అలెక్సా వాయిస్ అసిస్టెంట్: రోజుకు లక్షలాదిమంది భారతీయ యూజర్లు
భారతదేశంలోఅలెక్సాఎన్నోకుటుంబాల్లోభాగమైపోయింది. ఈ సందర్భంగాభారతదేశంలోఅలెక్సాప్రయాణం, స్టార్ హోంని ఇక్కడివారు ఉపయోగించే తీరు, కీలకమైలురాళ్ల వినియోగదారులఫీడ్బ్యాక్పై అలెక్సా, అమెజాన్ఇండియా కంట్రీమేనేజర్ దిలీప్ మాటల్లోని కీలక అంశాలు:
1) భారతదేశంలో అలెక్సాప్రయాణంమొదలై అప్పుడే 4 ఏళ్లుపూర్తయ్యాయి. ఈ ప్రయాణం ఎలా సాగింది?
ఇవాళ్టి రోజున భారతదేశంలోని ఎన్నో కుటుంబాల్లోని రోజువారీ పనుల్లో అలెక్సా భాగమైంది. వందలమంది వినియోగ దారులు ఎకో పరికరాలను కొనుగోలు చేశారు. అంతేకాదు ప్రతివారం లక్షలసార్లు అలెక్సా వాయిస్అ సిస్టెంట్తో ఇంటరాక్ట్ అవుతున్నారు.
వినియోగదారులు రోజంతా వివిధ కారణాలకు అలెక్సాను ఉపయోగిస్తారు. సంగీతం వినడం, చేయాల్సిన పనుల జాబితాలను సిద్ధం చేసుకోవడం, వాటిని త్వరితగతిన పూర్తిచేయడం, అలార సెట్ చేయడం, పిల్లల కథలు చెప్పడం, స్మార్ట్ లైట్లు ఉపయోగించడం, ఉపకరణాలను నియంత్రించడం, ఆడియోబుక్‌లను ప్లే చేయడం, వాతావరణం, క్రికెట్ స్కోర్ అడగడం, రోజువారీ న్యూస్.. ఒక్కటేమిటీ సమస్తం ఇప్పుడు అలెక్సా ద్వారానే తెలుసుకుంటున్నారు. ఏ ఇతర దేశంతో పోల్చినా, ప్రపంచంలో అత్యంత ఎక్కువమంది వినియోగదారులున్న దేశం భారతదేశమే.
వినియోగదారులు “అలెక్సా, ఐలవ్యూ అని చెప్పడం ద్వారా లేదా “అలెక్సా, ఎలా ఉన్నావ్ఙు అని రోజులో చాలాసార్లు అడగడంద్వారా తమ ప్రేమను వ్యక్తం చేయడం కూడా ఈ సందర్భంగా చాలా ఆనందాన్ని ఇస్తుంది.
కొంతమంది కొత్త టెక్నాలజీ రాగానే దాన్ని స్వాగతిస్తారు
అలెక్సాను కూడా అందరూ ఇలా స్వాగతించినప్పుడు మేం కూడా ఇది ప్రారంభ దశ కాబట్టి అనుకున్నాం. కానీ ఆ తర్వాతే అద్భుతం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా అలెక్సాను ప్రతీఒక్కరూ గొప్పగా స్పీకరించారు. ఈ పరిణామాన్నిచూసి మేం కూడా చాలా ఆశ్చర్యపోయాం. మాకు పెద్దనగరాలనుంచే కాకుండా చిన్నగ్రామాల నుంచి కూడా వినియోగదారులు ఉన్నారు. అలెక్సా వాయిస్ అసిస్టెంట్,అమెజాన్ఎ కోస్మార్ట్స్పీకర్లతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వినియోగదారులు ప్రతీరోజూ ఇంటరాక్ట్ అవుతున్నారు. ఈ 2 రాష్ట్రాల్లో అమెజాన్ఎకో కస్టమర్ల సంఖ్య గత రెండేళ్లలో 48% పెరిగింది. ఈ జాబితాలో హైదరాబాద్ అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాతిస్థానాల్లోవిశాఖపట్నం, గుంటూరు, మెదక్, చిత్తూరు నెల్లూరు నగరాలున్నాయి. మరోవైపు ఎప్పటికప్పుడు లేటస్ట్ గాడ్జెట్లను కోరుకునే యువకులు రోజురోజుకి పెరుగుతూనే ఉన్నారు. ఇంకోవైపు అలెక్సాను ఉపయోగించే పెద్దవాళ్లు కూడాపెరుగుతున్నారు. వీటితో పాటు గ్రామీణప్రాంతాల్లో ఉండే పాఠశాల ఉపాధ్యాయులు తరగతిగదుల్లో ఎకో స్మార్ట్స్పీకర్లను ఉపయోగించి బోధన చేస్తున్నారు. దీన్నిబట్టే మనం అర్థం చేసుకోవచ్చు భారతదేశంలో రోజురోజుకి అలెక్సా వినియోగం పెరుగుతోందని.
2) వినియోగదారులకు అలెక్సా వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయన్న విషయాన్ని అందరికి తెలిసేందుకు ఏ కార్యక్రమాలుచేపట్టారు.?
భారతదేశంలోని వినియోగదారులకు అలెక్సా వాయిస్ అసిస్టెంట్‌ని మరింత చేరువ చేసేందుకు మేము అన్ని వేళలా మా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాము. గత 4 ఏళ్లలో స్థానిక విషయ పరిజ్ఞానం, క్రికెట్, భారతీయచరిత్ర, పండుగలు, బాలీవుడ్ లాంటి సగటు భారతీయులు ఇష్టపడే సమాచారాన్ని ఎప్పటికప్పుడు అలెక్సా ద్వారా అందిస్తూనే ఉన్నాము.
ఉదాహరణకు, మీరు అలెక్సాను చార్మినార్, బాలీవుడ్ డైలాగులు, దీపావళి గురించి ప్రశ్నలు లేదా రామాయణం, మహాభారతం వంటి పురాణాల గురించి, నిర్దిష్ట నగరం/ వ్యక్తిత్వం గురించి సమాచారాన్ని ఎన్నింటినో అడగవచ్చు. తెలుసుకోవచ్చు. ఇక సంగీతం, పాటలు విషయానికివస్తే అలెక్సా ఇచ్చేంత ఎంటర్టైన్మెంట్ మరెవ్వరూ ఇవ్వరంటే అతిశయోక్తికాదు. అలెక్సాను ఎక్కువమంది సంగీతం లేదా పాటలు వినడానికి ఎక్కువగా ఉపయోగిస్తారు. హిందీ, మరాఠీ, గుజరాతీ, కన్నడ, బెంగాలీ, తమిళం, తెలుగు మొదలైన అనేక భారతీయ భాషల్లోని పాటలపేర్లను అలెక్సా అర్థం చేసుకోగలదు.
హైదరాబాదీలు అలెక్సాను ఉపయోగించి అమెజాన్ ప్రైమ్ మ్మ్యూజిక్లో తెలుగు సినిమా పాటలను వినడానికి ఇష్టపడతారు. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో ట్రెండింగ్‌లో ఉన్నటాప్ 10 పాటల్లో ఐదు తెలుగుసినిమా పాటలే. సర్కారువారి పాట సినిమాలోని’ కళావతి’, పుష్పసినిమాలోని ’ఊ అంటావా ఊహూ అంటావా’ అలాగే ’శ్రీవల్లి’ పాట, డీజేటిల్లు సినిమాలోని’ టిల్లు అన్న డీజే పెడితే’ పాటలు టాప్ పొజిషన్లో ఉన్నాయి. ఇక ఆర్ఆర్ఆర్ నుంచి ’నాటునాటు’ పాట కూడా ఎక్కువమంది వినియోగదారులు కోరుకునే పాటల లిస్ట్‌లో ఉంది. ఇదివరకు పాట ప్లే చేయాలంటే చాలా వస్తువుల్నిఆపరేట్ చేయాల్సి వచ్చేది. ఇప్పుడు హ్యాండ్ ఫ్రీ. జస్ట్ ఒక్కమాటతో నచ్చిన పాట హ్యాపీగా వినవచ్చు.
ఇక క్రికెట్ సీజన్లలో ఆటగాళ్లు, మ్యాచ్‌ల గురించిన లేటెస్ట్ అప్డేట్స్ని స్కోర్‌ని ఎప్పటికప్పుడు అందించేందుకు అలెక్సా సిద్ధంగా ఉంటుంది. ఐపీఎల్ సీజన్లో, మీరు “అలెక్సా, సన్‌రైజర్స్ హైదరాబాద్ తర్వాతి మ్యాచ్ఎప్పుడు? అని అడగవచ్చు. తద్వారా మీరు మరో మ్యాచ్ మిస్ అయ్యే అవకాశమే ఉండదు. ఇక వంటల కోసం సంజీవ్ కపూర్, లొకేషన్స సమాచారం కోసం మ్యాప్ మైఇండియా, ఇంటరాక్టివ్ పద్ధతిలో ఇంగ్లీష్ నేర్చుకోవడం కోసం మ్యాక్మిలన్ ఉండనే ఉన్నాయి. భారత దేశానికి చెందిన కథలు కంటెంట్ కోసం ఆడిబుల్సు వంటి అనేక స్థానిక కంటెంట్ ప్రొవైడర్లతో కూడా అలెక్సా కలిసి పని చేస్తుంది. ఉదాహరణకు, మీరు “అలెక్సా, బిర్యానీకోసం రెసిపీని ఇవ్వండి’ అని అడగవచ్చు. వినియోగ దారులు అలెక్సాను భజనలు, కీర్తనల్ని అందించమని అడగవచ్చు. అమరగాయకురాలు ఎమ్.ఎస్.సుబ్బులక్ష్మి పాడిన‘ విష్ణు సహస్రనామాన్ని’ హైదరాబాద్‌నుంచి ఎక్కువమంది కోరుకుంటున్నారు.
వినియోగదారులు ఫైర్ టీవీ ఎకోషో పరికరాలలో అలెక్సాని అడగడం ద్వారావారికి ఇష్టమైన టీవీ కార్యక్రమాలు సినిమాలను చూస్తున్నారు. ఫైర్ టీవీలో, అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్, హాట్‌స్టార్, యాపిల్ టీవీ, యూట్యూబ్, జీ 5, వూట్ వంటి కంటెంట్‌ను అలెక్సాలోవాయిస్ కమాండ్ ద్వారాఈజీగాచూసేయవచ్చు. “అలెక్సా, తెలుగు సినిమాలు ప్లే చెయ్ అని అడిగితే వాటి అన్నింటిని అలెక్సా అందిస్తుంది.
ఇక ప్రైమ్ వీడియోలో 2022లో అత్యధికంగా ఎక్కువమంది చూసిన సినిమా పుష్ప: దిరైజ్, రాధేశ్యామ్, సర్కారువారిపాట, ఆచార్య, కేజీఎప్ చాప్టన్ 2. ఇంట్లోనే ఎక్కువగా ఉండే వ్యక్తులు గతరెండేళ్లలో వినోదం, ఫిట్నెస్, గేమింగ్‌కు సంబంధించిన కంటెంట్‌ను పొందడానికి ప్రతిరోజూ లక్షలసార్లు అలెక్సాతో ఇంటరాక్ట్ అయ్యారు.
3) భారతదేశంలోస్మార్ట్హోం అడాప్షన్ గురించి మీ అభిప్రాయం?
రోజురోజుకి పెరుగుతోన్న సాంకేతికత మానవజీవనశైలిపై ఎంతో ప్రభావం చూపించింది. ఒకప్పుడు గంటలో చేసేపని ఇప్పుడు నిమిషాల్లోకి మారి పోయింది. దీంతో చాలామందిమారుతున్నటెక్నాలజీకి తగ్గట్లుగా వారు కూడా మారుతున్నారు. తమ చుట్టూ ఉన్న పరిసరాలను కూడా మార్చు కుంటున్నారు. ఇలాంటి సమయంలో అందరికి ఎంతగానే ఉపయోగ పడుతోంది స్మార్ట్ హోమ్ కాన్సెప్ట్. భారతదేశంలో స్మార్ట్‌హోం అడాప్షన్, న్యూస్ ట్రెండ్లను అర్థం చేసుకోవడానికి ఇటీవల ఒక అధ్యయనాన్ని నిర్వహించాం. టెక్ ఆర్క్‌తో కలిసి ఈ అధ్యయనాన్ని చేశాము. దాదాపు 92శాతం మంది వినియోగదారులు స్మార్ట్ హోంని సెటప్ చేయడానికి వాయిస్ కమాండ్ తమకు అనుకూలంగా మారిందని చెప్పారు. అలెక్సాతో స్మార్ట్ గృహో పకరణాలను నియంత్రించడం ఒక అద్భుత అనుభవం అని అందరూ ఒప్పుకున్నారు. కొత్త టెక్నాలజీని ప్రయత్నించాలనే కోరిక కారణాన్ని90శాతం కంటే ఎక్కువమంది వినియోగ దారులు వెలిబుచ్చారు. అందువల్లే గత రెండేళ్లలో చాలామంది తమ తొలి స్మార్ట్ఫోన్లను కొనుగోలు చేశారని టెక్ఆర్క్ అధ్యయనం పేర్కొంది.
అలెక్సాతో పనిచేసే గృహోపకరణాలఎంపికను 72శాతం పెంచడానికి భారతదేశంలోని బహుళ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లతో కొన్ని సంవత్సరాలు పనిచేశాము. ఇవాళ్టి రోజున బల్బులు, ప్లగ్‌లు, లాక్‌లు, కెమెరాలు, సీలింగ్ ఫ్యాన్లు, టీవీలు, ఎయిర్ కండిషనర్లు, ఎయిర్ ప్యూరిఫైయర్లు మొదలైన విభిన్న వర్గాలను కవర్చేసే అలెక్సాకు అనుకూలమైన వేలాది స్మార్ట్‌ఫోన్ పరికరాలు రూ. 500 నుంచి రూ. 1,50,000 వరకు ఉన్నాయి. మీరు ఎకోబండిల్తో పాటు రూ.50 కంటే తక్కువధరకే స్మార్ట్ బల్బును కూడా పొందవచ్చు. ఎక్కువ ఉత్పత్తులు, ధర తక్కువగా కూడా ఉండడంతో వినియోగ దారులు తమ స్మార్ట్‌ఫోన్ ప్రయాణాన్ని ప్రారంభించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అన్నింటికి మించి అలెక్సాతో హ్యాండ్స్ ఫ్రీ కంట్రోల్ ఆప్షన్ కూడ మ్యాజిక్‌లా పనిచేస్తూ అందరికి సౌకర్యంగా మారిపోయింది.
4) మీరు సాధించిన కీలకమైలురాళ్లుఏమిటి?
భారతదేశంలో అలెక్సా ప్రయాణంచాలా ఆసక్తికరంగాఉంది. గతకొన్నేళ్లుగా మేము రోజువారీ పనులను సులభతరం చేయడమే కాకుండా, ఇక్కడి వినియోగదారులు ఇష్టపడే ఫీచర్లు నైపుణ్యాలను తీసుకురావడానికి చాలా కష్టపడ్డాము.
గత నాలుగేళ్లలో, అలెక్సా అనేక మైలురాళ్లను సాధించింది. మొదట్లో అలెక్సా హిందీలో అందుబాటులో ఉండటంవల్ల సానుకూల స్పందన వచ్చింది. ఇవాళ్టిరోజున, భారత దేశం నుంచి వినియోగదారులు హిందీ హింగ్లీష్‌లలో అలెక్సాకు రోజుకు వందల, వేల అభ్యర్థనలు చేస్తారు. చుట్కులే, షాయారీలు, కహానియా, కబీర్ కేదోహే, పంచతంత్ర కథలు, బాలీవుడ్ డైలాగ్‌లు వంటి విభిన్న హిందీకంటెంట్కో సంఅలెక్సాను అడగడం ఆనందిస్తున్నారు.
అలెక్సాలో బిల్ చెల్లింపులు మరో కీలకమైన అంశం. అలెక్సాఇన్బిల్ట్గా ఉన్న ఏదైనా ఎకోడివైజ్ ద్వారా కమాండ్ ఇస్తే చాలు అప్పటికప్పుడు హ్యాండ్స్ ఫ్రీగా చెల్లింపులు చేయవచ్చు. ఇందులో విద్యుత్, వాటర్, పోస్ట్పెయిడ్మొబైల్, వంట గ్యాస్, బ్రాడ్ బ్యాండ్, డీటీహెచ్ మరిన్నిబిల్లులు ఉంటాయి. కొత్త బిల్లుబకాయి ఉన్నప్పుడు అలెక్సా మీకు గుర్తు చేస్తుంది కాబట్టి ఇది ఎక్కువగా ఉపయోగించే ఫీచర్లలో ఒకటి.
అమెజాన్ షాపింగ్ యాప్‌లో అలెక్సాను చేర్చడం ఇండియాలో మరో మైలురాయి. గతేడాది, అలెక్సా షాపింగ్ యాప్‌లో 2వేల కొత్త వ్యక్తులతో ఇంటరాక్ట్ అయింది, కస్టమర్లు ఉత్పత్తులను కనుగొనడంలో, ఉత్పత్తి సంబంధిత ప్రశ్నలకు సమాధానమివ్వడంలో, షాపింగ్ చేసేటప్పుడు వారికిష్టమైన సంగీతాన్నివినడంలో, తాజా వార్తలను పొందడంలో మరిన్నింటికి సహాయం చేయడానికి ప్రతిరోజూ 8.6 లక్షల ప్రశ్నలకు,సమాధానం ఇచ్చింది. ప్రస్తుతం ఈ ప్రశ్నల సంఖ్య రోజుకు 13.8 లక్షలకు పెరిగింది.
అలెక్సాలో లెజెండరీ యాక్టర్ అమితాబ్ బచ్చన్ వాయిస్ మా అత్యంత ఉత్తేజకరమైన లాంచ్‌లలో ఒకటి. ఈ ఫీచర్ ద్వార ఆయన జీవితంలోని విశేషాలు సినిమాలు, జోకులు, ఇన్స్పిరేషనల్ కోట్స్, కవితలు, టంగ్ ట్విస్టర్లు, సంగీతం లాంటి వాటిని ఆయనస్వరంతో అందిస్తుంది. వినియోగదారులు అమిత్ జీతో సంభాషించడాన్నిఇష్టపడతారు. కేవలం ‘‘కిత్నీ ఆద్మీ థే’’ తో ప్రారంభమయ్యే సరదా సంభాషణల నుండి షోలేకథలు, ఆయన బాల్యం సినిమాలలో ఆయన ప్రయాణం గురించి, అభిమానులు తెలుసుకో గలుగు తున్నారు. అంతేకాకుండా మహీంద్రా ఎక్స్యువీ700 అలెక్సా ఇంటిగ్రేషన్‌తో తయారైన దేశీయ తొలివాహనం. కేవలం అలెక్సాను అడగడం ద్వారా ఎక్స్యువీ700 వినియోగదారులు కిటికీలు క్యాబిన్ ఉష్ణోగ్రతతో సహా వాహన ఫంక్షన్లను నియంత్రించవచ్చు. పాటలు ప్లే చేయవచ్చు, ఆడియో బుక్‌లు వినవచ్చు, అలాగే నేవిగేషన్ను కూడా పొందవచ్చు. వీటితోపాటు ట్రాఫిక్‌ను చెక్ చేసుకోవచ్చు, స్మార్ట్ హోంను కూడా నిర్వహించుకోవచ్చు. పార్కింగ్ కూడా ఎక్కడ ఉందో తెలుసు కోవచ్చు. అలెక్సా ఉంటే చాలు మనకళ్లు రోడ్డపై ఉంటాయి, చేతులు స్టీరింగ్‌పై ఉంటాయి. హ్యాపీగా ఎలాంటి ఇబ్బందులు, టెన్షన్ లేకుండా వెహికల్ డ్రైవ్ చేసుకోవచ్చు. (అడ్వర్టోరియల్)
గమనిక : sakshi.com నందు వచ్చే ప్రకటనలు అనేక దేశాలు, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుంచి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్తతో ఉత్పత్తులు లేదా సేవల గురించి విచారించి కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు/సేవల నాణ్యత, లోపాల విషయంలో సాక్షి యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈవిషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు తావు లేదు.