ఆదిత్య ఎల్‌-1 ప్రయోగం విజయవంతం.. అభినందనల వెల్లువ | Aditya-L1 Launch: PM Modi Congratulations On Aditya-L1 Mission Success - Sakshi
Sakshi News home page

ఆదిత్య ఎల్‌-1 ప్రయోగం విజయవంతం.. అభినందనల వెల్లువ

Published Sat, Sep 2 2023 1:28 PM | Last Updated on Sat, Sep 2 2023 3:21 PM

PM Modi Congratulations On Aditya L1 Mission Success - Sakshi

సూర్యుడి రహస్యాలు ఛేదించేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ  ఇస్రో ప్రయోగించిన ఆదిత్య ఎల్‌-1 విజయవంతంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. భారత తొలి మిషన్‌  విజయవంతంగా ప్రయోగించినందుకు ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. చంద్రయాన్‌-3 విజయం తర్వాత భారత్‌ తన అంతరిక్ష యాత్రను కొనసాగిస్తోందని అన్నారు. ప్రపంచ మానవాళి సంక్షేమం కోసం విశ్వంపై అవగాహన పెంపొందించడానికి మన శాస్త్రవేత్తల అవిశ్రాంత ప్రయత్నాలు కొనసాగుతాయని పేర్కొన్నారు.

ఇస్రో శాస్త్రవేత్తలపై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము  ఇస్రో శాస్త్రవేత్తల కృషిని కొనియాడారు. ‘భారతదేశపు మొట్టమొదటి సౌర మిషన్ అయిన ఆదిత్య-ఎల్1 ప్రయోగం భారతదేశ స్వదేశీ అంతరిక్ష కార్యక్రమాన్ని కొత్త పథంలోకి తీసుకెళ్లే ఒక మైలురాయి సాధన. ఇది అంతరిక్షం, ఖగోళ దృగ్విషయాలను బాగా అర్థం చేసుకోవడానికి మనకు ఎంతగానో సాయపడుతుంది. శాస్త్రవేత్తలు, ఇంజినీర్లను నేను అభినందిస్తున్నాను. మిషన్ విజయవంతం అయినందుకు నా శుభాకాంక్షలు’ అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు.

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) శనివారం ‘ఆదిత్య ఎల్1’ ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఇస్రో అంతరిక్ష పరిశోధనా రంగంలో మరో కీలక మైలురాయిని దాటింది అని సీఎం పేర్కొన్నారు. అంతరిక్ష పరిశోధనా రంగంలో ప్రపంచానికి ఆదర్శంగా దేశ శాస్త్రవేత్తలు సాధిస్తున్న ప్రగతి, ప్రతి భారతీయుడు గర్వపడేలా చేసిందన్నారు. ఈ సందర్భంగా ఇస్రో చైర్మన్, శాస్త్రవేత్తలు, ఇతర సాంకేతిక సిబ్బందిని అభినందిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.

 ఆదిత్య ఎల్‌-1 ప్రయోగం విజయవంతం
సూర్యుడిపై పరిశోధనలకు భారత అంతరిక్ష సంస్థ ఇస్రో చేపట్టిన తొలి ప్రయోగం ఆదిత్య ఎల్‌-1 మిషన్‌ విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. తిరుపతి జిల్లాలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) నుంచి పీఎస్‌ఎల్‌వీ- సీ27 వాహకనౌక ఆదిత్య ఎల్‌1 ఉపగ్రహాన్ని మోసుకెళ్లింది. 

ఆదిత్య ఎల్‌1ను విజయవంతంగా నిర్దేశిత కక్ష్యలో ప్రవేశపెట్టినట్లు ఇస్రో ఛైర్మన్‌ సోమనాథ్‌ పేర్కొన్నారు. రాకెట్‌ నుంచి విజయవంతంగా ఆదిత్య ఎల్‌1 విడిపోయినట్లు తెలిపారు. ఈ ప్రయోగం విజయవంతమవడానికి సహకరించిన శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. దీంతో శ్రీహరి కోట షార్‌లో శాస్త్రవేత్తలు సంబురాలు చేసుకుంటున్నారు. 
చదవండి: ఆదిత్య ఎల్‌-1 సక్సెస్‌పై సీఎం జగన్‌ హర్షం. ఇస్రోకు అభినందనలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement