rocket launch
-
శతప్రయోగ విజయసీమ
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో మైలురాయిని చేరుకుంది. బుధవారం ఉదయం జరిపిన నూరవ రాకెట్ ప్రయోగంతో చరిత్రలో కొత్త అధ్యాయం లిఖించింది. శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం (షార్)లో రెండో లాంచ్ ప్యాడ్ నుంచి నింగిలోకి ఎగసిన భూ సమకాలిక ఉపగ్రహ ప్రయోగవాహక నౌక (జీఎస్ఎల్వీ–ఎఫ్15) ఎన్వీఎస్–02 ఉపగ్రహాన్ని విజయ వంతంగా నిర్ణీత కక్ష్య అయిన జియోసింక్రనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్ – జీటీఓలోకి చేర్చింది. ఈ కొత్త ఏడాది చేపట్టిన తొలి ప్రయోగం నిర్విఘ్నంగా సాగడం శాస్త్రవేత్తల్లో ఆనందం పెంచింది. రోదసిలో చేరిన ఈ తాజా శాటిలైట్‌తో మన ‘నావిక్’ (నావిగేషన్ విత్ ఇండియన్ కాన్స్టలేషన్)లో విధులు నిర్వహిస్తున్న ఉపగ్రహాల సంఖ్య 4 నుంచి 5కు పెరిగింది. దీని వల్ల మన దేశంతో పాటు మన పొరుగు దేశాలకూ మొబైల్ ఫోన్లలో జీపీఎస్ సహా అనేక సేవల్లో కచ్చితత్వం పెరగనుంది. ఇతర దేశాలన్నీ అమెరికా తాలూకు జీపీఎస్‌పై ఆధారపడితే, భారత్ ఉపగ్రహ ఆధారిత నావిగేషన్‌లో సొంత కాళ్ళపై నిలబడేందుకు చేస్తున్న ఈ కృషి సగటు భారతీయుడి ఛాతీ ఉప్పొంగే క్షణం. సైకిళ్ళు, ఎడ్లబండ్లపై రాకెట్ విడిభాగాలను తరలించిన కాలం నుంచి ఇటీవలే అంతరిక్షంలో రెండు ఉపగ్రహాలను అనుసంధానించే (డాకింగ్ చేసే) స్థాయికి ఇస్రో చేరడం చిరకాలం చెప్పుకోవా ల్సిన స్ఫూర్తిగాథ. విక్రమ్ సారాభాయ్, సతీశ్ ధవన్ లాంటి దిగ్గజాల తొలి అడుగులతో ఆరంభించి, ఆపైన కలామ్ లాంటి వారి మేధను వినియోగించుకొని అయిదు దశాబ్దాల పైగా సాగించిన ప్రస్థానం చిరస్మరణీయం. 1962లో అణుశక్తి విభాగం కింద ఏర్పాటైన ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రిసెర్చ్ ద్వారా ఇస్రోకు బీజం పడింది. చంద్రుడి మీదకు అమెరికా మానవుణ్ణి పంపిన 1969లోనే ఇప్పుడు మనం చూస్తున్న ఇస్రో స్థాపన జరిగింది. 1972లో ప్రత్యేకంగా అంతరిక్ష శాఖ ఏర్పాటైంది. ఆనాటి నుంచి ఈనాటి వరకు మన అంతరిక్ష పరిశోధనా సంస్థ అనేక రాకెట్లకు పురుడు పోయడమే కాక, ఇతర దేశాల ఉపగ్రహ ప్రయోగాలలోనూ విశ్వసనీయ భాగస్వామిగా ఎదిగింది. మన ఇస్రో 1979 ఆగస్ట్ 10న తొలిసారిగా ఉపగ్రహ ప్రయోగ నౌక (ఎస్ఎల్వీ–3 ఈ10) ద్వారా ప్రయోగాత్మకంగా రోహిణీ టెక్నాలజీ పేలోడ్‌ను నింగిలోకి పంపిన క్షణాలు ఆ తరంలో చాలామందికి ఇప్పటికీ గుర్తే. అప్పట్లో ఇస్రోతో పనిచేస్తున్న అబ్దుల్ కలామే ఆ ప్రయోగానికి డైరెక్టర్. సదరు ప్రయోగం పాక్షికంగానే విజయం సాధించింది కానీ, ఆ తర్వాత కాలగతిలో అంతరిక్ష ప్రయోగాల్లో మనం అగ్రరాజ్యాలకు దీటుగా ఆరితేరాం. అంకెల్లో చెప్పాలంటే, ఇప్పటి వరకు ఇస్రో 548 ఉప గ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. దాదాపు 120 టన్నుల పేలోడ్‌ను నింగిలోకి పంపింది. అందులో 433 విదేశీ ఉపగ్రహాలకు చెందిన 23 టన్నులూ ఉంది. ఈ సుదీర్ఘ ప్రయాణంలో షార్ కేంద్రం ఎన్నో చరిత్రాత్మక ఘట్టాలకు వేదికైంది. మూడు చంద్రయాన్‌లు, ఒక మార్స్ ఆర్బిటర్ ప్రయోగం, ఆదిత్య ఎల్1 ప్రయోగం లాంటివి గణనీయమైనవి. కక్ష్యలో పరిభ్రమించే వ్యోమనౌకను భూవాతావరణంలోకి ప్రవేశింపజేసి... భూమి పైకి క్షేమంగా తెచ్చి రికవరీ చేసే ‘స్పేస్ క్యాప్సూల్ రికవరీ ప్రయోగం’ (ఎస్ఆర్ఈ), అలాగే ఒకే రాకెట్‌తో 104 శాటిలైట్లను కక్ష్యలోకి ప్రవేశపెట్టడం వగైరా ప్రత్యేకంగా చెప్పుకోదగ్గవి. ఇస్రో ప్రయోగించినవాటిల్లో కమ్యూనికేషన్ శాటిలైట్లు, భూ పరిశీలన ఉపగ్రహాలు, మార్గనిర్దేశక (నావిగేషనల్), ప్రయోగాత్మక శాటిలైట్లు అనేకం. ఆ వివరాలు సగర్వంగా తోస్తాయి. రానున్న రోజుల్లోనూ మరిన్ని చారిత్రక ఘట్టాలకు ఇస్రో చోదకశక్తి కానుంది. గగన్‌యాన్‌లో భాగంగా మానవరహిత జి1 ప్రయోగం తొలిసారి చేయనున్నారు. అలాగే, నెక్స్›్ట జనరేషన్ లాంచ్ వెహికల్ (ఎన్జీఎల్వీ), చంద్రయాన్, శుక్రయాన్ జరగనున్నాయి. ప్రైవేట్ ఉపగ్రహ ప్రయోగాలకు సైతం వేదికగా నిలిచి, అంతరిక్ష వాణిజ్యంలో తగిన వాటా కోసం ప్రయత్నిస్తున్న ఇస్రో మరో రెండేళ్ళలో శ్రీహరికోటలో మూడో లాంచ్ ప్యాడ్‌ను నిర్మించనుండడం విశేషం. అలాగే, తమిళనాడులోని కులశేఖరపట్నంలో రెండో ఉపగ్రహ ప్రయోగ కాంప్లెక్స్ సైతం సిద్ధమవుతోంది. భారీ పేలోడ్ లను రోదసిలోకి తీసుకెళ్ళగలిగే ఎన్జీఎల్వీల రూపకల్పనకూ, మూడో లాంచ్ ప్యాడ్ నిర్మాణానికీ దాదాపు రూ. 4 వేల కోట్లు ఖర్చవుతుంది. అంత మొత్తం వెచ్చించేందుకు ప్రభుత్వం ముందుకు రావడం విశేషం. భారత అంతరిక్ష పరిశోధన, ప్రయోగ రంగానికి ఇది పెద్ద ఊతం. ఇవన్నీ ప్రైవేట్ రంగ రోదసీ ప్రయోగాల్లో ఇస్రో సింహభాగం దక్కించుకోవడానికి ఉపకరిస్తాయి. ఒకప్పుడు అగ్రరాజ్యాలు సాంకేతిక విజ్ఞానాన్ని అందించడానికి నిరాకరించినప్పుడు స్వశక్తితో దేశీయంగా బుడిబుడి అడుగులతో మొదలుపెట్టిన భారత్ దాదాపు అయిదు పదుల ఏళ్ళలో శత రోదసీ ప్రయోగాలు సాగించింది. రానున్న అయిదేళ్ళలోనే రెండో శతం పూర్తి చేసి, మొత్తం 200 ప్రయోగాల మైలురాయికి చేరుకోవడానికి ఉరకలు వేస్తోంది. ఇన్నేళ్ళుగా మన అంతరిక్ష పరిశోధ కులు, శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు చూపుతున్న అచంచలమైన నిబద్ధత, అంకితభావానికి మచ్చుతునక ఈ ఇస్రో విజయగీతిక. విశ్వవేదికపై అగ్రరాజ్యాల సరసన అంతరిక్షంలో భారత్ సూపర్ పవర్‌గా ఎదిగిందనడానికీ ఇది ప్రతీక. అనేక ఆర్థిక, సాంకేతిక పరిమితులు ఉన్నప్పటికీ సృజనాత్మకంగా ఆలోచించి, పరిస్థితులకు తగ్గట్లు మనల్ని మనం మలుచుకొంటే గణనీయ విజయాలు సాధ్యమే అనడానికి ఇదే తిరుగులేని రుజువు. 1975లో తొలి ఉపగ్రహం ఆర్యభట్ట ప్రయోగం నుంచి ఆ మధ్య మంగళ్యాన్ వరకు ప్రతిసారీ తక్కువ ఖర్చుతో, అంచనాలకు అందని విజయాలు సాధించిన మన శాస్త్రవేత్తల ఘనతకు భవిష్యత్తులోనూ ఆకాశమే హద్దు. -
జీఎస్ఎల్వీ-ఎఫ్ 15 రాకెట్ ప్రయోగం విజయవంతం
-
ఇస్రోకు ‘వంద’నం!
సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఆరు దశాబ్దాలుగా ఆకాశమే హద్దుగా దూసుకుపోతోంది. ఎంతోమంది మహామహుల కృషి ఫలితంగా నేడు 99 ప్రయోగాలను పూర్తిచేసి వందో ప్రయోగాన్ని నిర్వహించేందుకు సిద్ధమైంది. నాటి ఆర్యభట్ట నుంచి చంద్రుడిపై రోవర్‌తో పరిశోధనలు, డాకింగ్ టెక్నాలజీ అందుబాటులోకి తెచ్చుకున్న స్పేడెక్స్ ఉపగ్రహ ప్రయోగాలతో భారత అంతరిక్ష యాత్ర అప్రతిహతంగా సాగుతోంది.ఈ నేపథ్యంలో.. శ్రీహరికోట రాకెట్ కేంద్రం ఈనెల 29న ప్రయోగించబోయే జీఎస్ఎల్వీ ఎఫ్15 ప్రయోగంతో సెంచరీ పూర్తిచేయడానికి ఉవ్విళ్లూరుతోంది. ఈ ప్రయోగంతో ఇస్రో సొంతంగా 100 ప్రయోగాలను పూర్తిచేసిన జాబితాలో చేరనుంది. ఎస్ఎల్వీ రాకెట్లు 4, ఏఎస్ఎల్వీలు 4, పీఎస్ఎల్వీలు 62, జీఎస్ఎల్వీలు 16, ఎల్వీఎం3– 7, ఎస్ఎస్ఎల్వీలు 3, స్క్రామ్‌జెట్ 1, ఆర్ఎల్వీ టీడీ 1, క్రూ ఎస్కేప్ సిస్టం 1 మొత్తం కలిపి 99 ప్రయోగాలు చేశారు. ఈ రాకెట్ల ద్వారా 129 స్వదేశీ ఉపగ్రహాలు, 18 స్టూడెంట్ ఉపగ్రహాలు, 9 రీఎంట్రీ మిషన్లు, 433 విదేశీ ఉపగ్రహాలు, రెండు ప్రైవేట్ ఉపగ్రహాలు, ఒక గగన్‌యాన్ టెస్ట్ వెహికల్–డీ1 పేర్లతో 592 ఉపగ్రహాలను ప్రయోగించి చరిత్ర సృష్టించారు. ఇక ఈ 99 ప్రయోగాల్లో 89 విజయవంతమయ్యాయి. ఉపగ్రహాలతో ఉపయోగాలు.. సముద్రాలు, భూమిపై అధ్యయనం చేసేందుకు.. భూమి పొరల్లో దాగివుండే నిధి నిక్షేపాలను తెలియజేసేందుకు.. పట్టణ ప్రణాళికాభివృద్ధి, వాతావరణ పరిస్థితులపై అధ్యయనం.. రైతులకు ఉపయోగపడే ఎన్నో ప్రయోజనాల కోసం దూర పరిశీలనా ఉపగ్రహాలు (రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్), రేడియో, టెలివిజన్, డీటీహెచ్, టెలీ ఎడ్యుకేషన్, టెలీ మెడిసన్, ఇంటర్నెట్, ఆండ్రాయిడ్ టెక్నాలజీ లాంటి ఎన్నో ప్రసారాలను మెరుగుపరిచేందుకు సమాచార ఉపగ్రహాలు (కమ్యూనికేషన్ శాటిలైట్స్)ను పంపించారు.విశ్వంలోని చంద్రుడు, సూర్యుడు, అంగారక గ్రహాల మీద పరిశోధనకు చంద్రయాన్–1, 2, 3 మంగళ్యాన్–1, సూర్యయాన్–1 అనే మూడు ఉపగ్రహాలతో పరిశోధనలు చేస్తున్నారు. ఉపగ్రహాల సామర్థ్యాన్ని కూడా నిర్థారించుకునేందుకు ఎక్స్పరిమెంట్ ఉపగ్రహాలు, నావిగేషన్ వ్యవస్థకు చెందిన ఉపగ్రహాలు, ఖగోళం, వాతావరణం గురించి తెలియజేసేందుకు స్పేస్ సైన్స్ ఉపగ్రహాలు, విద్యార్థులకు ఉపయోగపడే స్టూడెంట్ శాటిలైట్స్ అన్నీ కలుపుకుంటే ఇప్పటివరకూ 159 ఉపగ్రహాలను పంపారు. ఇస్రో చరిత్రలోకి వెళ్తే.. 1961లో డాక్టర్ హోమీ జే బాబా అనే శాస్త్రవేత్త అంతరిక్ష ప్రయోగాలకు డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ (డీఏఈ)ని ప్రారంభించారు. ఈ సంస్థను అభివృద్ధి చేసి 1962లో ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్‌గా ఉద్భవించింది. దీనికి అంతరిక్ష పితామహుడు డాక్టర్ విక్రమ్ సారాభాయ్ చైర్మన్‌గా నియమితులయ్యారు. ఆయన ఆధ్వర్యంలో కేరళలోని తిరువనంతపురం సమీపంలో తుంబా ఈక్విటోరియల్ లాంచింగ్ స్టేషన్‌ను ఏర్పాటు చేశారు. 1963 నవంబర్ 21న 5 దేశాల సాయంతో దిగుమతి చేసుకున్న ‘నైక్ అపాచి’ అనే 2 దశల సౌండింగ్ రాకెట్‌ను ప్రయోగించారు. సారాభాయ్ ఆధ్వర్యంలో.. దేశంలో సొంతంగా రాకెట్ కేంద్రం, ఉపగ్రహాల తయారీ కేంద్రం ఏర్పాట్లు చేసుకోవాలని డాక్టర్ విక్రమ్ సారాభాయ్ ముందుకు సాగారు. ఆయన చేసిన ప్రయత్నాలకు నాటి ప్రధాని ఇందిరాగాంధీ ఆధ్వర్యంలో తుంబాలో సౌండింగ్ రాకెట్ కేంద్రాన్ని ఏర్పాటుచేసుకుని 1967 నవంబర్ 20న రోహిణి–75 అనే సౌండింగ్ రాకెట్‌ను పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించి విజయంతంగా ప్రయోగించారు. ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ సంస్థను 1969లో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థగా పేరు మార్చారు.1970లో డిపార్ట్మెంట్ స్పేస్ కమిషన్‌ను ఏర్పాటు చేశారు. 1963లో తుంబా నుంచి సౌండింగ్ రాకెట్ ప్రయోగాలతో మన అంతరిక్ష ప్రయోగాల వేట మొదలైంది. తూర్పు తీర ప్రాంతాన.. డాక్టర్ విక్రమ్ సారాభాయ్, ఇందిరాగాంధీ 1969లో ముందుగా అరేబియా సముద్ర తీర ప్రాంతంలో స్థలాన్వేషణ చేశారు. ముందుగా గుజరాత్లో చూసి అక్కడ గ్రావిటీ పవర్ ఎక్కువగా ఉండడంతో తూర్పున బంగాళాఖాతం తీర ప్రాంతంలో స్థలాన్వేషణ చేస్తున్న సమయంలో పులికాట్ సరస్సుకు బంగాళాఖాతానికి మధ్యలో 44 చదరపు కిలోమీటర్లు విస్తరించిన శ్రీహరికోట దీవి ప్రాంతం కనిపించింది. ఈ ప్రాంతం భూమధ్య రేఖకు 13 డిగ్రీల అక్షాంశంలో ఉండడం, గ్రావిటీ పవర్ తక్కువగా ఉండడంతో రాకెట్ ప్రయోగాలకు అనువుగా ఉంటుందని సారాభాయ్ శ్రీహరికోటను ఎంపిక చేశారు. ఇక్కడున్న సుమారు 56 గ్రామాలను ఖాళీ చేయించి రాకెట్ కేంద్రాన్ని ఏర్పాటుచేశారు. దురదృష్టవశాత్తూ 1970 డిసెంబరు 30న డాక్టర్ విక్రమ్ సారాభాయ్ మృతిచెందడంతో ఆ బాధ్యతలను వెంటనే ప్రొఫెసర్ సతీష్ ధవన్‌కు అప్పగించారు. ఆర్యభట్టతోనే అడుగులు.. ఒకవైపు శ్రీహరికోటలో రాకెట్ కేంద్రాన్ని ఏర్పాటుచేస్తూనే మరోవైపు బెంగళూరులో శాటిలైట్ తయారీ కేంద్రంలో 1975లో ఆర్యభట్ట ఉపగ్రహాన్ని తయారుచేసుకుని రష్యా నుంచి ప్రయోగించి మొదటి ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపించారు. శ్రీహరికోట రాకెట్ కేంద్రం పూర్తిస్థాయిలో రూపాంతరం చెందాక మొదటి ప్రయోగ వేదిక నుంచి 1979 ఆగస్టు 10 ఎస్ఎల్వీ–3 ఇ1 పేరుతో రాకెట్ ప్రయోగాలకు శ్రీకారం చుట్టారు. అనంతరం.. ఏఎస్ఎల్వీ, పీఎస్ఎల్వీ, జీఎస్ఎల్వీ రాకెట్లను అభివృద్ధిచేశారు. ఇండియన్ రాకెట్ల ద్వారా కమ్యూనికేషన్ శాటిలైట్స్ (సమాచార ఉపగ్రహాలు) రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ (దూరపరిశీలనా ఉపగ్రహాలు), ఇండియన్ రీజినల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టం (భారత క్షేత్రీయ దిక్చూచి ఉపగ్రహాలు), వాతావరణ పరిశోధనలకు ఆస్రోనాట్ ఉపగ్రహాలు, గ్రహంతర ప్రయోగాలు (చంద్రయాన్–1, మంగళ్యాన్–1, చంద్రయాన్–1), అంతరిక్షంలో స్పేస్ స్టేషన్ నిర్మాణం కోసం సేడెక్స్ ఉపగ్రహాలతో డాకింగ్ టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చుకుని నాలుగో దేశంగా భారత్ ఖ్యాతి గడించింది. అలాగే, రష్యా, అమెరికా, ఫ్రాన్స్ దేశాల అంతరిక్ష సంస్థల నుంచి రాకెట్ల ద్వారా 30 ఉపగ్రహాలను పంపించిన ఇస్రో ఇప్పుడు 37 దేశాలకు చెందిన 433 విదేశీ ఉపగ్రహాలను పంపించి రికార్డు నెలకొల్పింది. షార్‌లో అత్యాధునిక సౌకర్యాలు.. ఇక శ్రీహరికోట రాకెట్ కేంద్రంగా గుర్తించిన మొదటి రోజుల్లో సౌండింగ్ రాకెట్లు, ఆ తరువాత చిన్నపాటి లాంచ్ప్యాడ్ల మీద ఎస్ఎల్వీ, ఏఎస్ఎల్వీ రాకెట్లను ప్రయోగించారు. చిన్నచిన్న ప్రయోగాల్లో రాటుదేలడంతో పెద్ద ప్రయోగాలు చేయడానికి మొదటి ప్రయోగ వేదికను నిర్మించారు. దీనిపై 1990 నంచి 2005 దాకా ఎన్నో ప్రయోగాలు చేసి విజయాలు సాధించారు. ఆ తరువాత భవిష్యత్తులో అత్యంత బరువైను ఉపగ్రహాలను ప్రయోగించేందుకు మరో ప్రయోగ వేదిక అవసరాన్ని 2002లో గుర్తించారు. అంచెలంచెలుగా ఇక్కడ అత్యాధునిక సౌకర్యాలు కల్పించారు.ఇస్రో చైర్మన్లు వీరే.. 1963–71: డాక్టర్ విక్రమ్ సారాభాయ్ 1972లో 9 నెలలు పాటు ఎంజీకే మీనన్ 1973–84 : ప్రొఫెసర్ సతీష్ ధవన్ 1984–94 : డాక్టర్ యూఆర్ రావు 1994–2003 : డాక్టర్ కస్తూరి రంగన్ 2003–2009 : ఈకే మాధవన్ నాయర్ 2009–2014 : డాక్టర్ కే రాధాకృష్ణన్ 2015లో 11 రోజులపాటు శైలేష్ నాయక్ 2015–2018 : ఏఎస్ కిరణ్‌కుమార్ 2018–2022 : డాక్టర్ కైలాసవాడివో శివన్ 2022–2025 : డాక్టర్ ఎస్ సోమనాథ్ 2025 జనవరి 14 నుంచి : డాక్టర్ వీ నారాయణన్షార్ డైరెక్టర్లు.. 1969–76 : వై జనార్థన్‌రావు 1977–85 : కల్నల్ ఎన్ పంత్ 1985–89 : ఎంఆర్ కురూప్. 1989–94 : ఆర్. అరవాముదన్ 1994లో : (6 నెలలు) శ్రీనివాసన్ 1994–99 : డాక్టర్ ఎస్ వసంత్1999–2005 : డాక్టర్ కాటూరి నారాయణ 2005–2008 : ఎం అన్నామలై 2008–2012 : ఎం చంద్రదత్తన్ 2013–2015 : ఎంవైఎస్ ప్రసాద్ 2015–2018 : పీ కున్హికృష్ణన్ 2018–2019 : ఎస్ పాండ్యన్ 2019 నుంచి : ఎ.రాజరాజన్ -
సరికొత్త చరిత్ర సృష్టించిన ఇస్రో
-
ఇవాళ రాత్రి పీఎస్ఎల్ వీ సీ-60 ప్రయోగం
-
PSLV C-59 ప్రయోగం విజయవంతం
-
PSLV C-59 రాకెట్ ప్రయోగానికి సర్వం సిద్ధం
-
భారత్ అమ్ములపొదిలో మరో అస్త్రం..
-
అలెక్సా చెబితే టపాసు వింటోంది!
దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని చాలామంది టపాసులు కాలుస్తారు. కొంతమంది సరైన నిబంధనలు పాటించకుండా వాటిని కాల్చి గాయాలపాలవుతారు. అలాంటి వారికోసం టెక్నాలజీ వినియోగించి టపాసులను నేరుగా ముట్టించకుండా కాల్చే విధానాన్ని ఇటీవల ఓ వ్యక్తి ప్రయోగించారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. అమెజాన్ ఏఐ అలెక్సాను ఉపయోగించి టపాసు పేల్చినట్లు ఉన్న ఈ వీడియోను ఇప్పటికే 1.3 కోట్ల మంది వీక్షించడం గమనార్హం.ఇదీ చదవండి: టికెట్ బుక్ అవ్వకుండానే రూ.100 కట్! ఐఆర్సీటీసీ రిప్లై ఇదే..హైటెక్ లాంచ్మనీస్ప్రాజెక్ట్ల్యాబ్ అనే ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ అప్లోడ్ చేసిన వీడియో ప్రకారం..అమెజాన్‌కు చెందిన ఏఐ అలెక్సాతో టపాసు రాకెట్‌ను అనుసంధానించారు. ‘అలెక్సా లాంచ్ ది రాకెట్’ అనే కమాండ్ ఇవ్వగానే అలెక్సా ‘యెస్ బాస్, లాంచింగ్ ది రాకెట్’ అని రిప్లై రావడంతోపాటు అప్పటికే రాకెట్ చివర నిప్పు రాజుకునేలా వైర్లతో ఏర్పాటు చేశారు. దాంతో అలెక్సా కమాండ్ స్వీకరించిన వెంటనే వైర్లలో కరెంట్ సరఫరా అయి నిప్పు రావడంతో రాకెట్ గాల్లోకి దూసుకెళ్లడం వీడియోలో గమనించవచ్చు. ఇంట్లో చిన్న పిల్లలకు ఈ విధానం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని నెటిజన్లు స్పందిస్తున్నారు. ఇంకొందరు ఈ ప్రయోగం చేసిన వ్యక్తి ఇండియన్ ఇలాన్‌మస్క్ అని సరదాగా రిప్లై ఇస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఇప్పటికే ఈ వీడియోను 13 మిలియన్ల మంది వీక్షించారు. View this post on Instagram A post shared by Mani's Projects Lab (@manisprojectslab) -
రీయూజబుల్ రాకెట్.. రూమీ-1 సక్సెస్
-
ఎస్ఎస్ఎల్ వీడీ-3 ప్రయోగం
-
కాసేపట్లో శ్రీహరికోటలో SSLV D-3 ప్రయోగం
-
ఎస్ఎస్ఎల్వీడీ-3 ప్రయోగం సక్సెస్
సాక్షి,సూళ్లూరుపేట/తిరుమల: శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి శుక్రవారం(ఆగస్టు16) స్మాల్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ (ఎస్ఎస్ఎల్వీ డీ3)ని ఇస్రో శాస్త్రవేత్తలు విజయవంతంగా ప్రయోగించారు.కౌంట్‌డౌన్ ముగియగానే అనుకున్న షెడ్యూల్ ప్రకారం రాకెట్ 9.17 గంటలకు నింగిలోకి దూసుకెళ్లింది. మొత్తం నాలుగు దశల్లో 17 నిమిషాలపాటు జరిగిన రాకెట్ ప్రయోగం విజయవంతమైనట్లు ఇస్రో చైర్మన్ సోమనాథన్ ప్రకటించారు. రాకెట్ ప్రయోగం సక్సెస్ అవడంతో శాస్త్రవేత్తలు సంబరాలు జరుపుకున్నారు. ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ (ఈఓఎస్–08)తో పాటు ఎస్ఆర్–0 డెమోశాట్ అనే చిన్న తరహా ఉపగ్రహాలను 475 కిలోమీటర్లు ఎత్తులోని సర్క్యులర్ ఆర్బిట్‌లో రాకెట్ విజయవంతంగా ప్రవేశపెట్టింది. రక్షణ రంగంతో పాటు విపత్తు నిర్వహణ, ఇతర రంగాలకు ఈ ఉపగ్రహాల సేవలు ఏడాదిపాటు అందనున్నాయి. -
రాకెట్ ప్రయోగం విజయవంతం
-
అగ్నిబాణ్ రాకెట్ ప్రయోగం సక్సెస్
సాక్షి, తిరుపతి: అగ్నిబాణ్ రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్(షార్) నుంచి ప్రైవేట్ రాకెట్ అగ్నిబాణ్ విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. ప్రెవేట్ రాకెట్ ప్రయోగ వేదికపై నుంచి ఉదయం 7 గంటల 15 నిమిషాలకు అగ్నిబాన్ రాకెట్ ప్రయోగం చేశారుఈ ప్రయోగం విజయంతో ప్రెవేటు రాకెట్ ప్రయోగాల పరంపర మొదలైందని ఇస్రో అధికారులు తెలిపారు. భవిష్యత్‌లో 300 కిలోల లోపు చిన్న తరహా ఉపగ్రహాలను లోఎర్త్ ఆర్బిట్‌లో ప్రవేశపెట్టడానికి ఈ తరహా ప్రయోగం చేప్టటింది ఇస్రో. కాగా, ప్రైవేటు స్టార్టప్ కంపెనీ అగ్నికుల్ కాస్మోస్ ఈ రాకెట్‌ను రూపొందించింది. దేశంలోనే తొలి సెమీ క్రయోజనిక్ ఇంజిన్ ఆధారిత రాకెట్‌గా ఇది రికార్డులకెక్కింది. కాగా ఇప్పటికే 3సార్లు వాయిదా పడిన ఈ రాకెట్ ప్రయోగం ఎట్టకేలకు విజయవంతమైంది. -
అగ్నిబాన్ రాకెట్ ప్రయోగం మరోసారి వాయిదా
సూళ్లూరుపేట (తిరుపతి జిల్లా): ప్రైవేటు అంతరిక్ష సంస్థకు చెందిన అగ్నిబాన్ రాకెట్ ప్రయోగం మరోసారి వాయిదా పడింది. సాంకేతిక లోపాల కారణంగా ఈ రాకెట్ ప్రయోగం గతంలో రెండుసార్లు వాయిదా పడింది. అందులో తలెత్తిన సాంకేతిక లోపాలను సరిదిద్ది మంగళవారం తెల్లవారు జామున ప్రయోగానికి సిద్ధం చేశారు. అయితే, ప్రయోగానికి కొద్ది సెకన్ల ముందు మరోసారి సాంకేతిక లోపాన్ని గుర్తించి, ప్రయోగాన్ని నిలిపివేశారు. అగ్నికుల్ కాస్మోస్ ప్రైవేట్ లిమిటెడ్ (చెన్నై) అనే ప్రైవేటు ఎస్ఓఆర్ టీఈడీ మిషన్–01 అనే ఈ చిన్న తరహా రాకెట్‌ను రూపొందించింది.సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్)లోని ధనుష్ రాకెట్ కాంప్లెక్స్ నుంచి ఈ ఏడాది మార్చి 22న తొలిసారి దీనిని ప్రయోగానికి సిద్ధం చేశారు. చివర్లో సాంకేతిక లోపంతో వాయిదా వేశారు. మళ్లీ ఏప్రిల్ నెల 6న మరోసారి ప్రయోగానికి సిద్ధమైనప్పటికీ, సాంకేతికపరమైన కారణాలు, వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో వాయిదా పడింది. వీటిన్నింటినీ అ«ధిగమించి మంగళవారం తెల్లవారుజామున 5.45 గంటలకు మరోసారి ప్రయోగానికి పూనుకొన్నారు. 6 గంటల ముందు నుంచి (సోమవారం అర్ధరాత్రి 12 గంటల నుంచి) కౌంట్‌డౌన్ ప్రారంభించారు. ఆఖర్లో 11 సెకన్లకు ముందు కమాండ్ కంట్రోల్ సిస్టంలో సాంకేతిక లోపం తలెత్తడంతో ప్రయోగాన్ని నిలిపివేశారు.తదుపరి ప్రయోగ తేదీని నిర్దిష్టంగా ప్రకటించలేదు. -
శ్రీహరికోట: అగ్నిబాణం.. ప్చ్ మళ్లీ వాయిదా
సాక్షి, తిరుపతి: శ్రీహరికోట నుంచి జరగాల్సిన ప్రైవేట్ రాకెట్ అగ్నిబాణ్ ప్రయోగం మరోసారి వాయిదా పడింది. సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) వేదికగా ఈ ఉదయం రాకెట్ ప్రయోగాన్ని నిర్వహించాల్సి ఉంది. అయితే మంగళవారం వేకువ ఝామున ప్రయోగానికి ముందు సాంకేతిక సమస్య తలెత్తడంతో వాయిదా వేశారు శాస్త్రవేత్తలు.చెన్నైకి చెందిన అగ్నికుల్ కాస్మోస్ ఏరోస్పేస్ సంస్థ అగ్నిబాణ్ రాకెట్‌ను రూపొందించింది. సొంత ల్యాంచ్‌ప్యాడ్ ఏర్పాటు చేసి సముద్ర మట్టానికి తక్కువ ఎత్తులో ఉపగ్రహాన్ని ప్రవేశ పెట్టాలనుకున్నారు. షెడ్యూల్ ప్రకారం.. ఎనిమిది గంటల కౌంట్‌డౌన్ అనంతరం ప్రైవేట్ ప్రయోగ వేదిక నుంచి ఉదయం 5.48 గంటలకు రాకెట్ నింగిలోకి దూసుకెళ్లాల్సి ఉంది. ప్రయోగాన్ని సమీక్షించేందుకు ఇస్రో అధిపతి డాక్టర్ సోమనాథ్ సోమవారం సాయంత్రమే షార్కు కూడా చేరుకున్నారు. అయితే సాంకేతిక సమస్య తలెత్తడంతో చివరి నిమిషంలో శాస్త్రవేత్తలు ప్రయోగం నిలిపివేశారు.ఏప్రిల్ 7వ తేదీ నుంచి అగ్నిబాణ్ ప్రయోగం వాయిదా పడడం ఇది నాలుగోసారి. దేశంలోనే మొదటి సెమీ క్రయోజనిక్ ఇంజిన్ ఆధారిత రాకెట్‌గా అగ్నిబాణ్ రికార్డులకెక్కింది. దేశీయంగా రూపొందించిన 3డీ ప్రింటెడ్ ఇంజిన్‌ను ఇందులో ఉపయోగిస్తున్నారు. -
నేడు ఇస్రో GSLV-F14 ప్రయోగం..
-
అర్ధ శతాబ్ది తర్వాత చంద్రుడిపై అమెరికా కన్ను
కేప్ కనావరెల్(యూఎస్): యాభై సంవత్సరాల తర్వాత అమెరికా చంద్రుడిపై పరిశోధనలకు నడుం బిగించింది. ఆర్టెమిస్ మిషన్ సన్నాహకాల్లో భాగంగా నాసా.. ఆస్ట్రోబోటిక్ టెక్నాలజీ వారు తయారుచేసిన పెరీగ్రీన్ ల్యాండర్‌ను యూనైటెడ్ లాంఛ్ అలయన్స్ వల్కన్ రాకెట్ ద్వారా నింగిలోకి పంపింది. సోమవారం ఫ్లోరిడాలోని కేప్ కనావరెల్ స్పేస్ ఫోర్స్ స్టేషన్ నుంచి రాకెట్‌ను ప్రయోగించారు. పలుమార్లు కక్ష్యలను మార్చుకుంటూ ఫిబ్రవరి 23వ తేదీన అది చంద్రుడిపై దిగనుంది. దాదాపు రూ.900 కోట్ల వ్యయంతో ఈ ల్యాండర్‌ను తయారుచేశారు. ల్యాండర్ తయారీలో ఆస్ట్రోబోటిక్కు అవకాశం ఇవ్వడం ద్వారా నాసా.. అంతరిక్ష ‘డెలివరీ’ సేవల రంగంలోకి ప్రైవేట్ సంస్థలను ఆహా్వనించినట్లయింది. చంద్రుడిపై దిగాక పెరీగ్రీన్ పలు పరిశోధనలు చేయనుంది. ఈ పరిశోధనలు ఈ ఏడాది చివర్లో నాసా నలుగురు వ్యోమగాములతో చేపట్టే ప్రయోగానికి సాయపడనున్నాయి. ఆస్ట్రోబోటిక్తోపాటు నోవా–సీ ల్యాండర్‌ను తయారుచేసేందుకు హ్యూస్టన్‌కు చెందిన ఇంట్యూటివ్ మెషీన్స్తోనూ నాసా ఒప్పందం కుదుర్చుకుంది. నోవా–సీను ల్యాండర్‌ను వచ్చే నెలలో స్పేస్ఎక్స్ రాకెట్ ద్వారా చంద్రుడి మీదకు పంపనున్నారు. నేరుగా ప్రయాణం కారణంగా పెరిగ్రీన్ కంటే ముందుగా వారం రోజుల్లోనే ఇది చంద్రుడిపై దిగనుంది. 1960, 70 దశకాల్లో చంద్రుడిపై విజయవంతంగా ల్యాండింగ్లతో అమెరికా, సోవియట్ యూనియన్లు పోటాపోటీగా ప్రయోగాలు చేపట్టడం తెల్సిందే. చంద్రుడిపై శోధనాపర్వంలో 2013లో చైనా, 2023లో భారత్ చేరాయి. గతేడాది రష్యా, జపాన్ ల్యాండర్లు విఫలమయ్యాయి. -
ISRO: మన బాహుబలికి అంత బలం లేదట!
అంతరిక్ష పరిశోధనల్లో వరుస సక్సెస్‌లతో భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ.. ఇస్రో(ISRO) ఎదురేలేకుండా దూసుకుపోతోంది. కొత్త ఏడాది ఆరంభం రోజే చేపట్టిన ప్రయోగమూ విజయవంతం కావడంతో శాస్త్రవేత్తలు.. మరింత జోష్‌తో తదుపరి ప్రయోగాలకు సిద్ధం అవుతున్నారు. అయితే.. తన తదుపరి శాటిలైట్ లాంఛ్ కోసం విదేశీ రాకెట్‌ను ఇస్రో ఆశ్రయిస్తుండడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. భారత్ తరఫున తర్వాతి తరం భారీ కమ్యూనికేషన్ ఉపగ్రహం జీశాట్-20 (GSAT-20)ని స్పేస్ఎక్స్కు చెందిన రాకెట్ ద్వారా ప్రయోగించబోతోంది. అయితే దీనిని స్వదేశీ రాకెట్‌తో కాకుండా.. విదేశీ రాకెట్‌తో ప్రయోగించబోతోంది. ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ఎక్స్ కంపెనీలో ఫాల్కన్-9 రాకెట్‌కు భారీ లాంఛర్‌గా పేరున్న సంగతి తెలిసిందే. ఫ్లోరిడాలోని లాంఛింగ్ స్టేషన్ నుంచి ఈ ఏడాది రెండో త్రైమాసికంలో ఫాల్కన్ రాకెట్‌తో భారత శాటిలైట్ ప్రయోగం జరగనుంది. ఇస్రో ఏమందంటే.. గతంలో భారీ ఉపగ్రహాల ప్రయోగం కోసం ఇస్రో కమర్షియల్ విభాగం న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్.. ఫ్రాన్స్‌కు చెందిన ఏరియన్‌స్పేస్ సంస్థతో ఒప్పందాలు కుదుర్చుకునేది. కానీ, ఇప్పుడు స్పేస్ఎక్స్తో ఒప్పందం కుదుర్చుకోవడం ఆసక్తికర చర్చకు దారి తీసింది. అయితే.. ఈ ప్రయోగంపై ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ స్పందించారు. నిర్ణీత సమయానికి రాకెట్ అందుబాటులో లేనందునే స్పేస్‌ఎక్స్‌ను ఆశ్రయించినట్లు స్పష్టం చేశారు. మన బాహుబలి ఉంది కదా! జీశాట్-20 ఉపగ్రహం అత్యంత శక్తివంతమైంది. దీనిని తయారు చేయడానికి ప్రధాన ఉద్దేశం.. మారుమూల ప్రాంతాలకు సేవలు అందించడం. ఇది ఎంత శక్తివంతమైందంటే.. హార్మోనైజ్డ్ టారిఫ్ షెడ్యూల్ (HTS) సామర్థ్యం 48 జీపీబీఎస్. అంతేకాదు.. 32 బీమ్స్ సామర్థ్యంతో అండమాన్ నికోబార్ దీవులు, జమ్ము కశ్మీర్, లక్షదీవులు.. ఇలా పాన్ ఇండియా కవరేజ్ చేయగలిగే సత్తా ఉంది. GSAT-N2గా దీనికి నామకరణం కూడా చేశారు. అయితే ఆ శాటిలైట్ బరువు.. 4,700 కేజీలు. భారత్‌లో ఇస్రో తరఫున ఇప్పటిదాకా ఉన్న లాంఛ్ వెహికిల్ మార్క్ 3(LVM3)నే అత్యధిక బరువు ఉన్న ఉపగ్రహాల్ని మోసుకెళ్తోంది. అందుకే ఇస్రో బాహుబలిగా దానికి పేరు ముద్రపడింది. కానీ, దాని సామర్థ్యం 4 వేల కిలోగ్రాముల దాకానే ఉంది. అందుకే అంతకు మించిన శాటిలైట్ ప్రయోగాల కోసం విదేశీ రాకెట్లపైన ఆధారపడాల్సి వస్తోంది. ఇస్రో ప్రయోగాలకు.. 10 వేల కేజీల రాకెట్లను సైతం మోసుకెళ్లగలిగే తర్వాతి తరం లాంచ్ వెహికిల్స్ (NGLV)రూపకల్పన అవసరం ఉందని ఇస్రో చైర్మన్ సోమనాథ్ అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో బాహుబలిని మించిన రాకెట్ డిజైన్ రూపకల్పన జరిగిపోయిందట. అయితే.. అది ప్రత్యక్ష రూపంలోకి రావడానికి ఇంకా కొన్నేళ్లు పట్టొచ్చని సోమనాథ్ అంటున్నారు. -
నింగిలోకి ఎక్స్‌పోశాట్
సూళ్లూరుపేట (తిరుపతి జిల్లా): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) నూతన సంవత్సరాన్ని దిగ్విజయంగా ఆరంభించింది. సోమవారం చేపట్టిన పీఎస్‌ఎల్‌ఎవీ సీ58 60వ ప్రయోగం విజయవంతమైంది. పీఎస్ఎల్వీ రాకెట్ తొలుత కృష్ణబిలాల పరిశోధనకు ఉద్దేశించిన ఎక్స్‌రే పొలారిమీటర్ శాటిలైట్ (ఎక్స్‌పోశాట్)తో పాటు కేరళ యూనివర్సిటీకి చెందిన బుల్లి ఉపగ్రహం వియ్శాట్నూ రోదసిలోకి ప్రవేశపెట్టింది. అనంతరం చివరిదైన నాలుగో దశలో ఫ్యూయల్ సెల్ పవర్ సిస్టం (ఎఫ్‌సీపీఎస్)తో పాటు మొత్తం పది పరికరాలను దిగువ భూ కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. భారత్ నిర్మించబోయే సొంత అంతరిక్ష కేంద్రానికి ఇంధన లభ్యత కోణంలో ఎఫ్‌సీపీఎస్ ఎంతో కీలకం కానుంది. ప్రయోగం దిగి్వజయం కావడంపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వెలిబుచ్చారు. 2024కు అద్భుత ఆరంభాన్నిచి్చనందుకు శాస్త్రవేత్తలకు అభినందనలన్నారు. నిప్పులు చిమ్ముతూ... సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ షార్‌లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి పీఎస్ఎల్వీ సీ58 ప్రయోగం జరిగింది. ఆదివారం మొదలైన 25 గంటల కౌంట్‌డౌన్ ముగియగానే సోమవారం ఉదయం 9.10 గంటలకు ముగిసింది. ఆ వెంటనే 44.4 మీటర్లు పొడవున్న పీఎస్ఎల్వీ రాకెట్ 260 టన్నుల బరువుతో మంచు తెరలను చీల్చుకుంటూ, నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది. మొత్తం ప్రయోగం నాలుగు దశల్లో 21.55 నిమిషాల్లో పూర్తయింది. ముందుగా ఎక్స్‌పోశాట్ ఉపగ్రహాన్ని భూమికి 650 కిలోమీటర్లు ఎత్తులోని సన్‌సింక్రనస్ ఆర్బిట్‌లోకి విజయవంతంగా ప్రవేశపెట్టారు. అనంతరం కిలో బరువున్న వియ్‌శాట్‌ను కూడా కక్ష్యలోకి నిర్దేశిత సమయంలో ప్రవేశపెట్టారు. ఏడాది తొలి రోజే చేపట్టిన కీలక ప్రయోగం విజయవంతం కావడంతో శాస్త్రవేత్తల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఇస్రో ఛైర్మన్ ఎస్ సోమనాథ్ శాస్త్రవేత్తలను ఆలింగనం చేసుకున్నారు. ఇస్రో ప్రయోగాల పరంపరకు శ్రీకారం చుట్టి ఈ ఏడాదితో 60 ఏళ్లు పూర్తయ్యాయి. పీఎస్ఎల్వీ రాకెట్ సిరీస్‌లోనూ ఇది 60వ ప్రయోగం కావడం విశేషం! మొత్తమ్మీద షార్ నుంచి ఇది 92వ ప్రయోగం. ఫ్యూయల్ సెల్ ప్రయోగం... ఎక్స్‌పోశాట్, వియ్శాట్లను నిరీ్ణత కక్ష్యలోకి ప్రవేశపెట్టాక ప్రయోగ చివరి దశలో పీఎస్ఎల్వీ వ్యోమ నౌకను రెండుసార్లు మండించి దాని ఎత్తును 650 కి.మీ. నుంచి 350 కి.మీకి తగ్గించారు. 10 కీలక పరికరాలను ఆ భూ దిగువ కక్ష్యలోకి విజయవతంగా చేర్చారు. ఫ్యూయల్ సెల్ పవర్ సిస్టం (ఎఫ్‌సీపీఎస్)తో పాటు బెలిఫ్శాట్, గ్రీన్ ఇంపల్స్ ట్రాన్స్మిటర్ బెలాట్రిక్స్ వంటివి వీటిలో ఉన్నాయి. పీఎస్‌ఎలవీ ఆర్బిటల్ ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్–3 (పోయెం) ప్రయోగంలో భాగంగా ఈ ప్రక్రియను చేపట్టారు. 2023 ఏప్రిల్‌లో పీఎస్ఎల్వీ–సీ55 ప్రయోగం సందర్భంగా కూడా పోయెం–2 ద్వారా ఇలాంటి ప్రయోగాన్నే ఇస్రో చేపట్టింది. ► ఇస్రో నిర్మించనున్న భారత అంతరిక్ష కేంద్రానికి ఎఫ్‌సీపీఎస్ కీలకం కానుంది. ► రోదసిలో సుస్థిర శక్తి వనరును సమకూర్చుకోవడం దీని లక్ష్యం. ► ఇందులోని టెక్నాలజీ ఎలక్ట్రో కెమికల్ రియాక్షన్ సాయంతో రసాయన శక్తిని నేరుగా విద్యుచ్ఛక్తిగా మారుస్తుంది. ► తద్వారా మన అంతరిక్ష కేంద్రానికి కావాల్సిన ఇంధనాన్ని ఇది సుదీర్ఘ కాలం పాటు అందించగలదు. ఎక్స్‌పోశాట్‌తో ఉపయోగాలివీ... ► ఉపగ్రహం బరువు 469 కిలోలు. ► ఇది ఐదేళ్ల పాటు సేవలందిస్తుంది. ► గతంలో ప్రయోగించిన ఆస్ట్రోశాట్‌తో కలిసి ఖగోళ పరిశోధన చేపట్టనుంది. ► ఇవి రెండూ విశ్వంతారాల్లో పరిణామాలపై, ముఖ్యంగా కృష్ణ బిలాలపై పరిశోధనలు చేస్తాయి. ► ఎక్స్‌పోశాట్‌లోని ప్రాథమిక పేలోడ్ పోలిక్స్ (ఎక్స్–పోలారిమీటర్ పరికరం)ను 8.3 కిలోవాట్ల ఫోటాన్ల మధ్య వ్యవస్థ ఎక్స్‌రే శక్తి శ్రేణిలో ధ్రువణ పరామితులను, ప్రత్యేకంగా వాటి డిగ్రీ, ధ్రువణ కోణాలను కొలిచేందుకు రూపొందించారు. రామన్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (ఆర్ఆర్ఐ) బెంగళూరు ఇస్రో కేంద్రం దీన్ని రూపొందించింది. ► ఇందులోని మరో పేలోడ్ ఎక్స్పెక్ట్ (ఎక్స్ రే స్పెక్ట్రోస్కోపీ, టైమింగ్) 0.8–15 కిలోవాట్స్ శక్తి పరిధిలో స్పెక్ట్రోస్కోపిక్ సమాచారాన్ని అందిస్తుంది. దీన్ని ఫ్రొపెసర్ యూఆర్ రావు స్పేస్ సెంటర్ రూపొందించింది. ► ఈ రెండు పేలోడ్లు విశ్వాంతరాల్లో కృష్ణ బిలాలపై లోతుగా అధ్యయనం చేసి విలువైన సమాచారం అందిస్తాయి. ► ఇక కేరళ వర్సిటీ విద్యార్థినులు తయారు చేసిన వియ్‌శాట్ కేజీ బరువున్న సూక్ష్మ ఉపగ్రహం. ► కేరళలో మారిన వాతావరణ పరిస్థితుల అధ్యయనం దీని ముఖ్యోద్దేశం. ఈ ఏడాది 12 ప్రయోగాలు: సోమనాథ్ ఈ ఏడాది 12 ప్రయోగాలు లక్ష్యంగా పెట్టుకున్నట్టు ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ తెలిపారు. ‘‘2024ను గగన్‌యాన్ ఏడాదిగా నిర్దేశించుకున్నాం. ఆ ప్రాజెక్టులో భాగంగా ఈ ఏడాది నాలుగు మానవరహిత ప్రయోగాలు చేయనున్నాం. అనంతరం 2025లో మానవసహిత ప్రయోగం ఉంటుంది. నాసాతో సంయుక్తంగా రూపొందించిన ఇన్శాట్–త్రీడీ ఉపగ్రహాన్ని త్వరలో ప్రయోగిస్తాం. ఈ నెల 26న, లేదా ఫిబ్రవరి తొలి వారంలో నావిక్–02 ఉపగ్రహ ప్రయోగం ఉటుంది’’ అని ఆయన వివరించారు. -
నింగిలోకి దూసుకెళ్లిన PSLV C58 రాకెట్
-
పీఎస్ఎల్వీ సీ-58 ప్రయోగం విజయవంతం
Live Updates.. పీఎస్ఎల్వీ సీ-58 విజయవంతపై సీఎం జగన్ హర్షం ►ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ► నూతన సంవత్సరంలో మంచి విజయాన్ని సాధించారు ►అనుకున్న రీతిలోనే ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టటం సంతోషకరం ►భవిష్యత్తులో ఇస్రో మరిన్ని విజయాలు సాధించాలి ►పీఎస్ఎల్వీ సీ-58 ప్రయోగం విజయవంతం. ►2021లో IXPE పేరిట ఈ తరహా ప్రయోగం నిర్వహించిన అమెరికా ►అమెరికా తర్వాత ఇలాంటి ప్రయోగం చేసిన దేశంగా ఘనత దక్కించుకున్న భారత్ ►కొత్త ఏడాదిలో ఇస్రో తొలి ప్రయోగం సక్సెస్ ►శ్రీహరికోటలో ఇస్రో శాస్త్రవేత్తలు సంబరాలు ►శ్రీహరికోట నుంచి నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్ఎల్వీ-సీ 58. #WATCH | PSLV-C58 XPoSat Mission launch | ISRO launches X-Ray Polarimeter Satellite (XPoSat) from the first launch-pad, SDSC-SHAR, Sriharikota in Andhra Pradesh. (Source: ISRO) pic.twitter.com/ua96eSPIcJ — ANI (@ANI) January 1, 2024 ►ఎక్స్‌పోశాట్ ఉపగ్రహ జీవితకాలం ఐదేళ్లు. ఎక్స్-రే మూలాలను అన్వేషించడమే ప్రధాన లక్ష్యంగా ప్రయోగం. ►2024 నూతన సంవత్సరం ప్రారంభం రోజునే ఇస్రో తొలి ప్రయోగానికి కౌంట్‌డౌన్ మొదలుపెట్టింది. తిరుపతి జిల్లాలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి నిర్వహించనున్న పీఎస్ఎల్వీ-సీ58 ప్రయోగానికి కౌంట్‌డౌన్ ఆదివారం ఉదయం 8:10 గంటలకు ప్రారంభమైంది. ఇస్రో ఎక్స్ రే పొలారి మీటర్ శాటిలైట్(ఎక్స్పో శాట్)ను ప్రయోగించనుంది. ఇది భారత అంతరిక్ష చరిత్రలో తొలి పొలారిమీటర్ మిషన్ కావడం విశేషం. ►కౌంట్‌డౌన్ అనంతరం సోమవారం ఉదయం 9:10 గంటలకు షార్‌లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి పీఎస్ఎల్వీ వాహకనౌక నింగిలోకి దూసుకెళ్లనుంది. ఇందులో మన దేశానికి చెందిన 480 కిలోల బరువు గల ఎక్స్‌పోశాట్ ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపుతున్నారు. ప్రయోగం తర్వాత 21 నిమిషాలకు ఎక్స్‌పోశాట్ నిర్ణీత కక్ష్యలోకి చేరుకోనుంది. ►అనంతరం రాకెట్లో నాలుగో స్టేజ్ అయిన పీఎస్4 అక్కడి నుంచి దిగువ కక్ష్యకు వస్తుంది. ఇందులో తిరువనంతపురం ఎల్బీఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ విమెన్ కాలేజ్ విద్యార్థినులు తయారుచేసిన విమెన్ ఇంజినీర్డ్ శాటిలైట్ సహా వివిధ ఉపకరణాలు ఉంటాయి. వీటి సాయంతో శాస్త్రవేత్తలు పలు అంశాలపై అధ్యయనం చేయనున్నారు. #WATCH | PSLV-C58 XPoSat Mission launch | Sriharikota, Andhra Pradesh: The launch of the X-Ray Polarimeter Satellite (XPoSat) is set for today at 09:10 am from the first launch-pad, SDSC-SHAR, Sriharikota in Andhra Pradesh. (Visuals from Satish Dhawan Space Centre) pic.twitter.com/c5LkajQEpU — ANI (@ANI) January 1, 2024 ►కాంతివంతమైన అంతరిక్ష ఎక్స్‌రే కిరణాల మూలాల సంక్లిష్టతను, అసాధారణ పరిస్థితుల్లో వాటి ప్రభావాన్ని ఎక్స్ పో శాట్ అధ్యయనం చేయనుంది. ఈ అధ్యయనానికిగాను ఎక్స్‌పోశాట్‌లో రెండు అత్యాధునిక సాంకేతికత కలిగిన పేలోడ్లను అమర్చారు. ఇవి తక్కువ ఎత్తులో గల భూ కక్ష్య నుంచి అధ్యయనాన్ని కొనసాగిస్తాయి. ►ఎక్స్‌పోశాట్‌లోని ప్రాథమిక పరికరం పోలిక్స్ మధ్యతరహా ఎక్స్‌రే కిరణాలను వెదజల్లే మూలాలపై పరిశోధన చేస్తుంది. ఇక మిగిలిన ఎక్స్‌స్పెక్ట్ పేలోడ్ అంతరిక్షంలోని బ్లాక్‌హోళ్లు, న్యూట్రాన్ నక్షత్రాలు, యాక్టివ్ గలాటిక్ న్యూక్లై, పల్సర్ విండ్, నెబ్యులా తదితరాల నుంచి వెలువడే ఎక్స్‌రే కిరణాల స్పెక్ట్రోస్కోపిక్ సమాచారాన్ని అందించనుంది. గడిచిన ఏడాది 2023లో ఇస్రో చంద్రయాన్ 3, ఆదిత్య ఎల్ 1 ప్రయోగాలతో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. -
పేలిపోయిన స్టార్‌షిప్ రాకెట్
టెక్సాస్: స్పేస్ ఎక్స్ సంస్థ ప్రయోగించిన స్టార్‌షిప్ రాకెట్ ప్రయోగం విఫలమైంది. ప్రయోగించిన కొద్దిసేపటికే అంతరిక్షంలో పేలిపోయింది. అమెరికాకు చెందిన అపరకుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ ఎక్స్ శనివారం టెక్సాస్ నుంచి ఈ ప్రయోగం చేపట్టింది. ఎనిమిది నిమిషాల పాటు ప్రయాణించిన అనంతరం రాకెట్ పైభాగం బూస్టర్ నుంచి విజయవంతంగా వేరుపడింది. అనంతరం భూమితో సంబంధాలు తెగిపోయాయి. ప్రత్యక్ష ప్రసారం నిలిచిపోయింది. కొద్దిక్షణాల్లోనే అది పేలిపోయింది. ఇంధనంతో కలిపి ఈ భారీ స్టార్ షిప్ మొత్తం బరువు 5 వేల టన్నులు కాగా వ్యాసం 9 మీటర్లు, ఎత్తు 121 మీటర్లు. ఇదే సంస్థ ఏప్రిల్‌లో మొదటి ప్రయోగం చేపట్టింది. నాలుగు నిమిషాల పాటు ప్రయాణించిన అనంతరం రాకెట్ పేలిపోయింది. -
రూ.225 కోట్ల నిధులు సమీకరించిన స్కైరూట్
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న అంకుర సంస్థ, స్కైరూట్ ఏరోస్పేస్ ‘ప్రీ సిరీస్-సీ ఫైనాన్సింగ్ రౌండ్’లో భాగంగా రూ.225 కోట్లు సమీకరించింది. అంతరిక్ష రంగంలో కార్యకలాపాలు సాగిస్తున్న దేశీయ అంకుర సంస్థ నిధులు సేకరించడం ఇది రెండోసారి. గతంలో 2022లో రూ.400 కోట్లు నిధులు సమీకరించింది. సింగపూర్‌కు చెందిన టెమాసెక్ నేతృత్వంలోని ప్రీ-సిరీస్ సి ఫండింగ్ ద్వారా రూ.225 కోట్ల మేర నిధులు సమీకరించినట్లు సంస్థ ప్రకటన విడుదల చేసింది. అయితే ఫండ్‌రైజింగ్ ద్వారా వచ్చిన సొమ్మును రాకెట్ లాంచింగ్ సమయంలో ప్రయోగ ఫ్రీక్వెన్సీ, సామర్థ్యాలను పెంపొందించడానికి ఉపయోగించే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధికి ఖర్చు చేస్తామని తెలిపారు. దాంతోపాటు నైపుణ్యాలు కలిగిన ఉన్నతస్థాయి ఉద్యోగులను నియమించడానికి వెచ్చిస్తామని చెప్పారు. రానున్న రోజుల్లో సంస్థ మరింత వృద్ధి సాధిస్తుందని కంపెనీ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేశాయి. గతంలో సమీకరించిన నిధులతోపాటు తాజా ప్రకటనతో కలిపి కంపెనీ మొత్తం రూ.790కోట్లను సేకరించింది. రానున్న రెండేళ్లలో సంస్థ ప్రయోగిస్తున్న రాకెట్ల అవసరాల కోసం ఈ నిధులు ఎంతో ఉపయోగపడుతాయని స్కైరూట్ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ పవన్ కుమార్ చందన అన్నారు. చంద్రయాన్ 3 మూన్ ల్యాండింగ్ మిషన్ విజయవంతం కావడంతో భారతదేశ అంతరిక్ష రంగంపై ప్రపంచం ఆసక్తిగా ఉందన్నారు. గ్లోబల్ శాటిలైట్ లాంచ్ మార్కెట్లోకి ప్రవేశించే లక్ష్యంతో కంపెనీ పనిచేస్తుందని తెలిపారు. టెమాసెక్ వంటి ప్రసిద్ధి చెందిన పెట్టుబడి సంస్థ తమపై విశ్వాసాన్ని ఉంచి నిధులు కూడగట్టడంపై స్కైరూట్ సహ వ్యవస్థాపకుడు, సీఓఓ భరత్ డాకా హర్షం వ్యక్తం చేశారు. ఈ నిధులతో తమ రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విభాగం మరింత సమర్థవంతంగా పనిచేసేందుకు తోడ్పడుతుందని చెప్పారు. గతేడాది స్కైరూట్ సంస్థ విక్రమ్ ఎస్ రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించింది. వచ్చే ఏడాది ప్రారంభంలో విక్రమ్ 1ను ప్రయోగించనుంది. -
జపాన్ చందమామ ల్యాండర్ ప్రయోగం వాయిదా
టోక్యో: చందమామపై తొలిసారిగా అడుగుపెట్టాలన్న జపాన్ లక్ష్యం చివరి నిమిషంలో సాకారం కాలేదు. జాబిల్లి ఉపరితలంపై ల్యాండర్‌ను సురక్షితంగా దించి, పరిశోధనలు చేయడమే లక్ష్యంగా జపాన్ చేపట్టిన మూన్ ల్యాండర్ రాకెట్ ప్రయోగం వాయిదా పడింది. జాక్సా టానేగíÙమా స్పేస్ సెంటర్లోని యోషినోబు లాంచ్ కాంప్లెక్స్ నుంచి సోమవారం ఉదయం 9.26 గంటలకు హెచ్2–ఏ రాకెట్‌ను ప్రయోగించాల్సి ఉన్నది. ప్రతికూల వాతావరణం కారణంగా లాంచింగ్‌కు 27 నిమిషాల ముందు ఈ ప్రయోగాన్ని వాయిదా వేసినట్లు జపాన్ అంతరిక్ష పరిశోధనా సంస్థ ‘జాక్సా’ తెలియజేసింది. ప్రయోగ కేంద్రం వద్ద తీవ్రస్థాయిలో బలమైన గాలులు వీచడం, ఉపరితల వాతావరణంలో అనిశి్చత పరిస్థితులు నెలకొనడం వల్లే వాయిదా పడినట్లు తెలుస్తోంది. తదుపరి ప్రయోగ తేదీని ఇంకా ఖరారు చేయలేదు. సెపె్టంబర్ 15వ తేదీ తర్వాత తదుపరి ప్రయోగం ఉండొచ్చని సమాచారం. చంద్రుడిపై పరిశోధనల కోసం అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా), యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ సహకారంతో సాఫ్ట్ ల్యాండర్ ఫర్ ఇన్వెస్టిగేటింగ్ మూన్(స్లిమ్) అనే లూనార్ ప్రోబ్‌ను జపాన్ అభివృద్ధి చేసింది. ఈ ప్రయోగం విజయవంతమైతే చంద్రుడిపై ల్యాండర్‌ను క్షేమంగా దించిన ఐదో దేశంగా జపాన్ రికార్డు సృష్టిస్తుంది. అయితే ప్రయోగించిన 4 నెలల తర్వాత ఈ స్పేస్‌క్రాఫ్ట్ చంద్రుడి కక్ష్యలోకి చేరనుంది. ఇదిలా ఉండగా, హెచ్–2ఏ రాకెట్ ద్వారా ఇప్పటిదాకా 46 ప్రయోగాలు చేయగా, అందులో 45 ప్రయోగాలు విజయవంతమయ్యాయి. -
ఇస్రోకు రష్యా కౌంటర్.. 50 ఏళ్ల తర్వాత సరికొత్త రాకెట్ ప్రయోగం
మాస్కో: ఇటీవలే భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్–3 మిషన్ చంద్రుడికి మరింత చేరువైన విషయం తెలిసిందే. ఇదే సమయంలో ఇస్రోకు ధీటుగా రష్యా సరికొత్త ప్రయోగానికి తెరలేపింది. దాదాపు 50 ఏళ్ల తర్వాత మళ్లీ చంద్రుడిపైకి ‘లునా - 25’ పేరుతో రాకెట్‌ను రష్యా ప్రయోగించింది. వివరాల ప్రకారం.. దాదాపు 50 ఏళ్ల తర్వాత మళ్లీ రష్యా.. చంద్రుడిపైకి మరోసారి రాకెట్ ప్రయోగాన్ని చేపట్టింది. ఈ మేరకు రష్యా అంతరిక్ష పరిశోధనా సంస్థ రోస్కాస్మోస్ రాకెట్‌కు సంబంధించిన వివరాలను విడుదల చేసింది. మాస్కోకు తూర్పున 3,450 మైళ్ల దూరంలోని వోస్తోక్నీ కాస్మోడ్రోమ్ ప్రాంతం నుంచి శుక్రవారం తెల్లవారుజామున 2.10 గంటలకు ‘లునా -25’ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లినట్టు పేర్కొంది. కాగా, లునా-25 కేవలం ఐదు రోజుల్లోనే చంద్రుడి కక్ష్యలోకి చేరనున్నట్టు తెలిపింది. ఆ తర్వాత చంద్రుడిపై ఎవరూ చేరని దక్షిణ ధ్రువంలో.. మరో 3 లేదా 7 రోజుల్లో ల్యాండర్‌ను ల్యాండ్ చేసేలా రష్యా ప్రణాళికలు చేస్తున్నట్టు స్పష్టం చేసింది. అక్కడి వనరుల జాడను గుర్తించేందుకు ఏడాది పాటు ఇది పనిచేయనున్నట్లు రోస్కాస్మోస్ వెల్లడించింది. చంద్రయాన్ ఇలా.. ఇదిలా ఉండగా.. ఇప్పటివరకు ఏ దేశ అంతరిక్ష నౌక కూడా చేరుకోని చంద్రుడి దక్షిణ ధ్రువంపై ‘చంద్రయాన్-3’ ద్వారా సాఫ్ట్ ల్యాండింగ్ చేసి చరిత్ర సృష్టించాలని భావిస్తున్న ఇస్రోకు రష్యా షాకిచ్చే ప్రయత్నం చేస్తోంది. చంద్రయాన్-3 కంటే ముందే రష్యా లూనా-25 అక్కడికి చేరుకున్న అవకాశముంది. చంద్రయాన్-3 చంద్రుడిపై దక్షిణ ధ్రువంపై ఆగస్టు 23న ల్యాండ్ కానుండగా.. అంతకంటే లూనా-25 అక్కడే అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది. ఇక, 1976 తర్వాత రష్యా చేపట్టిన తొలి లూనార్ ల్యాండర్ ప్రయోగం ఇదే కావడం విశేషం. 47 Years Later, Russia Sent a Rocket to the Moon - ROV#fyp #foryou #goviral #foryoupage #trending #russiarocket #rocketlaunch pic.twitter.com/19cmFrxEUL — Routine of Voice (@routineofvoice) August 11, 2023 మరోవైపు..ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్–3 మిషన్ చంద్రుడికి మరింత చేరువయ్యే సమయంలో ల్యాండర్ మాడ్యూల్లో అమర్చిన ‘‘ల్యాండర్ హారిజెంటల్ వెలాసిటీ కెమెరా’’(ఎల్‌హెచ్‌వీసీ) రెండు ఛాయా చిత్రాలను తీసి పంపింది. వాటిని ఇస్రో తన వెబ్సైట్లో అధికారికంగా విడుదల చేసింది. ఈనెల 6న ఎల్‌హెచ్‌వీసీ ఇనుస్ట్రుమెంట్ చంద్రుడ్ని తీసిన వీడియోను విడుదల చేసిన విషయం తెలిసిందే. తాజాగా లూనార్ కక్ష్యలో నుంచి చంద్రుడ్ని వీడియోతో పాటు ఛాయా చిత్రాలు తీయడం విశేషం. ప్రయోగం రోజున అంటే గత నెల 14న ‘‘ల్యాండర్ ఇమేజర్ కెమెరా’’భూమిని తీసిన ఛాయాచిత్రాలను కూడా గురువారం విడుదల చేసింది. చంద్రయాన్–1, చంద్రయాన్–2 ప్రయోగాల కంటే చంద్రయాన్–3 మిషన్‌లో అత్యంత హై రిజల్యూషన్ కెమెరాలను అమర్చినట్టుగా తెలుస్తోంది. ఈ రెండు చాయా చిత్రాలతో పాటుగా 14 సెకన్లపాటు తీసిన వీడియో కూడా ఎంతో స్పష్టతతో కూడి ఉండడం విశేషం. ఇది కూడా చదవండి: సుందర హవాయి దీవుల్లో పెనువిషాదం: కార్చిచ్చుకు గాలి తోడై నగరం బుగ్గి.. -
ఒకేసారి 7 ఉపగ్రహాలతో నింగిలోకి దూసుకెళ్లిన PSLV-C56
-
పీఎస్ఎల్వీ సీ-56 రాకెట్ ప్రయోగం విజయవంతం
సాక్షి, సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): పీఎస్ఎల్వీ సీ-56 వాహకనౌక ప్రయోగం విజయవంతమైంది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి ఆదివారం ఉదయం 6.31 గంటలకు పీఎస్ఎల్వీ-సి56 ప్రయోగం నిర్వహించారు. నాలుగు దశల్లో రాకెట్ ప్రయోగం జరిగింది. కాగా, 25.30 గంటలపాటు కౌంట్‌డౌన్‌తో నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్ఎల్వీ సీ-56 విజయవంతంగా కక్షలోకి దూసుకెళ్లింది. ఇక, సింగపూర్‌కు చెందిన 420 కిలోల బరువు గల ఏడు ఉపగ్రహాలను దీని ద్వారా కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. 7 ఉపగ్రహాలను నియో ఆర్బిట్‌లోకి ప్రవేశ పెట్టనున్నారు. #PSLVC56 | The mission is successfully accomplished. PSLV-C56 vehicle launched all seven satellites precisely into their intended orbits: ISRO — ANI (@ANI) July 30, 2023 రాకెట్ ప్రయోగం విజయవంతం కావడంతో శాస్త్రవేత్తలు సంబురాలు జరుపుకుంటున్నారు. ఇక, ఈనెలలో ఇస్రోకు ఇది రెండో ప్రయోగం కావడం విశేషం. ఒకే నెలలో 2 ప్రయోగాలను సక్సెస్ చేసిన ఇస్రో. కాగా, పీఎస్ఎల్వీ సిరీస్‌లో ఇది 58వ ప్రయోగం. అనంతరం శాస్త్రవేత్తలకు ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ అభినందనలు తెలిపారు. ఈ సందర్బంగా సోమనాథ్ మాట్లాడుతూ.. నిర్దేశించిన కక్ష్యలో రాకెట్‌ను విజయవంతంగా ప్రవేశపెట్టాం. సెప్టెంబర్‌లో మరో పీఎస్ఎల్వీ ప్రయోగం చేపడతాం. అది కూడా పూర్తిగా కమిర్షియల్ ప్రయోగమని స్పష్టం చేశారు. #WATCH | Indian Space Research Organisation (ISRO) launches its PSLV-C56 with six co-passenger satellites from Satish Dhawan Space Centre (SDSC) SHAR, Sriharikota. (Source: ISRO) pic.twitter.com/2I1pNvKvBH — ANI (@ANI) July 30, 2023 -
చంద్రయాన్ -3 తొలి కక్ష్యను పెంచే విన్యాసం విజయవంతమైంది !
-
రోదసీలోకి ద్వారా ఎన్ వీఎస్ ఉపగ్రహం
-
జూలైలో చంద్రయాన్–3
సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): చంద్రయాన్–3 ప్రయోగాన్ని జూలై మొదటి వారంలో నిర్వహించనున్నట్లు ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ తెలిపారు. శుక్రవారం రాత్రి చంద్రయాన్–3 ఉపగ్రహం బెంగళూరు నుంచి షార్ కేంద్రానికి చేరుకుందని చెప్పారు. సోమవారం నిర్వహించే జీఎస్ఎల్వీ ఎఫ్12 రాకెట్ ప్రయోగం విజయవంతం కావాలని కోరుకుంటూ శనివారం సూళ్లూరుపేటలోని శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ బోర్డు చైర్మన్ దువ్వూరు బాలచంద్రారెడ్డి, ఈవో శ్రీనివాసులురెడ్డి, సభ్యులు ఇస్రో చైర్మన్‌కు స్వాగతం పలికి ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం ఆయన్ని ఆలయ మర్యాదలతో సత్కరించారు. ఆ తర్వాత సోమనాథ్ మీడియాతో మాట్లాడారు. జీఎస్ఎల్వీ ఎఫ్12 ప్రయోగానికి ఆదివారం ఉదయం 7.12 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభించనున్నట్లు చెప్పారు. ప్రస్తుతం సేవలందిస్తున్న ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్(ఐఆర్ఎన్ఎస్ఎస్) సిరీస్‌లోని 7 ఉపగ్రహాల శ్రేణిలో 4 ఉపగ్రహాల కాలపరిమితి పూర్తి కానుండటంతో.. వాటి స్థానంలో నావిక్ ఉపగ్రహాలను ప్రయోగిస్తున్నామని తెలిపారు. ఇకపై ఆరు నెలలకొకసారి నావిగేషన్ శాటిలైట్‌ను ప్రయోగిస్తామని చెప్పారు. ప్రస్తుతం ఐఆర్ఎన్ఎస్ఎస్–1జీ స్థానంలో నావిక్–01 ఉపగ్రహాన్ని రోదసీలోకి ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. గగన్‌యాన్ ప్రయోగానికి సంబం«ధించి ఇంకా పలు పరీక్షలు నిర్వహించాల్సి ఉందన్నారు. 2024 చివరికల్లా మానవ రహిత ప్రయోగానికి సిద్ధమయ్యేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో షార్ గ్రూప్ డైరెక్టర్ గోపీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
PSLV-C55 సక్సెస్ పై సీఎం జగన్ హర్షం
-
22న పీఎస్ఎల్వీ సీ–55 ప్రయోగం
సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఈ నెల 22న సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ షార్‌లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి పీఎస్ఎల్వీ సీ–55 ప్రయోగం చేపట్టేందుకు శాస్త్రవేత్తలు సిద్ధం చేస్తున్నారు. షార్‌లోని మొదటి ప్రయోగ వేదికకు అనుసంధానంగా ఉన్న పీఐఎఫ్ భవనంలో పీఎస్ఎల్వీ మొదటి, రెండు దశలు రాకెట్ అనుసంధానం పూర్తి చేశారు. మూడు, నాలుగు దశలను మొబైల్ సర్వీస్ టవర్‌లో అనుసంధానం చేసి సిద్ధం చేస్తున్నారు. ఈ ప్రయోగంలో సింగపూర్‌కు చెందిన ఉపగ్రహాలను వాణిజ్యపరంగా ప్రయోగిస్తున్నారు. -
ఆర్ఎల్వీ పరీక్ష విజయవంతం
సూళ్ళూరుపేట/సాక్షి బెంగళూరు: గగన్‌యాన్ ప్రాజెక్టు పరిశోధనా పరీక్షల్లో భాగంగా రీయూజబుల్ లాంచ్ వెహికల్ అటనామస్ ల్యాండింగ్ మిషన్(ఆర్ఎల్వీ–ఎల్ఈఎక్స్) రాకెట్ ప్రయోగ పరీక్షలను భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) ఆదివారం విజయవంతంగా నిర్వహించింది. కర్ణాటక రాష్ట్రం చిత్రదుర్గ జిల్లా కుందాపురం సమీపంలోని ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్(ఏటీఆర్)లో ఈ పరీక్ష చేపట్టారు. భారత వైమానిక దళానికి సంబంధించిన చినోక్ అనే హెలికాప్టర్ సహాయంతో ఆర్ఎల్వీ రాకెట్‌ను ఉదయం 7.10 గంటలకు సముద్ర మట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తుకు తీసుకెళ్లి వదిలిపెట్టారు. ఆర్ఎల్వీ–ఎల్ఈఎక్స్లోని మిషన్ మేనేజ్మెంట్ కంప్యూటర్ కమాండ్ ఆధారంగా రాకెట్ తిరిగి 7.40 గంటలకు భూమిపై నిర్దేశిత ప్రాంతంలో క్షేమంగా ల్యాండయ్యింది. ముందస్తుగా సిద్ధం చేసి రూపొందించిన నేవిగేషన్, గైడెన్స్, నియంత్రణ వ్యవస్థల సహాయంతో ఈ మానవ రహిత లాంచింగ్ వాహనం ఎలాంటి ఆటంకం లేకుండా భూమిపైకి చేరింది. ఈ ప్రయోగంలో ఇస్రోతోపాటు డీఆర్డీవో, భారత వైమానిక దళం కూడా భాగస్వామిగా మారింది. ప్రపంచంలోనే మొదటిసారిగా హెలికాప్టర్ సహాయంతో ఆర్ఎల్వీ లాంటి రాకెట్‌ను ఆకా«శంలో వదిలి, తిరిగి విజయవంతంగా భూమి మీదకు చేర్చిన ఘనత ఇస్రో శాస్త్రవేత్తలకే దక్కిందని ఇస్రో చైర్మన్ సోమనాథ్ వెల్లడించారు. ఆర్ఎల్వీ ప్రాజెక్టు నిర్వహణ బృందాన్ని ఆయన అభినందించారు. 2016 మే 23న ఆర్ఎల్వీ–టీడీ పేరుతో నిర్వహించిన ప్రయోగాత్మక పరీక్ష విజయవంతమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 2024 ఆఖరుకు గగన్‌యాన్ ప్రయోగానికి శాస్త్రవేత్తలు సిద్ధమవుతున్నారు. పరీక్షను విజయవంతంగా నిర్వహించిన ఇస్రోకు ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలియజేశారు. ప్రయోగ రాకెట్ ల్యాండ్ అయిన దృశ్యం -
ఇస్రో శాస్త్రవేత్తలకు సీఎం జగన్ అభినందనలు
-
GSLV మార్క్3-M3 రాకెట్ ప్రయోగం
-
ఆజాదీ శాట్–2ను రూపొందించిన ‘ప్రభుత్వ’ విద్యార్థినులు
సూళ్లూరుపేట (తిరుపతి జిల్లా): ఎస్ఎస్ఎల్వీ డీ2 ప్రయోగం ద్వారా ఇస్రో అంతరిక్షంలోకి పంపించిన ఆజాదీశాట్–2 ఉపగ్రహాన్ని పూర్తిగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థినులే తయారు చేశారు. అంతరిక్ష ప్రయోగాలపై విద్యార్థి దశనుంచే అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్న 75 పాఠశాలలను.. వాటిలో విద్యనభ్యసిస్తున్న 750 మంది విద్యార్థినులను ఎంపిక చేశారు. చెన్నైకి చెందిన స్పేస్ కిడ్ ఇండియా సీఈవో కేశన్ ఆధ్వర్యంలో ఈ విద్యార్థినులు ఆజాదీశాట్–2ను రూపొందించారు. ఇందులో తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం నారాయణవనం ప్రభుత్వ పాఠశాల విద్యార్థినులు కూడా భాగస్వాములయ్యారు. స్పేస్ కిడ్ ఇండియాలో భాగంగా విద్యార్థినులంతా 6 నెలలు పాటు శ్రమించి రూ.86 లక్షల ఖర్చుతో ఈ బుల్లి ఉపగ్రహాన్ని తయారుచేశారు. -
ఇస్రో బృందానికి సీఎం జగన్ అభినందనలు
సాక్షి, తాడేపల్లి: ఎస్ఎస్ఎల్వీ డీ2 రాకెట్ ప్రయోగం విజయవంత కావడం పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. మూడు ఉపగ్రహాలను ఒకేసారి కక్ష్యలోకి ప్రవేశపెట్టి ఇస్రో విజయం సాధించడంపై సైంటిస్టులకు సీఎం జగన్ అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో ఇస్రో మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నట్లు సీఎం జగన్ పేర్కొన్నారు. కాగా, శ్రీహరికోట నుంచి ఎస్ఎస్ఎల్వీ డీ2 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రయోగంలో ఎస్ఎస్ఎల్వీ డీ2.. మూడు ఉప గ్రహాలను అంతరిక్షంలోకి మోసుకెళ్లింది. కాగా, 13 నిమిషాల 2 సెకన్లలో రాకెట్ ప్రయోగం పూర్తికానుంది. దీని ద్వారా 2 దేశీయ, అమెరికాకు చెందిన ఒక ఉపగ్రహం కక్షలోకి చేరుకున్నాయి. -
SSLV D2 రాకెట్ ప్రయోగం విజయవంతం
సాక్షి, తిరుపతి: శ్రీహరికోట నుంచి ఎస్ఎస్ఎల్వీ డీ2 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రయోగంలో ఎస్ఎస్ఎల్వీ డీ2.. మూడు ఉప గ్రహాలను అంతరిక్షంలోకి మోసుకెళ్లింది. కాగా, 13 నిమిషాల 2 సెకన్లలో రాకెట్ ప్రయోగం పూర్తికానుంది. దీని ద్వారా 2 దేశీయ, అమెరికాకు చెందిన ఒక ఉపగ్రహం కక్షలోకి చేరుకున్నాయి. కాగా, సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్)లోని మొదటి ప్రయోగవేదిక నుంచి స్మాల్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ (ఎస్ఎస్ఎల్వీ–డీ2)ను శుక్రవారం ఉదయం 9.18 గంటలకు నింగిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రయోగం ద్వారా ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్, జానుస్–1, ఆజాదీ శాట్–2 అనే మూడు ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. ఇక, ఎస్ఎస్ఎల్వీ–డీ1 పేరుతో గత ఏడాదిలో చేసిన మొదటి ప్రయోగం విఫలం కావడంతో ఈ ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు కృషి చేశారు. రాకెట్ వివరాలు ఇవే.. ఎస్ఎస్ఎల్వీ–డీ2 రాకెట్ 34 మీటర్లు పొడవు, రెండు మీటర్లు వెడల్పు, 119 టన్నుల బరువు కలిగి ఉంది. దీనిని నాలుగు దశల్లో ప్రయోగించనున్నారు. ఈ రాకెట్ మొదటి దశను 87 టన్నుల ఘన ఇంధనాన్ని ఉపయోగించి 124 సెకన్లలో పూర్తిచేస్తారు. రెండో దశను 7.7 టన్నుల ఘన ఇంధనంతో 384.2 సెకన్లలో, మూడో దశను 4.5 టన్నుల ఘన ఇంధనంతో 674.9 సెకన్లలో పూర్తి చేయనున్నారు. నాలుగో దశలో మాత్రమే 0.05 టన్నుల ద్రవ ఇంధనం సాయంతో 785.1 సెకన్లలో పూర్తి చేస్తారు. -
Mann Ki Baat: ‘అంతరిక్షం’లో నూతన సూర్యోదయం
సాక్షి, న్యూఢిల్లీ: ‘విక్రమ్–ఎస్’ రాకెట్ ప్రయోగం మన దేశంలో ప్రైవేట్ అంతరిక్ష రంగంలో నూతన సూర్యోదయమని ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. ఈ ప్రయోగంతో దేశ అంతరిక్ష రంగంలో నూతన శకం మొదలైందన్నారు. ఆదివారం 95వ ‘మన్‌కీ బాత్’లో ఆయన ప్రజలనుద్దేశించి మాట్లాడారు. జీ20కి సారథ్యం వహిస్తున్న దేశంగా ప్రపంచం ముందున్న సవాళ్లకు పరిష్కార మార్గాలు కనిపెట్టాల్సిన బాధ్యత భారత్‌పై ఉందని చెప్పారు. మోదీ ఇంకా ఏం మాట్లాడారంటే... ‘స్పేస్’లో ప్రైవేట్ పాత్ర భేష్ స్పేస్ టెక్నాలజీలో ప్రైవేట్ రంగం పాత్ర ప్రశంసనీయం. స్పేస్ సెక్టార్లో నవంబర్ 18న ‘కొత్త చరిత్రకు’ ప్రజలంతా సాక్షిభూతంగా నిలిచారు. దేశీయంగా ప్రైవేట్ రంగంలో డిజైన్ చేసి, రూపొందించిన తొలి రాకెట్ ‘విక్రమ్–ఎస్’ నింగిలోకి విజయవంతంగా దూసుకెళ్లింది. ప్రతి భారతీయుడి గుండె గర్వంతో ఉప్పొంగిపోయింది. ఈ రాకెట్‌ను తక్కువ ఖర్చుతో రూపొందించడం గొప్ప విషయం. స్పేస్ టెక్నాలజీలో భారత్ పరిమిత ఖర్చుతోనే ప్రపంచ స్థాయి ప్రమాణాలకు చేరుకుంది. విక్రమ్–ఎస్ రాకెట్లో కొన్ని కీలక భాగాలను 3డీ ప్రింటింగ్ ద్వారా తయారు చేశారు. ఈ రాకెట్ ప్రయోగం ప్రైవేట్ స్పేస్ సెక్టార్లో నూతన సూర్యోదయం. కాగితాలతో విమానాలు తయారు చేసి, గాల్లోకి ఎగురవేసిన మన పిల్లలు ఇప్పుడు అసలైన విమానాలు తయారు చేసే అవకాశం దక్కించుకుంటున్నారు. కాగితాలపై ఆకాశం, చంద్రుడు, నక్షత్రాలను గీసిన మనవాళ్లు ఇప్పుడు రాకెట్లు తయారు చేస్తున్నారు. విక్రమ్–ఎస్ ప్రయోగం భారత్–భూటాన్ సంబంధాలకు బలమైన నిదర్శనం. దేశమంతటా జీ20 కార్యక్రమాలు శక్తివంతమైన జీ20 కూటమికి భారత్ నాయకత్వం వహించనుండడం ప్రతి భారతీయుడికి గొప్ప అవకాశం. వసుధైక కుటుంబ భావనను ప్రతిబింబించేలా జీ20కి ‘ఒకే భూగోళం, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు’ అనే థీమ్ ఇచ్చాం. జీ20కి సంబంధించిన కార్యక్రమాలు దేశమంతటా నిర్వహిస్తాం. ఇందులో భాగంగా విదేశీయులు మన రాష్ట్రాలను సందర్శిస్తారు. మన విభిన్నమైన సంస్కృతి సంప్రదాయలను విదేశాలకు పరిచయం చేయొచ్చు. జీ20 కార్యక్రమాల్లో ప్రజలు.. ముఖ్యంగా యువత పాలుపంచుకోవాలి. యువత పరుగును ఆపడం కష్టం మన యువత గొప్పగా ఆలోచిస్తున్నారు, గొప్ప ఘనతలు సాధిస్తున్నారు. అంతరిక్షం, సాంకేతిక పరిజ్ఞానం, నూతన ఆవిష్కరణల విషయంలో సహచర యువతను కలుపుకొని ముందుకెళ్తున్నారు. స్టార్టప్‌లను ప్రోత్సహిస్తున్నారు. డ్రోన్ల తయారీలోనూ భారత్ వేగంగా పరుగులు తీస్తోంది. హిమాచల్ ప్రదేశ్‌లో ఇటీవలే యాపిల్ పండ్లను డ్రోన్ల ద్వారా రవాణా చేశారు. నూతన ఆవిష్కరణ ద్వారా అసాధ్యాలను సుసాధ్యం చేస్తుండడం సంతోషకరంమన యువత పరుగును ఆపడం ఇక కష్టం. ప్రపంచం నలు మూలలకూ మన సంగీతం సంగీత రంగంలోనూ భారత్ గణనీయ ప్రగతి సాధిస్తోంది. ఎనిమిదేళ్లలో సంగీత పరికరాల ఎగుమతి మూడున్నర రెట్లు పెరిగింది. భారతీయ సంగీత ఖ్యాతి ప్రపంచ నలుమూలలకూ చేరుతోంది. తమ కళలు, సంస్కృతి, సంగీతాన్ని చక్కగా పరిరక్షించుకుంటున్న నాగా ప్రజలను ఆదర్శంగా తీసుకోవాలి’’ అని మోదీ సూచించారు. యూపీలోని బన్సా గ్రామంలో ‘కమ్యూనిటీ లైబ్రరీ, రిసోర్స్ సెంటర్’ను స్థాపించిన జతిన్ లలిత్ సింగ్, జార్ఖండ్‌లో ‘లైబ్రరీ మ్యాన్’గా గుర్తింపు పొందిన సంజయ్ కశ్యప్‌పై ప్రధాని మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. -
ఇస్రో శాస్త్రవేత్తలకు సీఎం జగన్ అభినందనలు
తాడేపల్లి : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) శ్రీహరికోట రాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి ప్రవేశపెట్టిన పీఎస్ఎల్వీ సీ54 విజయవంతం కావడంపై సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఇస్రో శాస్త్రవేత్తలకు సీఎం జగన్ అభినందనలు తెలిపారు.భవిష్యత్తులో ఇస్రో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. కాగా, శ్రీహరికోట రాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి ఇస్రో ప్రవేశపెట్టిన పీఎస్ఎల్వీ సీ54 విజయవంతమైంది. ఈఓఎస్ 06, ఎనిమిది చిన్న ఉపగ్రహాలను కక్ష్యలోకి తీసుకెళ్లేందుకు దీనిని ప్రయోగించారు.సముద్రాలపై వాతావరణాన్ని అధ్యయనం చేసేందుకు కూడా ఇది ఉపయోగపడనుంది. ఈ ప్రయోగం ద్వారా భారత్‌కు చెందిన 1,117 కేజీల బరువున్న ఈఓఎస్ 06, అలాగే 18.28 కేజీల బరువున్న ఐఎన్ఎస్ 2బీ, 16.15 కిలోల బరువున్న ఆనంద్, 1.45 కిలోల బరువున్న రెండు థాయ్ బోల్ట్ షాటిలైట్స్‌తో పాటు.. 17.92 కేజీల బరువున్న 4 యూఎస్‌కు చెందిన యాస్ట్రో కాట్ ఉపగ్రహాలను నింగిలోకి పంపారు. శ్రీహరికోట అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి ఇది 87వ ప్రయోగం కావడం గమనార్హం. చదవండి: ఇస్రో జైత్రయాత్ర: పీఎస్ఎల్వీ సీ54 ప్రయోగం విజయవంతం -
ఇస్రో జైత్రయాత్ర: పీఎస్ఎల్వీ సీ54 ప్రయోగం విజయవంతం
సాక్షి, సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) శ్రీహరికోట రాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి ప్రవేశపెట్టిన పీఎస్ఎల్వీ సీ54 విజయవంతమైంది. ఈఓఎస్ 06, ఎనిమిది చిన్న ఉపగ్రహాలను కక్ష్యలోకి తీసుకెళ్లేందుకు దీనిని ప్రయోగించారు. సముద్రాలపై వాతావరణాన్ని అధ్యయనం చేసేందుకు కూడా ఇది ఉపయోగపడనుంది. ఈ ప్రయోగం ద్వారా భారత్‌కు చెందిన 1,117 కేజీల బరువున్న ఈఓఎస్ 06, అలాగే 18.28 కేజీల బరువున్న ఐఎన్ఎస్ 2బీ, 16.15 కిలోల బరువున్న ఆనంద్, 1.45 కిలోల బరువున్న రెండు థాయ్ బోల్ట్ షాటిలైట్స్‌తో పాటు.. 17.92 కేజీల బరువున్న 4 యూఎస్‌కు చెందిన యాస్ట్రో కాట్ ఉపగ్రహాలను నింగిలోకి పంపారు. శ్రీహరికోట అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి ఇది 87వ ప్రయోగం కావడం గమనార్హం. ఎన్నో ఏళ్ల కృషికి ఫలితం పీఎస్ఎల్వీ సీ54 ప్రయోగం విజయవంతం కావడంతో సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నో ఏళ్ల కృషికి ఫలితమే ఈ విజయమని ఇస్రో శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. నీటి వనరుల పర్యవేక్షణ, తుపాను అంచనా, భూవాతవరణంపై పీఎస్ఎల్వీ సీ54 అధ్యయనం చేయనున్నట్లు ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు. చదవండి: (క్రమశిక్షణ నేర్పే రూల్ బుక్ రాజ్యాంగం: సీఎం జగన్) -
PSLV-C54 Launch: నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్ఎల్వీ సీ54
సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): సతీష్‌ధవన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి పీఎస్ఎల్వీ సీ54 నింగిలోకి దూసుకెళ్లింది. రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. ఈ ప్రయోగం ద్వారా 9 ఉప గ్రహాలను భూమికి 720 కిలోమీటర్ల ఎత్తులో సన్‌సింక్రోనస్ ఆర్బిట్‌లోకి ప్రవేశపెట్టారు. కాగా, పీఎస్ఎల్వీ సీ–54 రాకెట్‌కు శుక్రవారం ఉదయం 10.26 నిమిషాలకు ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్, లాంచ్ ఆథరైజేషన్ బోర్డు చైర్మన్ ఆర్ముగంరాజరాజన్లు కౌంట్‌డౌన్ ప్రారంభించారు. శుక్రవారం సాయంత్రం రాకెట్‌లోని నాల్గో దశలో ద్రవ ఇంధనాన్ని నింపే ప్రక్రియను పూర్తి చేశారు. అనంతరం రాకెట్‌కు సంబంధించిన అన్ని పరీక్షలు నిర్వహించారు. చదవండి: సీఎం జగన్ చరిత్రాత్మక నిర్ణయం.. వారికి తీపి కబురు.. -
పీఎస్ఎల్వీ సీ54’కు కౌంట్‌డౌన్
సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) తిరుపతి జిల్లా సతీష్ ధవన్ స్పేస్ సెంటర్లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి పీఎస్ఎల్వీ సీ54 ఉపగ్రహ వాహక నౌకకు శుక్రవారం ఉదయం 10.26 గంటలకు కౌంట్‌డౌన్ నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. 25.30 గంటల కౌంట్‌డౌన్ కొనసాగాక శనివారం ఉదయం 11.56 గంటలకు పీఎస్ఎల్వీ సీ54 రాకెట్‌ను ప్రయోగించేందుకు సర్వం సిద్ధమైంది. ఈ ప్రయోగానికి సంబంధించి గురువారం షార్‌లోని బ్రహ్మప్రకాష్ హాల్లో ఎంఆర్ఆర్ కమిటీ చైర్మన్ బీఎన్ సురేష్ ఆధ్వర్యంలో మిషన్ రెడీనెస్ రివ్యూ(ఎంఆర్ఆర్) సమావేశం నిర్వహించారు. ల్యాబ్ చైర్మన్ ఆర్ముగం రాజరాజన్ ఆధ్వర్యంలో తుది విడతగా రాకెట్‌కు తనిఖీలు నిర్వహించి లాంచ్ రిహార్సల్స్ చేపట్టారు. అనంతరం కౌంట్‌డౌన్ సమయాన్ని శుక్రవారం ఉదయం 10.26 గంటలకు, ప్రయోగ సమయాన్ని శనివారం ఉదయం 11.56 గంటలకని అధికారికంగా ప్రకటించారు. ఈ ప్రయోగం ద్వారా తొమ్మిది ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపనున్నారు. ఇందులో ఇస్రోకు చెందిన ఈఓఎస్–06 ఉపగ్రహంతో పాటు ఎనిమిది ఉప గ్రహాలను వాణిజ్యపరంగా ప్రయోగిస్తోంది. శుక్రవారం ఉదయం 10.26 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభమయ్యాక రాకెట్ నాలుగో దశ, రెండో దశలో ద్రవ ఇంధనాన్ని నింపే ప్రక్రియను చేపట్టనున్నారు. షార్ నుంచి ఇది 87వ ప్రయోగం. పీఎస్ఎల్వీ రాకెట్ సిరీస్‌లో 56వ ప్రయోగం. పీఎస్ఎల్వీ ఎక్స్‌ల్ వెర్షన్లో 24వ ప్రయోగం కావడం విశేషం. షార్ కేంద్రానికి చేరుకోనున్న ఇస్రో చైర్మన్ సోమనాథ్ ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ శుక్రవారం బెంగళూరు అంతరిక్ష కేంద్ర ప్రధాన కార్యాలయం నుంచి శ్రీహరికోటకు చేరుకోనున్నారు. పీఎస్ఎల్వీ సీ54 రాకెట్‌కు ఆయన మరోమారు తనిఖీలు నిర్వహించి కౌంట్‌డౌన్‌ను స్వయంగా పర్యవేక్షిస్తారు. -
‘విక్రమ్ ఎస్’ విజయంతో అంబరాన ప్రైవేటు సంబరం
అంతరిక్ష యానంలో మరో పెద్ద అడుగు ముందుకు పడింది. శ్రీహరికోటలోని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) రాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి 550 కిలోల చిన్న రాకెట్ ‘విక్రమ్ ఎస్’ గతవారం గగనంలోకి దూసుకుపోవడం చారిత్రక ఘట్టం. దీంతో, రోదసీ రంగంలో ప్రైవేట్ రంగ భాగస్వామ్యం విషయంలో మన దేశం ఒక్క ఉదుటున ముందుకు ఉరికినట్టయింది. భారత్‌లో ప్రైవేట్ రంగంలో అభివృద్ధి చేసిన తొట్టతొలి రాకెట్ ఇదే. హైదరాబాద్‌కు చెందిన ‘స్కైరూట్ ఏరోస్పేస్’ సంస్థ దీన్ని రూపొందించడం మరింత ఆనందదాయకం. రానున్న కాలంలో ఈ సంస్థ మరింత పెద్ద రాకెట్లను వరుసగా ప్రయోగించడానికి సిద్ధమవుతోంది. అంటే, అంబర వీధిలో అనేక సంవత్సరాల భారత ప్రయత్నాలు మరో పెద్ద మలుపు తిరగనున్నాయన్న మాట. దేశ అంతరిక్ష ప్రయోగాల్లో ఒకపక్క ‘ఇస్రో’ ప్రధానపాత్ర కొనసాగిస్తుంటే, మరోపక్క దానికి పూరకంగా ప్రైవేట్ రంగం నిలబడనుంది. దీని పరిణామాలు, విపరిణామాలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. భారత అంతరిక్ష ప్రయోగాల మార్గదర్శి విక్రమ్ సారాభాయ్ పేరిట ‘విక్రమ్ ఎస్’ రాకెట్‌తో సాగించిన ఈ ‘ప్రారంభ్’ ప్రయోగం శుభారంభం. భారతీయ అంకుర సంస్థలు మరింతగా పాలు పంచుకొనేలా భారత అంతరిక్ష కార్యక్రమానికి తలుపులు తెరవాలన్న కేంద్ర ప్రభుత్వ చొరవ వల్ల ఇది సాధ్యమైంది. నిజానికి, వినువీధిలోకి అంతరిక్ష ప్రయోగ వాహన నౌకలను పంపడం మంచి గిరాకీ ఉన్న వ్యాపారం. ఇటీవలి దాకా అందులో ఆయా దేశ ప్రభుత్వాలదే ఆధిపత్యం. ఎలన్ మస్క్ తన ‘స్పేస్ ఎక్స్’ సంస్థతో దానికి గండి కొట్టింది. త్వరలోనే అమెజాన్ వారి ‘బ్లూ ఆరిజన్’ రాకెట్ మార్కెట్లోకి రానుంది. అంతరిక్షంలోని సరికొత్త వాణిజ్య అవకాశాలను అంది పుచ్చుకోవడానికి అంతర్జాతీయ సహకారం పెరుగుతుండడంతో ప్రైవేట్ రంగ వికాసానికి దారులు పడ్డాయి. ఒకప్పుడు మన విహాయస ప్రయోగాలకు అభివృద్ధి, దేశ ప్రతిష్ఠలే మూలమంత్రాలు. ఇప్పుడు బ్రాడ్‌బ్యాండ్‌కు ఉపగ్రహ వినియోగం, చంద్రమండల శోధన, గగనాంతర గవేషణ లాంటివి ముందుకొచ్చాయి. అలా వ్యాపారం, ఆర్థికవ్యవస్థ వచ్చి చేరాయి. శరవేగంగా పెరుగుతున్న ఈ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ విలువ ప్రస్తుతం 45 వేల కోట్ల డాలర్లు. పదేళ్ళలో ఇది ఏకంగా లక్ష కోట్ల డాలర్లకు చేరుతుందట. ఇందులో ఇప్పుడు భారత్ వాటా 2 శాతమే. రానున్న వత్సరాల్లో మన వాటాను చకచకా 8 శాతానికి పెంచాలన్నది ప్రధాని మాట. ప్రైవేట్ రంగ సంస్థలకు సైతం పెద్ద పీట వేస్తేనే ఆ వాటా పెరుగుదల సాధ్యం. ఆ క్రమంలో వచ్చినదే తాజా ‘విక్ర’మార్కు విజయం! ప్రైవేట్ రంగ భాగస్వామ్యంలో అనేక ప్రపంచ దేశాలు ఇప్పటికే చాలా ముందుకు పోయాయి. వారిని అందుకొనేందుకు మనం బహుదూరం ప్రయాణించాల్సి ఉంది. మన ప్రైవేట్ రంగంలోనూ ప్రతిభాపాటవాలున్నాయి. వాటి వినియోగానికి ప్రభుత్వం విధానపరంగా తగిన వాతావరణం కల్పిస్తే సుదీర్ఘ యానం సంక్షిప్తమవుతుంది. ఇన్నేళ్ళ భారత అంతరిక్ష ప్రయోగ పరిణామ క్రమంలో ప్రైవేట్ రంగ పాత్ర లేనే లేదనుకుంటే పొరపాటు. గోద్రెజ్ అండ్ బోయిస్, లార్సెన్ అండ్ టుబ్రో, వాల్చంద్నగర్ ఇండస్ట్రీస్ లాంటి అనేక ప్రైవేట్ రంగ సంస్థలు తమ వంతు భాగస్వామ్యం వహించాయి. ఇప్పుడిక స్కైరూట్ లాంటి స్టార్టప్‌లు నక్షత్రపథాన నవీన కల్పనలకు పాదులు వేస్తాయి. అయితే, ఆకసాన బలమైన ఆర్థికశక్తిగా ఎదగాలంటే భారీ సంస్థల ప్రవేశం అనివార్యం. ప్రస్తుతానికి మన అంకుర సంస్థలకు విదేశీ మూలధనమే ఆధారం. మచ్చుకు విక్రమ్‌ను ప్రయోగించిన స్కైరూట్ సంస్థలో ప్రధాన పెట్టుబడులు సింగపూర్‌వి. రేపు మన అంతరిక్ష ప్రయోగాలు తలుపులు బార్లా తెరిచినప్పుడు పాశ్చాత్య సంస్థలు పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపడం ఖాయం. ఇవాళ ప్రపంచమంతటా జాతీయ అంతరిక్ష పరిశోధనల్లో అంతర్జాతీయ భాగస్వామ్యమూ పెరుగుతోంది. 50 ఏళ్ళ క్రితం చంద్రునిపై మానవుడి ‘అపోలో’ ప్రయోగాన్ని జాతీయ ప్రాజెక్ట్‌గా అమెరికా నిర్వహించింది. వారం క్రితం నవంబర్ 16న మరోసారి చంద్రుని పైకి ‘ఆర్టెమిస్1’ రాకెట్ ప్రయోగాన్ని ఫ్రాన్స్, కెనడా, జపాన్‌లతో కలసి బహుళ దేశాల ప్రయత్నంగా జరిపింది. రష్యా, చైనాలు చుక్కలతోవలో చెట్టపట్టాలు వేసుకోవడమే కాక నెలవంకపై దీర్ఘకాల మానవ ఆవాసానికి సంయుక్త స్థావరం నెలకొల్పే పనిలో ఉన్నాయి. రయ్యిమంటూ రోదసీలోకి సాగిన మన తొలి ప్రైవేట్ రాకెట్ ప్రయోగాన్ని వీటన్నిటి నేపథ్యంలో చూడాలి. వచ్చే పదేళ్ళలో దేశంలో 20 వేలకు పైగా చిన్న ఉపగ్రహాలు నింగికి ఎగురుతా యట. వ్యాపార సంస్థలు, విద్యాలయాలు, ప్రైవేట్ ప్రయోగశాలలు తాము తీర్చిదిద్దిన ఉపగ్రహా లను ప్రైవేట్ రాకెట్లతో దివికి పంపి, వాతావరణ, భూవిజ్ఞాన సమాచారాన్ని సేకరిస్తాయి. వెరసి, నిన్నటి దాకా ప్రభుత్వ ఆధిపత్యంలోని అంబర చుంబన యాత్రలో ప్రైవేట్ పాదముద్రలు బలంగా పడనున్నాయి. 2020 జూన్‌లోనే అంతరిక్ష కార్యకలాపాలన్నిటా ప్రైవేట్‌కు సర్కారు ద్వారాలు తీసింది. పరిశోధనలకూ, పోటీ తత్త్వానికీ తోడ్పడే ఈ మార్పును స్వాగతిస్తూనే తగు జాగ్రత్తలూ తప్పవు. అంతా ప్రైవేటైపోతే, దేశ రక్షణ మాటేమిటన్న భయాలను పాలకులు పోగొట్టాలి. ఇస్రో అనుభవాన్నీ, మార్గదర్శనాన్నీ వాడుకోవాలి. అమెరికాలో నాసాలా ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్య (పీపీపీ) విధానం మేలు. 350కి పైగా ప్రైవేట్ అంతరిక్ష సంస్థలతో అమెరికా, బ్రిటన్, కెనడా, జర్మనీల తర్వాత మనది 5వ స్థానం. భవిష్యత్తులో చుక్కల తోటలో ఎక్కడుంటామో ఆసక్తికరం. ఇదీ చదవండి: సైన్సు అవార్డుల్లో కోతలా? -
26న పీఎస్ఎల్వీ సీ54 ప్రయోగం
సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఈ నెల 26న ఉదయం 11.56 గంటలకు తిరుపతి జిల్లా సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ షార్ లో పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ (పీఎస్ఎల్వీ సీ54) ఉపగ్రహ వాహకనౌకను ప్రయోగించేందుకు సన్నాహాలు చేస్తోంది. ప్రయోగం ద్వారా భారత్‌కు చెందిన 960 కేజీల బరువు కలిగిన ఓషన్‌శాట్–3 (ఈవోఎస్–06) ఉపగ్రహంతో పాటు మరో 8 ఉపగ్రహాలను అంతరిక్ష కక్ష్యలోకి పంపనున్నారు. భారత్‌కే చెందిన తైబోల్ట్–1, తైబోల్ట్–2, ఆనంద్, ఇండియా–భూటాన్ దేశాలు సంయుక్తంగా తయారు చేసిన అకా ఐఎన్ఎస్–2బీ, స్విట్జర్లాండ్‌కు చెందిన ఆస్ట్రోకాస్ట్ –2 పేరుతో 4 ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపనున్నారు. -
రాకెట్లా దూసుకెళ్తున్న ఏపీ శాస్త్రవేత్త.. సాయిదివ్య స్పెషల్ ఇదే..
తెనాలిరూరల్: దేశ చరిత్రలో తొలిసారి ప్రయోగించిన ప్రైవేట్ రాకెట్ ప్రారంభ్(విక్రమ్–ఎస్) విజయవంతం అవడంపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ చారిత్రక ఘట్టంలో తెనాలి యువతి భాగస్వామి అయ్యింది. పట్టణానికి చెందిన యువ శాస్త్రవేత్త సాయిదివ్య కూరపాటి రూపొందించిన 200 గ్రాముల పేలోడ్‌ను విక్రమ్–ఎస్ ద్వారా అంతరిక్షంలోకి పంపారు. ఉపగ్రహ కమ్యూనికేషన్ రంగంలో పీహెడీ స్కాలర్ అయిన సాయిదివ్య తన భర్త కొత్తమాసు రఘురామ్‌తో కలసి ఎన్–స్పేస్‌టెక్ ఇండియా పేరిట సంస్థను ఏర్పాటు చేసి ఉపగ్రహ తయారీపై ప్రయోగాలు చేస్తున్నారు. గతంలో సాయిదివ్య మైక్రో శాటిలైట్ ‘లక్ష్య శాట్’ను తయారు చేయగా యూకేలోని బీ–2 స్పేస్ సంస్థ ఆస్తరావరణం(స్టాటోస్పియర్)లోకి పంపింది. ప్రస్తుతం ఆమె తయారుచేసిన పేలోడ్‌ను హైదరాబాద్‌లోని స్కైరూట్ ఏరో స్పేస్ సంస్థకు పంపగా, అక్కడ నుంచి శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్‌కు పంపారు. ప్రారంభ్ రాకెట్ ద్వారా సాయిదివ్య తయారు చేసిన పేలోడ్‌తోపాటు మరో రెండు సంస్థలు తయారు చేసిన పేలోడ్లను ప్రయోగించారు. - తొలి ప్రైవేట్ రాకెట్ ప్రయోగానికి సన్నాహాలు జరుగుతున్న నాటి నుంచి సాయిదివ్య స్కైరూట్ సంస్థతో సంప్రదిస్తూ వచ్చారు. తెనాలిలోని తన పరిశోధన కేంద్రంలోనే పేలోడ్ తయారు చేశారు. దీనిని ఇతర పేలోడ్లతో అనుసంథానించడం, రాకెట్ అంతరభాగంలో సరిపోయే విధంగా రూపొందించేందుకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. వాతావరణంలో ఉన్న తేమ, ఇతర వివరాలను నమోదు చేసేలా పేలోడ్‌ను రూపొందించారు. - తెనాలిలో తయారైన పేలోడ్‌ను హైదరాబాద్ పంపారు. అక్కడ కొన్ని ప్రాథమిక పరీక్షల అనంతరం రాకెట్లో అమర్చేందుకు షార్కు పంపారు. రాకెట్లో అమర్చి, పనితీరును పరిశీలించారు. పేలోడ్ నుంచి వస్తున్న సిగ్నల్స్, ఇతర సమాచార వ్యవస్థను అధ్యయనం చేశారు. విజయవంతంగా రాకెట్ నింగిలోకి దూసుకెళ్లగా అందులో తెనాలిలో తయారుకాబడిన పేలోడ్ ఉండడం విశేషం. టూ వే కమ్యూనికేషన్ శాటిలైట్ తయారీ విక్రమ్–ఎస్ ప్రయోగం విజయవంతం కావడంతో త్వరలో విక్రమ్–1 పేరిట మరో ప్రైవేట్ రాకెట్ తయారీకి రంగం సిద్ధం చేస్తున్నారు. విక్రమ్–ఎస్‌లోని పేలోడ్లు కేవలం వాతావరణంలోని తేమ వంటి వివరాలను మాత్రమే నమోదు చేశాయి. విక్రమ్–1లో టూ వే కమ్యూనికేషన్ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. విక్రమ్–ఎస్‌ను సబ్–ఆర్బిటల్‌లోకి మాత్రమే ప్రయోగించారు. కేవలం 89.5 కిలోమీటర్లు దూరం ఈ రాకెట్ వెళ్లగా, భవిష్యత్తులో తయారుకానున్న విక్రమ్–1ను ఆర్బిటల్(కక్ష్య)లోకి పంపే ఆలోచనలో ఉన్నారు. ఈ రాకెట్లో అమర్చే పేలోడ్లలో టూ వే కమ్యూనికేషన్ వ్యవ్థను అమరుస్తారు. కక్ష్యలోని శాటిలైట్‌తో సంప్రదించడం, దాని నుంచి సమాచారం రాబట్టడం చేస్తారు. ఇందు కోసం సాయిదివ్య పేలోడ్ తయారు చేస్తున్నారు. కమ్యూనికేషన్ వ్యవస్థ కోసం సెన్సార్లను ఏర్పాటు చేయనున్నారు. అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యం.. స్పేస్ టెక్నాలజీని విద్యార్థులు, రీసెర్చ్ చేసే వాళ్లకు అందుబాటులోకి తీసుకురావాలన్న లక్ష్యంతోనే ఎన్–స్పేస్ టెక్ ఇండియా సంస్థను నెలకొల్పాం. ఉపగ్రహాలు, రాకెట్ల ద్వారా నింగిలోకి పంపే పేలోడ్ల తయారీ, వాటికి సంబంధించిన ప్రయోగాలను వీరికి అందుబాటులోకి తీసుకురావడం వల్ల భవిష్యత్తులో ఈ రంగంలో మరింత మంది రాణించే అవకాశం ఉంటుంది. దీని ద్వారా ప్రైవేటు ఉపగ్రహల తయారీ రంగం మరింత అభివృద్ధి చెందుతుంది. తొలి ప్రైవేటు రాకెట్ ప్రయోగంలో భాగస్వాములం అవడం సంతోషంగా ఉంది. – కూరపాటి సాయిదివ్య, యువ శాస్త్రవేత్త -
‘విక్రమ్’ ప్రయోగం వాయిదా
న్యూఢిల్లీ: భారత్‌లో తొలిసారిగా ప్రైవేట్‌రంగంలో రూపుదిద్దుకున్న విక్రమ్–ఎస్ రాకెట్ ప్రయోగం ప్రతికూల వాతావరణం కారణంగా మూడ్రోజులు వాయిదాపడింది. నవంబర్ 15న చేపట్టాల్సిన ప్రయోగాన్ని నవంబర్ 18న ఉదయం 11.30కి నిర్వహిస్తామని దాని తయారీదారు, హైదరాబాద్‌కు చెందిన స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థ ప్రతినిధి ఆదివారం వెల్లడించారు. శ్రీహరికోటలోని ఇస్రోకు చెందిన సతీష్ ధవన్ అంతరిక్ష ప్రయోగకేంద్రం వేదిక నుంచి దీనిని ప్రయోగిస్తారు. -
తొలి ప్రైవేట్ రాకెట్ ప్రయోగం వాయిదా
న్యూఢిల్లీ: దేశంలోనే తొలి ప్రైవేటు రాకెట్ విక్రమ్- ఎస్ ప్రయోగం వాయిదా పడింది. వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవటంతో మరో మూడు రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు హైదరాబాద్‌కు చెందిన స్పేస్ స్టార్టప్ స్కైరూట్ ఏరోస్పేస్ ఆదివారం ప్రకటించించింది. ఈ నెల 15నే విక్రమ్-ఎస్ ప్రయోగం నిర్వహించాలని భావించినప్పటికీ.. నవంబర్ 18కి వాయిదా వేస్తున్నట్లు పేర్కొంది. ‘వాతావరణం అనుకూలించకపోవటం వల్ల విక్రమ్-ఎస్ రాకెట్ లాంఛ్‌ను మరో మూడు రోజులు 15-19 మధ్య చేపట్టాలని నిర్ణయించాం. నవంబర్ 18 ఉదయం 11.30 గంటల ప్రాంతంలో జరిగేందుకు అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరి కోట ఇస్రో లాంఛ్‌పాడ్ నుంచి ఈ ప్రయోగం జరగనుంది.’ అని తెలిపింది స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థ. దేశంలో మొట్టమొదటిసారిగా ప్రైవేటు రంగంలో నిర్మించిన రాకెట్ విక్రమ్-ఎస్. ‘ప్రారంభ్’ అనే ఈ మిషన్‌లో రెండు భారతీయ, ఒక విదేశీ ఉపగ్రహం ఉంటాయని హైదరాబాద్‌కు చెందిన స్టార్టప్ స్కైరూట్ ఏరోస్పేస్ తెలిపింది. స్కైరూట్ ఏరోస్పేస్ కంపెనీ మూడు వేరియంట్లలో విక్రమ్ రాకెట్‌ను డెవలప్ చేస్తోంది. విక్రమ్–1 రాకెట్ 480 కిలోల పేలోడ్‌ను తక్కువ ఎత్తు ఉన్న కక్ష్యలోకి మోసుకెళ్లగలదు. విక్రమ్–2 595 కిలోలు, విక్రమ్–3 815 కిలోల పేలోడ్‌ను భూమి నుంచి 500 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న కక్ష్యలోకి మోసుకెళ్తాయి. ఇదీ చదవండి: తిండి లేని రోజుల నుంచి.. అమెరికాలో సైంటిస్ట్ దాకా.. ఆయన ప్రయాణం స్ఫూర్తిదాయకం -
15న నింగిలోకి తొలి ప్రైవేట్ రాకెట్
న్యూఢిల్లీ: దేశంలో మొట్టమొదటిసారిగా ప్రైవేటు రంగంలో నిర్మించిన రాకెట్ విక్రమ్-ఎస్ ఈ నెల 15న నింగిలోకి దూసుకెళ్లనుంది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరి కోట ఇస్రో లాంఛ్‌పాడ్ నుంచి ఉదయం11.30 గంటలకు ప్రయోగించనున్నట్లు హైదరాబాద్‌కు చెందిన స్టార్టప్ సంస్థ స్కైరూట్ ఏరోస్పేస్ తెలిపింది. ప్రారంభ్ అనే ఈ మిషన్‌లో రెండు భారతీయ, ఒక విదేశీ ఉపగ్రహం ఉంటాయని తెలిపింది. స్కైరూట్ ఏరోస్పేస్ కంపెనీ మూడు వేరియంట్లలో విక్రమ్ రాకెట్‌ను డెవలప్ చేస్తోంది. విక్రమ్–1 రాకెట్ 480 కిలోల పేలోడ్‌ను తక్కువ ఎత్తు ఉన్న కక్ష్యలోకి మోసుకెళ్లగలదు. విక్రమ్–2 595 కిలోలు, విక్రమ్–3 815 కిలోల పేలోడ్‌ను భూమి నుంచి 500 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న కక్ష్యలోకి మోసుకెళ్తాయి. ఇదీ చదవండి: న్యాయమూర్తుల నియామకంలో జాప్యమా? -
వచ్చేవారమే నింగిలోకి తొలి ప్రైవేట్ రాకెట్
న్యూఢిల్లీ: భారత్‌లో అంతరిక్ష ప్రయోగాల విషయంలో నూతన అధ్యాయం ప్రారంభం కాబోతోంది. దేశంలో ప్రైవేట్ రంగంలో అభివృద్ధి చేసిన మొట్టమొదటి రాకెట్ ‘విక్రమ్–ఎస్’ ప్రయోగాన్ని వచ్చేవారమే చేపట్టబోతున్నారు. సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఈ నెల 12–16 తేదీల మధ్య ఈ ప్రైవేట్ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది. ఈ మొత్తం ప్రయోగానికి ‘ప్రారంభ్ మిషన్’ అని నామకరణం చేశారు. విక్రమ్–ఎస్ రాకెట్‌ను హైదరాబాద్‌కు చెందిన స్కైరూట్ ఏరోస్పేస్ అనే ప్రైవేట్ స్టార్టప్ కంపెనీ అభివృద్ధి చేసింది. ప్రైవేట్ రంగంలో రాకెట్‌ను అభివృద్ధి చేసి, ప్రయోగిస్తుండడం దేశంలో ఇదే మొదటిసారి కావడం విశేషం. విక్రమ్–ఎస్ రాకెట్ మూడు పేలోడ్లను అంతరిక్షంలోకి తీసుకెళ్లనుంది. ఇందులో విద్యార్థులు తయారు చేసిన 2.5 కిలోల పేలోడ్ సైతం ఉంది. స్పేస్ కిడ్స్ ఇండియా కార్యక్రమంలో భాగంగా దీనిని తయారు చేశారు. ‘ఇన్–స్పేస్’ క్లియరెన్స్ దేశంలో అంతరిక్ష సాంకేతికరంగ నూతన సంస్థలకు ప్రోత్సాహం, నియంత్రణలకు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ‘ఇన్–స్పేస్’ సంస్థ నోడల్ ఏజెన్సీగా పనిచేస్తోంది. ప్రైవేట్ విక్రమ్–ఎస్ రాకెట్ ప్రయోగానికి ఇన్–స్పేస్ నుంచి ఇప్పటికే క్లియరెన్స్ లభించింది. ఇంకా అధికారికంగా ప్రకటించనప్పటికీ ఈ నెల 12–16 మధ్య ప్రయోగం చేపట్టే వీలున్నట్లు స్కైరూట్ ఏరోస్పేస్ బిజినెస్ డెవలప్మెంట్ ప్రతినిధి శిరీష్ పల్లికొండ మంగళవారం తెలిపారు. ప్రారంభ్ మిషన్‌ను ఆరంభిస్తుండడం ఆనందంగా ఉందన్నారు. వాతావరణ పరిస్థితులను బట్టి ప్రయోగ తేదీని ఖరారు చేస్తామని స్కైరూట్ ఏరోస్పేస్ సీఈఓ పవన్‌కుమార్ చందన వెల్లడించారు. స్కైరూట్ ఏరోస్పేస్ కంపెనీ మూడు వేరియంట్లలో విక్రమ్ రాకెట్‌ను డెవలప్ చేస్తోంది. విక్రమ్–1 రాకెట్ 480 కిలోల పేలోడ్‌ను తక్కువ ఎత్తు ఉన్న కక్ష్యలోకి మోసుకెళ్లగలదు. విక్రమ్–2 595 కిలోలు, విక్రమ్–3 815 కిలోల పేలోడ్‌ను భూమి నుంచి 500 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న కక్ష్యలోకి మోసుకెళ్తాయి. ఇదీ చదవండి: ఓవైపు చంద్రగ్రహణం, మరోవైపు బిర్యానీ.. ఏంటిది? మీరు చెప్పేదేంటి? కొట్టుకునేవరకు వెళ్లిన పంచాయితీ -
సీఈ20 ఇంజన్ పరీక్ష విజయవంతం
సూళ్లూరుపేట: ఎల్వీఎం3–ఎం3 రాకెట్ ప్రయోగానికి సంబంధించి క్రయోజనిక్ దశలో ఉపయోగపడే కొత్త ఇంజన్‌ను(సీఈ–20) భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) విజయవంతంగా పరీక్షించింది. సీఈ–20 ఇంజన్ భూస్థిర పరీక్షను నిర్వహించినట్టుగా ఇస్రో శనివారం ప్రకటించింది. తమిళనాడు రాష్ట్రం మహేంద్రగిరిలోని ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్(ఐపీఆర్సీ) ఈ పరీక్షకు వేదికగా నిలిచింది. ఈ నెల 22న నిర్వహించిన ఎల్వీఎం3–ఎం2 రాకెట్ ప్రయోగం ద్వారా లండన్ శాటిలైట్ కమ్యూనికేషన్ల సంస్థ ‘వన్‌వెబ్’కు చెందిన 36 ఉపగ్రహాలను భూమికి 601 కిలోమీటర్లు ఎత్తులోని లోయర్ ఎర్త్ ఆర్బిట్‌లోకి ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. వన్‌వెబ్‌కు చెందిన మరో 36 శాటిలైట్లను వచ్చే ఏడాది జనవరి–ఫిబ్రవరిలో ఎల్వీఎం3–ఎం3 రాకెట్ ద్వారా ప్రయోగించాల్సి ఉంది. ఈ ఉపగ్రహాలను వదిలిపెట్టాల్సిన కక్ష్య తక్కువ దూరంలో ఉండడంతో క్రయోజనిక్ దశలో నింపే 25 టన్నుల ఇంధనంలో 5 టన్నుల భారాన్ని, ఖర్చును తగ్గించేందుకు సీఈ–20 పేరిట నూతనంగా క్రయోజనిక్ ఇంజన్‌ను డిజైన్ చేశారు. సుమారు 25 సెకండ్లపాటు మండించి ఈ ఇంజన్ సామర్థ్యాన్ని నిర్ధారించుకున్నారు. దీన్ని ఎల్వీఎం3 రాకెట్ ప్రయోగాల కోసమే రూపొందించినట్లు ఇస్రో వెల్లడించింది. జీఎస్ఎల్వీ మార్క్–2 రాకెట్ ప్రయోగాలకు సీఈ–12.5, జీఎస్ఎల్వీ మార్క్–3 ప్రయోగాలకు సీఈ–25, వాణిజ్యపరంగా ఎల్వీఎం3 ప్రయోగాలకు సీఈ–20.. అనే మూడు రకాల క్రయోజనిక్ ఇంజన్లు అందుబాటులోకి రావడం విశేషం. -
ఇక... వాణిజ్య గ‘ఘనమే’!
వినువీధిలో మరో విజయం దక్కింది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) తన చరిత్రలోనే అత్యంత బరువైన రాకెట్‌ను ఆదివారం నాడు విజయవంతంగా గగనతలంలోకి పంపి, మరో మైలురాయిని చేరుకుంది. ‘జియోసింక్రనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ మార్క్ 3’ (జీఎస్ఎల్వీ ఎంకే 3) రాకెట్‌తో దాదాపు 6 టన్నుల పేలోడ్‌ను దిగువ భూకక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ‘ఎల్వీఎం3– ఎం2’ అని కూడా ప్రస్తావించే ఈ రాకెట్ ఏకంగా 36 ఉపగ్రహాలతో ఇంత బరువును విహాయసంలోకి తీసుకువెళ్ళడం ఇస్రో చరిత్రలో ఇదే తొలిసారి. విజయవంతమైన ఈ ప్రయోగం మన అత్యాధునిక ఉపగ్రహ వాహక నౌక ‘ఎల్వీఎం3’ రాకెట్ ఆచరణీయతను మరోసారి ధ్రువీకరించింది. ఆసక్తితో చూస్తున్న ‘గగన్‌యాన్’ లాంటి వాటికి ఆ రాకెట్ అన్ని విధాలా తగినదని తేల్చిచెప్పింది. అంతేకాక, భారీ ఉపగ్రహాల ప్రయోగానికి సంబంధించిన విపణిలో ఇస్రో బలమైన అభ్యర్థి అని చాటిచెప్పింది. ఈ పరిణామం అభినందనీయం. అందుకు అనేక కారణాలున్నాయి. భారత అంతరిక్ష విభాగ పరిధిలోని ప్రభుత్వరంగ సంస్థ ‘న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్’ (ఎన్ఎస్ఐఎల్) వాణిజ్య ఉపగ్రహ ప్రయోగాలను చేపడుతోంది. ఆ ప్రయోగాలకు అంకితమైన రాకెట్ – ‘ఎల్వీఎం3’. 2017లో ఈ రాకెట్‌ను తొలిసారి ప్రయోగించారు. అప్పటి నుంచి మన దేశ కమ్యూనికేషన్ ఉపగ్రహాలనూ, ఇతర పేలోడ్లనూ నాలుగు సార్లు విజయవంతంగా వినువీధిలోకి పంపిన ఘనత ఈ రాకెట్ది. ఇప్పుడు తొలిసారిగా విదేశీ పేలోడ్‌ను వినువీధిలోకి పంపడానికి దీన్ని వినియోగించారు. జయకేతనం ఎగరే సిన ఈ రాకెట్ మనకు అందివచ్చిన అవకాశం. ఒకేసారి ఉపగ్రహాల్ని ఒక మండలంగా ప్రయోగిస్తూ పలు సంస్థల అవసరాల్ని తీర్చి, అంతర్జాతీయ విపణిలో ఆ ఖాళీ భర్తీకి ఇది ఉపకరిస్తుంది. నిజానికి, అక్టోబర్ 23 నాటి ఈ అంతరిక్ష ప్రయోగం ఎన్ఎస్ఐఎల్కూ, బ్రిటన్‌కు చెందిన ‘వన్ వెబ్’కూ మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందంలో భాగం. భారతీ గ్లోబల్ భారీగా పెట్టుబడులు పెట్టిన ఈ వన్ వెబ్‌కు దిగువ భూకక్ష్య (ఎల్ఈఓ)లో పలు ఉపగ్రహాలు అవసరం. ఆ అవసరాన్ని ఇస్రో ఇలా తీరుస్తోంది. తాజా 36 ఉపగ్రహాలు కాక, మరో 36 వన్‌వెబ్ ఉపగ్రహాలను రెండో విడతగా 2023లో ఇస్రో అంతరిక్షంలోకి పంపనుంది. ఇలా రెండు ప్రయోగాలతో మొత్తం 72 ఉపగ్రహాలను నింగిలోకి పంపడానికి ఆ సంస్థ మన ఇస్రోకు రూ. 1000 కోట్లు చెల్లించింది. వచ్చే ఏడాది కల్లా ప్రపంచవ్యాప్త టెలీకమ్యూనికేషన్లలో హైస్పీడ్ కనెక్టివిటీని అందించాలని వన్‌వెబ్ లక్ష్యం. ఆ లక్ష్య సాధనకు మొత్తం 648 ఉపగ్రహాల్ని నింగిలోకి పంపాలని సిద్ధమైంది. ఇప్పటికి 462 పంపగలిగింది. తాజా ప్రయోగంలో ఓ తిరకాసుంది. ప్రతి రెంటికీ మధ్య కనీసం 137 మీటర్ల దూరం ఉండేలా మొత్తం 36 ఉపగ్రహాలనూ 601 కి.మీ. కక్ష్యలో అత్యంత కచ్చితత్వంతో ప్రవేశపెట్టాలి. వన్‌వెబ్‌కు ఉన్న ఈ అవసరాన్ని అతి సమర్థంగా నెరవేర్చడం ఇస్రో సాధించిన ఘనత. థ్రస్టర్లను ఉపయోగించి, క్రయో దశలోనే పదే పదే దిశానిర్దేశంతో, ఈ విన్యాసాన్ని ఇస్రో చేసిచూపింది. ఇస్రోకు మరిన్ని వాణిజ్య ఒప్పందాలు రావాలంటే – ఇప్పటి ప్రయోగం, అలాగే వచ్చే ఏటి రెండో విడత ప్రయోగం సక్సెస్ కావడం కీలకం. తాజా విజయం మన అంతరిక్ష ప్రయోగ సామర్థ్యానికి మరో మచ్చుతునక. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న వాణిజ్య ఉపగ్రహ ప్రయోగాల గిరాకీకి తగ్గట్టు మన ఉపగ్రహ వాహక జవనాశ్వమైన ఎల్వీఎం3 రాకెట్ల తయారీని వేగవంతం చేసేందుకు ఇస్రో సన్నద్ధమవుతోంది. అసలు ఇలా ఒకేసారి ఉపగ్రహ మండలంగా పలు ఉపగ్రహాలను ఒకే కక్ష్యలోకి వాణిజ్యపరంగా పంపే వాహక నౌకల కొరత అంతర్జాతీయంగా ఉంది. ఉక్రెయిన్ యుద్ధ నేపథ్యంలో ఆ ఉపగ్రహా లను రక్షణ ప్రయోజనాలకు వాడబోమని హామీ ఇవ్వాలంటూ పట్టుబట్టి, రష్యా ఈ వన్ వెబ్ అవకాశం వదులుకుంది. చైనా రాకెట్ల వాణిజ్య సత్తాను పాశ్చాత్యలోకంం అంగీకరించదు. ఫ్రాన్స్‌లో వీటి అభివృద్ధి ఆలస్యమైంది. ఇవన్నీ మనకు కలిసొచ్చాయి. ప్రస్తుతం అంతరిక్ష వాణిజ్య విపణిలో అంతర్జాతీయంగా భారత వాటా 2 శాతమే. తాజా ప్రయోగ విజయంతో దాన్ని గణనీయంగా పెంచుకొనే వీలు చిక్కింది. వాణిజ్య ప్రయోగాలకు ఇస్రో వద్ద పీఎస్ఎల్వీ మాత్రమే ఉంది. తాజా ఎల్వీఎం3–ఎం2 రాకెట్‌తో రెండో అస్త్రం చేరింది. పూర్తి స్వదేశీ సాంకేతికతతో రూపొందిన ఈ రాకెట్ ‘చంద్రయాన్–2’ సహా 4 ప్రయోగాల్ని సక్సెస్ చేసింది. మనిషిని విహాయసంలో విహరింపజేసే ‘గగన్‌యాన్’కూ దీన్నే స్వల్ప మార్పులతో సిద్ధం చేస్తున్నారు. వచ్చే ఏటి ‘చంద్రయాన్–3’కీ, సూర్య గ్రహ అధ్యయనమైన ‘ఆదిత్య ఎల్1’కూ సన్నాహాలు సాగుతుండడం గర్వకారణం. రాబోయే రోజుల్లో ఉపగ్రహ సేవలనేవి అతి పెద్ద వ్యాపారం. 5జీ వస్తున్నవేళ టెలికామ్ సేవలకు కీలకమైన ఎల్ఈఓ ఉపగ్రహాలను గగనంలోకి పంపే విపణిలో ఆటగాడిగా మనం అవతరించడం శుభసూచకం. మనకూ ఉపయుక్తం. ఇదే ఊపు కొనసాగితే వచ్చే 2025 కల్లా మన అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ 1300 కోట్ల డాలర్ల (రూ.1.07 లక్షల కోట్ల) ఆదాయాన్ని అందుకుంటుందట. ఉపగ్రహ సేవల విపణి 500 కోట్ల డాలర్లకూ, గ్రౌండ్ సేవలు 400 కోట్ల డాలర్లకూ చేరుకుంటాయని లెక్క. వెరసి, రాగల మూడేళ్ళలో ఉపగ్రహ, ప్రయోగ సేవల్లో మనం మునుపెన్నడూ లేనట్టు 13 శాతం అత్యధిక వార్షిక వృద్ధి రేటు సాధిస్తామన్న మాట ఈ ఆనందానికి మరిన్ని రెక్కలు తొడుగుతోంది. దేశీయ అంతరిక్ష రంగంలో ప్రైవేట్ భాగస్వామ్యం శ్రీకారం చుట్టుకుంది. అంతరిక్ష వాణిజ్య సేవల రంగంలో దేశంలో రానున్న పెనుమార్పులకు స్వాగతం... శుభ స్వాగతం! -
ఎస్ఎస్ఎల్వీ డీ1 రాకెట్ ప్రయోగంలో సందిగ్ధత
సూళ్లూరుపేట(తిరుపతి): చిన్నచిన్న ఉపగ్రహాలను తక్కువ దూరంలో ఉన్న కక్ష్యలోకి ప్రవేశపెట్టడానికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) రూపొందించిన స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్(ఎస్ఎస్ఎల్వీ డీ1) ఆదివారం నింగిలోకి దూసుకెళ్లింది. 13.2 నిమిషాల్లో ప్రయోగం పూర్తయ్యింది. రాకెట్ గమనాన్ని విశ్లేషిస్తున్నామని శాస్త్రవేత్తలు తెలిపారు. మూడో దశ తర్వాత ఈవోఎస్-2, ఆజాదీ ఉపగ్రహాలను రాకెట్ వదిలింది. సాంకేతిక లోపం కారణంగా ఉపగ్రహాల నుంచి కంట్రోల్ సెంటర్‌కు సిగ్నల్ అందడం లేదని శాస్త్తవేత్తలు తెలిపారు. మూడు దశల ప్రయోగాలు పూర్తయ్యాయని.. నాలుగో దశలో సాంకేతిక సమస్య తలెత్తిందన్నారు. తుది దశ సమాచార సేకరణలో కొంత ఆలస్యం జరుగుతుందన్నారు. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట సమీపంలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లోని(షార్) మొదటి ప్రయోగ వేదిక నుంచి ఉదయం 9.18 గంటలకు ఈ రాకెట్‌ను ప్రయోగించింది. చదవండి: ఆరోగ్య బీమాలో రెండో స్థానంలో ఏపీ చిన్నచిన్న ఉపగ్రహాలతో అంతరిక్షంలోకి దూసుకెళ్లేలా ఎస్ఎస్ఎల్వీ డీ1ను ఇస్రో రూపొందించింది. 34 మీటర్ల పొడవు, రెండు మీటర్ల వెడల్పు, 120 టన్నుల బరువు ఉండే ఈ రాకెట్ ద్వారా రెండు ఉపగ్రహాలను రోదసీలోకి పంపిస్తున్నారు. ఇందులో దేశ అవసరాలకు సంబంధించిన 135 కేజీల మైక్రోశాట్–2ఏ(ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్) ఉపగ్రహంతో పాటు దేశంలోని 75 జిల్లా పరిషత్ హైస్కూల్స్‌కు చెందిన 750 మంది గ్రామీణ విద్యార్థినులు తయారు చేసిన ‘ఆజాదీ శాట్’ను ప్రయోగించారు. ఇస్రో పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన భూ పరిశీలన ఉపగ్రహమే మైక్రోశాట్ 2ఏ. అధిక రిజల్యూషన్‌తో కూడిన ప్రయోగాత్మక ఆప్టికల్ రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహం ఇది. ఈ ఉపగ్రహం భూమికి తక్కువ ఎత్తులో ఉండి అత్యంత ఆధునిక సాంకేతిక పరికరాలతో భూమి మీద ఉన్న వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు అధ్యయనం చేసి సమాచారాన్ని చేరవేస్తుంటుంది. బుల్లి ఉపగ్రహమైన ఆజాదీ శాట్ బరువు 8 కేజీలు. ఇందులో 75 పే లోడ్స్‌ను ఏకీకృతం చేశారు. ఉష్ణోగ్రత సెన్సార్లు, రేడియేషన్ కౌంటర్లు, సోలార్ ప్యానల్ సహాయంతో ఫొటోలు తీయడానికి సెల్ఫీ కెమెరాలు, దీర్ఘ శ్రేణి కమ్యూనికేషన్ ట్రాన్స్పాండర్లు అమర్చారు. ఈ ఉపగ్రహం 6 నెలలు మాత్రమే సేవలందిస్తుంది. ఈ ఏడాదిని ‘అంతరిక్షంలో అతివ’గా పరిగణిస్తున్న నేపథ్యంలో ‘సైన్స్ అండ్ టెక్నాలజీ–ఇంజనీరింగ్ మ్యాథమేటిక్స్’లో మహిళలను ప్రోత్సహించేందుకు దీనిని మొదటి అంతరిక్ష మిషన్‌గా ప్రయోగిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌కు రిఫాత్ షరూక్ అనే మహిళ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్‌గా విద్యార్థులతో ఈ ఉపగ్రహాన్ని తయారు చేయించారు. -
నేడే నింగిలోకి ఎస్ఎస్ఎల్వీ డీ1
సూళ్లూరుపేట(తిరుపతి): చిన్నచిన్న ఉపగ్రహాలను తక్కువ దూరంలో ఉన్న కక్ష్యలోకి ప్రవేశపెట్టడానికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) రూపొందించిన స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్(ఎస్ఎస్ఎల్వీ డీ1) ఆదివారం నింగిలోకి దూసుకెళ్లనుంది. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట సమీపంలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లోని(షార్) మొదటి ప్రయోగ వేదిక నుంచి ఉదయం 9.18 గంటలకు ఈ రాకెట్‌ను ప్రయోగించనున్నారు. రాకెట్ ప్రయోగంపై శనివారం ‘షార్’లో ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ పర్యవేక్షణలో ఎంఆర్ఆర్ కమిటీ చైర్మన్ పద్మకుమార్ ఆధ్వర్యంలో సమీక్ష నిర్వహించారు. మధ్యాహ్నం 2 గంటలకు లాంచ్ ఆథరైజేషన్ బోర్డు చైర్మన్ ఆర్ముగం రాజరాజన్ ఆధ్వర్యంలో మరో సమావేశం నిర్వహించి.. ప్రయోగ సమయాన్ని అధికారికంగా ఖరారు చేశారు. షార్ నుంచి ఇది 83వ ప్రయోగం కాగా.. ఎస్ఎస్ఎల్వీ డీ1 సిరీస్‌లో ఇదే మొదటిది కావడం గమనార్హం. అంటే ఎస్ఎస్ఎల్వీ ప్రయోగాల్లో ఇస్రో నూతన చరిత్రకు శ్రీకారం చుడుతున్నట్లు స్పష్టమవుతోంది. పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్(పీఎస్ఎల్వీ), జియోసింక్రనస్ లాంచ్ వెహికల్(జీఎస్ఎల్వీ) ప్రయోగాల్లో ఇస్రో ఇప్పటికే అంతర్జాతీయ ఖ్యాతి గడించిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఎస్ఎస్ఎల్వీ వంతు వచ్చింది. 7 గంటల కౌంట్‌డౌన్ 34 మీటర్ల పొడువు, 2 మీటర్ల వెడల్పు, 120 టన్నుల బరువున్న ఎస్ఎస్ఎల్వీ డీ1ను నాలుగు దశల్లో ప్రయోగించనున్నారు. కేవలం 13.2 నిమిషాల్లోనే ప్రయోగం పూర్తవుతుంది. మొదటి దశను 87 టన్నుల ఘన ఇంధనంతో 127.5 సెకన్లలో పూర్తి చేస్తారు. రెండో దశను 7.7 టన్నుల ఘన ఇంధనంతో 336.9 సెకన్లలో, మూడో దశను 4.5 టన్నుల ఘన ఇంధనంతో 633.3 సెకన్లలో పూర్తి చేయనున్నారు. నాలుగో దశలో మాత్రం 0.05 టన్నుల ద్రవ ఇంధనాన్ని మండించి, 742 సెకన్లలో 135 కిలోల బరువు కలిగిన మైక్రోశాట్–2ఏ(ఈఓఎస్శాట్)ను ముందుగా రోదసీలోకి ప్రవేశపెడతారు. తర్వాత విద్యార్థినులు తయారు చేసిన ఆజాదీశాట్‌ను భూమికి అతి దగ్గరగా.. 350 కిలోమీటర్ల ఎత్తులోని లియో ఆర్బిట్‌లోకి 792 సెకన్లలో ప్రవేశపెట్టేలా శాస్త్రవేత్తలు ప్రయోగాన్ని డిజైన్ చేశారు. ద్రవ ఇంధనాన్ని నింపే ప్రక్రియతో పాటు రాకెట్‌లోని అన్ని వ్యవస్థలను ఉత్తేజితం చేయడానికి కౌంట్‌డౌన్‌ను 7 గంటలుగా నిర్ణయించారు. -
ఈనెల 7న ఎస్ఎస్ఎల్వీ తొలి ప్రయోగం
సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) నూతనంగా తయారుచేసిన స్మాల్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ (ఎస్ఎస్ఎల్వీ)ను ఈనెల 7వ తేదీ ఉదయం 9.18 గంటలకు ప్రయోగించనుంది. స్వదేశీ, విదేశీ సంస్థలతో పాటు, విద్యార్థులు తయారుచేసే చిన్న తరహా ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపించేందుకు ఇస్రో పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో ఎస్ఎస్ఎల్వీని రూపొందించింది. 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కేంద్రం నిర్వహిస్తున్న ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా ఈ రాకెట్ ప్రయోగాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు ముమ్మరం చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న 75 జిల్లా పరిషత్ పాఠశాలలకు చెందిన 750 మంది గ్రామీణ విద్యార్థినులు తయారు చేసిన ఆజాదీ శాట్ అనే ఉపగ్రహాన్ని ఈ రాకెట్ ద్వారా తొలిసారిగా అంతరిక్షంలోకి పంపిస్తున్నారు. ఇది కూడా చదవండి: మీ ఫోన్ రిపేర్ అయ్యిందా? శాంసంగ్ యూజర్లకు శుభవార్త! -
నేడు జీశాట్–24 ఉపగ్రహ ప్రయోగం
సూళ్లూరుపేట: న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్ (ఎన్సీఐఎల్), కేంద ప్రభుత్వం తరఫున డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ (డీవోఎస్) సంయుక్తంగా రూపాందించిన జీశాట్–24 కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని బుధవారం తెల్లవారుజామున ప్రయోగించనున్నారు. ఫ్రాన్స్‌లోని ప్రెంచి గయానా కౌరూ అంతరిక్ష కేంద్రం నుంచి ఏరియన్–వీ వీఏ257 రాకెట్ నుంచి దీన్ని అంతరిక్షంలోకి పంపనున్నారు. బెంగళూరులోని ప్రొఫెసర్ యూఆర్ రావు స్పేస్ సెంటర్ (యూఆర్ఎస్సీ)లో రూపొందించిన 4,180 కిలోల బరువు కలిగిన జీశాట్–24 ఉపగ్రహాన్ని గత నెల 18న ఫ్రాన్స్‌కు పంపించిన విషయం విదితమే. ఈ ఉపగ్రహంలో 24 కేయూ బ్యాండ్ ట్రాన్స్‌ఫాండర్లు అమర్చారు. డీటీహెచ్ అప్లికేషన్ అవసరాలను తీర్చేందుకు పాన్ ఇండియా కవరేజీతో ఈ ఉపగ్రహాన్ని రోదసీలో పంపుతున్నారు. న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్ జీశాట్–24 ఉపగ్రహాన్ని టాటాప్లే అనే సంస్థకు లీజుకిచ్చింది. ఇప్పటికే ఇస్రో శాస్త్రవేత్తలు ఫ్రాన్స్‌కు చేరుకుని రాకెట్ ప్రయోగం పనులను పరిశీలిస్తున్నారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) 4,000 కిలోలకుపైన బరువున్న భారీ ఉపగ్రహాలను కౌరూ అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగిస్తుండగా.. ఫ్రాన్స్‌కు చెందిన బుల్లి ఉపగ్రహాలను వారు మన దేశం అంటే ఇస్రో నుంచి ప్రయోగిస్తున్నారు. -
గుడ్ క్యాచ్! ఆకాశం నుంచి పడిపోతున్న రాకెట్‌ని పట్టుకున్న హెలికాప్టర్!
US-based launch firm was partially successful: అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన రాకెట్‌ల్యాబ్ ప్రయోగ సంస్థ ఒక అత్యద్భుతమైన ప్రయోగాన్ని విజయవంతం చేసింది. అంతరిక్ష పరిశోధనలకు సంబంధించిన ప్రయోగాలలో ఒక గొప్ప మైలురాయిని సాధించింది. అంతరిక్షంలోకి బహుళ ఉపగ్రహాలతో రాకెట్‌ని పంపే ఖర్చుని తగ్గించుకునేలా వాటిని తిరిగి భూమ్మీదకు తీసుకువచ్చేందుకు చేసిన ఒక ప్రయోగం అద్భుతమైన విజయాన్ని సాధించింది. అపర కుభేరుడు, స్పేస్ఎక్స్ వ్యవస్థాపకుడు ఎలెన్ మస్క్ ఈ రాకెట్ ల్యాబ్‌ని నిర్వహిస్తున్నారు. న్యూజిల్యాండ్‌లో బుధవారం ఉదయం 10.50 గంటలకు అంతరిక్షంలోని కక్ష్యలోకి 34 ఉపగ్రహాలను పంపడానికి బయలుదేరిన బూస్టర్ రాకెట్ ఆకాశంలో ఒకనొక దశలో కొంత ఎత్తుకు చేరుకున్న తర్వాత భూమ్మీద పడిపోబోతోంది. అదే సమయంలో న్యూజిలాండ్ తీరంలో సౌత్ పసిఫిక్‌కి సమీపంలో ఉన్న ఒక హెలికాప్టర్ రాకెట్‌ని పట్టుకునేందుకు 22 మైళ్ల దూరంలో ఒక పారాచూట్‌ని వదిలింది. హెలికాప్టర్ పారాచూట్, కేబుల్ వైర్ల సాయంతో ఆ రాకెట్‌ని పట్టుకుంది. ఆ తర్వాత ఆ రాకెట్ పసిఫిక్ మహా సముద్రంలోకి దూసుకెళ్లింది. ఈ మేరకు ఈ రాకెట్ ప్రయోగం పాక్షికంగా విజయవంతమైంది గానీ ఆ రాకెట్‌ని సముద్రంలో పడకుండా భూమ్మీదకు తేగలిగినట్లయితే పూర్తి స్థాయిలో విజయం సాధించనట్లు అని రాకెట్ ల్యాబ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ పీటర్ బెక్ చెప్పారు. ఆ రాకెట్ సురక్షితంగా సముద్రంలోకి వెళ్లిందని, దాన్ని ఓడ సాయంతో తిరిగి తీసుకువస్తామని తెలిపారు. ఐతే ఆ బూస్టర్ రాకెట్ తిరిగి వినయోగించనుందా లేదా అనేది స్పష్టం చేయలేదు. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆన్లైన్లో తెగ వైరల్ అవుతోంది. 🚁 This was the moment a helicopter caught a falling rocket booster before dropping it into the ocean https://t.co/sPxDJjhEtt pic.twitter.com/I00r9G014L — Reuters (@Reuters) May 3, 2022 This is what it looked like from the front seats. pic.twitter.com/AwZfuWjwQD — Peter Beck (@Peter_J_Beck) May 3, 2022 (చదవండి: నేనేం రోబోను కాదు.. నాకూ ఫీలింగ్స్ ఉన్నాయి: ఎలన్ మస్క్) -
తగ్గేదేలే అంటున్న నార్త్ కొరియా.. కిమ్ మరో వార్నింగ్
ప్యాంగ్యాంగ్: ఉక్రెయిన్-రష్యా యుద్దం ప్రపంచ దేశాలను ఆందోళనకు గురి చేస్తుంటే.. మరోవైపు ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ క్షిపణి ప్రయోగాలతో దూసుకెళ్తున్నారు. ఈ ఏడాదిలో ఇప్పటికే ఎనిమిది క్షిపణి ప్రయోగాలు చేసిన నార్త్ కొరియా.. తాజాగా శనివారం మరో ప్రయోగం చేసి ఉద్రిక్తతలను పెంచింది. వివరాల ప్రకారం.. ప్రపంచదేశాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నా ఉత్తరకొరియా తన క్షిపణి ప్రయోగాలను ఆపట్లేదు. అణ్వాయుధాల కట్టడిపై 2019లో అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో జరిపిన చర్చలు విఫలం అయ్యాయి. అనంతరం అమెరికా, ఉత్తర కొరియా మధ్య తీవ్ర ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ట్రంప్, కిమ్ మధ్య కొన్ని రోజులు మాటల యుద్దం నడిచింది. ఆ తర్వాత ఉత్తరకొరియా మరింత జోరు పెంచింది. తమ రక్షణ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసుకునేలా పలుమార్లు క్షిపణి ప్రయోగాలను చేపడుతూనే ఉంది. కొన్ని నెలలుగా నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ వరుస క్షిపణి ప్రయోగాలతో బిజీగా మారిపోయారు. ఈ సంవత్సురంలో ఇప్పటికి తొమ్మిది క్షిపణి ప్రయోగాలు చేపట్టినట్టు దక్షిణ కొరియా వెల్లడించింది. శనివారం ప్రయోగించిన క్షిపణి ప్రయోగంపై జపాన్ రక్షణ శాఖ స్పందిస్తూ.. సముద్రంలోకి బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించినట్టు తాము భావిస్తున్నామని చెప్పింది. అంతకు ముందు ఫిబ్రవరి 27వ తేదీన నార్త్ కొరియా ఎనిమిదొవ బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది. మరోవైపు మార్చి 9వ తేదీన(బుధవారం) దక్షిణ కొరియాలో అధ్యక్ష ఎన్నికలు జరుగనున్నాయి. కాగా, ఎన్నికల కోసం ప్రెసిడెన్షియల్ బ్లూ హౌస్‌లో జాతీయ భద్రతా మండలి అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేయనున్న క్రమంలో నార్త్ కొరియా క్షిపణి ప్రయోగం చేపట్టడం ఆందోళనకు గురి చేసింది. -
బుల్లి ఉపగ్రహాలతో.. తుర్రుమనేలా
సూళ్లూరుపేట: అతి తక్కువ వ్యయంతో ఉపగ్రహాలను విజయవంతంగా అంతరిక్షంలోకి పంపిస్తూ ప్రపంచ దేశాలను ఆకర్షించిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ఇప్పుడు చిన్నచిన్న ఉపగ్రహాలపై దృష్టి పెట్టింది. ఇందుకోసం ప్రత్యేకంగా స్మాల్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్(ఎస్ఎస్ఎల్వీ)ను కూడా తయారు చేసింది. ఈ ఏడాది మార్చి నెలలోనే దీనిని ప్రయోగించేందుకు సిద్ధమైంది. ఈ ఏడాది చివరి నాటికి ఎస్ఎస్ఎల్వీ రాకెట్ల ద్వారా వంద కిలోల నుంచి 500 కిలోల బరువు కలిగిన 6,000 ఉపగ్రహాలను ప్రయోగించాలని ఇస్రో లక్ష్యంగా పెట్టుకుంది. మార్చి నెలలో ఎస్ఎస్ఎల్వీ రాకెట్‌ను ప్రయోగాత్మకంగా పరీక్షించనున్నట్లు సమాచారం. ఆ ఫలితానికి అనుగుణంగా మార్చి 25న పూర్తిస్థాయి ప్రయోగం చేపట్టనున్నారు. 34 మీటర్ల ఎత్తు.. రెండు మీటర్ల వ్యాసార్థం.. ఇప్పటిదాకా ఇస్రో ఎస్ఎల్వీ, ఏఎస్ఎల్వీ, పీఎస్ఎల్వీ, జీఎస్ఎల్వీ, జీఎస్ఎల్వీ మార్క్3 అనే ఐదు రకాల రాకెట్ల ద్వారా ఉపగ్రహాలను రోదసీలోకి పంపిస్తోంది. తాజాగా వీటి సరసన ఎస్ఎస్ఎల్వీ చేరబోతోంది. దీన్ని నాలుగు దశల్లో ప్రయోగించే విధంగా డిజైన్ చేశారు. 34 మీటర్ల ఎత్తు, రెండు మీటర్ల వ్యాసార్థం కలిగి ఉంటుంది. ప్రయోగ సమయంలో 120 టన్నుల బరువు ఉండే ఈ రాకెట్‌ను.. 500 కిలోల బరువు కలిగిన ఉపగ్రహాలను భూమికి అతి దగ్గరగా వున్న లియో ఆర్బిట్‌లో ప్రవేశపెట్టే విధంగా డిజైన్ చేశారు. ఈ రాకెట్‌ను వర్టికల్ పొజిషన్లో పెట్టి ప్రయోగించనున్నారు. ఎస్ఎస్ఎల్వీ రాకెట్‌లోని మొదటి, రెండు, మూడు దశలను ఘన ఇంధనంతో ప్రయోగించే విధంగా డిజైన్ చేశారు. ఇందులో ద్రవ ఇంధనం దశ ఉండదు. వెలాసిటీ టైమింగ్ మాడ్యూల్ అనే దశను కొత్తగా అమర్చారు. ఆ దశలోనే ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెడతారు. విద్యార్థులనూ ప్రోత్సహించే విధంగా.. ఇప్పటికే దేశంలోని పలు యూనివర్సిటీలకు చెందిన ఆస్ట్రోనాట్, ఐఐటీ విద్యార్థులు చిన్నచిన్న ఉపగ్రహాలను తయారు చేస్తున్నారు. వీరిని మరింతగా ప్రోత్సహించేందుకు ఎస్ఎస్ఎల్వీ ఎంతగానో దోహదపడనుంది. ఇస్రో కూడా భవిష్యత్ శాస్త్రవేత్తలు తయారు కావాలనే లక్ష్యంతో విద్యార్థులను భాగస్వాములను చేస్తోంది. ఇందులో భాగంగానే దేశ, విదేశాల్లో చదువుతున్న విద్యార్థులకు సాంకేతిక విజ్ఞానం, తగిన ప్రోత్సాహకం అందిస్తోంది. చిన్న తరహా ఉపగ్రహాలను తయారు చేసుకుని ముందుకొస్తే.. ఇస్రో ఉచితంగా ప్రయోగించేందుకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలోనే విద్యార్థులు ప్రత్యేకంగా రూపొందించిన ఆనంద్–01 అనే ఉపగ్రహాన్ని మార్చిలో ప్రయోగించేందుకు సన్నాహాలు చేస్తోంది. -
చైనా దూకుడు.. ఏలియన్ల కోసమే!
అంతరిక్ష పరిశోధనల్లో ప్రపంచ దేశాలన్నీ వేర్వేరు ఎజెండాతో ముందుకు వెళ్తుంటే.. చైనా మాత్రం డిఫరెంట్ పంథాలో నడుస్తోంది. ప్రస్తుతం అగ్రరాజ్యాలు మాత్రం స్పేస్ టూరిజంలో ఆధిపత్యం ప్రదర్శించడం కోసం ప్రయోగాలు చేస్తున్నాయి. అయితే చైనా మాత్రం భిన్నంగా ఏలియన్ల ఉనికి కోసమే అంతరిక్ష ప్రయోగాలు చేపడుతుండడం గమనార్హం. ఈ క్రమంలో మరో అరుదైన ఘట్టానికి చైనా వేదికైంది. ముగ్గురు వ్యోమగాములతో చైనా రాకెట్ నింగికెగసింది. అయితే ఇది ఇతర గ్రహా ప్రయోగం కాదు. చైనా భారీ ఖర్చుతో నిర్మించిన సొంత స్పేస్ స్టేషన్ కోసం. భారతకాలమానం ప్రకారం.. శుక్రవారం అర్ధరాత్రి దాటాక గోబీ ఎడారిలోని జిక్యూక్వాన్ లాంచ్ సెంటర్ నుంచి లాంగ్ మార్చ్ 2 ఎఫ్ రాకెట్ లాంఛ్ అయ్యింది. మొత్తం ముగ్గురు (షెంజావు 13 స్పేస్‌షిప్) వ్యోమగాములు ఆరు నెలలపాటు చైనా నిర్మించిన టియాన్గాంగ్ స్పేస్ స్టేషన్లో గడపనున్నారు. ఇప్పటిదాకా చైనా చేపట్టిన సుదీర్గ అంతరిక్ష ప్రయోగం ఇదే. టియాన్గాంగ్ స్పేస్ స్టేషన్లో ఎక్విప్మెంట్ను సెటప్ చేయడంతో పాటు టెక్నాలజీని పరీక్షించడానికి వీళ్లు బయలుదేరారు. తద్వారా ఏలియన్ల కోసం పరిశోధనను ముమ్మరం చేయనున్నారు. 2008లో చైనా తరపున స్పేస్ వాక్ చేసిన జాయ్ ఇఝ్గ్యాంగ్ తాజా మిషన్‌కు నాయకత్వం వహిస్తున్నారు. ఇదిలా ఉంటే చైనాకి ఇది రెండో అధికారిక స్పేస్ యాత్ర. ఏలియన్ల ఉనికి పరిశోధన కోసం చైనా అతిపెద్ద సిగ్నల్ వ్యవస్థను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. చదవండి: నటుడి అరుదైన రికార్డు -
ఆకాశంలో ఒక్కసారిగా పేలిపోయిన రాకెట్....!
వాషింగ్టన్: అంతరిక్షాన్ని జయించడం కోసం మానవుడు అనేక ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. ఇప్పటికే నాసా, పలు దేశాల అంతరిక్ష సంస్థలు అంతరిక్షాన్ని జయించాయి. నాసా, స్పేస్ఎక్స్, బ్లూ ఆరిజిన్, వర్జిన్ గెలాక్టిక్ కంపెనీలతో పాటు పలు ప్రైవేట్ కంపెనీలు కూడా అంతరిక్ష ప్రయోగాలపై దృష్టి సారించాయి. అమెరికాకు చెందిన ఫైర్‌ఫై కూడా స్పేస్ రేసులో నిలిచేందుకు ఊవిళ్లురుతుంది. అందులో భాగంగా ఫైర్‌ఫ్లై తొలి రాకెట్ ఆల్ఫాను సెప్టెంబర్ 2న ప్రయోగించింది. చదవండి: Nasa Evtol Aircraft: ఎలక్ట్రికల్ ఎయిర్ టాక్సీలపై నాసా ప్రయోగాలు ఆల్ఫా రాకెట్ లాంచ్ చేసిన కొద్ది సేపటికే ఆకాశంలో ఒక్కసారిగా పేలిపోయింది. కాగా ఫైర్‌ఫ్లై చేపట్టిన తొలి ప్రయోగం విఫలమైంది. ఫైర్‌ఫ్లై పేలుడుకు సంబంధించిన వీడియోను అధికారికంగా కంపెనీ రిలీజ్ చేసింది. రాకెట్ ప్రయోగంలో చోటుచేసుకున్న లోపాలను సోషల్‌మీడియాలో ఫైర్ ఫ్లై పేర్కొంది. ఫైర్‌ఫ్లై ఒక ప్రకటనలో రాకెట్ లాంచ్ ఐనా రెండు నిమిషాల తరువాత రాకెట్‌లోని ఒక ఇంజన్ పనిచేయడం నిలిచిపోయినట్లు పేర్కొంది. దీంతో ఒకసారిగా రాకెట్ తన నిర్దేశిత మార్గం నుంచి పక్కకు పోయి ఒక్కసారిగా పేలిపోయిందని కంపెనీ పేర్కొంది. ఆల్ఫా రాకెట్ భూ స్థిర కక్షలోకి ప్రవేశపెట్టనప్పటికీ, కంపెనీ భవిష్యత్తులో మరిన్నీ ప్రయోగాలను చేపట్టే నమ్మకం తమలో ఏర్పడిందని ఒక ప్రకటనలో పేర్కొంది. రాకెట్లను నిర్మించగల, ప్రయోగించగల కంపెనీగా ఫైర్‌ఫ్లై నిరూపించిందని కంపెనీ తెలిపింది. -
చరిత్ర సృష్టించనున్న ఎలన్ మస్క్..!
టెక్సాస్: ఎలన్ మస్క్ ది రియల్ లైఫ్ ఐరన్ మ్యాన్.. అంగారక గ్రహం, చంద్రుడిపైకి మానవులను తీసుకెళ్లాలని ఎంతగానో తహతహలాడుతున్నాడు. అందుకోసం ఇప్పటికే మానవులను ఇతరగ్రహలపైకి రవాణాచేసే అంతరిక్షనౌక స్టార్‌షిప్ ప్రయోగాలను స్పేస్ఎక్స్ కంపెనీ ప్రారంభించిన విషయం తెలిసిందే. అనేక పరాజయాల తరువాత అంతరిక్షనౌక స్టార్‌షిప్.. నింగిలోకి నిప్పులు చిమ్ముకుంటూ ఎగిసి గాల్లో చక్కర్లు కొడుతూ హై ఆల్టిట్యూడ్ టెస్ట్‌ను విజయవంతంగా స్పేస్ఎక్స్ సంస్థ పరీక్షించింది. ఎలన్ మస్క్ కలల ప్రాజెక్ట్ స్టార్‌షిప్ మరో కొత్త చరిత్రను సృష్టించనుంది. స్టార్‌షిప్‌ను తొలిసారిగా భూ నిర్ణీత కక్ష్యలోకి పంపాలని ప్రణాళిక చేస్తోంది. స్టార్‌షిప్ ఆర్బిటల్ ప్రయోగాన్ని జూలైలో లాంచ్ చేయనున్నట్లు స్పేస్ఎక్స్ అధ్యక్షురాలు గ్విన్నే షాట్వెల్ పేర్కొన్నారు. శుక్రవారం జరిగిన నేషనల్ స్పేస్ సొసైటీ అఫ్ ఇంటర్నేషనల్ స్పేస్ సదస్సులో షాట్వెల్ మాట్లాడుతూ.. ప్రస్తుతం స్టార్‌షిప్‌తో చేసే ఆర్బిటల్ ప్రయోగం చరిత్ర సృష్టించబోతుందని పేర్కొన్నారు. ఈ ప్రయోగం కష్టంతో కూడుకున్న పనైనా.. స్పేస్ ఎక్స్ శాస్త్రవేత్తలు ఆర్బిటల్ లాంచ్ ప్రయోగాన్ని విజయవంతం చేస్తామనే కృతనిశ్చయంతో ఉన్నారని తెలిపింది. స్టార్‌షిప్ ఆర్బిటల్ లాంచ్ ప్రయోగం 90 నిమిషాలపాటు జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. కాగా ప్రస్తుతం ఈ ప్రయోగానికి ఫెడరల్ ఏవియేషన్ అఫ్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ఆమోదం రాలేదు. అంతేకాకుండా స్టార్‌షిప్ ఆర్బిటల్ లాంచ్ ప్రయోగానికి పర్యావరణ అనుమతులు కూడా రావాల్సి ఉంది. ఈ ప్రయోగానికి అనుమతులు తొందరలోనే వస్తాయని స్పేస్ఎక్స్ సంస్థ అధ్యక్షురాలు గ్విన్నే షాట్వెల్ ఆశాభావం వ్యక్తం చేశారు. స్టార్‌షిప్ ప్రయోగం విజయవంతమైతే ఎలన్ మస్క్ కంపెనీ స్పేస్ ఎక్స్ అంతరిక్ష చరిత్రలో కొత్త అధ్యాయాన్ని సృష్టిస్తోందని నిపుణులు భావిస్తున్నారు. చదవండి: స్పేస్ ఎక్స్ స్టార్‌లింక్ ఇంటర్నెట్ షట్‌డౌన్.. సింపుల్‌గా పరిష్కరించిన యువకుడు..! -
చైనా నిర్వాకం: ప్రపంచం నెత్తిన మరో ప్రమాదం...
వాషింగ్టన్: కోవిడ్ ధాటికి ప్రపంచ దేశాలు చిగురుటాకులా వణికిపోతున్నాయి. మహమ్మారి వ్యాప్తి మొదలై ఇప్పటికే దాదాపు ఏడాదిన్నర కావోస్తుంది. దీన్నుంచి ఇంకా కోలుకోకమునుపే చైనా ప్రపంచం నెత్తిన మరో బాంబు వేసింది. డ్రాగన్ దేశం పంపిన ఓ రాకెట్ నియంత్రణ కోల్పోయి భూమి దిశగా పయనిస్తుందట. ఏ క్షణమైన అది భూమ్మీద పడవచ్చని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా ఏ రాకెట్ కూలిపోయిన సముద్రంలో పడుతుంది. కానీ చైనా ప్రయోగించిన లాంగ్ మార్చ్ 5బీ రాకెట్ మాత్ర భూమి దిశగా దూసుకువస్తుందట. అది ఎక్కడ పడనుందో తెలియక శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమెరికా రక్షణశాఖ ప్రస్తుతం 5బీ రాకెట్‌ను ట్రాక్ చేసేందుకు ప్రయత్నిస్తుంది. ఈ నెల 8న అది భూమ్మీదకు వచ్చే అవకాశం ఉందంటున్నారు పెంటగాన్ శాస్త్రవేత్తలు. కాకపోతే అది సరిగ్గా ఏ ప్రదేశంలో భూవాతవరణంలో ప్రవేశిస్తుందో అంచనా వేయలేకపోతున్నారు. ఈ రాకెట్ మార్గాన్ని అమెరికా స్పేస్ కమాండ్ నిశితంగా పరిశీలిస్తుందని తెలిపారు. ఇక లాంగ్ మార్చ్ 5 బీ రాకెట్ బరువు సుమారు 21 టన్నులు. ఇది ఏ క్షణానైనా భూమిపై పడే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు శాస్త్రవేత్తలు. గత వారం అంతరిక్షంలో సొంత స్పేస్ స్టేషన్‌ను ఏర్పాటు చేసేందుకు డ్రాగన్ కంట్రీ తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా మొదటి మాడ్యూల్‌ను విడుదల చేసింది. ఈ నేపథ్యంలో అంతరిక్షంలో స్పేస్ స్టేషన్ నిర్మించడం కోసం చైనా లాంగ్‌మార్చ్ 5బీ రాకెట్ తియాన్హే స్పేస్ మ్యాడుల్‌ను అంతరిక్షంలోని 300 కిలోమీటర్ల ఎత్తున కక్ష్యలోకి చేర్చింది. నియంత్రణ కోల్పోయిన ఈ రాకెట్ శకలాలు భూమి మీదకు దూసుకురానున్నాయి. చైనా 2022 నాటి కల్లా అంతరిక్షంలో సొంతంగా ఓ స్పేస్ స్టేషన్‌ను ఏర్పాటు చేసుకునేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో సుమారు ముగ్గురు వ్యోమగాములు ఉండేలా చైనా ప్లాన్ చేస్తోంది. తియాన్ గాంగ్ స్పేస్ స్టేషన్లో భాగంగా 30 మీటర్ల పొడవైన తొలి మ్యాడుల్ ‘టియాన్హె’ను చైనా లాంగ్ మార్చ్ రాకెటును ఉపయోగించి అంతరిక్షంలోనికి పంపింది. చదవండి: అంతరిక్షంపై డ్రాగన్ నజర్...! -
నింగికెగిసిన పీఎస్ఎల్వీ సీ-50 రాకెట్
సాక్షి, సూళ్లూరుపేట: శ్రీహరికోట సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి ఈ రోజు 3.41 గంటలకు పీఎస్ఎల్వీ సీ-50 ఉపగ్రహ వాహక నౌక నింగిలోకి దూసుకెళ్లింది.1410 కిలోల బరువుగల కమ్యూనికేషన్ శాటిలైట్లను నింగిలోకి మోసుకెళ్లింది. నాలుగు దశల రాకెట్ ప్రయాణాన్ని 20.11 సెకన్లలో ప్రయోగం ముగిసేటట్లుగా శాస్త్రవేత్తలు రూపకల్పన చేశారు. సీఎంఎస్-01 కమ్యూనికేషన్ శాటిలైట్‌ను నింగిలోకి ఇస్రో పంపింది. సీ-బ్యాండ్ సేవల విస్తరణకు సీఎంఎస్-01 దోహదపడనుంది. ఏడేళ్లపాటు సేవలందించనుంది. జిశాట్-12 స్థానాన్ని సీఎంఎస్-01 శాటిలైట్ భర్తీ చేయనుంది. సీఎంఎస్ -01 దేశానికి చెందిన 42వ కమ్యూనికేషన్ ఉపగ్రహం కాగా, పీఎస్ఎల్వీ సీ-50 ప్రయోగం మొదటి దశ విజయవంతం అయ్యింది. (చదవండి: ఏపీలో మరో జపాన్ ఇండస్ట్రియల్ టౌన్షిప్) ఇస్రో చైర్మన్ హర్షం.. పీఎస్ఎల్వీ సీ-50 రాకెట్ ప్రయోగం విజయవంతంపై ఇస్రో చైర్మన్ కే శివన్ హర్షం వ్యక్తం చేశారు. ఆయన ఈ సందర్భంగా ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. శాటిలైట్ అద్భుతంగా పని చేస్తోందని, నాలుగు రోజుల్లో నిర్ణీత స్లాట్‌లో ప్రవేశపెడతామని శివన్ పేర్కొన్నారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రతిష్టాత్మకంగా రూపొందించిన పీఎస్ఎల్వీ రాకెట్ విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్తోంది. రెండు టన్నులకు మించి బరువు కలిగిన అతి పెద్ద ఉపగ్రహాలను ఫ్రాన్స్, రష్యా అంతరిక్ష సంస్థల నుంచి ఇస్రో పంపిస్తోంది. అతి చిన్న విదేశీ ఉపగ్రహాలను పీఎస్ఎల్వీల ద్వారా ప్రయోగించి వాణిజ్యపరంగా ఇస్రోకు ఆదాయాన్ని తీసుకొచ్చేగనిగా మారింది. చంద్రయాన్, మంగళ్యాన్ లాంటి గ్రహాంతర ప్రయోగాలు, ఒకేసారి పది ఉపగ్రహాలు, 20 ఉపగ్రహాలు, ఆ తరువాత 104, మళ్లీ 38 ఉపగ్రహాలను సునాయాసంగా మోసుకెళ్లి అంతరిక్ష కక్ష్యలో ప్రవేశపెట్టగలిగిన ఘనత పీఎస్‌ఎలీ్వకే సొంతం. ఇప్పటి వరకు 51 పీఎస్ఎల్వీ రాకెట్లను ప్రయోగించగా అందులో రెండు మాత్రమే విఫలమయ్యాయి. గురువారం నాటి ప్రయోగంతో మరో కీలక ఘట్టానికి షార్ వేదికైంది. (చదవండి: దేశ చరిత్రలో ఇదే తొలిసారి: సీఎం జగన్) ♦పీఎస్ఎల్వీ రాకెట్‌ను ఇస్రో రెండు రకాలుగా ఉపయోగిస్తోంది. తక్కువ బరువు కలిగిన ఉపగ్రహాలను తీసుకెళ్లేటప్పుడు స్ట్రాఫాన్ బూస్టర్లు లేకుండా చేస్తారు. దీన్ని కోర్ అలోన్ ప్రయోగమని ఇస్రో పరిభాషలో అంటారు. ♦ఎక్కువ బరువు కలిగిన ఉపగ్రహాలను మోసుకెళ్లాలంటే అత్యంత శక్తివంతమైన స్ట్రాపాన్ బూస్టర్లతో చేస్తారు. ఈ తరహా ఎక్సెల్ స్ట్రాపాన్ బూస్టర్లతో ఇప్పటికి 21 ప్రయోగాలు చేశారు. ♦ఇటీవలి కాలంలో రెండు స్ట్రాపాన్ బూస్టర్లతో చేసే ప్రయోగాన్ని పీఎస్ఎల్వీ – క్యూఎల్, నాలుగు స్ట్రాపాన్ బూస్టర్లతో చేసే ప్రయోగాన్ని పీఎస్ఎల్వీ – డీఎల్ అనే పేర్లతో చేస్తున్నారు. ♦వీటి ద్వారా కమ్యూనికేషన్ ఉపగ్రహాలు, రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాలు (దూర పరిశీలన ఉపగ్రహాలు), చంద్రయాన్ ∙1, మంగళ్యాన్ – 1 లాంటి గ్రహాంతర ప్రయోగాలు, భారత క్షేత్రీయ దిక్సూచి వ్యవస్థ ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలోకి పంపించి దేశ ప్రజలకు అత్యంత సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడంలో పీఎస్ఎల్వీ అగ్రగామిగా ఉంది. ♦ఎక్కువ ఉపగ్రహాలను మోసుకెళ్లి సూర్యానువర్తన ధ్రువకక్ష్యలో వివిధ రకాల కక్ష్యల్లో ప్రవేశపెట్టగలిగే సామర్థ్యం కలిగి ఉండే రాకెట్ కూడా ఇదే కావడం గమనార్హం. ఓకే ఆర్బిట్.. ఎనిమిది రకాల కక్ష్యలు ఒకే ఆర్బిట్‌లో ఎనిమిది రకాల కక్ష్యలను గుర్తించి ఎక్కువ ఉపగ్రహాలను తీసుకెళ్లిన ఘనత పీఎస్‌ఎలీ్వదే. గతేడాది జనవరి 24న పీఎస్ఎల్వీ సీ – 44 రాకెట్లో నాలుగో దశను ప్రయోగాత్మకంగా చేసి రెండు రకాల కక్ష్యల్లో మూడు ఉపగ్రహాలను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఆ ప్రయోగమిచ్చిన విజయంతో ఏప్రిల్ 1న పీఎస్ఎల్వీ సీ – 45 ప్రయోగంలో నాలుగోదశ (పీఎస్ – 4) ద్వారా మూడు రకాల కక్ష్యల్లో 29 ఉపగ్రహాలను విడివిడిగా ప్రవేశపెట్టగలిగారు. ♦జనవరి 24న ప్రయోగించిన పీఎస్ఎల్వీ సీ – 44 ద్వారా పీఎస్ – 4 దశలో సూర్యానువర్తన ధ్రువకక్ష్యలోనే ఎనిమిది రకాల కక్ష్యలను గుర్తించింది. ♦భవిష్యత్తులో ఇంకా ఎక్కువ ఉపగ్రహాలను భూమికి 800 కిలోమీటర్ల ఎత్తు నుంచి 504 కిలోమీటర్లు తగ్గించుకుంటూ వస్తే 8 రకాల కక్ష్యల్లోకి ప్రవేశపెట్టే వీలుంటుందని గుర్తించింది పీఎస్ఎల్వీ రాకెట్టే కావడం గమనార్హం. పీఎస్ఎల్వీ సీ – 45లోని పీఎస్ – 4 దశ ముందుగా 753 కిలోమీటర్ల ఎత్తులోని సన్ సింక్రనస్ ఆర్బిట్‌లో ఈఎంఐ శాట్ అనే ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టాక పీఎస్ – 4 దశను మండించి మళ్లీ కిందికి తీసుకొచ్చి 508 కిలోమీటర్ల ఎత్తులో కొన్ని ఉపగ్రహాలు, 505 కిలోమీటర్ల ఎత్తులో మరికొన్ని ఉపగ్రహాలను ప్రవేశపెట్టి అంతరిక్ష ప్రయోగాల్లో చరిత్ర సృష్టించింది కూడా పీఎస్ఎల్వీ రాకెట్టే కావడం గమనార్హం. -
నేడు పీఎస్ఎల్వీ సీ50 ప్రయోగం
సూళ్లూరుపేట/తిరుమల/శ్రీకాళహస్తి: సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) రెండో ప్రయోగ వేదిక నుంచి గురువారం సాయంత్రం 3.41 గంటలకు ప్రయోగించనున్న పీఎస్ఎల్వీ సీ50 ఉపగ్రహ వాహక నౌకకు బుధవారం మధ్యాహ్నం 2.41 గంటలకు కౌంట్‌డౌన్‌ను లాంఛనంగా ప్రారంభించారు. మంగళవారం మధ్యాహ్నం మిషన్ సంసిద్ధతా సమావేశం నిర్వహించి ప్రయోగ పనులను లాంచ్ ఆథరైజేషన్ బోర్డుకు అప్పగించారు. ల్యాబ్ చైర్మన్ ఆర్ముగం రాజరాజన్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించి ప్రయోగానికి 25 గంటల కౌంట్‌డౌన్‌ను ప్రారంభించారు. ఈ ప్రయోగం ద్వారా 1,410 కిలోల బరువు గల సీఎంఎస్–01 (జీశాట్–12ఆర్) అనే కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని భూమికి దగ్గరగా 265 కి.మీ ఎత్తులో, భూమికి దూరంగా 35,975 కి.మీ ఎత్తులోని దీర్ఘ వృత్తాకార జియో ట్రాన్స్ఫర్ ఆర్బిట్‌లో ప్రవేశ పెట్టనున్నారు. ప్రయోగం విజయవంతం కావాలని.. పీఎస్ఎల్వీ–సీ50 ప్రయోగం విజయవంతం కావాలని ఇస్రో డిప్యూటీ సెక్రటరీ లక్ష్మణ్ బుధవారం తిరుమల,శ్రీకాళహస్తీశ్వరాలయంలో పూజలు నిర్వహించారు. పీఎస్ఎల్వీ–సీ50 నమూనాను శ్రీవారి పాదాల చెంత, శ్రీకాళహస్తి ఆలయంలోని స్వామి, అమ్మవార్ల సన్నిధిలో ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. నింగివైపు దూసుకెళ్లేందుకు సిద్ధంగా ఉన్న పీఎస్ఎల్వీ సీ50 ఉపగ్రహ వాహక నౌక -
రాకెట్ రెడీ: పీఎస్ఎల్వీ సీ50
సాక్షి, సూళ్లూరుపేట: షార్‌లోని రెండో ప్రయోగవేదిక నుంచి ఈనెల 17న సాయంత్రం 3.41 గంటలకు పీఎస్ఎల్వీ సీ50 ఉపగ్రహ వాహకనౌకను ప్రయోగించేందుకు ఇస్రో ఏర్పాట్లు చేస్తోంది. 1,410 కేజీల బరువు కలిగిన సీఎంఎస్–01 (జీశాట్–12ఆర్) అనే సరికొత్త కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని రోదసీలోకి పంపనున్నారు. వెహికల్ అసెంబ్లింగ్ బిల్డింగ్‌లో (వ్యాబ్)లో రాకెట్ అనుసంధానం చేసిన దృశ్యాలను ఇస్రో శుక్రవారం విడుదల చేసింది. చదవండి: గగనం.. దూరం -
మానవ అంతరిక్ష పరిశోధనలో కొత్త శకం
వాషింగ్టన్ : ‘స్పేస్ ఎక్స్’ అంతరిక్ష సంస్థ మరోసారి మానవసహిత రాకేట్‌ను దిగ్విజయంగా అంతరిక్షంలోకి ప్రయోగించింది. స్పేస్ ఎక్స్‌కు చెందిన క్రూ డ్రాగన్ ఆదివారం ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌కు ప్రయాణమైంది. స్పేస్ ఎక్స్, నాసాలు సంయుక్తంగా చేపట్టిన తొలి మానవసహిత ఆపరేషనల్ మిషన్ ఇదే. అమెరికాకు చెందిన వ్యోమగాములు మైకెల్ హాప్కిన్స్, విక్టర్ గ్లోవర్, శనాన్ వాకర్, జపాన్‌కు చెందిన సోచి నగూచీలు ఈ మిషన్‌లో భాగమయ్యారు. ఆదివారం రాత్రి 7:27 గంటల ప్రాంతంలో ఫ్లోరిడాలోని కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి రాకేట్ ఐఎస్ఎస్కి బయలుదేరింది. అమెరికా నూతన అధ్యక్షుడు జోబైడెన్ ఈ ప్రయోగాన్ని కొనియాడారు. ( త్వరలో ఫైజర్ కరోనా టీకా సరఫరా ) సోమవారం ట్విటర్ వేదికగా ఆయన స్పందిస్తూ.. ‘‘ మన తెలివి, సంకల్ప బలం ద్వారా సాధించిన విజ్ఞాన శక్తికి ఇది నిదర్శనం.. ఎంతో గొప్పది’’ అని పేర్కొన్నారు. అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ కూడా దీనిపై స్పందించారు ‘‘అమెరికా మానవ అంతరిక్ష పరిశోధనలో కొత్త శకం’’ అని అన్నారు. కాగా, గత మే నెలలో స్పేస్ ఎక్స్‌కు చెందిన ఓ రాకేట్ ఇద్దరు వ్యోమగాములతో నింగిలోకి దూసుకెళ్లింది. ఎలాంటి నష్టం లేకుండా ఆగస్టు నెలలో క్షేమంగా భూమిపైకి చేరింది. -
అంగారకుడిపైకి చైనా!
బీజింగ్: అరుణ గ్రహంపైకి ఓ శోధక నౌకను ప్రయోగించడంలో చైనా గురువారం విజయవంతమైంది. అంగారకుడి చుట్టూ చక్కర్లు కొట్టడంతోపాటు ఆ గ్రహంపై దిగడం తిరగడం ఈ శోధక నౌక ప్రయోగ లక్ష్యం. లాంగ్‌మార్చ్–5 రాకెట్ ద్వారా వెన్‌ఛాంగ్ అంతరిక్ష ప్రయోగశాల నుంచి గురువారం నింగికి ఎగసిన ఐదు టన్నుల శోధక నౌక అంగారకుడివైపు తన ప్రయాణాన్ని ప్రారంభించింది. ప్రయోగం జరిగిన 36 నిమిషాలకు ఆర్బిటర్, ల్యాండర్, రోవర్లతో కూడిన అంతరిక్ష నౌక భూ– అంగారక మార్పిడి కక్ష్యలోకి ప్రవేశించిందని, ఏడు నెలల సుదీర్ఘ ప్రయాణం తరువాత అంగారక గ్రహాన్ని చేరుకుంటుందని చైనా జాతీయ అంతరిక్ష పరిశోధన కేంద్రం తెలిపింది. తియాన్‌విన్–1 పేరున్న ఈ శోధక నౌక అరుణగ్రహంపై దిగిన తరువాత అక్కడి మట్టిని, గ్రహ అంతర్భాగపు నిర్మాణం, వాతావరణం, నీరు వంటి వేర్వేరు అంశాలపై ప్రయోగాలు జరపనుంది. అంగారక గ్రహ కక్ష్యలోకి చేరిన తరువాత శోధక నౌకలోని ఆర్బిటర్, ల్యాండర్, రోవర్లు విడిపోతాయని, ఆర్బిటర్ కక్ష్యలోనే ఉంటూ ప్రయోగాలు నిర్వహిస్తుందని చైనా ఏరోస్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ కార్పొరేషన్ తెలిపింది. ల్యాండర్/రోవర్లు తమంతట తాముగా అంగారక గ్రహంపై ల్యాండ్ అవుతాయని తెలిపింది. ఆరు చక్రాలున్న రోవర్ సుమారు 200 కిలోల బరువు ఉంటుంది. మూడు నెలలపాటు అక్కడే తిరుగుతూ ప్రయోగాలు చేయనుంది. -
షిప్ నుంచి రాకెట్ ప్రయోగించిన చైనా
బీజింగ్ : అంతరిక్ష రంగంలో తనదైన ముద్ర వేయాలని భావిస్తున్న ఆ దిశలో తీవ్రమైన కసరత్తు చేస్తోంది. అందులో భాగంగా సముద్రంలోని షిప్‌పై నుంచి రాకెట్ ప్రయోగాన్ని చైనా విజయవంతంగా పూర్తి చేసింది. ఈ విషయాన్ని అక్కడి మీడియా బుధవారం వెల్లడించింది. ఈ విధంగా రాకెట్‌ను ప్రయోగించడం చైనాకు ఇదే తొలిసారి. ఎల్లో సముద్రం నుంచి ప్రయోగించిన లాంగ్ మార్చ్ 11 రాకెట్ 7 ఉప్రగ్రహాలను నింగిలోకి తీసుకెళ్లింది. వాటిలో ఒక శాటిలైట్ తుపాన్ల పరిశీలనకు సంబంధించింది. మరో రెండు కమ్యూనికేషన్ శాటిలైట్లు బీజింగ్‌లోని ఓ టెక్నాలజీ కంపెనీకి చెందినవి. ఇటీవలి కాలంలో అంతరిక్ష పరిశోధనలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్న చైనా.. అందుకోసం భారీగా నిధులను కూడా ఖర్చు చేస్తుంది. అంతేకాకుండా 2030 నాటికి అంతరిక్షరంగంలో అమెరికాను అందుకోవాలని భావిస్తోంది. -
అంతరిక్షానికి నిచ్చెన వేద్దాం..
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రతిష్టాత్మక ప్రాజెక్టు గగన్‌యాన్‌కు రంగం సిద్ధమవుతోంది. రూ.10 వేల కోట్ల ఖర్చుతో వ్యోమగాములు వారం రోజుల పాటు అంతరిక్షంలో ఉండేందుకు ఉద్దేశించిన ఈ భారీ ప్రయోగానికి అవసరమైన అన్ని సాంకేతికతలు, వసతులను ఇస్రో ఒక్కొక్కటిగా సిద్ధం చేసుకుంటోంది. డిజైన్ రూపకల్పన, పారాచూట్స్, స్పేస్ సూట్ల తయారీకి సంబంధించి ఇస్రో చేస్తున్న ప్రయత్నాలు క్లుప్తంగా.. ముందుగా రోబోలు గగన్‌యాన్ ప్రాజెక్టులో భాగంగా ముందుగా రోబోలతో కొన్ని ప్రయోగాలు నిర్వహించాలని ఇస్రో ప్రణాళిక సిద్ధం చేసింది. 2022లో మనుషులను అంతరిక్షంలోకి పంపేందుకు ముందుగా మనుషులను పోలిన రోబోల (హ్యుమనాయిడ్స్)తో ప్రయోగాలు నిర్వహిస్తామని ఇస్రో చైర్మన్ కె.శివన్ అంటున్నారు. హ్యూమనాయిడ్ రోబో సిద్ధమైపోయిందని వివరించారు. మానవులను అంతరిక్షంలోకి పంపే సత్తా భారత్‌కు ఉందని నిరూపించడంతో పాటు సురక్షితంగా వెనక్కి తీసుకురావడం కూడా సాధ్యమని చాటి చెప్పాలన్నది తమ లక్ష్యమంటున్నారు. ‘ఇస్రో సిద్ధం చేసిన హ్యూమనాయిడ్ రోబో మనిషి చేయగల అన్ని పనులు చేయగలదు. గగన్‌యాన్ సన్నాహక ప్రయోగాల్లో భాగంగా చేసే తొలి ప్రయోగం లోనే దీన్ని వాడతాం. బయో ఫిల్టర్లు, సెన్సర్లు, బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణకు సంబంధించిన ప్రయోగాలు చేపడతాం’అని చెప్పారు. దేశంలోని పరిశోధన సంస్థలు కూడా తమ ప్రతిపాదనలు ముందుకు తెచ్చాయని నిపుణుల కమిటీ వాటిని విశ్లేషించి కొన్నింటినీ చేపట్టే అవకాశం ఉందని అంచనా. గగన్‌యాన్ డిజైన్‌కు సంబంధించిన పనులు వచ్చే వారానికల్లా పూర్తవుతాయని శివన్ తెలిపారు. ఇందుకోసం ఇప్పటికే 11 కమిటీలను ఏర్పాటు చేశామని ఇవి ఒక్కో ఉపవ్యవస్థ డిజైన్‌ను పరిశీలించి ఓకే చేస్తుందన్నారు. డిజైన్ ఖరారు తర్వాత అవసరమైన సామగ్రిని సమకూర్చుకోవడం మొదలవుతుందని, పరిశోధన శాలలో నమూనా వ్యవస్థలను తయారు చేస్తామని చెప్పారు. త్వరలో ‘మాడ్యూల్స్’డిజైన్లు ఖరారు గగన్‌యాన్‌కు అవసరమైన క్రూ మాడ్యూల్ (వ్యోమగాములు ఉండే గది), క్రూ సర్వీస్ మాడ్యూల్ డిజైన్ల కరారు ప్రక్రియ తుదిదశకు చేరుకుందని, త్వరలో డిజైన్లు ఖరారు చేస్తామని శివన్ చెప్పారు. హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ పేరుతో కొత్తగా ఓ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని, గగన్‌యాన్‌కు సంబంధించిన పనులన్నీ అక్కడే జరుగుతున్నాయని తెలిపారు. క్రూ మాడ్యూల్, క్రూ సర్వీస్ మాడ్యూళ్లను ఇప్పుడే మొదటిసారిగా రూపొందించట్లేదని, వీటికి అవసరమైన మౌలికవసతులు ఇప్పటికే తమకు ఉన్నాయని చెప్పారు. ఇస్రో కొన్ని సంవత్సరాల కిందటే క్రూ మాడ్యూల్‌ను ప్రయోగాత్మకంగా అంతరిక్షంలోకి పంపి మళ్లీ వెనక్కి తీసుకొచ్చింది. గతేడాది క్రూ ఎస్కేప్ సిస్టం (రాకెట్లో వెళ్తుండగా ఏదైనా ప్రమాదం జరిగితే వ్యోమగాములు తప్పించుకునే వ్యవస్థ)ను కూడా పరీక్షించింది. 259 సెకన్ల పాటు జరిగిన ఈ ప్రయోగంలో క్రూ ఎస్కేప్ వ్యవస్థ, క్రూ మాడ్యూల్ సహా రాకెట్ నుంచి విడిపోయింది. అది బంగాళాఖాతంపై ఉండగా, దానికి అమర్చిన పారాచూట్లు విచ్చుకున్నాయి. వాటి సహాయంతో శ్రీహరికోటకు 2.9 కిలోమీటర్ల దూరంలో సముద్రంపై దిగింది. అక్కడ నుంచి దాన్ని భూమి మీదకు తెచ్చారు. క్రూ మాడ్యూల్‌కు అమర్చిన ప్రత్యేకంగా రూపొందించిన 7 మోటార్లు క్రూ మాడ్యూల్‌ను అతివేగంతో రాకెట్ నుంచి ప్రమాదం జరగనంత దూరానికి తీసుకెళ్లాయి. 2022లో మానవులను పంపిస్తామని చెప్పారు. వడోదరా స్పేస్ సూట్ అంతరిక్ష యాత్రలో వ్యోమగాములు ధరించే స్పేస్ సూట్‌కు ఎన్నో ప్రత్యేకతలున్నాయి. మేకిన్ ఇండియా ప్రాజెక్టులో భాగంగా దీన్ని గుజరాత్‌లోని వడోదరాలో రూపొందించారు. విదేశాలు రూపొందిస్తున్న స్పేస్ సూట్లతో పోలిస్తే ఇది 20% తక్కువ బరువుంటుంది. ఇతర దేశాలు స్పేస్ సూట్ తయారీకి చేసిన వ్యయం కంటే వందో వంతు తక్కువ ఖర్చుతో రూపొందించారు. 4 పొరల ఈ స్పేస్‌సూట్‌ను ప్రత్యేకమైన పోగులతో అత్యాధునిక టెక్నాలజీతో తయారు చేశారు. అంతరిక్షంలో ఉండే అధిక పీడన పరిస్థితులను తట్టుకునేలా రూపొందింది. శరీర ఉష్ణోగ్రతల్ని కొలిచే బయో సెన్సర్లు, అత్యవసర పరిస్థితుల్లో వినియోగించుకోవడానికి ఆక్సిజన్ సిలిండర్లు, చేతులకు వేసుకోవడానికి మృదువైన తొడుగులు, తేలిగ్గా ఉండే షూస్ అన్నీ ఇందులోనే ఉంటాయి. వీటిని పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతోనే రూపొందించారు. ఈ స్పేస్ సూట్ మైనస్ 40 డిగ్రీల అతిశీతల పరిస్థితుల నుంచి 80 డిగ్రీల సెల్సియస్ వేడి వరకు ఉష్ణోగ్రతలను తట్టుకునేలా రూపకల్పన చేశారు. ఆగ్రా పారాచూట్... అంతరిక్షంలో వారం రోజులు గడిపి తిరిగి పయనమయ్యే ముగ్గురు భారతీయ వ్యోమగాములు భూమికి చేరుకునేటప్పుడు అవసరమయ్యే పారాచూట్లను ఆగ్రాలో తయారు చేశారు. డీఆర్డీవోకి చెందిన ఏరియల్ డెలివరీ రీసెర్చ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ వీటిని రూపొందించింది. తిరుగుప్రయాణంలో భూమికి 120 కి.మీ. ఎత్తులో క్రూ మాడ్యూల్, సర్వీసు మాడ్యూల్ వేరవుతాయి. అప్పట్నుంచి వ్యోమగాములు భూమి మీదకి చేరుకోవడానికి 36 నిమిషాలు పడుతుంది. గుజరాత్లో అరేబియా సముద్ర తీర ప్రాంతంలో క్రూ మాడ్యూల్ దిగడానికి ముందు ఈ పారాచూట్లు తెరుచుకుంటాయి. పారాచూట్లు క్రూ మాడ్యూల్ వేగాన్ని సెకనుకు 216 మీటర్ల నుంచి 11 మీటర్లకి తగ్గిస్తాయి. చాలా గొప్ప విషయం... భారత్ అంతరిక్షానికి మనుషుల్ని పంపడానికి సిద్ధమవడం చాలా గొప్ప విషయం. రెక్కలు కట్టుకొని అంతరిక్షంలోకి వాలితే మనుషుల ఆలోచనల్లోనూ మార్పులు వస్తాయి. గగన్‌యాన్‌తో భారత్ తన సాంకేతిక సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటి చెబుతుంది. ప్రపంచంలోనే శక్తిమంతమైన దేశంగా నిలుస్తుంది. ఈ కార్యక్రమంతో అంతరిక్ష రంగంలో విద్యార్థులకు ఆసక్తి పెరిగి స్టెమ్ (సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్) కోర్సులకు డిమాండ్ పెరుగుతుంది. ఇదంతా దేశ ఆర్థిక పురోగతికి దోహదపడుతుంది. జెర్రీ రోజ్, నాసాకు చెందిన మాజీ వ్యోమగామి, ఏడుసార్లు అంతరిక్షానికి వెళ్లి రికార్డు సృష్టించిన వ్యోమగామి – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
భూమి బరువు తగ్గుతోంది..
వాషింగ్టన్: భూమి రోజురోజుకూ తనపై ఉన్న వాయువులను కోల్పోతున్న అంశంపై అధ్యయనం చేసేందుకు నాసా సౌండింగ్ రాకెట్ ప్రయోగాన్ని చేపట్టనుంది. విజన్స్(విజువలైజింగ్ అయాన్ ఔట్‌ఫ్లో వయా న్యూట్రల్ ఆటమ్ సెన్సింగ్)–2 అనే రాకెట్‌ను పంపేందుకు సన్నాహాలు చేస్తోంది. నార్వే నుంచి ఈ ప్రయోగాన్ని చేపట్టనుంది. దీని ద్వారా భూమి తన వాతావరణంలోని ఆక్సిజన్‌ను అంతరిక్షంలోకి కోల్పోతున్న అంశాన్ని అధ్యయనం చేయనుంది. ‘భూమి రోజూ బరువును కోల్పోతుంది. వంద నుంచి కొన్ని వందల టన్నుల మేర వాతావరణంలోని వాయువులను భూమి అంతరిక్షంలోకి కోల్పోతున్నట్లు రుజువయింది. ఇదే వేగంతో భూమి తన వాయువులను తిరిగి నింపుకోవటానికి బిలియన్ లేదా అంతకంటే ఎక్కువ ఏళ్లు పడుతంది’అని నాసా శాస్త్రవేత్త థామస్ మూరే వెల్లడించారు. హైడ్రోజన్ కంటే 16 రెట్లు బరువైన ఆక్సిజన్ భూ గురుత్వాకర్షణ వలయాన్ని తప్పించుకుని వెళ్లలేదని శాస్త్రవేత్తలు భావించేవాళ్లు. అయితే ప్రస్తుతం భూమి చుట్టుపక్కల ఉన్న అంతరిక్ష ఆవరణం ఎక్కువ శాతం భూమి మీద ఉద్భవించిన వాయువులతోనే నిండి ఉండటం కలవరపరిచే అంశం. సౌండింగ్ రాకెట్ అంటే.. సౌండింగ్ రాకెట్ అంటే నాటికల్ అర్థం ప్రకారం కొలతలు తీసుకునేది. ఈ రాకెట్ రాకెట్ నింగిలోకి ఎగిసిన తర్వాత మొదటి మోటార్ భాగంలోని ఇంధనంతో పైకి వెళ్తుంది. అనంతరం పేలోడ్‌ను వదిలేసి రాకెట్ భూమి మీదకి వచ్చేస్తుంది. పేలోడ్ మాత్రం అంతరిక్షంలోకి వెళ్తూ అధ్యయనాన్ని పూర్తి చేస్తుంది. గ్రాండ్ చాలెంజ్‌లో భాగంగా రానున్న 14 నెలల్లో పంపనున్న 9 సౌండింగ్ రాకెట్లలో మొదటి రాకెట్ విజన్స్–2 కావడం గమనార్హం. -
ఇస్రోకు మరో ‘పీఎస్ఎల్వీ’ విజయం
శ్రీహరికోట(సూళ్లూరుపేట): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) తన గెలుపుగుర్రం పీఎస్ఎల్వీతో మరో అద్భుత విజయాన్ని నమోదు చేసింది. పీఎస్ఎల్వీ–సీ43 రాకెట్ ద్వారా హైసిస్ (హైపర్ స్పెక్ట్రల్ ఇమేజింగ్ శాటిలైట్) అనే అత్యాధునిక భూ పర్యవేక్షక ఉపగ్రహంతోపాటు ఎనిమిది దేశాలకు చెందిన మరో 30 ఉపగ్రహాలను కూడా విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. 28 గంటల కౌంట్‌డౌన్ తర్వాత గురువారం ఉదయం 9.57 గంటలకు పీఎస్ఎల్వీ సీ–43 రాకెట్ నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ అంతరిక్ష కేంద్రం నుంచి నిప్పులు చిమ్ముతూ, మేఘాలను చీల్చుతూ నింగికి దూసుకెళ్లింది. సరిగ్గా 17 నిమిషాల 27 సెకన్లలో హైసిస్‌ను భూమికి 636.3 కిలోమీటర్ల దూరంలోని నిర్దేశిత సూర్యానువర్తన ధృవ కక్ష్యలో ప్రవేశపెట్టింది. అనంతరం మరో గంటలో మిగిలిన 30 ఉపగ్రహాలను ఒక్కొక్కటిగా వివిధ కక్ష్యల్లోకి చేర్చింది. ఇస్రో చరిత్రలో అత్యంత సుదీర్ఘ సమయం సాగిన ప్రయోగం ఇదే. ఇస్రో అభివృద్ధి చేసిన హైసిస్ ఉపగ్రహంతో ప్రయోజనాలు చేకూరనున్నాయి. ఐదేళ్లపాటు ఈ ఉపగ్రహం వ్యవసాయం, అడవులు, భూ సర్వే, భూగర్భ శాస్త్రం, తీర ప్రాంతాలు, దేశీయ జల మార్గాలు, పర్యావరణ పర్యవేక్షణ, పరిశ్రమల నుంచి వెలువడే కాలుష్యం గుర్తింపు తదితర రంగాల్లో హైసిస్ సేవలనందించనుంది. వైఎస్ జగన్ అభినందనలు పీఎస్ఎల్వీ–సీ 43 ప్రయోగం విజయవంతం అయినందుకు ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించారు. భవిష్యత్తులో వారికి అన్నీ విజయాలే చేకూరాలనీ, అంతరిక్షరంగంలో భారతదేశం వెలిగి పోవాలని ఆయన ఆకాంక్షించారు. 15 రోజుల్లోనే మరో అద్భుత విజయం: శివన్ ఇటీవలే భారీ రాకెట్ జీఎస్ఎల్వీ–మార్క్3–డీ2 ద్వారా జీశాట్ 29 ఉపగ్రహాన్ని ఇస్రో ప్రయోగించింది. ఆ తర్వాత 15 రోజుల్లోనే ప్రయోగించిన పీఎస్ఎల్వీ–సీ43 రాకెట్ విజయవంతంగా ఉపగ్రహాలను కక్ష్యల్లోకి ప్రవేశపెట్టడం అద్భుతమని ఇస్రో చైర్మన్ శివన్ అన్నారు. వచ్చే నెల 5వ తేదీనే ఇస్రో మరో ప్రయోగం చేపడుతోంది. ఫ్రెంచ్ గయానా నుంచి జీశాట్ 11 ఉపగ్రహాన్ని నింగిలోకి పంపనుంది. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న జీశాట్–7ఏ ఉపగ్రహాన్ని కూడా డిసెంబర్లోనే ప్రయోగించే అవకాశం ఉంది. చంద్రయాన్– ఐఐ సహా వచ్చే ఏడాది తామెన్నో ప్రయోగాలను చేయనున్నామన్నారు. గగన్‌యాన్ ప్రాజెక్టును వీలైనంత ఎక్కువ స్వదేశీ పరిజ్ఞానంతో చేపడతామని ఆయన చెప్పారు. గగన్‌యాన్ కింద 2020 డిసెంబర్ నాటికి మానవ రహిత, 2022 నాటికి మానవసహిత ప్రయోగాలను చేపట్టనున్నామని శివన్ వెల్లడించారు. -
చీకట్లను చీల్చుకుంటూ....
దేశమంతా చీకట్లు కమ్ముకుంటున్న వేళ, నా సమయమైందే అని చంద్రుడు ఎదురొస్తున్న వేళ బంగారు వర్ణపు నిప్పులు కక్కుతూ జీఎస్ఎల్వీ–మార్క్3–డీ2 రాకెట్ నింగిలోకి దూసుకెళ్తున్న వేళ తీసిన అపురూప సుందర చిత్రాన్ని ఇస్రో విడుదల చేసింది. చంద్రుడికి అభిముఖంగా జీఎస్ఎల్వీ దూసుపోతున్న ఫొటోను చూసి కుంచెపై గీచిన చిత్రంలా అందంగా ఉందంటూ నెటిజన్లంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సాక్షి, హైదరాబాద్: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) బాహుబలిగా పేరుగాంచిన జీఎస్ఎల్వీ–మార్క్3–డీ2 రాకెట్ ద్వారా జీశాట్–29 ఉపగ్రహ ప్రయోగం విజయవంతమైంది. బుధవారం సాయంత్రం నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రంలోని రెండో ప్రయోగ వేదిక నుంచి జీఎస్ఎల్వీ–మార్క్3–డీ2 నింగిలోకి దూసుకెళ్లింది. ఇస్రోకు ఇది 67వ అంతరిక్ష ప్రయోగం. సమాచార ఉపగ్రహమైన జీశాట్–29లో కేఏ, కేయూ బ్యాండ్ ట్రాన్స్పాండర్లను అమర్చారు. ఈశాన్య రాష్ట్రాలతోపాటు జమ్మూ కశ్మీర్ ప్రజల ఇంటర్నెట్ కనెక్టివిటీ తదితర అవసరాల కోసం ఈ ఉపగ్రహాన్ని ప్రయోగించారు. ఈ రాకెట్ 43.43 మీటర్ల పొడవుతో 640 టన్నుల బరువుంటుంది. జీఎస్ఎల్వీ–మార్క్3–డీ2 రాకెట్ ప్రయోగానికి ముందు తిరుమల శ్రీవారి ఆలయంలో రాకెట్ నమూనాను స్వామివారి పాదాల చెంత ఉంచి శివన్ ప్రత్యేక పూజలు నిర్వహించిన సంగతి తెలిసిందే. -
సూపర్ సిక్సర్
డిజిటల్ ఇండియాదే! ఇస్రో సూపర్ సిక్సర్ కొట్టింది. రెండు దశాబ్దాలుగా అవిరళ కృషితో ఐదు జీఎస్ఎల్వీలను విజయవంతంగా నింగిలోకి పంపిన శాస్త్రవేత్తలు విజయగర్వంతో ఆరో ప్రయోగాన్ని సఫలీకృతం చేశారు. భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి చేపట్టిన జీఎస్ఎల్వీ మార్క్3 డీ2 ప్రయోగం విజయవంతం కావడంతో డిజిటల్ ఇండియా ఆవిష్కృతానికి కీలక అడుగు వేసినట్టయింది. అత్యాధునిక సాంకేతిక సేవలు అందుబాటులోకి రానున్నాయి. భారత సైనిక అవసరాలకు కూడా దోహదపడుతుంది. ఈశాన్య రాష్ట్రాలతో పాటు జమ్మూ అండ్ కశ్మీర్ ప్రాంతంలోని మారుమూల గ్రామాలకు కూడా ఇంటర్నెట్ కనెక్టివిటీని అనుసంధానం చేస్తుంది. ఈ ఉపగ్రహం 10 ఏళ్ల పాటు సేవలు అందిస్తుంది. జయహో ఇస్రో. నెల్లూరు ,సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చిన్న రాకెట్ల ద్వారా అత్యంత తక్కువ బరువు కలిగిన ఉపగ్రహాల నుంచి పెద్ద ఉపగ్రహాలను అంతరిక్ష కక్ష్యలో ప్రవేశ పెట్టి దేశ ప్రజలకు అత్యంత అధునాతనమైన సాంకేతిక పరిజ్ఞానం అందించే దిశగా నిరంతరాయంగా కృషి చేస్తోంది. జీఎస్ఎల్వీ రాకెట్‌కు సంబం«ధించి మూడో దశలో ఉపయోగించే క్రయోజనిక్ దశను దేశీయ పరిజ్ఞానంతో పూర్తిస్థాయిలో రూపొందించే ప్రక్రియలో భాగంగా సాంకేతికపరమైన ఇబ్బందులన్నీ ఎదుర్కొని పరిపక్వతను సాధించారు. మామూలు జీఎస్ఎల్వీ రాకెట్‌లోని మూడో దశలో ఉపయోగించే క్రయోజనిక్ దశలో 12.5 టన్నుల ఇంధనాన్ని ఉపయోగిస్తారు. అదే జీఎస్ఎల్వీ మార్క్–3 తరహా రాకెట్లో 25 టన్నుల క్రయో ఇంధనం అవసరమవుతుంది. దీన్ని రూపొందించేందుకు కొంత కాలం సమయం తీసుకుంది. వరుసగా ఐదు జీఎస్ఎల్వీ రాకెట్లు విజయవంతం చేయడంతో పాటు బుధవారం నాటి జీఎస్ఎల్వీ మార్క్–3డీ2 ప్రయోగంలో సీ–25 అద్భుతంగా పని చేయడంతో క్రయోజనిక్ టెక్నాలజీలో పరిపక్వతను సాధించారు. సౌండింగ్ రాకెట్ల స్థాయి నుంచి ఎస్ఎల్వీ, ఏఎస్ఎల్వీ, పీఎస్ఎల్వీ, జీఎస్ఎల్వీ, జీఎస్ఎల్వీ మార్క్–3 రాకెట్ల స్థాయికి ఎదిగి, 40 కిలోల ఉపగ్రహం నుంచి అంచెలంచెలుగా 3,500 కిలోల బరువు కలిగిన భారీ ఉపగ్రహం జీశాట్–29 ప్రయోగించి విజయం సాధించడంతో అగ్రదేశాలతో సమాన స్థాయిలో నిలిచింది. సమాచారం రంగంలో ఎప్పటికప్పుడు వస్తున్న విప్లవాత్మకమైన మార్పులను దేశవాళికి అందించేందుకు అత్యంత బరువైన సమాచార ఉపగ్రహలను పంపేందుకు ఈ ప్రయోగం ఎంతో దోహదపడుతోంది. ఇందులో భాగంగా 2 వేల నుంచి 5 వేల కిలోల బరువు కలిగిన సమాచార ఉపగ్రహాలను ఫ్రెంచి అంతరిక్ష పరిశోధనా సంస్థతో ఉన్న ఒప్పందం ప్రకారం అక్కడి నుంచి వాళ్ల రాకెట్ల ద్వారా కక్ష్యలోకి పంపిస్తూ వచ్చారు. ఇక నుంచి ఐదు టన్నుల బరువైన ఉపగ్రహాలను కూడా ఇక్కడి నుంచే పంపించే వెసులు బాటు కలిగింది. జీఎస్ఎల్వీ ప్రయోగాలకు అప్పర్ స్టేజీలో రష్యా దేశం సహకారంతో క్రయోజనిక్ ఇంజిన్లు ఉపయోగించి ఆరు ప్రయోగాలు చేశారు. జీఎస్ఎల్వీ డీ2 పేరుతో 2001 ఏప్రిల్ 18న మొట్ట మొదటి ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. ఇందులో 2 వేల కిలోల బరువు కలిగిన జీశాట్–01 సమాచారం ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపారు. ఆరు ప్రయోగాలకు రష్యా దేశపు క్రయోజనిక్ ఇంజిన్లను వాడుకున్నారు. ఒక్క ప్రయోగానికి మాత్రం ఇస్రో శాస్త్రవేత్తలు సొంతంగా తయారు చేసిన క్రయోదశను ఉపయోగించగా దురదృష్టవశాత్తూ ఆ ప్రయోగం విఫలమైంది. 2010 ఏప్రిల్ 15న జీఎస్ఎల్వీ డీ3 ప్రయోగంలో పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన క్రయోజనిక్ ఇంజిన్లుతో చేసిన ప్రయోగం ఘోర పరాజయం పాలైంది. మళ్లీ అదే ఏడాది డిసెంబర్ 25న రష్యా సాంకేతిక సహకారంతో కొనుగోలు చేసిన క్రయోజనిక్ ఇంజిన్‌తో చేసిన ప్రయోగం కూడా ఘోర పరాజయం పాలైంది. దీంతో రెండేళ్లు జీఎస్ఎల్వీ ప్రయోగాల జోలికే పోలేదు. 2001 నుంచి 2010 వరకు చేసిన ఏడు ప్రయోగాల్లో నాలుగు ప్రయోగాలు విజయవంతం కాగా మూడు ప్రయోగాలు అపజయం పాలయ్యాయి. ఈ ఇంజిన్‌లో ఉపయోగించే లిక్విడ్ ఆక్సిజన్, లిక్విడ్ హైడ్రోజన్ ఇంధనం మైనస్ 220, 270 డిగ్రీల అతి శీతలమైన వాతావరణంలో తయారు చేయాల్సి ఉండడంతో ఇందులో బాలారిష్టాలను దాటేందుకు మన శాస్త్రవేత్తలు అవిరళ కృషి చేశారు. పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన క్రయోజనిక్ ఇంజిన్లతో చేసిన ఐదు ప్రయోగాలు వరుసగా విజయాలనే నమోదు చేసుకున్నాయి. బుధవారం చేసిన జీఎస్ఎల్వీ మార్క్–3డీ2 ప్రయోగం కూడా విజయవంతం కావడంతో ఇస్రో తిరుగులేని శక్తిగా మారింది. జీఎస్ఎల్వీ మార్క్–3డీ1, డీ2 రాకెట్లు వరుసగా పూర్తి స్థాయిలో విజయం సాధించడం, ఎస్–200, ఎల్–110, సీ–25 దశలన్నీ అద్భుతంగా పనిచేయడంతో తిరుగులేని విజయాన్ని నమోదు చేసుకుని అంతరిక్ష విజయాల వినువీధిలో విజయకేతనం ఎగుర వేశారు. ఇక నుంచి అత్యంత బరువైన సమాచార ఉపగ్రహాలను ఇతర దేశాల మీద ఆధార పడకుం డా మనమే పంపించడమే కాకుండా మానవ సహితయాత్ర చేసే అంతరిక్ష దేశంగాభారత్ ఆవిర్భవించనుందని చెప్పడంలో అతిశయోక్తి కాదు. సూళ్లూరుపేట: భారత అంతరిక పరిశోధనా సంస్థ (ఇస్రో) ప్రస్థానంలో బుధవారం సాయంత్రం 5,08 గంటలకు నిర్వహించిన జీఎస్ఎల్వీ మార్క్3డీ2 ప్రయోగం చరిత్రాత్మకమైనదని ఇస్రో శాస్త్రవేత్తలు అన్నారు. ఈ ప్రయోగంలో ఎంతో మంది శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు, ఉద్యోగులు పాత్ర ఉన్నప్పటికీ ముఖ్యంగా కొద్దిమంది శాస్త్రవేత్తల ఆధ్వర్యంలో ప్రయోగం జరిగింది. ఇస్రో చరిత్రలో రెండో సారి అతి భారీ ప్రయోగాన్ని నిర్వహించి గ ‘ఘన’ విజయం సాధించిన సందర్భంగా ఇస్రో శాస్త్రవేత్తలు ఎవరేమన్నారంటే.. ఇస్రోకు చరిత్రాత్మకమైన విజయం ఇస్రో చరిత్రలో ఈ ప్రయోగం ఒక సువర్ణాధ్యాయంగా నిలిచిపోతుంది. ఇస్రో చరిత్రలో అతి పెద్ద ప్రయోగాన్ని చేపట్టి తొలిప్రయత్నంలోనే రెండు భారీ విజయాలను సాధించినందుకు ఇస్రో టీంకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు. జీఎస్ఎల్వీ మార్క్3డీ2 విజయంలో ప్రముఖపాత్ర పోషించిన క్రయోజనిక్ దశ అత్యంత అద్భుతంగా పనిచేయడంతో పాటు ఎస్–200 స్ట్రాపాన్ బూస్టర్లు, ఎల్–110 ద్రవ ఇంధనం దశలు అత్యంత సమర్థవంతంగా పనిచేయడంతో మార్వ్‌లెస్ ప్రయోగంగా అభివర్ణించారు. ఈ విజయం ఇస్రోలో పనిచేస్తున్న అందరికి దక్కుంతుంది. – డాక్టర్ కైలాసవాడివో శివన్, ఇస్రో చైర్మన్ ఇస్రో చరిత్రలో ఇదొక సువర్ణాధ్యాయం ఇస్రో చరిత్రలో బుధవారం నిర్వహించిన జీశాట్–29 ఉపగ్రహాన్ని విజయవంతంగా నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టి ఒక సువర్ణాధ్యాయాన్ని సృష్టించాం. రాకెట్‌లోని అన్ని దశలు అత్యంత అద్భుతంగా పనిచేయడంతో ఇంత గొప్ప విజయం. సాధించిగలిగాం. ఈ విజయం షార్‌లో పనిచేసిన అందరికీ దక్కుతుంది. దేశంలోని అన్ని ఇస్రో సెంటర్లు కలిసి కట్టుగా 18 ఏళ్లు శ్రమించి చేసిన పరిశోధనలు ఫలించి రెండు భారీ ప్రయోగాలను వరుసగా విజయం సాధించినందుకు సంతోషంగా వుంది.– ఎస్ పాండ్యన్, షార్ డైరెక్టర్ రాకెట్‌లోని అన్ని దశలు అద్భుతంగా పనిచేశాయి జీఎస్ఎల్వీ మార్క్3డీ2 రాకెట్లో ఎస్–200, ఎల్–110, సీ–25 దశలు అద్భుతంగా పని చేయడంతో ఇస్రో చరిత్రలో తిరుగులేని విజయాన్ని సాధించాం. ఇన్ని రోజులు సంక్లిష్టమైన సాంకేతిక పరిజ్ఞానం కోసం మనం ప్రపంచం వైపు చూశాం. ఈ ప్రయోగంతో ప్రపంచమే మన వైపు చూడడం ప్రారంభించింది. వెహికల్ ముందుగా నిర్ణయించిన మేరకు సక్రమంగా పని చేసింది. 3,423 కిలోల బరువు కలిగిన అతిపెద్ద ఉపగ్రహాన్ని నిర్ణీత సమయంలో నిర్దేశిత కక్ష్యలో ప్రవేశపెట్టి చరిత్రను సృష్టించాం.– బీ జయకుమార్, వెహికల్ డైరెక్టర్ చరిత్రలో నిలిచిపోయే విజయమిది చరిత్రలో నిలిచిపోయే విజయమిది. రాకెట్ సంబం«ధించిన అన్ని దశలను వీఎస్ఎస్సీలోనే రూపొందించాం. ఇస్రో చరిత్రలో అతిపెద్ద ప్రయోగాన్ని నిర్వహించి చరిత్రాత్మకమైన విజయాన్ని సాధించినందుకు సంతోషంగా ఉంది. రాకెట్‌లోని అన్ని దశలు అద్భుతంగా పని చేశాయి. నిర్ణీత సమయానికే జీశాట్ 29 ఉపగ్రహా అత్యంత జాగ్రత్తగా జియో ట్రాన్స్ఫర్ ఆర్బిట్‌లో విజయవంతంగా ప్రవేశ పెట్టగలిగాం. భవిష్యత్ తరాలకు అత్యంత ఆధునాతమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించేందుకు అడ్వాన్స్డ్ సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన జీశాట్ 29 ఉపగ్రహాన్ని అందుబాటులోకి తెచ్చాము. దీంతో క్రయోజనిక్ టెక్నాలజీలో పూర్తి సాంకేతిక పరమైన పరిపక్వతను సాధించాము. రాకెట్ విడిభాగాలు అందించడంలో ప్రయివేట్ సంస్థల భాగస్వామ్యాన్ని అయన అభినందించారు.– ఎస్ సోమనాథ్. వీఎస్ఎస్సీ డైరెక్టర్ చరిత్రలో నిలిచిపోయిన రోజు ఇది జీఎస్ఎల్వీ మార్క్3డీ2 ప్రయోగ విజయం చరిత్రలో నిలిచిపోయిన రోజు ఇది. అత్యంత బరువు కలిగిన జీశాట్ 29 ఉపగ్రహాన్ని క్రయోజనిక్ దశ (సీ25) సునాయాసంగా నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. మార్క్–3 ప్రాజెక్ట్ కోసం పదిహేడేళ్లుగా శ్రమించాం. 2014 నుంచి క్రయోజనిక్ దశను రూపొందించేందుకు అనేక రకాలు ఇబ్బందులు ఎదురైనా మొక్కవోని ధైర్యంతో క్రయో ఇంజిన్లను తయారు చేసుకున్నాం. ఈ దశ ఎంతో సంక్లిష్టమైంది కావడంతో 2014 నుంచి అనేక రకాలుగా భూస్థిర పరీక్షలు చేసి సామర్థ్యాన్ని నిర్థారించుకున్నాక పూర్తిస్థాయి ప్రయోగానికి సిద్ధమయ్యాం. ఈ రాకెట్‌కు సంబంధించి పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించుకున్నాం.– టీ మూకయ్య, ఐపీఆర్సీ డైరెక్టర్ ఉపగ్రహాన్ని అత్యంత అధునాతనంగా తయారు చేశాం బెంగళూరులోని ఉపగ్రహాల తయారీ కేంద్రంలోని ఉపగ్రహాన్ని తయారు చేశాం. ఇస్రో చరిత్రలో ఇదే అతి పెద్ద ఉపగ్రహం కావడం విశేషం. ఈ ఉపగ్రహంలో అడ్వాన్స్డ్ కమ్యూనికేషన్ పేలోడ్స్‌ను అమర్చి పంపాం. ఈ పేలోడ్స్‌తో దేశంలో మారుమూల గ్రామాల్లో ఇంటర్కెట్ కనెక్టివిటిని అనుసంధానం చేసేందుకు ఉపకరిస్తుంది. -
భళా.. ‘బాహుబలి’!
శ్రీహరికోట (సూళ్లూరుపేట): భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరింది. ఇస్రో చరిత్రలోనే అత్యంత బరువైన జీఎస్ఎల్వీ మార్క్3–డీ2 రాకెట్.. కమ్యూనికేషన్ ఉపగ్రహం జీశాట్29ను విజయవంతంగా అంతరిక్షంలోకి మోసుకెళ్లింది. ఈశాన్య రాష్ట్రాలు, కశ్మీర్‌లోని మారుమూల ప్రాంతాల కమ్యూనికేషన్ అవసరాలను ఈ ఉపగ్రహం తీర్చనుంది. మంగళవారం మధ్యాహ్నం ప్రారంభమైన 27 గంటల కౌంట్‌డౌన్ ముగియగానే బుధవారం సాయంత్రం 5.08 గంటలకు మార్క్3–డీ2 నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి దూసుకెళ్లింది. నెల్లూరు జిల్లా సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్(షార్)లోని ప్రయోగ కేంద్రం ఇందుకు వేదికైంది. ఉపగ్రహాన్ని వాహకనౌక విజయవంతంగా నిర్దేశిత కక్ష్యలో చేర్చిందని ఇస్రో శాస్త్రవేత్తలు వెల్లడించారు. లాంచ్‌ప్యాడ్ నుంచి బయల్దేరిన 16 నిమిషాల్లోనే రాకెట్ నిర్ణీత కక్ష్యను చేరుకుంది. దీంతో ప్రయోగాన్ని వీక్షిస్తున్న శాస్తవేత్తలు ఆనందోత్సాహాల్లో మునిగారు. ఒకరినొకరు అభినందించుకున్నారు. గజ తుపాను నేపథ్యంలో ఓ దశలో ప్రయోగ నిర్వహణపై ఆందోళనలు నెలకొన్నా, చివరకు వాతావరణం సహకరించడంతో శాస్త్రవేత్తలు ఊపిరిపీల్చుకున్నారు. జీఎస్ఎల్వీ మార్క్3– డీ2 రాకెట్ ప్రయోగం రెండోసారీ విజయవంతం కావడం విశేషం. 2017లో జీశాట్19ను నింగిలోకి పంపేందుకు మార్క్2–డీ1ను వాడారు. భవిష్యత్తులో చేపట్టనున్న మానవ సహిత మిషన్ ‘గగన్‌యాన్’లో ఈ రాకెట్‌నే వినియోగించనున్న నేపథ్యంలో తాజా ప్రయోగం శాస్త్రవేత్తల మనోధైర్యాన్ని పెంచుతుందని భావిస్తున్నారు. ఈ ప్రయోగం విజయవంతం కావడంపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోదీ ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించారు. మూడు దశల్లో ప్రయోగం.. ఈ ప్రయోగాన్ని మూడు దశల్లో 16.43 నిమిషాల్లో ఇస్రో శాస్త్రవేత్తలు పూర్తి చేశారు. కౌంట్‌డౌన్ ముగిసిన వెంటనే రాకెట్‌కు మొదటి దశలో రెండు వైపులా అమర్చిన 200 టన్నుల ఘన ఇంధన బూస్టర్లు (ఎస్–200)ను మండించడంతో రాకెట్ ప్రయాణం ప్రారంభమైంది. అనంతరం 1.54 నిమిషాలకు రెండో దశలోని 110 టన్నుల ద్రవ ఇంధనం (ఎల్–110)ను మండించి రాకెట్ వేగాన్ని పెంచారు. తరువాత 2.19 నిమిషాలకు మొదటి దశలోని ఎస్–200 రెండు బూస్టర్లను విడదీసి మొదటి దశను విజయవంతంగా పూర్తిచేశారు. ఎల్–110 దశ 5.18 నిమిషాలకు రెండో దశను పూర్తి చేసింది. ఆ తర్వాత 25 టన్నుల క్రయోజనిక్ ఇంధనం(సీ–25)తో మూడో దశను ప్రారంభించారు. 16.28 నిమిషాలకు క్రయోజనిక్ దశ కటాఫ్ అయిపోయింది. 16.43 నిమిషాలకు రాకెట్‌కు శిఖర భాగంలో అమర్చిన 3,423 కిలోల జీశాట్–29ను విడదీసి భూ బదిలీ కక్ష్యలో విజయవంతంగా ప్రవేశ పెట్టారు. శాస్త్రవేత్తలకు జగన్ శుభాకాంక్షలు సాక్షి, అమరావతి: జీఎస్ఎల్వీ మార్క్ 3–డీ2 ప్రయోగం విజయవంతం కావడం పట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ ప్రయోగాన్ని జయప్రదం చేసిన ఇస్రో శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్‌లో చేసే ప్రయోగాలు సైతం విజయవంతం కావాలని ఆకాంక్షించారు. భారతీయ అంతరిక్ష కార్యక్రమాల్లో ఇదొక మైలురాయి అని జగన్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రయోగం.. ఎవరెస్ట్‌తో సమానంఇన్నాళ్లు చేసిన ప్రయోగాలు ఒక ఎత్తయితే ఈ ప్రయోగం మాత్రం ఎవరెస్ట్ అంత ఎత్తయినదని ఇస్రో చైర్మన్ కె.శివన్ అభివర్ణించారు. మన సమాచార ఉపగ్రహాలనే కాకుండా విదేశాలకు చెందిన భారీ ఉపగ్రహాలను కూడా పంపే స్థాయికి చేరుకోవడం గర్వకారణమని అన్నారు. తొలి మానవసహిత అంతరిక్ష ప్రయోగం ‘గగన్‌యాన్’ను డిసెంబర్ 2021 నాటికి చేపట్టాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు ఆయన వెల్లడించారు. దానికి ముందు ప్రయోగాత్మకంగా మానవ రహిత గగన్‌యాన్‌ను డిసెంబర్ 2020 నాటికి పరీక్షించాలని యోచిస్తున్నట్లు తెలిపారు. మరోవైపు, 2019 జనవరిలో చంద్రుడిపై పరిశో«ధనలు చేసేందుకు చంద్రయాన్–2 గ్రహాంతర ప్రయోగం చేయడానికి సిద్ధమవుతున్నామని తెలిపారు. 2019లో 10 ప్రయోగాలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నామని వివరించారు. అధునాతన పేలోడ్లతో.. జీశాట్–29లో ప్రత్యేకించి కేయూ–బ్యాండ్ ఫోర్ యూజర్ స్పాట్ బీమ్స్, కేఏ–బ్యాండ్ ఫోర్ యూజర్ స్పాట్ భీమ్‌తో పాటు వన్ యూజర్ స్టీరిబుల్ భీమ్, క్యూ/వీ– బ్యాండ్ కమ్యూనికేషన్ పేలోడ్, జియో హైరిజల్యూషన్ కెమెరా, ఆప్టికల్ కమ్యూనికేషన్ పేలోడ్ అనే ఐదు రకాల ఉపకరణాలను అమర్చారు. కమ్యూనికేషన్ ఉపగ్రహాల్లో ఇలాంటి పేలోడ్స్ పంపడం ఇదే మొదటిసారి కావడం విశేషం. ఈశాన్య రాష్ట్రాలతో పాటు జమ్మూ కశ్మీర్‌లోని మారుమూల గ్రామాలను ఈ ఉపగ్రహం ఇంటర్నెట్తో అనుసంధానం చేస్తుంది. విలేజ్ రీసోర్స్ సెంటర్స్ అంటే మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో నీటి వనరులు, సదుపాయా లు, ఇతర ఏర్పాట్లను గుర్తించి సమాచారాన్ని అందించడమే కాకుండా భారత సైనిక అవసరాలకూ దోహదపడుతుంది. ఉపగ్రహం వివరాలు.. ► రాకెట్: జీఎస్ఎల్వీ మార్క్ 3–డీ2 ► ఉపగ్రహంతోకలిపి మొత్తం బరువు: 640 టన్నులు ► ఎత్తు: 43.39 మీటర్లు ► వ్యాసం: 4 మీటర్లు ► ప్రయోగ దశలు: మూడు (ఘన, ద్రవ, క్రయోజెనిక్) ► జీశాట్29 ఉపగ్రహం బరువు: 3,423 కిలోలు ► ఉపగ్రహ జీవితకాలం: 10 ఏళ్లు ► పనిచేయడానికి కావాల్సిన విద్యుత్: 4600 వాట్లు రాకెట్ నమూనాతో ఇస్రో చైర్మన్ శివన్ -
ఉత్తర కొరియా దూకుడు
ప్యోంగ్ యాంగ్: పలు దేశాల హెచ్చరికలను బేఖాతరుచేస్తూ 'శాటిలైట్' క్షిపణి ప్రయోగాన్ని నిర్వహించి ఉత్తర కొరియా దూకుడు ప్రదర్శించింది. అణ్వాయుధాలను మోసుకెళ్లడంతోపాటు దాదాపు 3,400 మైళ్ల దూరంలోని లక్ష్యాన్ని సైతం ఛేదించగల ఖండాంతర క్షిపణిని స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం విజయవంతంగా ప్రయోగించింది. ఆ దేశ నియంత నేత కింగ్ జాంగ్ ఉన్ స్వయంగా రాకెట్ లాంచింగ్ స్టేషన్ కు వచ్చి ప్రయోగాన్ని వీక్షించారు. క్షిపణి ప్రయోగానికి సంబంధించిన దృశ్యాలు అధికారిక టీవీ ఛానెల్ లో ప్రసారమయ్యాయి. పెంటగాన్, జపాన్ సైన్యాలు కూడా క్షిపణి ప్రయోగం నిజమేనని నిర్ధారించాయి. ఇప్పటికే హైడ్రోజన్ బాంబు ప్రయోగంతో తూర్పు ఆసియాపై ఆవహించిన యుద్ధమేఘాలకు ఇంకాస్త కారునలుపును పులుమిన ఉత్తర కొరియా.. తాజా ప్రయోగంతో ప్రపంచదేశాల ఆగ్రహానికి గురైంది. కొరియా తన దుశ్చర్యలను మానుకోవాల్సిందిగా ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ బాన్ కి మూన్ హెచ్చరించారు. భద్రతామండలిని అత్యవసరంగా సమావేశపర్చి ఉత్తరకొరియాపై చర్యలు తీసుకోవాలని అమెరికా, జపాన్, దక్షిణ కొరియాలు డిమాండ్ చేశాయి. టోక్యోలో జపాన్ ప్రధాని షిజో అబే మాట్లాడుతూ 'ఒకినావా ద్వీపంలో మోహరించిన తమ సైన్యాలకు ఉత్తరకొరియా ప్రయోగించిన క్షపణి స్పష్టంగా కనిపించిందని, తమ గగనతలంలోకి వస్తే పేల్చేస్తామని హెచ్చరించినప్పటికీ కొరియా దుస్సాహసానికి ఒడిగట్టింది. వెంటనే ఆ దేశంపై చర్యలు చేపట్టాలి' అని పేర్కొన్నారు. -
'డిక్టేటర్'ను తక్కువగా అంచనా వేయొద్దు...
కాలిఫోర్నియా: నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తాడంటూ ప్రపంచదేశాలు ఆ నేతపై మండిపడుతున్నప్పటికీ.. డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఉత్తర కొరియా దేశాధినేత కిమ్ జాంగ్ ఉన్ ను తక్కువగా అంచనా వేయొద్దని వ్యాఖ్యానించారు. ఆయన అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్ పార్టీ తరఫున పోటీలో ముందు వరుసలో ఉన్న విషయం తెలిసిందే. సంచలనవ్యాఖ్యలు చేసే ట్రంప్ మరోసారి వివాదానికి తెరతీశారు. చిన్న వయసులోనే నాయకత్వ లక్షణాలు అలవర్చుకున్నాడంటూ నార్త్ కొరియా 'డిక్టేటర్' ను తెగ పొగిడేశాడు. గత నెలలో అతి ప్రమాదకరమైన హైడ్రోజన్ బాంబును పరీక్షించి సక్సెస్ అయ్యామని ఆ దేశం ప్రకటించడంపై ప్రపంచదేశాల నుంచి కిమ్ జాంగ్ ఉన్ తీవ్ర విమర్శల పాలయ్యాడు. దక్షిణ కాలిఫోర్నియా, ఫ్లోరెన్స్ లో జరిగిన ర్యాలీలో పాల్గొన్న ట్రంప్ మాట్లాడుతూ... కిమ్ జాంగ్ ఉన్ టాలెంట్ ను తక్కువగా అంచనా వేయొద్దని.. తండ్రి కిమ్ జాంగ్ ఇల్ మృతిచెందిన తర్వాత దేశాన్ని చాలా సులువుగా నియంత్రణలోకి తెచ్చుకున్నాడంటూ ప్రశంసించాడు. నార్త్ కొరియా నియంతగా పిలువబడే కిమ్ జాంగ్ ఉన్ ను ట్రంప్ పొగడటం ఇది రెండోసారి. సుదీర్ఘ దూరాలలోని లక్ష్యాలను చేధించగల క్షిపణిని ప్రయోగించామని నార్త్ కొరియా ఆదివారం అధికారికంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఆయనను మరోసారి దెబ్బతీసే అవకాశాలు లేకపోలేదు. గతనెలలో లోవాలో ఇలాంటి వ్యాఖ్యలే చేయగా.. ఆ ప్రాంతంలో ఇటీవల జరిగిన పోలింగ్‌లో చాలా తక్కువ ఓట్లు సాధించి ట్రంప్ ఓటమి పాలైన విషయం విదితమే. -
గగనతలంలో మరో విజయం.. పీఎస్ఎల్వీ సీ-29 విజయవంతం!
శ్రీహరికోట: ఐదు దశాబ్దాల చరిత్ర కలిగిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) గగనతలంలో మరోసారి తన సత్తా చాటింది. శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని శ్రీహారికోట షార్ కేంద్రం నుంచి బుధవారం సాయంత్రం 6.00 గంటలకు పోలార్ లాంచింగ్ శాటిలైట్ వెహికల్ (పీఎస్ఎల్వీ) సీ-29 రాకెట్ ప్రయోగాన్ని విజయవంతంగా చేపట్టింది. ఇది పూర్తిగా వాణిజ్య ప్రయోగం. సింగపూర్‌కు చెందిన ఆరు ఉపగ్రహాలను మోసుకెళ్లిన ఈ రాకెట్ వాటిని విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. 59 గంటల కౌంట్‌డౌన్ అనంతరం నింగిలోకి ఎగిరిన పీఎస్ఎల్వీ సీ29.. ఉత్కంఠభరితంగా దూసుకుపోతూ వివిధ దశలను దాటుకుంటూ ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఇది ఇస్రో చేపట్టిన 33వ ప్రయోగం. 400 కిలోల బరువున్న టెలియోస్ ఉపగ్రహంతోపాటు ఐదు చిన్న ఉపగ్రహాలను పీఎస్ఎల్వీ కక్ష్యకు చేర్చింది. ఈ ఘట్టాన్ని ఉత్కంఠగా వీక్షిస్తున్న ఇస్రో శాస్త్రవేత్తల్లో రాకెట్ ప్రయోగం విజయవంతం కావడంతో ఆనందం వెల్లివిరిసింది. ఇస్రోకు నమ్మకమైన రాకెట్ పీఎస్ఎల్వీ. వాణిజ్యపరమైన ప్రయోగాల్లో ఇస్రోకు ఇది తిరుగులేని విజయాల్ని అందిస్తూ వస్తున్నది. ఈ ఏడాది జూన్ 10న పీఎస్ఎల్వీ సీ 28 ద్వారా ఐదు విదేశీ ఉపగ్రహాలను, సెప్టెంబర్ 28న పీఎస్ఎల్వీ సీ 30 ద్వారా మరో కార్టోశాట్‌ను విజయవంతంగా రోదసిలోకి పంపింది. ఇప్పటివరకు 81 ఉపగ్రహాలను ఇస్రో ప్రయోగించగా ఇందులో 51 విదేశీ ఉపగ్రహాలు, 30 స్వదేశీ ఉపగ్రహాలు కావడం గమనార్హం.