విశ్వంలో భారీ పేలుళ్లపై చైనా పరిశోధన | China’s space lab searches for strongest blasts in universe | Sakshi
Sakshi News home page

విశ్వంలో భారీ పేలుళ్లపై చైనా పరిశోధన

Published Mon, Oct 31 2016 8:09 AM | Last Updated on Wed, Apr 3 2019 4:08 PM

విశ్వంలో భారీ పేలుళ్లపై చైనా పరిశోధన - Sakshi

విశ్వంలో భారీ పేలుళ్లపై చైనా పరిశోధన

బీజింగ్‌: విశ్వంలో జరిగిన భారీ పేలుళ్ల విషయం తేల్చేందుకు చైనా నడుం బిగించింది. దీనికి సంబంధించి ప్రస్తుతం భూస్థిర కక్ష్యలో ఉన్న తన రెండో అంతరిక్ష పరిశోధనశాల తియాంగాంగ్‌–2లో పరిశోధనలు చేస్తోంది. దీనికి సంబంధించి ఒక చతురస్రాకారపు పరికరాన్ని స్పేస్‌ ల్యాబ్‌లో ఉంచింది. ఇది గామా కిరణ పేలుళ్లను పరిశీలించడం ద్వారా విశ్వంలో శక్తివంతమైన పేలుళ్లను అంచనా వేస్తుంది. ఈ పరిశోధనకు అధికారికంగా పోలార్‌ అని పేరు పెట్టారు. ఈ విషయాన్ని ప్రభుత్వానికి చెందిన జిన్హూ వార్తాసంస్థ వెల్లడించింది.

చైనా ప్రయోగించిన తియాంగాంగ్‌–2 అంతరిక్ష ప్రయోగశాలలో ప్రస్తుతం ఇద్దరు వ్యోమగాములు పనిచేస్తున్నారు. ప్రస్తుతం భూస్థిర కక్ష్యలో ఇది తిరుగుతోంది. ఈ పరిశోధన అంతరిక్ష విజ్ఞాన శాస్త్రంలో గామా కిరణాల పాత్రను తేటతెల్లం చేస్తుందని పోలార్‌ ప్రాజెక్టు ముఖ్య పరిశోధకుడు జాంగ్‌ షువాంగానా అన్నారు. తియాంగాంగ్‌–2 పైన చేపట్టిన ఈ పోలార్‌ ప్రాజెక్టు అంతర్జాతీయ సహకారంతో చేపట్టామని, ఇందులో యూనివర్సిటీ ఆఫ్‌ జెనీవా, స్విట్జర్‌లాండ్‌కు చెందిన పాల్‌ స్కెర్రర్‌ ఇన్‌స్టిట్యూట్, పోలాండ్‌కు చెందిన ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూక్లియర్‌ ఫిజిక్స్, భాగస్వాములుగా ఉన్నట్లు జాంగ్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement