Cracker Explosion
-
అలెక్సా చెబితే టపాసు వింటోంది!
దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని చాలామంది టపాసులు కాలుస్తారు. కొంతమంది సరైన నిబంధనలు పాటించకుండా వాటిని కాల్చి గాయాలపాలవుతారు. అలాంటి వారికోసం టెక్నాలజీ వినియోగించి టపాసులను నేరుగా ముట్టించకుండా కాల్చే విధానాన్ని ఇటీవల ఓ వ్యక్తి ప్రయోగించారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. అమెజాన్ ఏఐ అలెక్సాను ఉపయోగించి టపాసు పేల్చినట్లు ఉన్న ఈ వీడియోను ఇప్పటికే 1.3 కోట్ల మంది వీక్షించడం గమనార్హం.ఇదీ చదవండి: టికెట్ బుక్ అవ్వకుండానే రూ.100 కట్! ఐఆర్సీటీసీ రిప్లై ఇదే..హైటెక్ లాంచ్మనీస్ప్రాజెక్ట్ల్యాబ్ అనే ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ అప్లోడ్ చేసిన వీడియో ప్రకారం..అమెజాన్‌కు చెందిన ఏఐ అలెక్సాతో టపాసు రాకెట్‌ను అనుసంధానించారు. ‘అలెక్సా లాంచ్ ది రాకెట్’ అనే కమాండ్ ఇవ్వగానే అలెక్సా ‘యెస్ బాస్, లాంచింగ్ ది రాకెట్’ అని రిప్లై రావడంతోపాటు అప్పటికే రాకెట్ చివర నిప్పు రాజుకునేలా వైర్లతో ఏర్పాటు చేశారు. దాంతో అలెక్సా కమాండ్ స్వీకరించిన వెంటనే వైర్లలో కరెంట్ సరఫరా అయి నిప్పు రావడంతో రాకెట్ గాల్లోకి దూసుకెళ్లడం వీడియోలో గమనించవచ్చు. ఇంట్లో చిన్న పిల్లలకు ఈ విధానం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని నెటిజన్లు స్పందిస్తున్నారు. ఇంకొందరు ఈ ప్రయోగం చేసిన వ్యక్తి ఇండియన్ ఇలాన్‌మస్క్ అని సరదాగా రిప్లై ఇస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఇప్పటికే ఈ వీడియోను 13 మిలియన్ల మంది వీక్షించారు. View this post on Instagram A post shared by Mani's Projects Lab (@manisprojectslab) -
బండిపై పేలిన టపాసులు.. ముక్కలు ముక్కలుగా
-
రైలులో అగ్ని ప్రమాదం.. ప్రయాణికులకు గాయాలు
చండీగఢ్:హర్యానాలోని రోహ్తక్లో కదులుతున్న రైలులో బాణసంచాకు మంటలంటుకున్నాయి.ఈ ప్రమాదంలో రైలులో ప్రయాణిస్తున్న పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. జింద్ నుంచి ఢిల్లీ వెళుతున్న రైలులో తొలుత మంటలు లేచాయని, తర్వాత రైలు మొత్తం పొగచూరిందని జీఆర్పీ పోలీసులు తెలిపారు.రైలులో షార్ట్‌సర్క్యూట్ కారణంగా తొలుత మంటలు లేచాయని, ఈ మంటలు రైలులో ఉన్న ఓ ప్రయాణికుడి వద్ద ఉన్న బాణసంచాకు అంటుకోవడంతో అగ్ని ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా తేల్చారు. పోలీసులు కేసు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇదీ చదవండి: గుడిలో బాణసంచా ప్రమాదం.. 150 మందికి గాయాలు -
బాణాసంచా ఫ్యాక్టరీలో ప్రమాదం, ఆరుగురు మృతి
చెన్నై : తమిళనాడులోని శివకాశిలో గురువారం సాయంత్రం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇప్పటి వరకు ఆరుగురు ప్రాణాలు కోల్పోగా దాదాపు 14 మందికి గాయాలయ్యాయి. విరుదునగర్ జిల్లా శివకాశి సమీపంలోని కాళైయ్యర్‌కురిచ్చిలో ఓ ప్రైవేటు బాణాసంచా తయారీ పరిశ్రమలో ఫ్యాన్సీ రకానికి చెందిన టపాసులు తయారు చేస్తున్నారు. ఈ క్రమంలో గురువారం భారీ స్థాయిలో ప్రమాదం సంభవించి పది గదులు నేలమట్టమయ్యాయి. పేలుడు ధాటికి అక్కడే పనిచేస్తున్న ఆరుగురు కూలీలు మృత్యువాతపడగా.. 14 మందికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. శరీరాలు బాగా కాలిపోవడంతో మృతులను వెంటనే గుర్తించడం సాధ్యం కాలేదు. వరుసగా పేలుళ్లు చోటుచేసుకోవడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. క్షతగాత్రులను శివకాశి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా శివకాశి పరిసర ప్రాంతాల్లో గత రెండు వారాల్లో మూడు పేలుడు ఘటనలు జరిగాయి. ఈ నెల 12న అచ్చంకుళంలోని ఓ బాణ సంచా ఫ్యాక్టరీలో జరిగిన పేలుడులో 23 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలో బాణసంచా పరిశ్రమల క్రమబద్ధీకరణకు తీసుకుంటున్న చర్యలపై నివేదిక అందించాలని మధురై హైకోర్టు తమిళనాడు ప్రభుత్వాన్ని ఈ రోజు మధ్యాహ్నమే ఆదేశించింది. చదవండి: బంజారాహిల్స్‌లో బీఎండబ్ల్యూతో ఉడాయించిన డ్రైవర్ సంచలన విషయాలు వెల్లడించిన బిట్టు శ్రీను! -
బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు.. ఒకరు మృతి
చంఢీగడ్: హరియాణలోని కర్నాల్ నగరంలో మంగళవారం రాత్రి ఓ బాణసంచా తయారీ కర్మాగారంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరో ముగ్గురి శరీరాలు కాలిపోయి తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పారు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం రాత్రి 9.30 గంటలకు ఘోగ్రిపూర్ రోడ్డు సమీపంలోని బాణసంచా తయారీ కర్మాగారంలో భారీ శబ్ధం, మంటలతో పేలుడు జరిగింది. ఈ ప్రమాదంలో ఒక మృతి చెందగా.. ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంలో మరణించి వ్యక్తి మృత దేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గాయపడిన ముగ్గురిని శివం కుమార్(28), విజయ్ పాల్(22), విజయ్ కుమార్(25)గా గుర్తించారు. వారంతా వలస కార్మికులని తెలిపారు. ఈ ప్రమాదంతో బాణసంచా కర్మాగారంలోని అధిక భాగం మంటల్లో కాలిపోయినట్లు తెలుస్తోంది. బాణసంచా కర్మాగారం యాజమాని రాకేష్ కుమార్ మాట్లాడుతూ.. పేలుడు సంభవించిన సమయంలో మృతి చెందిన వ్యక్తితో పాటు మరో ముగ్గురు బాణసంచా తయారీ విభాగాన్ని శుభ్రం చేస్తున్నట్లు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతి చెందిన వ్యక్తి ఎవరనేది ఇంకా తెలియలేదన్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. చదవండి: కారు టైరు పేలి.. ఏడుగురు అక్కడికక్కడే -
ఘోరం జరిగిన వేళ స్పందించే తీరు ఇదేనా?
పిఠాపురం :‘ఇది కనీవినీ ఎరుగని ప్రమాదం. ఇంత దారుణం జరిగితే ప్రభుత్వం స్పందించిన తీరు బాధాకరం. మీకోసం సర్కారుపై పోరాడుతా’ అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షులు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి వాకతిప్ప విస్ఫోట బాధితులకు ధైర్యం చెప్పారు. బుధవారం ఆయన కొత్తపల్లి మండలం వాకతిప్పలో బాధిత కుటుంబాలను పరామర్శించారు. కాకినాడ నుంచి పండూరు మీదుగా పెదకలవల దొడ్డి వచ్చిన ఆయన ఆ గ్రామానికి చెందిన మృతుడు పిల్లి వీర మణికంఠస్వామి తల్లి కామేశ్వరి, తండ్రి సత్తిబాబు, మరో మృతుడు దమ్ము గుర్రయ్య భార్య మంగ, కుమార్తెలు విమలాదేవి, ప్రమీలలను ఓదార్చారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కాకినాడ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కుక్కల శ్రీను భార్య రమణమ్మను, కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం నిదానందొడ్డి వెళ్లి మృతులు తుట్టా మంగ, ఆమె కుమారుడు సత్తిబాబుల కుటుంబ సభ్యులైన చంద్రరావు, నూకరత్నం, చినతల్లిలను ఊరడించారు. రాయుడు రాఘవ, మేడిశెట్టి నూకరత్నం, తుట్టా నాగమణి కుటుంబసభ్యులను పరామరిచారు. జగన్‌ను చూడగానే బాధితులు బావురుమన్నారు. వారి దుఃఖాన్ని చూసి చలించిన ఆయన వారిని అక్కున చేర్చుకుని, అనునయించారు. ‘అందరికీ అండగా ఉంటా. ఎవరు అధైర్యపడొద్దు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి అందరికీ న్యాయం జరిగేలా కృషి చేస్తాను’ అని భరోసా ఇచ్చారు. ప్రభుత్వం నిరుపేదలకు ఉపాధి కల్పించడంలో విఫలమైందని జగన్ వ్యాఖ్యానించారు. దుర్ఘటన స్థలంలో చలించిన జగన్ అనంతరం కొత్తపల్లి మీదుగా వాకతిప్ప చేరుకున్న ఆయన విస్ఫోటం జరిగిన స్థలాన్ని పరిశీలించారు. అక్కడి పరిస్థితి, కాలిపోయిన చెట్లు, వరిపొలం చూసి చలించిపోయారు. ‘ప్రమాదం కనీవినీ ఎరుగనిది. ఇంత దారుణం జరిగినా ప్రభుత్వం సక్రమంగా స్పందించలేదు’ అని ఆవేదనగా అన్నా రు. అక్కడి నుంచి వాకతిప్ప ఎస్సీ పేటకు చేరుకున్న జగన్ ప్రమాదంలో మృతి చెందిన మసకపల్లి గంగ, మసకపల్లి అప్పయ్యమ్మ, మసకపల్లి విజయకుమారి, మసకపల్లి కుమారి, ద్రాక్షారపు కాంతం, ద్రాక్షారపు చినతల్లి, అద్దంకి నూకరత్నం, మసకపల్లి పుష్ప, ఉలంపర్తి కామరాజు, ఉండ్రాజపు కీర్తిల కుటుంబసభ్యులను పరామర్శించారు. అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. బాధితులను ఆదుకోవడంలో అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమైందన్నారు. బాధితులకు అండగా ఉండాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు సూచించారు. జగన్ వెంట ప్రత్తిపాడు, తుని, రంపచోడవరం ఎమ్మెల్యేలు వరుపుల సుబ్బారావు, దాడిశెట్టి రాజా, వంతల రాజేశ్వరి, ఎమ్మెల్సీలు ఆదిరెడ్డి అప్పారావు, బొడ్డు భాస్కరరామారావు, వైఎస్సార్ కాంగ్రెస్ సీఈసీ సభ్యులు పిల్లి సుభాష్‌చంద్రబోస్, సీజీసీ సభ్యులు జక్కంపూడి విజయలక్ష్మి, కుడుపూడి చిట్టబ్బాయి, మాజీ మంత్రి పినిపే విశ్వరూప్, జెడ్పీ ప్రతిపక్ష నేత జ్యోతుల నవీన్, మాజీ ఎంపీ గిరజాల వెంకటస్వామినాయుడు, మాజీ ఎమ్మెల్యేలు ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, పెండెం దొరబాబు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జక్కంపూడి రాజా, రాజమండ్రి కార్పొరేషన్లో పార్టీ ఫ్లోర్‌లీడర్ మేడపాటి షర్మిలారెడ్డి, వివిద నియోజకవర్గాల కో ఆర్డినేటర్లు డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి, చెల్లుబోయిన వేణు, గుత్తుల సాయి, కొండేటి చిట్టిబాబు, తోట సుబ్బారావు నాయుడు, ఆకుల వీర్రాజు, అనుబంధ విభాగాల కన్వీనర్లు అనంత ఉదయభాస్కర్, కర్రి పాపారాయుడు, రావూరి వెంకటేశ్వరరావు, డాక్టర్ యనమదల మురళీ కృష్ణ, సేవాదళ్ రాష్ట్ర కార్యదర్శి సుంకర చిన్ని, కాకినాడ నగర కన్వీనర్ ఫ్రూటీ కుమార్, నాయకులు గంపల వెంకటరమణ, పట్టాభిరామయ్య చౌదరి, వట్టికూటి రాజశేఖర్, అల్లి రాజు, నక్కా రాజబాబు, ఆదిరెడ్డి వాసు, చెల్లుబోయిన శ్రీనివాస్, సబ్బెళ్ల రామకృష్ణారెడ్డి, వాసిరెడ్డి జమీలు, తాడి విజయ భాస్కరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
భువనగిరిలో బాణసంచా పేలుడు, ఇద్దరు సజీవ దహనం!
భువనగిరి: ఓ ఇంట్లో నిలువ చేసిన బాణసంచా పేలిన ఘటనలో ఇద్దరు వ్యక్తులు మరణించారు. ఈ ఘటన నల్లగొండ జిల్లా భువనగిరిలోని ఆర్బీనగర్ లో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు సజీవదహనమైనట్టు సమాచారం. ఈ దుర్ఘటనలో గాయపడిన వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. దీపావళి పండగ కోసం ఓ వ్యాపారి పెద్ద ఎత్తున తన నివాసంలో నిల్వ చేసిన బాణసంచా ప్రమాదవశత్తూ పేలడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది.