
న్యూఢిల్లీ: దేశంలో మొట్టమొదటిసారిగా ప్రైవేటు రంగంలో నిర్మించిన రాకెట్ విక్రమ్-ఎస్ ఈ నెల 15న నింగిలోకి దూసుకెళ్లనుంది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరి కోట ఇస్రో లాంఛ్‌పాడ్ నుంచి ఉదయం11.30 గంటలకు ప్రయోగించనున్నట్లు హైదరాబాద్‌కు చెందిన స్టార్టప్ సంస్థ స్కైరూట్ ఏరోస్పేస్ తెలిపింది. ప్రారంభ్ అనే ఈ మిషన్‌లో రెండు భారతీయ, ఒక విదేశీ ఉపగ్రహం ఉంటాయని తెలిపింది.
స్కైరూట్ ఏరోస్పేస్ కంపెనీ మూడు వేరియంట్లలో విక్రమ్ రాకెట్‌ను డెవలప్ చేస్తోంది. విక్రమ్–1 రాకెట్ 480 కిలోల పేలోడ్‌ను తక్కువ ఎత్తు ఉన్న కక్ష్యలోకి మోసుకెళ్లగలదు. విక్రమ్–2 595 కిలోలు, విక్రమ్–3 815 కిలోల పేలోడ్‌ను భూమి నుంచి 500 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న కక్ష్యలోకి మోసుకెళ్తాయి.
ఇదీ చదవండి: న్యాయమూర్తుల నియామకంలో జాప్యమా?
Comments
Please login to add a commentAdd a comment