
ఒడిషా యువతి తృష్ణా రే ‘మిస్ టీన్ యూనివర్స్–2024’ కిరీటం గెలుచుకుంది. దక్షిణాఫ్రికాలోని కింబర్లీ నగరంలో ఈ నెల 1 నుంచి 9వ తేదీ దాకా జరిగిన మిస్ టీన్ యూనివర్స్ పోటీలో విజేతగా నిలిచింది. పెరూ, దక్షిణాఫ్రికా, బ్రెజిల్, కెన్యా, పోర్చుగల్, నెదర్లాండ్స్ తదితర దేశాల నుంచి 10 మంది ఫైనల్‌కు చేరుకోగా, ఇండియా నుంచి ప్రాతినిధ్యం వహించిన 19 ఏళ్ల తృష్ణా రే వారందరినీ వెనక్కి నెట్టి అందాల సుందరి కిరీటం సొంతం చేసుకుంది.
పెరూ దేశానికి చెందిన అన్నే థార్సెన్ మొదటి రన్నరప్‌గా, నమీబియాకు చెందిన ఆండ్రి రెండో రన్నరప్‌గా నిలిచారు. కల్నల్ దిలీప్ కుమార్ రే, రాజశ్రీ రే దంపతుల కుమార్తె అయిన తృష్ణా రే ప్రస్తుతం ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లోని కేఐఐటీ యూనివర్సిటీలో ఫ్యాషన్ టెక్నాలజీ చదువుతోంది. – న్యూఢిల్లీ
Comments
Please login to add a commentAdd a comment