శాండ్విచ్ కోసం శరీరాన్ని అమ్ముకుంటున్నారు.. | Greek girls selling sex for sandwiches: Study | Sakshi
Sakshi News home page

శాండ్విచ్ కోసం శరీరాన్ని అమ్ముకుంటున్నారు..

Published Sat, Nov 28 2015 8:23 PM | Last Updated on Sun, Sep 3 2017 1:10 PM

శాండ్విచ్ కోసం శరీరాన్ని అమ్ముకుంటున్నారు..

శాండ్విచ్ కోసం శరీరాన్ని అమ్ముకుంటున్నారు..

లండన్: గ్రీక్ ఆర్థిక సంక్షోభం ఆ దేశానికి తీరని కష్టాలను మిగిల్చింది. చాలా మంది ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. పరిస్థితులు ఎంత దారుణంగా తయారయ్యాయంటే.. కొందరు యువతులు తమ ఆకలి బాధను తీర్చుకునేందుకు ఓ శాండ్ విచ్ కోసం తమ శరీరాన్ని అమ్ముకుంటున్న వైనం వారి దయనీయ పరిస్థితికి అద్దం పడుతోంది.

గ్రీక్లో 17 వేల మందికిపైగా సెక్స్ వర్కర్లు ఉన్నట్టు ఓ సర్వేలో వెల్లడైంది. తూర్పు యూరప్లో వ్యభిచార వృత్తిలో గ్రీక్ మహిళలే ఎక్కువ మంది ఉన్నారు. గ్రీక్లో ఆర్థిక సంక్షోభం రాకముందు సెక్స్ వర్కర్లు దాదాపు 4000 వేల వరకు డిమాండ్ చేసేవారు కాగా ఇప్పుడు 150 రూపాయలు ఇస్తే చాలన్నట్టుగా పరిస్థితి మారింది.  17-20 ఏళ్ల వయస్సులో ఈ వృత్తిలోకి వస్తున్నట్టు సర్వేలో తేలింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement