TikTok Star Kellie Geradi Will Sent To Space For New Healthcare Tech Testing - Sakshi
Sakshi News home page

అరుదైన అంతరిక్ష ప్రయోగం, ఆ టిక్​టాక్​ స్టార్​పై..​

Published Sat, Jun 5 2021 4:29 PM | Last Updated on Sat, Jun 5 2021 9:58 PM

New Healthcare Tech Test Virgin Galactic Send TikTok Star Kellie Gerardi - Sakshi

కాలిఫోర్నియా: అమెరికన్​ ప్రైవేట్ స్పేస్​ కంపెనీ వర్జిన్​ గెలాక్టిక్​ అరుదైన ప్రయోగానికి రెడీ అయ్యింది. ఫ్లోరిడాకు చెందిన కెల్లీ గెరార్డియా అనే ఫేమస్ టిక్​టాక్​ స్టార్​ను స్పేస్​లోకి పంపేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. అయితే రకరకాల పరీక్షల కోసమే ఈ స్పేస్​ ఆపరేషన్​ నిర్వహించబోతున్నట్లు వర్జిన్ గెలాక్టిక్​​ వెల్లడించింది. కొత్త హెల్త్​కేర్​ టెక్నాలజీని ఆమెపై ప్రయోగించడం ద్వారా వాటి సానుకూలతపై ఓ స్పష్టతకు వస్తామని ఒక ప్రకటనలో వర్జిన్​ గెలాక్టిక్​ పేర్కొంది.
 
కాగా, గెరార్డియాకు టిక్​టాక్​, ఇన్​స్టాగ్రామ్​లో బాగానే ఫాలోవర్స్ ఉన్నారు. అయితే ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఆమె బయోఆస్ట్రోనాటిక్స్​ రీసెర్చర్​ కావడం విశేషం. ఈ విషయాన్ని వర్జిన్​ గెలాక్టిక్​ శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. 32 ఏళ్ల కెల్లీ.. పాపులర్​ సైన్స్​ కమ్యూనికేటర్​ అని తెలిపింది. ఇక స్పేస్​షిప్​లో గాల్లో తేలియాడుతూనే కెల్లీ, ఆరోగ్యపరమైన ప్రతీ ప్రయోగంలో పాలుపంచుకోబోతున్నట్లు తెలిపింది. అయితే ఆమె ప్రాణాలకు వచ్చే హాని ఏం ఉండదని వర్జిన్​ గెలాక్టిక్​ పేర్కొంది.


 
ఇక ఈ స్పేస్​క్రాఫ్ట్​ ప్రయోగం ద్వారా బయోమానిటరింగ్(లాంఛ్​, వెయిట్​లెస్​నెస్​, రీ ఎంట్రీ​) కెపాసిటీని పరీక్షించబోతున్నట్లు సమాచారం. తద్వారా రాబోయే రోజుల్లో మానవ సహిత వర్జిన్​ గెలాక్టిక్​ స్పేస్​షిప్ ప్రయోగాల సాధ్యాసాధ్యాలపై మరో అడుగు ముందుకు వేయనుంది. ఇక ఈ ప్రయోగంపై గెరార్డియా స్పందిస్తూ.. ‘తన ప్రయత్నం మరికొందరు యువ రీసెర్చర్లను ముందుకు తీసుకొస్తుందని’ ఆశాభావం వ్యక్తం చేసింది. బ్రిటిష్​ బిలియనీర్​ రిచర్డ్​ బ్రాన్సన్, అమెరికా రిటైర్డ్​ ఏరోస్పేస్​ ఇంజినీర్ బర్ట్​ రూటన్ కలిసి​​ స్థాపించిన వర్జిన్​ గెలాక్టిక్​.. వచ్చే ఏడాది నుంచి కమర్షియల్​ సబ్​-ఆర్బిటల్​ ఫ్లైట్స్​ను ప్రారంభించాలని నిర్ణయించుకుంది.ఈ క్రమంలో ఏడాదికి 400 ట్రిప్పులను లక్ష్యంగా పెట్టుకుంది. కాగా, ఈ కంపెనీ తరపున ఇటీవలె రాకెట్ తరహా విమానం వీఎంఎన్​ ఈవ్​ ద్వారా ఇద్దరు పైలైట్లు స్పేస్​లోకి చేరుకున్న విషయం తెలిసిందే. ఇక వర్జిన్​ గెలాక్టిక్​ నుంచి స్పేస్​లోకి వెళ్లేందుకు సెలబ్రిటీలతో సహా 600 మంది ఇప్పటికే రిజర్వేషన్లు చేసుకోవడం విశేషం.

  ​

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement