సాక్షి, గుంటూరు: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ సూర్యుడిపై చేపట్టిన ఆదిత్య ఎల్-1 ఉపగ్రహ ప్రయోగం సక్సెస్‌పై దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. చంద్రయాన్-3తో చరిత్ర సృష్టించి.. ఆ వెంటనే సూర్యుడి మీద ప్రయోగంలో తొలి అడుగు వేసినందుకు ఇస్రో శాస్త్రవేత్తలపై అంతటా ప్రశంసలు కురుస్తున్నాయి.
ఆదిత్య ఎల్-1 ప్రయోగంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలియజేశారు. భారతీయ అంతరిక్ష సాంకేతికతను మరింత ఎత్తుకు తీసుకెళ్లారంటూ ఒక ప్రకటనలో అభినందనలు తెలియజేశారాయన.
ఇదిలా ఉంటే.. సూర్యుడిపై పరిశోధనలకు గానూ ఆదిత్య ఎల్-1 ఉపగ్రహాన్ని ఏపీలోని శ్రీహరికోట షార్ నుంచి ఇస్రో తన రాకెట్ ద్వారా నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఎల్-1 పాయింట్‌కు చేరుకున్నాక.. ఐదేళ్లపాటు సూర్యుడిపై పరిశోధనలు కొనసాగిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment