సాక్షి, తాడేపల్లి: ఎస్‌ఎస్‌ఎల్‌వీ డీ2 రాకెట్ ప్రయోగం విజయవంత కావడం పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. మూడు ఉపగ్రహాలను ఒకేసారి కక్ష్యలోకి ప్రవేశపెట్టి ఇస్రో విజయం సాధించడంపై సైంటిస్టులకు సీఎం జగన్ అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో ఇస్రో మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నట్లు సీఎం జగన్ పేర్కొన్నారు.
కాగా, శ్రీహరికోట నుంచి ఎస్‌ఎస్‌ఎల్‌వీ డీ2 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రయోగంలో ఎస్‌ఎస్‌ఎల్‌వీ డీ2.. మూడు ఉప గ్రహాలను అంతరిక్షంలోకి మోసుకెళ్లింది. కాగా, 13 నిమిషాల 2 సెకన్లలో రాకెట్ ప్రయోగం పూర్తికానుంది. దీని ద్వారా 2 దేశీయ, అమెరికాకు చెందిన ఒక ఉపగ్రహం కక్షలోకి చేరుకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment