అంతరిక్షం అంచుల్లో గెలాక్సీ | Astronomers spot glimmer of a galaxy that dates back to universe's infancy | Sakshi
Sakshi News home page

అంతరిక్షం అంచుల్లో గెలాక్సీ

Published Sat, Mar 5 2016 4:19 AM | Last Updated on Sun, Sep 3 2017 7:00 PM

అంతరిక్షం అంచుల్లో గెలాక్సీ

అంతరిక్షం అంచుల్లో గెలాక్సీ

వాషింగ్టన్: విశ్వంలోని మరో అద్భుతాన్ని ఖగోళ శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు. ఇప్పటి వరకు మానవుడు కనుగొన్న గెలాక్సీలకన్నా అత్యంత దూరమైన నక్షత మండలాన్ని కనిపెట్టారు. 1,340 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఈ పాలపుంత.. విశ్వం ఏర్పడిన తొలినాళ్లలో అంటే దాదాపు 40 కోట్ల సంవత్సరాల తర్వాత ఏర్పడి ఉంటుందని భావిస్తున్నారు. జీఎన్-జడ్11 అనే ఈ గెలాక్సీ.. ఉర్సా మేజర్ నక్షత్ర మండలం దిశలో ఉందని శాస్త్రవేత్తలు గుర్తించారు. నాసాకు చెందిన హబుల్ స్పేస్ టెలిస్కోప్ సాయంతో కొత్త గెలాక్సీని చూశాం’ అని యేల్ యూనివర్సిటీకి చెందిన పాస్కల్ అనే ప్రధాన పరిశోధకుడు తెలిపారు. ఈ పాలపుంత దూరాన్ని హబుల్ టెలిస్కోప్‌లోని వైడ్ ఫీల్డ్ కెమెరా 3ని పరిశోధకులు తొలిసారిగా ఉపయోగించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement