వాహ్‌ ఆదిత్య.. సెల్ఫీ అద్భుతం | Aditya-L1 takes selfie, clicks images of Earth and Moon: ISRO - Sakshi
Sakshi News home page

వీడియో: వాహ్‌ ఆదిత్య.. సెల్ఫీ అద్భుతం.. ఇంకో ఫొటో అంతకు మించి!

Published Thu, Sep 7 2023 1:06 PM | Last Updated on Thu, Sep 7 2023 1:45 PM

ISRO Aditya L1 takes selfie clicks images of Earth and Moon - Sakshi

బెంగళూరు: సూర్యుడిపై పరిశోధనలకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ( ఇస్రో) ప్రయోగించిన ఉపగ్రహం ఆదిత్య ఎల్1 మిషన్ (Aditya L1 Mission) విన్యాసాలు షురూ చేశాడు.  ఈ క్రమంలో ఏకంగా అద్భుతమైన ఫొటోలు తీసింది కూడా.  

భూమి నుంచి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న లాగ్రాంజ్ పాయింట్-1 దిశగా పయనిస్తోంది ఆదిత్య ఎల్‌1.  అందుకు ఇంకా 4 నెలల సుదీర్ఘ ప్రయాణం చేయాల్సి ఉంటుంది. తొలి 16 రోజులు భూకక్ష్యల్లోనే చక్కర్లు కొడుతుంది. అలా.. చక్కర్లు కొడుతూ..  ఆదిత్య ఎల్1 అద్భుతమైన ఫొటోలను తీసింది. ఎల్1 మిషన్ కనిపించేలా సెల్ఫీ తీసుకోవడంతో పాటు ఒకే ఫొటోలో భూమి, సుదూరాన ఉన్న చంద్రుడు ఫొటోల్ని కూడా బంధించింది. 

సెప్టెంబర్ 4న భూమి, చంద్రుడు ఒకే కక్ష్యలో ఉన్న సమయంలో ఈ ఫొటో తీసినట్లు ఇస్రో తెలిపింది. ‘‘ ఆదిత్య-ఎల్1 మిషన్: చూస్తోంది!. సూర్యుడు-భూమి ఎల్1 పాయింట్ లక్ష్యంగా దూసుకెళ్తున్న ఆదిత్య ఎల్1 ఒక సెల్ఫీ తీసుకుంది. భూమి, చంద్రుడి చిత్రాలు కూడా తీసింది’’ అంటూ ఇస్రో ఒక వీడియోను షేర్ చేసింది.

ఆదిత్య ఎల్1 మిషన్ శాటిలైట్‌ జీవితకాలం ఐదేళ్లు కాగా ఆదిత్య ఎల్‌1 ప్రయోగం ద్వారా.. సూర్యుడి పొరలైన ఫొటోస్పియర్‌, క్రోమోస్పియర్‌‌తో పాటు వెలుపల ఉండే కరోనాని అధ్యయనం చేయాలనుకుంటోంది ఇస్రో.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement