Aditya L1 Mission
-
ఆ రోజే క్యాన్సర్ బయటపడింది
సూళ్లూరుపేట (తిరుపతి జిల్లా): సూర్యుడి సంబంధ పరిశోధన కోసం భారత్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆదిత్య ఎల్–1 మిషన్ ప్రయోగంతో ఆనందంలో మునిగిపోయిన ఇస్రో చైర్మన్ ఎస్.సోమ్నాథ్నూ అశుభ వార్త ఒకటి కొద్దిరోజులపాటు కలవరపాటుకు గురిచేసింది. ఆయన కడుపులో పెరుగుతున్న క్యాన్సరే అందుకు కారణం. శస్త్రచికిత్స, కీమోథెరపీ తర్వాత ఆయన ప్రస్తుతం క్యాన్సర్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. గత ఏడాది సెపె్టంబర్ రెండో తేదీన జరిగిన ఘటన తాలూకు వివరాలను ఆయన ఇటీవల వెల్లడించారు. టార్కామ్ మీడియా సంస్థ వారి ‘ రైట్ టాక్’ కార్యక్రమంలో భాగంగా ఇచి్చన ఒక ఇంటర్వ్యూలో అందరితో ఆ విషయాలను పంచుకున్నారు. ‘‘ సెప్టెంబర్ రెండో తేదీన ఆదిత్య ఎల్–1 మిషన్ లాంఛ్ ప్రక్రియకు కొద్ది వారాల ముందు నుంచే కడుపు నొప్పిగా అది మొదలైంది. మొదట అదే ఏడాది జూలై 14వ తేదీన చంద్రయాన్–3 ప్రాజెక్ట్ సందర్భంగానూ అనారోగ్యం బారినపడ్డా. ప్రతిష్టాత్మక ప్రాజెక్టు పని ఒత్తిడి కారణంగా అలా అయ్యిందేమో అనుకుని దానిని సంగతి వదిలేశా. కానీ ఆ తర్వాతా కడుపు నొప్పి నన్ను వెంటాడింది. ఇక లాభం లేదనుకుని ఆదిత్య ఎల్–1 ప్రయోగం విజయవంతంగా పూర్వవగానే అదే రోజు చెన్నైలోని ఓ ఆస్పత్రిలో స్కానింగ్‌లు, టెస్ట్‌లు చేయించుకున్నా. పెద్ద పేగులో చిన్నపాటి క్యాన్సర్ కణతి పెరుగుతోందని పరీక్షల్లో బయటపడింది. ఆ వార్త విని నా కుటుంబసభ్యులంతా షాక్‌కు గురయ్యారు. కుటుంబసభ్యులే కాదు ఇస్రోలో శాస్త్రవేత్తలు, ఉద్యోగులు, ఇంజనీర్లు హుతాశులయ్యారు. శస్త్రచికిత్స తప్పదని వైద్యులు సూచించడంతో నాలుగు రోజులు ఆస్పత్రికే పరిమితయ్యా. సర్జరీ, కీమో థెరపీ తర్వాత ఇప్పుడు పూర్తిగా కోలుకున్నా. ఏటా స్కానింగ్, చెకప్ చేయించుకుంటా. నాకు క్యాన్సర్ వంశపారంపర్యంగా వచి్చందని చెబుతున్నారు. దాన్ని జయించా. చిన్నపాటిది కాబట్టి మొదట్లోనే గుర్తించి శస్త్రచికిత్సతో తొలగించారు’’ అని సోమ్‌నాథ్ చెప్పుకొచ్చారు. -
సౌరగాలి ప్రభావాన్ని గుర్తించిన ‘పాపా’
ఆదిత్య-ఎల్1 ఉపగ్రహంలోని ప్లాస్మా ఎనలైజర్ ప్యాకేజీ ఫర్ ఆదిత్య(పాపా) పేలోడ్ విజయవంతంగా పనిచేస్తోందని ఇస్రో వెల్లడించింది. దీని అధునాతన సెన్సార్లు ఫిబ్రవరి 10, 11, 2024 తేదీల్లో సంభవించిన పరిణామాలతోపాటు కరోనల్ మాస్ ఎజెక్షన్ల(సీఎమ్ఈ) ప్రభావాన్ని గుర్తించినట్లు ఇస్రో ట్విట్టర్లో తెలిపింది. పాపాలో రెండు సెన్సార్లు ఏర్పరిచారు. అందులో ఎలక్ట్రాన్లను కొలవడానికి సోలార్ విండ్ ఎలక్ట్రాన్ ఎనర్జీ ప్రోబ్ (స్వీప్), అయాన్లను కొలవడానికి సోలార్ విండ్ అయాన్ కంపోజిషన్ ఎనలైజర్ (స్వీకర్) ఉన్నాయి. రెండు సెన్సార్లు సౌర పవన కణాలు ఏ దిశ నుంచి వస్తున్నాయో గుర్తించగలవు. Aditya-L1 Mission: PAPA payload has been operational and performing nominally. It detected the solar wind impact of Coronal Mass Ejections (CMEs) including those that occurred during Feb 10-11, 2024. Demonstrates its effectiveness in monitoring space weather conditions.… pic.twitter.com/DiBtW4tQjl — ISRO (@isro) February 23, 2024 ఈ సెన్సార్లు డిసెంబరు 12 నుంచి పనిలో ఉన్నట్లు ఇస్రో తెలిపింది. ఊహించిన విధంగా ప్రోటాన్లు, ఆల్ఫా కణాల కదలికను గుర్తించేలా ఒక స్పెక్ట్రాను రికార్డ్ చేసింది. జనవరి 6న ఆదిత్య-ఎల్1 హాలో ఆర్బిట్ ఇన్సర్షన్ సమయంలో తాత్కాలికంగా పేలోడ్ ఓరియంటేషన్ మారినప్పుడు స్పెక్ట్రాలో కొంత డిప్ కనిపించినట్లు తెలిపింది. ఇదీ చదవండి: ‘ఇండియాలో ఆసక్తి కలిగించిన అంశం అదే..’ DSCOVR, ACE ఉపగ్రహాల ద్వారా డిసెంబర్ 15న వచ్చిన డేటాను ఇస్రో విశ్లేషించింది. ఆదిత్య ఎల్1లోని సీఎంఈ సెన్సార్లు L1 పాయింట్ వద్ద సౌర గాలి మార్పులకు అనుగుణంగా కణాల స్థానాల్లో మార్పులు గమనించినట్లు చెప్పింది. ఫిబ్రవరి 10, 11న కూడా సౌరగాలిలో స్వల్ప వ్యత్యాసాలు ఏర్పడినట్లు తెలిపింది. -
Aditya-L1: లగ్రాంజ్ పాయింట్లోకి ఆదిత్య
సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): సూర్యునిపై సౌర జ్వాలలు, కరోనల్ మాస్ ఎజెక్షన్ తదితర విషయాలను అధ్యయనం చేసేందుకు ఇస్రో గత ఏడాది ప్రయోగించిన సోలార్ అబ్జర్వేటరీ వ్యోమనౌక ఆదిత్య ఎల్1 ఎట్టకేలకు తన తుది కక్ష్యలోకి చేరుకుంది. శనివారం సాయంత్రం నాలుగు గంటలకు వ్యోమనౌక తన గమ్యస్థానాన్ని చేరుకోవడంతో ఇస్రో తన అంతరిక్ష ప్రయోగాల్లో మరో మైలురాయిని దాటింది. భూమి నుంచి సూర్యునివైపుగా 15 లక్షల కిలోమీటర్ల దూరంలోని కక్ష్య(ఎల్1 పాయింట్)లోకి శనివారం ఆదిత్య వ్యోమనౌక చేరుకుందని ప్రధాని మోదీ ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు. గ్రహణాల వంటి సందర్భాల్లోనూ ఎలాంటి అడ్డూలేకుండా నిరంతరంగా సూర్యుడిని చూసేలా అనువైన ఎల్1 పాయింట్లో ఉంటూ ఆదిత్య ఎల్1 అధ్యయనం చేయనుంది. చంద్రుడి ఉపరితలంపై చంద్రయాన్–3 సాఫ్ట్‌ల్యాండింగ్ విజయవంతమైన కొద్దినెలలకే సూర్యుడి సంబంధ ప్రయోగంలోనూ భారత్ ఘన విజయం సాధించడం విశేషం. భూమికి సూర్యునికి మధ్య దూరం 15 కోట్ల కిలోమీటర్లుకాగా అందులో ఒక శాతం అంటే 15 లక్షల కిలోమీటర్ల దూరాన్ని లగ్రాంజ్ పాయింట్(ఎల్1)గా గణిస్తున్నారు. ఈ పాయింట్ ఉన్న హాలో కక్ష్యలో వ్యోమనౌక ఉంటే సూర్యగ్రహణం వంటి సందర్భాల్లోనూ నిరంతరంగా శూన్యంలో అంతరిక్ష వాతావరణంలో సూర్య సంబంధ శోధన చేసే సువర్ణావకాశం చిక్కుతుంది. మూన్‌వాక్ నుంచి సన్‌డ్యాన్స్ దాకా.. ‘‘ భారత్ మరో మైలురాయిని చేరుకుంది. భారత తొలి సోలార్ అబ్జర్వేటరీ తన కక్ష్యను చేరుకుంది. సంక్లిష్టమైన అంతరిక్ష ప్రయోగాలను సఫలం చేస్తూ మన శాస్త్రవేత్తలు అంకితభావానికి ఈ సంఘటనే చక్కని తార్కాణం. వీరి అసాధారణ ప్రతిభకు దేశం గరి్వస్తోంది. మానవాళి సంక్షేమం కోసం నూతన శాస్త్రీయ పరిశోధనలు ఇకమీదటా ఇలాగే కొనసాగాలి’’ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం ట్వీట్ చేశారు. ‘‘ఇస్రో మరో ఘనత సాధించింది. ఈ మిషన్‌తో యావత్ మానవాళికి ఎంతో మేలు చేకూరుతుంది. ఈ మిషన్‌తో సూర్యుడు–భూమి మధ్య మనకున్న జ్ఞానాన్ని మరింత పెంచుతుంది. గొప్ప విజయం సాధించిన భారత శాస్త్రవేత్తలకు నా అభినందనలు’’ అని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఇస్రో శాస్త్రవేత్తలను ప్రశంసించారు. కేంద్ర శాస్త్ర, సాంకేతిక మంత్రిత్వ శాఖ మంత్రి జితేంద్ర సింగ్ సైతం ఆనందం వ్యక్తంచేశారు. ‘‘మూన్ వాక్ నుంచి సన్ డ్యాన్స్ వరకు..!. భారత్‌కు ఎంతటి ఉజ్వల సంవత్సరమిది’’ అని ట్వీట్‌చేశారు. ‘‘ అంతరిక్షంలోనూ భారత జైత్రయాత్ర కొనసాగుతోంది’ అని హోం మంత్రి అమిత్ షా ట్వీట్‌చేశారు. ► గత ఏడాది సెపె్టంబర్ రెండో తేదీన ఆదిత్యను మోస్తూ పీఎస్ఎల్వీ–సీ57 రాకెట్ శ్రీహరికోట ప్రయోగ కేంద్రం నుంచి నింగిలోకి దూసుకెళ్లింది. ► దాదాపు 63 నిమిషాల తర్వాత 235 ్ఠ19,500 కిలోమీటర్ల కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. తర్వాత దాని కక్ష్యలను ఇస్రో పలుమార్లు మార్చుతూ చివరకు శనివారం తుదికక్ష్యలోకి చేర్చింది. ► దీని బరువు దాదాపు 1500 కేజీలు. విజిబుల్ ఎమిషన్ లైన్ కొరోనాగ్రాఫ్, సోలార్ అల్ట్రావాయిలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్, ఆదిత్య సోలార్ విండ్ పారి్టకల్ ఎక్స్పరిమెంట్, ప్లాస్మా అనలైజర్ ప్యాకేజ్ ఫర్ ఆదిత్య, సోలార్ లో ఎనర్జీ ఎక్స్‌రే స్పెక్ట్రోమీటర్, హైఎనర్జీ ఎల్–1 ఆర్బిటింగ్ ఎక్స్‌రే స్పెక్ట్రోమీటర్, మ్యాగ్నెటోమీటర్ అనే పేలోడ్లను ఈ ఉపగ్రహంలో అమర్చారు. -
ఇస్రో శాస్త్రవేత్తలకు సీఎం జగన్ అభినందనలు
సాక్షి, తాడేపల్లి: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) సైంటిస్టులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందనలు తెలియజేశారు. ఇస్రో ప్రయోగించిన ఆదిత్య ఎల్-1 అద్భుత విజయంపై సీఎం జగన్ హర్షం వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో ఇస్రో మరిన్ని విజయాలను సాధించాలని ఆయన ఆకాంక్షించారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ప్రయోగించిన ఆదిత్య ఎల్-1 మిషన్ శనివారం అద్భుత విజయం సాధించింది. ఆదిత్య వ్యోమనౌక సాయంత్రం 4 గంటలకు సూర్యుడికి అతి సమీపంలో లాంగ్రేజియన్ పాయింట్లోకి ప్రవేశించింది. ఈ వ్యోమనౌక అంతరిక్షంలో 127 రోజుల పాటు 15 లక్షల కిలోమీటర్లు ప్రయాణించి ఎల్-1 పాయింట్లోకి ప్రవేశించింది. చదవండి: Aditya-L1 Mission: ఆదిత్య ఎల్-1 సంపూర్ణ విజయం.. ఎల్ 1 పాయింట్లోకి ప్రవేశించిన వ్యోమనౌక -
Aditya-L1 Mission: ఇస్రో చరిత్రలో మరో మైలురాయి.. ఆదిత్య ఎల్-1 సంపూర్ణ విజయం
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చరిత్రలో మరో మైలురాయిని చేరింది. సూర్యుని అధ్యయనం చేసేందుకు భారత్ తొలిసారి ప్రయోగించిన ప్రతిష్టాత్మక ఆదిత్య ఎల్- 1 మిషన్ సంపూర్ణ విజయాన్ని అందుకుంది. ఆదిత్య వ్యోమనౌక తన ప్రయాణంలో తుది ఘట్టాన్ని పూర్తి చేసుకొని నేడు నిర్దేశిత గమ్యానికి చేరుకుంది. సాయంత్రం 4 గంటలకు సూర్యుడికి అతి సమీపంలోని లాంగ్రేజియన్ పాయింట్లోకి ప్రవేశించింది. ఈ ఉపగ్రహం హాలో కక్ష్య నుంచి సూర్యుడిని పరిశీలించనుంది. ఐదేళ్లపాటు భారత్‌కు తన సేవలును అందించనుంది. కాగా గతేడాది సెప్టెంబర్ 2వ తేదీన శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఆదిత్య ఎల్- 1 మిషన్ ప్రయోగించారు ఇస్రో శాస్త్రవేత్తలు. ఈ వ్యోమనౌక భూమి నుంచి అంతరిక్షంలో 127 రోజుల పాటు 15 లక్షల కిలోమీటర్లు ప్రయాణించి ఎల్-1 పాయింట్లోకి ప్రవేశించింది. భారత్ తరఫున సూర్యుడిని పరిశోధించేందుకు ఇస్రో చేపట్టిన తొలి మిషన్ ఇదే. సౌర వాతావరణాన్ని లోతుగా అధ్యయనం చేయడం ఆదిత్య ఎల్ 1 లక్ష్యం. ఈ వ్యోమనౌక మొత్తం ఏడు పేలోడ్లను మోసుకెళ్లింది. సౌర వాతావరణం, సౌర జ్వాలలు, కరోనల్ మాస్ ఎజెక్షన్ తదితర విషయాలను అధ్యయనం చేసేందుకు ఇవి కీలకమైన సమాచారాన్ని అందించనున్నాయి. India creates yet another landmark. India’s first solar observatory Aditya-L1 reaches it’s destination. It is a testament to the relentless dedication of our scientists in realising among the most complex and intricate space missions. I join the nation in applauding this… — Narendra Modi (@narendramodi) January 6, 2024 ఆదిత్య ఎల్-1 మిషన సక్సెస్‌పై ప్రధానమంత్రి మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఇస్రో శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు తెలిపారు. భారత్ మరో మైలురాయిని సాధించిందని పేర్కొన్నారు. ఆదిత్య ఎల్ 1 విజయంపై ఇస్రో శాస్త్రవేత్తలు ట్వీట్ చేశారు. ఆదిల్య ఎల్-1 మిషన్ సంపూర్ణ విజయం సాధించినట్లు చెప్పారు. చదవండి: Aditya-1 mission: ఏ పరికరాలు ఏం చేస్తాయి? -
గమ్యస్థానం చేరనున్న ఆదిత్య-L1 మిషన్
-
Aditya L1: భారత తొలి సన్ మిషన్‌లో రేపు కీలక పరిణామం
బెంగళూరు: సూర్యునిపై పరిశోధనలకు భారత్ తొలిసారి ప్రయోగించిన ఆదిత్య ఎల్1 వ్యోమనౌక శనివారం(జనవరి 6)వ తేదీన ఉదయం నిర్దేశించిన కక్ష్యలోకి చేరనుంది. ఇక్కడికి చేరిన తర్వాత ఎలాంటి అడ్డంకులు లేకుండా ఆదిత్య ఎల్1 నిరంతరం సూర్యునిపై అధ్యయనం చేయగలుగుతుంది. సెప్టెంబర్ 2న ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట నుంచి ప్రయోగించిన ఆదిత్య ఎల్1 నాలుగు దశలు దాటి ఇప్పటికే భూమికి,సూర్యునికి మధ్యలో ఉన్న లాగ్రాంజియన్ పాయింట్‌కు చేరుకుంది. అయితే శనివారం మరో 63 నిమిషాల 20 సెకన్లు ప్రయాణించి నిర్దేశిత కక్ష్యలోకి చేరుతుంది.లాంగ్రాంజియన్ పాయింట్లో భూమి,సూర్యుని గురత్వాకర్షణ శక్తి బలాలు ఒకదానికొకటి క్యాంసిల్ అయి దాదాపు జీరో స్థితికి చేరుకుంటాయి. అంటే ఇక్కడ గ్రావిటీ ఉండదు. దీంతో సూర్యుని చుట్టూ తిరిగేందుకుగాను ఈ పాయింట్లో ఉన్న వ్యోమనౌకలకు పెద్దగా ఇంధనం అవసరం ఉండదు. ఈ కారణం వల్లే పరిశోధనలకు ఎల్1 పాయింట్ అనుకూలంగా ఉంటుంది. ఆదిత్య ఎల్1లో ఏడు సైంటిఫిక్ పేలోడ్లు ఉంటాయి. సూర్యునిపై ఉండే ఫొటోస్పియర్, క్రోమో స్పియర్, కరోనా పొరలను మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డిటెక్టర్ల సాయంతో ఏడు పేలోడ్లు నిరంతరం అధ్యయనం చేసి డేటాను భూమికి పంపిస్తుంటాయి. ఇదీచదవండి..టెట్రిస్ గేమ్‌ను జయించిన బాలుడు -
ISRO: కొత్త ఏడాది తొలిరోజే కీలక ప్రయోగం
సాక్షి, బెంగళూరు: కొత్త ఏడాదిలో తొలిరోజే ఇస్రో సరికొత్త ప్రయోగానికి తెర తీసింది. నూతన సంవత్సరం సందర్భంగా సోమవారం(జనవరి 1) ఉదయం 9.10 గంటలకు ఎక్స్ రే పొలారి మీటర్ శాటిలైట్(ఎక్స్పో శాట్)ను ప్రయోగించనుంది. ఇది భారత అంతరిక్ష చరిత్రలో తొలి పొలారిమీటర్ మిషన్ కావడం విశేషం. పీఎస్ఎల్వీ రాకెట్ ద్వారా శ్రీహరికోటలోని సతీష్‌ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగించనున్న ఈ ప్రయోగం కౌంట్‌డౌన్ ఇప్పటికే ప్రారంభమైంది. కాంతివంతమైన అంతరిక్ష ఎక్స్‌రే కిరణాల మూలాల సంక్లిష్టతను, అసాధారణ పరిస్థితుల్లో వాటి ప్రభావాన్ని ఎక్స్ పో శాట్ అధ్యయనం చేయనుంది. ఈ అధ్యయనానికిగాను ఎక్స్‌పోశాట్‌లో రెండు అత్యాధునిక సాంకేతికత కలిగిన పేలోడ్లను అమర్చారు. ఇవి తక్కువ ఎత్తులో గల భూ కక్ష్య నుంచి అధ్యయనాన్ని కొనసాగిస్తాయి. ఎక్స్‌పోశాట్‌లోని ప్రాథమిక పరికరం పోలిక్స్ మధ్యతరహా ఎక్స్‌రే కిరణాలను వెదజల్లే మూలాలపై పరిశోధన చేస్తుంది. ఇక మిగిలిన ఎక్స్‌స్పెక్ట్ పేలోడ్ అంతరిక్షంలోని బ్లాక్‌హోళ్లు, న్యూట్రాన్ నక్షత్రాలు, యాక్టివ్ గలాటిక్ న్యూక్లై, పల్సర్ విండ్, నెబ్యులా తదితరాల నుంచి వెలువడే ఎక్స్‌రే కిరణాల స్పెక్ట్రోస్కోపిక్ సమాచారాన్ని అందించనుంది. గడిచిన ఏడాది 2023లో ఇస్రో చంద్రయాన్ 3, ఆదిత్య ఎల్ 1 ప్రయోగాలతో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఇదీచదవండి..అయోధ్య రామ మందిర వేడుకలు..కర్ణాటక మంత్రి సంచలన వ్యాఖ్యలు -
Aditya L1: ఆసక్తికర విషయాలు వెల్లడించిన ఇస్రో చీఫ్
ముంబై: ఆదిత్య ఎల్1 సూర్యునికి, భూమికి మధ్యలో ఉన్న లాగ్రాంజ్ పాయింట్‌కు జనవరి 6వ తేదీన చేరుకుంటుందని ఇస్రో చీఫ్ సోమనాథ్ తెలిపారు. ముంబై ఐఐటీలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన సోమనాథ్ సెప్టెంబర్‌లో ప్రయోగించిన ఆదిత్య ఎల్1, అంతకముందు విజయవంతమైన చంద్రయాన్ 3 మిషన్‌కు సంబంధించిన ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ‘ఆదిత్య ఎల్1 దాదాపుగా గమ్యాన్ని చేరుకుంది. జనవరి 6వ తేదీ సాయంత్రం 4 గంటలకు ఎల్-1 పాయింట్‌కు చేరుకుంటుంది. ఎల్-1 కక్ష్యలోకి పంపేందుకు మండించాల్సిన ఆరు ఇంజన్లు చక్కగా పనిచేస్తున్నాయి. ఎల్-1 పాయింట్లో భూమికి సూర్యునికి మధ్య గ్రావిటీ ఉండదు. అయితే అక్కడ జీరో గ్రావిటీ ఉండటం మాత్రం అసాధ్యం ఎందుకంటే చంద్రుడు, మార్స్, వీనస్ గ్రహాలకు సంబంధించిన గ్రావిటీ ప్రభావం ఈ పాయింట్లో కొంత మేర ఉంటుంది’ అని సోమనాథ్ తెలిపారు. ‘శాటిలైట్ ఎల్1 పాయింట్లో కుదరుకున్నప్పటి నుంచి ఎప్పటికీ పనిచేస్తూనే ఉంటుంది. అందులోని పరికరాలు పనిచేసినంత కాలం సూర్యునికి సంబంధించిన డేటా భూమికి పంపిస్తూనే ఉంటుంది. సూర్యునిలో జరిగే చాలా చర్యలకు భూమి మీద వాతావరణ మార్పులకు మధ్య ఉండే సంబంధాన్ని ఎల్1 ద్వారా పరిశోధనలు చేసి కనిపెట్టగలమని ఆశిస్తున్నాం’ అని సోమనాథ్ చెప్పారు. ప్రజ్ఞాన్ రోవర్ కథ ఇక ముగిసినట్లే.. ‘14 రోజుల మిషన్ తర్వాత చంద్రయాన్ 3లో భాగమైన ప్రజ్ఞాన్ రోవర్ చంద్రుని మీద హాయిగా నిద్ర పోతున్నాడు. రోవర్ ఇక ఎప్పటికీ నిద్ర పోతూనే ఉంటాడు. ప్రజ్ఞాన్ స్లీప్‌మోడ్‌లోకి వెళ్లిన తర్వాత మళ్లీ పనిచేస్తాడనుకున్నాం. ల్యాబ్‌లో కూడా ఇది విజయవంతంగా పరీక్షించి చూశాం. దురదృష్టవశాత్తు చంద్రునిపై మాత్రం ఇది జరగలేదు. ల్యాబ్‌లో సాధ్యమైనవి కొన్ని చంద్రునిపై నిజంగా సాధ్యపడవు. రేడియేషనే ఇందుకు కారణం’అని సోమనాథ్ తెలిపారు. దేశ అంతరిక్ష ప్రయోగాల చరిత్రలో సూర్యున్ని అధ్యయనం చేసేందుకుగాను భారత్ తొలిసారిగా ఆదిత్య ఎల్1ను ప్రయోగించిన విషయం తెలిసిందే. -
Aditya-L1: జనవరి ఆరున కక్ష్యలోకి ఆదిత్యఎల్1
అహ్మదాబాద్: భగభగమండే భానుడి వాతావరణం, సూర్యుడిలో సంభవించే స్వల్ప మార్పులు భూగోళంపై ఎలాంటి ప్రతికూల ప్రభావాలు చూపుతాయనే అంశాలను అధ్యయనం చేసేందుకు ఇస్రో ప్రయోగించిన అంతరిక్షనౌక ఆదిత్య ఎల్–1 జనవరి ఆరో తేదీన తన కక్ష్యలోకి చేరుకుంటుందని ఇస్రో చైర్మన్ సోమనాథ్ అంచనావేశారు. శుక్రవారం గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఒక ఎన్జీవో ఏర్పాటుచేసిన ‘భారతీయ విజ్ఞాన్ సమ్మేళన్’ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ‘‘ భూమి నుంచి సూర్యుడి వైపుగా 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న లాంగ్రాంజియాన్ పాయింట్(ఎల్) కక్ష్యలోకి ఆదిత్య ఎల్–1 జనవరి ఆరో తేదీన చేరుకుంటుందని భావిస్తున్నాం. ఆరో తేదీన ఎల్1 పాయింట్లోకి చేరగానే వ్యోమనౌక మరింత ముందుకు వెళ్లకుండా వ్యతిరేకదిశలో ఇంజిన్‌ను మండిస్తాం. దాంతో అది ఆ కక్ష్యలో స్థిరంగా కుదురుకుంటుంది. ఆ కక్ష్యలోనే తిరుగుతూ సూర్య వాతావరణ విశేషాలపై అధ్యయనం మొదలుపెడుతుంది. వచ్చే ఐదేళ్లపాటు సూర్యుడిపై సంభవించే పరిణామాలను విశ్లేíÙంచనుంది. స్పేస్‌క్రాఫ్ట్ తన కక్ష్యలో కుదురుకున్నాక సౌరగాలులు, సౌర ఉపరితలంపై మార్పులు తదితరాల డేటాను ఒడిసిపట్టి భారత్‌కు మాత్రమేకాదు యావత్ ప్రపంచానికి పనికొచ్చే సమాచారాన్ని ఆదిత్య ఎల్1 అందించనుంది’’ అని సోమనాథ్ చెప్పారు. ‘‘ ప్రధాని మోదీ ఉద్భోదించినట్లు అమృతకాలంలో భారత్ ‘భారతీయ స్పేస్ స్టేషన్’ పేరిట సొంత అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటుచేసేందుకు కృషిచేస్తున్నాం’ అని వివరించారు. -
సౌర కళలు సూపర్
సూళ్లూరుపేట (తిరుపతి జిల్లా): సూర్యునిపై పరిశోధనల నిమిత్తం ఇస్రో ప్రయోగించిన ఆదిత్య ఎల్1 ఉపగ్రహం అపూర్వమైన ఫొటోలను అందించింది. తొలిసారిగా సూర్యుని ఫుల్ డిస్క్ ఇమేజీలను భూమికి పంపింది. ఉపగ్రహంలోని సోలార్ అల్ట్రా వయొలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్ (సూట్) విజయవంతంగా ఈ ఫొటోలు తీసినట్టు ఇస్రో శుక్రవారం పేర్కొంది. వాటిని తన వెబ్సైట్లో ఉంచింది. ఈ ఫొటోలను 200–400 ఎన్ఎం తరంగదైర్ఘ్య పరిధిలో తీసినట్టు వెల్లడించింది. ఈ ఫొటోల్లో సూర్యుని తాలూకు ఫొటోస్పియర్, క్రోమోస్పియర్‌లను 11 వేర్వేరు శాస్త్రీయ ఫిల్టర్లను ఉపయోగించి ఆదిత్య ఎల్1 బందించింది. ఆ స్పియర్లపై లోతైన సమాచారాన్ని ఈ ఫొటోలు అందించినట్టు ఇస్రో తెలిపింది. భూ వాతావరణంపై సౌర ధారి్మకత ప్రభావం తదితరాలను మరింత లోతుగా అధ్యయనం చేయడానికి తాజా ఫొటోలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపింది. వాటిలో సూర్య వలయాల వంటివి కొట్టొచి్చనట్టు కని్పస్తున్నాయి. గత సెపె్టంబర్ 2న ప్రయోగించిన ఆదిత్య ఎల్1 సూర్యుని దిశగా ప్రయాణంలో భాగంగా లాంగ్రేజియన్ పాయింట్1కు చేరింది. దీంట్లోని ఏడు పేలోడ్లను పూర్తిగా దేశీయంగానే రూపొందించారు. -
Aditya-L1 mission: పని మొదలెట్టిన ఆదిత్య–ఎల్ 1
సూళ్లూరుపేట (తిరుపతి జిల్లా): సూర్యుడిని అధ్యయనం చేసేందుకు రోదసీలోకి దూసుకెళ్లిన ఆదిత్య–ఎల్ 1 తన ప్రయాణంలో మరో మైలురాయిని అందుకుంది. ఈ ఉపగ్రహంలోని ఆదిత్య సోలార్ విండ్ పార్టికల్ ఎక్స్పరిమెంట్ అనే పరికరం తన కార్యకలాపాలను మొదలుపెట్టిందని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ప్రకటించింది. ఈ పరికరంలోని రెండు విభిన్న భాగాలు తమ పరిశోధనలను విజయవంతంగా కొనసాగిస్తున్నాయి. ఇవి సౌర గాలులను అధ్యయనం చేస్తున్నాయి’ అని ఇస్రో వెల్లడించింది. సంబంధిత వివరాలను ఇస్రో తన ‘ఎక్స్’ ఖాతాలో ట్వీట్‌చేసింది. ‘సోలార్ విండ్ పారి్టకల్ ఎక్స్పరిమెంట్’లో భాగమైన సూపర్‌థర్మల్ అండ్ ఎనర్జిటిక్ పారి్టకల్ స్పెక్ట్రోమీటర్(స్టెప్స్)ను సెపె్టంబర్ పదో తేదీన, సోలార్ విండ్ అయాన్ స్పెక్ట్రోమీటర్(స్విస్)ను నవంబర్ రెండో తేదీన యాక్టివేట్ చేయడం తెల్సిందే. ఈ రెండు భాగాలు తమ కార్యకలాపాలను విజయవంతంగా కొనసాగిస్తున్నాయని ఇస్రో పేర్కొంది. స్విస్‌లో ఉన్న రెండు సెన్సార్లు 360 డిగ్రీలో చక్కర్లు కొడుతూ విధులు నిర్వర్తిస్తున్నాయి. నవంబర్ నెలలో సోలార్ విండ్ అయాన్లు, ప్రైమరీ ప్రోటాన్స్, ఆల్ఫా పారి్టకల్స్లను ‘స్విస్’ విజయవంతంగా లెక్కగట్టి విశ్లేíÙంచగలిగిందని ఇస్రో ప్రకటించింది. ఈ సెన్సర్ సేకరించిన ఎనర్జీ హస్ట్రోగామ్ను పరిశీలించారు. దీంతో ప్రోటాన్, అయనీకరణ చెందిన హీలియం, ఆల్ఫా పారి్టకల్స్లో కొన్ని భిన్న లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు. ఈ తాజా విశ్లేషణతో సౌర గాలుల విలక్షణతపై ఇన్నాళ్లూ నెలకొన్న ప్రశ్నలకు సమాధానాలు దొరికే అవకాశముందని ఇస్రో శాస్త్రవేత్తలు ఆశాభావం వ్యక్తంచేశారు. సౌర గాలుల్లోని అంతర్గత ప్రక్రియలు.. భూమిపై ఏ విధమైన ప్రభావం చూపుతాయనే విషయంపై సమగ్ర అధ్యయనం చేసేందుకు తాజా డేటా సహాయకారిగా ఉంటుందని ఇస్రో పేర్కొంది. లాగ్రాంజ్ పాయింట్ వద్ద చోటుచేసుకునే కరోనల్ మాస్ ఎజెక్షన్పై ఓ అవగాహనకు రావచ్చని వెల్లడించింది. సూర్యుడిపై అధ్యయనం కోసం ఈ ఏడాది సెప్టెంబరు 2న నింగిలోకి దూసుకెళ్లిన ‘ఆదిత్య – ఎల్ 1’ తన ప్రయాణంలో దాదాపు చివరి దశను చేరుకుంది. భూమి నుంచి 15 లక్షల కి.మీ దూరంలో ఉన్న లాగ్రాంజ్ పాయింట్–1 చేరాక దాని కక్ష్యలో పరిభ్రమిస్తూ ఆదిత్య – ఎల్ 1 సూర్యుడిని అధ్యయనం చేయనుంది. -
తుది‘దశ’లో ఆదిత్య ఎల్1
తిరువనంతపురం: సూర్యుడి సంబంధ అంశాలపై మరింత లోతైన అధ్యయనం కోసం ఇస్రో ప్రయోగించిన ఆదిత్య ఎల్–1 వ్యోమనౌక త్వరలోనే దాని ఎల్–1 పాయింట్లోకి చేరుకోనుందని ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ వెల్లడించారు. తొలి సౌండింగ్ రాకెట్‌ను ప్రయోగించి 60 ఏళ్లు పూర్తయిన సందర్భంగా తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్(వీఎస్ఎస్సీ)లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా సోమనాథ్ మాట్లాడారు. ‘ ఆదిత్య తన దిశలో దూసుకుపోతోంది. ఇది దాదాపు తన తుదిదశకు చేరుకుంది. ఎల్–1 పాయింట్లోకి దానిని చేర్చేందుకు సన్నాహక కార్యక్రమాలు చేపడుతున్నాం. వచ్చే ఏడాది జనవరి ఏడో తేదీకల్లా ఎల్–1లోకి ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు సిద్ధంచేశాం’’ అని చెప్పారు. -
ఎల్1కు చేరువలో ఆదిత్య : ఇస్రో చైర్మన్
తిరువనంతపురం: సూర్యున్ని అధ్యయనం చేయడానికి నింగిలోకి వెళ్లిన వ్యోమనౌక ఆదిత్య ఎల్-1ప్రయాణం తుది దశకు చేరుకుందని ఇస్రో చైర్మన్ సోమనాథ్ తెలిపారు. వచ్చే ఏడాది జనవరి 7కల్లా ఆదిత్య వ్యోమనౌక ఎల్ 1 పాయింట్ చేరుకునేందుకు కావల్సిన తుది ఏర్పాట్లు పూర్తవుతాయని చెప్పారు. తిరువనంతపురంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సోమనాథ్ ఆదిత్య ఎల్1 అప్డేట్స్ను వెల్లడించారు. ‘ఆదిత్య మిషన్ గమ్యాన్ని చేరుకునేందుకు అతి దగ్గరలో ఉంది. ఎల్ 1 పాయింట్‌కు వెళ్లేందుకు తుది ఏర్పాట్లు చేస్తున్నాం’ అని సోమనాథ్ తెలిపారు.సెప్టెంబర్ 2న ఆదిత్య ఎల్1 ను శ్రీహరికోటలోని సతీష్‌ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగించారు. 125 రోజుల్లో 15 లక్షల కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత ఆదిత్య స్పేస్ క్రాఫ్ట్ సూర్యునికి అతి సమీపంలో ఉన్న లాంగ్రేజియన్ పాయింట్(ఎల్-1)ను చేరుకునే లక్ష్యంతో పంపించారు. ఎల్-1పాయింట్ చేరకున్న తర్వాత అక్కడి నుంచి ఆదిత్య సూర్యుని చిత్రాలు తీసి భూమికి పంపనుంది. ఇవి సూర్యున్ని మరింత లోతుగా అధ్యయనం చేయడంలో ఇస్రోకు ఎంతగానో ఉపయోగపడనున్నాయి. ఇదీచదవండి..తేజస్ యుద్ధ విమానంలో ప్రయాణించిన మోదీ -
ఆదిత్య-ఎల్1 మరో ఘనత
-
డాక్టర్ అవ్వాలనుకున్న ఇస్రో ఛైర్మన్..!
సంక్లిష్టమైన చంద్రయాన్-3 ప్రయోగాన్ని సుసాధ్యం చేసిన ఇండియన్ స్పేస్ రిసెర్చ్ ఆర్గనైజేషన్(ఇస్రో)కు సారథ్యం వహిస్తున్న సంస్థ ఛైర్మన్ సోమనాథ్ తాను చిన్నతనంలో డాక్టర్ కావాలనుకున్నానని చెప్పారు. ఇటీవల చెన్నైలోని డాక్టర్ ఎంజీఆర్ యూనివర్శిటీలో జరిగిన వైద్యుల సదస్సులో ఆయన్ ప్రసంగించారు. ఆయనకు బయాలజీ అంటే ఇష్టమనీ, తాను చిన్ననాటి నుంచి జీవశాస్త్రంలో టాపర్‌గా ఉండేవాడినని గుర్తుచేసుకున్నారు. డాక్టర్ కావాలనే ఆకాంక్ష బలంగా ఉండేదన్నారు. అయితే వైద్య వృత్తి చాలా కఠినమైందని, ఇంజినీరింగ్ లేదా గణితాన్ని ఎంచుకోవాలని ఆయన తండ్రి చెప్పినట్లు తెలిపారు. గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాక ఎలాంటి స్పెషలైజేషన్ చేయలేదని సోమనాథ్ వెల్లడించారు. తాను మెకానికల్ ఇంజినీర్ కోర్సు చేస్తున్నపుడు ప్రొపల్షన్‌పై ఆసక్తి కలిగిందన్నారు. వైద్య నిపుణులు సాఫ్ట్వేర్, ఏఐ టూల్స్ గురించి అవగాహన పెంచుకోవాలని సూచించారు. టెక్నాలజీ వినియోగం వల్ల ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలని కోరారు. -
’ఆదిత్య’ మార్గాన్ని చక్కదిద్ది... కీలక ఘట్టాన్ని పూర్తి చేసిన ఇస్రో
బెంగళూరు: సూర్యశోధనకు ఉద్దేశించిన ఆదిత్య –ఎల్1 ఉపగ్రహ ప్రయోగంలో మరో కీలక దశను ఇస్రో విజయవంతంగా పూర్తి చేసింది. దాని మార్గాన్ని సరిదిద్దే ప్రక్రియను సజావుగా జరిపినట్టు ఆదివారం ప్రకటించింది. అక్టోబర్ 6న 16 సెకన్ల పాటు ఇది కొనసాగిందని వివరించింది. లగ్రాంజ్ పాయింట్1 వైపు ఉపగ్రహం నిర్దేశిత మార్గంలో సాగేలా ఉంచేందుకు ఈ ప్రక్రియ తోడ్పడుతుంది. ఆదిత్య –ఎల్1 సూర్యునిపైకి భారత తొలి ప్రయోగం. దీన్ని సెపె్టంబర్ 2న శ్రీహరికోట నుంచి జరిపారు. తర్వాత దాని గమనాన్ని సెపె్టంబర్ 19న లగ్రాంజియన్ పాయింట్ కేసి నిర్దేశించారు. తాజా ప్రయత్నం ద్వారా దాన్ని మరింతగా సరిచేశారు. 125 రోజుల పాటు భూమి నుంచి 15 లక్షల కిలోమీటర్ల ప్రయాణం తర్వాత ఆదిత్య–ఎల్1ను సూర్యునికి అతి సన్నిహితమైన హాలో కక్ష్యలోకి ప్రవేశపెట్టాలన్నది ఇస్రో లక్ష్యం. -
గురుత్వాకర్షణ పరిధిని దాటిన ఆదిత్య–ఎల్1
బెంగళూరు: సూర్యుడిపై పరిశోధనలే లక్ష్యంగా ప్రయోగించిన ఆదిత్య–ఎల్1 ఉపగ్రహం భూమికి 9.2 లక్షల కిలోమీటర్ల దూరం ప్రయా ణించి, భూ గురుత్వాకర్షణ పరిధిని దాటేసిందని ఇస్రో తెలిపింది. ప్రస్తుతం అది లాగ్రాంజ్ పాయింట్ దిశగా ప్రయాణం సాగిస్తోందని శనివారం ‘ఎక్స్’లో వెల్లడించింది. ఆదిత్య–ఎల్1 ఉపగ్రహాన్ని పీఎస్ఎల్పీ– సి57 రాకెట్ ద్వారా సెప్టెంబర్ 2వ తేదీన శ్రీహరి కోట నుంచి ప్రయోగించిన విషయం తెలిసిందే. -
ఆదిత్య ఎల్1.. అసలు కథ షురూ
సూర్యుని పై పరిశోధనలు చేసేందుకు ఇస్రో ప్రయోగించిన ఆదిత్య ఎల్-1 మిషన్ లో మరో కీలక ఘట్టం నమోదైంది. ఆదిత్య ఎల్-1 ఉపగ్రహం సూర్యుడిని చేరుకునేందుకు ఐదో సారి భూ కక్ష్యను పెంపును ఇస్రో శాస్త్రవేత్తలు విజయవంతంగా పూర్తి చేశారు. తద్వారా ఆదిత్య ఎల్ -1 భూప్రదక్షిణ దశ ముగించుకుని.. సూర్యుడి దిశగా ప్రయాణం ప్రారంభించింది.ఇక ఇక్కడి నుంచి అసలు ఉత్కంఠ మొదలవుతుంది. సోమవారం అర్ధరాత్రి దాటాక.. వాహన నౌక లగ్రాంజ్ పాయంట్ 1 దిశగా దూసుకెళ్లడం ప్రారంభించింది. ఇప్పటికే ఈ ఉపగ్రహ భూకక్ష్యను నాలుగుసార్లు పెంచారు. తాజాగా ఐదోసారి కక్ష్యను పెంచి సూర్యుడి దిశలో వెళ్లేలా విన్యాసం చేశారు. బెంగళూరులోని టెలిమెట్రీ, ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్ వర్క్ కేంద్రంగా ఇస్రో ఆపరేట్ చేస్తుంది. అదేవిధంగా మారిషస్, పోర్ట్ బ్లెయిర్ లోని ఇస్రో గ్రౌండ్ స్టేషన్లు భూ కక్ష్య పెంపును సమీక్షించాయి. ప్రస్తుతం ఆదిత్య ఎల్-1 శాటిలైట్ 256 కి.మీ x 121973 కి.మీ. కక్ష్యలోకి ప్రవేశించినట్లు ఇస్రో శాస్త్రవేత్తలు వెల్లడించారు. శాటిలైట్ సూర్యుడి వైపు ప్రయాణించి.. నిర్దేశిత ఎల్-1 పాయింట్ కు చేరాలంటే మరో నాలుగు నెలల సమయం పడుతుందని పేర్కొన్నారు. డేటా సేకరణ ప్రారంభం సూర్యుడిపై పరిశోధనలకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో (ISRO) సెప్టెంబర్ 2వ తేదీన ఆదిత్య ఎల్ -1 (Aditya-L1) ప్రయోగించింది. అయితే ఇది శాస్త్రీయ డేటాను సేకరించడం ప్రారంభించింది. భూమి చుట్టూ ఉన్న పార్టికల్స్ ప్రవర్తనను విశ్లేషించడానికి శాస్త్రవేత్తలకు ఈ డేటా ఉపయోగపడనుంది. Aditya-L1 Mission: Aditya-L1 has commenced collecting scientific data. The sensors of the STEPS instrument have begun measuring supra-thermal and energetic ions and electrons at distances greater than 50,000 km from Earth. This data helps scientists analyze the behaviour of… pic.twitter.com/kkLXFoy3Ri — ISRO (@isro) September 18, 2023 -
ఆదిత్య –ఎల్1 కక్ష్య దూరం మళ్లీ పెంపు
సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఈనెల 2న ప్రయోగించిన ఆదిత్య –ఎల్1 ఉపగ్రహానికి శుక్రవారం నాలుగో విడత కక్ష్య దూరాన్ని పెంచారు. బెంగళూరులోని ఇస్రో టెలీమెట్రీ ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్వర్క్(ఇస్ట్రాక్), మారిషస్, అండమాన్ నికోబార్ దీవుల్లోని పోర్టుబ్లెయిర్ గ్రౌండ్‌స్టేషన్ల నుంచి ఇస్రో శాస్త్రవేత్తలు ఉపగ్రహంలో అపోజి ఇంధనాన్ని మండించి కక్ష్య దూరాన్ని విజయవంతంగా పెంచారు. మూడో విడతలో 296గీ71,767 కిలోమీటర్ల దీర్ఘవృత్తాకార కక్ష్యలో భూమి చుట్టూ పరిభ్రమిస్తున్న సమయంలో నాలుగో విడుతలో భూమికి దగ్గరగా ఉన్న 296 కిలోమీటర్ల దూరాన్ని 256 కిలోమీటర్లకు తగ్గిస్తూ భూమికి దూరంగా ఉన్న 71,767 దూరాన్ని 1,21,973 కిలోమీటర్లకు పెంచారు. ఈనెల 19న అయిదోసారి కక్ష్యదూరం పెంపుదలలో భాగంగా ఆదిత్య –ఎల్1 ఉపగ్రహాన్ని భూ మధ్యంతర కక్ష్యనుంచి సూర్యుడికి దగ్గరగా లాంగ్రేజియన్ పాయింట్–1 వద్ద çహాలో కక్ష్యలోకి ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. -
ఆదిత్య సెల్ఫీ..!
సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): సూర్యుడి దిశగా దూసుకుపోతున్న ఆదిత్య–ఎల్1 కెమెరా పని మొదలుపెట్టింది. తన సెల్ఫీతోపాటు భూమి, చంద్రుడిని కూడా క్లిక్ మనిపించింది. ఈ మేరకు ఆదిత్య–ఎల్1 నుంచి అందుకున్న ఫొటోలను బెంగళూరులోని ఇస్రో ప్రధాన కార్యాలయం గురువారం సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’లో విడుదల చేసింది. ఆదిత్య–ఎల్1లో అమర్చిన కెమెరా ఈనెల 4న తీసిన సెల్ఫీలో వీఈఎల్సీ (విజిబుల్ ఎమిషన్ లైన్), ఎస్‌యూఐటీ(సోలార్ అ్రల్టావయొలెట్) పరికరాలు కనిపిస్తున్నాయి. అదే కెమెరా భూమి, చంద్రుడి ఫొటోలను కూడా తీసింది. ఆదిత్య–ఎల్1లో అమర్చిన ఏడు వేర్వేరు పేలోడ్లలో వీఈఎల్సీ, ఎస్యూఐటీలు కూడా ఉన్నాయి. ఆదిత్య–ఎల్1 భూమికి 15 లక్షల కిలోమీటర్ల దూరంలోని లగ్రాంజియన్ పాయింట్1(ఎల్1)లోని తన నిర్దేశిత కక్ష్యలోకి చేరుకున్నాక సూర్యుడి చుట్టు పరిభ్రమిస్తూ వీఈఎల్సీ పేలోడ్ ద్వారా రోజుకు 1,440 ఫొటోలను తీసి భూనియంత్రిత కేంద్రాలకు విశ్లేషణ నిమిత్తం పంపించనుంది. -
ఆదిత్య L1 సెల్ఫీ...ఒకే ఫ్రేమ్ లో భూమి-చంద్రుడు..
-
వాహ్ ఆదిత్య.. సెల్ఫీ అద్భుతం
బెంగళూరు: సూర్యుడిపై పరిశోధనలకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ( ఇస్రో) ప్రయోగించిన ఉపగ్రహం ఆదిత్య ఎల్1 మిషన్ (Aditya L1 Mission) విన్యాసాలు షురూ చేశాడు. ఈ క్రమంలో ఏకంగా అద్భుతమైన ఫొటోలు తీసింది కూడా. భూమి నుంచి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న లాగ్రాంజ్ పాయింట్-1 దిశగా పయనిస్తోంది ఆదిత్య ఎల్1. అందుకు ఇంకా 4 నెలల సుదీర్ఘ ప్రయాణం చేయాల్సి ఉంటుంది. తొలి 16 రోజులు భూకక్ష్యల్లోనే చక్కర్లు కొడుతుంది. అలా.. చక్కర్లు కొడుతూ.. ఆదిత్య ఎల్1 అద్భుతమైన ఫొటోలను తీసింది. ఎల్1 మిషన్ కనిపించేలా సెల్ఫీ తీసుకోవడంతో పాటు ఒకే ఫొటోలో భూమి, సుదూరాన ఉన్న చంద్రుడు ఫొటోల్ని కూడా బంధించింది. సెప్టెంబర్ 4న భూమి, చంద్రుడు ఒకే కక్ష్యలో ఉన్న సమయంలో ఈ ఫొటో తీసినట్లు ఇస్రో తెలిపింది. ‘‘ ఆదిత్య-ఎల్1 మిషన్: చూస్తోంది!. సూర్యుడు-భూమి ఎల్1 పాయింట్ లక్ష్యంగా దూసుకెళ్తున్న ఆదిత్య ఎల్1 ఒక సెల్ఫీ తీసుకుంది. భూమి, చంద్రుడి చిత్రాలు కూడా తీసింది’’ అంటూ ఇస్రో ఒక వీడియోను షేర్ చేసింది. Aditya-L1 Mission: 👀Onlooker! Aditya-L1, destined for the Sun-Earth L1 point, takes a selfie and images of the Earth and the Moon.#AdityaL1 pic.twitter.com/54KxrfYSwy — ISRO (@isro) September 7, 2023 ఆదిత్య ఎల్1 మిషన్ శాటిలైట్ జీవితకాలం ఐదేళ్లు కాగా ఆదిత్య ఎల్1 ప్రయోగం ద్వారా.. సూర్యుడి పొరలైన ఫొటోస్పియర్, క్రోమోస్పియర్‌తో పాటు వెలుపల ఉండే కరోనాని అధ్యయనం చేయాలనుకుంటోంది ఇస్రో. -
ఇది మాత్రమే అభివృద్ధి కాదు!
76 ఏళ్ల స్వతంత్ర భారతదేశం సాధించిన ఘనతల పరంపరలో తాజాగా ‘చంద్రయాన్–3’ వచ్చి చేరడం కేంద్రంలోని పాలక పార్టీ బీజేపీకి కలిసొచ్చే అంశమే. ఇస్రో శాస్త్రవేత్తలు సల్పిన నిర్వరామ కృషి ఎన్డీఏ ప్రభుత్వ విజయంగా మారింది. కొన్ని దశాబ్దాల క్రితం రాకెట్లను ఎడ్ల బండ్లపై తీసుకెళ్లిన ఇస్రో శాస్త్రవేత్తలు కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా... తమ కృషిని కొనసాగిస్తూనే ఉన్నారు. శాస్త్ర సాంకేతిక రంగంలో దేశాన్ని అగ్రభాగాన నిలిపేందుకు వారు నిస్వార్థంగా కృషి చేస్తూనే ఉన్నారు. చంద్రయాన్–3 విజయం భారత్ ప్రతిష్ఠను అమాంతం ఆకాశం అంత ఎత్తుకు పెంచేసింది. చంద్రయాన్–3 తర్వాత సూర్యయాన్ వైపు ఇస్రో శాస్త్రవేత్తలు తమ కృషిని సాగించడమూ భారతీయులందరికీ గర్వకారణమే. అయితే, దేశ శాస్త్ర సాంకేతిక రంగంలో సాధించిన ఈ ఘనత, అభివృద్ధి అన్ని రంగాలలో ప్రతిఫలిస్తు న్నాయా? అనివార్యంగా వేసుకోవలసిన ప్రశ్న ఇది. అభివృద్ధిని నిర్ధారించడానికి ప్రపంచంలోని అన్ని దేశాలు కొలమానంగా మానవాభివృద్ధి సూచిక, శిశు మర ణాల రేటు, పార్లమెంట్లో మహిళల భాగస్వామ్యం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటున్నాయి. ఈ అంశాల ఆధారంగా భారత్‌తోపాటు ఇంచుమించుగా అదే సమయంలో స్వాతంత్య్రం పొందిన దేశాలు, ఇతర అభివృద్ధి చెందిన దేశాల ప్రగతిని బేరీజు వేసుకోవలసిన అవసరం ఉంది. ఇటీవల ప్రపంచ బ్యాంకు వెల్లడించిన అభివృద్ధి నివేదికలలో పలు ఆశ్చర్యకరమైన వాస్తవాలు వెల్లడయ్యాయి. బ్రిక్స్ దేశాలైన బ్రెజిల్, రష్యా, చైనా, సౌత్ ఆఫ్రికాలు; జీ7 కంట్రీస్‌గా పిలవబడే కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, యునైటెడ్ కింగ్‌డవ్‌ు, యునైటెడ్ స్టేట్స్‌లు; ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థలైన అర్జెంటీనా, చిలీ, కొలంబియా, ఈజిప్ట్, హంగరీ, ఇండోనేషియా, ఇరాన్, మలేసియా, మెక్సికో, ఫిలిప్పీన్స్, పోలెండ్, సౌదీ అరేబియా, థాయ్‌లాండ్, టర్కీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌తోపాటు భారత ఉపఖండంలోని బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్, పాకిస్తాన్, శ్రీలంక దేశాలు సాధించిన ర్యాంకింగ్‌ల ఆధారంగా అక్కడి స్థితిగతులు అర్థమవు తాయి. పైన పేర్కొన్న దేశాల జాతీయ స్థూల ఉత్పత్తి (జీడీపీ)ని పరిశీలిస్తే, 1960 నుంచి 2022 మధ్య కాలంలో తలసరి ఆదాయంలో భారత్‌ది అడుగు నుంచి మూడవ స్థానం. కేవలం పాకిస్తాన్, నేపాల్ మాత్రమే భారత్ కంటే దిగువన ఉన్నాయి. 1950 నుంచి 2021 మధ్య కాలంలో 31 దేశాల మానాభివృద్ధి సూచికలను పరిశీలించినప్పుడు భారత్ 1950లో 26వ స్థానంలో ఉండగా, 2021 నాటికి 29వ స్థానానికి పడిపోయింది. 32 దేశాల్లో శిశు మరణాలకు సంబంధించి 1960–1975 మధ్య కాలంలో, ఆ తర్వాత 2021 వరకు నమోదైన గణాంకాలను పరి శీలిస్తే... 1960–1975 మధ్య అత్యధిక శిశు మరణాలు నమోదైన దేశాలలో భారత్ 7వ స్థానంలో ఉంది. ఆ తర్వాత 2021 నాటికి ఆ స్థానం మరింత దిగజారి కింది నుంచి 3వ స్థానానికి చేరుకొంది. పార్లమెంట్లో మహిళల ప్రాతినిధ్యం అంశంలో 31 దేశాలలో 1997 నుంచి 2022 మధ్యకాలంలో భారత్‌ది 21వ స్థానం. 1997–98లో భారత్ పార్లమెంట్లో మహి ళల ప్రాతినిధ్యం 7 శాతం ఉండగా, 2022 నాటికి అది 14.9 శాతంకు పెరిగింది. 140 దేశాల కంటే భారత్ పార్లమెంట్లో మహిళల ప్రాతినిధ్యం తక్కువగా ఉంది. ఎక్కడైతే మహిళల ప్రాతినిధ్యం ఎక్కువగా ఉందో, ఆ దేశాలు అభివృద్ధిలో ముందంజలో ఉన్నా యని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇక.. విద్యుత్, ఇంటర్నెట్ సేవల రంగాలలో మాత్రం భారత్ గణనీయమైన పురోగతి సాధించింది. 1993–2000 మధ్య కాలంలో దేశంలో 50 శాతం జనాభాకు మాత్రమే విద్యుత్ సౌకర్యం అందు బాటులో ఉండగా, ప్రçస్తుతం దేశంలో 99 శాతం మందికి విద్యుత్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఇక, ఇంటర్నెట్ సేవల రంగాన్ని పరిశీ లిస్తే, 2020 నాటికి భారత్‌లో 43 శాతం జనాభాకు ఇంటర్నెట్ సదుపాయం అందుబాటులోకి వచ్చింది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా పేరుపడిన భారత్ పౌరహక్కులు, లింగ సమానత్వం, స్వేచ్ఛ వంటి అంశాలలో ఎంతో వెనుకబడింది. మానవా భివృద్ధి సూచికల్లో ప్రధానమైన అంశంగా పౌరహక్కులను పరిగణిస్తారు. పౌరహక్కులలో భారత్ స్థానం 92గా ఉంది. అంటే, భారత్ కంటే 91 దేశాలు మెరుగైన పరిస్థి తుల్లో ఉన్నట్లుగా నివేదికలు వెల్లడిస్తున్నాయి. భారతదేశంలో ప్రజాస్వామ్య మనుగడకు పలు రాజ్యాంగ వ్యవస్థలు దోహదం చేస్తాయి. అయితే, గత కొంతకాలంగా దేశంలోని పలు రాజ్యాంగ వ్యవస్థలను బలహీన పరిచే ప్రయత్నాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. ప్రజాస్వామ్యంలో ఎన్నికల నిర్వహణ అతి ముఖ్యమైన అంశం. ఆ బాధ్యతను నిర్వహించే స్వతంత్ర సంస్థ ‘భారత ఎన్నికల కమిషన్’నే పూర్తిగా తమ చెప్పుచేతల్లో పెట్టుకునే ప్రయత్నాలను కేంద్రంలో అధికా రంలో ఉన్నవారు చేయడం ఆశ్చర్యకరం. భారత ఎన్నికల కమిషన్ తరఫున చీఫ్ ఎన్నికల కమిషనర్, ఇతర ఎన్నికల కమిషనర్లు బాధ్యతలు నిర్వహిస్తారు. వారి నియామ కాలను చేపట్టే విధానాన్ని సమూలంగా మార్చడానికి కేంద్ర ప్రభుత్వం తాజాగా ఓ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. దాని ప్రకారం ఆ ఎంపిక కమిటీలో ప్రధానమంత్రి, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడితోపాటు భారత ప్రధాన న్యాయమూర్తి బదులుగా ఒక కేంద్ర మంత్రి నియమితులవుతారు. ఆ కేంద్రమంత్రిని ప్రధాన మంత్రే సభ్యుడిగా నియమిస్తారు. ఈ చట్టం అమలులోకి వస్తే ఎన్నికల నిర్వహణ తీరుతెన్నులు పూర్తిగా మారి పోతాయి. దేశంలో ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరగడం అన్నది ఇకపై ఉండకపోవచ్చు. ఇది దేశ ప్రజా స్వామ్యాన్ని పూర్తిగా ప్రమాదంలోకి నెట్టే చట్టం. శాస్త్ర సాంకేతిక రంగాలలో సాధించిన అభివృద్ధిని, ఐటీని, సేవల రంగంలోని అభివృద్ధినీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ద్వారా అందుబాటులోకి వచ్చిన అభివృద్ధినీ చూపి ఇదే దేశాభివృద్ధిగా చాటుకుంటే అంతకంటే ఆత్మవంచన మరొకటి ఉండదు. అభివృద్ధికి నిర్వచనం మార్చేసి మేడిపండు లాంటి అభివృద్ధి చూపి అదే అభివృద్ధి అని ప్రచారం చేస్తే ఎలా? ఇది కేవలం ఎన్నికల్లో లబ్ధి పొందడానికి చేస్తున్న ప్రయత్నమని వేరే చెప్ప వలసిన అవసరం లేదు. సి. రామచంద్రయ్య వ్యాసకర్త ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యులు -
ఆదిత్య హృదయం
రెండు వారాల్లో రెండు ప్రయోగాలు! ఒకటి చంద్రుడి పైకి... మరొకటి సూర్యుడి గురించి! భారత శాస్త్రవేత్తలు మన అంతరిక్ష ఆకాంక్షలను మరింత ఉన్నత కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. ఆగస్ట్ 23న చంద్రయాన్–3 ప్రయోగంతో ఇప్పటిదాకా పరిశోధనల్లో అసూర్యంపశ్యగా మిగిలిపోయిన చంద్రుడి దక్షిణ ధ్రువప్రాంతంపైకి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఉపగ్రహాన్ని పంపడం, రోబోటిక్ ల్యాండర్ విక్రమ్– రోవర్ ప్రజ్ఞాన్లు చంద్రునిపై సుతిమెత్తగా దిగడం, వాటిలో పరికరాలు పంపు తున్న అపూర్వడేటా దేశ కీర్తిప్రతిష్ఠల్ని పెంచాయి. ఆ విజయ పరంపర సాగుతుండగానే, భూమికి అతి సమీప నక్షత్రం సూర్యుడి అధ్యయనానికి భారత్ తొలిసారి ఉపగ్రహాన్ని పంపడం విశేషం. చంద్రయాన్–3తో పోలిస్తే, ‘ఆదిత్య– ఎల్1’ ప్రయోగంలో నాటకీయత తక్కువే. కానీ, సెప్టెంబర్ 2న సక్సెసైన ఈ సౌరశోధనా ఉపగ్రహ ప్రయోగం మరో 4 నెలల్లో కీలకమైన భౌమ– సౌర లాగ్రేంజ్ పాయింట్1 (ఎల్1)కు సురక్షితంగా చేరగలిగితే, ఎన్నో సౌర రహస్యాలు బయటకొస్తాయి. ఇప్పటికే చంద్రునిపై ఆక్సిజన్ జాడ సహా అనేకం కనుగొని, చంద్ర మండలం ఊహిస్తున్న దాని కన్నా ఎక్కువగానే ఆవాసయోగ్యమని మనం తేల్చాం. రేపటి శోధనలో ఆదిత్య హృదయం ఏం వెల్లడిస్తుందో ఆసక్తికరమే. దేశంలోని మరో ఆరు సంస్థల భాగస్వామ్యంతో ఇస్రో చేస్తున్న ఈ రోదసీ గవేషణతో సౌర వర్తన, అంతరిక్ష వాతావరణం, వైపరీత్యాల నుంచి మన అంతరిక్ష ఆస్తుల సంరక్షణ వగైరాలపై లోతైన అవగాహన కలగవచ్చు. అంతరిక్ష పరిశోధనలో అంతకంతకూ భారత్ ముంద డుగులు వేస్తున్నదనడానికి ఇది మరో కొండగుర్తు. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ ‘నాసా’, అలాగే యూరోపియన్ అంతరిక్ష పరిశోధనా సంస్థ ‘ఈసా’లు సూర్యుడి గురించి ఇప్పటికే 20కి పైగా శాస్త్రీయ అంతరిక్ష ప్రయోగాలు జరిపాయి. అమెరికా, యూకేల సాయంతో జపాన్ సైతం తన పరిశోధక ఉపగ్రహాన్ని 2006లో ప్రయోగించింది. అయితే, మన ఇస్రో మాత్రం ‘చంద్రయాన్’ లాగానే ఈ సూర్య మండల గవేషణలోనూ తన వైన ప్రత్యేక ఆవిష్కరణలు చేయాలని నడుం బిగించింది. ముఖ్యంగా సూర్య గోళానికి వెలుపల విస్తరించి ఉండే కాంతివలయమూ, సౌర వాతావరణానికి పైభాగమైన (కరోనా); సూర్యునిలో భాగమైన వెలుగులు విరజిమ్మే ప్రకాశమండలం (ఫోటోస్పియర్); ఆ చుట్టూ వ్యాపించే, సౌర వాతా వరణానికి దిగువ ప్రాంతమైన వర్ణమండలం (క్రోమోస్పియర్); సౌర పవనాలు – వీటన్నిటిపైనా దృష్టి సారించాలని రంగంలోకి దిగింది. ‘ఆదిత్య ఎల్1’లోని శాస్త్రీయ పరికరాల ద్వారా సౌర విద్యు దయస్కాంత క్షేత్రాలనూ, వెలువడే కణ ఉద్గారాలనూ లెక్కించాలని ప్రణాళిక వేసుకుంది. తద్వారా సూర్యుడి ప్రవర్తన గురించి కొత్త అంశాలను వెలికి తీసుకురావాలనేది ప్రధాన లక్ష్యం. చంద్రయాన్ ద్వారా చంద్రుడు, వెంటనే ఆదిత్య–ఎల్1 ద్వారా సూర్యుడు, ఆ వెంటనే శుక్రుడు, అటు పైన మానవ సహిత వ్యోమనౌకతో అంతరిక్ష యానమైన ‘గగన్‌యాన్’... ఇలా వరుసగా అనేక బృహత్ యజ్ఞాలను ఇస్రో చేపడుతోంది. బుధుడి తర్వాత మనకు అత్యంత సమీపంలో ఉన్న శుక్ర గ్రహపు మేళనాన్నీ, అక్కడి వాతావరణాన్నీ అధ్యయనం చేయడం ఒక ప్రాజెక్ట్ ఆలోచనైతే, ముగ్గురు భారత వ్యోమగాముల్ని అంతరిక్షంలోకి పంపి, మళ్ళీ వారిని సురక్షితంగా భూమి మీదకు తీసుకు రావడం మరో ప్రాజెక్ట్ లక్ష్యం. ఇప్పటి వరకు ప్రపంచంలో 3 దేశాలు (అమెరికా, రష్యా, చైనా) మాత్రమే ఇలా మనుషుల్ని అంతరిక్షంలోకి పంపాయన్నది గమనార్హం. ఈ ప్రాజెక్టులన్నిటిలో ఇస్రో ఎంచుకున్న మార్గం ఒక్కటే – వీలైనంత తక్కువ ఖర్చులో ఉన్నత సాంకేతిక నవకల్పన! తాజా సౌరశోధననే చూస్తే– భూమి నుంచి 15 కోట్ల కి.మీ.ల దూరంలో సూర్యుడుంటాడు. మన ఆదిత్య–ఎల్1 వెళ్ళేది అందులో 15 లక్షల కి.మీ.ల దూరమే. అంటే, భూమి కన్నా ఒక్క శాతం మాత్రమే సూర్యునికి దగ్గరగా వెళుతుంది. అయితేనేం, సూర్య, భూమి రెంటి గురుత్వాకర్షణ శక్తి సమానంగా ఉండి, అందుకు తగ్గట్టు వ్యోమనౌక తిరిగేందుకు కావాల్సిన కేంద్రోన్ముఖ బలాన్నిఅందించే పరివేష కక్ష్య (హేలో ఆర్బిట్)లోని కీలకమైన లాగ్రేంజ్ పాయింట్1 (ఎల్1)లో ఈ ఆదిత్య ఉపగ్రహాన్ని ప్రవేశపెడతారు. దీనివల్ల ఎక్కువగా ఇంధనం ఖర్చు కాకుండానే మన ఉపగ్రహం సౌర మండలాన్ని నిరంతరాయంగా పరిశీలించవచ్చు. భూమి నుంచి 9.9 కోట్ల కి.మీ.ల దగ్గరున్నప్పుడు కుజుడి అధ్యయనానికి గతంలో మంగళ్యాన్ చేసిన మన అనుభవమూ ఆదిత్యకు పనికొచ్చింది. ఎల్1 వైపు సాగుతున్న ప్రయాణంలో ఆదిత్య ఉపగ్రహ కక్ష్యను ఇప్పటికి రెండుసార్లు విజయవంతంగా పెంచగలిగాం. సెప్టెంబర్ 10న మూడోసారి కక్ష్య పెంపు ఉండనుంది. వెరసి, ప్రయోగం నాటి నుంచి 125 రోజులకు, అంటే సుమారు నాలుగు నెలలకు పరివేష కక్ష్యలో ఎల్1 వద్ద మన ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టే ప్రక్రియ పూర్తవుతుంది. వచ్చే అయిదేళ్ళ పాటు ఈ ఉపగ్రహం సూర్యుడికి సంబంధించిన సమాచారాన్ని సేకరించి, పంపనుంది. అంతా బాగుంటే, ఆ తర్వాత కూడా మరో పదేళ్ళ పైగానే అది పనిచేసే అవకాశం కూడా ఉందట. జ్ఞానమే సమున్నత అధికారమైన ఆధునిక సమాజంలో, దానిపై ఆధారపడ్డ ఆర్థిక వ్యవస్థలో అగ్రరాజ్యాలతో మనం దీటుగా నిలబడేందుకు అంతకు మించి ఇంకేం కావాలి! అనేక దేశాల వల్ల కాని సూర్యచంద్ర శోధనను మనం సాధించ గలగడం మన శాస్త్రవేత్తల నిర్విరామ కృషికి నిదర్శనమే! 2020 నుంచి ప్రైవేటీకరణ బాట పట్టిన భారత అంతరిక్ష విధానంతో, 360 బిలియన్ డాలర్ల ప్రపంచ అంతరిక్ష ఆర్థిక వ్యవస్థలో గణనీయ మైన వాటా దక్కించుకోవడానికీ ఇలాంటి శోధనలు, విజయసాధనలు మరింత అవసరమే! -
ఆదిత్య–ఎల్1 మొదటి కక్ష్య పెంపు విజయవంతం
సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) శనివారం మధ్యాహ్నం సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి ప్రయోగించిన ఆదిత్య –ఎల్1 ఉపగ్రహానికి మొదటిసారి కక్ష్య దూరాన్ని విజయవంతంగా పెంపొందించింది. బెంగళూరులోని మిషన్ ఆపరేటర్ కాంఫ్లెక్స్ (ఎంఓఎక్స్), ఇస్రో టెలీమెట్రీ ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్వర్క్(ఇ్రస్టాక్), బైలాలులో ఉన్న ఇండియన్ డీప్ స్పేస్ నెట్వర్క్ (ఐడీఎస్ఎన్) లాంటి భూనియంత్రత కేంద్రాల నుంచి ఇస్రో శాస్త్రవేత్తలు ఉపగ్రహంలోని అపోజి ఇంధనాన్ని మండించి కక్ష్య దూరాన్ని విజయవంతంగా పెంచారు. శనివారం ప్రయోగం చేసినపుడు భూమికి దగ్గరగా 235 కిలోమీటర్లు, దూరంగా 19,500 కిలోమీటర్లు ఎత్తులో భూ మధ్యంతర కక్ష్యలో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. మొదటి విడత కక్ష్య దూరం పెంపుదలలో భూమికి దగ్గరగా 235 కిలోమీటర్ల నుంచి 245 కిలోమీటర్లకు పెంచారు. భూమికి దూరంగా ఉన్న 19,500 కిలోమీటర్ల దూరాన్ని 22,459 కిలోమీటర్లకు పెంచారు. అంటే ప్రస్తుతం 245‘‘22459 కిలోమీటర్లు దీర్ఘ వృత్తాకార కక్ష్యలో భూమి చుట్టూరా పరిభ్రమిస్తూ ఉంది. రాబోయే 15 రోజుల్లో మరో నాలుగుసార్లు కక్ష్య దూరాన్ని పెంచుతూ ఈనెల 18న భూ మధ్యంతర కక్ష్య నుంచి సూర్యుని వైపునకు మళ్లిస్తారు. అక్కడి నుంచి 15 లక్షల కిలోమీటర్ల దూరంలోని లాంగ్రేజియన్ బిందువు 1 వద్దకు చేర్చడానికి 125 రోజులు సమయం తీసుకుంటుందని ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ తెలిపారు. -
ఇస్రో శాస్త్రవేత్తల విశేష కృషి: సోమనాథ్
సూళ్లూరుపేట (తిరుపతి జిల్లా): ఆదిత్య–ఎల్1 ప్రయోగం విజయవంతం కావడం వెనుక ఇస్రో శాస్త్రవేత్తల కృషి ఎంతో ఉందని ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ తెలిపారు. ఆదిత్య–ఎల్1 ప్రయోగం సక్సెస్ అయిన వెంటనే ఆయన మిషన్ కంట్రోల్ సెంటర్ నుంచి మాట్లాడారు. ఈ ప్రయోగాన్ని ముందుగా అనుకున్న విధంగానే చేయగలిగామని చెప్పారు. జూలై 14న నిర్వహించి చంద్రయాన్–3 మిషన్‌ను ఆగస్టు 23న చంద్రుడిపై ల్యాండర్‌ను దించి సక్సెస్‌ను ఆస్వాదిస్తున్న సమయంలోనే సూర్యయాన్–1కి రెడీ అయిపోయామని చెప్పారు. రేపటి నుంచి 16 రోజుల పాటు ఆర్టిట్ రైజింగ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు. 125 రోజుల తర్వాత ఉపగ్రహాన్ని సూర్యుని దిశగా పయనింపజేసి 15 లక్షల కిలోమీటర్ల దూరంలోని లాంగ్రేజియన్–1 బిందువు వద్ద ప్రవేశపెడతామన్నారు. భవిష్యత్తులో చంద్రయాన్–4 ప్రయోగం, ఆ తర్వాత శుక్రుడి మీదకు కూడా ప్రయోగానికి సిద్ధమవుతామని తెలిపారు. ఈ ఏడాది ఆక్టోబర్‌లో గగన్‌యాన్ ప్రయోగాత్మక ప్రయోగం, జీఎస్ఎల్వీ మార్క్–2 రాకెట్ ద్వారా త్రీడీఎస్ అనే సరికొత్త ఉపగ్రహాన్ని పంపించబోతున్నామని చెప్పారు. ఇస్రోకు ప్రధాని అభినందనలు న్యూఢిల్లీ: దేశం యొక్క మొదటి సోలార్ మిషన్‌ను విజయవంతంగా పూర్తి చేసిన ఇస్రో శాస్త్రవేత్తలకు ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. మానవాళి సంక్షేమం కోసం విశ్వాంతరాళాన్ని అర్థం చేసుకునే క్రమంలో మన శాస్త్రీయ పరిశోధనలు అవిశ్రాంతంగా కొనసాగుతాయని ఎక్స్‌లో ఆయన పేర్కొన్నారు. ఆదిత్య–ఎల్1 ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేసిన ఇస్రో ఇంజినీర్లు, శాస్త్రవేత్తలకు అభినందనలు అని తెలిపారు. ఇస్రో బృందానికి ఏపీ సీఎం వైఎస్ జగన్ అభినందనలు సాక్షి, అమరావతి: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో.. పరిశోధనల క్రమంలో సోలార్ మిషన్ ఆదిత్య ఎల్1 ఉపగ్రహాన్ని నింగిలోకి విజయవంతంగా ప్రవేశపెట్టడం పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇస్రో బృందాన్ని అభినందించారు. భారతీయ అంతరిక్ష సాంకేతికతను మరింత ఎత్తుకు తీసుకెళ్లే మిషన్‌ను సాధించాలని సీఎం వైఎస్ జగన్ ఆకాంక్షించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ అభినందనలు సాక్షి, హైదరాబాద్: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) శనివారం ‘ఆదిత్య ఎల్–1’ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించడం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు. ఇస్రో అంతరిక్ష పరిశోధనా రంగంలో మరో కీలక మైలురాయిని దాటిందని అన్నారు. అంతరిక్ష పరిశోధనా రంగంలో ప్రపంచానికి ఆదర్శంగా దేశ శాస్త్రవేత్తలు సాధిస్తున్న ప్రగతి, ప్రతి భారతీయుడు గర్వపడేలా చేసిందన్నారు. ఇస్రో చైర్మన్, శాస్త్రవేత్తలు, సాంకేతిక సిబ్బందిని అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. -
చూసేదేమిటి? చేసేదేమిటి?.. మన ఆదిత్యుడి కథా కమామిషు..
సౌర కుటుంబం మొత్తానికి తన వెలుగుల ద్వారా శక్తిని అందించే సూర్యుడిపై అధ్యయనానికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) వదిలిన బాణం ఆదిత్య–ఎల్1 లక్ష్యం వైపు దూసుకెళుతోంది. సుమారు 4 నెలల ప్రయాణం, 15 లక్షల కిలోమీటర్ల దూరాన్ని అధిగమించి ఈ అబ్జర్వేటరీ (వేధశాల) భూమి, సూర్యుడు ఆకర్షణ శక్తి రెండూ లేని లగ్రాంజ్ పాయింట్ వద్దకు చేరుకోనుంది. ఆదిత్య–ఎల్1లో ఏ పరికరాలున్నాయి? వాటితో చేసే ప్రయోగాలేమిటి? పరిశీలనలేమిటి?ప్రయోజనాలేమిటి?స్థూలంగా.... ఆదిత్య–ఎల్1లో మొత్తం 7శాస్త్రీయ పరికరాలు ఉంటాయి. వీటిల్లో నాలుగు సూర్యుడిని పరిశీలించేందుకు ఉపయోగిస్తే.. మిగిలిన మూడు లగ్రాంజ్ పాయింట్ దగ్గరే వేర్వేరు ప్రయోగాలు చేస్తాయి. ఒక్కో పరికరం.. దాని ప్రాశస్త్యం, చేసే పని గురించి తెలుసుకుందాం... ► విజిబుల్ ఎమిషన్ లైన్ కరోనాగ్రఫ్ (వీఈఎల్సీ): సూర్యుడు ఓ మహా వాయుగోళం. హైడ్రోజన్ అణువులు ఒకదాంట్లో ఒకటి కలిసిపోతూ (కేంద్రక సంలీన ప్రక్రియ) అపారమైన శక్తిని విడుదల చేస్తూండే ప్రాంతం. కంటికి కనిపించే సూర్యుడి భాగాన్ని ఫొటోస్ఫియర్గా పిలుస్తారు. దీని దిగువన ఉన్న ఇంకో పొరను క్రోమోస్ఫియర్ అని.. దీని దిగువన ఉన్న మరో పొరను కరోనా అని పిలుస్తారు. వీఈఎల్సీ అనేది ఈ కరోనా పొర ఛాయాచిత్రాలను తీస్తుంది. అలాగే వేర్వేరు కాంతుల్లో (పరారుణ, అతినీలలోహిత, ఎక్స్–రే) కరోనాను పరిశీలిస్తుంది కూడా. బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్, ఇస్రోలు కలిసి తయారు చేసిన ఈ పరికరం కరోనా నుంచి వెలువడే శక్తిమంతమైన కణాల ప్రవాహాం (కరోనల్ మాస్ ఎజెక్షన్)పై ఓ కన్నేస్తుంది. కరోనల్ మాస్ ఎజెక్షన్లతో వెలువడే శక్తిమంతమైన ఫొటాన్లు భూ వాతావరణంపై ప్రభావం చూపగలవని అంచనా. ► సోలార్ అ్రల్టావయలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్(ఎస్‌యూఐటీ): వీఈఎల్సీ కరోనా అధ్యయనానికి ఉపయోగిస్తూంటే ఈ ఎస్యూఐటీని ఫొటో స్పియర్, క్రోమోస్పియర్ల ఛాయాచిత్రాలు తీసేందుకు ఉపయోగిస్తారు. అది కూడా అతినీలలోహిత కాంతి మాధ్యమం ద్వారా. అలాగే ఈ ప్రాంతంలో సూర్యుడి ఇర్రేడియన్స్ (నిర్దిష్ట ప్రాంతంలో పడే రేడియోధారి్మక శక్తి మొతాదు)ను కూడా కొలుస్తారు. ఇస్రో సహకారంతో పుణేలోని ఇంటర్ యూనివర్శిటీ సెంటర్ ఫర్ అస్ట్రానమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్ నిర్మించింది ఈ పరికరాన్ని. ► సోలార్ లో ఎనర్జీ ఎక్స్–రే స్పెక్ట్రోమీటర్ (సోలెక్స్): హై ఎనర్జీ ఎల్–1 ఆర్బిటింగ్ ఎక్స్–రే స్పెక్ట్రోమీటర్ (హీలియోస్) సూర్యుడి నుంచి వెలువడే ఎక్స్–రే కిరణాల పరిశీలనకు ఈ రెండు పరికరాలను ఉపయోగిస్తారు. కాకపోతే సోలెక్స్ అనేది కరోనా నుంచి వెలువడే ఎక్స్–రే కిరణాల్లో తక్కువ శక్తి కలిగిన వాటి ధర్మాలు, మార్పులను అధ్యయనం చేస్తే హీలియోస్ ఎక్కువ శక్తిగల వాటిపై దృష్టి పెడుతుంది. ఈ రెండు పరికరాలను బెంగళూరులోని యు.ఆర్.రావు శాటిలైట్ సెంటర్ అభివృద్ధి చేసింది. ► ఆదిత్య సోలార్ విండ్ పార్టికల్ ఎక్స్పెరిమెంట్ (ఎస్పెక్స్): పేరులో ఉన్నట్లే ఇది సౌరగాలుల్లోని కణాలపై ప్రయోగాలు చేస్తుంది. ఈ కణాల వేగం, సాంద్రత, ఉష్ణోగ్రతల వంటివి గుర్తిస్తుంది. తద్వారా ఈ గాలులు ఎక్కడ పుడుతున్నాయి? ఎలా వేగం పుంజుకుంటున్నాయన్నది తెలుస్తుంది. అహ్మదాబాద్‌లోని ఫిజికల్ రీసెర్చ్ లాబొరేటరీ దీన్ని అభివృద్ధి చేసింది. ► ప్లాస్మా అనలైజర్ ప్యాకేజ్ ఫర్ ఆదిత్య (పాపా): సూర్యుడి కరోనా పొర వెలువరించే ప్లాస్మా ధర్మాలను, సౌర గాలుల్లో ఏమేం ఉంటాయి? ఉష్ణోగ్రత, సాంద్రతలను గుర్తిస్తుంది. తిరువనంతపురంలోని విక్రం సారాభాయ్ స్పేస్ సెంటర్లోని స్పేస్ ఫిజిక్స్ లాబొరేటరీ తయారు చేసింది. ► అడ్వాన్స్డ్ ట్రై ఆక్సియల్ హై రెజల్యూషన్ మాగ్నెటోమీటర్: ఆదిత్య ఎల్–1 సూర్యుడిని పరిశీలించే ప్రాంతంలో గ్రహాంతర అయస్కాంత క్షేత్రాలను లెక్కగట్టేందుకు ఉపయోగిస్తున్నారు. ఈ అయస్కాంత క్షేత్రాలకు సౌర గాలులు, కరోనా తాలూకూ ప్లాస్మాల మధ్య సంబంధాలను గమనిస్తుంది. బెంగళూరులోని లా»ొరేటరీ ఫర్ ఎలక్ట్రో ఆప్టిక్స్ సిస్టమ్ అభివృద్ధి చేసిందీ పరికరాన్ని. మన ఆదిత్యుడి కథ కమామిషు... ► సౌర కుటుంబంలోనే అతిపెద్ద ఖగోళ వస్తువు, నక్షత్రం అయిన సూర్యుడి వయసు సుమారు 460 కోట్ల సంవత్సరాలు ► భూమి వ్యాసార్ధం కంటే దాదాపు 864,938 రెట్లు ఎక్కువ వ్యాసార్ధం సూర్యుడిది. కొంచెం అటు ఇటుగా 13.9 లక్షల కిలోమీటర్లు!! ► అతి భారీ వాయుగోళమైన సూర్యుడిలో 75 శాతం హైడ్రోజన్ కాగా.. మిగిలిన 25 శాతం హీలియం. లేశమాత్రంగా కొన్ని ఇతర అణువులు కూడా ఉంటాయి. ► కేంద్రక సంలీన ప్రక్రియ ద్వారా సూర్యుడిపై హైడ్రోజన్ కాస్తా హీలియంగా మారుతూంటుంది. ► సూర్యుడిపై ఉష్ణోగ్రత అన్నిచోట్ల ఒకేలా ఉండదు. కంటికి కనిపించే సూర్యుడి ఉపరితలం (ఫొటోస్పియర్) ఉష్ణోగ్రత సుమారు 5,500 డిగ్రీ సెల్సియస్. ఈ ఫొటోస్ఫియర్కు దిగువన క్రోమోస్పియర్ ఉంటే.. దాని దిగువన ఉండే కరోనా ప్రాంతంలో ఉష్ణోగ్రత 10 నుంచి 30 లక్షల డిగ్రీల సెల్సియస్. కరోనా కంటే లోతైన ప్రాంతం లేదా సూర్యుడి మధ్యభాగంలో వేడి కోటీయాభై లక్షల డిగ్రీల సెల్సియస్ అని అంచనా. ► సముద్రానికి ఆటుపోట్ల మాదిరిగా సూర్యుడిపై జరిగే కార్యకలాపాల్లో కూడా ఒక క్రమపద్ధతి ఉంటుంది. పదకొండేళ్లకు ఒకసారి ఆ కార్యకలాపాల్లో హెచ్చుతగ్గులు ఉంటాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. 2019 డిసెంబరులో సూర్యుడు 25వ సోలార్ సైకిల్‌లోకి ప్రవేశించినట్లు శాస్త్రవేత్తలు ప్రకటించారు. -
Aditya-L1: మిషన్ సూర్య సక్సెస్
సూళ్లూరుపేట (తిరుపతి జిల్లా): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) సూర్యడిపై పరిశోధనలు చేయాలనే కల నెరవేరింది. సూర్యయాన్–1 పేరుతో చేసిన ఆదిత్య –ఎల్1 ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించి ఇస్రో మంచి జోష్ మీదుంది. నిన్న చంద్రయాన్–3, నేడు సూర్యయాన్ ప్రయోగంతో వరుసగా రెండు గ్రహాంతర ప్రయోగాలను విజయవంతం చేసి చరిత్రాత్మక విజయాలను సొంతం చేసుకుంది. ఈ ప్రయోగంతోనే చంద్రయాన్–4, శుక్రుడిపై ప్రయోగానికి బీజం పడింది. ప్రపంచంలో నాసా ఇప్పటికే సూర్యుడిపై అధ్యయనం చేయడానికి ప్రయోగాలను చేసింది. ఆ తరువాత మొదటిసారి సూర్యుడిపై పరిశోధనలకు శ్రీకారం చుట్టింది. సూర్యుడు అగి్నగోళం కదా! అక్కడికి ఉపగ్రహాన్ని పంపిస్తే కాలిపోదా! అనే సందేహం చాలామందిలో ఉంది. అందుకే భూమికి 15 లక్షల కిలోమీటర్లు దూరంలోని సూర్యునికి దగ్గరగా ఉన్న లాంగ్రేజియన్ బిందువు 1 వద్ద ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టి అ«ధ్యయనం చేయనున్నారు. సౌర తుఫాన్ సమయంలో వెలువడే రేణువుల వల్ల భూమిపై సమాచార వ్యవస్థకు అవరోధాలు ఏర్పడుతున్నాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. దీంతోపాటు కాంతిమండలం (ఫొటోస్పియర్), వర్ణ మండలం (క్రోమోస్పియర్)లపై అధ్యయనం చేసి సమాచారాన్ని సేకరించాలని ఈ ప్రయోగాన్ని నిర్వహించేందుకు పూనుకున్నారు. సూర్యుడి వెలుపలి వలయాన్ని కరోనా అంటారు. సూర్యగోళానికి వేల కిలోమీటర్ల దూరం వరకు ఇది విస్తరించి ఉంటుంది. కరోనాలో వేడి పెరిగిపోతుండడానికి కారణం శాస్త్రవేత్తలకు అంతు చిక్కడం లేదు. ఈ అంశంపై ఆదిత్య–ఎల్1 దృష్టి సారించి పరిశోధనలు చేయనుంది. చంద్రుడు, అంగారకుడిపై చేసిన పరిశోధనలు మొదటి ప్రయత్నంలోనే విజయవంతం కావడంతో సూర్యుడిపై కూడా పరిశోధనలు కూడా మొదటి ప్రయత్నంలోనే చేసేందుకు శాస్త్రవేత్తలు సిద్ధమై ప్రయోగంలో మొదటి ఘట్టాన్ని విజయవంతంగా పూర్తి చేసి అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానంలో ప్రపంచంలో భారత్‌కు తిరుగులేదని మరోమారు నిరూపించారు. తిరుపతి జిల్లాలోని సతీష్ ధవన్ అంతరిక్ష ప్రయోగం కేంద్రంలోని రెండో ప్రయోగవేదిక నుంచి సూర్యయాన్–1 పేరుతో పీఎస్ఎల్వీ సీ57 రాకెట్ ద్వారా 1,480 కిలోలు ఆదిత్య –ఎల్1 ప్రయోగాన్ని నిర్వహించి ఇస్రో చరిత్రలోచరిత్రాత్మక ఘట్టానికి శ్రీకారం చుట్టారు. మొన్న చంద్రయాన్–3 సక్సెస్ జోష్‌లో ఉన్న ఇస్రో శాస్త్రవేత్తలు సూర్యుడిపై అధ్యయనం కోసం ఆదిత్య–ఎల్1 ప్రయోగాన్ని కూడా విజయవంతంగా నిర్వహించి ప్రపంచంలో అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానంలో తిరుగులేని దేశంగా మరోమారు నిలిపారు. సూర్యుడి మీద అధ్యయనం చేసే ప్రయోగం కావడం, కక్ష్య దూరం కొత్తగా ఉండడంతో మిషన్ కంట్రోల్‌రూంలో నిశ్శబ్ద వాతావరణం ఆవరించింది. శుక్రవారం మధ్యాహ్నం 12.10 గంటలకు ప్రారంభమైన కౌంట్‌డౌన్ 23.40 గంటలపాటు కొనసాగింది. కౌంట్‌డౌన్ ముగిసే సమయం దగ్గర పడింది. కౌంట్‌డౌన్ సమయంలో జీరో పడడమే తరువాయి.. తూర్పువైపున నిప్పులు చెరుగుతున్న భగభగ మండే ఎండను, మబ్బులను చీల్చుకుంటూ ఎరుపు, నారింజ రంగు మంటలను చిమ్ముతూ పీఎస్ఎల్వీ సీ57 ఉపగ్రహ వాహకనౌక ఆదిత్య ఎల్1 ఉపగ్రహాన్ని మోసుకుని నింగివైపునకు దూసుకెళ్లింది. వెంటనే మిషన్ కంట్రోల్‌రూంలోని శాస్త్రవేత్తలు టెన్షన్‌గా కంప్యూటర్లును ఆపరేట్ చేస్తూ కంటి మీద రెప్ప వాల్చకుండా రాకెట్ గమనాన్ని పరిశీలించారు. నాలుగు దశలతో కూడిన ప్రయోగాన్ని 01.03.31 గంటల వ్యవధిలో పూర్తి చేశారు. 1,480 కిలోల ఆదిత్య ఎల్1 ఉపగ్రహాన్ని గంటా మూడు నిమిషాల వ్యవధిలో భూమికి దగ్గరగా (పెరిజీ)235 కిలోమీటర్లు, భూమికి దూరంగా (అపోజి) 19,500 కిలోమీటర్లు ఎత్తులో ఎసిన్‌ట్రిక్ ఎర్త్ బౌండ్ అర్బిట్(అత్యంత విపరీతమైన కక్ష్య)లోకి విజయవంతంగా ప్రవేశపెట్టారు. ఈ ఉపగ్రహం 125 రోజులకు లాంగ్రేజియన్ బిందువు వద్ద ప్రవేశపెట్టి, 12 రోజుల తర్వాత సూర్యుడు సమీపంలోని లాంగ్రేజియన్ బిందువు–1 వద్ద అధ్యయనం చేసి సూర్యునిపై రహస్యాలను భూమికి చేర్చుతుంది. అంతరిక్ష ప్రయోగాల్లో ఇస్రో 90వ సారి ప్రయోగాన్ని కూడా విజయవంతంగా నిర్వహించి మరో గ‘ఘన’విజయాన్ని నమోదు చేసుకున్నారు. గ్రహాంతర ప్రయోగాల్లో ఆదిత్య ఎల్1 మిషన్ ఐదో ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించారు. రాకెట్ వివరాలు ► పీఎస్ఎల్వీ సీ57 రాకెట్‌ను నాలుగు దశల్లో ప్రయోగించారు. మొదటి, మూడో దశలు ఘన ఇంధనంతో.. రెండు, నాలుగు దశలు ద్రవ ఇంధనంతో నిర్వహించారు. ► పీఎస్ఎల్వీ సీ57 రాకెట్ పొడవు 44.4 మీటర్లు ► రాకెట్ ప్రయోగ సమయంలో 321 టన్నుల బరువుతో భూమి నుంచి నింగికి పయనమైన 1.03.31 గంటల్లో (3,799.52 సెకన్లు) ప్రయోగాన్ని పూర్తి చేశారు. -
నాడే విడుదల వీర శూర సూర్యచిత్ర
ఆదిత్య ఎల్1 మిషన్ విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లిన సందడి ఆకాశంలోనే కాదు అంతర్జాలంలోనూ కనిపిస్తోంది. సూర్యుడి చుట్టూ పరిభ్రమించిన సైన్స్–ఫిక్షన్ నుంచి సినిమాల వరకు ఎన్నో విషయాలు అంతర్జాలంలో చక్కర్లు కొడుతున్నాయి. మచ్చుకు ఫేస్బుక్లో ఒక వీడియో... జర్నీ టు ది ఫార్ సైడ్ ఆఫ్ ది సన్(1969) సినిమా తాలూకు ట్రైలర్ ఇది. ‘అపోలో హ్యాజ్ కాంకర్డ్ ది మూన్’ ‘వేర్ టూ నౌ ఇన్ స్పేస్?’ టైటిల్స్‌తో ట్రైలర్ మొదలవుతుంది. ఆ తరువాత... ఒక రాకెట్ నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి దూసుకువెళుతుంది. ఇప్పటి సినిమాలకు ఏమాత్రం తగ్గని ఉత్కంఠ ఈ ట్రైలర్లో కనిపిస్తుంది. ‘నాట్ ది ఎండ్’ అని ఊరిస్తూ ట్రైలర్ ముగుస్తుంది. -
ఆదిత్య L1 లాంచ్ : ఆనంద్ మహీంద్ర ఆసక్తికర ట్వీట్ వైరల్
Aditya L1 launch మిషన్ ఆదిత్య ఎల్ 1 పేరుతో ఇస్రో మరో ఘనతను సాధించింది. సూర్యుడి పరిశోధనలు నిర్వహించేందుకు ఆదిత్య ఎల్1 మిషన్‌ను శనివారం ఇస్రో విజయవంతంగా చేపట్టింది. ఈ మిషన్ సక్సెస్‌తో దేశవ్యాప్తంగా హర్షం వ్యక్తం అవుతోంది. అటు పారిశ్రామిక వేత్త, బిలియనీర్ ఆనంద్ మహీంద్ర కూడా దీనిపై స్పందించారు. ఈ సందర్బంగా ట్విటర్(ఎక్స్)లో ఆసక్తికరమైన పోస్ట్ చేశారు. ఇండియా తొలి సోలార్ మిషన్ పట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తూగ్రీకు పురాణ గాథలొ మైనపు రెక్కలతో సూర్యునికి దగ్గరగా ఎగురుతూ మరణించిన డేడాలస్ కుమారుడు ఇకారస్ కథను గుర్తుచేసుకున్నారు. “‘సూర్యుడికి చాలా దగ్గరగా ఎగరవద్దు’ అనే సామెత గ్రీకు పురాణం నుంచి వచ్చింది. గ్రీకు లెజెండ్ ఐకారస్ సూర్యుని దగ్గరగా వెళ్లి ప్రాణాలు పోగొట్టుకున్నారు. అత్యాశకు ప్రతీకగా నిలిచిన ఈ మాటల్ని ఇక ఇస్రో చెరిపేయనుంది. మనం మన ఆశయాలను మరింత ఉన్నతంగా నిర్దేశించుకునేలా 'సూర్యుడికి దగ్గరగా ఎగురుదాం' అనే సందేశాన్నిస్తున్న ఇస్రోకు ధన్యవాదాలు అంటూ ఆయన రాశారు.ఈ సందర్బంగా ఆదిత్య ఎల్1 మిషన్ కు సంబంధించిన వీడియోను కూడా షేర్ చేశారు. దీంతో ఇది నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది. (దివంగత రాకేష్ ఝన్‌ఝన్‌వాలా లగ్జరీ బంగ్లా: ఎన్ని అంతస్తులో తెలుసా?) మరోవైపు చంద్రయాన్-3 సక్సెస్ అంతరిక్షంలో భారత్ జైత్రయాత్ర కొనసాగుతోందంటూ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. మానవాళి మనుగడ కోసం విశ్వంపై శాస్త్రీయ పరిశోధనలు కొనసాగుతాయని ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. (డయానాతో ప్రమాదంలో మరణించిన డోడి తండ్రి, బిజినెస్ టైకూన్ కన్నుమూత) “Don’t fly too close to the Sun” comes from the Greek legend of Icarus who flew fatally near the sun, & is used to describe TOO MUCH ambition. Thanks to @Isro :“Let’s fly close to the Sun” will mean that we should lift our ambitions even HIGHER. 🙏🏽🇮🇳 pic.twitter.com/4DQQrGKQWs — anand mahindra (@anandmahindra) September 2, 2023 కాగా చంద్రయాన్-3 సక్సెస్ తరువాత ఆదిత్య ఎల్ 1 ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది. శ్రీహరికోటలో 24 గంటల కౌంట్‌డౌన్ పూర్తి చేసుకున్న పీఎస్ఎల్వీ-C57 రాకెట్ ఆదిత్యను తీసుకుని కక్ష్య దిశగా ప్రయాణిస్తోంది. 4 నెలల్లో భూమి నుంచి 15 లక్షల కిలోమీటర్లు ప్రయాణించి సూర్యుడి ఎల్ 1 కక్ష్యలోకి ఇది చేరుకుంటుంది. అనంతరం అందులోని ఏడు పేలోడ్లు వివిధ అంశాలపై పరిశోధనలు నిర్వహిస్తాయి. అంతేకాదు చంద్రుని దక్షిణ ధృవంపై కాలినడి తొలిదేశంగా నిలిచిన భారత్ఇపుడు అమెరికా, జపాన్, యూరప్, చైనా దేశాల తర్వాత సూర్యుడిపైకి రాకెట్ పంపిన దేశంగా భారత్ నిలిచింది. -
ఆదిత్య ఎల్-1 ప్రయోగం విజయవంతం.. అభినందనల వెల్లువ
సూర్యుడి రహస్యాలు ఛేదించేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రయోగించిన ఆదిత్య ఎల్-1 విజయవంతంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. భారత తొలి మిషన్ విజయవంతంగా ప్రయోగించినందుకు ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. చంద్రయాన్-3 విజయం తర్వాత భారత్ తన అంతరిక్ష యాత్రను కొనసాగిస్తోందని అన్నారు. ప్రపంచ మానవాళి సంక్షేమం కోసం విశ్వంపై అవగాహన పెంపొందించడానికి మన శాస్త్రవేత్తల అవిశ్రాంత ప్రయత్నాలు కొనసాగుతాయని పేర్కొన్నారు. After the success of Chandrayaan-3, India continues its space journey. Congratulations to our scientists and engineers at @isro for the successful launch of India’s first Solar Mission, Aditya -L1. Our tireless scientific efforts will continue in order to develop better… — Narendra Modi (@narendramodi) September 2, 2023 ఇస్రో శాస్త్రవేత్తలపై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇస్రో శాస్త్రవేత్తల కృషిని కొనియాడారు. ‘భారతదేశపు మొట్టమొదటి సౌర మిషన్ అయిన ఆదిత్య-ఎల్1 ప్రయోగం భారతదేశ స్వదేశీ అంతరిక్ష కార్యక్రమాన్ని కొత్త పథంలోకి తీసుకెళ్లే ఒక మైలురాయి సాధన. ఇది అంతరిక్షం, ఖగోళ దృగ్విషయాలను బాగా అర్థం చేసుకోవడానికి మనకు ఎంతగానో సాయపడుతుంది. శాస్త్రవేత్తలు, ఇంజినీర్లను నేను అభినందిస్తున్నాను. మిషన్ విజయవంతం అయినందుకు నా శుభాకాంక్షలు’ అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. The launch of Aditya-L1, India's first solar mission, is a landmark achievement that takes India’s indigenous space programme to a new trajectory. It will help us better understand space and celestial phenomena. I congratulate the scientists and engineers at @isro for this… — President of India (@rashtrapatibhvn) September 2, 2023 భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) శనివారం ‘ఆదిత్య ఎల్1’ ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఇస్రో అంతరిక్ష పరిశోధనా రంగంలో మరో కీలక మైలురాయిని దాటింది అని సీఎం పేర్కొన్నారు. అంతరిక్ష పరిశోధనా రంగంలో ప్రపంచానికి ఆదర్శంగా దేశ శాస్త్రవేత్తలు సాధిస్తున్న ప్రగతి, ప్రతి భారతీయుడు గర్వపడేలా చేసిందన్నారు. ఈ సందర్భంగా ఇస్రో చైర్మన్, శాస్త్రవేత్తలు, ఇతర సాంకేతిక సిబ్బందిని అభినందిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ @isro ఈరోజు ‘ఆదిత్య ఎల్1’ ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించడం పట్ల ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు. అంతరిక్ష పరిశోధనా రంగంలో ఇస్రో మరో కీలక మైలురాయిని దాటిందని సీఎం అన్నారు. అంతరిక్ష పరిశోధనా రంగంలో ప్రపంచానికి ఆదర్శంగా… pic.twitter.com/dOngtX8pUr — Telangana CMO (@TelanganaCMO) September 2, 2023 ఆదిత్య ఎల్-1 ప్రయోగం విజయవంతం సూర్యుడిపై పరిశోధనలకు భారత అంతరిక్ష సంస్థ ఇస్రో చేపట్టిన తొలి ప్రయోగం ఆదిత్య ఎల్-1 మిషన్ విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. తిరుపతి జిల్లాలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి పీఎస్ఎల్వీ- సీ27 వాహకనౌక ఆదిత్య ఎల్1 ఉపగ్రహాన్ని మోసుకెళ్లింది. ఆదిత్య ఎల్1ను విజయవంతంగా నిర్దేశిత కక్ష్యలో ప్రవేశపెట్టినట్లు ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ పేర్కొన్నారు. రాకెట్ నుంచి విజయవంతంగా ఆదిత్య ఎల్1 విడిపోయినట్లు తెలిపారు. ఈ ప్రయోగం విజయవంతమవడానికి సహకరించిన శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. దీంతో శ్రీహరి కోట షార్‌లో శాస్త్రవేత్తలు సంబురాలు చేసుకుంటున్నారు. చదవండి: ఆదిత్య ఎల్-1 సక్సెస్‌పై సీఎం జగన్ హర్షం. ఇస్రోకు అభినందనలు -
ఆదిత్య ఎల్-1 సక్సెస్‌పై సీఎం జగన్ హర్షం
సాక్షి, గుంటూరు: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ సూర్యుడిపై చేపట్టిన ఆదిత్య ఎల్-1 ఉపగ్రహ ప్రయోగం సక్సెస్‌పై దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. చంద్రయాన్-3తో చరిత్ర సృష్టించి.. ఆ వెంటనే సూర్యుడి మీద ప్రయోగంలో తొలి అడుగు వేసినందుకు ఇస్రో శాస్త్రవేత్తలపై అంతటా ప్రశంసలు కురుస్తున్నాయి. ఆదిత్య ఎల్-1 ప్రయోగంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలియజేశారు. భారతీయ అంతరిక్ష సాంకేతికతను మరింత ఎత్తుకు తీసుకెళ్లారంటూ ఒక ప్రకటనలో అభినందనలు తెలియజేశారాయన. ఇదిలా ఉంటే.. సూర్యుడిపై పరిశోధనలకు గానూ ఆదిత్య ఎల్-1 ఉపగ్రహాన్ని ఏపీలోని శ్రీహరికోట షార్ నుంచి ఇస్రో తన రాకెట్ ద్వారా నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఎల్-1 పాయింట్‌కు చేరుకున్నాక.. ఐదేళ్లపాటు సూర్యుడిపై పరిశోధనలు కొనసాగిస్తుంది. -
ఇస్రో ఆదిత్య ఎల్-1 ప్రయోగం సక్సెస్
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో.. మరో మైలురాయిని దాటేసింది. చంద్రయాన్-3 చరిత్రాత్మక విజయం ఇచ్చిన జోష్‌తో సూర్యుడిపై తొలి ప్రయోగం చేపట్టింది. సూర్యుడిపై పరిశోధనల క్రమంలో ఆదిత్య ఎల్-1 ఉపగ్రహాన్ని నింగిలోకి విజయవంతంగా ప్రవేశపెట్టింది. దీంతో శ్రీహరి కోట షార్‌లో శాస్త్రవేత్తల సంబురాలు చేసుకుంటున్నారు. ఇస్రో ఆదిత్య ఎల్-1 ప్రయోగం సక్సెస్ అయ్యిందని, నిర్దేశిత కక్ష్యలోకి ఉప్రగహాన్ని పీఎస్ఎల్వీ ప్రవేశపెట్టిందని, వాహన నౌక నుంచి ఉపగ్రహం విడిపోయిందని ఇస్రో చైర్మన్ సోమనాథ్ ప్రకటించారు. చదవండి: ఆదిత్య ఎల్1: సూర్యుడిపై సరికొత్త ప్రయోగం.. US, చైనాకు ధీటుగా.. PSLV-C57/Aditya-L1 Mission: The launch of Aditya-L1 by PSLV-C57 is accomplished successfully. The vehicle has placed the satellite precisely into its intended orbit. India’s first solar observatory has begun its journey to the destination of Sun-Earth L1 point. — ISRO (@isro) September 2, 2023 సూర్యుడిపై ఇస్రో తొలి మిషన్ ఆదిత్య ఎల్-1. పీఎస్ఎల్వీ సీ-57 రాకెట్ ద్వారా ఆదిత్య ఎల్-1 ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టారు. ఈ ఉపగ్రహం సోలార్ స్మార్ట్స్ను అధ్యయనం చేస్తుంది. ఆదిత్య ఎల్-1ను భూదిగువన కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఆపై దీర్ఘవృత్తాకార కక్ష్యలోకి దింపారు. ఇక ఇక్కడి నుంచి లాంగ్రేంజ్ పాయింట్ 1 వైపు పయనిస్తుంది ఉపగ్రహం. ఈ క్రమంలో.. భూగురుత్వాకర్షణ ప్రభావ ప్రాంతాన్ని దాటి వెళ్తుంది. అనంతరం క్రూజ్ దశ ప్రారంభం అవుతుంది. భూమి నుంచి నాలుగు నెలలపాటు.. దాదాపు 125 రోజులపాటు 15 లక్షల కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది సోలార్ మిషన్. అక్కడ ఎల్1 పాయింట్‌కు చేరుకుని.. సోలార్ కరోనల్ మాస్ ఎజెక్షన్స్‌ను తోలుగా అధ్యయనం చేస్తుంది ఆదిత్య ఎల్ 1. ఆదిత్య ఎల్-1 ఉపగ్రహం బరువు 1475 కిలోలు. ఉపగ్రహ జీవిత కాలం ఐదేళ్లకు పైనేనని ఇస్రో ప్రకటించింది. ఈ ఐదేళ్లలో.. సౌర తుఫానులు, జ్వాలలు, తీరు తెన్నులపై పరిశోధనలు నిర్వహిస్తుంది. ప్రతీరోజూ 1440 ఫొటోలు తీసి భూమికి పంపడంతో పాటు.. ఫిబ్రవరి నెలాఖరు నుంచి రెగ్యులర్‌గా డేటా అందిస్తుంది ఆదిత్య ఎల్-1 ఉపగ్రహం. రూ. 378 కోట్లతో ప్రయోగించిన ఈ మిషన్.. నాలుగు నెలలపాటు ప్రయాణించి దాదాపు 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న లాంగ్రేజ్ పాయింట్ (ఎల్ 1) వద్దకు చేరుకోనుంది. అనంతరం సూర్యుడిపై ప్రయోగాలు చేయనుంది. ఏడు పేలోడ్స్ సూర్యుడిపై ఇస్రో తొలి మిషన్ ఆదిత్య ఎల్-1. ఇందులో 7 పేలోడ్స్ ఉన్నాయి. ఇవి సూర్యుడి పొరలైన ఫొటో స్పియర్, క్రోమో స్పియర్ సహా వెలుపల ఉండే కరోనానూ అధ్యయనం చేస్తాయి. షార్ నుంచి చేసిన ప్రయోగాల్లో ఇది 92వది. పీఎస్ఎల్వీ సిరీస్‌లో 59వది. ఆదిత్య–ఎల్1 నిర్దేశిత కక్ష్యలోకి చేరిన వెంటనే అందులో అమర్చిన విజిబుల్ లైన్ కొరోనాగ్రాఫ్(వీఈఎల్సీ) పేలోడ్ నిమిషానికి ఒకటి చొప్పున రోజుకు సుమారు 1,440 చిత్రాలను తీసి విశ్లేషణ కోసం గ్రౌండ్ స్టేషన్‌కు పంపుతుందని ప్రాజెక్టు సైంటిస్ట్ అండ్ ఆపరేషన్ మేనేజర్ డాక్టర్ ముత్తు ప్రియాల్ చెప్పారు. ఫిబ్రవరి చివరినాటికి మొదటి చిత్రం అందుతుందని భావిస్తున్నామన్నారు. -
ఇస్రో ఆదిత్య-ఎల్ 1 మిషన్.. భగభగల గుట్టు విప్పేనా?
బెంగళూరు: చంద్రయాన్-3 (Chandrayaan-3) విజయోత్సాహంలో ఉన్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో(ISRO).. సూర్యుడిపై తొలిసారిగా ప్రయోగానికి సిద్ధమైంది. భగభగలాడే సూర్యుడి గుట్టు విప్పేందుకు ఆదిత్య- ఎల్ 1 (Aditya-L1) ఉపగ్రహాన్ని శ్రీహరి కోట(ఏపీ) అంతరిక్ష కేంద్రం షార్ వేదిక నుంచి ప్రయోగించబోతోంది. కాసేపట్లో ఇస్రో రాకెట్ ‘పీఎస్ఎల్వీ సీ-57 ఆదిత్య ఎల్-1ను నింగిలోకి మోసకెళ్లనుంది. ఈ క్రమంలో ఈ మిషన్ ప్రత్యేకతలు ఓసారి చూద్దాం.. సౌర వ్యవస్థలో భూమి నుంచి సూర్యుడి మధ్య దూరం 149.5 మిలియన్ కిలోమీటర్లు. అయితే ఇస్రో ఇప్పుడు సూర్యుడి మీద పరిశోధనలకు ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టబోతోంది. ఆ ప్రవేశపెట్టే ఎల్-1(లాగ్రేంజ్) పాయింట్.. భూమి నుంచి 9లక్షల మైళ్ల దూరం(15 లక్షల కి.మీల)లో ఉంది. భూమికి, సూర్యుడికి మధ్య దూరంలో ఇది కేవలం ఒక శాతం మాత్రమే. అదే భూమి నుంచి చంద్రుడి దూరంతో పోలిస్తే.. నాలుగు రెట్లు ఎక్కువ. మిషన్ ఇలా.. ‘ఆదిత్య-ఎల్ 1’ వ్యోమనౌకను తొలుత దిగువ భూకక్ష్యలో ప్రవేశపెడతారు. భూమి చుట్టూ దీర్ఘవృత్తాకార కక్ష్యల్లో తిరుగుతూ పయనించిన అనంతరం ప్రొపల్షన్ వ్యవస్థలను ఉపయోగించి ఎల్1 పాయింట్ వైపు మళ్లిస్తుంది ఇస్రో. ఈ క్రమంలో భూమి గురుత్వాకర్షణ ప్రాంతం ప్రభావం (ఎస్ఓఐ) నుంచి బయటపడి, చివరికి ఎల్1 చుట్టూ కక్ష్యలోకి చేరుకుంటుంది. ఇక్కడి నుంచి నిరంతరం సూర్యుడిని కనిపెట్టుకోవటానికి వీలుంటుంది. లాగ్రేంజ్ 1 ప్రాంతానికి చేరుకునేందుకు ఉపగ్రహానికి 125 రోజుల సమయం పడుతుంది. విజిబుల్ ఎమిషన్ లైన్ కొరోనాగ్రాఫ్ (వీఈఎల్సీ).. ఆదిత్య-ఎల్1లో కీలకం. ఇది సూర్యుడికి సంబంధించి ఇది ఒక్కో నిమిషానికి ఒక్కో ఫొటో చొప్పున రోజుకు 1440 ఫొటోలు ఇస్రోకు చేరవేస్తుంది. మొత్తంగా ఆదిత్య-ఎల్ 1 మొత్తం ఏడు పేలోడ్లను మోసుకెళ్లనుంది. ‘విజిబుల్ ఎమిషన్ లైన్ కొరోనాగ్రాఫ్ (వీఈఎల్సీ)’తో పాటు సోలార్ అల్ట్రావయోలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్, ఆదిత్య సోలార్ విండ్ పార్టికల్ ఎక్స్పరిమెంట్, ప్లాస్మా అనలైజర్ ప్యాకేజ్ ఫర్ ఆదిత్య, సోలార్‌లో ఎనర్జీ ఎక్స్‌రే స్పెక్ట్రోమీటర్, హైఎనర్జీ ఎల్-1 ఆర్బిటింగ్ ఎక్స్‌రే స్పెక్ట్రోమీటర్, మాగ్నెటో మీటర్ ఉన్నాయి. సౌర వాతావరణం, సౌర జ్వాలలు, కరోనల్ హీటింగ్, కరోనల్ మాస్ ఎజెక్షన్ తదితర విషయాలను అధ్యయనం చేసేందుకు ఇవి అత్యంత కీలకమైన సమాచారాన్ని అందించనున్నాయి. శక్తివంతమైన రాకెట్ ‘ఆదిత్య-ఎల్ 1’ ప్రయోగానికి ఇస్రో శాస్త్రవేత్తలు పీఎస్ఎల్వీ (ఎక్స్ఎల్) రకం రాకెట్‌ను వినియోగిస్తున్నారు. పీఎస్ఎల్వీలో ఇది అత్యంత శక్తిమంతమైనది. 2008లో చంద్రయాన్-1 మిషన్‌లో, 2013లో మార్స్ ఆర్బిటర్ మిషన్ (MOM)లో ఈ రకం రాకెట్లనే వినియోగించారు. సూర్యుడే టార్గెట్ ఎందుకంటే.. అంత దూరంలో ఉన్నప్పటికీ.. సూర్యుడే మనకు సమీప నక్షత్రం. భూమిపై సమస్త జీవరాశి మనుగడకు ఆధారం కూడా. అందువల్ల మిగతా నక్షత్రాలతో పోలిస్తే సూర్యుడిని సవివరంగా అధ్యయనం చేయడం మనకు అవసరం. పైగా ‘పాలపుంత’తో పాటు ఇతర గెలాక్సీల్లోని నక్షత్రాల గురించి మరింత సమాచారం తెలుసుకునేందుకు ఈ ప్రయోగం ఉపయోగపడొచ్చు. మరోవైపు.. సూర్యుడిపై విస్ఫోటాల ద్వారా సౌర వ్యవస్థలోకి అపారమైన శక్తి విడుదలవుతుంటుంది. ఇది భూమి వైపు మళ్లినట్లయితే.. మన సమీప అంతరిక్ష వాతావరణంలో అవాంతరాలు ఏర్పడతాయి. ఉపగ్రహాలు, వ్యోమనౌకలు, కమ్యూనికేషన్ వ్యవస్థలపై ప్రభావం పడుతుంది. కాబట్టి.. ఇటువంటి ఘటనలను ముందుగానే గుర్తించడం ముఖ్యం. తద్వారా దిద్దుబాటు చర్యలకు అవకాశం లభిస్తుంది అని ఇస్రో భావిస్తోంది. -
ISRO's Aditya-L1 Solar Mission: నేడే పీఎస్ఎల్వీ సీ57 ప్రయోగం
సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): సూర్యుడిపై పరిశోధనలే లక్ష్యంగా రూపుదిద్దుకున్న ఆదిత్య–ఎల్1 ఉపగ్రహం ప్రయోగానికి సర్వం సిద్ధమయింది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) తిరుపతి జిల్లా సతీష్ ధవన్‌స్పేస్ సెంటర్లోని రెండో ప్రయోగ వేదిక నుంచి పీఎస్ఎల్వీ సీ57 ఉపగ్రహ వాహకనౌక ఆదిత్య–ఎల్1ను మోసుకెళ్లనుంది. శుక్రవారం ఉదయం 12.10 గంటలకు మొదలైన కౌంట్‌డౌన్ ప్రక్రియ 23.40 గంటలు కొనసాగిన అనంతరం శనివారం ఉదయం 11.50 గంటలకు పీఎస్ఎల్వీ సీ57 ప్రయోగాన్ని చేపడతారు. శుక్రవారం ఉదయం షార్కు విచ్చేసిన ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ ముందుగా శ్రీ చెంగాళమ్మ ఆలయం పూజలు చేసుకున్నారు. కౌంట్‌డౌన్ ప్రక్రియలో భాగంగా ముందుగా రాకెట్‌కు నాలుగో దశలో 2.5 టన్నుల ద్రవ ఇంధనాన్ని నింపే ప్రక్రియను చేపట్టారు. శుక్రవారం ఆర్థరాత్రి దాటాక రాకెట్‌కు రెండో దశలో 41 టన్నుల ద్రవ ఇం«ధనాన్ని నింపే ప్రక్రియను చేపట్టనున్నారు. ఈ ప్రయోగంలో సూర్యుడిపై పరిశోధనలకు 1,480.7 కిలోల బరువు కలిగిన ఆదిత్య–ఎల్1 ఉపగ్రహాన్ని నింగిలోకి పంపుతున్నారు. షార్ నుంచి చేసిన ప్రయోగాల్లో ఇది 92వది. పీఎస్ఎల్వీ సిరీస్‌లో 59వది. పీఎస్–4 దశతో మరో సరికొత్త పరిశోధన: పీఎస్ఎల్వీ సీ57 రాకెట్‌లోని నాలుగో దశ (పీఎస్–4)తో మరో సరికొత్త పరిశోధనకు ఇస్రో శ్రీకారం చుట్టింది. నాలుగో దశతో వివిధ రకాల విన్యాసాలు చేసి 01.03.31 గంటలకు ఆదిత్య–ఎల్1 ఉపగ్రహాన్ని వదిలిపెడుతుంది. గతంలో ఎప్పుడు కూడా ఉపగ్రహాన్ని వదిలిపెట్టేందుకు ఇంత సమయం తీసుకున్న పరిస్థితి లేదు. ముందుగా ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టే కక్ష్య దూరం కూడా ఈసారి కొత్తగానే వుంది. అపోజి అంటే భూమికి దూరంగా 36,500 కిలోమీటర్ల దాకా ఉంటుంది. అలాంటిది కేవలం 19,500 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉపగ్రహాన్ని ప్రవేశపెడుతున్నారు. ఉపగ్రహాన్ని వదిలిపెట్టిన తరువాత రెండు రకాల విన్యాసాలను చేసి కక్ష్య దూరాలను పరిశోధించే పనిని చేపడుతున్నారు. ఎంఓఎన్ పాసివేషన్ పేరుతో 4042.52 సెకన్లకు ఒకసారి, ఎంఎంహెచ్ పాసివేషన్ పేరుతో 4382.52 సెకన్లకు ఒకసారి రీస్టార్ట్ చేసి సరికొత్త పరిశోధనలు చేస్తున్నారు. రోజుకు 1,440 చిత్రాలు ఆదిత్య–ఎల్1 నిర్దేశిత కక్ష్యలోకి చేరిన వెంటనే అందులో అమర్చిన విజిబుల్ లైన్ కొరోనాగ్రాఫ్(వీఈఎల్సీ) పేలోడ్ నిమిషానికి ఒకటి చొప్పున రోజుకు సుమారు 1,440 చిత్రాలను తీసి విశ్లేషణ కోసం గ్రౌండ్ స్టేషన్‌కు పంపుతుందని ప్రాజెక్టు సైంటిస్ట్ అండ్ ఆపరేషన్ మేనేజర్ డాక్టర్ ముత్తు ప్రియాల్ చెప్పారు. ఫిబ్రవరి చివరినాటికి మొదటి చిత్రం అందుతుందని భావిస్తున్నామన్నారు. రాకెట్ వివరాలు ► పీఎస్ఎల్వీ సీ57 రాకెట్ పొడవు 44.4 మీటర్లు. ► రాకెట్ ప్రయోగ సమయంలో 321 టన్నుల బరువుంటుంది. నింగికి పయనమైన 01–03–31 (3799.52) నిమిషాల్లో ప్రయోగం పూర్తవుతుంది. ► మొదటి దశలో 139 టన్నుల ఘన ఇంధనం కోర్ అలోన్ దశ, ఈ ప్రయోగానికి రాకెట్ చుట్టూరా ఆరు స్ట్రాపాన్ బూస్టర్లు ఉంటాయి. ఒక్కో బూస్టర్‌లో 12.2 టన్నుల ఘన ఇంధనం నింపుతారు. ► 212.02 టన్నుల ఘన ఇంధనంతో మొదటి దశ 109.40 సెకన్లలో పూర్తవుతుంది. ► 41 టన్నుల ద్రవ ఇంధనాన్ని వినియోగించి 262.38 సెకన్లకు రెండోదశ పూర్తవుతుంది. ► 7.65 టన్నుల ఘన ఇంధనం సాయంతో 581.42 సెకన్లకు మూడో దశను పూర్తిచేస్తారు. ► మళ్లీ నాలుగోదశ (పీఎస్–4) 3127.52 సెకన్లకు స్టార్ట్ చేసి 3599.52 సెకన్లకు కటాఫ్ చేస్తారు. ► శిఖరభాగాన అమర్చిన ఆదిత్య–ఎల్1 ఉపగ్రహాన్ని 3799.52 సెకన్లకు (01.03.31 గంటల వ్యవధి)లో భూమికి దగ్గరగా (పెరిజి) 235 కిలోమీటర్లు, భూమికి దూరంగా (అపోజి) 19,500 కిలోమీటర్ల ఎత్తులోని ఎసింట్రక్ ఎర్త్ బౌండ్ ఆర్బిట్‌లోకి ప్రవేశపెడతారు. 175 రోజుల తరువాత సూర్యుడి సమీపంలోని లాంగ్రేజియన్ బిందువు–1 వద్ద ప్రవేశపెట్టి సూర్యుడిపై అధ్యయనం చేస్తారు. -
ఆదిత్యుడిపై అధ్యయనం
తిరుపతి కల్చరల్ : శ్రీహరి కోటలోని సతీష్ దావన్ స్పేస్ సెంటర్ నుంచి శనివారం ప్రయోగిస్తున్న ఆదిత్య ఎల్1 మిషన్ ఉపగ్రహ ప్రయోగాన్ని సందర్శించేందుకు సైన్స్‌సెంటర్‌లో లైవ్ స్క్రీనింగ్ ఏర్పాటు చేస్తున్నారు. శుక్రవారం ఈ మేరకు రీజనల్ సైన్స్‌సెంటర్ ప్రాజెక్ట్ కో–ఆర్డినేటర్ శ్రీనివాస నెహ్రూ మాట్లాడుతూ శనివారం ఉదయం 11 గంటలకు నుంచి లైవ్ స్క్రీనింగ్ ఉంటుందని, మధ్యాహ్నం 12 గంటలకు ఆదిత్య ఎల్1 మిషన్‌పై ప్యానెల్ ఎగ్జిబిషన్ ప్రారంభిస్తున్నట్లు వివరించారు. ఈ అవకాశాన్ని ప్రజలు, అన్ని పాఠశాలల విద్యార్థుల సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వివరాలకు సైన్స్ సెంటర్ విద్యా విభాగం 0877–2286202, 7989694681 నంబర్లను సంప్రదించాలని కోరారు. సూళ్లూరుపేట: సౌరగోళంలో గాలులు, జ్వాలలు, రేణువుల తీరుతెన్నులపై పరిశోధనలకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) పీఎస్ఎల్వీ సీ57 రాకెట్ ప్రయోగించనుంది. 1480.7 కిలోల ఆదిత్య–ఎల్1 ఉపగ్రహాన్ని ఈ రాకెట్ ద్వారా శనివారం ఉదయం 11.50 గంటలకు ప్రయోగించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ ఉపగ్రహం ప్రయోగం ద్వారా సూర్యుడిపై దాగి వున్న రహస్యాలను ఛేదించనున్నారు. సౌర తుఫాన్ సమయంలో వెలువడే రేణువుల వల్ల భూమిపై సమాచార వ్యవస్థకు అవరోధాలు ఏర్పడుతున్నాయని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. దీంతో పాటు కాంతిమండలం (ఫోటోస్పియర్), వర్ణ మండలం (క్రోమోస్పియర్)లపై అధ్యయనం చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. సూర్యుడిపై అధ్యయనానికి ఇస్రో మొట్టమొదటిసారిగా ఈ ప్రయోగం చేపట్టింది. పరిశోధనలకు ‘పేలోడ్స్’ ఆదిత్య ఎల్1 ఉపగ్రహంలో ఏడు పేలోడ్స్ అమర్చి పంపుతున్నారు. 1,231 కేజీలు ద్రవ ఇంధనంతో ఉపగ్రహం నింపబడింది. మిగిలిన 249 కేజీలు పేలోడ్స్ బరువు వుంటుంది. ఉపగ్రహాన్ని సూర్యుడి వైపు తీసుకెళ్లేందుకు ద్రవ ఇంధనం అవసరం . మొదట ఉపగ్రహాన్ని భూ మధ్యంతర కక్ష్యలోకి ప్రవేశపెట్టిన తర్వాత భూమికి 15 లక్షలు కిలోమీటర్లు దూరంలోని లాగ్రేంజియన్ బిందువు–1 (ఎల్–1)లోకి చేరవేయడానికి 175 రోజులు పడుతుంది. ఆదిత్య ఎల్–1 ఉపగ్రహంలో సూర్యుడిపై అధ్యయనం చేయడానికి యాస్పెక్స్, సూట్, వెల్సీ, హెలియోస్, పాపా, సోలెక్స్, మాగ్ అనే ఏడు ఉపకరణాలు (పేలోడ్స్) అమర్చారు. ► 170 కేజీల బరువు గల విజిబుల్ ఎమిషన్ లైన్ కరోనాగ్రాఫ్ ( వెల్సీ) అనే పేలోడ్ ద్వారా సౌర వాతావరణం ఎందుకు వేడిగా వుంటుంది. సూర్యుడిలో మార్పులు, అంతరిక్ష వాతావరణం, భూమి వాతావరణాన్ని ఎలా ప్రభావితం చేస్తుందనే విషయాలపై పరిశోధనలు చేస్తుంది. ► సౌర అతినీలలోహిత ఇమేజింగ్ టెలిస్కోప్ (సూట్) అనే పేలోడ్ 35 కేజీల బరువు వుంటుంది. 200–400 ఎన్ఎం తరంగధైర్ఘ్యం పరిధి మధ్య సూర్యుడిని గమనిస్తుంది. ఇందులో 11 ఫిల్టర్లను ఉపయోగించడం ద్వారా సౌర వాతావరణంలో వివిధ పొరల పూర్తి డిస్క్ చిత్రాలను అందిస్తుంది. ► ఇది సూర్యుడ్ని నిరంతరం గమనిస్తూనే వుంటుంది. ఇస్రో ఇతర సంస్థల సహకారంతో పుణేలోని ఇంటర్–యూనివర్సిటీ సెంటర్ ఫర్ ఆస్ట్రానమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్ నుంచి ఏఎన్ రామ్ ప్రకాష్, దుర్గేష్ త్రిపాఠి నేతృత్వంలో ఈ పేలోడ్‌ను అభివృద్ది చేశారు. ► ఆదిత్య సోలార్ విండ్ పార్టికల్ ఎక్స్పర్మెంట్ (యాస్పెక్స్) అనే పేలోడ్ ద్వారా సౌర గాలి వైవిద్యం, లక్షణాలను తెలియజేయడమే కాకుండా దాని వర్ణ పటం లక్షణాలను అధ్యయనం చేస్తుంది. ► ఆదిత్య ప్లాస్మా ఎనలైజర్ ప్యాకేజీ (పాపా) సౌరగాలి కూర్పు దాని శక్తి పంపిణీని అర్థం చేసుకోవడానికి పరిశోధన చేస్తుంది. ► సోలార్ ఎనర్జీ ఎక్స్–రే స్పెక్ట్రోమీటరు (సోలెక్స్) సోలార్ కరోనా సమస్యాత్మకమైన కరోనల్ హీటింగ్ మెకానిజాన్ని అధ్యయనం చేయడానికి, ఎక్స్–రే మంటలను పర్యవేక్షించడానికి పరిశోధనలు చేస్తుంది. ► హై ఎనర్జీ ఎల్1 ఆర్బిటింగ్ ఎక్స్–రే స్పెక్ట్రోమీటర్ (హెలియోస్) సౌర కరోనాలో డైనమిక్ ఈవెంట్లను గమనించడానికి, విస్పోటనం..సంఘటనల సమయంలో సౌరశక్తి కణాలను వేగవంతం చేయడానికి ఉపయోగించే శక్తిని అంచనా వేస్తుంది. ► మ్యాగ్ అనే ఈ పేలోడ్‌ను మాగ్నోమీటర్ అని కూడా అంటారు. ఆదిత్య ఎల్1 ఉపగ్రహానికి ఆన్‌బోర్డు ఉపకరణంగా అమర్చి పంపుతున్నారు. ఇది ఉపగ్రహానికి సంబంధించి సమాచారాన్ని అందించేందుకు వినియోగిస్తారు. ఆదిత్యుడిపై అధ్యయనం భారత అంతరిక్ష పరశోధన సంస్థ సత్తా చాటుతోంది. దేశ ప్రతిష్ట ఇనుమడించేలా నూతన ప్రయోగాలకు శ్రీకారం చుడుతోంది. ఇటీవలే చంద్రయాన్–3 ద్వారా జాబిలిపై కాలుమోపింది. ప్రస్తుతం ఆదిత్య–ఎల్1తో సూర్యుడి రహస్యాల ఛేదనకు సన్నద్ధమైంది. సౌరగోళంలో వాతావరణాన్ని అధ్యయనం చేసేందుకు పీఎస్ఎల్వీ సీ57 రాకెట్ ద్వారా ఉపగ్రహ ప్రయోగానికి రంగం సిద్ధం చేసింది. -
ఆదిత్య ఎల్1: సూర్యుడిపై సరికొత్త ప్రయోగం.. US, చైనాకు ధీటుగా..
చంద్రయాన్ 3 విజయంతో జోష్ మీదున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో.. సూర్యుడి రహస్యాలు ఛేదించేందుకు మరో కొత్త మిషన్ ప్రయోగించేందుకు సిద్ధమవుతోంది. సూర్యుడిపై పరిశోధనల కోసం రూపొందించిన ‘ఆదిత్య ఎల్-1’ ప్రయోగానికి మరికొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. సెప్టెంబర్ 2న ఉదయం 11.50 గంటలకు శ్రీహరి కోట నుంచి ప్రయోగించనున్నారు. దీనిని పీఎస్ఎల్వీ-సీ57 రాకెట్ మోసుకుంటూ నింగిలోకి దూసుకెళ్లనుంది. ఆదిత్య ఎల్1 ప్రత్యేకతలు సూర్యుడి పుట్టుక, అక్కడి పరిస్థితులను తెలుసుకునేందుకు ఇస్రో ఆదిత్య ఎల్-1 ప్రయోగం చేస్తుంది. కాగా సూర్యుడు.. భూమి మధ్య దూరం 150 మిలియన్ కిలోమీటర్లు. ఆదిత్య వ్యోమనౌకను సూర్యునికి దగ్గరగా పంపిచరు. భూమి నుంచి 15 లక్షల కిలోమీటర్ల దూరంలోని లాంగ్రేజ్ పాయింట్-1 (ఎల్-1) వద్ద ఉండే సుదీర్ఘమైన దీర్ఘ వృత్తాకార కక్ష్యలోకి చేరుస్తారు. సుమారు 127 రోజుల ప్రయాణం తర్వాత ఆదిత్య ఎల్-1 ఈ కక్ష్యలోకి చేరుతుంది. దీని వల్ల గ్రహణాలతో సంబంధం లేకుండా సూర్యుడిని నిరంతరం అధ్యయనం చేసేందుకు వీలు లభిస్తుంది. ఇదే తొలి ప్రయోగం సూర్యుడిపై అధ్యయనం చేసేందుకు భారత్ ప్రయోగిస్తున్న తొలి స్పేస్‌క్రాఫ్ట్ ఇదే కావడం విశేషం. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, ఆస్ట్రేలియా, ఇతర దేశాల అంతరిక్ష సంస్థల సాయంతో సూర్యుడిపై అధ్యయనాలను ఇస్రో చేపడుతోంది. తక్కువ ఇంధనాన్ని వినియోగించుకొని నిర్దేశిత కక్ష్యలో ఎక్కువ కాలం కొనసాగేలా ప్రయోగం చేపడుతున్నారు. ఈ ఉపగ్రహం ద్వారా అతి దగ్గరి నుంచి సౌర వ్యవస్థపై నిఘా పెట్టవచ్చు. తద్వారా సౌర తుఫానులు, సూర్యుడి పుట్టుక, అక్కడి వాతావరణం, పరిస్థితులపై అధ్యయనం చేయవచ్చు. కరోనాగ్రఫీ పరికరం సాయంతో సౌర వాతావరణాన్ని లోతుగా పరిశోధించడమే ఈ ప్రాజెక్టు ఉద్దేశం. చదవండి: చంద్రయాన్-3 సక్సెస్.. ఇస్రో ఉద్యోగుల జీతాలు ఎంతో తెలుసా? ఏడు పేలోడ్స్ సుమారు 1500 కిలోల బరువైన ఆదిత్య ఎల్1 శాటిలైట్‌లో మొత్తం ఏడు పేలోడ్స్ ఉండనున్నాయి. సూర్యుడిపై ఉప సూర్యగోళం నుంచి ప్రసరించే అత్యంత శక్తిమంతమైన కాంతి ప్రభావాన్ని అధ్యయనం చేసేందుకు అనువుగా ఈ పేలోడ్లను రూపొందించారు. ఇవి ఎలక్ట్రోమాగ్నెటిక్, మాగ్నెటిక్ ఫీల్డ్ డిటెక్టర్ల సాయంతో సూర్యుడి లోపల పొరలైన ఫొటోస్పియర్, క్రోమోస్పియర్, వెలుపల ఉండే కరోనాను అధ్యయనం చేస్తాయి. ఎల్-1 ప్రదేశానికి ఉన్న సానుకూలతల దృష్ట్యా నాలుగు పరికరాలు నేరుగా సూర్యుడిని అధ్యయనం చేస్తాయి. మిగతా మూడు సాధనాలు.. సమీపంలోని సౌర రేణువులు, అయస్కాంత క్షేత్రాల గురించి శోధిస్తాయి. ఈ క్రమంలో ఇప్పటి వరకు సూర్యుడి మీదకు ఏఏ దేశాలు ప్రయోగాలు చేశాయో.. వివిధ దేశాలు ప్రయోగించిన సోలార్ మిషన్లకు సంబంధించిన సమాచారం తెలుసుకుందాం. ఇప్పటి వరకూ అమెరికా స్పేస్ ఏజెన్సీ నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, జర్మన్ ఏరోస్పేస్ సెంటర్, చైనా మాత్రమే సూర్యుడిపై అధ్యయనం చేసేందుకు ఉమ్మడిగా, వేర్వేరుగా స్పేస్ మిషన్లను ప్రయోగించాయి. అమెరికా, నాసా ఖగోళ చరిత్రలో తొలిసారి అమెరికాకు చెందిన నాసా 2018 ఆగస్టు 12న పార్కర్ సోలార్ ప్రోబ్ పేరుతో ప్రయోగించిన ఓ రోదసీ నౌక సూర్యుడి వెలుపలికక్షలోకి విజయవంతంగా ప్రవేశించింది. ఈ మిషన్.. సుదీర్ఘకాలం ప్రయాణించి 2021లో దాదాపు 2 మిలియన్ డిగ్రీల ఫారన్‌హీట్ ఉష్ణోగ్రత ఉండే సూర్యుడి కరోనాను(సూర్యుడి చుట్టూ ఉండే వలయం) తాకింది. అక్కడ ధూళి కణాలు, అయస్కాంత క్షేత్రాలకు సంబంధించిన కొన్ని నమూనాలను సేకరించి పంపించింది. నాసా ప్రకారం ఓ రోదసీ నౌక సూర్యుడి ఉపరితల వాతావారణాన్ని తాకడం అంతరిక్ష ప్రయోగాల చరిత్రలో ఇదే తొలిసారి. దీని వ్యయం లక్ష కోట్లు..(1.5 బిలియన్ డాలర్లు) చదవండి: ఆదిత్య-ఎల్ 1 ప్రయోగం.. ఇస్రో చైర్మన్ ప్రత్యేక పూజలు అంతకముందు 1995 డిసెంబర్లో నాసా, ఈఎస్ఏ (యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ), జక్సా (జపాన్ ఏరోస్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ ఏజెన్సీ) సంయుక్తంగా సోలార్ అండ్ హీలియోస్పిరిక్ అబ్జర్వేటరీ (SOHO)ను ప్రారంభించాయి. 1997 ఆగస్టులో అధునాతన కంపోజిషన్ ఎక్స్‌ప్లోరర్, అక్టోబర్ 2006లో సోలార్ టెరెస్ట్రియల్ రిలేషన్స్ అబ్జర్వేటరీ, ఫిబ్రవరి 2010లో సోలార్ డైనమిక్స్ అబ్జర్వేటరీ, జూన్ 2013లో ఇంటర్ఫేస్ రీజియన్ ఇమేజింగ్ స్పెక్ట్రోగ్రాఫ్ వంటి ఇతర క్రియాశీల సౌర మిషన్లను నాసా ప్రయోగించింది. 2020 ఫిబ్రవరిలోనూ.. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీతో కలిసి నాసా మరోసారి సోలార్ ఆర్బిటర్‌ను ప్రయోగించింది. దీనిని సూర్యుడి సృష్టి, సౌర వ్యవస్థలో నిరంతరం మారుతున్న వాతావరణాన్ని సూర్యుడు ఎలా నియంత్రిస్తున్నాడో తెలుసుకునేందుకు రూపొందించారు. అయితే నాసా ప్రయోగించిన వాటన్నింటిలో సూర్యడికి అతి దగ్గరగా వెళ్లిన స్పేస్ క్రాఫ్ట్ పార్కర్ సోలార్ ప్రోబ్ మాత్రమే. ఏడేళ్ల పాటు పనిచేసేలా తయారు చేసిన ఈ స్పేస్ క్రాఫ్ట్ సాధారణంగా భూమికి, సూర్యుడికి మధ్య దూరంలో పావు వంతు దూరంలో పరిభ్రమిస్తుంటుంది. జపాన్ ఇక జపాన్‌కు చెందిన జక్సా (జపాన్ ఏరోస్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ ఏజెన్సీ) 1981లో తమొదటి సౌర పరిశీలన ఉపగ్రహం హినోటోరి Hinotori (ASTRO-A)ను ప్రారంభించింది. హార్డ్ ఎక్స్-కిరణాలను ఉపయోగించి సౌర మంటలను అధ్యయనం చేయడం దీని లక్ష్యం. దీని తర్వాత 1991లో Yohkoh (SOLAR-A). 1995లో NASA, ESA సమన్వయంతో SOHO, 1998లో నాసాతో కలిసి ట్రాన్సియెంట్ రీజియన్, కరోనల్ ఎక్స్‌ప్లోరర్ (TRACE), 2006లో హినోడ్ (సోలార్-బీ)ను ప్రయోగించింది. యూఎస్, యూకే సహకారంతో జపాన్ దీనిని ప్రయోగించింది. ఇది భూమిపై చంద్రుడి ప్రభావాన్ని అధ్యయనం చేస్తుంది. యూరప్ 1990 అక్టోబర్‌లో యూరప్ (యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ) సూర్యుని పైన, దిగువన ఉన్న అంతరిక్ష వాతావరణాన్ని అధ్యయనం చేయడానికి యులిసెస్ను ప్రారంభించింది. NASA ,JAXA సహకారంతో కాకుండా ESA 2001 అక్టోబర్‌లో ప్రోబా-2ను ప్రయోగించింది. ఇది దాదాపు ఎనిమిది సంవత్సరాలు విజయవంతమైన ప్రోబా-1 సిరీస్‌కు కొనసాగింపు. ప్రోబా-2లో నాలుగు ప్రయోగాలు కొనసాగుతుండగా.. రెండు సూర్యుడికి సంబంధించినవి. ప్రోబా పూర్తి పేరు ప్రాజెక్ట్ ఫర్ ఆన్-బోర్డ్ అటానమీ. ఇక యూరప్ ప్రయోగించే రాబోయే సౌర మిషన్లలో 2024లో ప్రోబా-3, 2025లో స్మైల్ మిషన్లు ఉన్నాయి. చైనా 2022 అక్టోబర్ 8న అడ్వాన్స్డ్ స్పేస్-బేస్డ్ సోలార్ అబ్జర్వేటరీని (ASO-S) నేషనల్ స్పేస్ సైన్స్ సెంటర్, చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ (CAS) విజయవంతంగా ప్రారంభించింది. ఇప్పుడు ఇస్రో ప్రయోగించే ఆదిత్య ఎల్1 ప్రయోగం ద్వారా సూర్యుని గురించి అధ్యయనం చేస్తున్న అతి కొద్ది దేశాల సరసన భారత్ నిలవబోతోంది. అలాగే వారి కన్నా మెరుగ్గా తక్కువ సమయంలో ఈ ప్రయోగం చేసి పలు రికార్డులు నెలకొల్పడం కూడా ఖాయంగా కనిపిస్తోంది. దీంతో ఇస్రో చేపట్టబోయే ఆదిత్య ఎల్ 1 ప్రయోగాన్ని ప్రపంచం ఆసక్తిగా గమనిస్తోంది. -
ఆదిత్య-ఎల్1 ప్రయోగానికి కౌంట్‌డౌన్ ప్రారంభం
సాక్షి, తిరుపతి: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) శనివారం తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి పీఎస్ఎల్వీ సీ57 రాకెట్ ద్వారా ఆదిత్య–ఎల్1 ఉపగ్రహాన్ని ప్రయోగించబోతోంది. రెండో ప్రయోగ వేదిక నుంచి శనివారం ఉదయం 11.50 గంటలకు ఈ ప్రయోగాన్ని ఇస్రో శాస్త్రవేత్తలు నిర్వహించనున్నారు. ఇందుకోసం శుక్రవారం ఉదయం 11.50 గంటలకు కౌంట్‌డౌన్ ప్రక్రియను ప్రారంభించారు. కాగా, గురువారం షార్‌లోని బ్రహ్మప్రకాష్‌హాలులో మిషన్ సంసిద్ధత సమావేశం నిర్వహించారు. పీఎస్ఎల్వీ సీ57 రాకెట్‌కు అన్ని పరీక్షలు నిర్వహించి లాంచ్ ఆథరైజేషన్ బోర్డు(ల్యాబ్)కు అప్పగించారు. ల్యాబ్ చైర్మన్ రాజరాజన్ రాకెట్‌కు మరోసారి పరీక్షలు నిర్వహించి.. కౌంట్‌డౌన్, ప్రయోగ సమయాన్ని అధికారికంగా ప్రకటించారు. సూర్యుడు ఒక మండే అగ్నిగోళం.. అక్కడికి ఉపగ్రహాన్ని పంపిస్తే కాలిపోతుంది కదా.. అనే అనుమానం చాలా మందిలో ఉంటుంది. వాస్తవానికి ఈ ప్రయోగంలో భూమి నుంచి సూర్యుడి దిశగా 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న లాంగ్రేజియన్ బిందువు–1(ఎల్–1) చుట్టూ ఉన్న కక్ష్యలోకి దాదాపు 1,470 కిలోల బరువున్న ఆదిత్య–ఎల్1 ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టనున్నారు. దీనివల్ల గ్రహణాలతో సంబంధం లేకుండా సౌరగోళంపై నిరంతరం అధ్యయనం చేసేందుకు అవకాశం లభిస్తుంది. అక్కడికి చేరుకోవాలంటే 175 రోజుల సమయం పడుతుందని ఇస్రో శాస్త్రవేత్తలు చెబుతున్నారు. చదవండి: చంద్రయాన్-3 సక్సెస్.. ఇస్రో ఉద్యోగుల జీతాలు ఎంతో తెలుసా? -
రేపే ఆదిత్య-ఎల్ 1 ప్రయోగం.. ఇస్రో చైర్మన్ ప్రత్యేక పూజలు
సాక్షి, తిరుపతి జిల్లా: ఆపరేషన్ ఆదిత్య-ఎల్ 1 ప్రయోగానికి సర్వం సిద్ధమైంది. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి ఆలయంలో పీఎస్ఎల్వీ- సి57 రాకెట్ నమూనాతో ఇస్రో చైర్మన్ డాక్టర్ సోమనాథ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాకెట్ ప్రయోగానికి ముందు అమ్మవారి ఆశీస్సులు తీసుకోవడం సాంప్రదాయమన్నారు. భూమి నుంచి సూర్యుడి దిశగా 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న లాంగ్రేజియన్ బిందువు–1(ఎల్–1) చుట్టూ ఉన్న కక్ష్యలోకి దాదాపు 1,470 కిలోల బరువున్న ఆదిత్య–ఎల్1 ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టనున్నామన్నారు. చంద్రయాన్-3కీ సంబంధించిన లాండర్ రోవర్లు చంద్రునిపై విజయవంతంగా పని చేస్తున్నాయని పేర్కొన్నారు. అక్టోబర్ మొదటి, రెండో వారంలో గగన్‌యాన్ రాకెట్ ప్రయోగం ఉంటుందని, జీఎస్ఎల్వీ- మార్క్-2 ద్వారా INSAT-3DS రాకెట్ ప్రయోగం చేస్తామన్నారు. తదుపరి మాసంలో ఎస్ఎస్ఎల్-వి రాకెట్ ప్రయోగం చేపడతామని ఇస్రో ఛైర్మన్ చెప్పారు. చదవండి: సూర్యుడి గుట్టు విప్పే ఆదిత్య–ఎల్1 -
సూర్యుడి గుట్టు విప్పే ఆదిత్య–ఎల్1
సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): సౌరగోళంలో సౌరగాలులు, జ్వాలలు, రేణువుల తీరుతెన్నులపై పరిశో«ధనలే లక్ష్యంగా ఆదిత్య–ఎల్1 ఉపగ్రహ ప్రయోగాన్ని సెప్టెంబర్ 2న ప్రయోగించేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు సన్నాహాలు చేస్తున్నారు. సీఎస్ఎల్వీ సీ57 రాకెట్ ద్వారా ఉదయం 11.50 గంటలకు ఈ ప్రయోగం జరగనుంది. షార్ కేంద్రంలోని రెండో ప్రయోగవేదికకు చెందిన వెహికల్ అసెంబ్లింగ్ బిల్డింగ్‌లో రాకెట్ అనుసంధానం పనులు పూర్తి చేసి ప్రయోగవేదికపై పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆదిత్య–ఎల్1 ప్రయోగం ద్వారా సూర్యునిపై దాగి వున్న రహస్యాలను శోధించనున్నారు. సౌర తుపాన్ సమయంలో వెలువడే రేణువుల వల్ల భూమిపై సమాచార వ్యవస్థకు అవరోధాలు ఏర్పడుతున్నాయని శాస్త్రవేత్తల అంచనా. సౌర వాతావరణం ఎందుకు వేడిగా ఉంటుంది? ► ఆదిత్య–ఎల్1లోని ఏడు పేలోడ్లలో 170 కేజీల బరువుండే విజిబుల్ ఎమిషన్ లైన్ కరోనాగ్రాఫ్ (వెల్సి) అనే పేలోడ్‌తో సౌర వాతావరణం ఎందుకు వేడిగా ఉంటుంది? సూర్యుడిలో మార్పులు, అంతరిక్ష వాతావరణం, భూ వాతావరణాన్ని ఎలా ప్రభావితం చేస్తుందనే విషయాలపై ఇది పరిశోధనలు చేస్తుంది. ► సౌర అతినీలలోహిత ఇమేజింగ్ టెలిస్కోప్ (సూట్) అనే పేలోడ్ 35 కేజీల బరువు వుంటుంది. 200–400 ఎన్ఎం తరంగధైర్ఘ్యం పరిధి మధ్య సూర్యుడిని గమనిస్తుంది. ఇందులో 11 ఫిల్టర్లను ఉపయోగించ డం ద్వారా సౌర వాతావరణంలో వివిధ పొరల పూర్తి డిస్క్ చిత్రాలను అందిస్తుంది. ► ఆదిత్య సోలార్ విండ్ పారి్టకల్ ఎక్స్పెరిమెంట్ (యాస్పెక్స్) అనే పేలోడ్ సౌర గాలి వైవిధ్యం, లక్షణాలపై సమాచారాన్ని గ్రహించడంతోపాటు దాని వర్ణ పటం లక్షణాలను అధ్యయనం చేస్తుంది. ► ఆదిత్య ప్లాస్మా ఎనలైజర్ ప్యాకేజీ (పాపా) సౌరగాలి కూర్పు, దాని శక్తి పంపిణీని అర్థం చేసుకోవడానికి పరిశోధనలు చేస్తుంది. ► సోలార్ ఎనర్జీ ఎక్స్–రే స్పెక్ట్రోమీటరు (సోలెక్స్) సోలార్ కరోనా సమస్యాత్మకమైన కరోనల్ హీటింగ్ మెకానిజంను అ«ధ్యయనం చేయడానికి, ఎక్స్–రే మంటలను పర్యవేక్షించడానికి పరిశోదనలు చేస్తుంది. ► హై ఎనర్జీ ఎల్1 ఆర్బిటింగ్ ఎక్స్–రే స్పెక్ట్రోమీటర్ (హెలియోస్) సౌర కరోనాలో డైనమిక్ ఈవెంట్లను గమనించడానికి, విస్ఫోటనం సంఘటనల సమయంలో సౌరశక్తి కణాలను వేగవంతం చేయడానికి ఉపయోగించే శక్తిని అంచనా వేస్తుంది. ► మ్యాగ్ అనే ఈ పేలోడ్‌ను ఉపగ్రహానికి ఆన్‌బోర్డు ఉపకరణంగా అమర్చి పంపుతున్నారు. ఉపగ్రహానికి సంబంధించి సమాచారాన్ని అందించనుంది. ఆదిత్య–ఎల్1లో పేలోడ్స్ ఇవే.. సుమారుగా 1,475 కేజీలు బరువున్న ఆదిత్య–ఎల్1 ఉపగ్రహంలో ఏడు పేలోడ్స్ బరువు 244 కేజీలు. మిగతా 1,231 కేజీలు ద్రవ ఇంధనంతో నింపుతారు. ఉపగ్రహాన్ని భూ మధ్యంతర కక్ష్యలోకి ప్రవేశపెట్టిన తరువాత ఈ ఉపగ్రహాన్ని భూమికి 15 లక్షల కిలోమీటర్ల దూరంలోని లాంగ్రేజియన్ బిందువు–1 (ఎల్–1)లోకి చేరవేయడానికి 177 రోజులు పడుతుంది. ఆదిత్య ఎల్–1 ఉపగ్రహంలో సూర్యుడిపై అధ్యయనం చేయడానికి యాస్పెక్స్, సూట్, వెల్సి, హెలియోస్, పాపా, సోలెక్స్, మాగ్ అనే ఏడు ఉపకరణాలు (పేలోడ్స్) ఉంటాయి. -
Aditya-L1: 2న ఆదిత్య–ఎల్1 ప్రయోగం
బెంగళూరు: చంద్రయాన్–3 మిషన్ ఘన విజయంతో భారత అంతరిక్ష అధ్యయన సంస్థ (ఇస్రో) మరో ప్రయోగానికి సిద్ధమయింది. సౌర వాతావరణంపై అధ్యయనానికి ఉద్దేశించిన ఆదిత్య–ఎల్1 ఉపగ్రహాన్ని శ్రీహరి కోట నుంచి పీఎస్ఎల్వీ సీ57 వాహక నౌక ద్వారా సెప్టెంబర్ రెండో తేదీన ఉదయం 11.50 గంటలకు ప్రయోగించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది. బెంగళూరులోని యూఆర్ రావు శాటిలైట్ సెంటర్లో పూర్తి దేశీయంగా అభివృద్ధి పరిచిన ఈ శాటిలైట్‌ను రెండు వారాల క్రితమే శ్రీహరి కోటకు తరలించారు. సూర్యుడి వెలుపల పొరలు, ఫొటోస్ఫియర్ (కాంతి మండలం) క్రోమోస్ఫియర్ (వర్ణ మండలం), కరోనా వలయంలో పెరుగుతున్న వేడి వంటి వాటిపై ఆదిత్య–ఎల్1 అధ్యయనం జరుపుతుంది. సౌర వాతావరణంతోపాటు అంతరిక్ష వాతావరణం, భూ వాతావరణంపై దాని ప్రభావాన్ని ఇది అధ్యయనం చేస్తుందని ఇస్రో సోమవారం వెల్లడించింది. నిరాటంకంగా పరిశోధనలు భూమికి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో వున్న సూర్య వలయం లాంగ్రేజ్ పాయింట్–1 (ఎల్1) చుట్టూ ఉన్న కక్ష్యలోకి ఈ ఉపగ్రహాన్ని ప్రవేశపెడతారు. భూమి నుంచి లాంగ్రేజ్ పాయింట్‌కి చేరుకోవడానికి ఆదిత్య ఉపగ్రహానికి 175 రోజులు పడుతుంది. లాంగ్రేజ్ పాయింట్ల వద్ద ఉపగ్రహాలు తక్కువ ఇంధనాన్ని వినియోగించుకుని నిర్దేశిత కక్ష్యలో ఎక్కువ కాలం కొనసాగడంతోపాటు నిర్దేశిత లక్ష్యాలను అందుకునే అవకాశముంటుందని అంచనా. ఈ కక్ష్యలో ఉండే ఆదిత్య–ఎల్1కు గ్రహణాలు, ఇతర గ్రహాలు అడ్డురావు. పరిశోధనలను నిరాటంకంగా జరిపేందుకు వీలుగా ఉంటుందని ఇస్రో తెలిపింది. స్వదేశీ పరిజ్ఞానంతో.. సుమారు 1,500 కేజీల బరువైన ఈ శాటిలైట్‌లో ఏడు పేలోడ్లు ఉన్నాయి. బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రో ఫిజిక్స్(ఐఐఏ) ఆధ్వర్యంలో విజిబుల్ ఎమిషన్ లైన్ కొరోనాగ్రాఫ్(వీఈఎల్సీ) పేలోడ్‌ను తయారు చేసింది. పుణేలోని ఇంటర్ యూనివర్సిటీ సెంటర్ ఫర్ ఆస్ట్రానమీ అండ్ అస్ట్రో ఫిజిక్స్ శాస్త్రవేత్తలు సోలార్ అల్ట్రా వయోలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్(ఎస్‌యూఐటీ)ని తయారు చేశారు. సూర్యుడి ఉపరితలంపై 6వేల డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత మాత్రమే కాగా, కొరోనా వద్ద 10 లక్షల డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు ఉండటానికి కారణాలపై వీఈఎస్సీ వివరాలు సేకరించనుందని ఇస్రో వివరించింది. యూవీ పేలోడ్‌ను, ఎక్స్‌రే పేలోడ్స్‌ను వినియోగించుకుంటూ కొరోనాతోపాటు సోలార్ క్రోమోస్ఫియర్లపై ఆదిత్య–ఎల్1 పరిశీలనలు జరపనుంది. స్పెషల్ వాంటేజ్ పాయింట్ ఎల్1ను ఉపయోగించుకుని నాలుగు పేలోడ్లు సూర్యుడిపై ప్రత్యక్ష పరిశీలన జరుపుతాయి. మిగతా మూడు పేలోడ్లలో అమర్చిన పరికరాలు సూర్య కణాలపై పరిశోధనలు సాగిస్తాయి. కొరోనాలో ఉండే మితిమీరిన ఉష్ణోగ్రతలు, కొరోనల్ మాస్ ఇంజెక్షన్(సీఎంఈ), అంతరిక్ష వాతావరణం వంటి వాటిపైనా ఎస్‌యూఐటీ అత్యంత కీలకమైన సమాచారం పంపుతుందని ఆశిస్తున్నట్లు ఇస్రో పేర్కొంది. -
చంద్రయాన్-3: చంద్రుడిపై భారీ గుంత.. రోవర్ రూట్ మార్చిన ఇస్రో
సాక్షి, బెంగళూరు: ఇస్రో చేపట్టిన చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతమైన విషయం తెలిసిందే. కాగా, చంద్రుడి దక్షిణ ధృవం సమీపంలో దిగిన చంద్రయాన్-3 ప్రజ్ఞాన్ రోవర్ తన పని తాను చేసుకెళ్తోంది. ఈ క్రమంలో రోవర్ ప్రయాణిస్తున్న మార్గంలో లోతైన గుంత కనిపించడంతో శాస్త్రవేత్తలు అలర్ట్ అయ్యారు. దీంతో, వెంటనే రోవర్ రూట్ మార్చారు. ఇస్రో ట్విట్టర్ వేదికగా తెలిపిన వివరాల ప్రకారం..‘ఆగస్టు 27న రోవర్ ఉన్న ప్రాంతానికి మూడు మీటర్ల దూరంలో ఒక గుంత కన్పించింది. నాలుగు మీటర్ల వ్యాసంతో భారీ గుంత ఉంది. దీంతో తన మార్గాన్ని మార్చుకోవాలని రోవర్‌కు కమాండ్ ఇచ్చాం. ప్రస్తుతం రోవర్ తన కొత్త మార్గంలో సురక్షితంగా ప్రయాణిస్తోంది’ అని పేర్కొంది. ఈ మేరకు చంద్రుడిపై ఉన్న గుంతకు సంబంధించిన ఫొటోను ఇస్రో సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ క్రమంలోనే రోవర్‌లోని నావిగేషన్ కెమెరా ద్వారా ఈ గుంతను గుర్తించినట్లు ఇస్రో వెల్లడించింది. ఈ సందర్భంగా కొత్త మార్గంలో రోవర్ ప్రయాణించిన గుర్తులను కూడా షేర్ చేసింది. Chandrayaan-3 Mission: On August 27, 2023, the Rover came across a 4-meter diameter crater positioned 3 meters ahead of its location. The Rover was commanded to retrace the path. It's now safely heading on a new path.#Chandrayaan_3#Ch3 pic.twitter.com/QfOmqDYvSF — ISRO (@isro) August 28, 2023 చంద్రుడిపై ఓవర్ హీట్.. ఇదిలా ఉండగా.. చంద్రయాన్–3 ప్రయోగం ద్వారా చంద్రుడికి సంబంధించిన ఎన్నో ఆసక్తికర అంశాలు వెల్లడవుతున్నాయి. చంద్రయాన్–3 మిషన్‌లో అంతర్భాగమైన విక్రమ్ ల్యాండర్లో అమర్చిన చంద్రాస్ సర్ఫేస్ థర్మో ఫిజికల్ ఎక్స్పెరిమెంట్ అనే పేలోడ్ చంద్రుడి ఉపరితలంపై ఉష్ణ లక్షణాలను ఇస్రోకు పంపిస్తోంది. ‘చంద్రుడి ఉపరితలంపై 20 లేదా 30 డిగ్రీల సెంటీగ్రేడ్‌కు కాస్త అటూఇటూగా ఉష్ణోగ్రతలు ఉండొచ్చని అంచనా వేశారు. కానీ, ఆశ్చర్యకరంగా 70 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు ఉన్నాయని ఇస్రో శాస్త్రవేత్త బీహెచ్ఎం దారుకేశ ఆదివారం పీటీఐకి చెప్పారు. ‘అదేవిధంగా, ఈ పేలోడ్‌లో అమర్చిన కంట్రోల్డ్ పెన్ట్రేషన్ మెకానిజం ద్వారా ఉపరితలానికి 10 సెంటీమీటర్ల లోతు వరకు ఉష్ణోగ్రతలను సెన్సార్లతో కొలవచ్చు. ఉపరితలంపై 70 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉండగా కేవలం రెండు, మూడు సెంటీమీటర్ల లోతు కెళ్లే సరికి రెండు మూడు డిగ్రీల సెంటీగ్రేడ్ మేర ఉష్ణోగ్రతలు తగ్గాయి. ఇంకాస్త లోతుకెళితే –10 డిగ్రీల కంటే తక్కువగా ఉష్ణోగ్రతలున్నాయి. ఉపరితలంతో పోలిస్తే రమారమి 50 డిగ్రీలు తేడాతో ఉండటం చాలా ఆసక్తికరమైన అంశం’అని ఆయన తెలిపారు. 🚀PSLV-C57/🛰️Aditya-L1 Mission: The launch of Aditya-L1, the first space-based Indian observatory to study the Sun ☀️, is scheduled for 🗓️September 2, 2023, at 🕛11:50 Hrs. IST from Sriharikota. Citizens are invited to witness the launch from the Launch View Gallery at… pic.twitter.com/bjhM5mZNrx — ISRO (@isro) August 28, 2023 ‘కేవలం 8 సెంటీమీటర్ల లోతుకు వెళ్లగానే అది 10 డిగ్రీలకు పడిపోయింది. మరింత లోతుకు వెళితే మంచు ఆనవాళ్లు ఉన్నట్టుగా తెలుస్తోంది. తాజా పరిశోధనలను బట్టి చంద్రుడిపై ఉష్ణోగ్రతలు చాలా వేగంగా మారుతున్నట్లు స్పష్టమవుతోందని ఇస్రో పేర్కొంది. దక్షిణ ధ్రువానికి సంబంధించిన ఇలాంటి వివరాలను తెలుసుకోవడం ఇదే మొదటిసారని తెలిపింది. Chandrayaan-3 Mission: 🔍What's new here? Pragyan rover roams around Shiv Shakti Point in pursuit of lunar secrets at the South Pole 🌗! pic.twitter.com/1g5gQsgrjM — ISRO (@isro) August 26, 2023 ఇది కూడా చదవండి: ఆదిత్య ఎల్-1 ప్రయోగంపై ఇస్రో కీలక ప్రకటన -
ఆదిత్య ఎల్-1 ప్రయోగంపై ఇస్రో కీలక ప్రకటన
సాక్షి, నెల్లూరు: భారత అంతరిక్ష సంస్థ(ఇస్రో) ఆదిత్య ఎల్-1 ప్రయోగంపై కీలక ప్రకటన చేసింది. సెప్టెంబర్ 2వ తేదీన శ్రీహరికోట నుంచి ఆదిత్య ఎల్-1 ప్రయోగం చేపట్టనున్నట్టు ఇస్రో సోమవారం ఓ ప్రకటనలో పేర్కొంది. వివరాల ప్రకారం.. ఆదిత్య ఎల్-1పై ఇస్రో మరో కీలక ప్రకటన చేసింది. శ్రీహరికోట నుంచి సెప్టెంబర్ 2న ఉదయం 11.50 గంటలకు ఆదిత్య ఎల్-1 ప్రయోగం చేపట్టనున్నట్టు స్పష్టం చేసింది. ఇక, ఆదిత్య ఎల్-1 సూర్యుడిపై అధ్యయనం చేయనున్న విషయం తెలిసిందే. సూర్యుడి కరోనాపై పరిశోధనలు.. చంద్రయాన్-3 ప్రయోగం గ్రాండ్ సక్సెస్ కావడంతో ఇస్రో మరన్ని ప్రయోగాలకు రెడీ అవుతోంది. ఇందులో భాగంగా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఆదిత్య ఎల్-1 ప్రయోగం చేపట్టనున్నది. ఈ మిషన్ ద్వారా సూర్యుడి కరోనాపై పరిశోధనలు జరుపనుంది. సూర్యుడి పుట్టుక, అక్కడి పరిస్థితులను గుట్టు విప్పేందుకు ఆదిత్య ఎల్-1 ప్రయోగం చేపడుతుండగా.. ఈ శాటిలైట్‌ను భూమి నుంచి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న లాంగ్రేజ్ పాయింట్-1 వద్ద కక్ష్యలో ప్రవేశపెట్టనున్నది. ఉపగ్రహం ద్వారా అతి దగ్గరి నుంచి సౌర వ్యవస్థపై నిఘా పెట్టి.. సౌర తుఫానులు, సూర్యుడి పుట్టుక, అక్కడి వాతావరణం, పరిస్థితులపై అధ్యయనం చేయనున్నది. ఇందు కోసం ఆదిత్య ఎల్-1 ఏడు పేలోడ్స్‌ను తీసుకెళ్తోంది. ఫోటోస్పియర్, క్రోమోస్పియర్, సూర్యుడి బయటి పొర (కరోనా)పై అధ్యయనంలో చేయడంలో ఇవి ఉపయోగపడనున్నాయి. ఇక, బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ (IIA), పుణె ఇంటర్ యూనివర్సిటీ సెంటర్ ఫర్ ఆస్ట్రానమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్ ఈ మిషన్ కోసం పేలోడ్స్‌ను అభివృద్ధి చేశాయి. ఇది కూడా చదవండి: చంద్రయాన్-3: చంద్రుడిపై ఉష్ణోగ్రతల్లో వేగంగా మార్పులు