Greek
-
దొంగను పట్టించిన పుస్తకం..పాపం చోరికి వచ్చి..!
దొంగతనానికి వచ్చి కొందరు దొంగలు అక్కడ ఏమి లేకపోవడంతో లెటర్ రాసి పెట్టి వెళ్లిన ఘటనలు చూశాం. ఒక దొంగ చోరికి వచ్చి చక్కగా ఏసీ కింద పడుకున్న ఉదంతాన్ని కూడా చూశాం. ఇవన్నీ ఒక ఎత్తైతే పాపం ఈ దొంగను ఓ బుక్ అడ్డంగా బుక్‌చేసింది. తప్పించుకునేందుకు వీల్లేకుండా పోలీసులకు పట్టుబడేలా చేసింది. ఈ విచిత్ర ఘటన ఇటలీలో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..ఇటలీ రాజధాని రోమ్‌లోని ఒక ఇంటిలో చోరి చేసేందుకు ఒక దొంగ వచ్చాడు. రాత్రిపూట ఆ ఇంటి బాల్కనీ గుండా లోనికి ప్రవేశించి దొంగతనం చేసేందుకు యత్నిస్తుండగా..అక్కడే ఉన్న పుస్తకం దొంగగారిని తెగ ఆకర్షించింది. చదవకుండా ఉండలేకపోయాడు. ఇక అంతే ఆ పుస్తకం తీసుకుని చదవడం ప్రారంభించాడు. ఎంతలా అంటే అందులో నిమగ్నమైపోయాడు. ఇంతలో తెల్లారిపోయింది. మెలుకువ వచ్చి యజమాని చూడగా..అపరిచిత వ్యక్తి పుస్తకం చదువుతూ కనిపించాడు. వెంటనే అప్రమత్తమై పోలీసులకు కాల్ చేశాడు. అతడిని సమీపించి ఎవరు నువ్వు అని తట్టి అడిగేంత వరకు దొంగ ఈ లోకంలో లేనేలేడు. మనోడుకి దొరికిపోయానని అర్థమై.. తప్పించుకునేందుకు వీలుపడలేదు. ఇంతలో పోలీసులు రావడం దొంగని అరెస్టు చేయడం చకచక జరిగిపోయాయి. అయితే ఈ దొంగను ఆకర్షించిన పుస్తకం ఏంటంటే..గ్రీకు పురాణాలకి సంబంధించిన హుమర్స్ ఇలియాడ్ పుస్తకం. అది ఈ దొంగను తెగ ఆకర్షించింది. దీంతో దొంగ ఆ పుస్తక చదవడంలో మునిగిపోయి చోరీ విషయం మర్చిపోయి పట్టుబడ్డాడు. అయితే ఆ ఇంటి యజమాని మాత్రం పాపం అతడు చదవకుండా మధ్య వదిలేయాల్సి వచ్చిన ఆ పుస్తకం కాపీని ఆ దొంగకు పంపిస్తానని అన్నాడు. ఎందుకంటే ఆ పుస్తకమే కదా దొంగతనాన్ని నిరోధించింది. అలాగే ఇది అతడిలో మార్పు తీసుకొచ్చేందుకు ఉపయోగపడుతుందని నమ్మకంగా చెబుతున్నాడు సదరు యజమాని. (చదవండి: చప్పన్ భోగ్ థాలీ అంటే..? ఏం ఉంటాయంటే..) -
ప్రశ్నించడం నేర్పిన తొలి మేధావులు
‘దేవుడు చెడును ఆపాలని కోరుకుంటున్నా ఆపలేకపోతున్నాడా? అలా అయితే, అతను సృష్టి లయలను తన అధీనంలో ఉంచుకున్నవాడు కాదు. అతను సమర్థుడే, కానీ ఆపాలని కోరుకోవడం లేదా? అయితే అతను పగ, ద్వేషమూ గలవాడన్న మాట! అతను చెడును ఆపాలని కోరుకునేవాడు, పైగా సమర్థుడూ అయితే... మరి చెడు ఎందుకు రాజ్యమేలుతోందీ?– సమాధానం కావాలి! పోనీ, అతను చెడును ఆపాలని కోరుకోవడమూ లేదు – పైగా సామర్థ్యమూ లేదా? ఇక ఎందుకండీ ఆయనకు ఆ దేవుడనే బిరుదూ?’ అని ప్రశ్నించాడు ఎపిక్యురస్ (క్రీస్తు పూర్వం 341–270) అనే పురాతన గ్రీకు తత్త్వవేత్త. ‘ఎపిక్యురిజమ్’కు ఆయనే సిద్ధాంతకర్త. ఆయన రచనలు సుమారు మూడు వందల రాత ప్రతులున్నట్లు తెలిసింది. ఆయనపై డెమోక్రైటస్ అరిస్టిప్పస్, పైరో లాంటి వారి ప్రభావం ఉంది. ఎపిక్యురస్ బోధనలు తొలి దశలో సైన్సుకు ఆధారమయ్యాయి. ఎందుకంటే ఆయన రుజువుల్ని యథార్థాలనే నమ్మాలన్నాడు. క్రీ.పూ. 800–200 మధ్య కాలాన్ని ఏగియల్ యుగంగా పరిగణించారు. ఆ యుగంలో వైజ్ఞానిక ధోరణితో ఆలోచించి శాస్త్రయుగ కర్తగా నిలిచినవాడు ఎపిక్యురస్! గ్రీస్‌లో లాగానే ఇలాంటి ఆలోచనా ధోరణి గల వారు ఇండియా, చైనా, ఇరాన్ లాంటి దేశాల్లో ఉన్నారని కార్ల్ జాస్పర్స్ (1883–1969) అనే జర్మనీ తత్వవేత్త పరిశీలనలో తేలింది. ఆయన పరిశీలనల్లో వాస్తవం ఉందనిపిస్తుంది. ఎందుకంటే సాధారణ శకానికి పూర్వమే మన భారత్‌లో చార్వాకులు, హేతువాదులు విస్తరించి ఉన్నారు. సమాజానికి ప్రశ్నించడం నేర్పారు.ఎపిక్యురస్ ఆనాటి మేధావులందరితో విభేదించినా, డెమోక్రైటస్ (క్రీ.పూ. 460–370) వెలుగులోకి తెచ్చిన అటమిక్ థియరీని బలపరిచాడు. ఈ విశ్వం అతి సూక్ష్మమైన అణువులతో రూపొందిందనీ, అవి ఒకదానితో ఒకటి ఢీ–కొట్టుకుంటూ, విడిపోతూ, మళ్ళీ దగ్గరవుతూ ఉంటాయనీ, ఇవి నాశనం కావనీ, వీటి వల్లనే ‘పదార్థం’ ఏర్పడుతుందనీ డెమోక్రైటస్ భావించాడు. ఈ ‘ఆటమిక్ థియరీ’ని ఎపిక్యురస్ గట్టిగా నమ్మాడు. అయితే డెమోక్రైటస్ ఈ సిద్ధాంతం తనదని చెప్పుకోలేదు. తనకు గురుతుల్యుడైన లుసిప్పస్ (క్రీ.పూ. 5వ శతాబ్దం) ప్రతిపాదించాడనీ, తను కేవలం ఆ ఆటమిక్ థియరీని వెలుగులోకి తెచ్చానన్నాడు. లుసిప్పస్ తత్వవేత్త. మెటాఫిజిస్ట్ ఆటమిక్ ధియరీ ఎవరిదైనా కావచ్చు. కానీ అది వాస్తవం! ఆనాడు డెమోక్రైటస్ ప్రభావం ఎపిక్యురస్ పైనే కాదు, ఆధునిక కాలపు కార్ల్మార్క్స్పైనా ఉంది. ఎపిక్యురస్‌కు కొంచెం అటు ఇటుగా దృష్టి సారిస్తే, మనకు మిలోస్‌కు చెందిన డయగోరస్, సైరిన్కు చెందిన థియడోరస్లు కనిపిస్తారు (క్రీ.పూ. 5వ శతాబ్దం) వీరిలో డయగోరస్ గ్రీకు కవి, హేతువాది. థియడోరస్ నాటి గ్రీకు గణిత శాస్త్రవేత్త. ఆయన పేరుతోనే ‘స్పైరల్ ఆఫ్ థియడోరస్’ అనే గణిత సూత్రం ఉంది. పశ్చిమాన పరిస్థితి అలా ఉంటే, మన తూర్పు దేశాల్లో బౌద్ధం, జైనం, టోయిజం వంటివి వ్యాపించి విగ్రహారాధనను నిరసించాయి. డయగోరస్ తర్వాత– థియడోరస్, యుథిమిరస్ వెలుగులోకి వచ్చారు. గ్రీస్‌లో నిరీశ్వర వాదం ఆ రోజుల్లో పెద్ద నేరం! తత్త్వవేత్త సోక్రటీస్ (క్రీ.పూ. 399)కు శిక్ష పడింది కూడా ఆ విషయం గురించే! నాటి సమాజం గుడ్డిగా నమ్ముతున్న దేవుళ్ళను సోక్రటీస్ తిరస్కరించాడు. అతని ప్రభావంలో పడి యువత చెడిపోతోందని పాలకులు అతనికి మరణశిక్ష విధించారు. ఆ ఆ శిక్షను నింపాదిగా, నిబ్బరంగా స్వీకరించాడు. ఫ్రెంచ్ విప్లవ నేపథ్యంలో యూరోప్‌లో హేతువాదం బాగా పుంజుకుంది. ఫ్రెంచ్ విప్లవ ప్రభావం యూరోప్ సమాజంపై బాగా పడిన తర్వాత, విశ్వాసానికి – విశ్వసనీయతకు ఘర్షణ జరిగింది. క్రైస్తవ రహిత సమాజం రూపుదిద్దుకో నారంభించింది.అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో 19వ శతాబ్దంలో వచ్చిన సామాజిక ఉద్యమాల వల్ల అక్కడి సమాజంలో ‘స్వేచ్ఛాలోచన’ బాగా స్థిరపడింది. కేంబ్రిడ్జి యూనివర్సిటీ అధ్యయనం ప్రకారం 1917 రష్యా విప్లవం ప్రభావంతో సమాజంలో హేతువాదం బాగా పెరిగింది. అందువల్ల మార్క్సిస్టు – లెనినిస్టుల ప్రభుత్వం ఏర్పడింది. సమాజంలో హేతుబద్ధత పెంచాలంటే, లక్షల సంఖ్యలో కార్యకర్తలు నడుం బిగించాలి. వేల సంఖ్యలో రచయితలు కలాలు పట్టాలి. అప్పుడు గానీ, వైజ్ఞానిక స్పృహ గల ప్రభుత్వాలు ఏర్పడవు. అమాయకులంతా మాయమాటలు చెప్పే మోసగాళ్ళనే నమ్ముతారు. దీనికి పరిష్కారమెక్కడుందీ? వాస్తవాలు తెలుసుకోవడంలో ఉంది. నిజాల్ని జీర్ణించుకోవడంలో ఉంది. డాక్టర్ దేవరాజు మహారాజు వ్యాసకర్త సాహిత్య అకాడెమీ అవార్డ్ గ్రహీత -
హాలీవుడ్‌కి హాయ్ చెప్తున్న మన హీరోయిన్స్
హాలీవుడ్లో చాన్స్ అంటే అంత సులభం కాదు. కానీ ప్రతిభ, కష్టపడేతత్వం ఉంటే అసాధ్యం కూడా కాదు. దాంతో పాటు కాస్త అదృష్టం కూడా తోడవ్వాలి. అలా టాలెంట్‌తో పాటు హార్డ్‌వర్క్ చేస్తున్న కొందరు హీరోయిన్లను అదృష్టం కూడా వరించడంతో హాలీవుడ్ కబురు అందింది. హాలీవుడ్‌కి హాయ్ చెప్పిన ఆ కథానాయికల గురించి తెలుసుకుందాం. ► శ్రుతీహాసన్‌కు గత ఏడాది బాగా కలిసొచ్చిందనే చెప్పాలి. శ్రుతి హీరోయిన్గా నటించిన ‘వాల్తేరు వీరయ్య’, ‘వీరసింహారెడ్డి’, ‘సలార్: సీజ్ఫైర్’ సినిమాలు సూపర్ హిట్స్‌గా నిలిచాయి. అలాగే శ్రుతీహాసన్ ఓ లీడ్ రోల్లో చేసిన ఇంగ్లిష్ ఫిల్మ్ ‘ది ఐ’ గ్రీక్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శితమైంది. ‘రివర్ సిటీ’, ‘ది లాస్ట్ కింగ్డమ్’ వంటి సిరీస్‌లలో నటించిన మార్క్ రౌలీ ఈ సినిమాలో శ్రుతీహాసన్‌కు జోడీగా నటించారు. దర్శకురాలు డాఫ్నే ష్మోన్ తెరకెక్కించారు. ‘ది ఐ’ సినిమాను త్వరలోనే థియేటర్స్‌లో విడుదల చేయాలనుకుంటున్నారు. సో.. శ్రుతీ హాసన్‌కు ఇదే తొలి ఇంగ్లిష్ మూవీ అవుతుంది. అలాగే ‘ది ఐ’ చిత్రం లండన్ ఇండిపెండెంట్ ఫిల్మ్ ఫెస్టివల్లో పదర్శితం కానుంది. బెస్ట్ ఫిల్మ్ విభాగంలో నామినేషన్ దక్కించుకుంది. ఇదే జోష్‌లో ‘చెన్నై స్టోరీ’ అనే మరో ఇంగ్లిష్ ఫిల్మ్‌కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు శ్రుతీహాసన్. ‘ది ఆరేంజ్మెంట్స్ ఆఫ్ లవ్’ నవల ఆధారంగా ‘బాఫ్తా’ అవార్డు విజేత ఫిలిప్ జాన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రంలో శ్రుతీహాసన్‌కు లీడ్ పెయిర్‌గా అమెరికన్ నటుడు వివేక్ కల్రా నటిస్తారు. ఓ ప్రైవేటు డిటెక్టివ్ ఏజెన్సీ నడిపే అను (శ్రుతి పాత్ర) అనే యువతి నేపథ్యంలో సాగే రొమాంటిక్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఫిల్మ్ ఇది. ఇండో–యూకే ్ర΄÷డక్షన్ నిర్మించనున్న ఈ చిత్రానికి యూకేకి చెందిన బ్రిటిష్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఫండింగ్ చేయనుంది. త్వరలోనే ఈ సినిమా చిత్రీకరణ ్రపారంభం కానుంది. అయితే ఈ సినిమాలో తొలుత సమంత నటించాల్సింది. కొన్ని కారణాల వల్ల సమంత తప్పుకోవడంతో శ్రుతీహాసన్ చేస్తున్నారు. ► తెలుగు మూలాలు ఉన్న నాయిక శోభితా ధూళిపాళ. ఈ బ్యూటీ అడివి శేష్ హీరోగా రూపొందిన ‘గూఢచారి’, ‘మేజర్’ వంటి సినిమాల్లో హీరోయిన్గా నటించారు. మలయాళం, హిందీ భాషల్లోనూ సినిమాలు చేశారు. అయితే శోభితకు హాలీవుడ్ నుంచి కబురొచ్చింది. ‘స్లమ్ డాగ్ మిలియనీర్’ ఫేమ్ దేవ్ పటేల్ నటించి, దర్శకత్వం వహించిన ఇంగ్లిష్ మూవీ ‘మంకీ మ్యాన్’లో ఓ లీడ్ రోల్ చేశారు శోభిత. ఇటీవల ఈ సినిమా ట్రైలర్ కూడా విడుదలైంది. సినిమాను ఏప్రిల్ 5న థియేటర్స్‌లో విడుదల చేయనున్నారు. ‘‘నా తొలి హాలీవుడ్ మూవీకి మీ (అభిమానులు, ప్రేక్షకులను ఉద్దేశించి) ప్రేమ, అభిమానం కావాలి’’ అంటూ ఈ సినిమాను ఉద్దేశించి పేర్కొన్నారు శోభిత. ► దాదాపు నాలుగు దశాబ్దాలు వెండితెరపై వెలిగిన అలనాటి తార నూతన్ వారసురాలు ప్రనూతన్ బహల్. వెండితెరపై హిందీ చిత్రం ‘నోట్‌బుక్’ (2019)తో నటిగా ప్రయాణాన్ని మొదలు పెట్టారు ప్రనూతన్. ఆ తర్వాత ‘హెల్మెట్’ (2021)లోనూ మెరిశారామె. ఇప్పుడు ఈ యంగ్ బ్యూటీకి హాలీవుడ్ ఆఫర్ వచ్చింది. అమెరికన్ యాక్టర్ రహ్సాన్ నూర్ నటిస్తూ, దర్శకత్వం వహించనున్న ఓ రొమాంటిక్ డ్రామాలో ప్రనూతన్ హీరోయిన్గా నటించనున్నారు. ‘కోకో అండ్ నట్’ టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ సినిమా చిత్రీకరణ జూన్‌లో చికాగోలో ్రపారంభం కానుంది. ఇంగ్లిష్, ఇండియన్ నటులు ఈ సినిమాలో నటిస్తారు. ఈ ముగ్గురితో పాటు మరికొంతమంది హీరోయిన్ల హాలీవుడ్ ఎంట్రీ జరిగే అవకాశం ఉంది. -
ఆదిత్య L1 లాంచ్ : ఆనంద్ మహీంద్ర ఆసక్తికర ట్వీట్ వైరల్
Aditya L1 launch మిషన్ ఆదిత్య ఎల్ 1 పేరుతో ఇస్రో మరో ఘనతను సాధించింది. సూర్యుడి పరిశోధనలు నిర్వహించేందుకు ఆదిత్య ఎల్1 మిషన్‌ను శనివారం ఇస్రో విజయవంతంగా చేపట్టింది. ఈ మిషన్ సక్సెస్‌తో దేశవ్యాప్తంగా హర్షం వ్యక్తం అవుతోంది. అటు పారిశ్రామిక వేత్త, బిలియనీర్ ఆనంద్ మహీంద్ర కూడా దీనిపై స్పందించారు. ఈ సందర్బంగా ట్విటర్(ఎక్స్)లో ఆసక్తికరమైన పోస్ట్ చేశారు. ఇండియా తొలి సోలార్ మిషన్ పట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తూగ్రీకు పురాణ గాథలొ మైనపు రెక్కలతో సూర్యునికి దగ్గరగా ఎగురుతూ మరణించిన డేడాలస్ కుమారుడు ఇకారస్ కథను గుర్తుచేసుకున్నారు. “‘సూర్యుడికి చాలా దగ్గరగా ఎగరవద్దు’ అనే సామెత గ్రీకు పురాణం నుంచి వచ్చింది. గ్రీకు లెజెండ్ ఐకారస్ సూర్యుని దగ్గరగా వెళ్లి ప్రాణాలు పోగొట్టుకున్నారు. అత్యాశకు ప్రతీకగా నిలిచిన ఈ మాటల్ని ఇక ఇస్రో చెరిపేయనుంది. మనం మన ఆశయాలను మరింత ఉన్నతంగా నిర్దేశించుకునేలా 'సూర్యుడికి దగ్గరగా ఎగురుదాం' అనే సందేశాన్నిస్తున్న ఇస్రోకు ధన్యవాదాలు అంటూ ఆయన రాశారు.ఈ సందర్బంగా ఆదిత్య ఎల్1 మిషన్ కు సంబంధించిన వీడియోను కూడా షేర్ చేశారు. దీంతో ఇది నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది. (దివంగత రాకేష్ ఝన్‌ఝన్‌వాలా లగ్జరీ బంగ్లా: ఎన్ని అంతస్తులో తెలుసా?) మరోవైపు చంద్రయాన్-3 సక్సెస్ అంతరిక్షంలో భారత్ జైత్రయాత్ర కొనసాగుతోందంటూ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. మానవాళి మనుగడ కోసం విశ్వంపై శాస్త్రీయ పరిశోధనలు కొనసాగుతాయని ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. (డయానాతో ప్రమాదంలో మరణించిన డోడి తండ్రి, బిజినెస్ టైకూన్ కన్నుమూత) “Don’t fly too close to the Sun” comes from the Greek legend of Icarus who flew fatally near the sun, & is used to describe TOO MUCH ambition. Thanks to @Isro :“Let’s fly close to the Sun” will mean that we should lift our ambitions even HIGHER. 🙏🏽🇮🇳 pic.twitter.com/4DQQrGKQWs — anand mahindra (@anandmahindra) September 2, 2023 కాగా చంద్రయాన్-3 సక్సెస్ తరువాత ఆదిత్య ఎల్ 1 ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది. శ్రీహరికోటలో 24 గంటల కౌంట్‌డౌన్ పూర్తి చేసుకున్న పీఎస్ఎల్వీ-C57 రాకెట్ ఆదిత్యను తీసుకుని కక్ష్య దిశగా ప్రయాణిస్తోంది. 4 నెలల్లో భూమి నుంచి 15 లక్షల కిలోమీటర్లు ప్రయాణించి సూర్యుడి ఎల్ 1 కక్ష్యలోకి ఇది చేరుకుంటుంది. అనంతరం అందులోని ఏడు పేలోడ్లు వివిధ అంశాలపై పరిశోధనలు నిర్వహిస్తాయి. అంతేకాదు చంద్రుని దక్షిణ ధృవంపై కాలినడి తొలిదేశంగా నిలిచిన భారత్ఇపుడు అమెరికా, జపాన్, యూరప్, చైనా దేశాల తర్వాత సూర్యుడిపైకి రాకెట్ పంపిన దేశంగా భారత్ నిలిచింది. -
ఆ దేవుడి గౌరవార్థం ఒలింపిక్స్ మొదలయ్యాయట
వెయ్యి మైళ్ల ప్రయాణం ఒక్క అడుగుతో మొదలవుతుందన్నట్టు.. ప్రఖ్యాత ఒలింపిక్స్ కూడా కేవలం ఒక చిన్న రన్నింగ్ రేస్‌తోనే ప్రారంభమైంది! ఇప్పుడు వందలాది దేశాలు.. వేల మంది క్రీడాకారులు.. కోట్ల మంది వీక్షకులతో జపాన్‌లోని టోక్యోలో ఘనంగా క్రీడా సంగ్రామం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఒలింపిక్స్ చరిత్ర, ప్రత్యేకతలపై ఓ లుక్కేద్దామా.. – సాక్షి సెంట్రల్ డెస్క్ చిన్న రన్నింగ్ రేస్‌తో మొదలై.. గ్రీకుల పురాణాల ప్రకారం.. హెరాకల్స్ చక్రవర్తి వారి దేవుడు జియస్ గౌరవార్థం మొట్టమొదటగా ఒలింపియాలో తొలి క్రీడా పోటీలు నిర్వహించాడు. లిఖిత పూర్వక ఆధారాల ప్రకారమైతే.. క్రీస్తుపూర్వం 776వ సంవత్సరంలో ఒలింపియాలో 192 మీటర్ల పరుగు పందాలు నిర్వహించారు. కోరోబస్ అనే వంటవాడు అందులో గెలిచి.. మొదటి ఒలింపిక్ చాంపియన్‌గా నిలిచాడు. సుమారు వెయ్యి సంవత్సరాలు ఈ క్రీడాపోటీలు జరిగాయి. క్రీస్తుశకం 393లో గ్రీకు చక్రవర్తి థియోడొసియస్ క్రీడాపోటీలపై నిషేధం విధించడంతో పురాతన ఒలింపిక్స్ ఆగిపోయాయి. సుమారు 12 వందల ఏళ్ల తర్వాత 1850వ సంవత్సరంలో డాక్టర్ విలియం పెన్నీ బ్రూక్స్ ఒలింపిక్స్ అంశాన్ని తెరపైకి తెచ్చారు. గ్రీస్‌లో అంతర్జాతీయ స్థాయి ఒలింపిక్స్‌ను నిర్వహించాలని ప్రతిపాదించారు. మరో 40 ఏళ్ల తర్వాత.. పెన్నీ బ్రూక్స్ ఎంతగా ప్రచారం చేసినా తర్వాత 40ఏళ్లదాకా ఒలింపిక్స్ క్రీడల విషయం ముందుకు కదల్లేదు. చివరికి 1892లో ఫ్రాన్స్‌కు చెందిన పీ యర్ కోబర్టిన్ గట్టిగా ప్రయత్నించడంతో ఒలిం పిక్స్ నిర్వహణపై చర్చ మొదలైంది. 1894లో ‘ప్రపంచ ఒలింపిక్స్ కమిటీ (ఐఓసీ)’ ఏర్పాటైంది. 1896లో గ్రీస్‌లోని ఏథెన్స్లో మొట్టమొదటి ఆధునిక ఒలింపిక్స్ మొదలయ్యాయి. ప్రపంచ దేశాల మధ్య శాంతి, సహకారం, సోదరభావం పెంపొందించాలన్నదే ఈ క్రీడాపోటీల లక్ష్యమని ప్రకటించారు. కానీ మొదట్లో చాలా దేశాలు ఒలింపిక్స్‌ను అందుకు భిన్నంగా చూశాయి. అప్పట్లో వలస ప్రాంతాల విషయంగా యూరప్ దేశాల మధ్య కొనసాగుతున్న పోటీ, ఆధిపత్య పోరు వంటివి ఒలింపిక్స్‌కు చాలా ప్రాధాన్యం తీసుకొచ్చాయి. నాలుగేళ్ల తర్వాతే మహిళలకు చాన్స్ ఒలింపిక్స్ మొదలయ్యాక తొలి నాలుగేళ్ల పాటు మహిళా క్రీడాకారులను అనుమతించలేదు. 1890లో తొలిసారిగా టెన్నిస్, సెయిలింగ్, క్రోకెట్ (సుత్తి ఆకారంలో ఉండే బ్యాట్‌తో హాకీ తరహాలో ఆడే క్రీడ), ఈక్వెస్ట్రేనిజం (ఒకరకం గుర్రపు స్వారీ), గోల్ఫ్ క్రీడల్లో మహిళలకు అవకాశం కల్పించారు. ఒలింపిక్స్‌లో మహిళలకు అవకాశం కల్పించిన తర్వాత 90 ఏళ్లపాటు భారత మహిళా క్రీడాకారులెవరూ పతకాలు గెలుచుకోలేదు. తొలిసారిగా 2000 సిడ్నీ ఒలింపిక్స్ వెయిట్ లిఫ్టింగ్‌లో కరణం మల్లేశ్వరి కాంస్య పతకం సాధించింది. మన దేశం నుంచి వెళ్లింది ఒక్కరే.. ఒలింపిక్స్ మొదలయ్యే నాటికి భారతదేశం బ్రిటీషు వలస పాలనలోనే ఉంది. ఈ క్రమంలోనే 1900లో పారిస్‌లో జరిగిన ఒలింపిక్స్‌లో ఇండియా తరఫున నార్మన్ ప్రిచర్డ్ అనే ఒకేఒక్క క్రీడాకారుడు పాల్గొన్నాడు. 1920లో ఆంట్వెర్ప్లో జరిగిన పోటీల్లో మాత్రం నలుగురు అథ్లెట్లు, ఇద్దరు రెజ్లర్లు పాల్గొన్నారు. నాజీల అహంకారాన్ని దెబ్బతీస్తూ.. 19వ శతాబ్దం తొలినాళ్ల నుంచీ జర్మనీలో నాజీయిజం పెచ్చుమీరింది. ఆర్యులు అయిన నాజీలు.. మనుషుల్లో తామే అత్యుత్తమ జాతి అని.. నల్లవారు కిందిస్థాయివారని చెప్పుకొనేవారు. ఆ అహంకారానికి 1936లో అమెరికన్ నల్లజాతి క్రీడాకారుడు జెస్సీ ఓవెన్స్ గట్టి దెబ్బకొట్టాడు. బెర్లిన్‌లో జరిగిన ఆ ఒలింపిక్స్‌లో ఓవెన్స్ ఒక్కడే ఏకంగా నాలుగు బంగారు పతకాలు గెలుచుకున్నాడు. భారత హాకీ ‘బంగారం’ భారతదేశానికి చెందిన హాకీ టీమ్ 1928 నుంచే బంగారు పతకాల వేట మొదలుపెట్టింది. వరుసగా మూడు ఒలింపిక్స్ ఫైనల్స్‌లో నెదర్లాండ్స్, అమెరికా, జర్మనీలను ఓడించి బంగారు పతకాలను గెలుచుకుంది. తర్వాతి ఐదు ఒలింపిక్స్‌లలోనూ నాలుగు సార్లు గోల్డ్, ఒకసారి సిల్వర్ మెడల్ సాధించింది. చివరిగా 1980లో బంగారు పతకం గెలుచుకున్న హాకీ ఇండియా.. తర్వాతి నుంచి వెనుకబడి పోయింది. యుద్ధ క్షతగాత్రులతో ‘పారా ఒలింపిక్స్’ సాధారణ ఒలింపిక్స్ జరిగిన తరహాలోనే శారీరకంగా లోపాలు ఉన్న క్రీడాకారుల కోసం ‘పారా ఒలింపిక్స్’ నిర్వహిస్తారు. ప్రతి ఒలింపిక్స్ నుంచి రెండేళ్ల తర్వాత (అంటే ఒలింపిక్స్ జరిగే నాలుగేళ్ల గడువుకు మధ్యలో) ‘పారా ఒలింపిక్స్’ జరుగుతాయి. రెండో ప్రపంచ యుద్ధంలో కాళ్లు పోగొట్టుకున్న సైనికులకు గుర్తింపు, పునరావాసం కోసం 1948లో ప్రత్యేకంగా క్రీడాపోటీలు నిర్వహించారు. అవే 1960 నుంచి పారా ఒలింపిక్స్‌గా మారాయి. -
ఈ రోజు స్నానం చేశారా? లేదా? ఈ విషయాలు తెలుసుకోండి!
మీరు ఈ రోజు స్నానం చేశారా..? రోజూ చేస్తూనే ఉంటాం, ఈ రోజు స్పెషల్ ఏంటి అంటారా.. ఈ రోజు (జూన్ 14) అంతర్జాతీయ స్నానం దినోత్సవం మరి.. స్నానానికి కాస్త ఎక్కువ టైమిస్తూ, మరికాస్త ప్రశాంతంగా ఆలోచించడానికి ప్రయత్నించండి. ఎందుకీ రోజు జరుపుకోవడం, ఏమిటీ ఆలోచించడం, అంత ప్రాధాన్యత దేనికి అనుకుంటున్నారా..? ఈ రోజు నిజంగానే స్పెషల్. అటు సైన్స్‌పరంగా కీలక ముందడుగు పడిన రోజు, మన కోసం మనం కాస్త సమయం గడపాల్సిన రోజు. ఆ విశేషాలేంటో తెలుసుకుందామా? స్నానాల తొట్టెలో.. సూత్రం పుట్టింది ప్రఖ్యాత గ్రీకు శాస్త్రవేత్త ఆర్కిమెడిస్ గురించి, ఆయన కనిపెట్టిన భౌతిక శాస్త్ర, గణిత సూత్రాల గురించి మనం చిన్నప్పటి నుంచే చదువుకుని ఉంటాం. వస్తువు బరువు, పరిమాణం, సాంద్రత, స్క్రూలు, గేర్లు వంటి అంశాలపై క్రీస్తుపూర్వం 250వ సంవత్సరంలో ఆయన రూపొందించిన సూత్రాలు శాస్త్ర, సాంకేతిక రంగాలకు మార్గనిర్దేశం చేశాయి. ఇదంతా సరే.. ఈ స్నానాల తొట్టె (బాత్ టబ్)కు, ఆయనకు ఏం సంబంధం అనే డౌట్ వస్తోంది కదా! ఆర్కిమెడిస్ ఓ కీలక సూత్రాన్ని కనిపెట్టింది స్నానం చేస్తున్నప్పుడే. ఓ రోజు స్నానం కోసం బాత్‌టబ్‌లోకి దిగినప్పుడు నీళ్లు పైకి రావడాన్ని చూసిన ఆయన.. బాత్రూమ్లోనే కూర్చుని లెక్కలు వేయడం మొదలుపెట్టాడు. కొన్ని కీలక అంశాలను గుర్తించాడు.ఈ ఆనందం పట్టలేక.. బాత్రూమ్లోంచి అలా బట్టల్లేకుండానే ‘యురేకా’ అని అరుస్తూ వీధుల్లోకి పరుగెత్తాడట. ఏం కనిపెట్టాడు.. లాభమేంటి? బాత్‌టబ్‌లో పరిశీలనతో.. నీళ్లలో ఏదైనా వస్తువు ఎంత మేర మునిగితే, అంతే పరిమాణం లో నీళ్లు పక్కకు తొలగుతున్నట్టు ఆర్కిమెడిస్ గుర్తించాడు. వస్తువు వల్ల పక్కకు తొలగిన నీళ్ల బరువు.. ఆ వస్తువు బరువు కంటే ఎక్కువుంటే అది నీళ్లలో తేలుతుందని, తక్కువుంటే మునిగిపోతుందని తేల్చాడు. దీనికి వస్తువుల సాంద్రతతో లింకు ఉంటుందని గుర్తించాడు. ఏదైనా వస్తువు తొలగించిన నీటి బరువుతో సమాన బలంతో నీళ్లు ఆ వస్తువును పైకినెట్టడానికి ప్ర యత్నిస్తాయని (ఊర్ధ్వ పీడనం) తేల్చాడు. ఎన్నో ఆవిష్కరణలకు ఈ సూత్రాలు తోడ్పడ్డాయి. ఉదాహరణకు పడవలు, ఓడలు.. ఇనుము, ఉక్కు, కలప కలిపి భారీగా నిర్మించినా, వాటిల్లో భారీగా సామగ్రి తీసుకెళ్లినా మునగకుండా ఉంటాయి. ఆర్కిమెడిస్ సూత్రం ఆధారంగానే.. వాటి బరువు కంటే, ఎక్కువ నీటిని పక్కకు నెట్టేలా ఓడలను డిజైన్ చేస్తారు. మన కోసం.. టైం ఇచ్చుకోవాలని.. నిజానికి ఆర్కిమెడిస్ పుట్టినరోజును ప్రత్యేక దినంగా నిర్ణయించాలని అనుకున్నారు. కానీ ఆ తేదీ ఏమిటనేది ఎవరికీ తెలియదు. అయితే ఆయన ఈ సూత్రాన్ని కనిపెట్టిన రోజును మాత్రం కొన్ని అంశాల ఆధారంగా జూన్ 14వ తేదీగా అంచనా వేశారు. అది బాత్‌టబ్‌లో కనిపెట్టాడు కాబట్టి.. ‘ఇంటర్నేషనల్ బాత్ డే’గా ప్రకటించారు. ఇలా స్నానాల రోజుగా ప్రకటించడం వెనుక ఇంకొన్ని కారణాలు కూడా ఉన్నాయి. స్నానం చేసేప్పుడు మనం పూర్తి ఒంటరిగా, ప్రశాంతంగా ఉంటామని వైద్య నిపుణులు చెప్తున్నారు. గోరువెచ్చని నీటిలో స్నానం చేస్తూ, శరీరం పూర్తిగా రిలాక్స్ అయినప్పుడు మెదడు చురుగ్గా పనిచేస్తుందని, ఆలోచనలు మెరుగుపడతాయని.. ఆర్కిమెడిస్ కూడా ఇలాంటి సమయంలోనే గొప్ప ఆవిష్కరణ చేశాడని అంటున్నారు. అందుకే ఈ రోజు ప్రత్యేకంగా స్నానానికి కేటాయించి, మనపై మనం దృష్టి సారించుకోవాలని సూచిస్తున్నారు. పిల్లల్లో సైన్స్‌పై.. ఆసక్తి పెంచేందుకు.. పిల్లలకు స్నానం చేయడం, నీళ్లలో ఆడుకోవడం అంటే చాలా ఇష్టం. ఇదే సమయంలో వారికి సైన్స్ పట్ల ఆసక్తి, అవగాహన కల్పించేందుకు ప్రయత్నించవచ్చని నిపుణులు చెప్తున్నారు. ఇంటర్నేషనల్ బాత్ డే వెనుక ఇదీ ఓ కారణమని స్పష్టం చేస్తున్నారు. పిల్లలకు బాత్‌టబ్‌లో పలురకాల బొమ్మలు ఇచ్చి.. నీళ్లు నిండి ఉండడం, ఖాళీగా ఉండటం, నీటిపై తేలడం, మునగడం, తేలికగా ఉంటే ఏమవుతుంది, బరువుగా ఉంటే ఏమవుతుంది, వంటి ఫిజిక్స్ సూత్రాలపై అవగాహన కల్పించవచ్చని అంటున్నారు. కొన్ని యూరప్ దేశాల్లో ఈ రోజున పిల్లలకు బాత్‌టబ్ నిండా బొమ్మలతో బహుమతులు ఇస్తుండటం ఆనవాయితీ కూడా.. ఈ లెక్కలతోనే.. ఏనుగును కాపాడారు గత ఏడాది జనవరి 30న జార్ఖండ్‌లోని ఓ గ్రామంలో గున్న ఏనుగు బావిలో పడిపోయింది. దానిని ఎలా బయటికి తీయాలా అన్న ఆలోచన చేసిన అటవీశాఖ అధికారులు.. బావిలోకి బురద నీటిని పంపారు. గున్న ఏనుగు ఆ నీటిలో తేలుతూ పైకి రాగానే బయటికి లాగి కాపాడారు. ఈ విషయంలో ఆర్కిమెడిస్ సూత్రాన్ని పాటించామంటూ ఐఎఫ్ఎస్ అధికారి రమేశ్ పాండే.. ట్విట్టర్లో ట్వీట్ కూడా చేశారు. బురద నీటి సాంద్రత ఎక్కువగా ఉండటం వల్ల.. దానికంటే తక్కువ సాంద్రత ఉండే ఏనుగు ఆ నీటిలో తేలుతుందన్న ఆలోచనతోనే అధికారులు ఇలా చేశారని చెప్పడం గమనార్హం. –సాక్షి సెంట్రల్ డెస్క్ చదవండి: ఒత్తిడి తగ్గించుకోవడానికి 365 రోజులుగా అదే పనిలో ఉన్నాడు -
TS: ఆకునూరులో గ్రీకువీరుడు!
సాక్షి, హైదరాబాద్: ఈ శిల్పాన్ని చూడగానే గ్రీకువీరుడిలా అనిపిస్తుంది. కానీ ఇది ఓ యోధుడి స్మృతిశిల. సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం ఆకునూరు గ్రామశివారులోని సోమరాజుల కుంటలో బయటపడింది. రాష్ట్రకూటుల హయాంలో 9వ శతాబ్దానికి చెందినదిగా చరిత్రకారులు భావిస్తున్నారు. ఆకునూరు ప్రాంతం అప్పట్లో ఓ యుద్ధ క్షేత్రం. రాష్ట్రకూటులకు, ఇతర సామ్రాజ్యాల రాజు లకు తరచూ యుద్ధాలు జరిగేవి. యుద్ధంలో వీరమరణం పొందిన యోధులను గుర్తు చేసుకునేలా ఇలా శిల్పాలు చెక్కి ప్రతిష్టించటం ఆనవాయితీ. వాటినే వీరగల్లులుగా పేర్కొంటారు. ఈ వీరగల్లును కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యుడు కొలిపాక శ్రీనివాస్ గుర్తించారు. దీనితోపాటు మరొక వీరగల్లు, కాలభైరవ శిల్పం, నాగముచిలింద పోలికలున్న నాగవిగ్రహం బయటపడ్డాయి. ‘మొదటి వీరగల్లుపై సర్వాభరణాలున్నాయి. కుడి చేతిలో బాణం, ఎడమచేతిలో విల్లు ఉంది. నడి నెత్తిన కొప్పు, మూపున వీరశృంఖల, నడుమున పట్టాకత్తి ఉన్నాయి. వీరమరణం పొందాడనడానికి గుర్తు గా రెండుపక్కల అప్సరాంగణలు వింజామరలు వీస్తున్నట్టు చెక్కారు. శిల నిండా శిల్పి ప్రత్యేకతలు కనిపిస్తున్న ఇలాంటి చిత్రం అరుదు’అని కొత్త తెలంగాణ చరిత్ర బృందం ప్రధాన ప్రతినిధి శ్రీరామోజు హరగోపాల్ ‘సాక్షి’తో పేర్కొన్నారు. కాగా,వీరగల్లులపై పరిశోధన జరపాల్సిన అవసరం ఉందని ఈ బృందం నిర్ణయించింది. చదవండి: ధాన్యం తగులబెట్టి.. రోడ్డుపై బైఠాయించి ధర్నా -
రెండు వేల ఏళ్ల నాటి కంప్యూటర్!
ఏమైనా అంటే, ‘ఇప్పుడంతా కంప్యూటర్‌మయం’ అంటుంటాం. నిజానికి రెండు వేల ఏళ్ల క్రితమే ప్రాచీన గ్రీకు శాస్త్రవేత్తలు ఖగోళ సంబంధ విషయాల శోధనకు ఉపకరించే శక్తిమంతమైన కంప్యూటర్ను తయారుచేశారు. దీని గురించి ఎలా తెలిసింది అంటే... 1901లో అంటికితెర తీరం(దక్షిణ గ్రీకు దీవులు)లో ఓడ శిథిలాల్లో ఒక ఆసక్తికరమైన వస్తువు అవశేషాలను కనుగొన్నారు. ఆ వస్తువుపై వందసంవత్సరాలకు పైగా పరిశోధనలు సాగాయి. ఎట్టకేలకు యూనివర్శిటీ కాలేజ్ లండన్ (యుసీఎల్) శాస్త్రవేత్తలు దీని మిస్టరీని ఛేదించినట్లు ప్రకటించారు. ‘విశ్వానికి కేంద్రం భూమి’ అనే భూకేంద్ర సిద్ధాంతంతో పాటు ఆ కాలంలో ఉనికిలో ఉన్న రకరకాల నమ్మకాల ఆధారంగా గ్రీకు శాస్త్రవేత్తలు ఈ కంప్యూటర్ను రూపొందించారు. వర్కింగ్ గేర్ సిస్టంతో అలనాటి కంప్యూటర్ డిజిటల్ నమూనాను తయారుచేసి, ఒకప్పటి ఎక్స్–రే డేటా, ప్రాచీన గ్రీకు గణితశాస్త్ర పద్ధతుల ఆధారం గా ఈ పరికరం పనీచేసే తీరు (యాంటిక్ తెర మెకానిజం), ఖగోళ విషయాలను ఎలా అంచనా వేసేవారు.... మొదలైన వాటి గురించి యుసీఎల్ శాస్త్రవేత్తలు తెలియజేశారు. చదవండి: భూమి వైపు దూసుకొస్తున్న ప్రమాద గ్రహశకలం! -
టీవీ రిపోర్టర్‌ను వెంటాడిన పంది..
లైవ్ టీవీ రిపోర్టింగ్ చేసే జర్నలిస్ట్‌లకు కొన్నిసార్లు అనుహ్య పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుంది. తాజాగా గ్రీక్‌కు చెందిన ఓ రిపోర్టర్‌కు వింత అనుభవం ఎదురైంది. ఇటీవల ఏఎన్‌టీ1 టీవీకి చెందిన మాంటికోస్ అనే రిపోర్టర్ కైనెటా నగరంలో వరద నష్టంపై రిపోర్ట్ చేస్తున్నాడు. అయితే అతను రిపోర్టింగ్ చేస్తున్న సమయంలో ఓ పంది అతని వద్దకు వచ్చింది. అయితే దాని నుంచి తప్పించుకుని రిపోర్ట్ చేద్దామని చూసిన అది అతన్ని వెంబడించింది. ఆ సమయంలో స్టూడియోలో ఉన్న జర్నలిస్టులతో మాంటికోస్ మాట్లాడుతూ.. ‘ఇక్కడ ఓ పంది మమ్మల్ని ఉదయం నుంచి వెంబడిస్తుంది. పంది నన్ను కోరకాడానికి ప్రయత్నిస్తుంది.. అందుకే ఇక్కడ నిల్చోలేకపోతున్నాను. నన్ను క్షమించండి’ అని పేర్కొన్నాడు. ఇది అంతా చూస్తున్న స్టూడియోలోని జర్నలిస్టులు తమ నవ్వును ఆపుకోలేకపోయారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా, గతంలో లైవ్ రిపోర్టింగ్ చేస్తున్న మహిళా రిపోర్టలతో కొందరు వ్యక్తులు అసభ్యకరంగా ప్రవర్తించిన సంగతి తెలిసిందే. Greek journo pestered by a pig while reporting on the recent floods in #Kinetta #Greece #tv #bloopers #ant1tv #Ant1news pic.twitter.com/vsLBdlWCMB — Kostas Kallergis (@KallergisK) November 26, 2019 -
జీఎంఆర్ చేతికి క్రీట్ విమానాశ్రయ ప్రాజెక్టు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: నిర్మాణ రంగంలో ఉన్న జీఎంఆర్ అనుబంధ కంపెనీ జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ చేతికి మరో విమానాశ్రయ ప్రాజెక్టు వచ్చి చేరింది. గ్రీస్‌లోని క్రీట్ రాజధాని నగరమైన హిరాక్లియోలో కొత్త అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు కాంట్రాక్టును దక్కించుకుంది. గ్రీక్ కంపెనీ టెర్నా గ్రూప్‌తో కలిసి జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ ఈ ప్రాజెక్టును చేపడుతోంది. ఈ మేరకు ఇరు సంస్థలు కన్సెషన్ అగ్రిమెంట్‌పై సంతకాలు చేశాయి. ఒప్పందం కింద విమానాశ్రయ రూపకల్పన, నిర్మాణం, పెట్టుబడి, కార్యకలాపాలు, నిర్వహణను రెండు సంస్థల జాయింట్ వెంచర్ కంపెనీ చేపడుతుంది. ప్రాజెక్టు వ్యయం సుమారు రూ.4,034 కోట్లు. కన్సెషన్ పీరియడ్ 35 ఏళ్లు. ఈక్విటీ, ప్రస్తుత విమానాశ్రయం నుంచి అంతర్గత వనరులు, గ్రీస్ గవర్నమెంటు ఇచ్చే గ్రాంటు ద్వారా నిర్మాణం చేపడతారు. ఈ ప్రాజెక్టుకు రుణం అవసరం లేదని కంపెనీ తెలిపింది. రెండవ అతిపెద్ద విమానాశ్రయం.. అంతర్జాతీయంగా పర్యాటకులను ఆకట్టుకుంటున్న ప్రాంతాల్లో గ్రీస్ ముందు వరుసలో ఉంటుంది. ఏటా ఇక్కడికి 2.7 కోట్ల మంది పర్యాటకులు వస్తున్నారు. గ్రీస్‌లో ఎక్కువ మంది పర్యటిస్తున్న ద్వీపాల్లో క్రీట్ టాప్‌లో ఉంది. హిరాక్లియో విమానాశ్రయం గ్రీస్‌లో రెండవ అతిపెద్దది. మూడేళ్లుగా విమాన ప్రయాణికుల సంఖ్య ఏటా 10% వృద్ధి చెందుతోంది. ప్రయాణికుల సంఖ్యకు తగ్గట్టుగా విమానాశ్రయ సా మర్థ్యం సరిపోవడం లేదు. యూరప్ ప్రాంతంలో కంపెనీకి ఇది తొలి ప్రాజెక్టు అని జీఎంఆర్ ఎనర్జీ, ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్స్ బిజినెస్ చైర్మన్ శ్రీనివాస్ బొమ్మిడాల ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఈ ప్రాంతంలో మరింత విస్తరిస్తామని చెప్పారు. -
44 ఏళ్ల తర్వాత విచిత్ర పరిస్థితుల్లో దొరికిన మృతదేహం
చనిపోవడానికి ముందు రోజు తిన్న గింజల ఆధారంగానే ఓ వ్యక్తి అవశేషాలు బయటపడ్డాయి. మరణించిన తర్వాత పొట్ట నుంచి మొలకెత్తిన విత్తనం.. అతడి కుటుంబ సభ్యుల 44 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించింది. ఈ విచిత్ర సంఘటనకు సంబంధించిన వివరాలు.. మిర్రర్ కథనం ప్రకారం.. 1974లో గ్రీకు సైప్రోయిట్స్, టర్కిష్ సైప్రోయిట్స్ గ్రూప్స్ మధ్య జరిగిన యుద్ధంలో అహ్మద్ హెర్గూన్ అనే టర్కిష్ వ్యక్తిపై బాంబు దాడి జరిగింది. అతడితో పాటు మరో ఇద్దరు వ్యక్తులు కూడా మరణించారు. వారిద్దరి శవాలు దొరికాయి గానీ అహ్మద్ శవం మాత్రం కనిపించకపోవడంతో అతడి కుటుంబ సభ్యులు ఆవేదన చెందారు. ఒకవేళ బాంబు దాడిలో అతడు మరణించలేదేమో.. ఎక్కడైనా సురక్షితంగానే ఉన్నాడేమోనని ఆశతో బతికారు. కానీ 44 ఏళ్ల అనంతరం ఓ చెట్టు వల్ల అతడు బతికి లేడనే నిజం వారికి తెలిసింది. అసలేం జరిగింది... 1974లో బాంబు దాడికి గురైన అనంతరం అహ్మద్ ఓ గుహలోకి వెళ్లి దాక్కున్నాడు. కానీ తీవ్ర గాయాలపాలవడంతో అతడు మృతి చెందాడు. అయితే చనిపోవడానికి ముందు రోజు అతడు ఫిగ్ ట్రీ గింజలను తిన్నాడు. మరణించిన తర్వాత అతని పొట్టలో మిగిలి పోయిన ఫిగ్ విత్తనం సుమారు 44 ఏళ్ల తర్వాత మొలకెత్తింది. అదే అహ్మద్ జాడను తెలుసుకోవడంలో కీలక పాత్ర పోషించింది. ఓ పరిశోధకుడి కారణంగా.. చెట్లపై పరిశోధనలు చేస్తున్న ఓ ఔత్సాహికుడు అహ్మద్ మృతదేహం పడి ఉన్న గుహలోకి వెళ్లాడు. అయితే అప్పటికీ అక్కడ ఓ మనిషి తాలూకు అవశేషాలు ఉన్నాయని అతడికి తెలియదు. కానీ ఆ ప్రాంతంలో ఉన్న ఫిగ్ ట్రీ అతడిని ఆకర్షించడంతో ఆ చోటికి చేరుకున్నాడు. ఎందుకంటే అహ్మద్ మృతదేహం పడి ఉన్న పరిసరాల్లో అసలు ఫిగ్ ట్రీలు మొలకెత్తే అవకాశమే లేదు. దీంతో ఆ చెట్టు పుట్టుక గురించి తెలుసుకోవాలని పరిశోధకుడు భావించాడు. అందుకే చెట్టు మొదలును తవ్వుతున్న క్రమంలో మనిషికి సంబంధించిన అవశేషాలు లభించాయి. ఈ విషయం స్థానిక మీడియాలో ప్రసారం కావడంతో అహ్మద్ జాడ అతడి కుటుంబ సభ్యులకు తెలిసింది. దీంతో కనీసం ఇన్నేళ్ల తర్వాతనైనా తన అహ్మద్ గురించి తమకు నిజం తెలిసిందని అతడి సోదరి వ్యాఖ్యానించింది. ఈ విషయం బయటపడటానికి కారణమైన ఆ పరిశోధకుడికి ధన్యవాదాలు తెలిపింది. -
పడవలను ఫోటో తీసినందుకు జైలు శిక్ష
ఎథెన్స్ : ఆర్మీకి చెందిన రెండు పడవలను ఫోటో తీసిన దంపతులకు పోలీసులు జైలు శిక్ష విధించారు. తాము ఏ తప్పు చేయలేదని, పర్యటన నిమిత్తం ఆ దేశానికి వచ్చామని చెప్పినా వినిపించుకోకుండా ఇబ్బందుల పాలుచేశారు. ఈ సంఘటన గ్రీసు దేశంలోని ఎథెన్స్లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బ్రిటన్‌కు చెందిన దంపతులు పమెలా, మైకేల్ క్లియరీ పర్యటన నిమిత్తం గ్రీసు దేశానికి వెళ్లారు. కొద్దిరోజుల క్రితం ఐలాండ్ ఆఫ్ కాస్‌లోని ఓ ఓడరేవుకు చేరుకున్నారు. భార్యాభర్తలిద్దరూ సెల్ఫోన్లో ఫోటోలు తీసుకుంటూ సరదాగా గడుపుతున్నారు. మైకేల్ ఓడరేవులో నిలిపి ఉన్న రెండు ఆర్మీ పడవలను ఫోటో తీశాడు. ఇది గమనించిన ఓ ఆర్మీ సైనికుడు మైకేల్ ఫోన్లో తీసిన ఫోటోలను తొలగించాలని, పాస్‌పోర్ట్‌లు చూపించాలని ఆదేశించాడు. దీంతో భయపడ్డ దంపతులు అక్కడి నుంచి తప్పించుకుని బ్రిటన్‌కు బయలుదేరారు. మార్గం మధ్యలో వారిని అడ్డగించిన పోలీసులు వారి చేతులకు బేడీలు వేసి అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. తాము గూఢాచారులం కాదని ఆ దంపతులు ఎంతమొత్తుకున్నా వారు విడిచి పెట్టలేదు. మరుసటి రోజు కోర్టులో హాజరు పరిచారు. న్యాయమూర్తి ముందు వారు తమ గోడును వెళ్లబోసుకోగా ఆయన వారిని ఊరికి పంపటానికి అంగీకరించాడు. అయితే వారి ఫోన్లను గ్రీసు పోలీసులకు అప్పగించి, బ్రిటన్‌లోని ఓ లాయర్‌తో వాదనలు వినిపించాలని షరతు విధించాడు. స్వదేశానికి చేరుకునన్న ఆ దంపతులు లాయర్‌ను ఏర్పాటు చేసుకుని వాదనలు వినిపించారు. కొన్ని వారాల తర్వాత కేసు నిలబడలేకపోయింది. దీంతో గ్రీసు పోలీసులు స్వాధీనం చేసుకున్న ఫోన్లను సైతం వెనక్కు పంపించారు. -
జీసస్ బోధనల పురాతన ప్రతి లభ్యం
లండన్: ఏసుక్రీస్తు తన సోదరుడు జేమ్స్‌కు చేసిన రహస్య బోధనలకు సంబంధించి అసలైన గ్రీకు ప్రతుల్ని పరిశోధకులు కనుగొన్నారు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఆర్కైవ్స్‌లో వీటిని గుర్తించారు. ఈ పురాతన రాత ప్రతుల్లో పరలోక రాజ్యము, భవిష్యత్తు సంఘటనలు, జేమ్స్ అనివార్య మరణం గురించి ఏసుక్రీస్తు బోధనలున్నాయి. అయితే బైబిల్ కొత్త నిబంధన కూర్పు సమయంలో అందులోని 27 అధ్యాయాల సరసన వీటిని చేర్చలేదు. 1945లో ఎగువ ఈజిప్టులో తవ్వకాల్లో కాప్టిక్(ఈజిప్టు) భాషలో ఇలాంటి ప్రతులే దొరికినా... ప్రస్తుతం గ్రీకు భాషలో అసలైన ప్రతులు లభ్యమైనట్లు పరిశోధకులు పేర్కొన్నారు. ఐదు, ఆరు శతాబ్దాలకు చెందినవిగా భావిస్తున్న వీటిని ఈ ఏడాది ప్రారంభంలోనే గుర్తించారు. -
శాండ్విచ్ కోసం శరీరాన్ని అమ్ముకుంటున్నారు..
లండన్: గ్రీక్ ఆర్థిక సంక్షోభం ఆ దేశానికి తీరని కష్టాలను మిగిల్చింది. చాలా మంది ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. పరిస్థితులు ఎంత దారుణంగా తయారయ్యాయంటే.. కొందరు యువతులు తమ ఆకలి బాధను తీర్చుకునేందుకు ఓ శాండ్ విచ్ కోసం తమ శరీరాన్ని అమ్ముకుంటున్న వైనం వారి దయనీయ పరిస్థితికి అద్దం పడుతోంది. గ్రీక్‌లో 17 వేల మందికిపైగా సెక్స్ వర్కర్లు ఉన్నట్టు ఓ సర్వేలో వెల్లడైంది. తూర్పు యూరప్‌లో వ్యభిచార వృత్తిలో గ్రీక్ మహిళలే ఎక్కువ మంది ఉన్నారు. గ్రీక్‌లో ఆర్థిక సంక్షోభం రాకముందు సెక్స్ వర్కర్లు దాదాపు 4000 వేల వరకు డిమాండ్ చేసేవారు కాగా ఇప్పుడు 150 రూపాయలు ఇస్తే చాలన్నట్టుగా పరిస్థితి మారింది. 17-20 ఏళ్ల వయస్సులో ఈ వృత్తిలోకి వస్తున్నట్టు సర్వేలో తేలింది. -
బయటపడినా భయం వీడలేదు