శ్రీహరికోట(సూళ్లూరుపేట): భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి గత నెల 28న ప్రయోగించిన ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్ -1జీ ఉపగ్రహాన్ని బుధవారం భూస్థిర కక్ష్యలోకి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రవేశపెట్టనుంది. నాలుగోదశ భూస్థిర కక్ష్య పెంపులో భాగంగా ఉపగ్రహంలోని ద్రవ ఇంధనాన్ని మంగళవారం అర్ధరాత్రి 1.27 గంటలకు 231 సెకండ్ల పాటు మండించారు. కర్ణాటకలోని హసన్‌లో ఉన్న సంస్థ మాస్టర్ కంట్రోల్ ఫెసిలిటీ(ఎంసీఎఫ్) ఈ కార్యక్రమాన్ని చేపడుతోంది.
ఇప్పటికి మూడుసార్లు చేపట్టిన ఆపరేషన్‌తో అపోజీ (భూమికి దూరంగా) 35,813 కిలోమీటర్లు, పెరిజీ (భూమికి దగ్గరగా) 29,050 కిలో మీటర్లు ఎత్తులో ఉన్న ఉపగ్రహాన్ని నాలుగోసారి చేపట్టిన ఆపరేషన్‌తో భూమికి 36 కిలోమీటర్లు ఎత్తులోని భూస్థిర కక్ష్యలోకి బుధవారం ప్రవేశపెట్టి స్థిరపరుస్తారు
నేడు భూస్థిర కక్ష్యలోకి ఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1జీ
Published Wed, May 4 2016 2:56 AM | Last Updated on Sun, Sep 3 2017 11:20 PM
Advertisement