సాక్షి, సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): పీఎస్‌ఎల్‌వీ సీ-56 వాహకనౌక ప్రయోగం విజయవంతమైంది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి ఆదివారం ఉదయం 6.31 గంటలకు పీఎస్‌ఎల్‌వీ-సి56 ప్రయోగం నిర్వహించారు. నాలుగు దశల్లో రాకెట్ ప్రయోగం జరిగింది.
కాగా, 25.30 గంటలపాటు కౌంట్‌డౌన్‌తో నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్‌ఎల్‌వీ సీ-56 విజయవంతంగా కక్షలోకి దూసుకెళ్లింది. ఇక, సింగపూర్‌కు చెందిన 420 కిలోల బరువు గల ఏడు ఉపగ్రహాలను దీని ద్వారా కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. 7 ఉపగ్రహాలను నియో ఆర్బిట్‌లోకి ప్రవేశ పెట్టనున్నారు.
#PSLVC56 | The mission is successfully accomplished. PSLV-C56 vehicle launched all seven satellites precisely into their intended orbits: ISRO
— ANI (@ANI) July 30, 2023
రాకెట్ ప్రయోగం విజయవంతం కావడంతో శాస్త్రవేత్తలు సంబురాలు జరుపుకుంటున్నారు. ఇక, ఈనెలలో ఇస్రోకు ఇది రెండో ప్రయోగం కావడం విశేషం. ఒకే నెలలో 2 ప్రయోగాలను సక్సెస్ చేసిన ఇస్రో. కాగా, పీఎస్‌ఎల్వీ సిరీస్‌లో ఇది 58వ ప్రయోగం. అనంతరం శాస్త్రవేత్తలకు ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ అభినందనలు తెలిపారు.
ఈ సందర్బంగా సోమనాథ్ మాట్లాడుతూ.. నిర్దేశించిన కక్ష్యలో రాకెట్‌ను విజయవంతంగా ప్రవేశపెట్టాం. సెప్టెంబర్‌లో మరో పీఎస్‌ఎల్వీ ప్రయోగం చేపడతాం. అది కూడా పూర్తిగా కమిర్షియల్ ప్రయోగమని స్పష్టం చేశారు.
#WATCH | Indian Space Research Organisation (ISRO) launches its PSLV-C56 with six co-passenger satellites from Satish Dhawan Space Centre (SDSC) SHAR, Sriharikota.
— ANI (@ANI) July 30, 2023
(Source: ISRO) pic.twitter.com/2I1pNvKvBH
Comments
Please login to add a commentAdd a comment