చివరి 11 సెకన్లలో సాంకేతిక సమస్య ∙వెంటనే ప్రయోగం నిలిపివేత
అగ్నికుల్ కాస్మోస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన చిన్న రాకెట్ ఇది
గతంలో రెండుసార్లు వాయిదా.. ఇది మూడోసారి
సూళ్లూరుపేట (తిరుపతి జిల్లా): ప్రైవేటు అంతరిక్ష సంస్థకు చెందిన అగ్నిబాన్ రాకెట్ ప్రయోగం మరోసారి వాయిదా పడింది. సాంకేతిక లోపాల కారణంగా ఈ రాకెట్ ప్రయోగం గతంలో రెండుసార్లు వాయిదా పడింది. అందులో తలెత్తిన సాంకేతిక లోపాలను సరిదిద్ది మంగళవారం తెల్లవారు జామున ప్రయోగానికి సిద్ధం చేశారు. అయితే, ప్రయోగానికి కొద్ది సెకన్ల ముందు మరోసారి సాంకేతిక లోపాన్ని గుర్తించి, ప్రయోగాన్ని నిలిపివేశారు. అగ్నికుల్ కాస్మోస్ ప్రైవేట్ లిమిటెడ్ (చెన్నై) అనే ప్రైవేటు ఎస్‌ఓఆర్ టీఈడీ మిషన్–01 అనే ఈ చిన్న తరహా రాకెట్‌ను రూపొందించింది.
సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్)లోని ధనుష్ రాకెట్ కాంప్లెక్స్ నుంచి ఈ ఏడాది మార్చి 22న తొలిసారి దీనిని ప్రయోగానికి సిద్ధం చేశారు. చివర్లో సాంకేతిక లోపంతో వాయిదా వేశారు. మళ్లీ ఏప్రిల్ నెల 6న మరోసారి ప్రయోగానికి సిద్ధమైనప్పటికీ, సాంకేతికపరమైన కారణాలు, వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో వాయిదా పడింది. వీటిన్నింటినీ అ«ధిగమించి మంగళవారం తెల్లవారుజామున 5.45 గంటలకు మరోసారి ప్రయోగానికి పూనుకొన్నారు. 6 గంటల ముందు నుంచి (సోమవారం అర్ధరాత్రి 12 గంటల నుంచి) కౌంట్‌డౌన్ ప్రారంభించారు. ఆఖర్లో 11 సెకన్లకు ముందు కమాండ్ కంట్రోల్ సిస్టంలో సాంకేతిక లోపం తలెత్తడంతో ప్రయోగాన్ని నిలిపివేశారు.తదుపరి ప్రయోగ తేదీని నిర్దిష్టంగా ప్రకటించలేదు.
Comments
Please login to add a commentAdd a comment