పేలిపోయిన స్టార్‌షిప్‌ రాకెట్‌ | SpaceX Starship test flight fails minutes after launch on second attempt | Sakshi
Sakshi News home page

పేలిపోయిన స్టార్‌షిప్‌ రాకెట్‌

Published Sun, Nov 19 2023 6:02 AM | Last Updated on Sun, Nov 19 2023 6:02 AM

SpaceX Starship test flight fails minutes after launch on second attempt - Sakshi

టెక్సాస్‌: స్పేస్‌ ఎక్స్‌ సంస్థ ప్రయోగించిన స్టార్‌షిప్‌ రాకెట్‌ ప్రయోగం విఫలమైంది. ప్రయోగించిన కొద్దిసేపటికే అంతరిక్షంలో పేలిపోయింది. అమెరికాకు చెందిన అపరకుబేరుడు ఎలాన్‌ మస్క్‌కు చెందిన స్పేస్‌ ఎక్స్‌ శనివారం టెక్సాస్‌ నుంచి ఈ ప్రయోగం చేపట్టింది. ఎనిమిది నిమిషాల పాటు ప్రయాణించిన అనంతరం రాకెట్‌ పైభాగం బూస్టర్‌ నుంచి విజయవంతంగా వేరుపడింది.

అనంతరం భూమితో సంబంధాలు తెగిపోయాయి. ప్రత్యక్ష ప్రసారం నిలిచిపోయింది. కొద్దిక్షణాల్లోనే అది పేలిపోయింది. ఇంధనంతో కలిపి ఈ భారీ స్టార్‌ షిప్‌ మొత్తం బరువు 5 వేల టన్నులు కాగా వ్యాసం 9 మీటర్లు, ఎత్తు 121 మీటర్లు. ఇదే సంస్థ ఏప్రిల్‌లో మొదటి ప్రయోగం చేపట్టింది. నాలుగు నిమిషాల పాటు ప్రయాణించిన అనంతరం రాకెట్‌ పేలిపోయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement