
ఒకరోజు ముందే షార్‌కు ప్రధాని
శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట నుంచి 30న తలపెట్టిన పీఎస్‌ఎల్‌వీ-సీ23 రాకెట్ ప్రయోగాన్ని స్వయంగా తిలకించేందుకు వస్తున్న ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఒకరోజు ముందుగానే షార్‌కు చేరుకుంటారు.
* 29న సాయంత్రం హెలికాప్టర్‌లో చేరుకోనున్న మోడీ
* 30న ఉదయం పీఎస్‌ఎల్‌వీ-సీ23 ప్రయోగం
సాక్షి ప్రతినిధి, నెల్లూరు/సూళ్లూరుపేట: శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట నుంచి 30న తలపెట్టిన పీఎస్‌ఎల్‌వీ-సీ23 రాకెట్ ప్రయోగాన్ని స్వయంగా తిలకించేందుకు వస్తున్న ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఒకరోజు ముందుగానే షార్‌కు చేరుకుంటారు. ప్రధాని 29వ తేదీ సాయంత్రం 4 గంట లకు ప్రత్యేక విమానంలో చెన్నైకి చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో సాయంత్రం 4.50 గంటలకు షార్‌కు చేరుకుంటారు. రాత్రికి అక్కడే బసచేసి, మరుసటిరోజు ఉదయం జరిగే రాకెట్ ప్రయోగాన్ని వీక్షిస్తారు. పీఎస్‌ఎల్‌వీ-సీ23 రాకెట్‌ను 30వతేదీ ఉదయం 9.49 గంటలకు ప్రయోగించనున్న విషయం తెలిసిందే. ప్రధాని పదవి చేపట్టాక మోడీ తొలిసారిగా షార్‌కు వస్తుండడంతో ఈ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. మోడీ పర్యటన సందర్భంగా అధికారులు భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.