న్యూఢిల్లీ: దేశంలోనే తొలి ప్రైవేటు రాకెట్ విక్రమ్- ఎస్ ప్రయోగం వాయిదా పడింది. వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవటంతో మరో మూడు రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు హైదరాబాద్‌కు చెందిన స్పేస్ స్టార్టప్ స్కైరూట్ ఏరోస్పేస్ ఆదివారం ప్రకటించించింది. ఈ నెల 15నే విక్రమ్-ఎస్ ప్రయోగం నిర్వహించాలని భావించినప్పటికీ.. నవంబర్ 18కి వాయిదా వేస్తున్నట్లు పేర్కొంది.
‘వాతావరణం అనుకూలించకపోవటం వల్ల విక్రమ్-ఎస్ రాకెట్ లాంఛ్‌ను మరో మూడు రోజులు 15-19 మధ్య చేపట్టాలని నిర్ణయించాం. నవంబర్ 18 ఉదయం 11.30 గంటల ప్రాంతంలో జరిగేందుకు అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరి కోట ఇస్రో లాంఛ్‌పాడ్ నుంచి ఈ ప్రయోగం జరగనుంది.’ అని తెలిపింది స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థ.
దేశంలో మొట్టమొదటిసారిగా ప్రైవేటు రంగంలో నిర్మించిన రాకెట్ విక్రమ్-ఎస్. ‘ప్రారంభ్’ అనే ఈ మిషన్‌లో రెండు భారతీయ, ఒక విదేశీ ఉపగ్రహం ఉంటాయని హైదరాబాద్‌కు చెందిన స్టార్టప్ స్కైరూట్ ఏరోస్పేస్ తెలిపింది. స్కైరూట్ ఏరోస్పేస్ కంపెనీ మూడు వేరియంట్లలో విక్రమ్ రాకెట్‌ను డెవలప్ చేస్తోంది. విక్రమ్–1 రాకెట్ 480 కిలోల పేలోడ్‌ను తక్కువ ఎత్తు ఉన్న కక్ష్యలోకి మోసుకెళ్లగలదు. విక్రమ్–2 595 కిలోలు, విక్రమ్–3 815 కిలోల పేలోడ్‌ను భూమి నుంచి 500 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న కక్ష్యలోకి మోసుకెళ్తాయి.
ఇదీ చదవండి: తిండి లేని రోజుల నుంచి.. అమెరికాలో సైంటిస్ట్ దాకా.. ఆయన ప్రయాణం స్ఫూర్తిదాయకం
Comments
Please login to add a commentAdd a comment