Indian space launch center
-
విక్రమ్–ఎస్ ప్రయోగానికి సర్వం సిద్ధం
సూళ్లూరుపేట: భారత అంతరిక్ష ప్రయోగాల్లో ప్రైవేట్ రంగానికి నాంది పలుకుతూ ప్రైవేట్‌రంగంలో రూపొందిన తొలి రాకెట్ విక్రమ్–ఎస్‌ను శుక్రవారం ఉదయం 11.30 గంటలకు సతీష్ ధవన్ స్పేస్ సెంటర్లోని సౌండింగ్ రాకెట్ ప్రయోగవేదిక నుంచి నింగిలోకి పంపేందుకు సర్వం సిద్ధమైంది. హైదరాబాద్‌కు చెందిన స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థ రూపొందించిన ఈ రాకెట్‌కు అంతరిక్ష ప్రయోగాలకు ఆధ్యులైన డాక్టర్ విక్రమ్ సారాభాయ్ పేరిట విక్రమ్–ఎస్ అని నామకరణం చేశారు. ప్రైవేట్‌రంగంలో తొలి రాకెట్ కావడంతో దీనిని ప్రారంభ్ అని కూడా పిలుస్తున్నారు. ఈ రాకెట్ మూడు అతిచిన్న పేలోడ్లను అంతరిక్షంలోకి మోసుకెళ్లనుంది. ఈ పేలోడ్స్ రోదసీలో భూమికి అతి తక్కువ దూరం అంటే 81 కిలోమీటర్ల ఎత్తులోని కక్ష్యలో ఉండి వాతావరణాన్ని అధ్యయనం చేస్తాయి. స్కైరూట్ ఏరోస్పేస్ రూపొందించిన విక్రమ్–ఎస్ రాకెట్ మొత్తం బరువు 545 కేజీలు. ఎత్తు ఆరు మీటర్లు. ఇది 83 కేజీల మూడు పేలోడ్స్‌ను నింగిలోకి మోసుకెళ్లనుంది. ఘన ఇంధనంతో కూడిన సింగిల్ స్టేజ్ రాకెట్ కావడం దీని ప్రత్యేకత. ఈ రాకెట్ ద్వారా స్పేస్‌కిడ్జ్ అనే ఏరోస్పేస్ స్టార్టప్ సంస్థకు చెందిన 2.5 కేజీల ఫన్–శాట్‌ను కక్ష్యలోకి పంపుతున్నారు. దీనిని ఐఐటీ విద్యార్థులు, అమెరికా, సింగపూర్, ఇండోనేసియా విద్యార్థులు సంయుక్తంగా తయారుచేయడం విశేషం. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఎన్–స్పేస్ టెక్, ఆర్మేనియాకు చెందిన బజూమ్‌క్యూ స్పేస్ రీసెర్చ్ ల్యాబ్‌కు చెందిన పేలోడ్లను రాకెట్ మోసుకెళ్లనుంది. -
తొలి ప్రైవేట్ రాకెట్ ప్రయోగం వాయిదా
న్యూఢిల్లీ: దేశంలోనే తొలి ప్రైవేటు రాకెట్ విక్రమ్- ఎస్ ప్రయోగం వాయిదా పడింది. వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవటంతో మరో మూడు రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు హైదరాబాద్‌కు చెందిన స్పేస్ స్టార్టప్ స్కైరూట్ ఏరోస్పేస్ ఆదివారం ప్రకటించించింది. ఈ నెల 15నే విక్రమ్-ఎస్ ప్రయోగం నిర్వహించాలని భావించినప్పటికీ.. నవంబర్ 18కి వాయిదా వేస్తున్నట్లు పేర్కొంది. ‘వాతావరణం అనుకూలించకపోవటం వల్ల విక్రమ్-ఎస్ రాకెట్ లాంఛ్‌ను మరో మూడు రోజులు 15-19 మధ్య చేపట్టాలని నిర్ణయించాం. నవంబర్ 18 ఉదయం 11.30 గంటల ప్రాంతంలో జరిగేందుకు అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరి కోట ఇస్రో లాంఛ్‌పాడ్ నుంచి ఈ ప్రయోగం జరగనుంది.’ అని తెలిపింది స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థ. దేశంలో మొట్టమొదటిసారిగా ప్రైవేటు రంగంలో నిర్మించిన రాకెట్ విక్రమ్-ఎస్. ‘ప్రారంభ్’ అనే ఈ మిషన్‌లో రెండు భారతీయ, ఒక విదేశీ ఉపగ్రహం ఉంటాయని హైదరాబాద్‌కు చెందిన స్టార్టప్ స్కైరూట్ ఏరోస్పేస్ తెలిపింది. స్కైరూట్ ఏరోస్పేస్ కంపెనీ మూడు వేరియంట్లలో విక్రమ్ రాకెట్‌ను డెవలప్ చేస్తోంది. విక్రమ్–1 రాకెట్ 480 కిలోల పేలోడ్‌ను తక్కువ ఎత్తు ఉన్న కక్ష్యలోకి మోసుకెళ్లగలదు. విక్రమ్–2 595 కిలోలు, విక్రమ్–3 815 కిలోల పేలోడ్‌ను భూమి నుంచి 500 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న కక్ష్యలోకి మోసుకెళ్తాయి. ఇదీ చదవండి: తిండి లేని రోజుల నుంచి.. అమెరికాలో సైంటిస్ట్ దాకా.. ఆయన ప్రయాణం స్ఫూర్తిదాయకం -
15న నింగిలోకి తొలి ప్రైవేట్ రాకెట్
న్యూఢిల్లీ: దేశంలో మొట్టమొదటిసారిగా ప్రైవేటు రంగంలో నిర్మించిన రాకెట్ విక్రమ్-ఎస్ ఈ నెల 15న నింగిలోకి దూసుకెళ్లనుంది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరి కోట ఇస్రో లాంఛ్‌పాడ్ నుంచి ఉదయం11.30 గంటలకు ప్రయోగించనున్నట్లు హైదరాబాద్‌కు చెందిన స్టార్టప్ సంస్థ స్కైరూట్ ఏరోస్పేస్ తెలిపింది. ప్రారంభ్ అనే ఈ మిషన్‌లో రెండు భారతీయ, ఒక విదేశీ ఉపగ్రహం ఉంటాయని తెలిపింది. స్కైరూట్ ఏరోస్పేస్ కంపెనీ మూడు వేరియంట్లలో విక్రమ్ రాకెట్‌ను డెవలప్ చేస్తోంది. విక్రమ్–1 రాకెట్ 480 కిలోల పేలోడ్‌ను తక్కువ ఎత్తు ఉన్న కక్ష్యలోకి మోసుకెళ్లగలదు. విక్రమ్–2 595 కిలోలు, విక్రమ్–3 815 కిలోల పేలోడ్‌ను భూమి నుంచి 500 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న కక్ష్యలోకి మోసుకెళ్తాయి. ఇదీ చదవండి: న్యాయమూర్తుల నియామకంలో జాప్యమా? -
వచ్చేవారమే నింగిలోకి తొలి ప్రైవేట్ రాకెట్
న్యూఢిల్లీ: భారత్‌లో అంతరిక్ష ప్రయోగాల విషయంలో నూతన అధ్యాయం ప్రారంభం కాబోతోంది. దేశంలో ప్రైవేట్ రంగంలో అభివృద్ధి చేసిన మొట్టమొదటి రాకెట్ ‘విక్రమ్–ఎస్’ ప్రయోగాన్ని వచ్చేవారమే చేపట్టబోతున్నారు. సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఈ నెల 12–16 తేదీల మధ్య ఈ ప్రైవేట్ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది. ఈ మొత్తం ప్రయోగానికి ‘ప్రారంభ్ మిషన్’ అని నామకరణం చేశారు. విక్రమ్–ఎస్ రాకెట్‌ను హైదరాబాద్‌కు చెందిన స్కైరూట్ ఏరోస్పేస్ అనే ప్రైవేట్ స్టార్టప్ కంపెనీ అభివృద్ధి చేసింది. ప్రైవేట్ రంగంలో రాకెట్‌ను అభివృద్ధి చేసి, ప్రయోగిస్తుండడం దేశంలో ఇదే మొదటిసారి కావడం విశేషం. విక్రమ్–ఎస్ రాకెట్ మూడు పేలోడ్లను అంతరిక్షంలోకి తీసుకెళ్లనుంది. ఇందులో విద్యార్థులు తయారు చేసిన 2.5 కిలోల పేలోడ్ సైతం ఉంది. స్పేస్ కిడ్స్ ఇండియా కార్యక్రమంలో భాగంగా దీనిని తయారు చేశారు. ‘ఇన్–స్పేస్’ క్లియరెన్స్ దేశంలో అంతరిక్ష సాంకేతికరంగ నూతన సంస్థలకు ప్రోత్సాహం, నియంత్రణలకు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ‘ఇన్–స్పేస్’ సంస్థ నోడల్ ఏజెన్సీగా పనిచేస్తోంది. ప్రైవేట్ విక్రమ్–ఎస్ రాకెట్ ప్రయోగానికి ఇన్–స్పేస్ నుంచి ఇప్పటికే క్లియరెన్స్ లభించింది. ఇంకా అధికారికంగా ప్రకటించనప్పటికీ ఈ నెల 12–16 మధ్య ప్రయోగం చేపట్టే వీలున్నట్లు స్కైరూట్ ఏరోస్పేస్ బిజినెస్ డెవలప్మెంట్ ప్రతినిధి శిరీష్ పల్లికొండ మంగళవారం తెలిపారు. ప్రారంభ్ మిషన్‌ను ఆరంభిస్తుండడం ఆనందంగా ఉందన్నారు. వాతావరణ పరిస్థితులను బట్టి ప్రయోగ తేదీని ఖరారు చేస్తామని స్కైరూట్ ఏరోస్పేస్ సీఈఓ పవన్‌కుమార్ చందన వెల్లడించారు. స్కైరూట్ ఏరోస్పేస్ కంపెనీ మూడు వేరియంట్లలో విక్రమ్ రాకెట్‌ను డెవలప్ చేస్తోంది. విక్రమ్–1 రాకెట్ 480 కిలోల పేలోడ్‌ను తక్కువ ఎత్తు ఉన్న కక్ష్యలోకి మోసుకెళ్లగలదు. విక్రమ్–2 595 కిలోలు, విక్రమ్–3 815 కిలోల పేలోడ్‌ను భూమి నుంచి 500 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న కక్ష్యలోకి మోసుకెళ్తాయి. ఇదీ చదవండి: ఓవైపు చంద్రగ్రహణం, మరోవైపు బిర్యానీ.. ఏంటిది? మీరు చెప్పేదేంటి? కొట్టుకునేవరకు వెళ్లిన పంచాయితీ -
రేపు పీఎస్ఎల్వీ సీ47 ప్రయోగం
సూళ్లూరుపేట: భారత అంతరిక్ష ప్రయోగకేంద్రం సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి బుధవారం ఉదయం 9.28కి పీఎస్ఎల్వీ సీ47ను నింగిలోకి పంపనున్నారు. సోమవారం బ్రహ్మప్రకాష్ హాలులో జరిగిన మిషన్ సంసిద్ధతా సమావేశం (ఎంఆర్ఆర్)లో ఇస్రో శాస్త్రవేత్తలు అధికారికంగా నిర్ణయించారు. ఎంఆర్ఆర్ కమిటీ చైర్మన్ బీఎన్ సురేష్ ఆధ్వర్యంలో సోమవారం రాకెట్‌కు అన్ని రకాల పరీక్షలు నిర్వహించాక ప్రయోగానికి అంతా సిద్ధం అని ప్రకటించారు. ప్రయోగ పనులను లాంచ్ ఆథరైజే షన్ బోర్డుకు అప్పగించారు. బోర్డు చైర్మన్ ఆర్ముగం రాజరాజన్ ఆధ్వర్యంలో సోమవారం సమావేశం నిర్వహించి ప్రయోగానికి 26 గంటల ముందు అంటే మంగళ వారం ఉదయం 7.28కి కౌంట్‌డౌన్ ప్రారంభించేందుకు నిర్ణయం తీసుకున్నారు. పీఎస్ఎల్వీ సీ47 ద్వారా 714 కిలోల బరువు కలిగిన కార్టోశాట్–3 సిరీస్‌లో ఎనిమిదో ఉపగ్రహంతో పాటు అమెరికా 12 ఫ్లోక్–4పీ అనే బుల్లి ఉపగ్రహాలు, మెష్‌బెడ్ అనే మరో బుల్లి ఉపగ్రహాన్ని రోదసీలోకి పంపేందుకు సిద్ధం చేస్తున్నారు. ఇది షార్ నుంచి 74వ ప్రయోగం. -
నేడు భూస్థిర కక్ష్యలోకి ఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1జీ
శ్రీహరికోట(సూళ్లూరుపేట): భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి గత నెల 28న ప్రయోగించిన ఐఆర్ఎన్ఎస్ఎస్ -1జీ ఉపగ్రహాన్ని బుధవారం భూస్థిర కక్ష్యలోకి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రవేశపెట్టనుంది. నాలుగోదశ భూస్థిర కక్ష్య పెంపులో భాగంగా ఉపగ్రహంలోని ద్రవ ఇంధనాన్ని మంగళవారం అర్ధరాత్రి 1.27 గంటలకు 231 సెకండ్ల పాటు మండించారు. కర్ణాటకలోని హసన్‌లో ఉన్న సంస్థ మాస్టర్ కంట్రోల్ ఫెసిలిటీ(ఎంసీఎఫ్) ఈ కార్యక్రమాన్ని చేపడుతోంది. ఇప్పటికి మూడుసార్లు చేపట్టిన ఆపరేషన్‌తో అపోజీ (భూమికి దూరంగా) 35,813 కిలోమీటర్లు, పెరిజీ (భూమికి దగ్గరగా) 29,050 కిలో మీటర్లు ఎత్తులో ఉన్న ఉపగ్రహాన్ని నాలుగోసారి చేపట్టిన ఆపరేషన్‌తో భూమికి 36 కిలోమీటర్లు ఎత్తులోని భూస్థిర కక్ష్యలోకి బుధవారం ప్రవేశపెట్టి స్థిరపరుస్తారు -
నేడు పీఎస్ఎల్వీ సీ33 కౌంట్‌డౌన్ ప్రారంభం
♦ 28న మధ్యాహ్నం 12.50 గంటలకు ప్రయోగం ♦ ఎంఆర్ఆర్ సమావేశంలో నిర్ణయం శ్రీహరికోట(సూళ్లూరుపేట): శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని భారత అంతరిక్ష ప్రయోగకేంద్రమైన సతీష్ ధవన్ స్పేస్ సెంటర్(షార్) నుంచి పీఎస్ఎల్వీ సీ33 ఉపగ్రహం ప్రయోగానికి సిద్ధమైంది. ఈనెల 28న మధ్యాహ్నం 12. 50 గంటలకు జరుగుతుందని, మంగళవారం ఉదయం 9.20 కౌంట్‌డౌన్ ప్రారంభమవుతుందని మిషన్ సంసిద్ధతా సమావేశం(ఎంఆర్ఆర్)లో అధికారికంగా ప్రకటించారు. షార్‌లోని బ్రహ్మప్రకాష్హాల్ లో ఎంఆర్ఆర్ కమిటీ చైర్మన్ బీఎన్ సురేష్ ఆధ్వర్యంలో పీఎస్ఎల్వీ సీ33, పీఎస్ఎల్వీ సీ34 గురించి తగు నిర్ణయాలు తీసుకున్నారు. సోమవారం 12.50 కు లాంచ్ రిహార్సల్స్‌ను విజయవంతంగా పూర్తి చేసిన అనంతరం ఎంఆర్ఆర్ సమావేశం నిర్వహించి ప్రయోగ పనులను లాంచ్ ఆథరైజేషన్ బోర్డుకు అప్పగించారు. దీనిపై ల్యాబ్ (లాం చ్ ఆథరైజేషన్ బోర్డు) చైర్మన్ పి.కున్హికృష్ణన్ ఆధ్వర్యంలో కూడా భేటీ జరిగింది. ప్రయోగానికి 51.30 గంటల ముందు అంటే మంగళవారం ఉదయం 9.20 గంట లకు కౌంట్‌డౌన్ ప్రారంభించేందుకు సర్వం సిద్ధం చేస్తున్నారు. పీఎస్ఎల్వీ సీ33 ద్వారా ఐఆర్ఎన్ఎస్ఎస్ సిరీస్‌లో ఆఖరు ఉపగ్రహం ఐఆర్ఎన్ఎస్ఎస్-1జీ ఉపగ్రహాన్ని రోదసీలోకి పంపనున్నారు. జూన్‌లో పీఎస్ఎల్వీ సీ34 ప్రయోగం.. పీఎస్ఎల్వీ సీ34 ప్రయోగాన్ని వాస్తవంగా మే నెలాఖరులో చేపట్టేందుకు ఇస్రో లక్ష్యంగా పెట్టుకుంది. కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఈ ప్రయోగం జూన్ మొదటి వారానికి వాయిదావేయాలని ఎఆర్ఆర్ సమావేశంలో నిర్ణయించారు. ఈ ప్రయోగంలో సరికొత్తగా 22 ఉపగ్రహాలను రోదసీలోకి పంపేం దుకు ఏర్పాట్లు చేస్తున్నారు.