సూళ్లూరుపేట: భారత అంతరిక్ష ప్రయోగకేంద్రం సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి బుధవారం ఉదయం 9.28కి పీఎస్‌ఎల్‌వీ సీ47ను నింగిలోకి పంపనున్నారు. సోమవారం బ్రహ్మప్రకాష్ హాలులో జరిగిన మిషన్ సంసిద్ధతా సమావేశం (ఎంఆర్‌ఆర్)లో ఇస్రో శాస్త్రవేత్తలు అధికారికంగా నిర్ణయించారు. ఎంఆర్‌ఆర్ కమిటీ చైర్మన్ బీఎన్ సురేష్ ఆధ్వర్యంలో సోమవారం రాకెట్‌కు అన్ని రకాల పరీక్షలు నిర్వహించాక ప్రయోగానికి అంతా సిద్ధం అని ప్రకటించారు. ప్రయోగ పనులను లాంచ్ ఆథరైజే షన్ బోర్డుకు అప్పగించారు.
బోర్డు చైర్మన్ ఆర్ముగం రాజరాజన్ ఆధ్వర్యంలో సోమవారం సమావేశం నిర్వహించి ప్రయోగానికి 26 గంటల ముందు అంటే మంగళ వారం ఉదయం 7.28కి కౌంట్‌డౌన్ ప్రారంభించేందుకు నిర్ణయం తీసుకున్నారు. పీఎస్‌ఎల్‌వీ సీ47 ద్వారా 714 కిలోల బరువు కలిగిన కార్టోశాట్–3 సిరీస్‌లో ఎనిమిదో ఉపగ్రహంతో పాటు అమెరికా 12 ఫ్లోక్–4పీ అనే బుల్లి ఉపగ్రహాలు, మెష్‌బెడ్ అనే మరో బుల్లి ఉపగ్రహాన్ని రోదసీలోకి పంపేందుకు సిద్ధం చేస్తున్నారు. ఇది షార్ నుంచి 74వ ప్రయోగం.
Comments
Please login to add a commentAdd a comment