Private Space Agency
-
అగ్నిబాన్ రాకెట్ ప్రయోగం మరోసారి వాయిదా
సూళ్లూరుపేట (తిరుపతి జిల్లా): ప్రైవేటు అంతరిక్ష సంస్థకు చెందిన అగ్నిబాన్ రాకెట్ ప్రయోగం మరోసారి వాయిదా పడింది. సాంకేతిక లోపాల కారణంగా ఈ రాకెట్ ప్రయోగం గతంలో రెండుసార్లు వాయిదా పడింది. అందులో తలెత్తిన సాంకేతిక లోపాలను సరిదిద్ది మంగళవారం తెల్లవారు జామున ప్రయోగానికి సిద్ధం చేశారు. అయితే, ప్రయోగానికి కొద్ది సెకన్ల ముందు మరోసారి సాంకేతిక లోపాన్ని గుర్తించి, ప్రయోగాన్ని నిలిపివేశారు. అగ్నికుల్ కాస్మోస్ ప్రైవేట్ లిమిటెడ్ (చెన్నై) అనే ప్రైవేటు ఎస్ఓఆర్ టీఈడీ మిషన్–01 అనే ఈ చిన్న తరహా రాకెట్‌ను రూపొందించింది.సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్)లోని ధనుష్ రాకెట్ కాంప్లెక్స్ నుంచి ఈ ఏడాది మార్చి 22న తొలిసారి దీనిని ప్రయోగానికి సిద్ధం చేశారు. చివర్లో సాంకేతిక లోపంతో వాయిదా వేశారు. మళ్లీ ఏప్రిల్ నెల 6న మరోసారి ప్రయోగానికి సిద్ధమైనప్పటికీ, సాంకేతికపరమైన కారణాలు, వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో వాయిదా పడింది. వీటిన్నింటినీ అ«ధిగమించి మంగళవారం తెల్లవారుజామున 5.45 గంటలకు మరోసారి ప్రయోగానికి పూనుకొన్నారు. 6 గంటల ముందు నుంచి (సోమవారం అర్ధరాత్రి 12 గంటల నుంచి) కౌంట్‌డౌన్ ప్రారంభించారు. ఆఖర్లో 11 సెకన్లకు ముందు కమాండ్ కంట్రోల్ సిస్టంలో సాంకేతిక లోపం తలెత్తడంతో ప్రయోగాన్ని నిలిపివేశారు.తదుపరి ప్రయోగ తేదీని నిర్దిష్టంగా ప్రకటించలేదు. -
అరుదైన ప్రయోగం.. స్పేస్‌లోకి టిక్‌టాక్ స్టార్
కాలిఫోర్నియా: అమెరికన్ ప్రైవేట్ స్పేస్ కంపెనీ వర్జిన్ గెలాక్టిక్ అరుదైన ప్రయోగానికి రెడీ అయ్యింది. ఫ్లోరిడాకు చెందిన కెల్లీ గెరార్డియా అనే ఫేమస్ టిక్‌టాక్ స్టార్‌ను స్పేస్‌లోకి పంపేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. అయితే రకరకాల పరీక్షల కోసమే ఈ స్పేస్ ఆపరేషన్ నిర్వహించబోతున్నట్లు వర్జిన్ గెలాక్టిక్ వెల్లడించింది. కొత్త హెల్త్‌కేర్ టెక్నాలజీని ఆమెపై ప్రయోగించడం ద్వారా వాటి సానుకూలతపై ఓ స్పష్టతకు వస్తామని ఒక ప్రకటనలో వర్జిన్ గెలాక్టిక్ పేర్కొంది. కాగా, గెరార్డియాకు టిక్‌టాక్, ఇన్‌స్టాగ్రామ్‌లో బాగానే ఫాలోవర్స్ ఉన్నారు. అయితే ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఆమె బయోఆస్ట్రోనాటిక్స్ రీసెర్చర్ కావడం విశేషం. ఈ విషయాన్ని వర్జిన్ గెలాక్టిక్ శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. 32 ఏళ్ల కెల్లీ.. పాపులర్ సైన్స్ కమ్యూనికేటర్ అని తెలిపింది. ఇక స్పేస్‌షిప్‌లో గాల్లో తేలియాడుతూనే కెల్లీ, ఆరోగ్యపరమైన ప్రతీ ప్రయోగంలో పాలుపంచుకోబోతున్నట్లు తెలిపింది. అయితే ఆమె ప్రాణాలకు వచ్చే హాని ఏం ఉండదని వర్జిన్ గెలాక్టిక్ పేర్కొంది. ఇక ఈ స్పేస్‌క్రాఫ్ట్ ప్రయోగం ద్వారా బయోమానిటరింగ్(లాంఛ్, వెయిట్‌లెస్‌నెస్, రీ ఎంట్రీ) కెపాసిటీని పరీక్షించబోతున్నట్లు సమాచారం. తద్వారా రాబోయే రోజుల్లో మానవ సహిత వర్జిన్ గెలాక్టిక్ స్పేస్‌షిప్ ప్రయోగాల సాధ్యాసాధ్యాలపై మరో అడుగు ముందుకు వేయనుంది. ఇక ఈ ప్రయోగంపై గెరార్డియా స్పందిస్తూ.. ‘తన ప్రయత్నం మరికొందరు యువ రీసెర్చర్లను ముందుకు తీసుకొస్తుందని’ ఆశాభావం వ్యక్తం చేసింది. బ్రిటిష్ బిలియనీర్ రిచర్డ్ బ్రాన్సన్, అమెరికా రిటైర్డ్ ఏరోస్పేస్ ఇంజినీర్ బర్ట్ రూటన్ కలిసి స్థాపించిన వర్జిన్ గెలాక్టిక్.. వచ్చే ఏడాది నుంచి కమర్షియల్ సబ్-ఆర్బిటల్ ఫ్లైట్స్‌ను ప్రారంభించాలని నిర్ణయించుకుంది.ఈ క్రమంలో ఏడాదికి 400 ట్రిప్పులను లక్ష్యంగా పెట్టుకుంది. కాగా, ఈ కంపెనీ తరపున ఇటీవలె రాకెట్ తరహా విమానం వీఎంఎన్ ఈవ్ ద్వారా ఇద్దరు పైలైట్లు స్పేస్‌లోకి చేరుకున్న విషయం తెలిసిందే. ఇక వర్జిన్ గెలాక్టిక్ నుంచి స్పేస్‌లోకి వెళ్లేందుకు సెలబ్రిటీలతో సహా 600 మంది ఇప్పటికే రిజర్వేషన్లు చేసుకోవడం విశేషం. -
బూస్టర్ రాకెట్ ల్యాండింగ్ సక్సెస్
కేప్ కనావరెల్(యూఎస్): అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)కు సరుకులను మోసుకెళ్లే రాకెట్‌ను నింగిలోకి పంపాక బూస్టర్ రాకెట్‌ను ప్రైవేటు అంతరిక్ష సంస్థ ‘స్పేస్ఎక్స్’ తిరిగి విజయవంతంగా తొలిసారిగా సముద్ర జలాలపై తేలియాడే ప్లాట్‌ఫామ్‌పై ల్యాండ్ చేసింది. ప్రయోగించిన వెంటనే ప్రధాన రాకెట్ మరింత వేగంగా దూసుకుపోయేందుకు ఈ బూస్టర్ రాకెట్లు సాయపడతాయి. తర్వాతి దశలో ప్రధాన రాకెట్ నుంచి విడిపోయి సముద్రంలో పడేలా సాధారణంగా వీటిని డిజైన్చేస్తారు. ఐసిస్‌కు సరుకులను తీసుకెళ్లే ఫాల్కన్9 రాకెట్ శుక్రవారం కేప్ కనావరెల్ ప్రయోగ కేంద్రం నుంచి నింగిలోకి దూసుకుపోయాక ఈ బూస్టర్ రాకెట్ సముద్రంలోని ప్లాట్‌ఫామ్‌పై ల్యాండ్‌అయ్యింది. గతంలో ఇలా చేసిన పలు ప్రయోగాలు విఫలమయ్యాయి.