దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని చాలామంది టపాసులు కాలుస్తారు. కొంతమంది సరైన నిబంధనలు పాటించకుండా వాటిని కాల్చి గాయాలపాలవుతారు. అలాంటి వారికోసం టెక్నాలజీ వినియోగించి టపాసులను నేరుగా ముట్టించకుండా కాల్చే విధానాన్ని ఇటీవల ఓ వ్యక్తి ప్రయోగించారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. అమెజాన్ ఏఐ అలెక్సాను ఉపయోగించి టపాసు పేల్చినట్లు ఉన్న ఈ వీడియోను ఇప్పటికే 1.3 కోట్ల మంది వీక్షించడం గమనార్హం.
ఇదీ చదవండి: టికెట్ బుక్ అవ్వకుండానే రూ.100 కట్! ఐఆర్‌సీటీసీ రిప్లై ఇదే..
హైటెక్ లాంచ్
మనీస్‌ప్రాజెక్ట్‌ల్యాబ్ అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ అప్‌లోడ్ చేసిన వీడియో ప్రకారం..అమెజాన్‌కు చెందిన ఏఐ అలెక్సాతో టపాసు రాకెట్‌ను అనుసంధానించారు. ‘అలెక్సా లాంచ్ ది రాకెట్’ అనే కమాండ్ ఇవ్వగానే అలెక్సా ‘యెస్ బాస్, లాంచింగ్ ది రాకెట్’ అని రిప్లై రావడంతోపాటు అప్పటికే రాకెట్ చివర నిప్పు రాజుకునేలా వైర్లతో ఏర్పాటు చేశారు. దాంతో అలెక్సా కమాండ్ స్వీకరించిన వెంటనే వైర్లలో కరెంట్ సరఫరా అయి నిప్పు రావడంతో రాకెట్ గాల్లోకి దూసుకెళ్లడం వీడియోలో గమనించవచ్చు. ఇంట్లో చిన్న పిల్లలకు ఈ విధానం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని నెటిజన్లు స్పందిస్తున్నారు. ఇంకొందరు ఈ ప్రయోగం చేసిన వ్యక్తి ఇండియన్ ఇలాన్‌మస్క్ అని సరదాగా రిప్లై ఇస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఇప్పటికే ఈ వీడియోను 13 మిలియన్ల మంది వీక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment