భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో.. మరో మైలురాయిని దాటేసింది. చంద్రయాన్-3 చరిత్రాత్మక విజయం ఇచ్చిన జోష్‌తో సూర్యుడిపై తొలి ప్రయోగం చేపట్టింది. సూర్యుడిపై పరిశోధనల క్రమంలో ఆదిత్య ఎల్-1 ఉపగ్రహాన్ని నింగిలోకి విజయవంతంగా ప్రవేశపెట్టింది. దీంతో శ్రీహరి కోట షార్‌లో శాస్త్రవేత్తల సంబురాలు చేసుకుంటున్నారు.
ఇస్రో ఆదిత్య ఎల్-1 ప్రయోగం సక్సెస్ అయ్యిందని, నిర్దేశిత కక్ష్యలోకి ఉప్రగహాన్ని పీఎస్‌ఎల్వీ ప్రవేశపెట్టిందని, వాహన నౌక నుంచి ఉపగ్రహం విడిపోయిందని ఇస్రో చైర్మన్ సోమనాథ్ ప్రకటించారు.
చదవండి: ఆదిత్య ఎల్1: సూర్యుడిపై సరికొత్త ప్రయోగం.. US, చైనాకు ధీటుగా..
PSLV-C57/Aditya-L1 Mission:
The launch of Aditya-L1 by PSLV-C57 is accomplished successfully.
The vehicle has placed the satellite precisely into its intended orbit.
India’s first solar observatory has begun its journey to the destination of Sun-Earth L1 point.
— ISRO (@isro) September 2, 2023
సూర్యుడిపై ఇస్రో తొలి మిషన్ ఆదిత్య ఎల్-1. పీఎస్‌ఎల్‌వీ సీ-57 రాకెట్ ద్వారా ఆదిత్య ఎల్-1 ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టారు. ఈ ఉపగ్రహం సోలార్ స్మార్ట్స్‌ను అధ్యయనం చేస్తుంది. ఆదిత్య ఎల్-1ను భూదిగువన కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఆపై దీర్ఘవృత్తాకార కక్ష్యలోకి దింపారు.
ఇక ఇక్కడి నుంచి లాంగ్‌రేంజ్ పాయింట్ 1 వైపు పయనిస్తుంది ఉపగ్రహం. ఈ క్రమంలో.. భూగురుత్వాకర్షణ ప్రభావ ప్రాంతాన్ని దాటి వెళ్తుంది. అనంతరం క్రూజ్ దశ ప్రారంభం అవుతుంది. భూమి నుంచి నాలుగు నెలలపాటు.. దాదాపు 125 రోజులపాటు 15 లక్షల కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది సోలార్ మిషన్. అక్కడ ఎల్1 పాయింట్‌కు చేరుకుని.. సోలార్ కరోనల్ మాస్ ఎజెక్షన్స్‌ను తోలుగా అధ్యయనం చేస్తుంది ఆదిత్య ఎల్ 1.
ఆదిత్య ఎల్-1 ఉపగ్రహం బరువు 1475 కిలోలు. ఉపగ్రహ జీవిత కాలం ఐదేళ్లకు పైనేనని ఇస్రో ప్రకటించింది. ఈ ఐదేళ్లలో.. సౌర తుఫానులు, జ్వాలలు, తీరు తెన్నులపై పరిశోధనలు నిర్వహిస్తుంది. ప్రతీరోజూ 1440 ఫొటోలు తీసి భూమికి పంపడంతో పాటు.. ఫిబ్రవరి నెలాఖరు నుంచి రెగ్యులర్‌గా డేటా అందిస్తుంది ఆదిత్య ఎల్-1 ఉపగ్రహం. రూ. 378 కోట్లతో ప్రయోగించిన ఈ మిషన్.. నాలుగు నెలలపాటు ప్రయాణించి దాదాపు 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న లాంగ్రేజ్ పాయింట్ (ఎల్ 1) వద్దకు చేరుకోనుంది. అనంతరం సూర్యుడిపై ప్రయోగాలు చేయనుంది.
ఏడు పేలోడ్స్
సూర్యుడిపై ఇస్రో తొలి మిషన్ ఆదిత్య ఎల్-1. ఇందులో 7 పేలోడ్స్ ఉన్నాయి. ఇవి సూర్యుడి పొరలైన ఫొటో స్పియర్, క్రోమో స్పియర్ సహా వెలుపల ఉండే కరోనానూ అధ్యయనం చేస్తాయి.
షార్ నుంచి చేసిన ప్రయోగాల్లో ఇది 92వది. పీఎస్‌ఎల్‌వీ సిరీస్‌లో 59వది. ఆదిత్య–ఎల్1 నిర్దేశిత కక్ష్యలోకి చేరిన వెంటనే అందులో అమర్చిన విజిబుల్ లైన్ కొరోనాగ్రాఫ్(వీఈఎల్‌సీ) పేలోడ్ నిమిషానికి ఒకటి చొప్పున రోజుకు సుమారు 1,440 చిత్రాలను తీసి విశ్లేషణ కోసం గ్రౌండ్ స్టేషన్‌కు పంపుతుందని ప్రాజెక్టు సైంటిస్ట్ అండ్ ఆపరేషన్ మేనేజర్ డాక్టర్ ముత్తు ప్రియాల్ చెప్పారు. ఫిబ్రవరి చివరినాటికి మొదటి చిత్రం అందుతుందని భావిస్తున్నామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment