Aditya L1 launch మిషన్ ఆదిత్య ఎల్ 1 పేరుతో ఇస్రో మరో ఘనతను సాధించింది. సూర్యుడి పరిశోధనలు నిర్వహించేందుకు ఆదిత్య ఎల్1 మిషన్‌ను శనివారం ఇస్రో విజయవంతంగా చేపట్టింది. ఈ మిషన్ సక్సెస్‌తో దేశవ్యాప్తంగా హర్షం వ్యక్తం అవుతోంది. అటు పారిశ్రామిక వేత్త, బిలియనీర్ ఆనంద్ మహీంద్ర కూడా దీనిపై స్పందించారు. ఈ సందర్బంగా ట్విటర్(ఎక్స్)లో ఆసక్తికరమైన పోస్ట్ చేశారు. ఇండియా తొలి సోలార్ మిషన్ పట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తూగ్రీకు పురాణ గాథలొ మైనపు రెక్కలతో సూర్యునికి దగ్గరగా ఎగురుతూ మరణించిన డేడాలస్ కుమారుడు ఇకారస్ కథను గుర్తుచేసుకున్నారు.
“‘సూర్యుడికి చాలా దగ్గరగా ఎగరవద్దు’ అనే సామెత గ్రీకు పురాణం నుంచి వచ్చింది. గ్రీకు లెజెండ్ ఐకారస్ సూర్యుని దగ్గరగా వెళ్లి ప్రాణాలు పోగొట్టుకున్నారు. అత్యాశకు ప్రతీకగా నిలిచిన ఈ మాటల్ని ఇక ఇస్రో చెరిపేయనుంది. మనం మన ఆశయాలను మరింత ఉన్నతంగా నిర్దేశించుకునేలా 'సూర్యుడికి దగ్గరగా ఎగురుదాం' అనే సందేశాన్నిస్తున్న ఇస్రోకు ధన్యవాదాలు అంటూ ఆయన రాశారు.ఈ సందర్బంగా ఆదిత్య ఎల్1 మిషన్ కు సంబంధించిన వీడియోను కూడా షేర్ చేశారు. దీంతో ఇది నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది. (దివంగత రాకేష్ ఝన్‌ఝన్‌వాలా లగ్జరీ బంగ్లా: ఎన్ని అంతస్తులో తెలుసా?)
మరోవైపు చంద్రయాన్-3 సక్సెస్ అంతరిక్షంలో భారత్ జైత్రయాత్ర కొనసాగుతోందంటూ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. మానవాళి మనుగడ కోసం విశ్వంపై శాస్త్రీయ పరిశోధనలు కొనసాగుతాయని ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. (డయానాతో ప్రమాదంలో మరణించిన డోడి తండ్రి, బిజినెస్ టైకూన్ కన్నుమూత)
“Don’t fly too close to the Sun” comes from the Greek legend of Icarus who flew fatally near the sun, & is used to describe TOO MUCH ambition. Thanks to @Isro :“Let’s fly close to the Sun” will mean that we should lift our ambitions even HIGHER. 🙏🏽🇮🇳
— anand mahindra (@anandmahindra) September 2, 2023
pic.twitter.com/4DQQrGKQWs
కాగా చంద్రయాన్-3 సక్సెస్ తరువాత ఆదిత్య ఎల్ 1 ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది. శ్రీహరికోటలో 24 గంటల కౌంట్‌డౌన్ పూర్తి చేసుకున్న పీఎస్‌ఎల్‌వీ-C57 రాకెట్ ఆదిత్యను తీసుకుని కక్ష్య దిశగా ప్రయాణిస్తోంది. 4 నెలల్లో భూమి నుంచి 15 లక్షల కిలోమీటర్లు ప్రయాణించి సూర్యుడి ఎల్ 1 కక్ష్యలోకి ఇది చేరుకుంటుంది. అనంతరం అందులోని ఏడు పేలోడ్లు వివిధ అంశాలపై పరిశోధనలు నిర్వహిస్తాయి. అంతేకాదు చంద్రుని దక్షిణ ధృవంపై కాలినడి తొలిదేశంగా నిలిచిన భారత్‌ఇపుడు అమెరికా, జపాన్, యూరప్, చైనా దేశాల తర్వాత సూర్యుడిపైకి రాకెట్ పంపిన దేశంగా భారత్ నిలిచింది.
Comments
Please login to add a commentAdd a comment