
సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఈ నెల 26న ఉదయం 11.56 గంటలకు తిరుపతి జిల్లా సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ షార్ లో పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ (పీఎస్‌ఎల్‌వీ సీ54) ఉపగ్రహ వాహకనౌకను ప్రయోగించేందుకు సన్నాహాలు చేస్తోంది.
ప్రయోగం ద్వారా భారత్‌కు చెందిన 960 కేజీల బరువు కలిగిన ఓషన్‌శాట్–3 (ఈవోఎస్–06) ఉపగ్రహంతో పాటు మరో 8 ఉపగ్రహాలను అంతరిక్ష కక్ష్యలోకి పంపనున్నారు. భారత్‌కే చెందిన తైబోల్ట్–1, తైబోల్ట్–2, ఆనంద్, ఇండియా–భూటాన్ దేశాలు సంయుక్తంగా తయారు చేసిన అకా ఐఎన్‌ఎస్–2బీ, స్విట్జర్లాండ్‌కు చెందిన ఆస్ట్రోకాస్ట్ –2 పేరుతో 4 ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపనున్నారు.