30న రాత్రి 9.58 గంటలకు ప్రయోగం
సూళ్లూరుపేట: తిరుపతి జిల్లా సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ షార్‌లోని మొదటి ప్రయోగవేదిక నుంచి ఈనెల 30న రాత్రి 9.58 గంటలకు ప్రయోగించనున్న పీఎస్‌ఎల్‌వీ సీ60 రాకెట్‌కు 25 గంటలకు ముందు అంటే 29న రాత్రి 8.58 గంటలకు కౌంట్‌డౌన్ ప్రక్రియను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఈ ప్రయోగం ద్వారా 220 కిలోలు బరువు కలిగిన స్పాడెక్స్‌లో ఛేజర్, టార్గెట్ అనే జంట ఉపగ్రహాలను భూమికి 470 కిలోమీటర్లు ఎత్తులోని వృత్తాకార కక్ష్యలో 55 డిగ్రీలు వంపులో ప్రవేశపెట్టనున్నారు. ఈ రెండు ఉపగ్రహాలు సమాంతర కక్ష్యలోకి వెళ్లిన తరువాత ఒకదానితో ఒకటి అనుసంధానమై పనిచేస్తూ సేవలను అందిస్తాయి.
అయితే ఉపగ్రహం బరువు మొత్తం 400కేజీలు అయినప్పటికీ ఇందులో రెండు ఉపగ్రహాల బరువు 220 కిలోలు మాత్రమే. మిగిలిన 180 కిలోలు ఉపగ్రహాల్లో ఇంధనం ఉంటుంది. అయితే ప్రస్తుతం రాకెట్‌కు అన్ని దశలను పూర్తిచేసి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షలన్నీ నిర్వహించిన తరువాత ఎంఆర్‌ఆర్ సమావేశం, లాంచ్ ఆథరైజేషన్ సమావేశాల అనంతరం ప్రయోగాన్ని చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment