ISRO launches new rocket SSLV-D2 with 3 satellites lifts off from Sriharikota - Sakshi
Sakshi News home page

నింగిలోకి దూసుకెళ్లిన SSLV D2.. ప్రయోగం విజయవంతం

Published Fri, Feb 10 2023 9:34 AM | Last Updated on Fri, Feb 10 2023 11:00 AM

SSLV D2 Rocket Launched Into Space At Sriharikota - Sakshi

సాక్షి, తిరుపతి: శ్రీహరికోట నుంచి ఎస్‌ఎస్‌ఎల్‌వీ డీ2 రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రయోగంలో ఎస్‌ఎస్‌ఎల్‌వీ డీ2.. మూడు ఉప గ్రహాలను అంతరిక్షంలోకి మోసుకెళ్లింది. కాగా, 13 నిమిషాల 2 సెకన్లలో రాకెట్‌ ప్రయోగం పూర్తికానుంది. దీని ద్వారా 2 దేశీయ, అమెరికాకు చెందిన ఒక ఉపగ్రహం కక్షలోకి చేరుకున్నాయి.

కాగా, సతీష్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌)లోని మొదటి ప్రయోగవేదిక నుంచి స్మాల్‌ శాటిలైట్‌ లాంచింగ్‌ వెహికల్‌ (ఎస్‌ఎస్‌ఎల్‌వీ–డీ2)ను శుక్రవారం ఉదయం 9.18 గంటలకు నింగిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రయోగం ద్వారా ఎర్త్‌ అబ్జర్వేషన్‌ శాటిలైట్, జానుస్‌–1, ఆజాదీ శాట్‌–2 అనే మూడు ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. ఇక, ఎస్‌ఎస్‌ఎల్‌వీ–డీ1 పేరుతో గత ఏడాదిలో చేసిన మొ­దటి ప్రయోగం విఫలం కావడంతో ఈ ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు కృషి  చేశారు.

 

రాకెట్‌ వివరాలు ఇవే..
ఎస్‌ఎస్‌ఎల్‌వీ–డీ2 రాకెట్‌ 34 మీటర్లు పొడవు, రెండు మీటర్లు వెడల్పు, 119 టన్నుల బరువు కలిగి ఉంది. దీనిని నాలుగు దశల్లో ప్రయోగించనున్నారు. ఈ రాకెట్‌ మొదటి దశను 87 టన్నుల ఘన ఇంధనాన్ని ఉపయోగించి 124 సెకన్లలో పూర్తిచేస్తారు. రెండో దశను 7.7 టన్నుల ఘన ఇంధనంతో 384.2 సెకన్లలో, మూడో దశను 4.5 టన్నుల ఘన ఇంధనంతో 674.9 సెకన్లలో పూర్తి చేయనున్నారు. నాలుగో దశలో మాత్రమే 0.05 టన్నుల ద్రవ ఇంధనం సాయంతో 785.1 సెకన్లలో పూర్తి చేస్తారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement