసా అబ్జర్వేటరీలో ఉన్న సైంటిస్టులు 21 గంటల ముందే అది భూమి వైపు దూసుకొస్తున్నదని గుర్తించారు. 2018 జీఈ3 అనే ఈ ఆస్టరాయిడ్ ఈస్టర్న్ డేలైట్ టైమ్ ప్రకారం ఆదివారం 12.11 గంటలకు భూమికి దగ్గరగా వచ్చినట్లు స్పేస్ డాట్ కామ్ వెబ్సైట్ వెల్లడించింది. గంటకు లక్ష కిలోమీటర్ల వేగంతో ఇది దూసుకెళ్లింది. ఇది 48–110 మీటర్ల వెడల్పు ఉన్నట్లు సైంటిస్టులు తెలిపారు. ఈ ఆస్టరాయిడ్ భూమిని ఢీకొట్టి ఉంటే.. ఓ ఖండమంతా నాశనమయ్యేదని స్పేస్ వెబ్సైట్ తెలిపింది. ఇది 1908లో రష్యాలోని సైబీరియా ప్రాంతంలో పడిన ఆస్టరాయిడ్ కంటే 3.6 రెట్లు పెద్దది కావడం గమనార్హం. అప్పట్లో ఈ ఆస్టరాయిడ్ హిరోషిమాపై పడిన అటామిక్ బాంబ్ కంటే 185 రెట్లు ఎక్కువ శక్తిని విడుదల చేసింది. -
తుదిదశలోనూ హాకింగ్ పరిశోధన
లండన్ : ఖగోళంలో ఎవరూ దృష్టి సారించని అంశాలపై ప్రముఖ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ ఎన్నో పరిశోధనలు జరిపారు. భౌతిక శాస్రంలో ఎన్నో అద్భుతమైన విజయాలు సాధించిన ఆయన విశ్వంలో మనిషిని పోలిన జీవులు ఉండొచ్చని తెలిపి, దానిని నిరూపించడానికి అలుపెరగని ప్రయత్నాలు చేశారు. తన పరిశోధనల సారాన్ని వివరిస్తూ ‘ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైమ్’ అనే గ్రంథాన్ని వెలువరించారు. ప్రపంచంలోని యువ శాస్త్రవేత్తలకు ఇది ఒక గొప్ప దిక్సూచిగా నిలిచింది. అతి భయంకరమైన వ్యాధితో పోరాడుతూ చక్రాల కుర్చీకే పరిమితమైనా.. మానవులకు ఏదో మేలు చేయాలనే తపన స్టీఫెన్ హాకింగ్ది. స్టీఫెన్ హాకింగ్ తుదిశ్వాస వరకు పరిశోధనలోనే నిమగ్నమయ్యారు. అందుకు నిదర్శరం తాను చనిపోవడానికి రెండువారాలకు ముందు ఆయన సమర్పించిన పరిశోధనా పత్రాలు. తాను ముందునుంచి చెబుతున్నట్టు.. విశ్వం ఒక్కటే లేదని, దానిని పోలిన విశ్వసముదాయాలు ఎన్నెన్నో ఉన్నాయని పేర్కొంటూ.. తన వాదనకు బలం చేకూర్చే సమాచారాన్ని ఈ పరిశోధనా పత్రాల్లో హాకింగ్ పొందుపర్చారు. ‘ఏ స్మూత్ ఎగ్జిట్ ఫ్రమ్ ఎటర్నల్ ఇన్ఫ్లేషన్’ పేరుతో ప్రచురించిన ఈ పత్రాలలో మానవ మనుగడ ఎక్కువ కాలం నిలవదని, వేరే సురక్షితమైన ప్రాంతానికి తరలివెళ్లక తప్పదని తాను ఎప్పటినుంచో చెబుతున్న థియరీకి సంబంధించి వివరణాత్మక విషయాలను పొందుపరిచారు. ‘ఒక పరమాణువు విస్తరించడం వల్లే నేటి విశ్వం ఆవిర్భవించింది. మనకున్న బిగ్ బ్యాంగ్ థియరీలాగే, ఇతర జీవులకు విశ్వాన్ని పోలిన ఆవాసం తప్పకుండా ఉంటుందని’ అని స్టీఫెన్ తన పరిశోధన పత్రాల్లో పేర్కొన్నారు. -
అంతరిక్షంలో ఖనిజాన్వేషణ
వాషింగ్టన్ : మీరు అవతార్ సినిమా చూశారా? అందులో, మనుషులు ఖనిజాల కోసం పండోరా అనే గ్రహంపై మైనింగ్ చేస్తారు.. గుర్తుందా? వెండితెరపై ఈ సన్నివేశాలు కొత్త ఆలోచనలకు పునాదులు వేశాయి. భూమిపై ఉన్న ఖనిజాలు కొన్నేళ్లలో కనుమరుగవనున్న నేపథ్యంలో మనుషుల అవసరాలు తీర్చేందుకు మనిషి ఎప్పటినుంచో ఇతర గ్రహాల వైపు చూస్తున్నాడు. ఈ క్రమంలోనే అమెరికా అంతరిక్ష పరిశోధక సంస్థ నాసా ఈ ఆలోచనను నిజం చేయబోతోంది. అంతరిక్షంలో ఉన్న విలువైన ఖనిజాలను తవ్వుకుని భూమికి తీసుకురావాలన్న ఆలోచనను మెల్లిగా అమలులో పెడుతోంది. ఇందులో భాగంగా ఓ స్పేస్‌క్రాఫ్ట్‌ను ఇప్పటికే ప్రయోగించింది. త్వరలోనే అది తన పనిని పూర్తి చేయనుంది. ఏంటి ఈ మిషన్? అంతరిక్ష ఖనిజాన్వేషణలో భాగంగా ‘101955 బెన్నూ’ అనే గ్రహశకలాన్ని అధ్యయనం చేయాలని నాసా భావించింది. ఇందుకోసం ఒసిరిస్– రెక్స్ OSIRIS& REx (Origins, Spectral Interpretation, Resource Identification, Secu rity, Regolith Explorer) అనే స్పేస్ క్రాఫ్ట్‌ను 2016, సెప్టెంబరు 9న ప్రయోగించింది. ఇది దాదాపు 20 లక్షల కిలోమీటర్లు ప్రయాణించి ఈ డిసెంబరులో ఈ గ్రహశకలాన్ని చేరుతుంది. ఏడాదిపాటు దాని చుట్టూ పరిభ్రమిస్తూ దాని ఫొటోలను తీయడం, సర్వే చేయడం పూర్తి చేస్తుంది. 2020 నాటికి గ్రహశకలాన్ని చేరుకుని దాని ఉపరితలాన్ని కొద్దిగా తవ్వి ఆ శాంపిల్స్‌ను తీసుకుంటుంది. 2021 మార్చినాటికి తిరుగుయాత్ర మొదలు పెట్టి, 2023, సెప్టెంబరు 24న భూమిని చేరుతుంది. సూర్యుడి చుట్టూ పరిభ్రమిస్తోన్న బెన్నూ గ్రహశకలం ప్రతీ ఆరేళ్లకోసారి భూమికి సమీపంలోకి వస్తుంది. ఈ గ్రహశకలంపై 10 శాతం ఇనుము, నికెల్ నిక్షేపాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. దాదాపు 800 మిలియన్‌డాలర్ల భారీ వ్యయంతో ఈ ప్రాజెక్టును నాసా చేపట్టింది. బెన్నూ విశేషాలేంటి? సౌర వ్యవస్థలో సూర్యుని చుట్టూ పరిభ్రమించే ఒక గ్రహశకలం. ఇది ప్రతీ ఆరేళ్ల కోసారి భూమికి సమీపంగా వస్తుంది. దీని పూర్తిపేరు 101955 బెన్నూ’. తొలిసారిగా దీన్ని 1999లో గుర్తించారు. ఇది రాంబస్ ఆకారంలో ఉండే సీ–టైప్ ఆస్టరాయిడ్ లేదా కార్బనేíషియస్ ఆస్టరాయిడ్. దీని ఉపరితలం ఎక్కువగా కార్బన్ సమ్మేళనాలతో నిండి ఉంటుంది. మిగిలిన కొద్దిమొత్తంలో ఖనిజాలు ఉంటాయి. ఈ ఖనిజాల కోసమే నాసా పరిశోధకులు ఇపుడు ఒసిరిస్‌ను ప్రయోగించారు. బెన్నూ ఎత్తు 510 మీటర్లు అంటే మన ఈఫిల్ టవర్ (324మీటర్లు) కన్నా అధికం. మానవాళికి ఏం లాభం? సైంటిస్టుల అంచనాలు నిజమై.. అనుకున్న ప్రకారం ఈ గ్రహశకలంపై ఖనిజాలు ఉన్నాయని తేలితే. అంతులేని ఖనిజ సంపద మానవుల సొంతమవుతుంది. మానవాళి భవిష్యత్తు అవసరాలకు ప్రత్యామ్నాయ మార్గం దొరికినట్లవుతుంది. ఈ గ్రహశకలంపై ఉన్న ఖనిజాలను పూర్తిగా తవ్వి తేగలిగితే.. ఇపుడున్న మార్కెట్ విలువ ప్రకారం..15 క్వింటిలిన్ ( దాదాపు లక్షల కోట్ల డాలర్లు) ఉంటుందని అంచనా. భూమిపై ఖనిజాలు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో ఈ ఆస్టరాయిడ్ మైనింగ్ సాధ్యమైతే భవిష్యత్తులో మానవాళి మనుగడకు ఢోకా ఉండదని ధీమా వ్యక్తం చేస్తున్నారు శాస్త్రవేత్తలు. ఎలా తవ్వుతుంది? ఈ స్పేస్‌క్రాఫ్ట్‌కు ఒక రోబోచేయి ఉంటుంది. ఒసిరిస్ బెన్నూను చేరగానే ఈ రోబోచేయి టాగ్సామ్ మెకానిజం (టచ్ గో శాంపిల్ అక్వైజేషన్ మెకానిజం) ద్వారా పనిచేయడం మొదలుపెడుతుంది. తొలుత నైట్రోజన్ గ్యాస్‌ను విడుదల చేస్తుంది. రిగోలియత్గా పిలిచే దాని ఉపరితలాన్ని 60 – 2000 గ్రాముల వరకు మొత్తం మూడుశాంపిళ్లను సేకరిస్తుంది. అలా సేకరించిన ఆ శాంపిల్స్‌తో ఒసిరిస్ తిరిగి భూమికి బయల్దేరుతుంది. -
ఆ తరంగాలు గ్రహాంతరవాసులవేనా?
-
గ్రహాంతర వాసులు ఉన్నారా? లేదా ?
-
నాన్నే నారాయణుడు
మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ, అతిథి దేవోభవ–ఈ నలుగురినీ సాక్షాత్తు ఈశ్వర స్వరూపాలుగా భావించి నమస్కరించిన ఉపనిషత్తు మనకూ అలాగే ప్రబోధం చేసింది. ఈ క్రమంలో మొదట తల్లి వైభవాన్ని గురించి తెలుసుకున్నాం కదా. తండ్రిని పరబ్రహ్మంగా ఎందుకు భావించాలో ఇప్పుడు చూద్దాం. పితృదేవోభవ–తండ్రి సాక్షాత్ పరమాత్మ స్వరూపమే. ఆయన చర్మచక్షువులకు కనబడేవాడు కాడు. పాలలోనే నెయ్యి ఉన్నది. కానీ మామూలు కన్నులకు కనిపించదు. కానీ ఆ పాలను కాచి, తోడుపెట్టి, కవ్వంతో చిలికి, వెన్నతీసి, కాచితే నెయ్యి వస్తుంది. పాలలో ఉన్న నెయ్యి ఎలా కనబడదో, అలా విశ్వనాథుడే విశ్వం రూపంలో ఉన్నప్పటికీ అందరికీ కనిపించడు. కొంత సాధన చేసినవారికి తప్ప ఇతరులకు పరమాత్మ దర్శనం లభించదు. ‘మాయ’ అనే తెర అడ్డు ఉన్న కారణంగా నామరూపాత్మకమైన జగత్తుతో తాదాత్మ్యత చెంది పునరావృత్తి చెందుతుంటాడు. కానీ ఈ లోకంలో మనకున్న మాంసనేత్రాలతో చూడడానికి యోగ్యమైన పరబ్రహ్మ స్వరూపమే తండ్రి. అందుకే తల్లికి తొలి నమస్కారం చేయించిన వేదం... తరువాత తండ్రిని పరబ్రహ్మగా గుర్తించి నమస్కరించాలన్నది. తండ్రి ఎలా పరబ్రహ్మ అవుతున్నాడు? ఇటువంటి ప్రశ్నలకు మనం సాధికారికంగా ఏదయినా చెప్పాలంటే ప్రమాణంగా వేటిని స్వీకరించాలి? ’భగవంతుని అనుగ్రహాన్ని పొందడానికి నీవు ఇలా బతకవలసి ఉంటుంది’ అని మార్గదర్శనం ఇవ్వగలిగినవి కొన్ని ఉన్నాయి–వాటిలో మొదటిది శృతి. అంటే వేదం. వేదమే ప్రమాణం. శృతి భగవంతుని ఊపిరి. తరువాత స్మృతి. దీనిలోని విషయాలు రుషులు సంకలనం చేసినవి. ఈ రెండింటినీ జనసామాన్యానికి మరింత స్పష్టంగా చూపించేవి పురాణాలు. కాలానుగుణంగా ఇవి ధర్మంపట్ల మనకు అనురక్తిని కలిగిస్తుంటాయి. తరువాత శిష్టాచారం. అంటే శృతి, స్మృతి, పురాణం కూడా తెలియకపోతే పెద్దలు ఎలా ప్రవర్తిస్తున్నారో చూసి, శాస్త్రం తెలిసినవారి నడవడి ఎలా ఉంటుందో చూసి తెలుసుకోవడం. ఈ నాలుగూ కూడా తెలియకపోతే అంతరాత్మ ప్రబోధం ప్రకారం నడచుకోవాలి. కాబట్టి మొట్టమొదటి ప్రమాణం శృతి. స్మృతులను అందరూ చదువుకోలేరనుకుని, కలియుగంలో మానవుల అల్పాయుర్దాయాన్ని దృష్టిలో పెట్టుకుని వ్యాసభగవానులు వేద విభజన చేసారు. స్వర ప్రధానంగా మూడుగా చేసి వాటిలో అత్యంత ప్రధానమైన అధర్వణ వేదాన్ని అత్యంత భద్రంగా మధ్యలో ఉంచారు. మళ్ళీ అత్యంత ప్రధానమైన రుద్రాధ్యాయాన్ని అధర్వణ వేదం మధ్యలో ఉంచారు.(ఈ భూలోకంలో ఎంత పెద్ద కష్టాన్నయినా తప్పించగలిగేది శివాభిషేకం. ఆ అభిషేకానికి వాడే భాగమే రుద్రాధ్యాయం.) ఈ రుద్రాధ్యాయంలో కూడా అత్యంత శక్తిమంతమైన మహామంత్రాన్ని దాని మధ్యలోని అష్టమానువాకంలో పెట్టారు. అందులో ఒకచోట ’నమశ్శంకరాయచ, మయస్కరాయచ..’ అంటుంది వేదం. శంకరాయచ అంటే తండ్రి. శంకరుడు ఈ లోకంలో తండ్రిరూపంలో తిరుగుతాడు. ఆ పరబ్రహ్మమే బ్రహ్మగా, విష్ణువుగా, శివుడుగా మూడు మూర్తులైనట్లు, అంటే.. మూడు మూర్తులు కలిసిన పరబ్రహ్మ–తండ్రిగా మన కంటిముందు తిరుగుతుంటాడు. ‘ఆ తండ్రికి చేసిన నమస్కారం పరబ్రహ్మానికి చేసిన నమస్కారమే’ అంది వేదం– అదే పితృదేవోభవ. -బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
మానవుడికి విశ్వంతో బంధం!
లాస్ఏంజెలిస్: మానవుడికి, విశ్వానికి మధ్య మనం ఊహించిన దాని కన్నా దగ్గరి సంబంధాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. మానవుడి కణ ద్రవ్య నిర్మాణం, పరమాణు నక్షత్రం (న్యూట్రాన్ స్టార్) సమానంగా ఉన్నాయని, ఈ రెండింటి మధ్య చాలా సారూప్యత ఉందని శాస్త్రవేత్తలు గుర్తించారు. కణాల్లో ఉండే ఎండోప్లాస్మిక్ రెటిక్యులంలో ఉన్న స్ప్రింగ్ మాదిరి కొన్ని నిర్మాణాలకు సంబంధించి అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాకు చెందిన శాస్త్రవేత్త శాంటా బార్బరా అధ్యయనం చేశారు. ఈ నిర్మాణాలకు ‘టెరసకి రాంప్స్’ అని పేరుపెట్టారు. పరమాణు నక్షత్ర పటలంలో కూడా ఇలాంటి నిర్మాణాలే ఉన్నట్లు పరమాణు భౌతికశాస్త్రవేత్త చార్లెస్ హోరోవిట్జ్ కనుగొన్నారు. పరమాణు నక్షత్రంలోని నాళికలు (స్పగెట్టీ), పత్రాలను (లసగ్నా) స్ప్రింగ్ మాదిరి నిర్మాణాలు కలిపి ఉంచుతున్నాయని, ఈ స్ప్రింగులు.. టెరసకి రాంప్స్ నిర్మాణాలతో సరిపోలుతున్నాయని గుర్తించారు. అయితే ఈ రెండింటి మధ్య వ్యత్యాసాలు ఉష్ణగతిక శాస్త్రంపై ఆధారపడి ఉంటాయని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా భౌతిక శాస్త్రవేత్త గ్రెగ్ హుబర్ పేర్కొన్నారు. కేంద్రకం, కణాంతర్గతంగా ఉన్న సాంద్రత, ఉష్ణోగ్రత, పీడనం వంటి అంశాలు ప్రభావితం చేస్తాయని పేర్కొన్నారు. -
విశ్వంలో భారీ పేలుళ్లపై చైనా పరిశోధన
బీజింగ్: విశ్వంలో జరిగిన భారీ పేలుళ్ల విషయం తేల్చేందుకు చైనా నడుం బిగించింది. దీనికి సంబంధించి ప్రస్తుతం భూస్థిర కక్ష్యలో ఉన్న తన రెండో అంతరిక్ష పరిశోధనశాల తియాంగాంగ్–2లో పరిశోధనలు చేస్తోంది. దీనికి సంబంధించి ఒక చతురస్రాకారపు పరికరాన్ని స్పేస్ ల్యాబ్‌లో ఉంచింది. ఇది గామా కిరణ పేలుళ్లను పరిశీలించడం ద్వారా విశ్వంలో శక్తివంతమైన పేలుళ్లను అంచనా వేస్తుంది. ఈ పరిశోధనకు అధికారికంగా పోలార్ అని పేరు పెట్టారు. ఈ విషయాన్ని ప్రభుత్వానికి చెందిన జిన్హూ వార్తాసంస్థ వెల్లడించింది. చైనా ప్రయోగించిన తియాంగాంగ్–2 అంతరిక్ష ప్రయోగశాలలో ప్రస్తుతం ఇద్దరు వ్యోమగాములు పనిచేస్తున్నారు. ప్రస్తుతం భూస్థిర కక్ష్యలో ఇది తిరుగుతోంది. ఈ పరిశోధన అంతరిక్ష విజ్ఞాన శాస్త్రంలో గామా కిరణాల పాత్రను తేటతెల్లం చేస్తుందని పోలార్ ప్రాజెక్టు ముఖ్య పరిశోధకుడు జాంగ్ షువాంగానా అన్నారు. తియాంగాంగ్–2 పైన చేపట్టిన ఈ పోలార్ ప్రాజెక్టు అంతర్జాతీయ సహకారంతో చేపట్టామని, ఇందులో యూనివర్సిటీ ఆఫ్ జెనీవా, స్విట్జర్లాండ్‌కు చెందిన పాల్ స్కెర్రర్ ఇన్స్టిట్యూట్, పోలాండ్‌కు చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ ఫిజిక్స్, భాగస్వాములుగా ఉన్నట్లు జాంగ్ తెలిపారు. -
విశ్వంలో ఎంత దూరం వెళ్లినా గురుత్వాకర్షణ శక్తి ఉంటుందా?
స్కూల్ ఎడ్యుకేషన్ * మన విశ్వంలో ‘ద్రవ్యరాశి’ (పదార్థం) గల ప్రతి వస్తువూ వేరే వస్తువుని ఆకర్షిస్తుంది. తన ఆకర్షణ శక్తితో ఆ రెండో వస్తువుని తన వైపుకి లాక్కొనే ప్రయత్నం చేస్తుంది. ఆ రెండు వస్తువుల ద్రవ్యరాశుల మధ్య పరస్పరం ఉండే ఆకర్షణ శక్తినే గురుత్వాకర్షణ శక్తి లేదా గురుత్వాకర్షణ బలం అని అంటారు. ఏవైనా రెండు వస్తువుల మధ్య ఉండే గురుత్వాకర్షణ శక్తి ప్రధానంగా రెండు అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఇందులో ఒకటి ఆ రెండు వస్తువులలోనూ ఉండే పదార్థ పరిమాణం కాగా రెండోది ఆ రెండు వస్తువుల కేంద్ర భాగాల మధ్య ఉండే దూరం. * వస్తువుల ద్రవ్యరాశి పెరిగితే వాటి మధ్య పనిచేసే గురుత్వాకర్షణ బలం కూడా పెరుగుతుంది. ఆ బలం రెండు వస్తువుల ద్రవ్యరాశుల లబ్ధానికి అనులోమానుపాతంలో ఉంటుంది. అంటే ఆ ద్రవ్యరాశుల లబ్ధం ఎంత ఎక్కువగా ఉంటే వాటి మధ్య పనిచేసే గురుత్వ బలం కూడా అంత ఎక్కువగా ఉంటుందన్న మాట. ఇది ఒక ముఖ్యమైన విషయం. * ఇక గురుత్వ బలానికి సంబంధించిన రెండో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. రెండు వస్తువుల కేంద్రకాల మధ్య ఉండే దూరం పెరిగే కొద్దీ ఆ రెండు వస్తువుల మధ్య పనిచేసే గురుత్వ బలం అదే స్థాయిలో తగ్గిపోతూ వస్తుంది. ఉదాహరణకు భూకేంద్రానికి -మనకు మధ్య ఉన్న దూరాన్ని రెండింతలు పెంచితే భూమికి - మనకు మధ్య పనిచేసే గురుత్వ బలం నాలుగో వంతుకి, పదింతలు పెంచితే 100వ వంతుకి పడిపోతోంది. ఇలా దూరం పెరిగి కొద్దీ గురుత్వ బలం క్రమేణా తగ్గిపోతుందే కాని ఎన్ని కోట్ల మైళ్ల దూరానికి పోయినా అది శూన్య స్థితికి మాత్రం చేరుకోదు. ఇదే సూత్రం విశ్వంలోని అన్ని ఖగోళాలకి వర్తిస్తుంది. -
అంతరిక్షం అంచుల్లో గెలాక్సీ
వాషింగ్టన్: విశ్వంలోని మరో అద్భుతాన్ని ఖగోళ శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు. ఇప్పటి వరకు మానవుడు కనుగొన్న గెలాక్సీలకన్నా అత్యంత దూరమైన నక్షత మండలాన్ని కనిపెట్టారు. 1,340 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఈ పాలపుంత.. విశ్వం ఏర్పడిన తొలినాళ్లలో అంటే దాదాపు 40 కోట్ల సంవత్సరాల తర్వాత ఏర్పడి ఉంటుందని భావిస్తున్నారు. జీఎన్-జడ్11 అనే ఈ గెలాక్సీ.. ఉర్సా మేజర్ నక్షత్ర మండలం దిశలో ఉందని శాస్త్రవేత్తలు గుర్తించారు. నాసాకు చెందిన హబుల్ స్పేస్ టెలిస్కోప్ సాయంతో కొత్త గెలాక్సీని చూశాం’ అని యేల్ యూనివర్సిటీకి చెందిన పాస్కల్ అనే ప్రధాన పరిశోధకుడు తెలిపారు. ఈ పాలపుంత దూరాన్ని హబుల్ టెలిస్కోప్‌లోని వైడ్ ఫీల్డ్ కెమెరా 3ని పరిశోధకులు తొలిసారిగా ఉపయోగించారు. -
వాళ్లు దేవుణ్ణి నమ్మడం లేదు..!
విత్తు ముందా? చెట్టు ముందా అన్నట్లుగానే ఆస్తిక వాదం, నాస్తిక వాదం మధ్య శతాబ్దాల తర్కం నడుస్తూనే ఉంది. విశ్వం పుట్టుకకు దేవుడు కారణమా? బిగ్ బ్యాంగ్ థియరీ నిజమా? అన్నదానిపై ఎవరికి తోచిన వివరణ వారిస్తూనే ఉన్నారు. అయితే ఇదే విషయంపై యూరప్ ఐస్లాండ్ లో తాజాగా ఓ పోల్ నిర్వహించారు. నిజంగా ప్రపంచం పుట్టుక ఎలా జరిగిందో తెలుసుకునే ప్రయత్నం మరోసారి చేశారు. ఐస్లాండ్ లోని ఎథికల్ హ్యూమనిస్ట్ అసోసియేషన్ విశ్వం పుట్టుకపై సర్వే నిర్వహించింది. ప్రపంచం ఎక్కడ ప్రారంభమైందో, ఎలా ప్రారంభమైందో తెలుసుకునేందుకు ప్రశ్నల ద్వారా పలువురి అభిప్రాయాలను సేకరించింది. ఇందులో 25 సంవత్సరాల వయసులోపు 93.9 శాతం మంది విశ్వం పుట్టుకకు బిగ్ బ్యాంగే కారణమని చెప్పగా... మిగిలిన ఆరు శాతం మంది తమకు తెలియదన్నారు. కాగా విశ్వం దేవుడి వల్లే పుట్టిందని మాత్రం ఏ ఒక్కరూ చెప్పలేదు. దీని ఆధారంగా స్థానిక రెక్జావిక్ వాసులు, యువత ఏ మతాన్నీ, దేవుణ్ణీ నమ్మడం లేదని తెలుస్తోందని ఐస్లాండ్ పత్రిక నివేదికలు చెప్తున్నాయి. ఇక్కడి వారిలో 80.6 శాతం మందిలో అదీ 55 ఏళ్ళకు పైబడిన వారు అంతా క్రైస్తవులే ఉన్నారు. 11.8 శాతం మాత్రం నాస్తికులుగా చెప్పాలి. కాగా 25 సంవత్సరాలు... అంతకంటే చిన్న వ్యక్తుల్లో 40.5 శాతం మంది నాస్తికులు కాగా మిగిలిన 42 శాతంమంది క్రైస్తవులని తేలింది. అయితే ఇదే పోల్ పై పలు విమర్శలు కూడ వెల్లువెత్తాయి. ఓ రెడ్డిట్ యూజర్ (ఇంటర్నెట్ మొదటి పేజీ) ఈ పోల్ తప్పుదారి పట్టించే విధంగా ఉందని ఆరోపించారు. అసోసియేషన్ నిర్వహించిన సర్వే గందరగోళంగా ఉందని, అడిగిన ప్రశ్నల్లో క్లారిటీ లేదని అన్నారు. విశ్వం పుట్టుక గురించి మీరేమనుకుంటున్నారు? అన్న ప్రశ్నకు... బిగ్ బ్యాంగ్ నుంచి వచ్చింది, దేవుడు సృష్టించాడు, తెలియదు, ఇతరాలు అన్న ఆప్షన్లు ఇవ్వడంలో అర్థం లేదన్నారు. చాలామంది దేవుడే బిగ్ బ్యాంగ్ కూ కారణమని నమ్ముతారని, ఇతరములు అన్న సమాధానంలో వీటిలో ఏదీ కాక దేవుడే బిగ్ బ్యాంగ్ ద్వారా ప్రపంచాన్ని సృష్టించాడన్న అర్థం కూడా వస్తుందని అన్నారు. మరికొంతమంది యూజర్లు.. బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం మొదట కాథలిక్ ప్రీస్ట్, భౌతిక శాస్త్రవేత్త జార్జిస్ లెమైట్రే నుంచి పుట్టిందన్నది వాస్తవమన్నారు. ఇలా ఎవరికి తోచిన వాదం వారు చేయగా.. అసలు విశ్వ పుట్టుక విషయం పక్కన పెడితే శాస్త్రీయ సిద్ధాంతాలకూ, దేవుడికీ పోలిక కుదరదని ముందు అది తెలుసుకోవాల్సిన అవసరం ఉందని పోప్ ఫ్రాన్సిస్ అన్నారు. -
ఇది కావాలనే చేశారు..!
మిస్ యూనివర్స్ గందరగోళం ఇంకా సర్దుమణగలేదు. గత ఆదివారం వెల్లడించిన మిస్ యూనివర్స్ పోటీ విజేతల ప్రకటనలో తప్పు దొర్లడం పెద్ద దుమారమే రేపింది. కార్యక్రమం నిర్వాహకుడు స్టీవ్ హార్వే విజేతల పేర్లు మార్చి ప్రకటించడం వెంటనే మళ్ళీ పేరు మార్చి సారీ చెప్పడం కొలంబియా ప్రజలకు ఆగ్రహం తెప్పించింది. ఇది కావాలనే చేశారని మండిపడుతున్నారు. 2015 మిస్ యూనివర్స్ కిరీటాన్ని ఫిలిప్పైన్స్ కు చెందిన పియా అలోంజ్ దక్కించుకుంది. గత సంవత్సరం విజేత... కొలంబియా సుందరి పౌలినా వెగాపియా.. అలోంజ్ కు కిరీటం అలంకరించారు. అయితే రెండవస్థానంలో నిలిచిన కొలంబియా సుందరి అరియాడ్నా మాత్రం మొదట తానే విజేత అని చెప్పి... తిరిగి మాట మార్చారని ఎంతో అసహనం వ్యక్తం చేస్తోంది. దీని వెనుక నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయని ఆరోపిస్తోంది. మరోవైపు ఇదే విషయంపై తాజాగా మిస్ జర్మనీ సారా లోరైన్ రెక్ కూడ విమర్శలు గుప్పించింది. ఓ వీడియో ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మిస్ యూనివర్స్ ఫలితాలు... పోటీల్లో పాల్గొన్న వారెవరికీ సక్రమంగా అనిపించలేదని చెప్పింది. మిస్ ఫిలిప్పైన్స్ విజేత కావాలని తామెవ్వరూ కోరుకోలేదని అంది. ఫేస్ బుక్ లో పోస్ట్ చేసిన ఓ వీడియోలో మిస్ జర్మనీ లోరైన్ రెక్.. '' నేను నిజంగా ఇది నమ్మలేకపోయాను. ఎంతో బాధపడ్డాను. చెప్పాలంటే.. మిస్ ఫ్రాన్స్ రియల్ విన్నర్'' అంటూ తన అభిప్రాయాన్ని వెల్లడించింది. మిస్ యూనివర్స్ పోటీల్లోని చివరి దశలో అమెరికా, ఫిలిప్పైన్స్, కొలంబియా దేశాల యువతులు నిలిచారు. అయితే మిస్ ఫిలిప్పైన్స్ మిస్ యూనివర్స్ కిరీటాన్ని దక్కించుకోగా... నిర్వాహకుడు పొరపాటున మిస్ కొలంబియాను ప్రకటించడం సర్వత్రా విమర్శలు చోటు చేసుకున్నాయి. పొరపాటును గమనించిన క్షణాల్లోనే తిరిగి మిస్ ఫిలిప్పైన్స్ ను విజేతగా ప్రకటించారు. దీంతో ఎలాగైతేనేం తమకు న్యాయం జరిగిందని ఫిలిప్పైన్స్ ప్రజలు సంతోషపడుతుంటే.. కొలంబియన్లు మాత్రం దీన్ని తీవ్ర తప్పిదంగా భావిస్తున్నారు. దీనికి తోడు ఇతర పోటీ దారులు కూడ తమ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. -
మరో మూడు ప్రపంచాలు..!
ఈ విశాల విశ్వంలో భూమి ఒంటరి అని ఒకప్పుడు అనుకునే వారు. ఇరవై ఏళ్ల కిందట ‘51 పెగసీ బీ’ని గుర్తించడంతో ఖగోళశాస్త్రంలో ఓ సంచలనం నమోదైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు సౌరకుటుంబానికి అవల దాదాపు 1800 గ్రహాలను గుర్తించారు. వజ్రాల రాశులు పోసి ఉన్న గ్రహాలు కొన్నైతే... ఆమ్లవర్షాలతో తడిసి ముద్దయ్యేవి మరికొన్ని. మరి ఇన్ని వందల గ్రహాల్లో భూమిని పోలినవి ఎన్ని? సూర్యుడి నుంచి ఉండే దూరం, గ్రహంపై ఉష్ణోగ్రత తదితర అంశాలనుబట్టి ఆ గ్రహం హ్యాబిటబుల్ జోన్లో ఉందా? అన్నది లెక్కకడతారు. ఈ లెక్కన భూమిని పోలిన గ్రహాలు మూడింటి వింతలేమిటో చూడండి మరి! గ్లీసీ 667 సీసీ... దాదాపు 22 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. భూమి కంటే 4.5 రెట్లు బరువైంది. ఇక్కడ ఒక ఏడాదికి కేవలం 28 రోజులే. సూర్యుడి కంటే తక్కువ ఉష్ణోగ్రత ఉండే నక్షత్రం చుట్టూ తిరుగుతూంటుంది. అయితే ఈ నక్షత్రం నుంచి వెలువడే మంటలకు దగ్గరగా గ్రహం వస్తూంటుంది కాబట్టి ఇదంత ఆవాసయోగ్యమైంది కాదని అంచనా. కెప్లెర్ 22బీ... భూమి కంటే దాదాపు 2.4 రెట్లు ఎక్కువ సైజున్న గ్రహం ఇది. 600 కాంతి సంవత్సరాల దూరంలో ఆవాసయోగ్యమైన ప్రాంతంలోనే తన నక్షత్రం చుట్టూ తిరుగుతూంటుంది. సూర్యుడి లాంటి ఈ నక్షత్రం చుట్టూ ఒకసారి తిరిగేందుకు 290 రోజులు పడుతుంది. కెప్లెర్ 452 బీ... భూమితో చాలా దగ్గరి పోలికలున్న గ్రహం ఇది. మూడు నాలుగు నెలల క్రితమే దీని గురించి ప్రపంచానికి తెలిసింది. భూమికి 1400 కాంతి సంవత్సరాల దూరంలో సూర్యుడి లాంటి నక్షత్రం చుట్టూ తిరుగుతూ ఉంటుంది ఈ గ్రహం. -
‘గురు’డి చెల్లి... మనకు మరో తల్లి?
విశ్వంలో భూమి మీదే జీవం ఎందుకు ఉంది? భూగోళమే జీవులకు ఎందుకు అనుకూలం? ఇక్కడ మాత్రమే అనుకూల వాతావరణం ఉంది కాబట్టి. అంతకంటే ముఖ్యంగా బలమైన అయస్కాంత క్షేత్రం ఉంది కాబట్టి! అయితే.. ఈ అనంత విశ్వంలో మనం ఒంటరివారమేనా? ఏమో.. భూమిలాగే ఎక్కడో ఓ గ్రహం పచ్చగా కళకళలాడుతూ ఉండవచ్చు! అందుకే.. శతాబ్దాల తరబడి అన్వేషణ సాగుతోంది.ప్రస్తుతానికైతే చంద్రుడు, అంగారకుడిపై కాలనీల గురించే ప్రయత్నాలన్నీ. కానీ.. గురుగ్రహం జాబిల్లి ‘గ్యానిమీడ్’ కూడా మనకు మరో భూమి కాగలదంటున్నారు శాస్త్రవేత్తలు!గురుగ్రహం చందమామ గ్యానిమీడ్ ఉపరితలం కింద మహా సముద్రం! చుట్టూ కొంత బలమైన అయస్కాంత క్షేత్రం! ఈ విషయాలను గతంలోనే అంచనా వేసినా.. తాజాగా కచ్చితమైన ఆధారాలు దొరికాయి. మంచుతో నిండి ఉన్న గ్యానిమీడ్ ఉపరితలం కింద భారీ సముద్రం ఉన్నట్లు హబుల్ అంతరిక్ష టెలిస్కోపు అందించిన సమాచారంతో ఖగోళ శాస్త్రవేత్తలు నిర్ధారించారు. దీని చుట్టూ అయస్కాంత క్షేత్రం కూడా ఆవరించి ఉన్నట్లు ఇటీవల ధ్రువీకరించారు. దీంతో భవిష్యత్తులో గ్యానిమీడ్ను మరో భూమిగా మార్చుకోవచ్చని భావిస్తున్నారు. ఎందుకంటే.. మన సౌరకుటుంబంలో అయస్కాంత క్షేత్రం ఉన్న ఏకైక చందమామ ఇదే మరి. ఉపరితలం కింద నీరు కూడా పుష్కలంగా ఉంది కాబట్టి.. మానవ ఆవాసానికి ఉపయోగపడే అవకాశాలున్నాయని చెబుతున్నారు. వందల కోట్లు కాకపోయినా.. కోట్లాది మంది అయినా నివసించవచ్చని చెబుతున్నారు. ఒకే గ్రహం.. రెండు అయస్కాంత క్షేత్రాలు! భూమిపై ఉత్తర, దక్షిణ ధ్రువాల వద్ద ఆకాశంలో రంగురంగుల ధ్రువ కాంతులు (ఆరోరా) ఏర్పడుతున్నట్లే.. గ్యానిమీడ్ చుట్టూ కూడా ధ్రువ కాంతులు నాట్యం చేస్తున్నాయి. అంతరిక్షం నుంచి విద్యుదావేశ కణాలు వాతావరణంలోకి ప్రవేశించినప్పుడు జరిగే మార్పుల వల్ల ధ్రువకాంతులు ఏర్పడుతుంటాయి. ఇవి ఏర్పడటం వెనక అయస్కాంత క్షేత్ర ప్రభావమే ప్రధాన కారణం. అదేవిధంగా గ్యానిమీడ్కు విచిత్రంగా రెండు అయస్కాంత క్షేత్రాలు ఉన్నాయి! ఒకటి సొంత క్షేత్రం కాగా, మరోటి గురుగ్రహ క్షేత్రం. అంటే.. గ్యానిమీడ్, జూపిటర్ అయస్కాంత క్షేత్రాలు పరస్పరం కలిసిపోతూ ఉంటాయి. దీనివల్ల గ్యానిమీడ్ ధ్రువకాంతులు కూడా వెనక్కి, ముందుకు కదులుతూ నాట్యం చేసినట్లు కనిపిస్తాయి. గ్యానిమీడ్ ఉపరితలం కింద ఉన్న భారీ సముద్రం వంద కిలోమీటర్ల మందంతో, ఒక లీటరుకు 5 గ్రాముల ఉప్పుతో ఉండవచ్చని అంచనా. నీరు అనేది జీవుల మనుగడకు ప్రాథమిక వనరు కాబట్టి.. దీనిపై నీరు ఉందన్న విషయం ఖగోళ శాస్త్రవేత్తల్లో కొత్త ఆశలను రేకెత్తిస్తోంది. ఇవీ సాధ్యాసాధ్యాలు... చంద్రుడు, అంగారకుడిపై కాలనీల నిర్మాణానికి ప్రయత్నాలు జరుగుతున్నా.. అక్కడ మనిషి స్థిరపడేందుకు వందల ఏళ్లు పట్టవచ్చు. అయినా ఎల్లప్పుడూ అంతరిక్షం నుంచి ఉల్కలు, రేడియేషన్ల ముప్పు ఎక్కువే. కానీ గ్యానిమీడ్కు కాస్త బలమైన అయస్కాంత క్షేత్రం, సముద్రం ఉండటం వల్ల ఇక్కడ ఆవాసం సులభం కానుంది. రెండు అయస్కాంత క్షేత్రాల నుంచి రక్షణ లభిస్తుండటం కూడా అనుకూలాంశమే. అయితే, గ్యానిమీడ్పై ఖనిజ వనరులు పెద్దగా లేవు. అయినా, గురుగ్రహానికి చెందిన ఇతర ఉపగ్రహాల నుంచి ఖనిజాలను దీనిపైకి తరలించడం చాలా సులభం. జూపిటర్ అయస్కాంత క్షేత్ర ప్రభావం వల్ల ఇక్కడ అంతరిక్ష ప్రయాణం ఎంతో ఈజీ. ఇంధన అవసరం లేకుండా మ్యాగ్నెటిక్ స్పేస్షిప్లలోనూ ప్రయాణించవచ్చు. షీల్డులతో కూడిన బయోస్పియర్లను ఏర్పాటు చేసుకుంటే పంటలు కూడా పండించుకోవచ్చని చెబుతున్నారు. మరిన్ని చందమామల్లోనూ.. సముద్రాలు! జూపిటర్ మూన్స్ యూరోపా, కాలిస్టో, శని చందమామలు ఎన్సెలడస్, టైటాన్, మిమాస్, నెప్ట్యూన్ మూన్ ట్రైటాన్ల ఉపరితలం కిందా సముద్రాలున్నాయి. ఎన్సెలడస్ సముద్రంలో వేడినీటి ప్రవాహాలున్నాయని, వాటిలో సూక్ష్మజీవులు ఉండవచ్చనీ అంచనా. అలాగే మరుగుజ్జు గ్రహాలు ప్లూటో, సిరీజ్ల ఉపరితలం కిందా సముద్రాలున్నాయి. ఇవన్నీ ఆవాసానికి అనుకూలం కాకపోయినా.. వీటిని అంతరిక్ష యాత్రల్లో వ్యోమగాములు మజిలీలుగా ఉపయోగించుకుని, ఇక్కడి నీటితో హైడ్రోజన్, ఆక్సిజన్లను తయారు చేసుకునేందుకైనా వీలు కావచ్చని భావిస్తున్నారు. 2022లో బయలుదేరనున్న ‘జ్యూస్’ ఆర్బిటర్ గ్యానిమీడ్ను సమగ్రంగా అధ్యయనం చేసేందుకు ఐరోపా అంతరిక్ష సంస్థ ఈసా 2022లో ‘జ్యూస్(జుపిటర్ ఐసీ మూన్ ఎక్స్‌ప్లోరర్)’ ఉపగ్రహాన్ని ప్రయోగించనుంది. ఇది 2030 నాటికి గ్యానిమీడ్ను చేరి, దాని అయస్కాంత క్షేత్రాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేయనుంది. రాడార్ పరికరాలతో మంచు ఉపరితలాన్ని, సముద్రాన్ని, గురుత్వాకర్షణ శక్తిని అధ్యయనం చేసి సమాచారాన్ని భూమికి పంపనుంది. ఈ మొత్తం ప్రాజెక్టుకు సుమారు రూ. 930 కోట్లు వ్యయం కానుందని అంచనా. ఇవీ విశేషాలు... ⇒ గెలీలియో 1610లో కనుగొన్నారు. ⇒ వైశాల్యం 5,300 కిలోమీటర్లు (భూమి సైజులో 0.0704 వంతు) ⇒ చంద్రుడి కంటే 2 రెట్లు బరువు ఎక్కువ ⇒ వాతావరణంలో ఆక్సిజన్, ఓజోన్ కూడా ఉండవచ్చు. ⇒ గెలీలియో కనుగొన్న నాలుగు జూపిటర్ మూన్స్‌లో ఒకటి. ⇒ ఇంతకుముందు వోయేజర్, గెలీలియో వ్యోమనౌకలు అధ్యయనం చేశాయి. ⇒ అయస్కాంత క్షేత్రం ఉన్న ఏకైక చందమామ. ⇒ గురుగ్రహం చుట్టూ ఏడు రోజులకోసారి తిరుగుతుంది. ⇒ అతిపెద్ద గ్రహమైన జూపిటర్కు 67 చందమామలుండగా, ఇదే అతిపెద్దది. ⇒ సౌరకుటుంబంలోని అన్ని చందమామల్లోనూ ఇదే పెద్దది. ⇒ భూమి నుంచి గ్యానిమీడ్ను చేరేందుకు ఎనిమిదేళ్లు పడుతుంది. - హన్మిరెడ్డి యెద్దుల -
కృష్ణ పదార్థం అన్వేషణలో ముందడుగు
లండన్: విశ్వంలో మిస్టరీగా ఉన్న కృష్ణపదార్థం జాడను కనుగొనేందుకు యూనివర్సిటీ ఆఫ్ సౌత్ఆంప్టన్ శాస్త్రవేత్తలు ఒక కొత్త సూక్ష్మకణాన్ని ప్రతిపాదించారు. కృష్ణపదార్థం ఉనికిని ఈ ప్రాథమిక చీకటి కణంతో కనిపెట్టవచ్చని పేర్కొన్నారు. నక్షత్రాలు, పాలపుంతలపై ఏర్పడే గురుత్వాకర్షణ బలానికి ఈ చీకటి పదార్థమే కారణమని శాస్త్రవేత్తల భావన. ఆధారాలు, ప్రయోగాత్మక విధానాల లేమితో ఎవరూ దీన్ని అధ్యయనం చేయలేకున్నారని వివరించారు. ఇతర భార అణువులు, ప్రాథ మిక కణాల కంటే కృష్ణపదార్థం కణాలు ఎక్కువ ద్రవ్యరాశిని కలిగి ఉంటాయని శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు. ఈ కణం ఎలక్ట్రాన్ కంటే తక్కువ ద్రవ్యరాశిని కలిగి ఉండి, కాంతితో సంఘర్షణ జరపనందున కృష్ణపదార్థం కనుగొనేందుకు ఉపకరిస్తుందని వారు అభిప్రాయపడుతున్నారు. మాక్రోస్కోపిక్ క్వాంటమ్ రెసోనేటర్స్ కన్సార్టియమ్ ఆధ్వర్యంలో కృష్ణపదార్థం జాడ కనుగొనేందుకు శాస్త్రవేత్తలు అంతరిక్ష ప్రయోగాన్ని చేయనున్నారు. ప్రతిపాదిత సూక్ష్మ కణాన్ని కృష్ణపదార్థం గుండా పంపించి దాని మార్గాన్ని పర్యవేక్షించి ఆ కణం స్థానాన్ని అంచనావేసి ఉనికిని కనుగొంటామన్నారు. -
విశ్వంలో భూములు ఎన్ని?
పున్నమి వెన్నెల్లో, ఆరుబయట నింగికేసి చూస్తే... మిణుకు మిణుకుమంటూ కోటానుకోట్ల నక్షత్రాలు! ఓహ్... ఎంత అందమైన దృశ్యమది! మరి... ఆ నక్షత్రాలన్నింటి చుట్టూ మన సూర్యుడికి మల్లే గ్రహాలున్నాయా? ఒకవేళ ఉంటే.. వాటిల్లో మన భూమిని పోలినవి ఎన్ని? చిక్కు ప్రశ్నలేగానీ... శాస్త్రవేత్తలు ఇప్పుడిప్పుడే వీటికి సమాధానాలు తెలుసుకుంటున్నారు. ఈ విశాల విశ్వంలో మనిషి, భూమి ఒంటరేనా? అన్న ప్రశ్న, సందేహం ఈనాటివి కాదు. యుగాలుగా అటు తత్వవేత్తలను, ఇటీవలి కాలంలో శాస్త్రవేత్తలను ఆలోచనల్లోకి పడేసినవే. కాకపోతే సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న కొద్దీ అపోహలు తొలగిపోతున్నాయి. కొత్తకొత్త విషయాలు తెలుస్తున్నాయి. నిన్నమొన్నటివరకూ సౌరకుటుంబానికి ఆవల అసలు గ్రహాలే లేవన్న భావన నుంచి సుదూర ప్రాంతాల్లో, ఖగోళపు అంచుల్లోనూ గ్రహ వ్యవస్థలు ఉన్నట్లు రూఢి అవుతున్న కాలమిది. ఈ నేపథ్యంలో కొన్నేళ్ల క్రితం అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ఈ ఎక్సోప్లానెట్ల (సౌరకుటుంబానికి ఆవల ఉన్న గ్రహాలు) అన్వేషణే ప్రథమ లక్ష్యంగా కెప్లర్ పేరుతో ఓ అంతరిక్ష వేధశాల (అబ్జర్వేటరీ)ను ప్రయోగించింది. ఆకాశంలోని అతిచిన్న ప్రాంతంపై కన్నేసిన ఈ దుర్భిణి ఆశ్చర్యకరమైన ఫలితాలు అందించింది.. ఇంతకూ గ్రహాన్నెలా గుర్తిస్తారు? గ్రహాల్లో అత్యధికం ప్రకాశవంతమైన నక్షత్రాల చుట్టూ తిరుగుతూంటాయని మనకు తెలుసు. ఈ క్రమంలో గ్రహం నక్షత్ర కాంతిని కొంతమేరకు అడ్డుకంటుంది. కాంతిలో వచ్చే ఈ అతిచిన్న మార్పును లెక్కించడం ద్వారా ఆయా నక్షత్రాల చుట్టూ తిరిగే గ్రహాల సైజు, ఆకారం వంటివాటిని తెలుసుకోవచ్చు. కెప్లెర్ చూసిందెంత? 2009 మార్చి ఏడవ తేదీని ప్రయోగించిన కెప్లెర్ వేధశాల సిగ్నస్ నక్షత్ర మండలం సమీపంలోని చిన్న ప్రాంతంపై తన దష్టిని కేంద్రీకరించింది. నాలుగేళ్ల సమయంలో దాదాపు 1,50,000 నక్షత్రాలు, వాటి పరిసరాలను పరిశీలించడం ద్వారా కెప్లెర్ కొన్ని వేల గ్రహాలను గుర్తించింది. భారీ సైజున్న గ్రహాల్లో జీవం ఉండే అవకాశం లేదు. కాబట్టి గురు, శని గ్రహాల సైజులో అంటే... భూమి కంటే రెండు లేదా అంతకంటే ఎక్కువ రెట్లు సైజున్న గ్రహాలను తొలగిస్తే మిగిలినవి...3558 అనువైన ప్రాంతంలో ఉన్నవెన్ని? భూమి సైజులో ఉన్న గ్రహాలన్నింటిలో జీవం ఉంటుందా? ఊహూ అవకాశం లేదు. జీవం ఏర్పడేందుకు, వద్ధి చెందేందుకు అనుకూలమైన పరిస్థితులు కూడా ఉండాలి. మాత నక్షత్రానికి దగ్గరగా ఉంటే వేడి వాతావరణం ఎక్కువగా ఉంటుంది. మరీ దూరంగా ఉంటే గడ్డకట్టుకుపోయే చలీ ఉండవచ్చు. కాబట్టి నక్షత్రం నుంచి ‘తగినంత’ దూరంలో ఉన్న గ్రహాల్లోనే జీవం ఏర్పడేందుకు అవకాశాలుంటాయి. కెప్లెర్ గుర్తించిన గ్రహాల్లో ఈ అనుకూల ప్రాంతంలో ఉన్న వాటి సంఖ్య.... 1696 భూమి లాంటివి ఉన్నాయా? జీవం ఉండేందుకు అవకాశమున్న 1696 గ్రహాలను కెప్లెర్ గుర్తించింది కానీ... ఇది కూడా పూర్తిస్థాయి అంచనా కాదు. ఎందుకంటే కెప్లెర్కూ కొన్ని పరిమితులున్నాయి. టెలిస్కోపు చూడగలిగే ప్రాంతంలో నక్షత్రం ముందు నుంచి ప్రయాణించే గ్రహాలను మాత్రమే ఇది చూడగలదు. గ్రహాల కక్ష్యామార్గంలో చిన్నపాటి తేడా ఉన్నా టెలిస్కోపు కంటికి అవి అందకపోవచ్చు. నక్షత్రం దూరం పెరిగే కొద్దీ ఇలాంటి గ్రహాలు ఉండే అవకాశాలు కూడా పెరుగుతాయి. ఇలా సంకేతాలు అందని గ్రహాలనూ పరిగణలోకి తీసుకుంటే కెప్లెర్ దష్టిపెట్టిన ప్రాంతంలో మాత్రమే ఉండే భూమిలాంటి గ్రహాల సంఖ్య...22,500 పాలపుంత మొత్తాన్ని చూస్తే... కెప్లెర్ ఆకాశంలో కేవలం 0.28 శాతం ప్రాంతాన్ని మాత్రమే పరిశీలించింది. దాదాపు మూడువేల కాంతి సంవత్సరాల దూరం వరకూ తొంగిచూసి అందించిన సమాచారాన్ని మిగిలిన ఆకాశానికి కూడా వర్తింపజేస్తే... లెక్కకు మించిన నక్షత్రాల చుట్టూ కోటానుకోట్ల భూమిలాంటి గ్రహాలు కోటానుకోట్లు ఉంటాయి. ఒక అంచనా ప్రకారం ఈ సంఖ్య...1500 - 3000 కోట్లు! ఇష్టమైందే చూడండి...! ఫేస్బుక్ ఓపెన్ చేయగానే వచ్చే న్యూస్‌ఫీడ్‌ను మీరెప్పుడైనా గమనించారా? ఏళ్ల క్రితం నాటి పోస్టింగ్స్ కూడా పేజీపైభాగంలో కనిపిస్తూంటాయి. తాజా పోస్ట్లనుకుని వాటికి మనం లైకులు కొట్టడం.. మనల్ని చూసి ఇంకొందరు అదేదారి పట్టడం తరచూ జరిగే విషయమే. అంతేకాకుండా మీ ప్రమేయం లేకుండానే కొన్నిసార్లు కొన్ని పేజీలు ప్రత్యక్షమవుతూ చికాకు పెడుతూంటాయి కూడా. ఇలాంటి చిక్కుల్లేకుండా మీకు ఇష్టమైన మిత్రుల పోస్ట్‌లు మాత్రమే చూడాలనుకుంటున్నారా? ఎప్పుడో మీరు అన్‌ఫాలో చేసిన మిత్రులతో మళ్లీ సంబంధాలు నెరపాలని అనుకుంటున్నారా? అయితే ఫేస్బుక్ మరోసారి ఈ అవకాశమిస్తోంది. ఇంకెందుకు ఆలస్యం... వెంటనే ఎలా, ఏమిటి? అన్నది చూసేయండి మరి. చాలా సింపుల్. ఫేస్బుక్ హోంపేజీలో ఎడమవైపున ఉన్న మెనూలో ఆప్స్ ఆప్షన్‌ను డబుల్ క్లిక్ చేయండి. న్యూస్‌ఫీడ్, ఈవెంట్స్ వంటి ఫీచర్ల తాలూకూ సెట్టింగ్స్‌తో కూడిన విండో ప్రత్యక్షమవుతుంది. దీంట్లో న్యూస్‌ఫీడ్ సెట్టింగ్స్‌ను క్లిక్ చేస్తే మీకు అప్పటివరకూ కనిపించే మిత్రుల జాబితా, ఫాలో అవుతున్న పేజీల వివరాలన్నీ కనిపిస్తాయి. మీకు నచ్చిన దాన్ని ఉంచుకోండి. మిగిలిన వాటిని తొలగించుకోండి. ఫేస్బుక్ ఫ్రెష్‌గా మారిపోతుంది. ఫేస్బుక్లో ఏరోజైనా ఒక్కో వ్యక్తి న్యూస్‌ఫీడ్‌లో దాదాపు 1500 పోస్టులు ప్రత్యక్షమవుతూంటాయని అంచనా. అయితే వీటిల్లో చాలామంది 150 పోస్టులకు మించి చూడరు. మీ బ్రౌజింగ్ తీరుతెన్నులను పరిగణనలోకి తీసుకుని ఫేస్బుక్ అల్గారిథమ్స్ మీకు ఏ రకమైన పోస్ట్‌లు పోస్ట్ చేయాలో నిర్ణయిస్తూంటుంది. అయితే మన మూడ్ ఎప్పుడూ ఒకేలా ఉంటుందా? అస్సలు ఉండదు. అందుకే అప్పుడప్పుడైనా ఈ న్యూస్‌ఫీడ్ సెట్టింగ్స్‌ను వాడుకుని మీ ఫ్రెండ్స్, లైక్స్ పేజీల లిస్ట్‌ను రిఫ్రెష్ చేసుకోవడం మేలు. ఇంకో విషయం... న్యూస్‌ఫీడ్‌ను మరింత సౌకర్యవంతంగా మార్చుకునేందుకు ఇలాంటి మరిన్ని ఫీచర్లను ప్రవేశపెడతామని ఫేస్బుక్ చెబుతోంది. చూస్తూనే ఉండండి మరి! -
ఐన్‌స్టీన్ సిద్ధాంతానికి కృష్ణబిలాల ఆధారం
విశ్వంలో గురుత్వాకర్షణ శక్తి తరంగాలు విడుదలవుతుంటాయని సాపేక్ష సిద్ధాంతంలో ప్రఖ్యాత శాస్త్రవేత్త అల్బర్ట్ ఐన్‌స్టీన్ చేసిన ప్రతిపాదనకు బలం చేకూర్చే ఆధారాలను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. కాంతితో సహా విశ్వంలోని అన్ని రకాల పదార్థాలనూ హాంఫట్ చేసేసే కృష్ణబిలాలు సాధారణంగా అన్ని గెలాక్సీల కేంద్రాల్లోనూ ఉన్నా.. చాలావరకూ ఒక భారీ కృష్ణబిలం(సూపర్ మ్యాసివ్ బ్లాక్‌హోల్) మాత్రమే ఉంటుందని ఇదివరకూ గుర్తించారు. కానీ.. 400 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలోని ఓ గెలాక్సీ కేంద్రంలో మూడు భారీ కృష్ణబిలాలు అతిదగ్గరగా పరస్పరం బంధించబడి ఉన్నాయని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ కేప్‌టౌన్ శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడైంది. ఈ కృష్ణబిలాలు మన సూర్యుడి కన్నా.. 10 లక్షల నుంచి 1,000 కోట్ల రె ట్ల ద్రవ్యరాశితో ఉండవచ్చట. వీటిలో రెండు కృష్ణబిలాలు చాలా దగ్గరగా 500 కాంతి సంవత్సరాల దూరంలోనే ఉండటమే కాకుండా, అవి ఒకదాని చుట్టూ ఒకటి ధ్వనివేగానికి 300 రెట్ల వేగంతో తిరుగుతున్నాయట. అందువల్ల వీటి నుంచి వెలువడుతున్న గురుత్వాకర్షణ శక్తి అలల మాదిరిగా అంతరిక్షంలోకి విడుదలవుతోందట. అలాగే దూరంగా ఉండటం వల్ల మరో బ్లాక్‌హోల్ నుంచి సరళరేఖ మాదిరిగా శక్తి తరంగాలు వెలువడుతున్నాయట. ఐన్‌స్టీన్ ఊహించిన గురుత్వాకర్షణ తరంగాల అన్వేషణకు ఈ కృష్ణబిలాలపై అధ్యయనం బాగా దోహదపడుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.