SpaceX Rocket
-
నిప్పులు చిమ్ముతూ నింగిలోకి GSAT-20
-
30 నిమిషాల్లో.. ఢిల్లీ నుంచి అమెరికాకు: సాధ్యమే అంటున్న మస్క్
టెక్ బిలియనీర్ 'ఇలాన్ మస్క్' (Elon Musk) ఎప్పటికప్పుడు కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూనే ఉంటారు. ఇందులో భాగంగానే స్టార్‌షిప్ రాకెట్ రూపొందించారు. దీని ద్వారా ప్రపంచంలోని ప్రధాన నగరాలకు చేరుకోవడానికి గంట కంటే తక్కువ సమయం పడుతుందని పేర్కొన్నారు.నవంబర్ 6న ఎక్స్ యూజర్ అలెక్స్ పోస్ట్ చేసిన వీడియోలో గమనిస్తే.. స్టార్‌షిప్ రాకెట్ ప్రయాణించడం చూడవచ్చు. ఇందులో భూమిపైనా ఎక్కడికైనా కేవలం గంటలోపే.. కొన్ని సంవత్సరాల్లోనే ఇది అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు. దీనిపై స్పందిస్తూ.. ఇది సాధ్యమవుతుందని మస్క్ ట్వీట్ చేశారు.సాధారణంగా ఢిల్లీ నుంచి అమెరికాలోని న్యూయార్క్ చేరుకోవడానికి సుమారు 16 గంటల సమయం పడుతుంది. అయితే స్పేస్ఎక్స్ స్టార్‌షిప్ రాకెట్ ద్వారా ఈ గమ్యాన్ని కేవలం 30 నిమిషాల్లో చేరుకోవచ్చని వీడియోలో వెల్లడైంది.ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పనులు జరుగుతున్నాయి. అన్నీ సవ్యంగా జరిగితే ఇది రాబోయే రోజుల్లో వినియోగంలోకి కూడా వచ్చేస్తుంది.ఇదీ చదవండి: మీటింగ్‌కు రాలేదని 90 శాతం ఉద్యోగులను తొలగించిన సీఈఓస్పేస్ఎక్స్ రూపొందిస్తున్న స్టార్‌షిప్ రాకెట్ సాధారణ విమానం మాదిరిగా కాకుండా.. రాకెట్ మాదిరిగా ఉంటుంది. ఇందులో ఒక్కసారికి 1,000 మంది ప్రయాణించవచ్చని చెబుతున్నాయి. ఇది పూర్తిగా స్టెయిన్లెస్ స్టీల్‌తో తయారై ఉంటుంది. అయితే డోనాల్డ్ ట్రంప్ అధికారం చేపట్టిన తరువాత ఈ ప్రాజెక్టుకు కావలసిన అన్ని అనుమతులను మంజూరు చేసే అవకాశం ఉంది. కాబట్టి ఇది వినియోగంలోకి వచ్చిన తరువాత విమానయాన సంస్థలు గట్టి పోటీ ఎదుర్కోవాలి ఉంటుంది.This is now possible— Elon Musk (@elonmusk) November 6, 2024 -
ఐఎస్ఎస్ చేరిన డ్రాగన్
వాషింగ్టన్: వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్లను వెనక్కు తీసుకొచ్చేందుకు బయల్దేరిన స్పేస్ ఎక్స్ డ్రాగన్ వ్యోమనౌక అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకుంది. సోమవారం ఐఎస్ఎస్తో విజయవంతంగా అనుసంధానమైంది. కాసేపటికే అందులోని వ్యోమగాములు నిక్ హేగ్, అలెగ్జాండర్ గోర్బనోవ్ ఐఎస్ఎస్లో ప్రవేశించారు. సునీత, విల్మోర్ తదితరులతో కలిసి ఫొటోలు దిగుతూ సందడి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. స్పేస్ ఎక్స్ క్రూ–9 మిషన్‌ను అమెరికాలో ఫ్లోరిడాలోని కేప్‌కెనవెరల్ నుంచి శనివారం ప్రయోగించడం తెలిసిందే. జూన్‌లో బోయింగ్ తొలిసారి ప్రయోగాత్మకంగా పంపిన స్టార్‌లైనర్ క్యాప్సూల్‌లో సునీత, విల్మోర్ ఐఎస్ఎస్ చేరుకున్నారు. 8 రోజుల్లో వారు తిరిగి రావాల్సి ఉండగా స్టార్‌లైనర్‌లో సాంకేతిక సమస్యలతో అక్కడే చిక్కుబడిపోయారు. చివరికి స్టార్‌లైనర్ ఖాళీగానే భూమికి తిరిగొచ్చింది. సునీత, విల్మోర్ డ్రాగన్ క్యాప్సూల్‌లో ఫిబ్రవరిలో తిరిగి రానున్నారు. వారికి చోటు కలి్పంచేందుకు వీలుగా నాలుగు సీట్ల సామర్థ్యమున్న డ్రాగన్ క్యాప్సూల్‌లో హేగ్, గోర్బనోవ్లను మాత్రమే పంపడం తెలిసిందే. -
కుప్పకూలనున్న 20 స్టార్‌లింక్ శాటిలైట్లు
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కు చెందిన ప్రైవేట్ అంతరిక్ష సంస్థ స్పేస్ ఎక్స్‌కు గట్టి ఎదురుదెబ్బ. అది గురువారం ప్రయోగించిన 20 స్టార్‌లింక్ ఉపగ్రహాలు త్వరలో కుప్పకూలనున్నాయి. స్పేస్ ఎక్స్ కూడా దీన్ని ధ్రువీకరించింది. ప్రయోగ సమయంలో చోటుచేసుకున్న పొరపాటే ఇందుకు కారణమని తెలిపింది. ‘‘గురువారం రాత్రి ప్రయోగం మొదలైన కాసేపటికి ఫాల్కన్–9 రాకెట్ రెండో దశ ఇంజన్ సకాలంలో మండటంలో విఫలమైంది. దాంతో ఉపగ్రహాలు ఉద్దేశించిన కక్ష్యకు బదులు భూ దిగువ కక్ష్యలోకి ప్రవేశించాయి. దాంతో వాటి మనుగడ అసాధ్యంగా మారింది. అవి త్వరలో భూ వాతావరణంలోకి ప్రవేశించి కాలిపోనున్నాయి’’ అని వివరించింది. అయితే, ‘‘వాటివల్ల ఇతర ఉపగ్రహాలకు ఏ సమస్యా ఉండబోదు. అలాగే ఉపగ్రహాలు ఒకవేళ భూమిని తాకినా జనావాసాలకు ముప్పేమీ ఉండదు’’ అని స్పష్టం చేసింది. ఇన్నాళ్లూ అత్యంత విశ్వసనీయంగా పని చేసిన ఫాల్కన్–9 రాకెట్ చరిత్రలో ఇది తొలి భారీ వైఫల్యంగా చెప్పవచ్చు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
తొలిసారిగా ఫాల్కన్ రాకెట్లో ఇస్రో శాటిలైట్
న్యూఢిల్లీ: సమయానికి వేరే రాకెట్ అందుబాటులోలేని కారణంగా ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్(ఇస్రో) అమెరికాకు చెందిన ప్రైవేట్ అంతరిక్ష సంస్థ స్పేస్ఎక్స్ సేవలను వినియోగించుకోనుంది. 4,700 కేజీల బరువైన భారీ ఉపగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశపెట్టేందుకు ఆ సంస్థకు చెందిన ఫాల్కన్ రాకెట్‌ను వాడుకోనుంది. విదేశీ ఫాల్కన్ రాకెట్‌ను ఇస్రో వాడటం ఇదే తొలిసారి. సంబంధిత వివరానలను ఇస్రో వాణిజ్యవిభాగమైన న్యూస్పేస్ ఇండియ లిమిటెడ్(ఎన్ఎస్ఐఎల్) బుధవారం వెల్లడించింది. ఇస్రోకు చెందిన జీఎస్ఎల్వీ–ఎంకే3 రాకెట్ దాదాపు 4,000 కేజీల పేలోడ్లనే మోసుకెళ్లగలదు. అంతకుమించి బరువున్న కమ్యూనికేషన్ ఉపగ్రహం జీశాట్–20ని మోసుకెళ్లే రాకెట్ అందుబాటులోలేని కారణంగా స్పేస్‌ఎక్స్‌ను ఇస్రో సంప్రదించింది. ఫాల్కన్ రాకెట్ ఏకంగా 8,300 కేజీల పేలోడ్‌ను మోసుకెళ్లగలదు. -
స్పేస్ ఎక్స్ 250వ రాకెట్ సేఫ్ ల్యాండ్.. ఎలాన్ మస్క్ హర్షం
స్పేస్ ఎక్స్ 250వ రాకెట్‌ను సురక్షితంగా ల్యాండింగ్ చేసింది. తాజాగా ఫాల్కన్ 9 రాకెట్‌ను కాలిఫోర్నియా తీరంలో వాండెన్‌బర్గ్ స్పేస్ ఫోర్స్ బేస్ నుండి విజయవంతంగా ప్రయోగించింది. ఐర్లాండ్‌కు చెందిన మొదటి ఉపగ్రహాన్ని, దక్షిణ కొరియా నిఘా ఉపగ్రహాన్ని ఈ రాకెట్ ద్వారా ప్రయోగించారు. ఈ మొదటి దశ ఫాల్కన్ 9 రాకెట్.. వాండెన్బర్గ్లోని ల్యాండింగ్ జోన్ 4 వద్ద సురక్షితంగా ల్యాండింగ్ అయింది. కాగా.. నింగి నుంచి క్షేమంగా స్పేస్ ఎక్స్ ల్యాండింగ్ చేసిన రాకెట్లలో ఇది 250వది కావడం గమనార్హం. ఈ సందర్భంగా స్పేస్ ఎక్స్ బృందానికి ఆ సంస్థ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ శుభాకాంక్షలు తెలిపారు. Congrats to the @SpaceX team on the 250th landing of a Falcon rocket pic.twitter.com/U3KoKGmUOm — Elon Musk (@elonmusk) December 2, 2023 ఈ ప్రయోగంలో మొత్తం 25 ఉపగ్రహాలను రాకెట్ మోసుకెళ్లింది. యూనివర్సిటీ కాలేజ్ డబ్లిన్ విద్యార్థులు నిర్మించిన ఎడ్యుకేషనల్ ఐరిష్ రీసెర్చ్ శాటిలైట్-1 (EIRSAT-1) ఇందులో ఒకటి. దక్షిణ కొరియాకు చెందిన ఐదు ఉపగ్రాహాలను 2025 నాటికి నింగిలోకి పంపించాలని స్పేస్ ఎక్స్ ఒప్పందం కుదుర్చుకోగా.. ప్రస్తుతం మొదటి ఉపగ్రహాన్ని ప్రయోగించారు. దక్షిణ కొరియాకు చెందిన 425 ప్రాజెక్ట్ EO/IR ఉపగ్రహం 1,700 పౌండ్లు (800 kg) ద్రవ్యరాశిని కలిగి ఉంటుంది. ఇన్ఫ్రారెడ్, ఎలక్ట్రో-ఆప్టికల్ సామర్థ్యాలను కలిగి ఉంది. అంతరిక్షంలోకి గూఢచారి ఉపగ్రహాన్ని ఉత్తర కొరియా మోహరించినట్లు ప్రకటించిన కొద్ది రోజులకే దక్షిణ కొరియా ఉపగ్రహం కూడా అంతరిక్షంలోకి దూసుకెళ్లింది. ఇదీ చదవండి: యూపీ అబ్బాయి.. డచ్ అమ్మాయి.. ఖండాంతరాలు దాటిన ప్రేమ -
పేలిపోయిన స్టార్‌షిప్ రాకెట్
టెక్సాస్: స్పేస్ ఎక్స్ సంస్థ ప్రయోగించిన స్టార్‌షిప్ రాకెట్ ప్రయోగం విఫలమైంది. ప్రయోగించిన కొద్దిసేపటికే అంతరిక్షంలో పేలిపోయింది. అమెరికాకు చెందిన అపరకుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ ఎక్స్ శనివారం టెక్సాస్ నుంచి ఈ ప్రయోగం చేపట్టింది. ఎనిమిది నిమిషాల పాటు ప్రయాణించిన అనంతరం రాకెట్ పైభాగం బూస్టర్ నుంచి విజయవంతంగా వేరుపడింది. అనంతరం భూమితో సంబంధాలు తెగిపోయాయి. ప్రత్యక్ష ప్రసారం నిలిచిపోయింది. కొద్దిక్షణాల్లోనే అది పేలిపోయింది. ఇంధనంతో కలిపి ఈ భారీ స్టార్ షిప్ మొత్తం బరువు 5 వేల టన్నులు కాగా వ్యాసం 9 మీటర్లు, ఎత్తు 121 మీటర్లు. ఇదే సంస్థ ఏప్రిల్‌లో మొదటి ప్రయోగం చేపట్టింది. నాలుగు నిమిషాల పాటు ప్రయాణించిన అనంతరం రాకెట్ పేలిపోయింది. -
నాలుగు దేశాలు.. నలుగురు వ్యోమగాములు
కేప్ కెనవెరాల్: నాలుగు వేర్వేరు దేశాలకు చెందిన నలుగురు వ్యోమగాములతో స్పేస్ ఎక్స్ రాకెట్ శనివారం కేప్ కెనవెరాల్ నుంచి నింగిలోకి దూసుకెళ్లింది. కక్ష్యలో పరిభ్రమిస్తున్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)లోకి ఆదివారం నలుగురు వ్యోమగాములు అడుగిడుతారు. మార్చి నెల నుంచి అక్కడే విధులు నిర్వర్తిస్తున్న వ్యోమగాముల స్థానంలో వీరు బాధ్యతలు చేపడతారు. ఆరు నెలలపాటు అక్కడుంటారు. నలుగురిలో ఒకరు నాసాకు చెందిన వారు కాగా, మిగతా ముగ్గురు డెన్మార్క్, జపాన్, రష్యా దేశస్తులు. అమెరికా ఇలా ఒకే అంతరిక్ష నౌకలో వేర్వేరు దేశాలకు చెందిన వారిని ఐఎస్ఎస్కు పంపించడం ఇదే మొదటిసారి. ఇప్పటి వరకు నాసా పంపించిన స్పేస్ ఎక్స్ ట్యాక్సీ రాకెట్లలో ఇద్దరు లేదా ముగ్గురు అమెరికన్లు ఉండేవారు. తాజా బృందానికి నాసాకు చెందిన జాస్మిన్ మొఘ్‌బెలి అనే మెరైన్ పైలట్ నాయకత్వం వహిస్తున్నారు. జాస్మిన్ తల్లిదండ్రులు ఇరాన్ దేశస్తులు. 1979లో ఇరాన్ విప్లవం సమయంలో జర్మనీ వెళ్లిపోయారు. అక్కడే జాస్మిన్ పుట్టారు. న్యూయార్క్‌లో పెరిగారు. అమెరికా మెరైన్స్ చేరి అఫ్గానిస్తాన్‌లో యుద్ధ హెలికాప్టర్లు నడిపారు. ఆత్మవిశ్వాసంతో ఏదైనా సాధించవచ్చని ఇరాన్ బాలికలకు చూపుతున్నానని ఆమె అంటున్నారు. -
ప్రపంచంలోనే భారీ రాకెట్ ప్రయోగం విఫలం..
సాక్షి, హైదరాబాద్: ఎలన్ మస్క్‌కు భారీ షాక్ తగిలింది. ప్రపంచంలోనే అతిపెద్ద రాకెట్ ప్రయోగం విఫలమైంది. మస్క్‌కు చెందిన స్పేస్ఎక్స్ కంపెనీ రూపొందించిన అతిపెద్ద రాకెట్ నింగిలోకి ఎగిసిన కాసేపటికే.. పేలిపోయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇదిలా ఉండగా, స్పేస్ఎక్స్ స్టార్‌షిప్.. భారీ ఖర్చుతో ప్రపంచంలోనే అత్యంత పొడవైన, అత్యంత శక్తివంతంగా నిర్మించిన రాకెట్. దీన్ని.. అంతరిక్షంలోకి వ్యోమగాములు, సరకు రవాణా కోసం రూపొందించారు. 400 అడుగులు పొడువున్న భారీ వ్యోమనౌక దాదాపు 250 టన్నుల బరువును మోయగలదు. 100 మందిని అంతరిక్షయానానికి తీసుకెళ్లగలదు. చంద్రుడు, అంగారకుడిపై యాత్రలకు వీలుగా దీన్ని రూపొందించారు. నాసా చంద్రుడి ప్రయోగాలకు పోటీగా.. మస్క్ దీనిని తెరపైకి తెచ్చాడనే చర్చ జోరుగా నడిచింది కూడా. ఈ రాకెట్ టెక్సాస్‌లోని బోకా చికాలోని ప్రైవేట్ స్పేస్ఎక్స్ స్పేస్‌పోర్ట్ అయిన స్టార్‌బేస్ నుండి ప్రయోగించబడింది. ఈ సందర్బంగా విఫలం కావడంతో పేలిపోయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సందర్బంగా రాకెట్ విఫలం కావడంపై స్పేస్ఎక్స్ స్పందించింది. ట్విట్టర్ వేదికగా.. భారీ రాకెట్ భాగాలు విడిపోయే క్రమంలో పేలిపోయినట్టు తెలిపింది. రాకెట్ విఫలమైనట్టు పేర్కొంది. This is the moment SpaceX's Starship - the biggest and most powerful rocket ever built - launched, and then failed before completing its full test. No people or satellites were aboard. https://t.co/DpnSfSGuZn pic.twitter.com/GEYKokG2B7 — The Associated Press (@AP) April 20, 2023 Congrats @SpaceX team on an exciting test launch of Starship! Learned a lot for next test launch in a few months. pic.twitter.com/gswdFut1dK — Elon Musk (@elonmusk) April 20, 2023 -
అమెరికా, రష్యా, యూఏఈల వ్యోమగాములతో..
కేప్ కెనవెరాల్: అరబ్ దేశాల నుంచి మొట్టమొదటి వ్యోమగామి సహా మూడు దేశాలకు చెందిన నలుగురు వ్యోమగాములతో స్పేస్ఎక్స్ రాకెట్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)కు చేరుకుంది. ఆరు నెలల ఈ మిషన్‌లో యూఏఈ రెండో వ్యోమగామి సుల్తాన్ అల్–నెయాడీ పాలుపంచుకుంటున్నారు. నెయాడీతోపాటు అమెరికాకు చెందిన స్టీఫెన్ బోవెన్, వారెన్ హొబర్గ్, రష్యాకు చెందిన అండ్రీ ఫెడ్యాయెవ్ ఉన్నారు. వీరు అక్కడికి చేరుకున్నాక ఐఎస్ఎస్లో గత ఏడాది అక్టోబర్ నుంచి ఉంటున్న అమెరికా, రష్యా, జపాన్ వ్యోమగాములు భూమిపైకి చేరుకోవాల్సి ఉంది. -
మార్చి 4న చైనా రాకెట్ చంద్రుడిని ఢీకొట్టనుందా? డ్రాగన్ కంట్రీ ఏమంటోంది..
Rocket To Crash Into Moon: బీజింగ్ చంద్రుని పై జరిపిన పరోశోధనల్లో భాగంగా చంద్రుని పైకి చైనాకి సంబంధించిన ఒక అంతరిక్ష వ్యర్థం వచ్చిందని నిపుణులు తెలిపారు. ఈ మేరకు మార్చి 4న చంద్రుడిని ఒక రాకెట్ ఢీకొట్టనుందని నిపుణులు వెల్లడించారు. తొలుత ఖగోళ శాస్త్రవేత్తలు అది స్పేస్ ఎక్స్ రాకెట్‌లోని భాగంగా భావించారు. కానీ అది ఏడేళ్ల క్రితం పేలిపోయిందని దాని మిషన్ పూర్తైయిన తర్వాత అంతరిక్షంలోకి వదిలివేయబడిందని నిర్ధారించారు. కానీ ఇప్పుడూ చైనీస్ స్పేస్ ఏజెన్సీ చంద్ర అన్వేషణ కార్యక్రమంలో భాగంగా 2014లో Chang'e 5-T1 రాకెట్‌ని అంతరిక్షంలోకి పంపిందని కాబట్టి అది ఆ రాకెట్‌కి సంబంధించిన బూస్టర్ అని కొంత మంది నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ మేరకు ఆ రాకెట్ మార్చి 4న చంద్రుని వైపు కూలిపోతుందని భావిస్తున్నారు. కానీ చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ సోమవారం ఈ వాదనను ఖండించింది. అంతేకాదు మీరు అనుమానిస్తున్న ఆ బూస్టర్ భూ వాతావరణంలోకి సురక్షితంగా ప్రవేశించి కాలిపోయిందని పేర్కొంది. చైనా అంతరిక్ష సూపర్‌పవర్‌గా అవతరించడంపై దృష్టి సారించడమే కాక కొత్త అంతరిక్ష కేంద్రానికి సుదీర్ఘమైన సిబ్బందితో కూడిన మిషన్‌ను ప్రారంభించి ఒక ప్రభంజనం సృష్టించింది. అంతేగాక ప్రపంచంలోని రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మిలిటరీ-రన్ స్పేస్ ప్రోగ్రామ్‌లో బిలియన్లను దున్నేసింది. చివరికి మానవులను చంద్రునిపైకి పంపాలని భావిస్తోంది కూడా. (చదవండి: పుతిన్- బైడెన్ల అత్యవసర భేటీ!) -
జాబిలి వైపు రాకెట్.. లాంఛ్ కాదు ఢీ కొట్టడానికి!
పరిశోధనల కోసం రాకెట్లను, శాటిలైట్లను అంతరిక్షంలోకి లాంఛ్ చేయడం సహజం. కానీ, ఇక్కడో రాకెట్ చంద్రుడ్ని ఢీ కొట్టే దూసుకెళ్తుండగా.. స్పేస్ ఏజెన్సీలన్నీ ఆసక్తిగా పరిశీలించబోతున్నాయి. అందుకు కారణాలు.. ఆ రాకెట్ ఎప్పుడో ఏడేళ్ల కిందట ప్రయోగించింది కావడం, ఇన్నాళ్లు స్పేస్‌లో కక్క్ష్య తప్పి అస్తవ్యస్తంగా సంచరించి ఇప్పుడు చంద్రుడి వైపు దూసుకెళ్లడం!. స్పేస్ఎక్స్ కంపెనీ ద్వారా ఫాల్కన్ 9 బూస్టర్ రాకెట్‌ను 2015 ఫిబ్రవరిలో అంతరిక్షంలోకి పంపించిన విషయం తెలిసిందే. అంతరిక్షంలోని లోతైన పరిస్థితుల్ని పరిశీలించడానికి ఈ రాకెట్‌ను ఫ్లోరిడా నుంచి ప్రయోగించారు. మొదటి దశలో విజయవంతమైనప్పటికీ.. రెండో దశలో ఈ ప్రయోగం ప్లాప్ అయ్యింది. అయితే ఫాల్కన్ 9 బూస్టర్ అప్పటి నుంచి అస్తవ్యస్తమైన కక్క్ష్యను అనుసరించింది. దీంతో అదుపు తప్పి జాడ లేకుండా పోవడంతో స్పేస్ జంక్‌గా దాదాపు ఒక నిర్ధారణకు వచ్చేశారు సైంటిస్టులు. ఇప్పుడు ఏడేళ్ల తర్వాత ఇప్పుడు ఆశ్చర్యకరరీతిలో ఈ రాకెట్ ట్రాక్ ఎక్కగా.. చంద్రుడి మీదకు క్రాష్ దిశగా దూసుకెళ్తుంది. నాసా అంచనాల ప్రకారం.. మార్చ్ 4వ తేదీన ఈ క్రాష్ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిజానికి మిలియన్ మైళ్ల ట్రెక్‌లో అంతరిక్ష వాతావరణ ఉపగ్రహాన్ని పంపడం ద్వారా తన మొదటి డీప్-స్పేస్ మిషన్‌ను ప్రారంభించినప్పటికీ.. ఫాల్కన్ 9 బూస్టర్ కొంత అస్తవ్యస్తమైన కక్ష్యలో తిరుగాడింది. దీంతో ఈ రాకెట్ సంగతి పట్టించుకోవడం మానేశారు!. అయితే ఇన్నేళ్లకు ఇది చంద్రుడి వైపు కక్క్ష్యను మార్చుకుని దూసుకెళ్తోంది. సుమారు 4వేల కేజీల బరువున్న పాల్కన్ 9 బూస్టర్ రాకెట్.. ప్రస్తుతం గంటకు 9,000 కిలోమీటర్ల వేగంతో చంద్రుడి వైపు పయనిస్తోంది. నాసా లునార్ ఆర్బిటర్(Lunar Reconnaissance Orbit)తో పాటు భారత్ చంద్రయాన్-2 స్పేస్‌క్రాఫ్ట్‌లు ఈ క్రాష్ ల్యాండ్‌ను అతి సమీపంగా గమనించనున్నాయి. అసలు ఈ క్రాష్ ల్యాండ్‌తో ఒరిగేది ఏముంటుందనే అనుమానం రావొచ్చు. చంద్రుడి ఉపరితలం మీది పరిస్థితులను మరింత లోతుగా అధ్యయనం చేయడం కోసం ఈ క్రాష్‌ల్యాండ్‌ను పరిశీలించనున్నారు. 2009లో నాసా కావాలనే ఒక రాకెట్‌ను చంద్రుడి మీదకు క్రాష్ లాంఛ్ చేసింది. అయితే పాల్కన్ విషయంలో అనుకోకుండా చంద్రుడి ఉపరితలంపైకి ఢీ కొడుతుండడం విశేషం. ఇది చంద్రుడ్ని ఢీ కొట్టడం ద్వారా జరిగే ప్రభావం అంతగా ఉండకపోవచ్చని స్పేస్ రీసెర్చర్లు భావిస్తున్నారు. క్లిక్ చేయండి: 5జీతో విమానాలకు ముప్పు పొంచి ఉందా? నిపుణుల మాటేంటంటే.. -
తెలుగోడి నేతృత్వంలో ఐఎస్ఎస్కు నాసా బృందం
-
తాత పుట్టింది మహబూబ్‌నగర్.. మనవడు అడుగు పెట్టేది చంద్ర మండలం
జాబిల్లిపై పరిశోధనలు విస్తృతం చేసేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చంద్రాయాన్ ప్రయోగాల్లో బిజీగా ఉండగానే భారత మూలాలు ఉన్న మరో వ్యక్తి ఏకంగా జాబిల్లిపై అడుగు పెట్టేందుకు ఆకాశంలోకి అడుగు పెట్టాడు. Raja Chari-Led SpaceX Crew-3 Mission Lifts Off: నాసా, స్పేస్ ఎక్స్ సంస్థలు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లోకి పంపించేందుకు ప్రయోగించిన స్పేస్‌ఫ్లైట్ స్పేస్ఎక్స్ క్రూ 3లో ఇండో అమెరికన్ రాజాచారి అంతరిక్షంలోకి అడుగు పెట్టారు. రాచాచారితో పాటు మిషన్ స్పెషలిస్ట్ కేయ్లా బారోన్, వెటరన్ అస్ట్రోనాట్ టామ్ మార్ష్‌బర్న్‌లు అంతరిక్ష యానానికి బయల్దేరి వెళ్లారు. అమెరికాలోని ఫ్లోరిడాలో ఉన్న కెన్నెడీ స్పేస్ స్టేషన్ నుంచి నిప్పులు కక్కుకుంటూ వీరిని ఫాల్కన్ రాకెట్ నింగిలోకి మోసుకెళ్లింది. #Crew3... 2... 1... and liftoff! Three @NASA_Astronauts and one @ESA astronaut are on their way to the @Space_Station aboard the @SpaceX Crew Dragon Endurance: pic.twitter.com/dxobsFb4Pa — NASA (@NASA) November 11, 2021 మూలాలు మహబూబ్‌నగర్‌లో అంతరిక్షంలో అడుగు పెడుతున్న రాజాచారి తెలుగు మూలాలు ఉన్న వ్యక్తి. ఆయన తండ్రి శ్రీనివాసాచారి ఉస్మానియా యూనివర్సిటీలో చదువు పూర్తి చేసి అమెరికాలో సెటిల్ అయ్యారు. శ్రీనివాసాచారి తండ్రి స్వస్థలం మహబూబ్‌నగర్ జిల్లా. అక్కడి నుంచి గణితం బోధించే అధ్యాపకుడిగా పని చేసేందుకు హైదరాబాద్ వచ్చి ఇక్కడే స్థిరపడ్డారు. హైదరాబాద్ టూ అమెరికా ఉస్మానియా యూనివవర్సిలో ఇంజనీరింగ్ పూర్తి చేసి పై చదువుల కోసం అమెరికా వెళ్లారు శ్రీనివాసాచారి. అక్కడ ఉద్యోగం చేస్తూ అమెరికన్ మహిళ పెగ్గీ ఎగ్‌బర్ట్‌ని వివాహం చేసుకున్నారు. వీరికి 1977 జూన్ 24న రాజాచారి జన్మించారు. రాజాచారి పూర్తి పేరు రాజా జాన్ వీర్‌పుత్తూర్ చారి. అస్ట్రోనాట్ చిన్నప్పటి నుంచే అస్ట్రోనాట్ కావాలనే లక్ష్యం పెట్టుకున్నారు చారి. అందుకు తగ్గట్టే చదువులోనే కాదు ఆటపాటల్లోనూ ఆస్ట్రోనాట్ కల ప్రతిబింబిచేలా ప్రవర్తించేవారు. అందుకు తగ్గట్టే 1995లో యూఎస్ స్టేట్ ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో చేరారు. ఆ తర్వాత 1999లో ఆస్ట్రోనాటికల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ పట్టా పుచ్చుకున్నారు. ఇదే విభాగంలో 2011లో మాస్టర్స్ పూర్తి చేశారు. నాసాలోకి ఎంట్రీ అంతరిక్ష పరిశోధనల కోసం నాసా 2017లో ఎంపిక చేసిన అస్ట్రోనాట్ గ్రూప్ 22కి ఎంపికయ్యారు రాజా చారి. రెండేళ్ల శిక్షణ అనంతరం 2024లో నాసా చంద్రుడి మీద ప్రయోగాల కోసం చేపట్టనున్న ఆర్టెమిస్ టీమ్‌కి సైతం ఎంపికయ్యారు. ఆ ప్రాజెక్టు సన్నహకాల్లో భాగంగా కమాండ్ ఇన్ ఛీఫ్ హోదాలో స్పేస్ ఎక్స్ క్రూ 3లో ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్‌కి వెళ్లారు. We like turtles. There are three aboard the #Crew3 Endurance capsule on the way to the @Space_Station: Two from the "Turtles" class of astronauts, Kayla Barron and @Astro_Raja, and the third... well, can you spot the zero G indicator? pic.twitter.com/kBmxKawusH — NASA (@NASA) November 11, 2021 ట్యాంక్‌బండ్ జ్ఞాపకాలు మరిచిపోలేను ‘నా తండ్రి మూలాలు భారత్‌లో ఉన్నాయనే విషయం నేను మరిచపోలేదు. ఇప్పటి వరకు మూడు సార్లు హైదరాబాద్‌కి వచ్చాను. అక్కడ మా బంధువులు చాలా మంది ఉన్నారు. చిన్నతనంలో వేసవి సెలవులకు హైదరాబాద్ వచ్చినప్పుడు ట్యాంక్‌బండ్‌కి వెళ్లాం. చాలా ఎంజాయ్ చేశాం. సంతోషంగా గడిపిన ఆ రోజులను నేను ఎన్నడూ మరిచిపోను’ అంటూ భాగ్యనగరంతో తనకున్న అనుభవాలను ఇటీవల నెమరువేసుకున్నారు రాజాచారి. అంతేకాదు హైదరాబాద్‌లో ఉన్నప్పుడు ఇక్కడి ఫుడ్ బాగా ఎంజాయ్ చేశానని, కొన్ని తెలుగు పదాలు కూడా నేర్చుకున్నట్టు ఆయన తెలిపారు. అయితే ప్రస్తుతం ఆ తెలుగు పదాలు అంతగా గుర్తులేవన్నారు. "It's really mind boggling when you think about how much effort it takes to put people in space and then to sustain them in space." — @Astro_Raja, Commander of the #Crew3 mission to the @Space_Station. pic.twitter.com/FGv5w46Q7a — NASA (@NASA) November 10, 2021 త్వరలో జాబిల్లిపైకి రాజాచారి ప్రస్తుతం హుస్టన్ నగరంలో నివసిస్తున్నారు. ఆయనకు భార్య ముగ్గురు పిల్లలు ఉన్నారు. అంతరిక్ష స్పేస్ స్టేషన్లో ప్రయోగాలు ముగించుకుని వచ్చిన తర్వాత ఆయన చంద్రమండల యాత్రకు సన్నద్ధం అవుతారు. చదవండి: చల్లని ‘రాజా’ ఓ చందమామ -
అప్పుడే అయిపోలేదు.. ఇప్పుడే మొదలైంది
గ్రహరాశులనధిగమించి ఘనతారల పథము నుంచి గగనాంతర రోదసిలో... గంధర్వగోళ తతుల దాటి చంద్రలోకమైనా దేవేంద్రలోకమైనా బొందితో జయించి మరల భువికి తిరిగి రాగలిగే మానవుడే మహనీయుడు.. తల్చుకుంటే మనిషి సాధించలేనిది ఏదీ లేదు. గత కొన్నేళ్లుగా పోటాపోటీ అంతరిక్ష పరిశోధనలతో అగ్రపథాన దూసుకుపోతున్నాడు. తాజాగా ప్రైవేట్ ఏజెన్సీ స్పేస్ఎక్స్ ‘ఇన్స్పిరేషన్4’.. చరిత్ర సృష్టించింది. నలుగురు.. అదీ వ్యోమగాములు కానీ వాళ్లు, ఎలాంటి శిక్షణ లేనివాళ్లతో అంతరిక్ష యానం పూర్తి చేయించి.. సురక్షితంగా భూమికి చేర్చడం ద్వారా అంతరిక్షయానంలో కొత్త అధ్యయం లిఖించింది. క్లిక్: బ్రాన్సన్, బెజోస్‌లది ఉత్తుత్తి ఫీట్.. మస్క్ దమ్మున్నోడు! సర్వత్రా ఉత్కంఠ రేకెత్తించిన SpaceX Inspiration ప్రయోగం విజవంతంగా పూర్తైంది. స్పేస్ఎక్స్ ఫాల్కన్-9 రాకెట్ ద్వారా బుధవారం రాత్రి 8గం.2ని. అంతరిక్షంలోకి దూసుకెళ్లిన #Inspiration4 బృందం.. మూడు రోజులపాటు అంతరిక్షంలోనే గడిపింది. తిరిగి డ్రాగన్ క్యాప్సూల్ ద్వారా శనివారం సాయంత్రం 7 గంటల సమయంలో ఫ్లోరిడా సముద్ర భాగాన ల్యాండ్ అయ్యింది క్రూ. బృందంలోని నలుగురు ఆరోగ్యవంతంగా ఉండగా.. వాళ్లను మరికొన్ని గంటలు అబ్జర్వేషన్లోనే ఉంచనున్నారు. అయితే ఏమాత్రం శిక్షణ లేని ఈ నలుగురిని అంతరిక్షంలోకి పంపి.. తద్వారా స్పేస్ టూరిజానికి కొత్త తోవ చూపించాడు ఎలన్ మస్క్. Liftoff of @Inspiration4X! Go Falcon 9! Go Dragon! pic.twitter.com/NhRXkD4IWg — SpaceX (@SpaceX) September 16, 2021 There's the #Inspiration4 crew getting their first taste of natural air after spending about 71 hours in orbit pic.twitter.com/unJXs5TT1A — Joey Roulette (@joroulette) September 18, 2021 Splashdown! Welcome back to planet Earth, @Inspiration4x! pic.twitter.com/94yLjMBqWt — SpaceX (@SpaceX) September 18, 2021 200 మిలియన్ల డాలర్లు.. స్పేస్ఎక్స్ ఇన్స్పిరేషన్4కి ఎంత ఖర్చు అయ్యిందనేది స్పష్టత లేదు. కానీ, ఈ ప్రయోగ ముఖ్యోద్దేశం.. సెయింట్ జూడ్ ఆస్పత్రి క్యాన్సర్ పరిశోధనల కోసం 200 మిలియన్ డాలర్ల సేకరణ. ఫండ్ రైజింగ్ ద్వారా ఈ మొత్తాన్ని రాబట్టాలన్నది ఎలన్‌మస్క్, ఆ నలుగురు స్పేస్ టూరిస్టుల ఉద్దేశం. ప్రస్తుతం అది 154 మిలియన్ డాలర్లకు చేరినట్లు తెలుస్తోంది. బిలియనీర్, షిఫ్ట్ పేమెంట్స్ వ్యవస్థాపకుడు జేర్డ్ ఐసాక్‌మాన్ నేతృత్వంలోని క్రిస్ సెంబ్రోస్కి(యూఎస్ ఎయిర్‌ఫోర్స్ వెటరన్), సియాన్ ప్రోక్టర్(జియోసైంటిస్ట్), హాయిలే ఆర్కేనాక్స్(అంతరిక్షంలోకి వెళ్లిన యంగెస్ట్ అమెరికన్)లతో కూడిన టీం 71గంటల అంతరిక్ష యానం పూర్తి చేసుకుంది. వీళ్లంతా స్ఫూర్తిదాయకమైన నేపథ్యం ఉన్నవాళ్లే. అందుకే ఈ ప్రయోగానికి ఇన్స్పిరేషన్ అనే పేరు పెట్టాడు ఎలన్ మస్క్. అనంతరం డ్రాగన్ క్యాప్సూల్స్ ద్వారా భూమికి చేరుకున్న బృందం.. రెండు సెట్ల పారాషూట్స్తో సురక్షితంగా సముద్ర భాగంలో ల్యాండ్ అయ్యింది. పాటలు వింటూ.. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్(ISS) కంటే దూరంలో (సుమారు 575 కిలోమీటర్ల) వీళ్లు స్పేస్‌షిప్‌లో గడిపారు. అంతరిక్షంలో ఉన్నంతసేపు.. సైంటిఫిక్ చేసింది ఇన్స్పిరేషన్4 టీం. స్పేస్‌లో మనిషి శరీరం ఎలా ఉంటుదనే అంశంపై ఫోకస్ చేస్తూ పరిశోధనలు చేశారు వాళ్లు. మధ్యమధ్యలో సంగీతం వింటూ.. కుపోలా(క్యాప్సూల్స్‌లోని స్పెషల్ విండో) ద్వారా కుటుంబ సభ్యులతో ఛాటింగ్ చేస్తూ సరదాగా గడిపారు. ప్రోక్టర్ ఏకంగా మెటాలిక్ మార్కర్స్‌తో ఆర్ట్ వర్క్ వేయడం విశేషం. ఇక సెంబ్రోస్కి ఏకంగా గిటార్ వాయించారు. వీటిని ఫండ్ రైజ్‌లో భాగంగా వేలం వేయనున్నారు కూడా. The Inspiration4 crew were all smiles as they gave a tour of the Dragon capsule and zoomed with patients from St. Jude. The mission is raising funds for the children’s hospital and cancer research.@LesterHoltNBC shares this story. pic.twitter.com/LoZF3vgDlx — NBC Nightly News with Lester Holt (@NBCNightlyNews) September 18, 2021 స్పేస్ టూరిజంలో కొత్త ఒరవడి సృష్టించిన స్పేస్ఎక్స్.. ఇన్స్పిరేషన్4 ప్రయోగంతో మరిన్ని ప్రయోగాలకు సిద్ధమవుతోంది. తాజాగా మరో ఐదు ప్రైవేట్ మిషన్ల కోసం కాంట్రాక్ట్ చేసుకుంది. వీటితో పాటు నాసాకు సంబంధించిన మిషన్స్ సైతం ఉండగా.. ప్రత్యర్థి బ్లూ ఆరిజిన్‌తో కలిసి పని చేయాల్సి వస్తుండడం విశేషం. చదవండి: జెఫ్‌బెజోస్ దెబ్బకు దిగివచ్చిన నాసా..! -
అంతరిక్ష పర్యాటకంలో మరో ముందడుగు
-
అంతరిక్ష పర్యాటకంలో మరో ముందడుగు
కేప్ కనావెరల్ (అమెరికా): వ్యోమగాములు లేకుండా, ఎలాంటి అంతరిక్ష యాత్రల అనుభవంలేని సాధారణ పౌరులతో తొలిసారిగా స్పేస్ టూరిజానికి స్పేస్ఎక్స్ రాకెట్‌తో శ్రీకారం చుట్టారు. ఇన్స్పిరేషన్–4 పేరిట మూడు రోజుల పాటు కొనసాగే ఈ అంతరిక్ష యాత్ర పూర్తి వ్యయ ప్రయాసల బాధ్యతలను అమెరికా కుబేరుడు, ఫిష్ట్4 పేమెంట్స్ సంస్థ అధినేత జేర్డ్ ఐసాక్‌మ్యాన్ తన భుజాలకెత్తుకున్నారు. ముగ్గురు ప్రయాణికులతోపాటు తానూ స్పేస్ఎక్స్ డ్రాగన్ క్యాప్సూల్‌లో కూర్చుని అంతరిక్ష యాత్రకు పయనమయ్యారు. ప్రొఫెషనల్ వ్యోమగాములే లేని ఈ ప్రయోగానికి అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలోని మెరిట్ ద్వీపంలో ఉన్న కెన్నడీ అంతరిక్ష ప్రయోగ కేంద్రం వేదికగా నిలిచింది. భారత కాలమానం ప్రకారం గురువారం ఉదయం గం.5.32 నిమిషాలకు ధవళవర్ణ స్పేస్సూట్లు ధరించిన క్రిస్ సెమ్‌బ్రోస్కీ, జేర్డ్ ఐసాక్‌మ్యాన్, సియాన్ ప్రోక్టర్, హేలే ఆర్సేనెక్స్లతో స్పేస్ఎక్స్ సంస్థకు చెందిన ఫాల్కన్–9 రాకెట్ నింగిలోకి దూసుకుపోయింది. చదవండి: బిడ్డకు భర్త పేరు పెట్టుకున్న యూఎస్ అమర సైనికుని భార్య ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలతో మొదలైన ఈ ప్రయాణంలో రాకెట్ ఆకాశంలో దాదాపు 160 కి.మీ.ల ఎత్తులో భూమి చుట్టూ పరిభ్రమించనుంది. మూడు రోజులపాటు ఈ యాత్ర కొనసాగనుంది. ఈ రాకెట్ గమనాన్ని ఆటోపైలట్‌మోడ్‌లో భూమి మీద నుంచే నియంత్రిస్తారు. తన స్పేస్ఎక్స్ రాకెట్ ద్వారా కేవలం సాధారణ పౌరులనే నింగిలోకి పంపి ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ సైతం అంతరిక్ష టూరిజం రంగంలోకి అడుగుపెట్టినట్లయింది. నేరుగా అంతరిక్ష ప్రయాణం చేసిన మూడో బిలియనీర్‌గా ఈ–కామర్స్ దిగ్గజం ఐసాక్‌మ్యాన్ చరిత్రలకెక్కారు. ఈ జూలై నెలలోనే ఇప్పటికే తమ సొంత రాకెట్లలో వర్జిన్ గెలాక్టిక్ యజమాని రిచర్డ్ బ్రాన్సన్, బ్లూ ఆరిజిన్స్ అధినేత జెఫ్ బెజోస్ అంతరిక్షయానం చేసి అంతరిక్ష పర్యాటక యాత్రల పరంపరను మొదలుపెట్టడం తెల్సిందే. తర్వాతి ప్రయాణాలకు మార్గదర్శకంగా.. ఈ ప్రయాణం విజయవంతమైతే దీనిని తదుపరి సాధారణ ప్రయాణికుల పర్యాటక యాత్రలకు మార్గదర్శకంగా భావించనున్నారు. మూడు రోజుల యాత్రలో భాగంగా ఈ నలుగురి ఆరోగ్య స్థితిని అంతరిక్షంలో పరీక్షించనున్నారు. వారి గుండె కొట్టుకునే వేగం, మేథో శక్తి, నిద్ర, రక్త ప్రసరణ తదితర అంశాలనూ పరిశీలించనున్నారు. ప్రయాణాన్ని వారు మరింతగా ఆస్వాదించేందుకు వీలుగా స్పేస్ఎక్స్ రాకెట్ పై భాగంలో తొలిసారిగా అతిపెద్ద డోమ్ విండోను ఏర్పాటుచేశారు. ‘ఇది అద్భుతం’ అని ఐసాక్‌మ్యాన్ వ్యాఖ్యానించారు. డ్రాగన్ క్యాప్సూల్‌లో ప్రయాణంలో సమస్యలొస్తే ఎలా ఎదుర్కోవాలో వివరిస్తూ వీరందరికీ వాషింగ్టన్లో ఆరు నెలల పాటు శిక్షణ ఇచ్చారు. వచ్చే ఏడాది తొలినాళ్లలో మరో ట్రిప్ ముగ్గురు అత్యంత ధనవంతులైన ప్రయాణికులు, ఒక మాజీ నాసా వ్యోమగామితో వారంపాటు కొనసాగే మరో అంతరిక్ష పర్యాటక యాత్ర వచ్చే ఏడాది తొలినాళ్లలో ఉంటుందని స్పేస్ఎక్స్ వెల్లడించింది. రష్యాకు చెందిన నటి, దర్శకుడు, జపాన్‌కు చెందిన వ్యాపార దిగ్గజం ఈ యాత్రలో పాలుపంచుకుంటారని పేర్కొంది. చదవండి: చైనా మరో కుతంత్రం..! ఏకంగా 30 విమానాశ్రయాల నిర్మాణం..! ఇద్దరు విజేతలు, ఒక హెల్త్‌కేర్ వర్కర్, ఒక కుబేరుడు నలుగురితో మొదలైన ఈ ఇన్స్పిరేషన్–4 యాత్రలో హేలే ఆర్సేనెక్స్ అనే 29 ఏళ్ల మహిళా హెల్త్‌కేర్ వర్కర్ ఉన్నారు. ఎముక క్యాన్సర్ బారినపడి కోలుకున్న ఈమె తాను చికిత్సపొందిన టెన్నెస్సీలోని పరిశోధనా వైద్యశాలలోనే విధులు నిర్వర్తిస్తున్నారు. నింగిలోకి దూసుకెళ్లిన అత్యంత పిన్న అమెరికన్‌గా ఈమె రికార్డు సృష్టించారు. ప్రయాణికుల్లో ఒకరైన ఐసాక్‌మ్యాన్ ఈ ఆస్పత్రికి 10 కోట్ల డాలర్ల విరాళం ఇచ్చారు. వాషింగ్టన్లో డాటా ఇంజనీర్‌గా పనిచేస్తున్న క్రిస్ సెమ్‌బ్రోస్కీ(42) సైతం యాత్రలో పాలుపంచుకున్నారు. ఆరిజోనాలోని కాలేజీలో జియాలజీ ప్రొఫెసర్ అయిన ఆఫ్రికన్ అమెరికన్ మహిళ సియాన్ ప్రోక్టర్(51) సైతం ఈ యాత్రకు ఎంపికయ్యారు. ప్రయాణికుల ఎంపిక కోసం జరిగిన పోటీలో క్రిస్, ప్రోక్టర్లు విజేతలుగా నిలిచారు. నింగిలోక దూసుకెళ్తున్న ఫాల్కన్ రాకెట్ -
స్పేస్ఎక్స్: నలుగురు మనుషులు,కక్ష్యలో 3 రోజుల ప్రయాణం
అపరకుబేరుడు ఎలాన్ మస్క్ తన చిరకాల స్వప్నాన్ని నెరవేర్చుకునే పనిలో పడ్డారు. స్పెస్ ఎక్స్ తయారు చేసిన ఫాల్కన్ 9 రాకెట్ సాయంతో 'ఇన్స్పిరేషన్4' పేరుతో నలుగురిని కక్ష్య(orbit)లోకి పంపనున్నారు. అలా కక్ష్యలోకి వెళ్లిన ఆ నలుగురు మూడురోజుల పాటు ప్రయాణించి తిరిగి భూమిపైకి రానుడంగా ఈ స్పేస్ ప్రయాణానికి సర్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 15నే ప్రయాణం యుఎస్ ఎయిర్ ఫోర్స్ స్కూల్ ఆఫ్ అడ్వాన్స్డ్ ఎయిర్ అండ్ స్పేస్ స్టడీస్ కు చెందిన స్ట్రాటజీ అండ్ సెక్యూరిటీ స్టడీస్ ప్రొఫెసర్ వెండి విట్మన్ కాబ్ ఆధ్వర్యంలో ఓ కాన్వర్జేషన్ జరుగుతుంది. ఈ కాన్వర్జేషన్ సందర్భంగా సెప్టెంబర్ 15న నలుగురు ప్రైవేట్ వ్యోమగాములు స్పేస్ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ సాయంతో ప్రైవేట్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ సాయంతో కక్ష్యలోకి వెళ్లేందుకు అంతరిక్ష ప్రయాణానికి సిద్ధంగా ఉన్నారని అమెరికాకు చెందిన పైలెట్, షిప్ట్4 పేమెంట్ సంస్థ అధినేత ఐజాక్మన్ తెలిపారు. క్యాన్సర్ హాస్పిటల్ కోసమే ఐజాక్మన్ నేతృత్వంలో జరగనున్న అంతరిక్ష ప్రయాణంలో ఐజాక్మన్తో పాటు సియాన్ ప్రొక్టర్,హేలీ ఆర్సెనియాక్స్,క్రిస్టోఫర్ సెంబ్రోస్కీ లు ఈ ప్రాజెక్ట్‌లో పాల్గొననున్నారు. ఈ ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశం సెయింట్ జూడ్ చిల్డ్రన్స్ క్యాన్సర్ రీసెర్చ్ హాస్పిటల్ ఫండింగ్ కోసమేనని తెలుస్తోంది. ఇక ఇప్పటికే స్పేస్ టూరిజంలో భాగంగా 2021,జులై 20న దిగ్గజ సంస్థ ఆమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ అంతరిక్ష ప్రయాణం చేసిన విషయం తెలిసిందే. స్పేస్‌క్రాఫ్ట్ ‘న్యూ షెఫర్డ్’ సాయంతో వ్యోమ నౌకలో జెఫ్ బెజోస్‌తో పాటు అతని సోదరుడు మార్క్ బెజోస్, 82 ఏళ్ల వాలీ ఫంక్, 18 ఏళ్ల ఫిజిక్స్ విద్యార్థి ఆలివర్ డెమెన్ కలిసి ప్రయాణించారు. ఈ నలుగురు భూమి నుంచి సుమారు 100 కి.మీ.ల ఎత్తున ఉన్న కార్మన్ లైన్‌కు ఆవలికి తీసుకువెళ్లి సరిగ్గా 10 నిమిషాల తరువాత తిరిగి భూమిపైకి వచ్చారు. పోటాపోటీ ఎలాన్ స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ సాయంతో నలుగురు కక్ష్యలోకి వెళ్లి 3 రోజుల పాటు ప్రయాణించి .. తిరిగి భూమిని చేరుకోవడం ఆసక్తికరంగా మారింది. చదవండి: ఈపీఎఫ్‌వో ఖాతాదారులకు కేంద్రం శుభవార్త -
స్టార్ షిప్ ఇంజిన్లను పరీక్షించిన స్పేస్ఎక్స్
టెక్సాస్: ఎలాన్ మస్క్ కలల ప్రాజెక్ట్ స్పేస్ఎక్స్ స్టార్ షిప్ ప్రొటోటైప్ సీరియల్ నంబర్ 9(ఎస్ఎన్ 9) రాకెట్ యొక్క మూడు రాప్టర్ ఇంజిన్లను సంస్థ 2 సెకన్ల వరకు మండించింది. ఈ భారీ రాకెట్ ను నేడు(జనవరి 8) గగనతలంలోకి ప్రయోగించడానికి సిద్దమవుతున్నట్లు తెలుస్తుంది. టెక్సాస్‌లోని స్పేస్ఎక్స్ యొక్క బోకా చికా టెస్టింగ్ ఫెసిలిటీ లాంచ్ ప్యాడ్‌లో ఎస్ఎన్ 9 యొక్క రాప్టర్ ఇంజిన్లను మండించింది. గగనతలం ప్రస్తుతం క్లియర్ గా లేదు అని సమాచారం. ఒకవేల నేడు ప్రయోగం సాధ్యం కాకపోతే శని లేదా ఆదివారాల్లో ప్రయోగించనున్నారు. గత రెండు సంవత్సరాలుగా స్పేస్ఎక్స్ తన స్టార్‌షిప్ డిజైన్‌ను పరీక్షిస్తుంది. గత నెలలో ప్రయోగించిన స్టార్ షిప్ ఎస్ఎన్8 విఫలమైన సంగతి మనకు తెలిసిందే. సుమారు 12.5 కిలోమీటర్ల ఎత్తుకు ఎగిరిన ఎస్ఎన్8 ల్యాండింగ్ సమయంలో పేలిపోయింది. ఈ ప్రయోగం పట్ల స్పేస్ఎక్స్ సీఈఓ ఎలన్ మస్క్ సంతోషం వ్యక్తం చేశారు. ప్రయోగం విఫలమైన అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడంతో పాటు, కావాల్సిన సమాచారాన్ని సేకరించింది అని ఎలన్ మస్క్ పేర్కొన్నాడు.(చదవండి: ప్రపంచ కుబేరుడిగా ఎలన్ మస్క్!) -
వాషింగ్టన్: స్టార్‌షిప్ నమూనా రాకెట్ క్రాష్
-
మరోసారి విఫలమైన ‘స్పేస్ఎక్స్’
వాషింగ్టన్: మార్స్ మిషన్‌లో భాగంగా అమెరికా అంతరిక్ష సంస్థ ‘స్సేస్ ఎక్స్’ హెవీ లిఫ్ట్ రాకెట్ స్టార్‌షిప్ నమూనా ఒకటి ల్యాండ్ అవుతుండగా పేలిపోయింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరలవుతోంది. టెక్సాస్‌లో బుధవారం ఉదయం టెస్ట్ లాంచ్ సందర్భంగా ఈ పేలుడు చోటు చేసుకుంది. కానీ సంస్థ మాత్రం ఎంతో ‘అద్భుతమైన పరీక్ష.. స్టార్‌షిప్ టీమ్‌కు ధన్యవాదాలు’ అంటూ మెసేజ్ చేయడం గమనార్హం. టెస్ట్ ప్రారంభానికి కొన్ని నిమిషాల ముందు స్పేస్ ఎక్స్ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ టెస్ట్‌ని ఉద్దేశించి ‘మార్స్.. మేం రాబోతున్నాం’ అంటు ట్వీట్ చేశారు. ల్యాండింగ్ స్పీడ్‌ను పెంచడం వల్లే ఈ పేలుడు సంభంవించినట్లు సమాచారం. స్టార్‌షిప్ క్రాష్ అయినప్పటికి.. ఈ పరీక్షలో విజయవంతమైన భాగాలను ఎలాన్ వివరించారు. టేకాఫ్, దాని (పేలుడు పూర్వ) ఖచ్చితమైన ల్యాండింగ్ పథం వంటి అంశాల్లో విజయం సాధించినట్లు తెలిపారు. ‘స్టార్ షిప్ కూలిపోయినప్పటికి మాకు అవసరమైన మొత్తం డాటా లభించింది! అభినందనలు స్పేస్ఎక్స్ బృందం" అని ఎలాన్ మస్క్ ట్వీట్ చేశారు.(చదవండి: ‘స్పేస్ ఎక్స్’ మరో అద్భుత ప్రాజెక్టు) బుధవారం టెస్ట్ లాంచ్ ప్రారంభం అయిన తర్వాత స్టార్‌షిప్ కక్ష్యలోకి అధిరోహించింది, ఆ తర్వాత ఒకదాని వెంట ఒకటి ఇంజన్లు బయటకు వచ్చాయి. నింగిలోకి దూసుకెళ్లిన 4 నిమిషాల 45 సెకన్ల వ్యవధి తర్వాత స్టార్‌షిప్ మూడవ ఇంజిన్ ఆరిపోయింది. దాన్ని నెమ్మదింపజేసే ప్రయత్నంలో అంతవరకు ఆపేసిన ఇంజన్లను పునః ప్రారంభించారు. కాని అది భూమిపైకి దూసుకెళ్లింది. క్రాష్ అయ్యింది. -
నాసా, స్పేస్ ఎక్స్ మరో అద్భుత విజయం
ఫ్లోరిడా: అంతరిక్ష ప్రయోగాల్లో మరో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. అమెరికాకు చెందిన నాసా, స్పేస్ ఎక్స్ మరో అద్భుత విజయం సాధించాయి. స్పేస్ ఎక్స్ డ్రాగన్ క్యాప్సుల్ ద్వారా అమెరికా వ్యోమగాములు డగ్ హార్లీ, బాబ్ బెంకెన్ అంతరిక్షం నుంచి క్షేమంగా భూమికి చేరుకున్నారు. భారత కాలమనం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి 12.18కి ఫ్లోరిడా తీరంలోని సముద్రంలో డ్రాగన్ క్యాప్సుల్ సురక్షితంగా దిగింది. వీరు సురక్షితంగా భూమికి చేరడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. అపోలో కమాండ్ మాడ్యుల్ అమెరికాలో దిగిన 45ఏళ్ల తర్వాత ఇదే తొలి స్పాష్ డౌన్ అంటూ ఆయన ట్వీట్ చేశారు. ఈ ప్రయోగం విజయవంతం కావడంపై స్పేస్ ఎక్స్ వ్యవస్థాపకుడు ఎలన్ మస్క్ ఆనందం వ్యక్తం చేశారు. 'అంతరిక్షయానం కూడా సాధారణ విమాన ప్రయాణంలాగా మారిపోయినప్పుడు భవిష్యత్‌లో మానవాళి మనుగడకు భద్రత దొరికనట్లే' అంటూ ఎలన్ మస్క్ ట్వీట్ చేశారు. (ట్రంప్‌కి ఎన్ని కల్లలేనా?) "Thanks for flying @SpaceX." 📍 Current Location: Planet Earth A 2:48pm ET, @AstroBehnken and @Astro_Doug splashed down, marking the first splashdown of an American crew spacecraft in 45 years. #LaunchAmerica pic.twitter.com/zO3KlNwxU3 — NASA (@NASA) August 2, 2020 -
స్పేస్ ఎక్స్.. నింగిలోకి వ్యోమగాములు
ఫ్లోరిడా : అంతరిక్ష ప్రయోగాల్లో మరో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. ఓ ప్రైవేటు సంస్థకు చెందిన రాకెట్.. ఇద్దరు నాసా వ్యోమగాములను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి(ఐఎస్ఎస్) తీసుకెళ్లింది. తొమ్మిదేళ్ల తర్వాత అమెరికా గడ్డపై నుంచి వ్యోమగాములు ఐఎస్ఎస్కు వెళ్లడం ఇదే తొలిసారి కావడంతో.. ఈ ప్రయోగంపై అందరిలోను ఆసక్తి నెలకొంది. నాసా ఆధ్వర్యంలో ఫ్లోరిడాలో కెన్నడీ స్పేస్ స్టేషన్ నుంచి శనివారం ఈ ప్రయోగాన్ని చేపట్టారు. స్పేస్ ఎక్స్ రూపొందించిన ఈ ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా డగ్లస్ హర్లీ మరియు రాబర్ట్ బెంకెన్ అంతరిక్షంలోకి ప్రయాణమయ్యారు. దాదాపు 19 గంటల ప్రయాణం తర్వాత వీరు ఐఎస్ఎస్కు చేరుకోనున్నారు. అక్కడ ఉన్న రష్యా వ్యోమగాములు అనాటోలీ ఇవానిషిన్, ఇవాన్ వాగ్నెర్, అమెరికా వ్యోమగామి క్రిస్ కాసిడీలను కలుసుకోనున్నారు. ఈ ప్రయోగంపై స్పేస్ ఎక్స్ వ్యవస్థాపకుడు ఎలన్ మస్క్ ఆనందం వ్యక్తం చేశారు. ఇది తనతోపాటు స్పేస్ ఎక్స్‌లో ఉన్న ప్రతి ఒక్కరి కల అని తెలిపారు. మరోవైపు ఈ ప్రయోగాన్ని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పలువురు అధికారులతో కలిసి వీక్షించారు. ‘ఇది చాలా ప్రత్యేకమైనది. ఈ రోజు మేము అమెరికా గడ్డపై నుంచి, అమెరికన్ రాకెట్లలో, అమెరికా వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపాం’ అని ట్రంప్ పేర్కొన్నారు. వాస్తవానికి బుధవారమే ఈ ప్రయోగం జరగాల్సి ఉన్నప్పటికీ.. వాతావరణం అనుకూలించకపోవడంతో చివరి నిమిషాల్లో వాయిదా పడిన సంగతి తెలిసిందే. Liftoff! pic.twitter.com/DRBfdUM7JA — SpaceX (@SpaceX) May 30, 2020 -
చివరి నిమిషాల్లో స్పేస్ ఎక్స్ ప్రయోగం వాయిదా
ఫ్లోరిడా : అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా చేపట్టిన స్పేస్ ఎక్స్ ప్రయోగం వాయిదా పడింది. తొమ్మిదేళ్ల తర్వాత అమెరికా గడ్డపై నుంచి వ్యోమగాములను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి(ఐఎస్ఎస్) తీసుకెళ్లడానికి ఉద్దేశించిన ఈ మిషన్ ప్రయోగానికి కొన్ని నిమిషాల ముందు వాయిదా పడినట్టు నాసా వెల్లడించింది. వాతావరణం అనుకూలించకపోవడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్టు నాసా తెలిపింది. అన్ని అనుకూలిస్తే స్థానిక కాలమానం ప్రకారం శనివారం మధ్యాహ్నం 3.22 గంటలకు గానీ, ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు స్పేస్ ఎక్స్‌ను నింగిలోకి పంపనున్నారు. ఓ వైపు 2011 తర్వాత యూఎస్ నుంచి వ్యోమగాములు అంతరిక్షంలోకి వెళ్లడం, మరోవైపు తొలిసారిగా ఓ ప్రైవేటు సంస్థ(స్పేస్ ఎక్స్) అభివృద్ధి చేసిన రాకెట్ కావడంతో ఈ ప్రయోగం నాసాకు ప్రతిష్టాత్మకంగా మారింది. కాగా, స్పేస్ ఎక్స్ రూపొందించిన ఈ ఫాల్కన్ రాకెట్ ద్వారా డగ్లస్ హర్లీ, రాబర్ట్ బెంకెన్ అంతరిక్షంలోకి వెళ్లేందుకు అన్ని రకాలుగా సిద్ధమయ్యారు. కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి బుధవారం సాయంత్రం 4.33 గంటలకు రాకెట్ నింగిలోకి వెళ్లడానికి కౌంట్‌డౌన్ స్టార్ అయింది. ప్రయోగ సమయానికి రెండు గంటల ముందే హర్లీ, బెంకెన్‌లు తమ సీట్లలో కూర్చున్నారు. అయితే ప్రయోగానికి సరిగ్గా 16 నిమిషాల ముందు వాతావరణం అనుకూలించకపోవడంతో ప్రయోగాన్ని వాయిదా వేస్తున్నట్టు స్పేస్ ఎక్స్ లాంచ్ డైరెక్టర్ మైక్ టేలర్ వెల్లడించారు. ఈ ప్రయోగాన్ని వీక్షించడానికి ఫ్లోరిడా స్పేస్ కోర్డు వద్దకు భారీగా జనాలు చేరుకున్నారు. అయితే ప్రయోగం వాయిదా పడటంతో వారు కాసింత నిరాశ చెందారు. -
ప్రయోగించిన సెకన్లకే పేలిపోయిన నాసా రాకెట్
మియామి: నాసా పర్యవేక్షణలో ప్రయోగించిన స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ కొద్ది సేపటికే కుప్పకూలింది. భారీ శబ్దం చేస్తూ శకలాలన్ని చెల్లా చెదురుగా సుదూర ప్రాంతాల్లో పడిపోయాయి. పేలిన సందర్భంలో ఆకాశంలో భారీ స్థాయిలో వెలుతురు విగజిమ్మింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి సాధారణంగా సరుకు రవాణా చేసేందుకు కాలిఫోర్నియాకు చెందిన ఇంటర్నెట్ ఎంటర్ ప్రెన్యూర్ ఎలాన్ మస్క్ అనే సంస్థ నాసా సహాయంతో అవసరాలకు తగినట్లుగా రాకెట్ ప్రయోగాలు చేపడుతుంది. ఆ క్రమంలోనే ఆదివారం ఫ్లోరిడాలోని కేప్ క్యానవరాల్ నుంచి ఈ రాకెట్‌ను ప్రయోగించారు. ప్రయోగించిన కొద్ది సేపటికే రాకెట్ పేలిపోగా దాని తాలుకూ చిత్రాలను నాసా సంస్థ స్పష్టంగా చిత్రీకరించింది. రాకెట్ పేలిపోయిన విషయాన్ని నాసా వివరాలు ఎప్పటికప్పుడు అందించే జార్జ్ డిల్లర్ స్పష్టం చేశారు. అసలు ఇలా ఎందుకు జరిగిందనే విషయాన్ని ఇప్పుడే స్పష్టంగా చెప్పలేమని సంబంధిత సంస్థ ప్రకటించింది. ఇంటర్నెట్ ఎంటర్ ప్రెన్యూర్ ఎలాన్ మస్క్ సంస్థ చేపట్టిన ప్రయోగాల్లో తొలి వైఫల్యం ఇదే కావడం విశేషం. రాకెట్ ప్రయోగించిన రెండు నిమిషాల 19 సెకన్లకే కూలిపోవడం అందరినీ ఒకింత షాక్‌కు గురిచేసింది. ఫ్లోరిడాలోని అంతరీక్ష కేంద్రం నుంచి అంతర్జాతీయ అంతరీక్ష కేంద్రానికి బయలుదేరిన ఈ మానవ రహిత ఫాల్కన్ 9 రాకెట్లో.. కొన్ని అత్యవసర వస్తువులు రవాణా చేస్తున్నారు. రాకెట్ పేలుడు దృశ్యాలను నాసా ఛానెల్లో అధికారులు ప్రసారం చేశారు.