సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): సతీష్‌ధవన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి పీఎస్‌ఎల్‌వీ సీ54 నింగిలోకి దూసుకెళ్లింది. రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. ఈ ప్రయోగం ద్వారా 9 ఉప గ్రహాలను భూమికి 720 కిలోమీటర్ల ఎత్తులో సన్‌సింక్రోనస్ ఆర్బిట్‌లోకి ప్రవేశపెట్టారు.
కాగా, పీఎస్‌ఎల్‌వీ సీ–54 రాకెట్‌కు శుక్రవారం ఉదయం 10.26 నిమిషాలకు ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్, లాంచ్ ఆథరైజేషన్ బోర్డు చైర్మన్ ఆర్ముగంరాజరాజన్‌లు కౌంట్‌డౌన్ ప్రారంభించారు. శుక్రవారం సాయంత్రం రాకెట్‌లోని నాల్గో దశలో ద్రవ ఇంధనాన్ని నింపే ప్రక్రియను పూర్తి చేశారు. అనంతరం రాకెట్‌కు సంబంధించిన అన్ని పరీక్షలు నిర్వహించారు.
చదవండి: సీఎం జగన్ చరిత్రాత్మక నిర్ణయం.. వారికి తీపి కబురు..
Comments
Please login to add a commentAdd a comment