ఇస్రోకు వైఎస్‌ జగన్‌ అభినందనలు | YSRCP YS Jagan Praised ISRO Over Success | Sakshi
Sakshi News home page

ఇస్రోకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

Published Thu, Jan 16 2025 1:27 PM | Last Updated on Thu, Jan 16 2025 3:25 PM

YSRCP YS Jagan Praised ISRO Over Success

సాక్షి, తాడేపల్లి: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) శాస్త్రవేత్తలకు వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి(YS Jagan) అభినందనలు తెలిపారు. అంతరిక్షంలో ఉపగ్రహాలను విజయవంతంగా డాకింగ్ చేసిన సందర్బంగా వైఎస్‌ జగన్‌.. ఇస్రోను అభినందించారు.

ఇస్రో(ISRO) విజయంపై వైఎస్‌ జగన్‌ ట్విట్టర్‌ వేదికగా స్పందించారు. ఈ సందర్బంగా వైఎస్‌ జగన్‌.. ఇస్రో శాస్త్రవేత్తలు అంతరిక్షంలో ఉపగ్రహాలను విజయవంతంగా డాకింగ్ చేయడం ద్వారా ఒక అద్భుతమైన మైలురాయిని సాధించారు. ఈ ముఖ్యమైన విజయం రాబోయే సంవత్సరాల్లో భారతదేశ ప్రతిష్టాత్మక అంతరిక్ష కార్యకలాపాలకు కీలకమైన ముందడుగు వేస్తుంది. ఇస్రోకు అభినందనలు! అంటూ కామెంట్స్‌ చేశారు.

ఇది కూడా చదవండి: ఇస్రో సరికొత్త చరిత్ర.. ఆ మూడు దేశాల సరసన నిలిచిన భారత్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement