
సూళ్లూరుపేట (తిరుపతి జిల్లా): ఎస్‌ఎస్‌ఎల్‌వీ డీ2 ప్రయోగం ద్వారా ఇస్రో అంతరిక్షంలోకి పంపించిన ఆజాదీశాట్–2 ఉపగ్రహాన్ని పూర్తిగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థినులే తయారు చేశారు. అంతరిక్ష ప్రయోగాలపై విద్యార్థి దశనుంచే అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్న 75 పాఠశాలలను.. వాటిలో విద్యనభ్యసిస్తున్న 750 మంది విద్యార్థినులను ఎంపిక చేశారు.
చెన్నైకి చెందిన స్పేస్ కిడ్ ఇండియా సీఈవో కేశన్ ఆధ్వర్యంలో ఈ విద్యార్థినులు ఆజాదీశాట్–2ను రూపొందించారు. ఇందులో తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం నారాయణవనం ప్రభుత్వ పాఠశాల విద్యార్థినులు కూడా భాగస్వాములయ్యారు. స్పేస్ కిడ్ ఇండియాలో భాగంగా విద్యార్థినులంతా 6 నెలలు పాటు శ్రమించి రూ.86 లక్షల ఖర్చుతో ఈ బుల్లి ఉపగ్రహాన్ని తయారుచేశారు.
Comments
Please login to add a commentAdd a comment