
వచ్చే నెల 1న స్ఫిరెక్స్ టెలిస్కోప్ ప్రయోగం
వాషింగ్టన్: మనం ఉంటున్న ఈ సువిశాల విశ్వం ఎలా పుట్టింది? దీని మూలమెక్కడ? నక్ష త్రాలు, గ్రహాలు ఎలా ఏర్పడ్డాయి? ఈ ప్రశ్నలకు సమాధానాలు కనుక్కోవడానికి ప్రాచీన కాలం నుంచి ఆధునిక కాలం దాకా ప్ర యత్నాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో ఎన్నెన్నో సిద్ధాంతాలు వ్యాప్తిలోకి వచ్చాయి. విశ్వంపై అన్వేషణలో అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’ మరో అడుగు ముందుకేస్తోంది.
బిగ్ బ్యాంగ్‌తో విశ్వం పురుడు పోసుకుందని ఎన్నో అధ్యయనాలు చెబుతు న్నాయి. అయితే, బిగ్ బ్యాంగ్ పరిణామం చోటుచేసుకున్న వెంటనే అసలేం జరిగింది? విశ్వం ఎలా మొదలైందో తెలుసుకోవడానికి ‘స్ఫిరెక్స్’ టెలిస్కోప్‌ను అంతరిక్షంలోకి ప్రయోగించడానికి నాసా ఏర్పాట్లు పూర్తిచేసింది. కాలిఫోర్నియాలోని వాండెన్‌బర్గ్ స్పేస్‌ఫోర్స్ స్టేషన్ నుంచి వచ్చే నెల 1వ తేదీన ఉదయం 8.39 గంటలకు స్పేస్‌ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా ఈ టెలిస్కోప్‌ను పంపించనుంది.
స్ఫిరెక్స్ టెలిస్కోప్ కాలపరిమితి రెండు సంవత్సరాలు. 45 కోట్ల నక్షత్ర మండలాలు, పాలపుంతలోని 10 కోట్ల నక్షత్రాల డేటాను సేకరించి, భూమిపైకి చేరవేస్తుంది. ఈ సమాచారం ఆధారంగా విశ్వం పుట్టుకను పరిశోధకులు అంచనా వేస్తారు. మన భూగోళం ఉన్న పాలపుంతలో భూమిపై కాకుండా ఇంకెక్కడైనా నీటి ఆనవాళ్లు? ఉన్నాయా? అనేది కూడా స్ఫిరెక్స్ అబ్జర్వేటరీ గుర్తించనుంది. అంతరిక్షానికి సంబంధించి 120 రంగుల్లో 3డీ మ్యాస్‌ను సైతం రూపొందిస్తుంది. స్ఫిరెక్స్ ప్రయోగంలో భాగంగా నాలుగు చిన్నపాటి ఉపగ్రహాలతో కూడిన పోలారిమీటర్ టు యునిఫై ద కరోనా, హెలియోస్ఫియర్(పంచ్) మిషన్‌ను సైతం నాసా సైంటిస్టులు అంతరిక్షంలోకి ప్రయోగించనున్నారు. సూర్యుడి నుంచి వెలువడే సౌర గాలులపై ఇది అధ్యయనం చేస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment