
ఆదిత్య ఎల్1 మిషన్ విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లిన సందడి ఆకాశంలోనే కాదు అంతర్జాలంలోనూ కనిపిస్తోంది. సూర్యుడి చుట్టూ పరిభ్రమించిన సైన్స్–ఫిక్షన్ నుంచి సినిమాల వరకు ఎన్నో విషయాలు అంతర్జాలంలో చక్కర్లు కొడుతున్నాయి. మచ్చుకు ఫేస్‌బుక్‌లో ఒక వీడియో... జర్నీ టు ది ఫార్ సైడ్ ఆఫ్ ది సన్(1969) సినిమా తాలూకు ట్రైలర్ ఇది.
‘అపోలో హ్యాజ్ కాంకర్డ్ ది మూన్’ ‘వేర్ టూ నౌ ఇన్ స్పేస్?’ టైటిల్స్‌తో ట్రైలర్ మొదలవుతుంది. ఆ తరువాత... ఒక రాకెట్ నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి దూసుకువెళుతుంది.
ఇప్పటి సినిమాలకు ఏమాత్రం తగ్గని ఉత్కంఠ ఈ ట్రైలర్‌లో కనిపిస్తుంది. ‘నాట్ ది ఎండ్’ అని ఊరిస్తూ ట్రైలర్ ముగుస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment